Bheemla Nayak is more than a remake, it’s adding a new layer of entertainment – Director Saagar K Chandra.


‘భీమ్లానాయక్‌’ నన్ను మరో మెట్టు ఎక్కించింది

– సాగర్‌ చంద్ర
పవన్‌కల్యాణ్‌, రానా కాంబినేషన్‌లో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం ‘భీమ్లానాయక్‌’. సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు–  స్క్రీన్ ప్లే   అందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సినిమా సాధించిన సక్సెస్‌ గురించి దర్శకుడు సాగర్‌ చంద్ర సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…
‘భీమ్లా నాయక్‌’ ప్రాజెక్ట్‌ గురించి..?
ఫస్ట్‌లాక్‌ డౌన్‌ సమయంలో నిర్మాత వంశీ గారు ఫోన్‌ చేసి ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రం గురించి మాట్లాడి, ఆ సినిమా చూసి అభిప్రాయం చెప్పమన్నారు. కొద్దిరోజులకు మళ్లీ ఫోన్‌ చేసి ఈ సినిమా చేద్దామనుకుంటున్నాం. నీకు ఇంట్రెస్ట్‌ ఉందా అనడిగారు. నేను వెంటనే ఓకే అన్నా. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారితో జర్నీ మొదలైంది. ‘ఎలా చేద్దాం. తెలుగు ప్రేక్షకులకు కోసం ఎలాంటి మార్పులు చేద్దాం’ అన్న మాటలు మొదలయ్యాయి. ఆ తర్వాత పవన్‌కల్యాణ్‌, రానా గారు రావడంతో మరింత ఎగ్జైటింగ్‌గా ముందుకెళ్లాం. ప్రాజెక్ట్‌లో పవన్‌కల్యాణ్‌గారి పేరు వినిపించగానే అదొక గొప్ప అనుభూతి. ఆయన్ను డైరెక్ట్‌ చేయాలంటే ఇన్నేళ్ల కష్టం.. క్యాలిబర్‌, ప్లానింగ్‌, క్రియేటివిటీ… ఇంత ఉంటే ఇది జరుగుతుంది అనుకోవడానికి లేదు. అలా కుదరాలి.. ఆ పని జరగాలి అంతే. అవన్నీ ప్లాన్‌ చేసుకుంటే జరిగేవి కాదు.
ఎలాంటి మార్పులు చేశారు?
త్రివిక్రమ్‌గారితో చర్చల్లో కూర్చుని మొదట చర్చించింది కోషి పాత్రను భీమ్లాకు ఎలా మార్చాలి… అన్న దగ్గర మొదలైంది. అసలు ఇది రీమేక్‌ అని మరిచిపోయాం. మెయిన్‌ కథ, కమర్షియల్‌ అంశాలు, పవన్‌–రానా పాత్రల బ్యాలెన్స్‌ చేయడం వంటి అంశాల మీద ఎక్కువ దృష్టిపెట్టాం. దీని రీమేక్‌ హక్కులు మరొకరు తీసుకోవాలి అన్నట్లు పని చేయాలి అని త్రివిక్రమ్‌ గారు ముందే చెప్పారు. ఆయన అన్న మాటను ఆల్మోస్ట్‌ రీచ్‌ అయ్యాం అనుకుంటున్నా. రీమేక్‌లా కాకుండా ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ లాంటి సినిమాను తెరకెక్కించాం అనుకుంటున్నాం. అలాగే ఒరిజినల్‌ ఉన్న కొన్ని సన్నివేశాలను పవన్‌కల్యాణ్‌పై తీయలేదని చాలామంది అడుగుతున్నారు. అక్కడున్న అన్ని సన్నివేశాలు పెట్టాలంటే మన స్టోరీ టెల్లింగ్‌కు తేడా వస్తుంది. అందుకే తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో.. ఏ సీన్‌ పండుతుందో చెక్‌ చేసుకుని తీశాం.
స్టార్‌హీరోను డైరెక్ట్‌ చేయడం ఇదే మొదటిసారి..
ఇది మీకు సులభమా? కష్టమా?
అది మన మైండ్‌ సెట్‌ మీద ఆధారపడుతుంది. త్రివిక్రమ్‌గారు రైటింగ్‌లో అయినా, డైరెక్షన్‌లో అయినా సీనియర్‌ పర్సనాలిటీ. ఆయన సజెషన్స్‌ ఏ టెక్నీషియన్‌కైనా అవసరమే! ఇద్దరు స్టార్స్‌తో కలిసి పనిచేయడం అనేది యుద్ధంలాగే ఉంటుంది. దానిని మనం ఎంతగా ఓన్‌ చేసుకున్నాం. అవుట్‌పుట్‌ బాగా రావడానికి ఏం చేశాం అన్నది ముఖ్యం.  ఆయన సహకారం లేకపోతే ‌చిత్రం ఇంత పెద్ద హిట్‌ అయ్యేది కాదు. నాయక్‌, డ్యాని రెండూ బలమైన పాత్రలు కాబట్టే తెరపై నువ్వా.. నేన్నా అన్నట్లు ఆ పాత్రలు కనిపించాయి. ‘భీమ్లానాయక్‌’ చేయడం వల్ల వచ్చిన పేరు, గుర్తింపుతో నేను చాలా ఆనందంగా ఉన్నా.
సినిమా ప్రారంభానికి ముందు ఆ తర్వాత పవన్‌కల్యాణ్‌ ఏం చెప్పారు.
‘వకీల్‌సాబ్‌’ సినిమా సెట్‌లో కల్యాణ్‌గారిని వన్‌ టు వన్‌ కలిశా. అప్పుడు కోర్టు రూమ్‌ సీన్‌ చేస్తున్నారు. సినిమా గురించి మాట్లాడుతుండగా ‘బాగా తీయ్‌.. బాధ్యతగా  పని చేయ్‌’ అని చెప్పారు. అంతేఎనర్జీతో మేం పని చేశాం. ఆ తర్వాత జర్నీ అంతా అందిరికీ తెలిసిందే!
మూడు సినిమాల దర్శకుడిగా మీలో వచ్చిన మార్పు?
‘అయ్యారే’ సమయంలో సినిమా తీయాలనే తపన తప్ప ఇంకేం తెలీదు. ప్రొడక్షన్‌ ఎలా చేయాలి… ఎలా ముందుకెళ్లాలి అన్న సంగతి తెలీదు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’తో పరిచయాలు.. పెరిగాయి, కొంత అవగాహన వచ్చింది. ఒక అడుగు ముందుకెళ్లేలా చేసింది. ఇక ‘భీమ్లానాయక్‌’ నన్ను మరో మెట్టు ఎక్కించింది. ఈ మూడు సినిమాల వల్ల నాకు మంచే జరిగింది.
ఇంత భారీ విజయం తర్వాత ఇండస్ట్రీ, అభిమానుల నుంచి ప్రశంసలు అందుతుంటాయి. ఎలా అనిపిస్తుంది.
ఒక సినిమా సక్సెస్‌ అయితే ‘తెలిసినవాళ్లు.. తెలియనివాళ్లు ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు’ అని సినిమా టీమ్‌ చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది. వీళ్ల నంబర్‌ జనాలకు ఎలా తెలుసని నవ్వుకునేవాడిని. ఇప్పుడు దానికో లాజిక్‌ ఉందని అర్థమైంది. తాజాగా ఆ అనుభవం నాకు ఎదురైంది. చాలామంది ఫోన్‌ చేసి మెచ్చుకుంటున్నారు. సినిమా చూసి సుకుమార్‌, హరీశ్‌ శంకర్‌, సురేందర్‌ రెడ్డి, క్రిష్‌ వంటి దర్శకులు ఫోన్‌ చేసి కమర్షియల్‌ హిట్‌ కొట్టావ్‌ అన్నారు. అదొక గొప్ప జ్ఞాపకం.
ఈ సక్సెస్‌ వెనుక చినబాబు గారు పాత్ర ఎంత ఉంది?
చినబాబుగారు, వంశీ నా వ్యక్తిగత జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తులుగా మారారు. సినిమా తీసే విషయంలో ఆయన ఇచ్చే సపోర్ట్‌ మరచిపోలేం. కష్టం తెలియకుండా చూసుకుంటారు. కరోనా వల్ల షూటింగ్‌ లేట్‌ అయ్యి ఇబ్బంది పడ్డాం. కానీ మిగత ఏ విషయంలోనూ మేం ఇబ్బంది పడలేదు. ఇబ్బందులు ఏమీ మా దగ్గరకు రాకుండా చినబాబుగారు చూసుకున్నారు. త్వరలో హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
స్టార్‌తో సినిమా అంటే బలమైన కథ కావాలంటారు? మలయాళంలో ఈగో అనే అంశంతో సినిమా తీసి హిట్‌ అందుకున్నారు కదా?
అది ప్రాంతాలను బట్టి.. ఉంటుంది. మన ప్రేక్షకుల అభిరుచి మేరకు మన కథలుంటాయి. పైగా మన సినిమాల స్పాన్‌ పెద్దది. దానికి తగ్గట్లే కథలు ఉంటాయి. మార్పులు చేర్పులు హంగులు జోడిస్తారు. గ్లామర్‌ లుక్‌ ఉంటుంది.
దర్శకులకు కొత్త కథ చెప్పాలనే ఆలోచన ఉంటుంది. ఈ సినిమాతో అలాంటి అవకాశం వచ్చుంటే బావుండేది అనిపించిందా?
ఇంకా చాలా కెరీర్‌ ఉందండీ. చాలా అవకాశాలు అందుకోవాలి. ఈసారి డెఫినెట్‌గా స్ట్రెయిట్‌ సినిమా చేస్తా. ‘భీమ్లానాయక్‌’ సినిమా కంటే ముందు వరుణ్‌తేజ్‌తో 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లో ఓ సినిమా ప్రకటించారు. అనుకున్న బడ్జెట్‌ దాటడంతో అది పక్కకు వెళ్లింది. తర్వాత ఆ కథతో చేస్తానా.. ఇంకోటి చేస్తానా అన్నది చూడాలి.
Bheemla Nayak is more than a remake, it’s adding a new layer of entertainment – Director Saagar K Chandra.
With Bheemla Nayak receiving thunderous applause from all quarters, director Saagar K Chandra is the man of the moment. Released on February 25, Bheemla Nayak was declared a blockbuster right after the first show. Starring Pawan Kalyan, Rana Daggubati, Nithya Menon, Samuthrakani, Samyuktha Menon, Murali Sharma, Rao Ramesh, and others, the film is all set to break many records. Here are excerpts from Saagar K Chandra’s interaction with the media.
On getting onboard Bheemla Nayak
During the lockdown, producer S Naga Vamsi called and told me about the idea of remaking Ayyappanum Koshiyum. Then we discussed how it may shape out in Telugu. After which he asked if I would be interested to helm the project. I said yes and we spoke at large on different ways to commercialise it and make a native of Telugu cinema. From then the journey was seamless.
On hearing about Pawan Kalyan being the protagonist
That was a surrealistic moment for me. You can’t really plan your way to work with Pawan Kalyan. It has to happen. I am very happy that it happened to me after two movies.
On changes made to the remake and what was challenging in this process?
When Trivikram and I were discussing adapting the film to Telugu, the first roadblock was how to make Biju Menon’s character larger than life and how to get the whole movie around him. It was portrayed by Pawan Kalyan. In Ayyappanum Koshiyum, Koshi’s character was bigger. So in Telugu, a paradigm shift of kind happened. The next change was to bring an almost 3-hour film long film to less than 2 hours 30 minutes. As the original was a procedural film and the second half had most of the emotional outburst with 30 minutes around a tit for tat kind of action. We can’t retain people’s attention span for half an hour without the change in the arc. To adapt it to the next level, we made many changes.
On working with Trivikram
Trivikram is a towering personality and a flawless technician. He lives in a war room before conceptualising a scene. I always looked up to him as a mentor. He is open to discussions and I learned a lot from him. Without our collective effort, Bheemla Nayak wouldn’t have become a blockbuster hit.
On his journey from Ayyare to Bheemla Nayak?
I was a rookie when I made Ayyare. I was clueless about the industry and its way of working. After Appatlo Okadundevadu, the industry opened to me. Now Bheemla Nayak got massive applause.
What were the new things that made way while making the film?
We didn’t have a textbook kind of filmmaking and made it more natural. We didn’t want to dip the emotion in crucial scenes with multiple cuts so the shots were conceived in such a way. It was more of fluid action. Somethings like giving a lift on the bike won’t work in the remake so we chopped it. Also, Biju Menon walking out of a bus was an anticipated scene but we tweaked the scene and made it more impactful. Whoever takes the side of good is the hero, so we ensured it comes out well in Bheemla Nayak’s character. This was challenging as the original was more tilted towards Koshi. I couldn’t get a chance to meet Sachy, the writer of Ayyappanum Koshiyum. Thanks to him for giving such a memorable film.
How are you reacting to fan calls?
It’s crazy. So many messages. Don’t know how my number travelled to so many people.
What’s Chinna Babu’s contribution to your success?
He is the best support system. That’s the great trait of a producer. I have a personal bond with him.
How industry reacted to your success?
I got calls from Surender Reddy, Krish, Sukumar, and many other people. Everyone showered their praises on me. I thank everyone from the bottom of my heart.
How did Pawan Kalyan react before and after the film’s shoot?
He told me to shoot the film with a lot of responsibility and he is very happy after watching the end product.
Which is easy – making an original film or adapting a successful one?
This is a tricky question. Here we dealt with the film as a fresh one and made it conducive to the Telugu audience. So it was a different experience.
On releasing Bheemla Nayak in Hindi?

It will happen very soon.

 

001 (3) 001 (4) 001 (2) 001 (1)