Rangde

Our next film is with #Bheeshma and #Mahanati!!

Yes, @actor_nithiin and @KeerthyOfficial are coming together for the first time in #Rangde. Movie will be directed by @dirvenky_atluri and produced by @vamsi84 under @sitharaents with @pcsreeram sir as DOP.

Happy with hat-trick hits with Sithara Entertainments: Nithiin

‘రంగ్ దే’ను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులంద‌రికీ థాంక్స్‌.. ఈ బ్యాన‌ర్‌లో హ్యాట్రిక్ రావ‌డం హ్యాపీ

- హీరో నితిన్‌.నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘రంగ్ దే’. చ‌క్క‌ని నిర్మాణ విలువ‌ల‌తో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్ర‌వారం (మార్చి 26) విడుద‌లై అన్ని ప్రాంతాల నుంచీ పాజిటివ్ టాక్‌తో విజ‌య‌ప‌థం వైపు దూసుకెళ్తోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం సంస్థ కార్యాల‌యంలో స‌క్సెస్ మీట్‌ను ఏర్పాటుచేసింది. ఈ కార్య‌క్ర‌మంలో హీరో నితిన్‌, డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి, ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ పాల్గొన్నారు. ముందుగా వారు చిత్ర విజ‌యాన్ని పుర‌స్క‌రించుకొని బాణ‌సంచా కాల్చి త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.‌

హీరో నితిన్ మాట్లాడుతూ, “సినిమాకు రెస్పాన్స్ చాలా బాగుంది. మూవీలోని ఫ‌న్‌, ఎమోష‌న్స్‌ను ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కీర్తి క్యారెక్ట‌ర్‌, నా క్యారెక్ట‌ర్ బాగా న‌చ్చాయంటున్నారు. మా ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగా న‌చ్చిందంటున్నారు. డీఎస్పీ, పీసీ శ్రీ‌రామ్ గార్ల వ‌ర్క్ బాగుంద‌ని ప్ర‌శంసిస్తున్నారు. అన్ని ప్లేస్‌ల నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ రావడం హ్యాపీ. ‘రంగ్ దే’ను ఆద‌రిస్తున్న అంద‌రికీ థాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ సంస్థ‌లో నాకు ఇది మూడో సినిమా. ఇదివ‌ర‌కు నేను చేసిన
‘అ ఆ’, ‘భీష్మ’ బాగా ఆడాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ రావ‌డం సంతోషంగా ఉంది. ‘గుండెజారి గ‌ల్లంత‌య్యిందే’ మూవీ త‌ర్వాత ఆ జాన‌ర్‌లో నేను చేసిన సినిమా ఇది. హీరో క్యారెక్ట‌ర్ చేంజ్ అయ్యే సీన్లు అంద‌రికీ బాగా న‌చ్చుతున్నాయి. వ్య‌క్తిగ‌తంగా నాకూ అవి న‌చ్చాయి. కీర్తి గొప్ప న‌టి. అను పాత్ర‌ను చాలా బాగా చేసింది. మేమిద్ద‌రం ‘రంగ్ దే’ క‌థ‌ను బాగా న‌మ్మాం. అది మా ఇద్ద‌రి మ‌ధ్య సీన్ల‌లో రిఫ్లెక్ట్ అయ్యి, బాగా వ‌చ్చాయ‌నుకుంటున్నా. మార్నింగ్ షో కంటే మ్యాట్నీకి క‌లెక్ష‌న్లు ఇంప్రూవ్ అయ్యాయి. షోకి షోకీ క‌లెక్ష‌న్లు పెరుగుతుండ‌టం హ్యాపీ. వీకెండ్ నాటికి మ‌రింత బాగా క‌లెక్ష‌న్లు వ‌చ్చి, బ‌య్య‌ర్లంద‌రూ హ్యాపీగా ఉంటార‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం.” అన్నారు

డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ, “ఎగ్జామ్స్ రాసి, ఈ రోజు రిజ‌ల్ట్ కోసం ఎదురుచూశాం. రిజ‌ల్ట్ బాగా వ‌చ్చినందుకు చాలా హ్యాపీ. అన్ని ప్రాంతాల నుంచీ పాజిటివ్ వైబ్స్ వ‌స్తున్నాయి. ముందుగా ఓవ‌ర్సీస్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చింది. ఈరోజు పొద్దున్నే గుడ్ న్యూస్‌తో నిద్ర‌లేచాం. హీరో హీరోయిన్లు నితిన్‌, కీర్తి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ‌ప్ర‌సాద్‌, డీఓపీ పీసీ శ్రీ‌రామ్ ‘రంగ్ దే’కు నాలుగు మూల స్తంభాలుగా నిలిచారు. అర్జున్‌, అను పాత్ర‌ల్లో నితిన్‌, కీర్తి వండ‌ర్‌ఫుల్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చారు. దేవి బ్యూటిఫుల్ ఇస్తే, పీసీ గారు త‌న కెమెరాతో సూప‌ర్బ్ ఔట్‌పుట్ ఇచ్చారు. ఈ సినిమాతో నాకింత మంచి అవ‌కాశాన్నిచ్చిన సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కు రుణ‌ప‌డి ఉంటాను. ఈ బ్యాన‌ర్‌లో మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌ర్క్ చేయాల‌ని కోరుకుంటున్నాను. డైలాగ్స్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు హ్యాపీ. అయితే ఆ క్రెడిట్‌ నాకంటే వాటిని చెప్పిన అంత బాగా చెప్పిన ఆర్టిస్టుల‌కే ద‌క్కుతుంది. సినిమాలో ఓ పార్ట్ ఫారిన్‌లో జ‌రగ‌డం అనేది నా సినిమాల్లో కోఇన్సిడెన్సే త‌ప్ప‌, సెంటిమెంట్‌గా చేస్తోంది కాదు. మొద‌ట ఈ సినిమాకు ఇట‌లీని బ్యాక్‌డ్రాప్‌గా అనుకున్నాం కానీ, కొవిడ్ వ‌ల్ల అక్క‌డ లాక్‌డౌన్ విధించ‌డంతో, బ్యాక్‌డ్రాప్‌ను దుబాయ్‌గా మార్చాం. ఆ సీన్స్ బాగా వ‌చ్చాయి, ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చాయి.” అన్నారు.

నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ మాట్లాడుతూ, “సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు ఆనందంగా ఉంది. అంద‌రూ సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. అంద‌రి కంటే ముందుగా మీడియా ప‌ర్స‌న్స్ ఫోన్ చేసి సినిమా బాగా న‌చ్చింద‌నీ, ఎంట‌ర్టైన్‌మెంట్‌, ఎమోష‌న్స్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయ‌ని చెప్తుంటే చాలా హ్యాపీ ఫీల‌య్యాను. మార్నింగ్ షోతో పోలిస్తే, మ్యాట్నీకి క‌లెక్ష‌న్లు ఇంప్రూవ్ అవ‌డం, ఫ‌స్ట్ షోకు ఇంకా పెర‌గ‌డం ఆనందంగా ఉంది. మునుముందు క‌లెక్ష‌న్లు ఇంకా పెరిగి, సినిమాని ప్రేక్ష‌కులు పెద్ద హిట్ చేస్తార‌ని ఆశిస్తున్నాం.” అన్నారు.

అనంత‌రం సినిమా విజ‌యానికి సంకేతంగా హీరో నితిన్ కేక్ క‌ట్ చేశారు.

Happy with hat-trick hits with Sithara Entertainments: Nithiin

Youth star Nithiin and National Award winning actress Keerthy Suresh starrer ‘Rang De’ was directed by Venky Atluri and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments banner, released at the box office on Friday and received a unanimous positive talk. With such a reception, the success celebrations were held at Sithara banner’s office in Hyderabad.

Speaking on this occasion hero Nithiin said, “The response to the film is superb. Audiences are thoroughly enjoying the comedy and emotional elements in the movie. The chemistry between me and Keerthy Suresh worked out really and Keerthy’s role is getting a lot of appreciation. So do for my role. I would like to thank all the audiences who are pouring down a lot of compliments. This is my third film in Sithara Entertainments and I’m really happy to score a hat-trick with this banner. The box office collections of the film are improving with every. We are getting reports that matinee collections are better than morning and so on. Hopefully the weekend collections will be far better.”

Director Venky Atluri said, “This moment is like a student waiting for his result after writing an exam. I’m so happy that the result is very positive. We are receiving positive vibes from all areas. We woke up this morning with good news from overseas but we are still nervous. Nithiin, Keerthy, music composer Devi Sri Prasad and cameraman PC Sreeram are the four pillars of this film.  I will be indebted to Sithara Entertainments banner and I will work with them in future. Also it’s no sentiment that film have foreign backdrop. It’s just a coincidence and initially we planned to shot in Italy but due to pandemic we shot in Dubai.”

Producer Naga Vamsi said, “Everyone who has watched the movie are saying positive words about it. Most importantly the media people have liked ‘Rang De.’ Some have liked the comedy and others emotional element. It’s a complete packaged film. Also the collections are getting better with every show and we hope that the collections will be far good in the weekend and ‘Rang De’ will become a big hit under our Sithara banner.”

Before that hero Nithiin cut the cake along with director Venky and producer Naga Vamsi and rejoiced the success.

PHOTO-2021-03-26-17-22-48 (1) PHOTO-2021-03-26-17-22-48 PHOTO-2021-03-26-17-22-47

Nithiin and Keerthy Suresh had more belief on ‘Rang De’: -Director Venky Alturi

 

Venugopal

AttachmentsThu, Mar 25, 5:46 PM (2 days ago)

to me
న‌న్ను మించి ‘రంగ్ దే’ క‌థ‌ను నితిన్‌, కీర్తి సురేష్ ఎక్కువ‌గా న‌మ్మారు
- డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి

* నితిన్‌ సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేయ‌డంతో న‌మ్మ‌లేక‌పోయాను
* పీసీ శ్రీ‌రామ్ గారు క‌థ విన‌గానే చేయ‌డానికి ఒప్పుకోవ‌డం నాకు షాక్

‘తొలిప్రేమ’‌, ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ చిత్రాల త‌ర్వాత వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూడో చిత్రం ‘రంగ్ దే’. నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. మార్చి 26న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా గురువారం మీడియా ప్ర‌తినిధుల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ‘రంగ్ దే’కి ప‌నిచేసిన అనుభ‌వం, హీరో హీరోయిన్లు నితిన్‌, కీర్తి ఎంత‌గా ఈ క‌థ‌ను న‌మ్మార‌నే విష‌యం, లెజెండ‌రీ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీ‌రామ్ వ్య‌వ‌హార‌శైలి గురించి ఆస‌క్తిక‌రంగా చెప్పుకొచ్చారు వెంకీ అట్లూరి. ఆ విశేషాలు.. ‌

‘రంగ్ దే’ క‌థ ఎలా పుట్టింది?
‘మిస్ట‌ర్ మ‌జ్ను’ త‌ర్వాత ఒక క్యూట్ ఫ్యామిలీ మూవీ చెయ్యాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. ప‌క్కింటి అబ్బాయి, ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా పాత్ర‌ల‌తో అలాంటి సినిమా చెయ్యాల‌నుకున్న‌ప్పుడు అర్జున్‌, అను పాత్ర‌లు నా మ‌న‌సులో పుట్టాయి. అలా వ‌చ్చిందే రంగ్ దే. ఈ సినిమాలో ల‌వ్ ఫ్యాక్ట‌ర్ కంటే ఎమోష‌న్ ఫ్యాక్ట‌రే ఎక్కువ ఉంటుంది.

కథాంశం ఏమిటి?
ప‌క్క ప‌క్క‌నే ఉండే రెండు కుటుంబాల క‌థ ఇది. స‌హ‌జంగానే మ‌నం మ‌న ఇంట్లోవాళ్ల‌ను ప‌క్కింటివాళ్ల‌తో పోల్చి చూస్తుంటాం. అలాంటప్పుడు వాళ్ల మ‌ధ్య ప్రేమ‌, ద్వేషం లాంటి ఎమోష‌న్స్ ఏర్ప‌డుతుంటాయి. అలా పొరుగిళ్ల‌లోని ఓ అబ్బాయి, ఓ అమ్మాయి మ‌ధ్య వ్య‌వ‌హారం పెళ్లిదాకా వ‌స్తే ఎలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌నేది ఆస‌క్తిక‌రంగా చిత్రీక‌రించాం. ఈ మూవీలో ఇటు క‌డుపుబ్బ న‌వ్వించే హాస్య స‌న్నివేశాల‌తో పాటు, మ‌న‌సుని త‌ట్టే భావోద్వేగ స‌న్నివేశాలూ ఉంటాయి.

‘రంగ్ దే’ అనే టైటిల్ పెట్ట‌డం వెనుక ఏదైనా కార‌ణం ఉందా?‌
ఇంద్ర‌ధ‌న‌స్సులోని ఏడు రంగుల్లో ఒక్కొక్క‌టి ఒక్కో ఎమోష‌న్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ని చెబుతుంటారు. అలాగే ఈ సినిమా క‌థ‌లో ర‌క‌ర‌కాల భావోద్వేగాలు ఉంటాయి. అందుకే ‘రంగ్ దే’ అనే టైటిల్ పెట్టాం. అయితే సినిమాలో కామెడీ, ఎమోష‌న్స్ ప్ర‌ముఖంగా క‌నిపిస్తాయి. చివ‌రి 35 నుంచి 40 నిమిషాల సినిమా నిజంగా ఎమోష‌న‌ల్‌గా న‌డుస్తుంది.

హీరోగా మీ మొద‌టి ఛాయిస్ నితిన్ యేనా?
నిజానికి నేను ఈ క‌థ రాసుకున్న త‌ర్వాత మొద‌ట నితిన్‌ను కాకుండా వేరే హీరోల‌ను అనుకున్నాను. ఈ సినిమా చేయ‌డానికి సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ముందుకు వ‌చ్చాక‌, నితిన్ పేరును నిర్మాత నాగ‌వంశీ సూచించారు. నితిన్ ఒప్పుకుంటాడో, లేదోన‌నే సందేహంతోనే నేను క‌థ చెప్పాను. త‌ను సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేయ‌డంతో న‌మ్మ‌లేక‌పోయాను. క‌థ‌ను ఆయ‌న అంత‌గా న‌మ్మాడు. నితిన్‌, కీర్తి అంత‌గా ఈ క‌థ‌ను న‌మ్మ‌డంతో వాళ్ల పాత్ర‌ల‌తో మ‌రింత బాగా ప్ర‌యోగాలు చేయ‌వ‌చ్చనిపించింది. ట్రైల‌ర్ రిలీజ్ చేశాక నా సినిమాల‌కు ఎప్పుడూ రానంత పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దాంతో సినిమాపై నా న‌మ్మ‌కం ఇంకా పెరిగింది.

‘మ‌హాన‌టి’ త‌ర్వాత కీర్తి వ‌రుస‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. ఈ రోల్‌తో ఆమెకు ఎలాంటి పేరు వ‌స్తుంద‌నుకుంటున్నారు?‌
‘మ‌హాన‌టి’ ఒక లెజండ‌రీ ఫిల్మ్‌. నేను ఈ సినిమా కోసం సంప్ర‌దించిన‌ప్పుడు కీర్తి.. మిస్ ఇండియా, పెంగ్విన్‌, గుడ్‌ల‌క్ స‌ఖి సినిమాలు రాలేదు. మ‌హాన‌టి వ‌చ్చాక కీర్తిని ఆ సినిమా ఫేమ్‌గానే చెప్తున్నారు కానీ, దానికంటే ముందు ఆమె మంచి మంచి రోల్స్ చాలా బాగా చేసింది. ఈ సినిమాలో అను పాత్ర ఆమెకు మంచి పేరు తెస్తుంద‌ని న‌మ్ముతున్నాను.

నితిన్‌, కీర్తి సురేష్‌ల‌తో సెట్స్ మీద ప‌నిచేసిన అనుభ‌వం ఎలాంటిది?
నితిన్ నాకు ప‌దిహేనేళ్లుగా ప‌రిచ‌యం. అందువ‌ల్ల నాకు త‌న‌తో సెట్స్ మీద చాలా సౌక‌ర్యంగా అనిపించింది. కీర్తి విష‌యానికి వ‌స్తే, ఆమె వెనుక ‘మ‌హాన‌టి’తో వ‌చ్చిన పెద్ద పేరుంది. ఆమెతో ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ రెండో రోజు నుంచే చాలా కంఫ‌ర్ట్ అట్మాస్పియ‌ర్‌ను ఆమె క్రియేట్ చేసింది. అలా ఆ ఇద్ద‌రితో చాలా సౌక‌ర్యంగా ఈ సినిమా చేశాను. నా కంటే ఈ స‌బ్జెక్టును నితిన్‌, కీర్తి గ‌ట్టిగా న‌మ్మారు. షూటింగ్ జ‌రుగుతున్నంత సేపూ క‌థ గురించి, స‌న్నివేశాల గురించి నాతో బాగా డిస్క‌స్ చేస్తూ వ‌చ్చారు. అర్జున్‌, అను పాత్ర‌ల‌ను వారు బాగా చేశారు అనేకంటే ఆ పాత్ర‌ల్లో వాళ్లు బాగా ఇన్‌వాల్వ్ అయ్యార‌న‌డం క‌రెక్టుగా ఉంటుంది.

పీసీ శ్రీ‌రామ్ లాంటి ప్ర‌ఖ్యాత సినిమాటోగ్రాఫ‌ర్‌తో ప‌నిచేశారు క‌దా.. ఎలా అనిపించింది?
జీవితంలో కొంత‌మందితో ప‌నిచేయాల‌ని అనుకుంటుంటా. పీసీ శ్రీ‌రామ్ గారితో అయితే క‌లిసి ప‌నిచేస్తాన‌ని నేను క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇండియాలోని టాప్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఆయ‌న పేరు ముందుగా వ‌స్తుంది. క‌థ చెప్ప‌గానే ఆయ‌న‌కు న‌చ్చింది. అదొక షాక్ నాకు. ఆయ‌న‌కు ముందుగానే బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చేయాలి, అదీ ఇంగ్లిష్‌లో. అది ఇచ్చాక ఆయ‌న త‌న అసిస్టెంట్లు ఆరేడుగురికి ఇచ్చి, చ‌ద‌వ‌మ‌ని చెప్పారు. అలా అంద‌రికీ ఆ స్క్రిప్ట్‌లో ఎప్పుడు ఏ సీన్‌, ఏ షాట్ వ‌స్తుందో తెలుసు. ఆయ‌న సెట్స్ మీదుంటే ఎవ‌రూ రిలాక్స్ అవ‌డానికి ఛాన్సే ఉండ‌దు, నాతో స‌హా. ఆయ‌న వ‌ల్లే 64 రోజుల్లో సినిమాని పూర్తి చేశాం. ఒక ద‌ర్శ‌కుడ్ని అయివుండి కూడా ఆయ‌న ద‌గ్గ‌ర నేను చాలా నేర్చుకున్నా.

దేవి శ్రీ‌ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌ణితో ప‌నిచేసిన అనుభ‌వం ఎలా ఉంది?
దేవి శ్రీ‌ప్ర‌సాద్ ఈ సినిమాకు ఏం కావాలో అది ఇచ్చారు. ఆయ‌నిచ్చిన సాంగ్స్ ఒకెత్తు అయితే, రీరికార్డింగ్ ఇంకో ఎత్తు. ఈ సినిమాకు పాట‌లూ, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్ల‌స్ అవుతాయి. ఇక శ్రీ‌మ‌ణి అయితే ఈ సినిమాతో క‌లిపి నాకు 18 పాట‌లు రాసిచ్చాడు.  వ‌దులుకోవాల‌న్నా మేం ఇద్ద‌రం ఒక‌ర్నొక‌రం వ‌దులుకోలేం. మా ఇద్ద‌రికీ బాగా కుదిరింది.‌‌

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ గురించి ఏం చెబుతారు?
నిర్మాణ విలువ‌ల విష‌యంలో సితార ఎంట‌ర్టైన్‌మెంట్స్ ఏ రోజూ రాజీ ప‌డ‌లేదు. మేం ఇట‌లీలో షూటింగ్ ప్లాన్ చేసిన‌ప్పుడు అక్క‌డ లాక్‌డౌన్ విధించ‌డంతో, ఇండియాలోనే షూటింగ్ చేసేద్దామ‌నుకున్నా. కానీ నాగ‌వంశీ అలా కాద‌ని దుబాయ్‌లో ప్లాన్ చేయించారు. క‌థ‌లోనూ దానికి త‌గ్గ‌ట్లుగా బ్యాక్‌డ్రాప్ మార్చాం. ఈ సినిమా కోసం ఖ‌ర్చు పెట్టిన‌దంతా మీకు తెర‌మీద క‌నిపిస్తుంది.

మీ త‌ర్వాత సినిమా ఏంటి?
సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, దిల్ రాజు బ్యాన‌ర్ క‌లిసి నా త‌దుప‌రి చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాయి. అది ల‌వ్ స్టోరీ కాదు. వేరే త‌ర‌హా సినిమా. ఇంత‌కంటే ఎక్కువ విష‌యాలు దాని గురించి చెప్ప‌లేను.

Nithiin and Keerthy Suresh had more belief on ‘Rang De’: -Director Venky Alturi

Rang De starring Nithiin and Keerthy Suresh in the lead roles, is releasing grandly worldwide on March 26th. The film is produced by Sithara Entertainments while it is written and directed by Venky Atluri. Ahead of the release, the director interacted with the media to share his working experience.

Speaking Venky said, “After ‘Tholi Prema’ and ‘Mr. Majnu’ I wanted to do a cute family entertainer. Just when I was thinking about a neighbour boy and girl, the characters of Arjun and Anu hit my thoughts. More than the romantic angle, this will be high on emotions.”

The idea behind the title ‘Rang De’ Venky revealed that every colour in rainbow portrays a different feeling and emotion, so does this film. It has many emotions that are different from one another. But there is more of comedy and emotional quotient. The last half another to forty minutes is going to be even more emotional.

Disclosing that Nithiin was not the first choice for ‘Rang De’ Venky added that after penning the script, I had a couple of heroes in mind. “When Sithara Entertainments came forward to bankroll this movie, producer Naga Vamsi suggested Nithiin’s name. I had my doubts whether Nithiin would accept my script but to my surprise, I gave nod in a single sitting and I was amazed. Both Nithiin and Keerthy Suresh believed in ‘Rang De’ script more than and it gave scope for me to do a bit of experiment too. After the trailer release, there is a huge positive buzz and so we are confident that audiences would like our ‘Rang De,” said Venky.

On Keerthy, Venky said, “Even more ‘Miss India’ ‘Penguin’ and ‘Good Luck Sakhi’ I approached Keerthy for ‘Rang De.’ I’m confident that as Anu in this movie, she would get a better name.”

Working experience with legendary cinematographer PC Sreeram, Venky added that he would cherish it for long. “To work with such legends is a huge opportunity. Firstly we have give Sreeram a bounded script that too in English. After reading the script, Sreeram said okay and it was unbelievable for me. He passed on the script to his assistants and so everyone remembers the scene that we are going to shoot. Because of Sreeram, we were able to wrap up the shooting in just 64 days. Being a director, I learned a lot from Sreeram,” stated Venky.

Regarding Devi Sri Prasad’s music, the director added that Rang De music is already a big hit and DSP should take the credit for it. But he did give his best for the rerecording. DSP is a huge plus for this film. And about lyricist Shreemani, we share a great rapport and we can’t afford to lose each other.

On the production values of Sithara Entertainments, Venky said the producers did not compromise in the filmmaking. We were supposed to shoot in Italy but due to lockdown we could not go there. So I decided to complete the shooting in Hyderabad but producer changed the plans to Dubai. The lavish visuals are example of production values.

About his future projects, Venky revealed that he would be doing one film each in Sithara Entertainments and another with ace producer ‘Dil’ Raju.

PHOTO-2021-03-25-16-57-43 (1) PHOTO-2021-03-25-16-57-43 PHOTO-2021-03-25-16-57-42 PHOTO-2021-03-25-16-57-41 PHOTO-2021-03-25-16-57-40

Rang De Grand Release Event Held at Rajamahendravaram


కీర్తి సురేష్‌ని స్ఫూర్తిగా తీసుకుని వెంకీ ఈ క‌థ రాశారు – హీరో నితిన్‌
 
• నితిన్ వ‌న్ ఆఫ్ ద బెస్ట్ కో స్టార్ – కీర్తి సురేష్‌ 
 
• సరదాగా, సందడిగా రాజమండ్రిలో ‘రంగ్ దే’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్
యూత్ స్టార్ నితిన్ న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `రంగ్ దే`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవర నాగ‌వంశీ నిర్మించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్ వీడియోల‌కు అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ నెల 26న విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్ర రిలీజ్ ఈవెంట్‌ని బుధవారం రాత్రి రాజ‌మండ్రిలో గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ వేడుకలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ  ”రాజ‌మండ్రికి నాకు అనుబంధం వుంది. ఫ‌స్ట్ టైమ్ ఈవెంట్ ఇక్క‌డ జ‌ర‌గ‌డం..చాలా ఆనందంగా వుంది. బేసిగ్గా ల‌వ్‌స్టోరీసే చేయాల‌న్న‌ది నా అభిమ‌తం కాదు. జ‌స్ట్ ఇది యాదృచ్ఛికంగా జ‌రిగింది. `రంగ్ దే` అనేది ఇద్ద‌రు వ్య‌క్తుల ప్రేమ‌క‌థ మాత్ర‌మే కాదు. `రంగ్ దే` అని పెట్ట‌డానికి కార‌ణం ఏంటంటే హోళీ ఆడితే ర‌క‌ర‌కాల క‌ల‌ర్ల‌ని ఒకేసారి ముఖం మీద కొడ‌తాం. అలాగే ఈ సినిమాలో కూడా ర‌క‌ర‌కాల ఎమోష‌న్స్ ఒక స్ప్లా‌ష్ కింద వ‌స్తే ఎంత హ్యాపీగా ఫీల‌వుతామో అంత చ‌క్క‌గా వుంటుందీ సినిమా. ప్రామిస్‌గా చెబుతున్నాను.. నితిన్‌గారు కామెడీ నిజంగా అద‌ర‌గొట్టేశారు. కీర్తిగారిని ఎంత ఏడిపిస్తారో.. త‌రువాత ఆమె అంత ప‌గ తీర్చుకుంటారు. ఈవిడ మామూలు మ‌నిషి కాదు. ఖ‌చ్చితంగా ఈ సినిమా మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. దేవిగారి విష‌యంలో త‌ప్పు చేశాను. అందుకు అంద‌రి ముందు పారీ చెబుతున్నాను. “బస్టాండే.. బ‌స్టాండే..” పాట ఎంతో పెద్ద హిట్టయింది. అందరికి న‌చ్చింది. అయితే ఈ పాట ముందు విన్న‌ప్పుడు సార్ ఇది అంటూ న‌సిగాను. వెంట‌నే దేవిగారు మీకు మైండ్ వుందా? అని తిట్టి ఈ సాంగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని ఈ సాంగ్ పెడ‌దాం అని న‌న్ను క‌న్విన్స్ చేశారు. ఆ పాట రిలీజైన ద‌గ్గ‌రి నుంచి మిలియ‌న్స్ వ్యూస్‌ని దాటేస్తోంది. ఈ సంద‌ర్భంగా దేవిగారికి సారీ చెబుతున్నాను.”అన్నారు.   ‌
రాక్ స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ “చాలా హ్యాపీగా వుంది. కొన్ని రోజుల క్రితం `ఉప్పెన‌`కు వ‌చ్చాం.. ఊపేశారు. ఇప్పుడు `రంగ్ దే`కు వ‌చ్చాం. ఈ మూవీ ఆడియోను బ్లాక్ బ‌స్ట‌ర్ చేసినందుకు చాలా థ్యాంక్స్‌. `రంగ్ దే` వెరీ రొమాంటిక్‌, సెంటిమెంట్‌, ఫ్యామిలీ, యూత్‌, అంద‌రికీ న‌చ్చే విధంగా కామెడీ అన్నీ వున్నాయి ఈ సినిమాలో. సో ఖ‌చ్చితంగా మీ అంద‌రికి న‌చ్చుతుంది. బాగా ఎంజాయ్ చేస్తార‌నుకుంటున్నాం. నేను కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ చేసిన‌ప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ప్ర‌త్యేకంగా చెప్పాలంటే వెంకీ గారు చాలా అందంగా తీర్చిదిద్ది ఈ సినిమాని తీశారు. థాంక్యూ వెంకీ గారు ఇలాంటి వండ‌ర్‌ఫుల్ రొమాంటిక్ మూవీకి వ‌ర్క్ చేసినందుకు. థ్యాంక్యూ ఫ‌ర్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నాగ‌వంశీ గారు. ప్రారంభం నుంచి నాకు పేరు తెచ్చిన‌వి ల‌వ్ స్టోరీసే. ఆనందం, సొంతం.. వ‌ర్షం కానీ..ఈ మ‌ధ్య కాలంలో చేసిన `ఉప్పెన‌` కానీ `రంగ్ దే` కానీ మంచి పేరు తెచ్చి పెట్టాయి. తొలిసారి నితిన్‌గారు నేను క‌లిసి వ‌ర్క్ చేశాం. మెలోడీస్ తో చేసిన రొమాంటిక్ ఫిల్మ్ ఇది. నితిన్ గారితో వ‌ర్క్ చేయ‌డం హ్యాపీగా వుంది. ప్ర‌తీ సాంగ్ కి నాకు ఫోన్ చేసి ఫుల్ జోష్ ఇచ్చేవారు. ఈ మూవీలో నితిన్ గారి న‌ట‌న చూస్తే ఒక బ్యూటిఫుల్ గ్రాఫ్ వుంటుంది. అల్ల‌రి కుర్రాడి నుంచి ఫుల్ కామెడీ చేస్తూ కీర్తిని ఏడిపించుకుంటూ ఫైన‌ల్‌గా మెచ్యూర్డ్ న‌ట‌న.. నాకు చాలా చాలా న‌చ్చింది. కీర్తి సురేష్‌, నితిన్ ల కెమిస్ట్రీ అదిరిపోయింది.” అన్నారు.
హీరో నితిన్ మాట్లాడుతూ “రంగ్ దే` సినిమా మార్చి 26న మీ ముందుకొస్తోంది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఖ‌చ్చితంగా మీ అంద‌రికి బాగా న‌చ్చుతుంది. ఈ బ్యాన‌ర్‌లో నాకిది మూడ‌వ సినిమా. అ ఆ, భీష్మ ఇప్పుడు `రంగ్ దే`. సో ఆ రెండు సినిమాల్లాగే ఈ సినిమా కూడా ఆడాల‌ని కోరుకుంటున్నాను. రాజ‌మండ్రికి లాస్ట్ టైమ్ `భీష్మ‌` షూటింగ్‌కి వ‌చ్చాను. సాంగ్ షూట్ కోసం వ‌చ్చాను. ఆ సినిమా హిట్ట‌యింది. `రంగ్ దే` కోసం మ‌ళ్లీ ఇప్పుడు ఇక్క‌డికి వ‌చ్చాను. సెంటిమెంట్‌గా మ‌ళ్లీ ఆడాల‌ని కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూస‌ర్ వంశీగారు ఇక్క‌డికి రాలేక‌పోయారు. వెంకీ అట్లూరి ఎప్ప‌టి నుంచో  నాకు మంచి స్నేహితుడు. త‌ను సినిమా బాగా చేశాడు. డీఎస్పీగారితో తొలిసారి వ‌ర్క్ చేశాను. చాలా అద్భుత‌మైన సంగీతం ఇచ్చారు. ఈ సాంగ్స్ చాలా రోజుల వ‌ర‌కు గుర్తుంటాయి. సినిమా రిలీజ్ అయ్యాక ఈ పాట‌లు చాలా పెద్ద హిట్ అవుతాయి. థ్యాంక్యూ దేవీ స‌ర్.. అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారు. మ‌న కాంబో ముందు ముందు ఇలాగే కొన‌సాగాల‌ని కోరుకుంటున్నాను. కీర్తీ చాలా మంచి న‌టి. ఈ సినిమాలో చాలా బాగా చేసింది. త‌న రియ‌ల్ క్యారెక్ట‌ర్ అదే. అంద‌రిని టార్చ‌ర్ పెడుతూ వుంటుంది. అది చూసి స్ఫూర్తిగా తీసుకుని వెంకీ ఈ క‌థ రాశారు. మార్చి 26 థియేట‌ర్‌లో ఈ సినిమా చూడండి. ఏప్రిల్ 9న ‘వ‌కీల్ సాబ్’ చూద్దాం” అన్నారు.
కీర్తి సురేష్ మాట్లాడుతూ “రొమాంటిక్  కామెడీ సినిమా ఇచ్చినందుకు వెంకీకి థ్యాంక్స్‌. డీఎస్పీతో ఇది నా థ‌ర్డ్ ఫిల్మ్‌. ఇది హ్యాట్రిక్ అవుతుంద‌ని చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాను. నితిన్ వ‌న్ ఆఫ్ ద బెస్ట్ కో స్టార్‌. ఒక విష‌యం చెప్పాలి. ట్రైల‌ర్ చూస్తే నేను విల‌న్‌లా క‌నిపిస్తున్నాను. అది అబ‌ద్ధం. నితినే విల‌న్‌. సెకండ్ హాఫ్‌లో నేను రివేంజ్ తీర్చుకున్నాను. అది మాత్ర‌మే ట్రైల‌ర్‌లో వుంది. అది చూసి మ‌రోలా భావించ‌కండి. థియేట‌ర్లో సినిమా చూసి నిజం ఏంటో తెలుసుకోండి. థియేట‌ర్స్‌కి వెళ్లి సినిమా చూడండి. 26న మా చిత్రం విడుద‌ల‌వుతోంది చూసి మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించండి” అన్నారు.
శ్రీ‌ముఖి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ కార్య‌క్ర‌మంలో టి టైమ్ ఉద‌య్‌, కాళీతేజ‌, అవి‌నాష్ కొల్లా త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇదే వేదిక‌పై రాజిరెడ్డి, స‌త్యకృష్ణ‌, మింది నాగేంద్ర .. యువ‌త హ‌రిత కార్య‌క్ర‌మం లో భాగంగా  చిత్ర బృందానికి మొక్క‌ల్ని అంద‌జేశారు. “బ‌స్టాండే బ‌స్టాండే”.. పాట‌కు ధేవిశ్రీ‌ప్ర‌సాద్‌, నితిన్‌, వెంకీ అట్లూరి, కీర్తి సురేష్ స్టెప్పులేశారు. అంతే కాకుండా ఇదే వేదిక‌పై కీర్తి సురేష్‌తో పాట పాడించారు.
Rang De Grand Release Event Held at Rajamahendravaram
Youth star Nithiin and Keerthy Suresh starrer ‘Rang De’ is gearing up for a worldwide release on March 26th. The film written and directed by Venky Atluri is getting a lot of positive buzz, all thanks to the trailer and lyrical videos released recently. ‘Rang De’ grand release event was held in a splendour manner in Rajamahendravaram.
Director Venky addressed the gathering first and said, “I have a connection with Rajamahendravaram and happy that ‘Rang De’ event is taking place here. Basically I did not confine myself to do only love stories but it just happened. ‘Rang De’ is like Holi festival that we see too many colors on a single day. This film will have many emotions.”
Adding the director said, “Nithiin’s comedy timing will be something else in this movie. He will bully Keerthy Suresh but she will get her share of revenge. She is no ordinary woman and definitely ‘Rang De’ will entertain everyone especially family audiences.”
Venky offered apology to music composer Devi Sri Prasad on this occasion. “When I heard the song ‘Bus Stande.. Bus Stande..’ I did not like. But DSP was sure that the song will be a huge hit and he even scolded me. After the release of the song and when it was getting millions of views, I realised I was wrong. I’m sorry DSP,” concluded Venky.
Music composer Devi Sri Prasad said, “A few days back I was here for ‘Uppena’ event and I’m back yet again. So happy to be in Rajamahendravaram. First of all I would like to thank everyone for making ‘Rang De’ music a huge success. This film has romance, comedy, entertainment, sentiment and will appeal to both family and youth audiences. I thoroughly enjoyed while doing the background score. Director Venky has crafted the film extremely well, so thank you director Venky for giving me to work in a romantic entertainer like ‘Rang De.’ Also thanks to Sithara Entertainments and Naga Vamsi.”
Further DSP said, “From the beginning of my career, love stories have brought me a big name. films like ‘Anandam’ ‘Varsham’ were the films in those days and now ‘Uppena’ and ‘Rang De’ are the ones that I’m happy to work.”
“This is my first film with Nithiin and he pumped my energy levels with his feedback for every song. His performance will be like a beautiful graph in this movie. He transforms from a playful youngster to a matured man. The chemistry between Nithiin and Keerthy is major highlight and asset for the film,” summed up DSP.
It was hero Nithiin’s turn then. “Rang De is releasing on March 26th and I’m sure that you all will like it. This is a family entertainer and will be liked by everyone. This is my third film in Sithara Entertainments banner. ‘A Aa’ and ‘Bheeshma’ were huge hits and I hope to score a hat-trick with Sithara. Due to some reasons my producer Naga Vamsi could not make it to the event,” said Nithiin.
“I know director Venky since long time and finally we worked together. Also this is my first film with music composer Devi Sri Prasad. He did give an amazing music. After the release of ‘Rang De’ the songs will turn even big hits and will be remembered for long. Thank you DSP for fantastic music. I hope more and more films come in our combination,” added Nithiin.
On Keerthy Suresh Nithiin said, “Keerthy is a terrific actor and she played her real self in the movie. She tortures everyone and director Venky got inspired by her and penned this story. Watch ‘Rang De’ in theatres on March 26th and then ‘Vakeel Saab’ on April 9th.”
Lastly Keerthy spoke and said, “Thanks to director Venky for making me part of this romantic comedy. I’m eagerly looking forward to score hat-trick hits with music composer Devi Sri Prasad. Nithiin is one of the best co-stars and I would like to clarify one thing. If you watch ‘Rang De’ trailer, I’m the villain but it’s not true. Nithiin is the villain and I take revenge in the second half. But don’t get carried away, watch the film in theatres and get to know the real twist. Bless us all and go watch ‘Rang De’ in theatres from March 26th.”
Sree Mukhi hosted the grand release event of ‘Rang De’ while Kali Teja, Avinash Kolla and others graced the occasion. Nithiin and ‘Rang De’ team took part in ‘Yuvatha-Haritha’ initiative and planted a sapling.
Nithiin, Keerthy, director Venky and DSP shook their leg on stage while DSP made Keerthy sing too.
IMG_4233

Jersey is a movie that is well deserved of the national awards that it has received. Very happy to have received two awards. -Young Producer Suryadevara Naga vamshi

జాతీయ‌ అవార్డులకు ‘జెర్సీ’ అన్ని విధాలా అర్హ‌మైంది.. రెండు అవార్డులు రావ‌డం హ్యాపీ

- యువ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
* ‘జెర్సీ’కి హీరో నాని, డైరెక్ట‌ర్ గౌత‌మ్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు
* బాబాయ్ ర‌మ్మంటే సాఫ్ట్‌వేర్ నుంచి సినిమాల్లోకి వ‌చ్చాను
* ‘రంగ్ దే’ ఫ‌స్టాఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో, సెకండాఫ్ ఎమోష‌న్స్‌తో అల‌రిస్తుంది
‌‌
సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కత్వంలో యువ నిర్మాత సూర్య‌‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ‘జెర్సీ’ మూవీ 2019 జాతీయ చల‌న‌చిత్ర అవార్డుల్లో ఉత్త‌మ తెలుగు చిత్రంగా పుర‌స్కారాన్ని గెలుచుకొని స‌గ‌ర్వంగా నిలిచింది. అలాగే ఈ చిత్రానికి ప‌నిచేసిన న‌వీన్ నూలి ఉత్త‌మ ఎడిట‌ర్‌గా అవార్డును పొందారు. ఈ రెండు పుర‌స్కారాలు తెచ్చిన ఆనందాన్ని ఆస్వాదిస్తూనే.. ‌మార్చి 26న విడుద‌ల‌వుతున్న ‘రంగ్ దే’ చిత్రం ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నారు నాగ‌వంశీ. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం మీడియాతో స‌మావేశ‌మైన ఆయ‌న ‘జెర్సీ’ సినిమా విశేషాల‌ను పంచుకోవ‌డంతో పాటు, ‘రంగ్ దే’ మూవీ సంగ‌తులు, భ‌విష్య‌త్ ప్రాజెక్టుల గురించి విపులంగా మాట్లాడారు. ఆ విష‌యాలు..
‘జెర్సీ’కి రెండు జాతీయ అవార్డులు వ‌చ్చినందుకు ముందుగా అభినంద‌న‌లు. ఈ అవార్డులు రావ‌డం ఎలా అనిపిస్తోంది?
‘జెర్సీ’కి అవార్డులు వ‌స్తాయ‌ని ఊహించాం. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త ఏడాది జాతీయ అవార్డులు లేక‌పోయేస‌రికి వాటి గురించి మ‌ర్చిపోయాం. కానీ ఇప్పుడు హ‌ఠాత్తుగా ప్ర‌క‌టించేస‌రికి ఆశ్చ‌ర్య‌మూ, ఆనంద‌మూ రెండూ క‌లిగాయి. తొలిసారి మా సినిమాకు జాతీయ అవార్డులు రావ‌డం సంతోషంగా అనిపిస్తోంది. ఆ సినిమా కోసం హీరో నాని చాలా ఎఫ‌ర్ట్ పెట్టారు, బాగా క‌ష్ట‌ప‌డ్డారు. డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి ప‌డిన క‌ష్టం కూడా చిన్న‌దేమీ కాదు.
‘జెర్సీ’ తీయాల‌ని ఎందుక‌నిపించింది?
గౌత‌మ్ ఈ క‌థ చెప్పిన‌ప్పుడు బాగా న‌చ్చేసింది. బేసిక‌ల్‌గా నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఆ నేప‌థ్యం ఉన్న క‌థ కావ‌డం, మంచి భావోద్వేగాలు ఉండ‌టంతో క‌నెక్ట‌య్యాను. నానితో ఈ సినిమా చేయాల‌నుకున్నాడు గౌత‌మ్‌. అయితే ఏడు సంవ‌త్స‌రాల కొడుకు ఉన్న తండ్రి క‌థ‌ని నాని ఒప్పుకుంటారా, లేదా అని సందేహించాం. కానీ విన‌గానే నాని ఈ క‌థ‌ను న‌మ్మారు. ఏమాత్రం సందేహించ‌కుండా ఏడేళ్ల కొడుకున్న తండ్రిగా సూప‌ర్బ్‌గా న‌టించారు.
అవార్డులు రావ‌డం స‌రే.. క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ సినిమాకు మీకు సంతృప్తినిచ్చిందా?
ప్రేక్ష‌కుల్ని ఇబ్బంది పెట్ట‌కుంటే చాలు అంటుంటారు బాబాయ్ (నిర్మాత ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు‌)‌. క‌థ‌లో మేం ఎంట‌ర్‌టైన్‌మెంట్, హ్యూమ‌న్ ఎమోష‌న్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంటాం. జెర్సీ క‌థ‌లో క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్ త‌క్కువే అయినా అందులోని ఎమోష‌న్స్‌ను నాని, నేను బాగా న‌మ్మాం కాబ‌ట్టే ఆ సినిమా చేశాం. రాయ‌ల‌సీమ‌, గుంటూరు ఏరియాలు మిన‌హా.. ఓవ‌ర్సీస్ స‌హా అన్ని చోట్లా క‌మ‌ర్షియ‌ల్‌గా బాగా ఆడింది. రెండో వారం హాలీవుడ్ ఫిల్మ్ ‘అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్’ రావ‌డంతో క‌లెక్ష‌న్ల‌పై ప్రభావం ప‌డింది. అయిన‌ప్ప‌టికీ బాగానే ఆడింది.
ఈ రెండు అవార్డులే కాకుండా వేరే అంశాల్లో అవార్డులు వ‌స్తాయ‌ని ఆశించారా?
బెస్ట్ యాక్ట‌ర్‌గా నానికి, బెస్ట్ డైరెక్ట‌ర్‌గా గౌత‌మ్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వ‌స్తాయ‌ని నేను న‌మ్మాను. అయితే ఇప్పుడు రెండు అంశాల్లో నేష‌న‌ల్ అవార్డ్స్ రావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. అందుకు ‘జెర్సీ’ సినిమా పూర్తిగా అర్హ‌మైంది.‌
ఇండ‌స్ట్రీ నుంచి ఎలాంటి స్పంద‌న ల‌భించింది?
ఇండ‌స్ట్రీకి సంబంధించిన చాలా మంది అభినంద‌న‌లు తెలిపారు. కొంత‌మంది ఫోన్ల ద్వారా, కొంత‌మంది సోషల్ మీడియా ద్వారా అభినందించారు. అందరికీ పేరు పేరు న కృతజ్ఞతలు.
మీ సినిమాతో పాటు ‘మ‌హ‌ర్షి’ చిత్రానికీ రెండు అవార్డులు ల‌భించడంపై మీ స్పంద‌న‌?
చాలా ఆనందంగా ఉంది. ‘మ‌హ‌ర్షి’ సినిమాని మంచి కాన్సెప్ట్‌తో తీశారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు ఆగాలంటే ఏం చేయాల‌నే క‌థ‌కి మ‌హేష్‌బాబు గారు త‌న ప‌ర్ఫార్మెన్స్‌తో గొప్ప న్యాయం చేశారు. డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి చాలా బాగా దాన్ని రూపొందించారు. ‘మ‌హ‌ర్షి’ టీమ్ మొత్తానికీ మా సంస్థ త‌ర‌పున అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నా.
హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌లో మీ పాత్ర ఎంత‌వ‌ర‌కు ఉంటుంది?
హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పేరుకు రెండు బ్యాన‌ర్ల‌యినా, నా వ‌ర‌కు అవి రెండూ ఒక‌టే. చెప్పాలంటే హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ పేరిట నిర్మించే సినిమాల్లోనే నా ఇన్‌వాల్వ్‌మెంట్ ఎక్కువ ఉంటుంది. హారిక‌, హాసిని అనేవి మా చెల్లెళ్ల పేర్లు. ఆ ఇద్ద‌రి పేరిట హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ పేరును త్రివిక్ర‌మ్ గారు పెట్టారు. సాధార‌ణంగా నా ద‌గ్గ‌ర‌కు ఏదైనా క‌థ వ‌చ్చి, అది నాకు న‌చ్చితే బాబాయ్ (ఎస్‌. రాధాకృష్ణ‌) ద‌గ్గ‌ర‌కు పంపిస్తాను. ఆయ‌న‌కూ న‌చ్చితే అప్పుడు ప్రాజెక్ట్ మొద‌లుపెడ‌తాం.
సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ నుంచి వ‌చ్చారు క‌దా.. సినీ నిర్మాణం సంతోషాన్నిస్తోందా?
నేను సాఫ్ట్‌వేర్ రంగం నుంచి సినీ రంగంలోకి రావ‌డానికి కార‌ణం మా బాబాయే. స‌హ‌జంగానే నాకు సినిమాలంటే చిన్న‌ప్ప‌ట్నుంచీ ఇష్టం. నిర్మాత‌ల్లో నాకు దిల్ రాజు గారంటే చాలా అభిమానం. ఆయ‌న స్వ‌యంకృషితో ఈ రంగంలోకి వ‌చ్చి ఉన్న‌త స్థాయికి ఎదిగారు. బాబాయ్ నిర్మాత‌గా సినిమాల్లోకి వ‌చ్చాక‌, న‌న్ను కూడా ర‌మ్మ‌నేస‌రికి సంతోషంగా వ‌చ్చేశాను. ఇప్పుడు మంచి సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థ‌లుగా మా బ్యాన‌ర్ల‌కు పేరు రావ‌డం మ‌రింత ఆనందంగా ఉంది.
‘రంగ్ దే’ గురించి ఏం చెబుతారు?
‘రంగ్ దే’ సినిమా యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇంజ‌నీరింగ్ చ‌దివిన 24 సంవ‌త్స‌రాల కుర్రాడి క‌థ‌. ఈ క‌థ‌లోనూ మంచి మాన‌వ భావోద్వేగాలుంటాయి. ప్ర‌ధ‌మార్ధం వినోదాత్మ‌కంగా ఉల్లాసంగా న‌డిస్తే, ద్వితీయార్ధం చివ‌రి న‌ల‌భై నిమిషాల‌లో భావోద్వేగాలు మ‌న‌సుల్ని ఆక‌ట్టుకుంటాయి. నితిన్ న‌ట‌న అంద‌ర్నీ అల‌రిస్తుంది.
షూటింగ్ కోసం ఇట‌లీకి వెళ్లాల‌నుకున్నారు క‌దా.. దుబాయ్‌కి మార్చారెందుక‌ని?
క‌థ ప్ర‌కారం ఇట‌లీకి వెళ్లాలి. కానీ కొవిడ్ వ‌ల్ల షూటింగ్‌ను దుబాయ్‌కి మార్చాం. క‌థ‌లోనూ బ్యాక్‌డ్రాప్‌ను దుబాయ్‌నే పెట్టాం. అక్క‌డ షూటింగ్ మంచి ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో స్మూత్‌గా జ‌రిగింది.
జూనియ‌ర్ ఎన్టీఆర్‌-త్రివిక్ర‌మ్ సినిమా ఎప్ప‌టి నుంచి ఉంటుంది?
ఏప్రిల్ నెలాఖ‌రు లేదా మే మొద‌టి వారంలో షూటింగ్ మొద‌ల‌వుతుంది.
‘అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్’ రీమేక్ షూటింగ్ గురించి ?
ఈ చిత్రం ఇద్ద‌రు వ్య‌క్తుల ఇగోల నేప‌థ్యంలో న‌డిచే క‌థ‌. ఒరిజిన‌ల్ త‌ర‌హాలోనే తెలుగులోనూ ఆ క్యారెక్ట‌రైజేష‌న్స్ అలాగే ఉంటాయి. కొన్ని స‌న్నివేశాల‌ను మార్చ‌డం, లేదా క‌ల‌ప‌డం జ‌రిగింది.
డైరెక్ట‌ర్‌గా సాగ‌ర్‌చంద్ర‌ను తీసుకొని, స్క్రిప్ట్ కోసం త్రివిక్ర‌మ్ గారిని తీసుకొచ్చారెందుక‌ని?
సాగ‌ర్‌చంద్ర డైరెక్ష‌న్ స్కిల్స్ మీద న‌మ్మ‌కంతోనే ఆయ‌న‌ను డైరెక్ట‌ర్‌గా తీసుకున్నాం. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు, రానా గారు న‌టిస్తుండ‌టంతో, ప్రాజెక్ట్ పెద్ద‌దైపోయింది. దాన్ని బ్యాలెన్స్ చేయ‌డం కోస‌మే త్రివిక్ర‌మ్ గారు స్క్రిప్ట్‌లోకి వ‌చ్చారు. ఆయ‌న స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ సినిమాకి బ‌ల‌మ‌వుతాయి.
హీరోయిన్లు ఎవ‌రు?
ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి స‌ర‌స‌న హీరోయిన్‌గా ఇంకా ఎవ‌రినీ ఎంపిక చేయ‌లేదు. రానా జోడీగా ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టిస్తోంది.
మీ బ్యాన‌ర్ మీద త‌ర్వాత వ‌చ్చే సినిమాలేమిటి?
సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ మీద త‌ర్వాత వ‌చ్చే సినిమా ‘వ‌రుడు కావ‌లెను’. మ‌ల‌యాళం హిట్ సినిమా ‘క‌ప్పేలా’ రీమేక్‌ను ‘బుట్ట‌బొమ్మ’ టైటిల్‌తో చేద్దామ‌నుకుంటున్నాం. ‘న‌రుడి బ్ర‌తుకు న‌ట‌న’ అనే సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. బెల్లంకొండ సురేష్ గారి చిన్న‌బ్బాయి గ‌ణేష్‌బాబు హీరోగా ఓ సినిమా చేస్తున్నాం.
క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి క‌దా.. సినిమాపై దీని ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారా?
క‌రోనా గురించి ఇదివ‌ర‌క‌టిలా ఇప్పుడంత భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌నేది నా వ్య‌క్తిగ‌త అభిప్రాయం. వైర‌స్‌లో తీవ్ర‌త త‌గ్గింది. కేసులు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఆందోళ‌న చెందాల్సింది లేదు. మ‌ళ్లీ లాక్‌డౌన్‌లు విధిస్తార‌ని నేన‌నుకోను. పెద్ద‌వాళ్లు ఇప్ప‌టికే వాక్సిన్ వేసుకుంటున్నారు.
థియేట‌ర్లు తెరుచుకున్నాక వ‌రుస‌గా సినిమాలు హిట్ట‌వుతుండ‌టంపై ఏమంటారు?
2020లో అల వైకుంఠ‌పుర‌ములో, స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ సినిమాలు మంచి హిట్ట‌య్యాక‌.. లాక్‌డౌన్ వ‌చ్చింది. ఈ సంవ‌త్స‌రం థియేట‌ర్లు ఓపెన్ అయ్యాక చాలా సినిమాలు హిట్ట‌వ‌డం, ఊహించిన దానికి మించి క‌లెక్ష‌న్లు వ‌స్తుండ‌టం ఇండ‌స్ట్రీకి శుభ ప‌రిణామం. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంద‌ని అనుకుంటున్నాం.
Happy with two National Awards for Jersey: Producer Suryadevara Naga Vamsi• Nani and director Gowtam Tinnanuri worked very hard for ‘Jersey.
• Left my software job and stepped into film production
• Rang De will be entertaining in the first half and emotional in the second half

‘Jersey’ starring Natural star Nani and Shraddha Srinath in the lead roles, was directed by Gowtam Tinnanuri and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments banner. The film won two National Awards i.e, Best Telugu Film and Best Editor (Navin Nooli). While enjoying this honour, the producer Naga Vamsi is super busy with the promotions of ‘Rang De’ which is gearing up for March 26th release.

On Tuesday Naga Vamsi interacted with the media and shared his thoughts on ‘Jersey,’ ‘Rang De’ and details of his future projects.

Speaking Naga Vamsi said, “We are expecting awards for ‘Jersey.’ Due to the pandemic, the National Awards were not announced and so it flipped from everyone’s mind. But all of a sudden the National Awards were announced. We were completely surprised and at the same time overjoyed by the honours. Hero Nani did put in a great effort while Gowtam’s hard work is no less.”

On ‘Jersey’ Naga Vamsi added when director Gowtam narrated the script he liked it. “Basically I love cricket and I got instantly connected because there were strong emotions too. Director Gowtam said he wants to do ‘Jersey’ with Nani but I had my inhibitions because Nani has to play the role of a father to a seven years old. As and when Nani heard the script, he immediately said okay and he was not at all worried to play a father and in the end he delivered an outstanding performance,” said Naga Vamsi.

When asked about the commercial success of the film, the young producer replied that ‘Jersey’ fared well at the box office. “My Babai (Producer Suryadevara Radha Krishna aka China Babu) always says that the audiences should not be bothered. We give top priority to entertainment and human emotions in the script we select. Yes ‘Jersey’ had low commercial elements but Nani, director and myself believed in the emotions and so we made the film. Except in Rayalaseem and Guntur, ‘Jersey’ fared well commercially. And with ‘Avengers: Endgame’ release, there was a drop in second week collections. Yet the film managed to pull the audiences,” said Naga Vamsi.

The producer further said he anticipated Filmfare awards for hero Nani and director Gowtam. But now they got a bigger reward than Filmfare.

About ‘Rang De’ Naga Vamsi said, this is a youthful family entertainer. “It’s a story of 24 years old engineering student. The film has human emotions. The first half will be breezy and entertaining whereas the second half will be heart-warming. The last 40 minutes is going to be heart-touching. Nithiin’s performance will be highlight,” said Naga Vamsi.

On ‘Ayyappanum Koshiyum’ the producer said, “This is a tale of two people who are highly egoistic. The prime characters from the original are retained but for Telugu audiences some scenes are added and removed.”

About director Saagar Chandra, he said, “We have immense faith in the director’s work. But with Pawan Kalyan and Rana Daggubati playing the lead roles, the project is a big one. To maintain the balance, director Trivikram came on board. He is providing the screenplay and dialogues for the movie.”

Aishwarya Rajesh is pairing up with Rana in this ‘Ayyappanum Koshiyum’ remake while the leading lady opposite Pawan Kalyan is yet to be locked.

Regarding the future projects, Naga Vamsi said, “Varadu Kavalenu is the next and we are remaking Malayalam movie ‘Kappela’ in Telugu with ‘Butta Bomma.’ And ‘Narudi Brathuku Natana’ is in shooting stages and we are also planning a film with producer Bellamkonda Suresh’s second son, Ganesh Babu.”

On the Corona effect, the producer opined that there is nothing to fear now and the virus influence has come down in the recent times. “I don’t think lockdown will be imposed yet again,” said Naga Vamsi.

snvjpg 5I8A0774 (1)

 

Rang De Will Be Colourful Like Rainbow – Ace Director Trivikram;


‘రంగ్‌ దే’ జీవితంలోని ఏడురంగులను చూపిస్తుంది
- సుప్రసిద్ధ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్
• గ్రాండ్ గా ‘రంగ్ దే’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్

యూత్ స్టార్ నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘రంగ్‌ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.

ఆదివారం హైదరాబాద్‌ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్‌ వేడుక కన్నుల పండుగగా జరిగింది. చిత్ర నాయకా,నాయికలు నితిన్, కీర్తి సురేష్, సుప్రసిద్ధ నిర్మాత, హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత సుధాకర్‌రెడ్ది, నిర్మాత ఠాగూర్ మధు,చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ, చిత్ర సమర్పకుడు పీడీవీ ప్రసాద్‌, చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి,సీనియర్ నటుడు వీకే నరే్‌ష్‌, రోహిణి, వెన్నెల కిషోర్‌, అభినవ్‌ గోమటం, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గీత రచయిత శ్రీమణి, గాయని మంగ్లీ,  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘రంగ్‌ దే’ జీవితంలోని ఏడురంగులను చూపిస్తుంది
- సుప్రసిద్ధ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్

ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘అన్ని జంతువులు నవ్వలేవు. మనిషి మాత్రమే నవ్వగలడు. అలాగే జంతువులకు ఏ వస్తువైనా బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే కనిపిస్తుంది. మనుషులకు మాత్రమే ఏడురంగులను చూసే అదృష్టం ఉంది. ఈ సినిమా జీవితంలోని ఏడు రంగులను చూపిస్తుంది. సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. ఇందులో నాకు బాగా నచ్చిన పాత్రలు అర్జున్‌, అను. ఎలాంటి సందర్భంలో అయినా ఓ మంచి పాటను తీసుకురాగలిగే సత్తా దేవిశ్రీ ప్రసాద్‌కు ఉంది. భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో దేవీ కూడా ఒకరు. ఇందులో ‘ఊరంతా చీకటి’ పాట థియేటర్‌లో చూస్తే ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చుతాయి’’ అని అన్నారు.

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘తొలిప్రేమ’, ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రాలకు నేను సంగీతం అందించాలి. మ్యూజిక్‌ టూర్స్‌లో ఉండడం వల్ల డేట్స్‌ కుదరలేదు. ఈ సినిమా గురించి ఫ్లైట్‌లో కలిసినప్పుడు ఓ గంట కథ చెప్పారు. అలా ‘రంగ్‌ దే’ కుదిరింది. యూత్‌ఫుల్‌గా ఉండే మెచ్యూర్డ్ స్టోరీ ఇది. నితిన్‌ చేసిన సినిమాల్లో డిఫరెంట్‌ సినిమా ఇది’’ అని అన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘‘నితిన్‌, కీర్తి ఈ కథ అంగీకరిస్తారని అనుకోలేదు. అర్జున్‌, అను పాత్రలకు ప్రాణం పోశారు. మేం ముగ్గురం బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. లాక్‌డౌన్‌లో నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్‌ మరచిపోలేనిది. దేవిగారిని ఓ ఫ్యాన్‌గా కలిశా. ఆయన మాత్రం నాకు ఫ్రీడమ్‌ ఇచ్చి కావలసినట్లు సంగీతం ఇచ్చారు.  పీసీ శ్రీరామ్‌గారు సినిమా అంగీకరించడం నా అదృష్టం. నటీనటులు, సాంకేతిక నిపుణులు ద బెస్ట్‌ ఇచ్చారు. వెన్నెల కిషోర్‌, అభినవ్‌ కామెడీ చక్కగా పండుతుంది. సినిమా చూసి త్రివిక్రమ్‌గారు ఇచ్చిన సపోర్ట్‌ మరువలేను’’ అని అన్నారు.

సీనియర్ యాక్టర్ నరేష్‌ మాట్లాడుతూ ‘‘ఒక్క ట్రైలర్‌.. రెండు డైలాగ్‌లతో వందకు పైగా మెసేజ్‌లు వచ్చాయి. అంతగా ప్రేక్షకుల్ని ట్రైలర్‌ ఆకట్టుకుంది. దీన్ని బట్టి వెంకీ ఈ చిత్రాన్ని ఎలా హ్యాండిల్‌ చేశారో తెలుస్తుంది. ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌తో బ్యూటిఫుల్‌ కాక్‌టైల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నితిన్‌ తప్ప మరెవరూ ఈ సినిమాకి సూట్‌కారు. కీర్తి దక్షిణ భారతదేశం గర్వంచదగ్గ నాయిక’’ అని అన్నారు.

నటి రోహిణి మాట్లాడుతూ ‘‘రిలాక్స్‌ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని సెలక్టివ్‌ సినిమాలు చూడాలనుకుంటాం. ఆ కోవకు చెందిన సినిమా ఇది. ప్రేమకథని పీసీ శ్రీరామ్‌ చూపించినంత అందంగా ఎవరూ చూపించలేరు. బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీ ఇది. అను పాత్రను కీర్తి తప్ప ఎవరూ చేయలేరు’’ అని అన్నారు.

గేయ రచయిత శ్రీమణి మాట్లాడుతూ ‘‘తొలిప్రేమ నుంచి వెంకీ అట్లూరితో జర్నీ చేస్తున్నా. పాటలకు ఆయనిచ్చే సందర్భాలు బావుంటాయి. అందుకే చక్కని సాహిత్యం అందించగలిగా. ఇందులో అన్ని పాటలు నేనే రాశా. ‘జులాయి’ సినిమా నుంచి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌తో ట్రావెల్‌ చేస్తున్నా. మంచి అవకాశాలిచ్చి నన్ను ప్రోత్సహిస్తున్న నాగవంశీగారికి కృతజ్ఞతలు’ అని అన్నారు.

హీరోయిన్ కీర్తి సురేష్‌ మాట్లాడుతూ ‘‘అను పాత్ర చేయగలనని నమ్మిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్‌. దేవి శ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో నా మూడో సినిమా ఇది. హ్యాట్రిక్‌ అవుతుందని ఆశిస్తున్నా. నితిన్‌తో నా కెమిస్ట్రీ బావుంటుంది’’ అని అన్నారు.


సినిమా ఇండస్ట్రీలో నా రెండు కళ్లు ఎవరంటే ఒకరు పవన్‌కల్యాణ్‌గారు, రెండు త్రివిక్రమ్‌గారు: నితిన్

నితిన్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో నా వయసు 24 ఏళ్లు. నిజంగా నా వయసు 36 ఏళ్లు. దర్శకుడు కథ చెప్పినప్పుడు నా వయసుని జనాలు అంగీకరిస్తారా అన్న అనుమానం వచ్చింది. పీసీ శ్రీరామ్‌ డిఓపీ అనగానే ఆయన బాగా చూపిస్తారనే నమ్మకంతో ధైర్యం వచ్చింది. ‘ఇష్క్‌’ తర్వాత ఆయనతో మరోసారి పని చేయడం హ్యాపీగా ఉంది. డీఎస్‌పీ డైమండ్స్‌ లాంటి పాటలిచ్చారు. కీర్తి సురేశ్‌ అనగానే ‘మహానటి’ గుర్తొస్తుంది. ఈ సినిమాలో మాత్రం ఆమె మహా నాటు, మహా నాటీ. ఈ కథకు ఆమె పెద్ద ఎసెట్‌. దర్శకుడితో పన్నెండేళ్ల పరిచయం ఉన్నా మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఇప్పటికి కుదిరింది. చాలా సెన్సిబుల్‌గా ఈ కథను తెరకెక్కించాడు. ఈ బ్యానర్‌లో మూడో సినిమా ఇది. నేను ఫ్లాప్‌లో ఉన్న ప్రతిసారీ ఈ బ్యానర్‌ హిట్‌ ఇస్తుంది. సెంటిమెంట్‌గా చూస్తే ఈ సినిమా కూడా హిట్‌ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో నా రెండు కళ్లు ఎవరంటే ఒకరు పవన్‌కల్యాణ్‌గారు, రెండు త్రివిక్రమ్‌గారు. ఈ ఇద్దరూ నా వెనకున్నారు. అదే నా ధైర్యం అదే నా దమ్ము’’ అని అన్నారు.

యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ
‘రంగ్ దే’.  ’ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.

ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్)
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశి
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి
 
Rang De Will Be Colourful Like Rainbow – Ace Director Trivikram; 
*Rang De Pre-Release Event Held In Grand StyleYouth star Nithiin and Keerthy Suresh starrer ‘Rang De’ is gearing up for release on March 26th. The film is written and directed by Venky Atluri while produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments banner. The Pre-Release Event of ‘Rang De’ was held in a grand style at Shilpa Kala Vedika. Star director Trivikram Srinivas graced the event as chief guest.

Speaking on the occasion, Ace Director Trivikram said, “Humans are the only living beings who can smile and see all the colours. We are the lucky ones and ‘Rang De’ will be like a rainbow. I’ve watched the film and I really liked it. Nithiin is like my brother and I always wish him success. Nithiin and Keerthy are playing Arjun and Anu respectively which is indirectly ‘A.. Aa.’ Devi Sri Prasad is one of my favourite music composers and I’ve immense respect for musicians who have classical background. There is a particular song in this movei ‘Oorantha Cheekati’ and it will certainly make the audiences weep in the theatres.”

Music director Devi Sri Prasad said, “I was supposed to compose music for director Venky’s ‘Tholi Prema’ and ‘Mr. Majnu.’ I was on an overseas tour and so it did not work out. I’m glad that I’ve finally collaborated with Venky. I heard ‘Rang De’ script in a flight and this is a matured love story cum youthful entertainer. It will be a different film in Nithiin’s career.”

Director Venky said, “I never imagined that Nithiin and Keerthy would accept this film. They breathed life in the roles of Arjun and Anu. Now we three have become best friends. The support I received from the producers during the lockdown period is unforgettable one. I met DSP as a fan but he gave me extraordinary music. It’s a blessing for this film to have legendary PC Sreeram and to all the artists and technicians, I thank you. Last but not least, director Trivikram’s encouraging words after watching ‘Rang De’ relieved me.”

Actress Keerthy Suresh said, “I thank the director and producers for believing in me that I can do the role of Anu. This is my third film in Devi Sri Prasad’s musical and I hope we score a hat-trick. The chemistry between me and Nithiin in ‘Rang De’ worked out quite well.”

Actor Naresh said, “I received hundreds of messages after the trailer was launched. This shows the response to the trailer and Venky has handled the film efficiently. ‘Rang De’ is a cocktail of emotions, entertainment and romance. None can fit in the role of Arjun except Nithiin and Keerthy is pride of South Indian cinema.”

Character artist Rohini said, “This film falls in that category when we would want to sit back and relax and watch a pleasant movie. Nobody can show love story as beautiful as PC Sreeram and ‘Rang De’ is a striking love story. Anu role can only be done by Keerthy.”

Lastly hero Nithiin addressed the event. “In this film my age is 24 but my actual age is 36. I was in doubt but when I heard that PC Sreeram is doing the cinematography, I gained confidence and courage. Happy to be working with him after ‘Ishq.’ DSP gave fantastic music and all the songs released so far have garnered superb response. Keerthy always reminds of ‘Mahanati’ but in this film she is too naughty. She is a big asset for this film. I know director Venky for the past 11 years yet it took long for us to work together. This is a sensible subject and was handled well. ‘Rang De’ is my third film in Sithara Entertainments banner. Whenever I score a flop, this banner gives me the much needed success. If reckoned as sentiment, ‘Rang De’ will definitely score a hit. In the industry, Pawan Kalyan and Trivikram are my pillars of support. They are my strength.”

Rang De Pre-Release event was also graced by producers S Radha Krishna (Chinababu),

PDV Prasad, N.Sudhakar Reddy, Thagore Madhu,Vennela Kishore, Abhinav Gomatam, lyricist Shreemani, Singer Mangli and others.
Apart from the lead pair of Nithin and Keerthy Suresh, prominent actor Naresh, Kousalya, Rohini,Bramhaji, Vennela Kishore,Vineeth, Gayithri raghuram, Satyam Rajesh, Abhinav Gomatam and  Suhas play pivotal characters in the movie.
Dop- P.C Sreeram
Music- Devi Sri Prasad
Editing- Naveen Nooli
Art- Avinash Kolla
Additional Screenplay- Satish Chandra Pasam
Executive Producer – S. Venkatarathnam (Venkat)
pro: Lakshmivenugopal
Presented by PDV Prasad
Produced by Suryadevara Nagavasmi
Written and Directed by Venky Atluri.
0N8A0303 copy 0N8A0301 copy