పునః ప్రారంభమైన నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం

పునః ప్రారంభమైన నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  చిత్రం

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నేడు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల.  చిత్రీకరణ తో షూటింగ్ ప్రారంభించి నట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశి.

నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్,ప్రవీణ్,అనంత్,కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

Sithara Entertainments resumed their Production No 8 film shoot today in Hyderabad with all the safety measures taken. The film features Naga Shaurya & Ritu Varma in lead roles & directed by debutante Lakshmi Sowjanya.

The main cast and crew wil be involved in this shoot, producer Suryadevara Naga Vamsi said.

Artistes:
Naga Shaurya
Ritu Varma
Nadiya
Murali Sharma
Vennela Kishore
Praveen
Ananth
Kireeti Damaraju
Rangasthalam Mahesh
Arjun Kalyan
Vaishnavi Chaitanya
Siddhiksha etc.

Technicians:
Music Director: Vishal Chandrashekhar
Cinematographer: Vamsi Pacchilulusu
Art Director:  A.S.Prakash
Editor:  Naveen Nooli
Presented by P.D.V.Prasad
Producer: Suryadevara Naga Vamsi
Director:  Lakshmi Sowjanya

4P5A5495 4P5A5560 P8 Shoot Resume

Sitara Entertainments upcoming movie in the combination of Siddhu jonnalagadda and Shraddha Srinath

సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ చిత్రం

* ‘నరుడి బ్రతుకు నటన’ గా చిత్రం పేరు ఖరారు
* ఆకర్షణీయమైన లోగోతో కూడిన ప్రచార చిత్రం విడుదల
* దీపావళి కి షూటింగ్ ప్రారంభం

టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించింది. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రద్ధ శ్రీనాధ్ నాయికగా ఈ చిత్రం రూపొందనుంది. వీరిద్దరూ కలసి నటించిన కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. అంతేకాదు సిద్ధు జొన్నలగడ్డ ఈ  చిత్రంతో ఇటు టాలీవుడ్ లోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.ఇప్పుడు వీరిద్దరి విజయవంతమైన కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్ మెంట్స్ ఈ  చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తోంది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ.

సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో’ రూపొందనున్న ఈ చిత్రానికి ‘నరుడి బ్రతుకు నటన’ అనే పేరును ఖరారు చేసినట్లు సంస్థ ప్రకటించింది. అంతేకాదు… ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని కూడా ఈరోజు  సాయంత్రం గంటలు 4.05 నిమిషాలకు విడుదల చేశారు.
చిత్రం పేరు, లోగో, ఆకర్షణీయమైన, ఉత్సుకతను కలిగించే చిత్రం ఇందులో కనిపిస్తాయి.ప్రచార చిత్రాన్ని నిశితంగా గమనిస్తే.. సంగీతానికి ఈ చిత్రకధకు సంభంధం ఉందన్నట్లు హెడ్ ఫోన్స్, హృదయం రూపంలో  ఓ జంట లోకాన్ని మరచిపోయి దగ్గరగా ఉండటం ఇది ప్రేమ కథాచిత్రమా అనిపిస్తుంది. సహజంగా హార్ట్ సింబల్ రెడ్ కలర్ లో ఉంటుంది. కానీ ఈ చిత్రంలో ఇది బ్లూ కలర్ లో కనిపిస్తుంది…ఇలా ఎందుకు…? ప్రేమ కధకుమించి  ఈ చిత్రంలోఇంకేదో ఉంది అనిపిస్తుంది. అదేమిటో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే..వేచి చూడాల్సిందే…! చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు, వివరాల కోసం నిర్మాణ సంస్థకు సంబంధించిన సామాజిక మాధ్యమం ఖాతాను గమనిస్తూ ఉండండి.

పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో,నిర్మాతసూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది  దీపావళి కి  ప్రారంభం అవుతుంది.
‘నరుడి బ్రతుకు నటన‘ చిత్రానికి
రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: కాలభైరవ
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ

Sitara Entertainments upcoming movie in the combination of Siddhu jonnalagadda and Shraddha Srinath


• “Narudi Brathuku Natana” is the title of the film.
. An attracting and intresting poster is released at 4.05 pm
• Shoot starts from Diwali.

Leading Production house in Tollywood has announced their Upcoming film. Young and promising Hero siddhu jonnalagadda and Heroine Shraddha Srinath are pairing up once again after krishna and his leela. Both are riding high on the success of krishna and his leela which is very well received by the audience all over. Siddhu jonnalagadda made himself a mark with krishna and his leela, as promising hero in Tollywood as well as among general public. Sithara entertainments is now producing a film in this successful combination. Producer Suryadevara nagavamsi is introducing a young and talented director named Vimal Krishna with this movie. Vimal Krishna, previously worked in the direction team of krishna and his leela as well.
The team has zeroed in on “Narudi Brathuku Natana” as the title for this movie starring Siddhu Jonnalagadda and Shraddha Srinath. An attracting and intresting poster is released at 4.05 pm today.
A closer look at the poster, it shows a couple in an intimate space, indicating a love story probably, but the heart is bleeding blue, WHY? With the title being narudi brathuku natana, may be the protagonist goes through a bumpy ride in his life. It looks like there is more to the story than just love. We must wait and watch for it.

Producer Suryadevara nagavamsi has said that the shoot commences from Diwali. This movie is being presented by P.D.V. PRASAD.

Narudi Brathuku Natana Movie Details :

Cast : Siddhu Jonnalagadda, Shraddha Srinath

Writer: Vimal Krishna, Siddhu Jonnalagadda
Music : Kaala Bhairava
DOP : Saiprakash Ummadisingu
Executive Producer: Dheeraj Mogilineni

Banner : Sithara Entertainments
Presenter: PDV Prasad
Producer : Suryadevara Naga Vamsi
Director : Vimal Krishna

details copy NBN Logo

Prakash Raj helps West Godavari student to pursue overseas studies

పేద విద్యార్థిని పాలిట ఆప‌ద్బాంధ‌వుడైన ప్ర‌కాష్‌రాజ్‌.. మాంచెస్ట‌ర్ యూనివ‌ర్సిటీలో మాస్ట‌ర్స్ డిగ్రీ చ‌దివించ‌డానికి ఏర్పాట్లు!

ఎదుటివాళ్ల‌కు సాయం చేయాల‌నే మంచి హృద‌యం ఉన్న‌వాళ్ల‌లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ ఒక‌రు. ఈ లాక్‌డౌన్ కాలంలో క‌ష్టాల్లో ఉన్న‌వాళ్ల‌కు త‌న వంతు సాయం చేస్తూ వ‌స్తున్నారు. వ‌ల‌స కార్మికుల‌కు ఆప‌న్న హ‌స్తం అందించిన ఆయ‌న, స్కూలు మిస్స‌వుతున్న పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పించే బాధ్య‌త‌ను కూడా తీసుకున్నారు. అలాగే తెలంగాణ‌లో ఒక గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని త‌న ఉదాత్త హృద‌యాన్ని చాటుకున్నారు.తాజాగా ఆయ‌న ఓ బ్రిలియంట్ స్టూడెంట్‌కు మాస్ట‌ర్స్ డిగ్రీ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన ఆర్థిక సాయాన్ని చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. ప‌శ్చిమ గోదావ‌రికి జిల్లాకు చెందిన సిరిచంద‌న స్కూలు నుంచే అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌నప‌రుస్తూ బీఎస్సీ కంప్యూట‌ర్ సైన్స్ పూర్తి చేసింది. ఆమెకు మాంచెస్ట‌ర్‌లోని  యూనివ‌ర్సిటీ ఆఫ్ సాల్‌ఫోర్డ్‌లో ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో మాస్ట‌ర్స్‌ డిగ్రీ చేయ‌డానికి సీటు వ‌చ్చింది. ఆమెకు తండ్రి లేడు. ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రం. అక్క‌డ‌కు వెళ్ల‌డానికి ఆశ‌లు వ‌దిలేసుకున్న ఆమె పాలిట ఆప‌ద్బాంధ‌వుడ‌య్యారు ప్ర‌కాష్‌రాజ్‌. ఆమెను మాంచెస్ట‌ర్ యూనివ‌ర్సిటీలో చ‌దివించ‌డానికి ముందుకు వ‌చ్చారు. దీంతో సిరిచంద‌న‌, ఆమె త‌ల్లి ఆనందాన్ని అవ‌ధులు లేవు. హైద‌రాబాద్‌లో షూటింగ్‌లో ఉన్న ప్ర‌కాష్‌రాజ్‌ను క‌లుసుకొని, త‌మ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఆమెను బాగా చ‌దువుకొని, వృద్ధిలోకి రావాల్సిందిగా ప్ర‌కాష్‌రాజ్ ఆశీర్వ‌దించారు.

ఈ సంద‌ర్భంగా సిరిచంద‌న మాట్లాడుతూ, “నాపేరు తిగిరిప‌ల్లి సిరిచంద‌న‌. మాది ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పెద్దేవం గ్రామం. నేను డిగ్రీ కంప్యూట‌ర్ సైన్స్‌ చ‌దువుకున్నాను. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో మాస్ట‌ర్స్‌ డిగ్రీ చేయ‌డానికి మాంచెస్ట‌ర్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ సాల్‌ఫోర్డ్‌లో సీటు వ‌చ్చింది. నాకు తొమ్మిదేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు మా నాన్న‌గారు చ‌నిపోయారు. అప్ప‌ట్నుంచీ మా అమ్మే క‌ష్ట‌ప‌డి మ‌మ్మ‌ల్ని చ‌దివించి ఇక్క‌డి దాకా తీసుకువ‌చ్చింది. యూనివ‌ర్సిటీలో సీటు వ‌చ్చిన‌ప్పుడు అక్క‌డికి వెళ్ల‌డానికి నేను ధైర్యం చెయ్య‌లేదు. ఎందుకంటే ఆర్థికంగా మా కుటుంబం ప‌రిస్థితి నాకు తెలుసు కాబ‌ట్టి. న‌రేంద్ర అనే మా శ్రేయోభిలాషి ఒక‌రు నా గురించి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన‌ప్పుడు, ప్ర‌కాష్‌రాజ్ గారు అదిచూసి, త‌న‌కు నేను హెల్ప్ చేస్తాను, త‌ను బాగా చ‌దువుకోవాలి అని ముందుకు వ‌చ్చారు. అన్ని ఖ‌ర్చులు ఆయ‌నే భ‌రిస్తున్నారు. ఆయ‌న ఇచ్చిన ప్రేర‌ణ‌తో నేను బాగా చ‌దువుకొని, నాలాంటి స్థితిలో ఉన్న మ‌రో న‌లుగురికి సాయం చేయాల‌ని అనుకుంటున్నా. నిజానికి మాంచెస్ట‌ర్ యూనివ‌ర్సిటీలో చ‌దువుకొనే స్థాయి మాకు లేదు. కానీ ఆర్థికంగా, నైతికంగా ప్ర‌కాష్‌రాజ్ గారు ఇచ్చిన స‌పోర్ట్ ఎన్న‌టికీ మ‌ర్చిపోలేం. బుక్స్ ద‌గ్గ‌ర్నుంచి కంప్యూట‌ర్ దాకా ఆయ‌నే స‌మ‌కూర్చి పెట్టారు. క‌చ్చితంగా ఈ విష‌యంలో ఆయ‌న‌ను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుంటాను. ఎప్ప‌టికీ ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటాను.” అని చెప్పింది.

సిరిచంద‌న వాళ్ల‌మ్మ ఉద్వేగంతో మాట్లాడుతూ, “నా పిల్ల‌లు చిన్న‌వాళ్లుగా ఉన్న‌ప్పుడే నా భ‌ర్త చ‌నిపోయారు. అప్ప‌ట్నంచీ అష్ట‌క‌ష్టాలు ప‌డి నా పిల్ల‌ల్ని పోషిస్తూ, చ‌దివించుకుంటూ వ‌చ్చాను. మాకు ఆస్తిపాస్తులు లేవు, వెనుకా ముందూ ఎవ‌రూ లేరు. నా రెక్క‌లే ఆధారం. పాప‌కు పీజీలో సీటు వ‌చ్చిన‌ప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా బాధేసింది. ప్ర‌కాష్‌రాజ్ గారికి నా బిడ్డ విష‌యం తెలిసి, త‌న బాధ్య‌తంతా ఆయ‌న తీసుకున్నారు. సిరిచంద‌న‌ను తాను చూసుకుంటాన‌నీ, చ‌దివిస్తాన‌నీ చెప్పారు. త‌న‌కో కూతురుంద‌నీ, సిరిని రెండో కూతుర‌నుకుంటాన‌నీ అన్నారు. ‘నువ్వు నా చెల్లెలివ‌మ్మా బాధ‌ప‌డ‌కు’ అని నాకు ధైర్యమిచ్చారు. ఏమిచ్చినా ఆయ‌న రుణం తీర్చుకోలేం. ఒక పెద్ద‌న్న‌లా ఆయ‌న న‌న్ను న‌డిపిస్తున్నారు.” అన్నారు.

Prakash Raj helps West Godavari student to pursue overseas studies

Veteran actor Prakash Raj is a man of words. Off the screen, he is a different person and believes in giving what life has given to him. During the pandemic lockdown, we have seen Prakash Raj taking care of the migrant labourers and now here is yet another tale of his helping nature.

Prakash Raj provided financial support to a girl who hails from West Godavari district. Into the story, Tigiripalli Siri Chandana is a bright student. Having graduated in Computer Science, she managed to get a seat in the prestigious University of Salford, Manchester city, UK. However due to her poor financial background she could not lay a step forward and was in the verge of giving up.

But this tale of Chandana reached Prakash Raj and he immediately came forward to support her. Keeping his word, Prakash Raj paid the tuition fee and living expenses of Chandana in UK. Receiving the help, Chandana met Prakash Raj and thanked him for all the invaluable help.

Speaking on this Chandana said, “My father passed away when I was 9 years old. Since then my mother was taking care of my family. After my graduation, I wanted to do post-graduation in information technology. But I can’t afford the overseas education and through a person, Prakash Raj sir came forward to help me. He took care of everything from college fee to my day-to-day expenses. I’m indebted to Prakash Raj sir but the most important thing I have learnt from him is, to help others who are like me out there.”

Adding Chandana further said that Prakash Raj filled the role of my father. This gesture from a great personality like him, I would never ever forget in my life.

Chandana’s mother got a little emotional while speaking. “I have worked very hard to give my children a good life. I have no one to support and not even assets to rely on. Prakash Raj garu came in like a ray of hope. He assured all the possible help and like a big brother to me, he helped my daughter to pursue her dreams. Thank you is a small word for what Prakash Raj garu has done for my daughter.”

Irrespective of the affiliations, Prakash Raj made the slogan ‘Beti Bachao.. Beti Padao..’ come true. Respect!

PHOTO-2020-10-03-18-19-53 PHOTO-2020-10-03-18-19-52

Aravind Swamy and Jayam Ravi’s Bogan Telugu Trailer out now

జ‌యం’ ర‌వి, ‘అర‌వింద్‌స్వామి’ ల సూప‌ర్‌హిట్ సినిమా ‘బోగ‌న్‌’ ట్రైల‌ర్ విడుద‌ల‌

ఇటీవ‌ల ‘బోగ‌న్’ చిత్రాన్ని రామ్ తాళ్లూరి తెలుగులో అందిస్తున్నార‌నే ప్ర‌క‌ట‌న రాగానే, ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన అమేజింగ్‌ రెస్పాన్స్ చూశాక‌, ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నామ‌నే న‌మ్మ‌కం మ‌రింత‌గా పెరిగిందని నిర్మాత తెలిపారు.

‘బోగ‌న్’ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్‌తో ఎస్.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి అందిస్తున్నారు. ఇప్ప‌టికే అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి.

ఈరోజు (గురువారం)ఉద‌యం 11 గంట‌ల‌కు బోగ‌న్ ట్రైల‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. సాధార‌ణంగా యాక్ష‌న్ సీన్లు టెర్రిఫిక్‌గా ఉంటాయంటాం. బోగ‌న్‌లో యాక్ష‌న్ సీన్లు మాత్ర‌మే కాదు, క‌థ‌ను న‌డిపించే అనేక సీన్లు టెర్రిఫిక్‌గా ఉంటాయ‌ని ఈ ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది.

ట్రైల‌ర్‌ని చూస్తుంటే సినిమాలో మ‌న ఊహ‌కు అంద‌ని ట్విస్టులు అనేకం ఉన్న‌ట్లు తెలుస్తోంది. జ‌యం ర‌వి త‌న ద‌గ్గ‌ర‌కు రివాల్వ‌ర్‌ ప‌ట్టుకొని వెరైటీగా న‌డుస్తూ వ‌స్తుంటే హ‌న్సిక ఫోన్‌లో ఏడుస్తూ “విక్ర‌మ్‌.. ఆదిత్య ఇక్క‌డ‌కు వ‌చ్చేశాడు.. భ‌యంగా ఉంది.. త్వ‌ర‌గా రా” అన‌డం, కారులో ఉన్న అర‌వింద్ స్వామి “వ‌స్తున్నా వ‌స్తున్నా” అన‌డం చూస్తుంటే ట్విస్టులు ఏ రేంజిలో ఉంటాయో అర్థ‌మ‌వుతోంది. అలాగే ట్రైల‌ర్ చివ‌ర‌లో అర‌వింద్ స్వామి “ఆదిత్యా” అని కోపంతో పెద్ద‌గా అర‌వ‌డం కూడా ఈ ట్విస్టులో భాగ‌మే. ఎందుకంటే ఆదిత్య పాత్ర‌ను చేసింది అర‌వింద్ స్వామి అయితే, విక్ర‌మ్ పాత్ర‌ను చేసింది జ‌యం ర‌వి. మ‌రి జ‌యం ర‌విని చూసి హ‌న్సిక ఎందుకు భ‌య‌ప‌డుతోందో, అర‌వింద్ స్వామి “ఆదిత్యా” అని ఆవేశంగా ఎందుకు కేక పెట్టాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఒక బ్యాంక్ దొంగ‌త‌నం కేసును ద‌ర్యాప్తు చేస్తూ, ఆదిత్య అనే నిందితుడిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే విక్ర‌మ్ అనే పోలీసాఫీస‌ర్ క‌థ ‘బోగ‌న్’ చిత్రం. త‌న‌కు చిక్క‌కుండా త‌ప్పించుకుంటున్న ఆదిత్య‌ను ఒక అద్భుత ప్లాన్‌తో విక్ర‌మ్ ప‌ట్టుకోవ‌డం టెర్రిఫిక్ ఇంట‌ర్వెల్ బ్లాక్‌. ఆ త‌ర్వాత క‌థ ప్రేక్ష‌కులు ఊహించ‌ని మ‌లుపులు తిరిగి, అనుక్ష‌ణం కుర్చీల‌లో మునివేళ్ల‌పై కూర్చోపెట్టేలా క‌థ‌నం ప‌రుగులు పెడుతుంద‌ని ట్రైల‌ర్ తెలియ‌జేస్తోంది.

ల‌క్ష్మ‌ణ్ స్క్రీన్‌ప్లే, సౌంద‌ర్‌రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, డి. ఇమ్మాన్ మ్యూజిక్ క‌లిసి ఈ మూవీని ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా త‌యారుచేశాయి. విక్ర‌మ్ ఐపీఎస్‌గా జ‌యం ర‌వి, ఆదిత్య‌గా అర‌వింద్ స్వామి.. ఇద్ద‌రూ ఇద్ద‌రే అన్న‌ట్లు ఫెంటాస్టిక్‌గా న‌టించిన ఈ సినిమా ఒక హాలీవుడ్ థ్రిల్ల‌ర్ చూసిన ఫీలింగ్‌ను క‌లిగిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

‘త‌ని ఒరువ‌న్’ త‌ర్వాత ‘జ‌యం’ ర‌వి, అర‌వింద్ స్వామి కాంబినేష‌న్‌లో రూపొంది సూప‌ర్‌హిట్ట‌యిన మ‌రో సినిమానే  ఈ  ‘బోగ‌న్‌’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీని డైరెక్ట‌ర్‌ ల‌క్ష్మ‌ణ్ రూపొందించారు. త‌క్కువ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా త‌మిళంలో రూ. 25 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది.

హీరోయిన్‌గా హ‌న్సికా మొత్వాని న‌టించిన ఈ చిత్రంలో నాజ‌ర్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, న‌రేన్‌, అక్ష‌ర గౌడ ఇత‌ర పాత్ర‌ధారులు. డి. ఇమ్మాన్ సంగీతం స‌మ‌కూర్చ‌గా, సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు.

త్వ‌ర‌లోనే చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత‌ చెప్పారు.

తారాగ‌ణం:
జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామి, హ‌న్సికా మొత్వానీ, నాజ‌ర్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, న‌రేన్‌, నాగేంద్ర‌ప్ర‌సాద్‌, వ‌రుణ్‌, అక్ష‌ర గౌడ‌

సాంకేతిక బృందం:
సంభాష‌ణ‌లు:  రాజేష్ ఎ. మూర్తి
సాహిత్యం:  భువ‌న‌చంద్ర‌
గాయ‌నీ గాయ‌కులు: స‌మీర భ‌ర‌ద్వాజ్‌, శ్రీ‌నివాస‌మూర్తి, సాయినాథ్‌, అశ్విన్‌, దీపిక‌
సంగీతం:  డి. ఇమ్మాన్‌
సినిమాటోగ్ర‌ఫీ:  సౌంద‌ర్ రాజ‌న్‌
కథ-  స్క్రీన్ ప్లే – ద‌ర్శ‌క‌త్వం: ల‌క్ష్మ‌ణ్‌
నిర్మాత‌:  రామ్ తాళ్లూరి
బ్యాన‌ర్‌: ఎస్‌.ఆర్‌.టి. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

Aravind Swamy and Jayam Ravi’s Bogan Telugu Trailer out now

After news broke out that Tollywood noted producer Ram Talluri is presenting the Bogan movie in Telugu version, the response received from the audience was overwhelming.

Bogan movie is being released in Telugu version with same title by noted Tollywood film producer Ram Talluri. Dubbing work for the movie has already been completed.

Bogan movie team has now released the trailer at 11 AM Today. Going by the trailer, one can understand that the movie is jam packed with breathtaking stunts and terrific action sequences. It is also to be noted that there are so many interesting twists and turns all through the movie.

In one of the scenes in the trailer, ‘Hansika’ is seen speaking to Aditya(aravind swamy) on phone asking him to come fast as Vikram(Jayam Ravi) is coming near to her with a revolver in his hand. And at the end of the trailer, Aravind Swamy is seen shouting Aditya but that character role is played by Aravind Swamy himself in the movie. Why is Hansika looking at Jayam Ravi with fear and why is Aravind Swamy calling out Aditya, to know that one has to watch the movie. There are so many suspense elements like these to watch out for in the movie.

The story revolves around a bank robbery case and police officer ‘Vikram’(Jayam Ravi) who wants to nab the criminal ‘Aditya’(Aravind Swamy) in the case.

Lakshman’s screenplay, D Imman’s music and Soundararajan’s cinematography are going to be the biggest highlights of the movie.

Jayam Ravi as IPS officer and Aravind Swamy as notorious thief are all set to give audience the feel of watching a Hollywood thriller movie with their top notch performance.

Jayam Ravi and Aravind Swamy teamed up once again for Bogan movie after Thani Oruvan movie. This movie which is made with a limited budget has collected approximately 25 crores and turned out to be sensational blockbuster in Tamil.

Hansika Motwani plays the female lead role in the movie, while Nasser, Ponvannan, Naren and Akshara Gowda play other supporting roles in the movie.

The producer of the movie Ram Talluri announced that they are planning to bring the movie as soon as possible for Telugu audience.

Technical team:

Dialogues: Rajesh A Murthy
Songs: Bhuvanachandra
Singers: Sameera Bharadwaj, Srinivas Murthy, SaiNath, Ashwin, Deepika
Music: D Imman
Cinematography: Soundararajan
Story-Screenplay-Direction: Lakshman
Producer: Ram Talluri
Banner: SRT Entertainments

Bogan_Plan-StillBogan_Trailer-out