Dec 23 2021
Dhanush – Venky Atluri – Sithara Entertainments & Fortune Four Cinemas Bilingual Movie titled as ‘SIR’ (Telugu)/’Vaathi’ (Tamil)
ధనుష్ – వెంకీ అట్లూరి – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ద్విభాషా చిత్రం టైటిల్ ‘సార్’ (తెలుగు)/ ‘వాతి’ (తమిళం)
పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్టర్ ‘ధనుష్’తో జతకడుతోంది. ఆయనతో తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రాన్ని నిర్మించనున్నది. తమిళ వెర్షన్‌కు ‘వాతి’, తెలుగు వెర్షన్‌కు ‘సార్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ఉత్తేజభరితమైన టైటిల్ లుక్ మోషన్ పోస్టర్‌ను నిర్మాతలు ఆవిష్కరించారు.
టైటిల్ రివీల్ వీడియోలో ఈ సినిమా “యాన్ యాంబిషియస్ జర్నీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్” అని చెప్పారు. ఈ మోషన్ పోస్టర్ ప్రకారం ధనుష్ ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా నటించనున్నారని తెలుస్తోంది. టైటిల్ డిజైన్‌లో పెన్నుపాళీ కనిపిస్తోంది. అంటే ఇది ఒక పీరియాడికల్ మూవీ అనీ, హీరో తన కలం బలంతో స్టూడెంట్స్‌కు ఒక రోల్ మోడల్ అవుతాడనీ ఊహించవచ్చు. మొత్తంగా ఈ మోషన్ పోస్టర్‌ను చూస్తుంటే, ఒక ఉద్వేగభరితమైన, ఉత్తేజకరమైన కథను దర్శక నిర్మాతలు మన ముందు ప్రెజెంట్ చేయనున్నారనే నమ్మకం కలుగుతోంది. చిత్రం పేరుతో కూడిన ప్రచార చిత్రాలను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు.
ఇదే బ్యానర్‌లో ఇటీవల ‘రంగ్‌దే’ చిత్రానికి దర్శకత్వం వహించిన యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్నారు.
కేరళకు చెందిన చార్మింగ్ సెన్సేషన్ సంయుక్తా మీనన్ ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికయ్యారు. ‘సూదు కవ్వం’, ‘సేతుపతి’, ‘తెగిడి’, ‘మిస్టర్ లోకల్’, ‘మార’ వంటి చిత్రాలకు పనిచేసి తనదైన ముద్రవేసిన సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేయనున్నారు. హృదయాన్ని హత్తుకొనే సంగీతం సమకూర్చడంలో దిట్ట అయిన జి.వి. ప్రకాష్‌కుమార్ సంగీత దర్శకుడు. రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవుతాయి. ఈ ద్విభాషా చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2022 జనవరిలో మొదలవుతుంది.
తారాగణం: ధనుష్, సంయుక్తా మీనన్, సాయికుమార్ తనికెళ్ల భరణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
సినిమాటోగ్రాఫర్: దినేష్ కృష్ణన్
మ్యూజిక్: జి.వి. ప్రకాష్‌కుమార్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాతలు: నాగవంశీ ఎస్. – సాయి సౌజన్య
రచయిత – దర్శకుడు: వెంకీ అట్లూరి
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ – ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
Dhanush – Venky Atluri – Sithara Entertainments & Fortune Four Cinemas Bilingual Movie titled as ‘SIR’ (Telugu)/’Vaathi’ (Tamil)
Sithara Entertainments, who are on a roll with multiple movies in production, are taking a step ahead and teaming up with the 2 time-National Award Winning actor ‘Dhanush’ for a new bilingual movie in Telugu and Tamil titled ‘Vaathi’ (Tamil) / ‘SIR’ (Telugu)’. On this occasion, the makers unveiled the intriguing Title Look Motion Poster of the movie which grabbed the attention of the movie buffs across social media.
Youthful Director Venky Atluri, who had directed Rang De movie in the same banner, will be directing this prestigious film. Sithara Entertainments, headed by Suryadevara Naga Vamsi, will be co-producing this film along with Mrs. Sai Soujanya (Fortune Four Cinemas). The charming sensation from Kerala Samyuktha Menon will be the female lead.
The posters of Vaathi and SIR, released in both languages, in the backdrop of a blackboard filled with several numbers, mathemetical equations, besides a note stating ‘classes start soon’, create an element of curiosity. Further, the video announcing the titles, take you through the film’s ambience, including the college premises, the bell and a series of sepia-tinted photographs, highlighting that the film would be ‘an ambitious journey of a common man’. The haunting background music adds a sense of nostalgia to the video.
Cinematographer Dinesh Krishnan, who worked on movies like Soodhu Kavvum, Sethupathi, Thegidi, Mr.Local, Maara will be handling the camera work. National Award Winning Editor Navin Nooli will be working for this movie. Soulful composer G. V. Prakash Kumar will be the music director. More Updates around the movie will be revealed as the time progresses. Regular shoot starts in January 2022.
Starring : Dhanush
Co-Starring: Samyuktha Menon, Sai Kumar, Tanikella Bharani
Executive Producer : S. Venkatarathnam (Venkat)
Production Designer : Avinash Kolla
Editor : Navin Nooli
DOP : Dinesh Krishnan
Music : G. V. Prakash Kumar
Producers : Naga Vamsi S – Sai Soujanya
Writer & Director : Venky Atluri
Presenter : PDV Prasad
Banners : Sithara Entertainments – Fortune Four Cinemas
Pro: Lakshmivenugopal
Follow Us!