RANARANGAM

*RanaRangam is steadily gaining momentum – Sharwanand*

నా సినిమాల్లో ‘రణరంగం’ బెస్ట్ లవ్ స్టోరీ అంటున్నారు
- హీరో శర్వానంద్

“ఈ సినిమాలో కల్యాణి, నాకూ మధ్య లవ్ స్టోరీ ఇప్పటివరకు నేను చేసిన లవ్ స్టొరీలన్నింటి కంటే బెస్ట్ అంటున్నారు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందంటున్నారు” అన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘రణరంగం’ సినిమా గురువారం(15-8-19)  విడుదలై, అనూహ్యమైన ఓపెనింగ్స్ సాధించింది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సినిమా మంచి వసూళ్లు సాధిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

చిత్ర సమర్పకుడు పి.డి.వి. ప్రసాద్ మాట్లాడుతూ “కలెక్షన్లు చాలా బాగున్నాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 7.50 కోట్ల గ్రాస్, రూ. 4.45 కోట్ల షేర్ వచ్చింది. 1985లో గిరిబాబుగారి డైరెక్షన్‌లో వచ్చిన ‘రణరంగం’ను కూడా మేమే నిర్మించాం. అది మంచి సక్సెసయింది. ఆ సినిమా ఆడిన అనేక థియేటర్లలో ఇప్పుడు ఈ ‘రణరంగం’ విడుదలవడం చక్కని అనుభవం. సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా శర్వానంద్ చాలా బాగా చేశాడని అంతా ప్రశంసిస్తున్నారు. అలాగే హ్యూమన్ రిలేషన్స్‌ను బాగా చూపించారనే పేరొచ్చింది” అన్నారు.

నటుడు రాజా మాట్లాడుతూ “జెన్యూన్ ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన ‘శివ’ తరహాలో ‘రణరంగం’ ఆడుతుందని ఆశిస్తున్నాం” అని చెప్పారు.

సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి మాట్లాడుతూ “సినిమాకి రెస్పాన్స్ చాలా బాగుంది. విజువల్‌గా సినిమా చాలా క్వాలిటీగా ఉందని మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పని చేయడాన్ని నిజంగా ఎంతో ఆస్వాదించాను” అన్నారు.

డైరెక్టర్ సుధీర్ వర్మ మాట్లాడుతూ “ఇది శర్వానంద్ సినిమా అని విడుదలకు ముందే చెప్పాను. ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణం శర్వానే. ఇప్పటి దాకా నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో దేనికీ రానన్ని ఫోన్లు ఈ సినిమా విడుదలయ్యాక వస్తున్నాయి. నిన్న సెకండ్ షో టికెట్లు దొరకలేదని ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. ప్రశాంతి పిళ్లై మ్యూజిక్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ సూపర్బ్. నిర్మాతలు చాలా రిచ్‌గా సినిమాని నిర్మించారు. ఓపెనింగ్స్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ఫిల్మ్ అవుతుంది” అని తెలిపారు.

హీరో శర్వానంద్ మాట్లాడుతూ “నిర్మాతలు నాపై పెట్టిన నమ్మకానికి రుణపడి ఉంటా. రణరంగం’కు మంచి ఓపెనింగ్స్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది.  ప్రేక్షకులకు ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇవ్వాలనుకొని, ఒక ప్రోపర్ యాక్షన్ ఫిల్మ్ తియ్యాలనుకొని ‘రణరంగం’ చేశాం. ఆ విషయంలో 200 శాతం సక్సెస్ అయ్యాం. ఇటీవల తెలుగులో వచ్చిన బెస్ట్ క్వాలిటీ ఫిల్మ్ అని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ సూపర్బ్ అనే పేరొచ్చింది. ఫైట్ సీన్స్‌ని వెంకట్ మాస్టర్ చాలా నేచురలిస్టిగ్గా కంపోజ్ చేశారు. నా ఫ్రెండ్స్‌గా నటించిన రాజా, ఆదర్శ్, సుదర్శన్లకు మంచి పేరొచ్చింది. తనది చిన్న రోల్ అయినా.. చేసినందుకు కాజల్‌కు థాంక్స్ చెప్పుకోవాలి. సినిమా రిలీజైనప్పుడు మార్నింగ్ షోకి డివైడ్ టాక్ వచ్చింది. మ్యాట్నీకి ఫర్వాలేదన్నారు. సెకండ్ షోకు వచ్చేసరికి ఎబోవ్ యావరేజ్ అనే టాక్ వచ్చింది. మున్ముందు మరింత పాజిటివ్ టాక్ వచ్చి బాగా ఆడుతుందని నమ్ముతున్నా. ఇప్పటివరకూ ఈ సినిమాలో చేసినటువంటి మాస్ కేరెక్టర్ చేయలేదు. ఇందులో నాకు నేనే నచ్చాను. రెండు దశలున్న కేరెక్టర్‌ను చేసేప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. స్క్రీన్‌ప్లే పరంగా కొత్తగా ఉండే సినిమా ఇది” అని వివరించారు.

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ
*RanaRangam is steadily gaining momentum – Sharwanand*
batch_SAM_4268 batch_SAM_4270 batch_SAM_4285 batch_SAM_4293
Sharwanand’s latest film RanaRangam hit the big screens yesterday amidst sky-high expectations. The film was directed by Sudheer Varma and also stars Kalyani Priyadarshan and Kajal Agarwal in lead roles. The movie unit held a success meet today and here’s what they had to say.

Sharwanand thanked the producer for not backing down in terms of budget. He further added that Sudheer Varma’s screenplay is another big asset to the film. Stupendous work from the cinematographer and music composer added a whole new layer to the film. RanaRangam is gaining more momentum, he said.

The director, Sudheer Varma said that RanaRangam opened to the best reports when compared to his previous films. He added that the film has rich production and technical values. He further said that mass audience are lapping up the film

The producer PDV Prasad said that audience are enjoying the film. He said that Sharwanand is seen in a mass role for the first time after Prasthanam. The film garnered good collections on its opening day and is expected to gain more support going forward, he said.

Actor Raja thanked the director Sudheer Varma for giving him a strong role in the film. He further added that everyone in his circle liked the film.

Starring:
Sharwanand, Kajal Aggarwal, Kalyani Priyadarshan

Crew:
Written & Directed by – Sudheer Varma
Cinematographer – Divakar Mani
Music Director – Prashant Pillai
Editor – Navin Nooli
Production Designer – Raveender
Sound Designer – Renganaath Ravee
Publicity Designs – Anil & Bhanu
Lyrics – Krishna Chaitanya, Ramajogayya Shastry
Stunts – Venkat
Dialogues – Arjun-Carthyk
Choreography – Brinda, Shobi, Sekhar
Production Controller – Ch. Rama Krishna Reddy
Presents – PDV Prasad
Producer – Suryadevara Naga Vamsi
Banner – Sithara Entertainments.

‘Ranarangam’ Releasing today posters

12x20-1 12x20-2 T.day DC Full Page-1 today

*Ranarangam got good reports from everyone who watched it, hope even the audience feel the same – Sharwanand*


*రణరంగం చూసిన వాళ్లు బాగుంది అంటున్నారు, చిత్రం విడుదల తరువాత ప్రేక్షకులు అదే అంటారు – హీరో శర్వానంద్*
హీరో శర్వానంద్‌ నటించిన ‘రణరంగం’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదారాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కథానాయకుడు నితిన్‌ ముఖ్య అతిధి గా విచ్చేశారు. ‘రణరంగం’ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్‌, కల్యాణి ప్రియదర్శిని  కథానాయికలుగా నటించారు. సుధీర్‌ వర్మ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న  విడుదల అవుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది.  మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ విడుదల చేసిన ‘రణరంగం’ సౌండ్‌ కట్‌ ట్రైలర్‌కు  విశేష ప్రాచుర్యం లభించింది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిత్ర యూనిట్ సభ్యులు , హీరో అభిమానులు  పాల్గొన్నారు.

*ఈ సందర్బంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘సినిమా బాగా వచ్చింది, డైరెక్టర్ సుధీర్ వర్మ టేకింగ్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలువనుంది. హీరోయిన్స్ ఇద్దరూ బాగా నటించారు. కెమెరామెన్ దివాకర్ మణి విజువల్స్ హైలెట్ కానున్నాయి.సినిమా చూసి నిర్మాత వంశీ కాల్ చేశారు.,చిత్రం బాగా వచ్చింది.నేను హ్యాపీ గా ఉన్నానని వంశీ చెప్పడం నాకు చాలా ఆనందమేసింది. రణరంగం చూసిన మా యూనిట్ అందరూ చాలా బాగుంది అన్నారు. రేపు సినిమా విడుదల తరువాత ప్రేక్షకులు కూడా అదే అంటారని నమ్మకం తో ఉన్నాను. మా నిర్మాత వంశీ భవిష్యత్తులో చేయబోయే అన్నీ సినిమాలు  విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

*డైరెక్టర్ సుధీర్ వర్మ మాట్లాడుతూ* రణరంగం సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికి థాంక్స్, ముఖ్యంగా కెమెరామెన్ దివాకర్, ఆర్ట్ డైరెక్టర్ రవి, ఫైట్ మాస్టర్ వెంకట్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యారు. నిర్మాత వంశీ ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా ఈ సినిమాను రూపొందించారు. కల్యాణి బాగా నటించింది. ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్న కాజల్ కు థాంక్స్. శర్వా రెండు విభిన్న పాత్రల్లో బాగా నటించారు. సినిమా విడుదల తరువాత మరిన్ని విశేషాలు మీతో పంచుకుంటాను అన్నారు.

*హీరొయిన్ కల్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ..*ఈ సినిమాలో నేను భాగమయినందుకు హ్యాపీ గా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ సుదీర్  వర్మ తాను అనుకున్న కథను అద్భుతంగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేశారు.హీరో శర్వానంద్ నాకు ఇన్స్పిరేషన్ తన దగ్గర ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నాను. కాజల్ తో కలిసి నటించే అవకాశం రావడం గొప్ప విషయం. షూటింగ్ సమయంలో నిర్మాతల సపోర్ట్ మరువలేనిది. రణరంగం అందరిని అలరిస్తుందని అనుకుంటున్నా’ అన్నారు.

ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన *హీరో నితిన్ మాట్లాడుతూ..* ఈ కథ విన్నప్పుడు శర్వా ఈ సినిమాలో45 ఇయర్స్ మ్యాన్ గా ఎలా కనిపిస్తాడు అనుకున్న కానీ పోస్టర్స్ , ప్రోమోస్ చూస్తుంటే కరెక్ట్ గా సెట్ అయ్యాడు. ఏ బ్యాక్ సపోర్ట్ లేకుండా శర్వా ఈ స్థానంలో ఉండడం నిజంగా గొప్ప విషయం. ఎంతో మంది యువ హీరోలకు శర్వా ఆదర్శం. ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను.  డైరెక్టర్ సుధీర్ వర్మ మంచి టెక్నీషియన్ ఈ సినిమాతో తాను మరోసారి  మంచి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటాడని అనుకుంటున్నా. నిర్మాత వంశీకి ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

*కెమెరామెన్ దివాకర్ మణి  మాట్లాడుతూ…*నేను డైరెక్టర్ సుధీర్ వర్మతో కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమా విజువల్స్ కొత్తగా ఉంటాయి. నిర్మాత వంశీ సపోర్ట్ మరువలేనిది. శర్వా లవ్లీ యాక్టర్. అతనితో పనిచెయ్యడం కంఫర్ట్ గా ఉంటుంది. హీరోయిన్స్ కాజల్, కల్యాణి బాగా నటించారు. నా కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి థాంక్స్. ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్న అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ
 6O6A0793-1600x1067 6O6A0807-1600x1067 6O6A0810-1600x1067 6O6A0814-1600x1067 6O6A0818-1600x1067 6O6A0819-1600x1067 6O6A0820-1600x1067 6O6A0822-1600x1067 6O6A0825-1600x1067 6O6A0838-1600x1067 6O6A0846-1600x1067

*Ranarangam got good reports from everyone who watched it, hope even the audience feel the same – Sharwanand*

Sharwanand’s up coming release Ranarangam’s pre-release event was held on a grand scale yesterday. Nithiin attended the event as the chief guest. The gangster drama is all set to hit the silver screens on August 15th. Here’s what the movie unit said at the pre-release event.Sharwanand stated that he is very happy with the final output. He said that Sudheer Varma’s stylish taking is a very big asset for the film. Diwakar Mani did a good job with the camera. All of our unit members watched the film and they all liked it. I hope even the audience feel the same when they watch the film, he said.

The director Sharwanand said that technical finesse is one of the key aspects of Ranarangam. He added that the producer Vamsi never compromised with production expenses as he always wanted to deliver a technically sleek film.

Heroine Kalyani Priyadarshan said that Sudheer Varma did a great job in picturizing what he had imagined. She added that working with Kajal was a great experience.

Nithiin opined that Sharwanand’s hard work and dedication shaped up his career. He added that Sharwa did a great job in the film and his mature act gives a lot of depth to the plot.

The cinematographer, Diwakar Mani said that the visuals in the film will give a whole new experience to the viewers. Sharwanand is a lovely actor. I sincerely thank the camera department and direction department for their help.

Starring:
Sharwanand, Kajal Aggarwal, Kalyani Priyadarshan

Crew:
Written & Directed by – Sudheer Varma
Cinematographer – Divakar Mani
Music Director – Prashant Pillai
Editor – Navin Nooli
Production Designer – Raveender
Sound Designer – Renganaath Ravee
Publicity Designs – Anil & Bhanu
Lyrics – Krishna Chaitanya, Ramajogayya Shastry
Stunts – Venkat
Dialogues – Arjun-Carthyk
Choreography – Brinda, Shobi, Sekhar
Production Controller – Ch. Rama Krishna Reddy


Presents – PDV Prasad
Producer – Suryadevara Naga Vamsi
Banner – Sithara Entertainments
RELEASING WORLDWIDE ON 15th AUGUST.

Mega Powerstar Ram Charan unveils Sound Cut trailer of Ranarangam

 ’రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్ ను విడుదలచేసిన 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ ఆగస్టు 15 న విడుదల అవుతున్న విషయం విదితమే. చిత్ర ప్రచారంలో భాగంగా  ’రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్ విడుదల అయింది.
‘రణరంగం’ చిత్రం  సౌండ్ కట్ ట్రైలర్ ను  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ఈరోజు
విడుదలచేశారు. రామ్ చరణ్ కు శర్వానంద్ మంచిమిత్రుడు. తన మిత్రుడి చిత్రం సౌండ్ కట్ ట్రైలర్ ను చూసిన అనంతరం ఆయన స్పందిస్తూ…’సూపర్బ్..సౌండ్ కట్ ట్రైలర్ చాలా కొత్తగావుంది.టెర్రిఫిక్ గా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఇటీవలే విడుదల అయింది. మళ్ళీ శర్వానంద్ ని మేము ఎలా అయితే చూడాలనుకున్నామో అలావుంది. పర్ఫెక్ట్ గా ఉంది. శర్వా లో ఉన్నది, మాకు నచ్చింది. అతనిలో ఉన్న ఇంటెన్సిటీ. అతని చిత్రాల్లో కో అంటే కోటి చిత్రం నాకిష్టం. అలాంటి ఇంటెన్సిటీతో ఉన్న చిత్రం శర్వాకు పడితే బాగుంటుంది అనుకునేవాడిని. ఇప్పుడీ రణరంగం సౌండ్ కట్ ట్రైలర్ ను చూసిన తరువాత అలాంటి చిత్రం అనిపించింది. దర్శకుడు సుధీరవర్మ ఈ చిత్రం తో తన ప్రతిభను మళ్ళీ నిరూపించుకున్నారనిపించింది. చాలా మంచి ప్లాట్ ఉన్న చిత్రం. సన్నివేశాల తాలూకు కట్స్ చాలా బాగున్నాయి. ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. టెర్రిఫిక్ గా ఉంది. ప్రశాంత్ పిళ్ళై సంగీతం బాగుండటం తో పాటు కొత్తగా ఉంది. డెఫినెట్ గా చిత్రం విజయం సాధించాలని చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు రామ్ చరణ్. ఈకార్యక్రమంలో చిత్ర కథానాయకుడు శర్వానంద్, నిర్మాత  సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు.ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ


Subject: Ranarangam Sound Cut Trailer Launch by Mega Power Star Ram Charan – Pictures & Video
Download Video: https://we.tl/t-YKhdWX4aXb

12456 (1) 12456 (2) 12456 (5) 12456 (6) 12456 (8) 12456 (9) 12456 (12) 12456 (16) 12456 (17)
Mega Powerstar Ram Charan  unveils Sound Cut trailer of Ranarangam
As the much awaited film starring Sharwanand, Kajal Aggarwal and Kalyani Priyadarshan, Rananrangam gears up for release on August 15, the promotions have been going on in full swing.The latest in this regard is the Sound Cut trailer of the film that was unveiled by Ram Charan on Sunday.Directed by Sudheer Varma, the film is a production of Suryadevara Naga Vamsi on Sithara Entertainments banner.

Ram Charan, who is a good friend of Sharwanand, spoke about the sound cut trailer and said, “This is something very new. I think it’s terrific. The recent trailer reveals that we will see Sharwa in an avatar we have all been waiting for. What we all love about Sharwa is his intensity and it is seen so well here. Of all his films my favourite is Ko Ante Koti. And I always felt like he should do another film with such an intense role. It looks like Ranarangam is that film I’ve been waiting for. This is a film with a great plot and director Sudheer Varma will surely leave you all impressed. I love everything about the film, background score, the scene cuts, and the plot too. Music by Prashant Pillai is a value addition. I am sure this film will be successful.”

Starring – Sharwanand, Kajal Aggarwal, Kalyani PriyadarshanCrew:
Written & Directed by – Sudheer Varma
Cinematographer – Divakar Mani
Music Director – Prashant Pillai
Editor – Navin Nooli
Production Designer – Raveender
Sound Designer – Renganaath Ravee
Publicity Designs – Anil & Bhanu
Lyrics – Krishna Chaitanya, Ramajogayya Shastry
Stunts – Venkat
Dialogues – Arjun-Carthyk
Choreography – Brinda, Shobi, Sekhar
Production Controller – Ch. Rama Krishna Reddy
Presents – PDV Prasad
Producer – Suryadevara Naga Vamsi
Banner – Sithara Entertainments

RELEASING WORLDWIDE ON 15th AUGUST !–

Ranarangam release date posters

16x13-1 sAKSHI 16x25-1 nmtg AJ half page HD DC - FULL PAGE-1