Sep 21 2023
*It’s official! Krithi Shetty roped in for Sharwa35*
కృతికి బర్త్ డే విషెస్ తెలియజేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ..టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ సంస్థ నిర్మిస్తున్న చిత్రాల్లో శర్వానంద్ 35వ సినిమా ఒకటి. భలే మంచి రోజు, శమంతకమణి, దేవ్ దాస్, హీరో వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి చిత్రం *ఉప్పెన* తోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కృతి శెట్టి ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడిగా నటిస్తోంది. ఈరోజు కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో కృతి శెట్టి అందంగా, క్యూట్ గా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. అక్టోబర్ నుంచి ప్రచార కార్యక్రమాల వేగం పెంచనున్నారు. ఇంట్రెస్టింగ్ పాత్రలో శర్వానంద్ ఈ చిత్రంలో కనిపించనున్నారు.
హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చేస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేస్తున్నారు.జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు : శర్వానంద్, కృతి శెట్టి.
రచన– దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీత దర్శకుడు : హేషమ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ : విష్ణు శర్మ
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ఆర్ట్ డైరెక్టర్ : జానీ షేక్
నిర్మాత : టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల
*It’s official! Krithi Shetty roped in for Sharwa35*
Sharwanand’s 35th movie (#Sharwa35) has been made on a prestigious scale by People Media Factory. With all but one schedule now completed, the film’s promotional campaign is set to kick into high gear starting in October. The makers are extremely happy with how well the film has shaped up so far.
Krithi Shetty, who has been such a sensation ever since her first movie ‘Uppena’, turned a year older today. The beauty will be seen in a unique, author-backed role in Sharwa35, directed by the talented filmmaker Sriram Adittya. Marking Krithi’s birthday, People Media Factory is pleased to put out a special video and a fab poster. Krithi’s role is not only unique but also prominent in the film.
Sharwanand is going to come before the audience with a super-interesting role in this potential blockbuster. The title of the movie will be announced soon at a grand event.
Produced by TG Vishwa Prasad, Sharwa35 has music by Hesham Abdul Wahab. Vishnu Sharma is doing the cinematography, while Prawin Pudi is doing the editing. Art work is by Jonny Shaik.
Cast: Sharwanand, Krithi Shetty
Technical Crew:
Writer, Director: Sriram Adittya
Producer: TG Vishwa Prasad
Banner: People Media Factory
Co-producer: Vivek Kuchibhotla
Music: Hesham Abdul Wahab
DOP: Vishnu Sharma
Editor: Prawin Pudi
Art: Jonny Shaik
Executive Producer : Krithi Prasad and Phani K Varma
PRO: L Venugopal, Vamsi-Shekar
Publicity designs : Padma Sri Ads
Marketing : First Show
Follow Us!