TSR-TV 9 FILM AWARDS 2011-2012 ..NEWS

పత్రికా ప్రకటన
టి.సుబ్బరామి రెడ్డి లలిత కళా పరిషత్ ఈ నెల 20వ తేదీన 2011 మరియు 2012 సంవత్సరములకు గాను TSR-TV9 ఫిలిం అవార్డుల కార్యక్రమాన్ని జాతీయస్థాయిలో ఎంతో వైభవంగా హైదరాబాద్ నందు నిర్వహించడానికి నిర్ణయించినది.  TSR-TV9 ఫిలిం అవార్డులను  హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ  చలన చిత్ర రంగానికి చెందిన  ప్రముఖ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అందజేయటం జరుగుతుందని  డా.టి.సుబ్బరామి రెడ్డి గారు తెలిపారు. అలాగే దీనికి సంబంధించి  TSR-TV9 ఫిలిం అవార్డుల కమిటీని ఈ క్రింద కనబరచిన విధముగా ఏర్పాటు చేయడమైనది అని ఆయన అన్నారు.
చైర్మన్       ….     డా.టి.సుబ్బరామి రెడ్డి, పార్లమెంట్ సభ్యులు
సభ్యులు     …      డా.అక్కినేని నాగేశ్వర రావు
                  …      డా.సి.నారాయణ రెడ్డి
                  …       డా.డి.రామానాయుడు
                  …        డా.పి.సుశీల
                  ….       డా.జయసుధ,
                  ….        డా.శోభన కామినేని, (డైరెక్టర్, అపోలో గ్రూప్ అఫ్ హాస్పిటల్స్)

TSR PHOTO