God of Masses Nandamuri Balakrishna, Bobby Kolli, Sithara Entertainments’ announce Title Glimpse on 15th November with a mass rugged poster

నవంబర్ 15న గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘NBK109′ మూవీ టైటిల్ టీజర్
కొన్నేళ్లుగా అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన 109వ చిత్రం ‘NBK109′ కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలిపారు. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదుచూస్తున్న ఈ చిత్ర టైటిల్‌ టీజర్ కి ముహూర్తం ఖరారైంది.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకొని, ‘NBK109′ పై అంచనాలను రెట్టింపు చేశాయి. పోస్టర్లు, రెండు భారీ యాక్షన్ గ్లింప్స్ లు అందరినీ కట్టిపడేశాయి. ముఖ్యంగా బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకి అందరూ ఫిదా అయ్యారు. టైటిల్ తో పాటు, ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ కార్తీక పూర్ణిమకి వారి నిరీక్షణకు తెరపడనుంది. తాజాగా టైటిల్‌ టీజర్ విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు.

కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా, నవంబర్ 15న ‘NBK109′ టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. విభిన్న దుస్తులు ధరించి, ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధాలను చేతబట్టిన బాలకృష్ణ లుక్ ఎంతో శక్తివంతంగా ఉంది. నెత్తురంటిన గొడ్డలిని పట్టుకొని, పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో బాలకృష్ణ నిల్చొని ఉన్న రూపం మరో స్థాయిలో ఉంది. ఈ ఒక్క పోస్టర్ సినిమాపై అంచనాలను ఎన్నో రెట్లు పెంచేలా ఉంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సంచలన స్వరకర్త ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం, 2025 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

God of Masses Nandamuri Balakrishna, Bobby Kolli, Sithara Entertainments’ announce Title Glimpse on 15th November with a mass rugged poster

God of Masses Nandamuri Balakrishna has been on a blockbuster success streak in recent years with his stunning action entertainers. Now, he has joined hands with blockbuster director Bobby Kolli, who is known for his massy presentation and scintillating action entertainers.

Ever since the announcement of the film, working title NBK109, the movie has been generating huge buzz across different platforms. The anticipation regarding the powerful title glimpse has been sky high among the fans and movie-lovers.

Already, the two big action glimpses released featuring NBK have gone viral and everyone praised the director for presenting Balakrishna in a never-before-seen stylish and massy avatar. The makers have announced the eagerly awaited title teaser release date with a mass rugged poster of NBK.

We see him holding a blood spilled axe and many weapons ready for action hinting at a thick bearded look. The excitement regarding title teaser has grown multi-folds with the poster. On the auspicious occasion of Karthika Poornima, NBK109 title teaser is set to release on 15th November.

Animal fame Bobby Deol is playing a prominent role in the film. Suryadevara Naga Vamsi, Sai Soujanya of Sithara Entertainments, Fortune Four Cinemas are producing the film on a massive scale while Srikara Studios is presenting it.

The movie shoot is currently in the last leg and it is set to release for Sankranti 2025 worldwide.

#NBK109-TitleTeaser Announcement NBK109-Title Teaser-Plain