First Look of Mithra Mandali Unveiled.

ఆకట్టుకుంటున్న ‘మిత్ర మండలి’ ఫస్ట్ లుక్

- నవ్వులు పంచనున్న ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా గ్యాంగ్
- తెలుగు తెరకు పరిచయమవుతున్న నిహారిక ఎన్. ఎం

బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ప్రీ లుక్ కి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ముసుగు అవతారాలలో ఉన్న నటులు ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో కలిగింది. దీని గురించి సామాజిక మాధ్యమాల్లో కూడా తెగ చర్చ జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు నిర్మాతలు.

ఈ చిత్రానికి “మిత్ర మండలి” అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ తో పాటు, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఫస్ట్ లుక్ అందరి అంచనాలను అందుకునేలా కట్టిపడేసేలా ఉంది. ఈ పోస్టర్ నీలిరంగు ముసుగుల వెనుక ఉన్న గ్యాంగ్ ను పరిచయం చేసింది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అపరిమిత వినోదాన్ని అందించడానికి ఈ గ్యాంగ్ సిద్ధమవుతోంది.

సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. “మిత్ర మండలి” చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తుండటం విశేషం. సోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక.. ఇటీవల ‘మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్’ కోసం టామ్ క్రూజ్‌తో కలిసి పనిచేసి వార్తల్లో నిలిచారు.

అద్భుతమైన నటన, కామిక్ టైమింగ్, భిన్నమైన పాత్రల ఎంపికతో ప్రియదర్శి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయనకు ‘మ్యాడ్’ ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా వంటి ప్రతిభగల నటులు తోడయ్యారు. ఈ నలుగురు కలిసి ‘మిత్ర మండలి’తో అద్భుతమైన వినోదాన్ని అందిస్తారు అనడంలో సందేహం లేదు.

బన్నీ వాస్ తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై ‘మిత్ర మండలి’ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత.

నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ‘మిత్ర మండలి’ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు.

‘మిత్ర మండలి’ అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది.

మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

చిత్రం: మిత్ర మండలి
తారాగణం: ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్.ఎం.
సంగీతం: ఆర్.ఆర్. ధృవన్
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ ఎస్.జె
కూర్పు: పీకే
కళా దర్శకుడు: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్‌: శిల్పా టంగుటూరు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రాజీవ్ కుమార్ రామా
దర్శకత్వం: విజయేందర్ ఎస్
నిర్మాతలు: కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల
సహ నిర్మాత: సోమరాజు పెన్మెత్స
సమర్పణ: బన్నీ వాస్ (బి.వి. వర్క్స్)
నిర్మాణ సంస్థలు: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Unmasking the Madness:
First Look of Mithra Mandali Unveiled.

After the quirky pre-look that has generated excitement and speculation across social media of who could be the cast in masked avatars, the much-awaited First Look Poster of “Mithra Mandali” has been unveiled today, and it’s every bit as vibrant as promised.

The poster introduces the gang behind the blue masks, revealing an ensemble cast that’s all set to deliver unlimited fun, chaos, and entertainment starring Priyadarshi, Rag Mayur, Vishnu Oi, and Prasad Behara.

In a refreshing twist, the film marks the Telugu debut of Social Media sensation Niharika N M, completing the crazy crew.
Niharika has been in the news for her collaboration with Tom Cruise recently for Mission Impossible – Final Reckoning.

Known for their impeccable Acting, comic timing and offbeat role choices,
Priyadarshi, Mad fame Vishnu Oi,
Rag Mayur and Prasad Behara bring a undoubted powerhouse of entertainment to Mithra Mandali.

The film is being presented by Bunny Vas under his newly launched banner BV Works, & Produced by the energetic collaboration of Sapta Aswa Media Works, Vyra Entertainments, and Passionate Producers Kalyan Manthina, Bhanu Pratapa, and Dr. Vijender Reddy Teegala.

Directed by debutant Vijayendar S, the film boasts a crackling technical team with RR Dhruvan composing the music,
Siddharth SJ handling cinematography, and Peekay as editor.

Other technicians include,
Art: Gandhi Nadikudikar
Costumes: Shilpa Tanguturu
Executive Producer: Rajeev Kumar Rama
PRO: Venu Gopal

MM FL LOCK insta plain MM FL LOCK twitter

A Quirky & Masked Madness Begins! Pre-Look released, First Look on June 6th.

మ్యాడ్ నెస్ మొదలైంది!
కట్టిపడేస్తున్న ప్రీ-లుక్.. జూన్ 6న ఫస్ట్ లుక్బన్నీ వాస్ వర్క్స్ తో కలిసి నవతరం నిర్మాణ సంస్థలు సప్త అశ్వ క్రియేటివ్స్ మరియు వైరా ఎంటర్టైన్మెంట్స్ ఒక ఆసక్తికర చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి కట్టిపడేసే ప్రీ-లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి, ట్రేడ్ తో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్ పై బన్నీ వాస్ తొలిసారిగా సినిమాను సమర్పిస్తుండటం.. ఈ ప్రాజెక్ట్ పై నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన భాను ప్రతాప గతంలో బన్నీ వాస్ తో కలిసి తండేల్ కి పని చేసి, బ్లాక్ బస్టర్ ను అందించారు. ఈ ద్వయం ‘ఆయ్’, ‘సింగిల్’ వంటి సినిమాలతో తమ విజయ పరంపరను కొనసాగిస్తూ, ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను పెంచుతున్నారు.

‘హాయ్ నాన్న’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ చేతులు కలపడం ఈ ప్రాజెక్ట్ కి అదనపు బలాన్ని చేకూరుస్తుంది.

తాజాగా ఆవిష్కరించబడిన ఆసక్తికరమైన ప్రీ-లుక్ పోస్టర్.. ఉత్సుకతను రేకెత్తించడంతో పాటు, నవ్వులను చిందించేలా ఉంది. ఎరుపు రంగు టోపీలు, నీలిరంగు ముసుగులు ధరించి వరుసగా నిల్చొని ఉన్న కొందరు వ్యక్తులతో కూడిన ఈ పోస్టర్.. ఫన్, మిస్టరీ, మ్యాడ్ నెస్ తో రోలర్‌కోస్టర్‌ను సూచిస్తుంది. జూన్ 6న ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో ప్రకటించిన నిర్మాతలు.. సరికొత్త వినోదాత్మక చిత్రాన్ని అందించనున్నట్లు హామీ ఇచ్చారు.

ఈ చిత్రంతో విజయేంద్ర ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకి సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన కథన శైలితో వినోదం యొక్క సరికొత్త రుచిని అందించడానికి సిద్ధమవుతోంది. ఆసక్తికరంగా రూపొందించిన ప్రీ-లుక్ పోస్టర్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత ఈ చిత్రంపై అంచనాలు మరో స్థాయికి వెళ్ళడం ఖాయమని చెప్పవచ్చు.

జూన్ 6న ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ప్రేక్షకుల ఎదురు చూపులకు తగిన ఫలితం అన్నట్టుగా నటీనటులను ఆవిష్కరిస్తూ ఉండే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అసలుసిసలైన మ్యాడ్ నెస్ ను అందించనుంది.

A Quirky & Masked Madness Begins! Pre-Look released, First Look on June 6th.

The new-age Production Houses Sapta Aswa Creatives and Vyra Entertainments in collaboration with Bunny Vas Works have just dropped a whacky and wildly intriguing Pre-Look Poster, and it’s already sparking curiosity across social media & trade.

Bunny Vas, for the first time presenting a film under BV Works, strengthens the confidence on this project. Bunny Vas & one of the Producers of this project Bhanu Pratapa has collaborated earlier for Thandel and delivered a blockbuster. The duo has continued their success streak with AAY & #Single, raising expectations on this project.

The project is cemented with Vyra Entertainments joining hands who has delivered the soothing blockbuster Hi Nanna.

The unveiled intriguing Pre-Look poster is raising curiosity and laughter. Featuring a lineup of masked men donning quirky red caps and hiding their identities in blue masks, reveal hints at a rollercoaster of fun, mystery, and madness. With the poster announcing “First Look on June 6th,” the makers have set the tone for a film that promises to be as unpredictable as it is entertaining.
The film is directed by debutant Vijayendar S & Produced by Kalyan Manthina, Bhanu Pratapa, and Dr. Vijender Reddy Teegala & Co-produced by Somaraju Penmetsa.
The film is backed by RR Dhruvan as Music Director, Siddharth SJ as Cinematographer, Peekay as Editor, Gandhi Nadikudikar as Art Director, Rajeev Kumar Rama as Executive Producer, Shilpa Tangturu as Costume Designer.

The film is gearing up to deliver a fresh flavor of fun with a unique narrative style. The visual aesthetics and design language of the pre-look already reflect the film’s commitment to youthful energy and wild imagination.
Stay tuned for the official First Look on June 6th, unveiling the cast and giving audiences a peek into the madness that awaits!

IMG_3668 MM PRELOOK DES LOCK TWITTER

MASS JATHARA LOCKS A MASS FESTIVAL IN THEATRES FOR GANESH CHATURTHI – AUGUST 27th.

వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల కానున్న మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతార’ చిత్రం

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. ‘మాస్ జాతర’ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.

‘మాస్ జతర’ చిత్రం వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల కానుంది. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ‘మాస్ జాతర’ రూపొందుతోంది. వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకురానుంది. ప్రచార చిత్రాలతోనే ఈ చిత్రం ఏ స్థాయి వినోదాన్ని అందించబోతుందో అర్థమైంది.

ఇటీవల మొదటి గీతం ‘తు మేరా లవర్’ విడుదలై అందరినీ ఉర్రూతలూగిస్తోంది. ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ పాటకు ట్రిబ్యూట్ గా మలిచిన ‘తు మేరా లవర్’ గీతం అభిమానులకు విందు భోజనంలా ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. ధమాకా జోడి రవితేజ-శ్రీలీల తెరపై కనిపిస్తే ఆ సందడే వేరు. ఈ జోడి మరోసారి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోంది.

సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో ‘మాస్ జాతర’ చిత్రానికి స్వరకర్త. ధమాకా చిత్ర విజయంలో ఆయన సంగీతం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ‘మాస్ జాతర’తో మరోసారి మాస్ ప్రేక్షకులను మెప్పించనున్నారు.

దర్శకుడు భాను బోగవరపు.. రవితేజ అభిమానులతో పాటు, మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ‘మాస్ జాతర’ను మలుస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు విధు అయ్యన్న ఆకట్టుకునే విజువల్స్ తో పక్కా కమర్షియల్ వైబ్ తీసుకొస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి తన అనుభవంతో అసలు సిసలైన పండుగ చిత్రంగా మలుస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్ నిర్మాణ సంస్థలు వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్నాయి. ఈ వినాయక చవితికి ‘మాస్ జాతర’ చిత్రంతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకొచ్చి, అభిమానుల దాహాన్ని తీర్చడానికి సిద్ధమవుతున్నారు.

తారాగణం & సాంకేతిక బృందం:

చిత్రం: మాస్ జాతర
తారాగణం: రవితేజ, శ్రీలీల
దర్శకత్వం: భాను బోగవరపు
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
మాటలు: నందు సవిరిగాన
కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌,
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

MASS JATHARA LOCKS A MASS FESTIVAL IN THEATRES FOR GANESH CHATURTHI – AUGUST 27th.

The much awaited film Mass Jathara is officially set to release on August 27th i.e Ganesh Chaturthi weekend with a celebration of full on entertainment! With vintage vibes and a pakka commercial setup this film is going to be a mass festival experience in theatres. Every content released so far has hit that perfect entertainment note building up to a total blast.

The makers recently unveiled the first song which received unanimous applause for its high energy beats and infectious vibe. Sreeleela stars as the female lead and every time this Ravi Teja – Sreeleela combo hits the screens fireworks at the box office are guaranteed.

The chart topping and crowd favorite music director Bheems Ceciroleo is composing the soundtrack striking the perfect chord yet again with the mass audience.

Director Bhanu Bhogavarapu is crafting everything with a perfect setup and has managed to hook the audience and fans by showcasing the energetic avatar we’re all excited to see Mass Maharaaj Ravi Teja in. Cinematography by Vidhu Ayyanna has so far brought all the vibrant commercial vibes through his visuals. And with National Award winner Navin Nooli on the edit you know it’s going to hit the mark his experience always brings that extra edge making this the perfect festival film..!!

Produced by Naga Vamsi and Sai Soujanya under the prestigious banners of Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios names that need no introduction as they’re on a winning streak with back to back blockbusters. This time, they’re all set to quench the fans thirst with a film that’s going to create a MASSIVE EUPHORIA this festive season.

Movie Name: Mass Jathara
Cast: Ravi Teja, Sreeleela
Director: Bhanu Bhogavarapu
Producers: Naga Vamsi, Sai Soujanya
Music: Bheems Ceciroleo
Cinematography: Vidhu Ayyanna
Editor: Navin Nooli
Dialogues: Nandu Savirgama
Production Designer: Sri Nagendra Tangala
Executive Producer: Phani K Varma
Presenter: Srikara Studios
Banners: Sithara Entertainments & Fortune Four Cinemas

 Mass Jathara - Date Design (1) Mass Jathara - Date Design-Still

*’Taara Taara’ song from Hari Hara Veera Mallu launched in a grand press meet in Chennai*

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ చిత్ర ‘తార తార’ గీతావిష్కరణ కార్యక్రమం

‘హరి హర వీరమల్లు’ చిత్రం ఘన విజయం సాధిస్తుంది: చెన్నై వేడుకలో చిత్ర బృందం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’లో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, మూడు గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో గీతం ‘తార తార’ విడుదలైంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర బృందం చెన్నైలో ఘనంగా నిర్వహించింది.

‘తార తార’ గీతం మనసుని హత్తుకునేలా శ్రావ్యంగా ఉంది. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ పై చిత్రీకరించిన ఈ గీతం వెండితెరపై ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ఇద్దరి జోడి చూడటానికి ఎంతో అందంగా ఉంది. లిరికల్ వీడియోలో భారీతనం కనిపిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం హృద్యంగా ఉంది. శ్రీ హర్ష తన సాహిత్యంతో పాటకు మరింత అందం తీసుకొచ్చారు. లిప్సిక భాష్యం, ఆదిత్య అయ్యంగార్ ఈ గీతాన్ని ఆలపించిన తీరు కట్టిపడేసింది. ప్రస్తుతం ‘తార తార’ గీతం సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

‘తార తార’ గీతావిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ, “చెన్నైతో నాకు మంచి అనుబంధం ఉంది. పలు గొప్ప తెలుగు సినిమాలను తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాను. అలాగే పలు తమిళ సినిమాలను తెలుగులో ప్రేక్షకులకు అందించాను. ముఖ్యంగా ‘ఇండియన్’ చిత్రం నిర్మాతగా నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది. సినిమా ద్వారా వినోదంతో పాటు, ఏదో ఒక సందేశం ఇవ్వాలనేది నా తపన. 90 శాతానికి పైగా నా సినిమాలు విజయం సాధించాయి. నా కుమారుడు జ్యోతికృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చిన్న వయసులోనే గొప్ప కథలతో ప్రముఖ దర్శకులను మెప్పించాడు. ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం హరి హర వీరమల్లు బాధ్యతను క్రిష్ గారి దగ్గర నుంచి తీసుకొని, సినిమా అద్భుతంగా రావడంలో కీలక పాత్ర పోషించాడు. ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఈ సినిమాని రూపొందించాము. కీరవాణి గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమా కోసం ఐదేళ్లు వెచ్చించిన నిధి అగర్వాల్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు.” అన్నారు.

చిత్ర సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, “ఎ.ఎం. రత్నం గారి ముఖంలో నేను కోపం ఎప్పుడూ చూడలేదు. శాంతంగా, చిరునవ్వుతో ఉంటారు. ఆయన రియల్ హీరో. హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే సంగీతంలో పవర్ కనిపించాలి. సంగీత విషయంలో జ్యోతికృష్ణ నాకెంతో స్వేచ్ఛను ఇచ్చాడు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించి.. ఎ.ఎం. రత్నం గారికి, జ్యోతికృష్ణకి సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, “అజిత్ గారి సూచన మేరకు నాన్నగారి లెగసీని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో.. డైరెక్షన్ ను పక్కనపెట్టి, కొన్నేళ్లు ప్రొడక్షన్ వైపు ఉన్నాను. అదే మాట పవన్ కళ్యాణ్ గారు. ఎ.ఎం. రత్నం గారి పేరు నిలబెట్టాలని చెప్పారు. పవన్ కళ్యాణ్ కేవలం నటుడు మాత్రమే కాదు.. తెలివైన వారు, ఎన్నో విభాగాల్లో పట్టుంది. రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ‘హరి హర వీరమల్లు’ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ‘అసుర హననం’ పాటలో ఫైట్ కి కూడా ఆయన కొరియోగ్రఫీ చేశారు. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పోషించిన వీరమల్లు పాత్ర మన సంస్కృతి, సంప్రదాయాలకు అడ్డం పట్టేలా ఉంటుంది. సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఉంటుంది. ఆరోగ్యం బాలేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం పనిచేశారు. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్ కంపెనీ ఈ చిత్రం కోసం పని చేశాయి. భారీస్థాయిలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాని రూపొందించాము. పవన్ కళ్యాణ్ గారు, నిధి అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. నాజర్ గారు, సత్య రాజ్ గారు వంటి సీనియర్ నటులతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. కీరవాణి గారు, తోట తరణి గారు, నాన్న రత్నం గారు లాంటి లెజెండ్స్ తో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ‘హరి హర వీరమల్లు’కి పార్ట్ 2 కూడా ఉంది. ఈ చిత్రం అందరి అంచనాలను మించేలా ఉంటుందని, మన దేశంలో గొప్ప చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని నమ్ముతున్నాను.” అన్నారు.

చిత్ర కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎ. ఎం. రత్నం గారికి కృతఙ్ఞతలు. సినిమా కోసం అంతలా తపనపడే నిర్మాతను నేను చూడలేదు. సెట్ కి అందరికంటే ముందుగా వచ్చి, అందరికంటే ఆలస్యంగా వెళ్తారు. ఐదేళ్లు ఈ సినిమాని రత్నం గారు తన భుజాలపై మోశారు. రత్నం గారి కోసం ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యోతి కృష్ణ గారు లాంటి దర్శకుడితో పని చేయడం సంతోషంగా ఉంది. నటీనటుల నుంచి సులువుగా మంచి నటనను రాబట్టుకుంటారు. కీరవాణి గారు సంగీతం అందించిన సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి చిత్రంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. చిత్ర బృందమంతా ఎంతో కష్టపడి హరి హర వీరమల్లును రూపొందించింది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను.” అన్నారు.

ప్రముఖ దర్శకుడు కె. ఎస్. రవికుమార్ మాట్లాడుతూ, “ఎ.ఎం. రత్నం గారితో నేను మూడు సినిమాలు చేశాను. ఆ సమయంలో జ్యోతి కృష్ణ చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాను. మంచి ప్రతిభ, జ్ఞానం ఉన్నాయి. ‘హరి హర వీరమల్లు’ ప్రచార చిత్రాలు బాగున్నాయి. ఐదు సంవత్సరాలు కష్టపడి ఈ సినిమాని అద్భుతంగా రూపొందించారు. ‘హరి హర వీరమల్లు’ ఘన విజయం సాధించాలని, జ్యోతి కృష్ణతో పాటు చిత్ర బృందం అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

ప్రముఖ నటుడు నాజర్ మాట్లాడుతూ, “ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎ.ఎం. రత్నం గారు ఎంతో పట్టుదలతో ఇంతటి భారీ చిత్రాన్ని నిర్మించారు. జ్యోతి కృష్ణ చాలా ప్రతిభావంతుడు. రేయింబవళ్లు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఎ.ఎం. రత్నం గారు, జ్యోతి కృష్ణతో పాటు అందరి సమిష్టి కృషితో ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ప్రజాసేవలో, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్.. సినిమాలో సంభాషణల విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు మంచి మాటలే చెప్పాలి అనేవారు.” అన్నారు.

ప్రముఖ నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ, “తమిళ వారికి ఎంజీఆర్ ఎలాగో.. తెలుగు వారికి ఎన్టీఆర్ గారు అలా. అలాంటి గొప్ప వ్యక్తి జయంతి రోజు ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉంది. తండ్రిని మించిన తనయుడు అంటారు కదా.. ఎ.ఎం. రత్నం గారి తనయుడు జ్యోతి కృష్ణ అలాంటి వాడే. అతని ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని, జ్యోతి కృష్ణ గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో హీరోయిన్ నిధి అగర్వాల్ కాదు నేను(నవ్వుతూ). హీరోయిన్ ని హీరో కాపాడుతాడు కదా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నన్ను కాపాడతారు. అందుకే నా పాత్ర హీరోయిన్ పాత్ర లాంటిది అన్నాను. ఇంత గొప్ప చిత్రంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది.” అన్నారు.

తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సమర్పణ: ఎ. ఎం. రత్నం
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్, యూనిఫై మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకత్వం: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ – లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

*’Taara Taara’ song from Hari Hara Veera Mallu launched in a grand press meet in Chennai*

After delivering back-to-back chartbuster songs, the makers today unveiled a foot-tapping number titled “Taara Taara” at a grand launch event in Chennai. The event was attended by acclaimed director K.S. Ravikumar, veteran actors Nasser and Sathyaraj, along with the entire team of Hari Hara Veera Mallu. The mesmerizing lyrical video impressed everyone.

The song features Nidhhi Agerwal in a sizzling avatar, and her charm leaves everyone stunned. Powerstar Pawan Kalyam’s graceful moves, combined with Nidhhi’s beauty, are truly enchanting. Oscar-winning composer M.M. Keeravaani has delivered a catchy tune, and his unique composition gives the song a fresh vibe. Singers Lipsika Bhashyam and Aditya Iyengar infuse the track with vibrant energy through their powerful vocals. The lyrics by Sri Harsha Emani are playful and add to the song’s sizzling appeal.

Hari Hara Veera Mallu Part-1: Sword vs Spirit is a high-budget period action drama set against the backdrop of the 17th century Mughal Empire and stars Pawan Kalyan in the titular role. The film also features a stellar cast including Bobby Deol, Nidhhi Agerwal, Nargis Fakhri, and Nora Fatehi. Directed by Jyothi Krisna and Krish Jagarlamudi, the film is an epic tale of a legendary outlaw, Veera Mallu, who battles injustice and fights for the oppressed.

Renowned producer A.M. Rathnam said, “I share a deep bond with Chennai. I’ve brought several iconic Telugu films to Tamil audiences and vice versa. Notably, the film Indian, which I produced, brought me immense recognition. My passion has always been to create films that not only entertain but also convey meaningful messages. Over 90% of the films I’ve produced have been successful. I must particularly mention my son, Jyothi Krisna. From a young age, he has impressed top directors with his storytelling. He has now taken up the responsibility of the pan-India project Hari Hara Veera Mallu from director Krish and played a key role in shaping it into something remarkable. We’ve worked hard on this film for five years. MM Keeravaani has delivered a phenomenal soundtrack. I extend special thanks to Nidhhi Agerwal, who dedicated five years to this project.”

Music director MM Keeravaani said, “I’ve never seen A.M. Rathnam angry, he always remains calm and smiling. He is a real hero. I’m confident Hari Hara Veera Mallu will be a grand success. When working on a Powerstar Pawan Kalyan film, the music must reflect that same power. Jyothi Krisna gave me immense creative freedom, and he worked tirelessly on this project. I sincerely hope the film brings great recognition to Rathnam garu, Jyothi Krishna, and everyone involved.”

Director Jyothi Krisna said, “Following a suggestion from Ajith sir, I took a step back from direction for a while to carry forward my father’s legacy through production. Pawan Kalyan garu also encouraged me to uphold A.M. Rathnam garu’s name. Pawan Kalyan is not just an actor; he is highly intelligent and excels in various fields, including politics. He has been a huge support throughout this film. He even choreographed the fight for the song ‘Asura Hananam’. Set against the backdrop of the Mughal empire, his role as Veera Mallu represents our culture and heritage, highlighting the essence of Sanatana Dharma. Even when unwell, he continued working with great dedication. The film is technically advanced, with international-level graphics and top-tier production values. The chemistry between Pawan Kalyan and Nidhhi Agerwal is beautifully captured. It has been an honor to work with veterans like Nasser garu and Sathyaraj garu. Collaborating with legends like Keeravaani garu, Thota Tharani garu, and my father Rathnam garu has been a privilege. Hari Hara Veera Mallu will also have a Part 2. I believe this film will exceed expectations and be remembered as one of India’s greatest cinematic achievements.”*

Nidhhi Agerwal expressed, “First and foremost, I thank A.M. Rathnam garu for this opportunity. I’ve never seen a producer so dedicated -always arriving first on set and leaving last. He has carried this film on his shoulders for five years. I truly wish for the film’s grand success for his sake. Working with a director like Jyothi Krishna has been a joy – he effortlessly brings out the best in actors. I feel honored to be part of a film with music composed by MM Keeravaani garu and privileged to work in a film featuring Pawan Kalyan garu. The entire team has poured their heart into making Hari Hara Veera Mallu, and I’m confident the audience will love it.”*

Veteran director K.S. Ravikumar said, “I’ve worked with A.M. Rathnam garu on three films. I was amazed when I heard the story narrated by Jyothi Krishna -his talent and knowledge are remarkable. The promotional material for Hari Hara Veera Mallu is excellent. After five years of hard work, the film has shaped up beautifully. I hope it becomes a huge success and brings well-deserved recognition to Jyothi Krishna and the entire team.”

Veteran actor Nasser said, “Despite numerous challenges, A.M. Rathnam garu remained determined and completed this grand project. Jyothi Krisna is extremely talented and has worked day and night for the film. The result is a collective achievement of the entire team. Working with Pawan Kalyan garu has been a delight. Though he serves the public and holds a position of responsibility, he paid close attention to the dialogues and ensured they carried meaningful messages.”

Veteran actor Sathyaraj said, “Just as MGR is to Tamil Nadu, NTR is to the Telugu states. It’s a proud moment to celebrate this event on the birth anniversary of such a great personality. They say a son surpassing his father is a true success – Jyothi Krisna is one such son. His talent amazed me. I hope the film becomes a huge hit and that Jyothi Krishna rises to great heights. And just for fun, Nidhhi Agerwal is not the only heroine in this film. In fact, I am the heroine because in the film, the hero (Pawan Kalyan) saves me! That’s why I jokingly called my role the heroine’s role. I’m truly honored to be part of such a grand film.”

The mesmerizing lyrical video impressed everyone. The song features Nidhhi Agerwal in a sizzling avatar, and her charm leaves everyone stunned. Powerstar Pawan Kalyam’s graceful moves, combined with Nidhhi’s beauty, are truly enchanting. Oscar-winning composer M.M. Keeravaani has delivered a catchy tune, and his unique composition gives the song a fresh vibe. Singers Lipsika Bhashyam and Aditya Iyengar infuse the track with vibrant energy through their powerful vocals. The lyrics by Sri Harsha Emani are playful and add to the song’s sizzling appeal.

Pawan Kalyan and Nidhhi Agerwal’s simple yet graceful dance moves are bound to become a sensation on social media, especially on reels and shorts. This song hooks listeners from start to finish. A cinematic event unlike any other is arriving this summer, as Powerstar Pawan Kalyan steps into the boots of Veera Mallu – warrior, outlaw, legend. The film hitting big screens on June 12th in Telugu, Tamil, Hindi, Kannada and Malayalam.

Cast: Pawan Kalyan, Nidhhi Agerwal, Bobby Deol, Anupam Kher, Sathyaraj, Jisshu Sengupta, Nasser, Sunil, Raghu Babu, Subbaraju, Nora Fatehi

Direction: Krish Jagarlamudi, Jyothi Krisna
Producer: A. Dayakar Rao
Presented by: A.M. Rathnam
Banner: Mega Surya Productions
Music: M.M. Keeravaani
Cinematography: Manoj Paramahamsa, Gnana Shekar V.S
Editing: Praveen K.L
Lyrics: Sirivennela Seetharama Sastry, Chandrabose, Penchal Das, Sri Harsha Emani
Visual Effects: Hari Hara Sutan, Sojo Studios, Unifi Media, Metavix
Art Direction: Thota Tharani
Choreography: Brinda, Ganesh
Stunts: Nick Powell, Syam Kaushal, Peter Hein, Ram-Laxman, Dilip Subbarayan, Stunt Silva, Todor Lazarov (Juji), Vijay, Dragon Prakash
PRO: LakshmiVenugopal

HHVM-Chennai (8) HHVM-Chennai (7) HHVM-Chennai (1) HHVM-Chennai (6) HHVM-Chennai (4) HHVM-Chennai (3) HHVM-Chennai (2) HHVM-Chennai (1) HHVM-Chennai (5)

ANAGANAGA OKA RAJU – THE PERFECT FILM FOR A PERFECT SANKRANTHI – JAN 14, 2026.

సంక్రాంతి కానుకగా ‘అనగనగా ఒక రాజు’
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వినోదభరిత చిత్రం ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనుంది.
తనదైన ప్రత్యేక కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బ్లాక్ బస్టర్ మెషిన్ నవీన్‌ పొలిశెట్టి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన మోషన్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంతో నవీన్‌ పొలిశెట్టి థియేటర్లలో నవ్వుల పండుగను తీసుకురాబోతున్నాడని మోషన్ పోస్టర్ తోనే అర్థమైంది.
తెలుగు సినీ అభిమానులు సంక్రాంతి పండుగను సినిమా పండుగలా భావిస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ లకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే పండుగకి సరైన సినిమాగా ‘అనగనగా ఒక రాజు’ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో అడుగుపెట్టనుంది.
తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి ‘అనగనగా ఒక రాజు’లో నవీన్‌ పొలిశెట్టికి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులను సరికొత్త వినోదాన్ని అందించేలా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.
మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. పండుగ రుచికి సరిగ్గా సరిపోయేలా ఆయన తనదైన మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేయనున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థలు కొన్నేళ్లుగా వరుస ఘన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘డాకు మహారాజ్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2026 సంక్రాంతికి ‘అనగనగ ఒక రాజు’తో మరో పండగ విజయాన్ని ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
తారాగణం: నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి
ఛాయాగ్రహణం: జె. యువరాజ్
సంగీతం: మిక్కీ జె. మేయర్
దర్శకత్వం: మారి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మివేణుగోపాల్
 
ANAGANAGA OKA RAJU – THE PERFECT FILM FOR A PERFECT SANKRANTHI - JAN 14, 2026. 
The most awaited entertainer #AnaganagaOkaRaju is all set to hit theatres this Sankranthi - January 14th, 2026.
The Blockbuster Machine Naveen Polishetty is back with another family entertainer and as always whenever he’s on screen, it guarantees a laughter riot. The makers have unveiled a motion poster that’s already grabbing attention and striking the right chord. The poster too sets the tone for a full fledged festive celebration.
Joining him the current lucky charm of Telugu cinema Meenakshi Chaudhary is riding high with back to back blockbusters. The film marks the directorial debut of Maari who’s bringing a fresh and vibrant narrative to life.
Mickey J Meyer delivers another musical banger that perfectly blends with the festive flavour.
The film is bankrolled by Naga Vamsi S and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas. Srikara Studios presents the film. These production houses carry a reputation for delivering consistent blockbusters. Most recently the Sankranthi hit Daaku Maharaaj and now they’re gearing up for yet another festive winner with Anaganaga Oka Raju in 2026.
Starring: Naveen Polishetty, Meenakshi Chaudhary
DOP: J Yuvraj
Music: Mickey J Meyer
Directer: Maari
Producer: Naga Vamsi S & Sai Soujanya
Banners: Sithara Entertainments & Fortune Four Cinemas
Presents: Srikara Studios
 AOR_Date_Still