Nov 28 2024
Power Star Pawan Kalyan, Mega Surya Productions’s Period Action Epic Hari Hara Veera Mallu Part-1 Sword vs Spirit enters last leg of shooting
తుది దశకు చేరుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రీకరణ
- ఈ వారాంతంలో విజయవాడలో తుది షెడ్యూల్ ప్రారంభం
- పవన్ కళ్యాణ్ తో పాటు, 200 మంది ఆర్టిస్టులతో భారీ సన్నివేశాల చిత్రీకరణ
ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇటీవల చిత్ర బృందం, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించింది. పవన్ కళ్యాణ్‌తో పాటు 400 – 500 మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ని ప్రత్యేకంగా నియమించారు. ఈ యుద్ధ సన్నివేశం అద్భుతంగా రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉంది.
‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాతలు కీలక విషయాన్ని పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ తో పాటు, 200 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్ తో ‘హరి హర వీర మల్లు’ చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకుని, యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అద్భుతమైన టీజర్ ని అందించడంతో పాటు, పవన్ కళ్యాణ్ అభిమానులు అనందించేలా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇస్తూ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడటంలో జ్యోతి కృష్ణ కీలక పాత్ర పోషించారు.
ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేస్తున్నారు.
ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Power Star Pawan Kalyan, Mega Surya Productions’s Period Action Epic Hari Hara Veera Mallu Part-1 Sword vs Spirit enters last leg of shooting
Power Star Pawan Kalyan, one of the craziest stars of Indian Cinema, is starring in a period action epic for the first time in his career. The movie titled, Hari Hara Veera Mallu Part-1 Sword vs Spirit, is being produced on a massive scale aiming at giving audiences a unique and lasting theatrical experience.
Recently, the team completed shooting of a gigantic action sequence, under the guidance of Hollywood legend Nick Powell. The action director has been specially recruited for this highly imaginative sequence involving 400 – 500 stuntmen and extra artistes. Pawan Kalyan also joined the shoot and makers are thrilled with the output.
Now, they have announced another powerful update regarding this highly anticipated film. The movie has entered last leg of shooting and the final schedule will start in Vijayawada from this weekend.
In this schedule, the makers are planning to shoot another massive sequence involving Pawan Kalyan with 200 artistes. With this mega sequence, the shoot of Hari Hara Veera Mallu, will be concluded and the movie is on schedule to release in March.
“Animal” fame Bollywod actor Bobby Deol is playing a prominent role in the film while Niddhi Agerwal is playing the leading lady role. Legendary actor Anupam Kher, Nasser, Raghu Babu and many others are cast in important roles in the film.
Young director Jyothi Krisna is directing this massive scale action epic keeping Pawan Kalyan fans expectations in mind. He has been instrumental in creating good hype and buzz around the film with timely updates and goosebumps inducing teaser.
Ace Cinematographer Manoj Paramahamsa is handling cinematography with legendary production designer Thotha Tharani taking care of art department. Baahubali fame VFX supervisor Srinivas Mohan is also part of the prestigious crew.
Above all, Oscar award winning composer MM Keeravani is composing music for the film. A. Dayakar Rao is producing the film on Mega Surya Productions banner with legendary producer AM Rathnam presenting it.
Pawan Kalyan’s epic outlaw warrior action drama Hari Hara Veera Mallu Part-1 Sword vs Spirit is set to release on 28th March 2025, in Telugu, Tamil, Malayalam, Hindi and Kannada languages worldwide.