Jun 30 2024
Sithara Entertainments’ announced their Production No.29 with Allari Naresh with an unique concept poster
అల్లరి నరేష్‌తో నూతన చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, విభిన్న చిత్రాలు, పాత్రలతో గొప్ప నటుడిగానూ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నరేష్ మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న “మీరు అతని కంటి నుండి తప్పించుకోలేరు” అంటూ విలక్షణమైన కాన్సెప్ట్ పోస్టర్‌తో నిర్మాణ సంస్థ ఈ చిత్ర ప్రకటన చేసింది. సంకేత భాషతో రూపొందించిన ఈ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. ఒక్క పోస్టర్ తోనే విభిన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సృజనాత్మక పోస్టర్ సినీ ప్రేమికులలో మరియు అల్లరి నరేష్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంకేత భాషలో దాచిన సందేశాన్ని డీకోడ్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు.
అల్లరి నరేష్ ఇటీవలి కాలంలో వైవిధ్యమైన, కొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తున్నారు. ఇక ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమా కేవలం ప్రకటనతోనే అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. “ఫ్యామిలీ డ్రామా” చిత్రంతో ప్రశంసలు పొందిన రచయిత-దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. నూతన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించి, ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు.
అల్లరి నరేష్ యొక్క 63వ చిత్రంగా రానున్న ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.29 గా రూపొందనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Sithara Entertainments’ announced their Production No.29 with Allari Naresh with an unique concept poster
Allari Naresh, renowned for his comedy and family entertainers, also established himself as a great performer in unique and different concept films. He is now starring in another unique concept film produced by one of the esteemed and prominent Telugu Cinema production houses, Sithara Entertainments.
The production house made an announcement on 30th June, on the occasion of Allari Naresh’s birthday, with a distinctive concept poster.
The poster showcases very interesting symbols in sign language. This creative poster has raised great intrigue among the movie-lovers and Allari Naresh fans and they are trying to decode the hidden message in sign language symbols.
Allari Naresh has been starring in variety and distinctively new concept oriented films, in recent times. Hence, this film has also created huge interest with just the announcement and concept poster.
Writer-director Meher Tej, known for the highly appreciated movie “Family Drama”, is writing and directing the film, with a highly distinctive and create concept. Makers have expressed with great belief and huge confidence that the movie will be entertaining and delivers a unique experience to audiences in theatres.
This 63rd film of Allari Naresh, known as #AN63 and Production No.29 from Sithara Entertainments is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya of Fortune Four Cinemas, respectively. More details about the film will be announced by the makers soon.