shalinipandeyyy as #Sonali in #Nishabdham ‬

look-3 Plain Still look-3
Presenting @shalinipandeyyy as #Sonali in #Nishabdham ‬
Watch teaser here ICYMI http://bit.ly/NishabdhamTeaser‬#AnushkaShetty @ActorMadhavan @yoursanjali @actorsubbaraju @hemantmadhukar #TGVishwaprasad @konavenkat99 @vivekkuchibotla @peoplemediafcy @KonaFilmCorp @GopiSundarOffl

First song from Mis Match ‘Arere Arere’ is very impressive: Director Trivikram


‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని మొదటిపాట *అరెరే అరెరే* ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 


* ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న విడుదలకు సిద్ధమైన ‘ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్’ ల ‘మిస్ మ్యాచ్’

‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం  ’మిస్ మ్యాచ్’. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న’మిస్ మ్యాచ్’ విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికెట్ ను పొందిందీ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న ‘మిస్ మ్యాచ్’ ను  విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు  ఇటీవలే మీడియాకు అధికారికంగా ప్రకటించారు.

‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని మొదటిపాట *అరెరే అరెరే* ను దర్శకుడు త్రివిక్రమ్ ఈరోజు విడుదల చేసారు.

ఈ సందర్బంగా డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ…’మిస్ మ్యాచ్’ టైటిల్ కొత్తగానూ,ఆసక్తిని కలిగించేదిగానూ ఉంది. డైరెక్టర్ నిర్మల్ తీసిన సలీమ్ సినిమా తమిళ్, తెలుగులో మంచి విజయం సాధించింది. తెలుగులో అతను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్న ‘మిస్ మ్యాచ్’ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. చిత్ర యూనిట్ కు గుడ్ లక్. ‘మిస్ మ్యాచ్’  ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్ కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. ఇప్పుడు రిలీజ్ అయిన ‘అరెరే అరెరే’ మెలోడీ సాంగ్, వినాలనిపించేదిగా ఉంది” అన్నారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ…నా అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ ‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్న అన్నారు. నా మొదటి సినిమా ‘ఆట కదరా శివ’ సినిమాకు త్రివిక్రమ్ గారు సపోర్ట్ చేశారు. మళ్ళీ ఈ సినిమా సాంగ్ ఆయన చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు అన్నారు హీరో ఉదయ్ శంకర్.

నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ…స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు సాంగ్ రిలీజ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. ఆడియన్స్ కోరుకుంటున్న అన్నీ అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు. ఉదయ్ శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారు. డిసెంబర్ ఆరున చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈరోజు విడుదల అయిన ఈ గీతం తరువాత మరో రెండు గీతాలను ఒకదాని తరువాత మరొకటి విభిన్నంగా విడుదల చేయబోతున్నాము అని తెలిపారు. ‘ఈ చిత్రానికి సంబంధించి ప్రముఖ దర్శకుడు ‘క్రిష్’ చేతుల మీదుగా  విడుదల అయిన ‘మిస్ మ్యాచ్’ తొలి ప్రచార చిత్రాలు, విక్టరీ వెంకటేష్ గారు విడుదల చేసిన చిత్రం టీజర్, అలాగే ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేసిన చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకులనుంచి విశేషమైన స్పందన లభించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి మరోసారి కృతఙ్ఞతలు తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ ఇలియాస్ మాట్లాడుతూ…సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి. ‘అరెరే అరెరే’ సాంగ్ త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషం. శ్రేష్ఠ గారు ఈ పాటను రచించారు, ఎమ్. ఎమ్. మనస్వి పాడడం జరిగింది. ఆడియన్స్ అందరికి ఈ సాంగ్ నచ్చుతుందని భావిస్తున్నాను” అన్నారు.

డైరెక్టర్ ఎన్. వి.నిర్మల్ మాట్లాడుతూ..’అరెరే అరెరే’ పాట ఒక మెలోడీ, రొమాంటిక్ నెంబర్ ఈ సాంగ్. శ్రోతలకు త్వరగా నచ్చే సాంగ్ ఇది. గిఫ్టన్  కంపోజిషన్ లో మనస్వి చక్కగా పాడడం జరిగింది. త్రివిక్రమ్ గారు ఈ సాంగ్ రిలీజ్ చెయ్యడంతో ఆడియన్స్ కు ఈ సాంగ్ మరింత చేరువవుతుందని భావిస్తున్నాను” అన్నారు.

ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం

దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ .
నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్
 
ZS3A6309 ZS3A6334 ZS3A6342 ZS3A6354
*First song from Mis Match ‘Arere Arere’ is very impressive: Director Trivikram*

Adiroh Creative Science LLP’s maiden production Mis Match is gearing up for release soon. Aata Gadara Siva fame Uday Shankar is playing the male lead role Aishwarya Rajesh is pairing up with him. NV Nirmal Kumar is directing this much-awaited flick. Star director, Trivikram released the first song of the film titled ‘Arere Arere’.

Trivikram said that the title Mis Match is fresh and intriguing. Nirmal Kumar’s previous flick ‘Saleem’ had a good run at the box offices in the Telugu states and Tamil Nadu. I hope this film will become a wholesome family entertainer. The first song from the film is a melodious one and it has a ring to it, he said.

Hero, Uday Shankar said he is delighted that his favorite director Trivikram Srinivas is releasing the first audio single of his film. Trivikram garu supported my first film as well. I thank him for this. This film was made with passion and dedication, he said.

The producer, Sriram stated he is really happy that a renowned filmmaker like Trivikram is releasing the first song from his flick . He added that the film came out really well and both the lead actors, Uday and Aishwarya came up with really good performances.

The music director Gifton Elias opined that the entire album has shaped up really well. MM Manasvi crooned this song while Sresht wrote the lyrics.

The director, Nirmal Kumar said that ‘Arere Arere’ is a beautiful composition and the melodious track will connect well with everyone. The song will now have a much wider reach as Trivikram garu has released it, he added.

Adhiroh creative signs LLP
‘MISS MATCH

Cast:
Uday Shankar,Aishwarya Rajesh,Pradeep rawath, Sanjay Swaroop,Master Adhiroh,Naga Mahesh,Ravulapati venkata ramarao.,Malakpet shailaja,Badhram,Roopa Laxmi,Sandhya Janak,Sharanya,Padma Jayanthi,Laxman,Munna.

Technicians:
Ganesh chandrra(DOP),Story, screen play: Bhupathi Raja,Music: Gifton Elias,Dialogues: Rajendra Kumar, Madhu,Lyricists: Sirivennela Seetharam Shastri ,Suddhaala Ashok Teja, Dharma Teja,Editor: SP Raja Sethupathi,Dance master: shiva shankar, Fight master: Vijay
Director: NV. Nirmal Kumar
Producers:  G srirama raju, Bharath ram

‘OMG Daddy’ from ‘Ala Vaikunthapurramlo’ out now

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  ”అల వైకుంఠపురములో”‘ … “ఓ డాడీ”  సాంగ్ విడుదల
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో…’  వీరిద్దరి కాంబినేషన్ లో  రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే  ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ‘సామజవరగమన’, “రాములో రాముల” పాటలు చిత్రం పై అంచనాల్ని తారాస్థాయికి చేర్చాయి. ఈ పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే.ఇప్పుడు సంగీత దర్శకుడు థమన్ స్వరపరచిన చిత్రం లోని మరోగీతం ‘ఓ డాడీ’ ఈరోజు విడుదలైంది. సాహిత్య విలువలతో కూడిన,ఎన్నో విజయవంతమైన గీతాలను రచించిన గీత రచయిత  కృష్ణ చైతన్య ఈ పాట రాసారు. ఈ పాటలో వచ్చే తెలుగు ర్యాప్ కూడా ఆయనే రాయడం విశేషం. తెలుగు ర్యాప్ ని బిగ్ బాస్ ఫేమ్ రోల్ రైడా పాడగా, ఇంగ్లీష్ ర్యాప్ ని ‘రాహుల్ నంబియార్’ పాడారు. ఫిమేల్ ర్యాప్ ని లేడీ కాష్ పాడింది. గాయకుడు  ’రాహుల్ సిప్లిగంజ్’ ఈ పాటను తన స్టయిల్ లో పాడి ఉర్రూతలూగించారు.. బ్లాజీ ఈ పాటకు గాత్ర సాయం చేశారు.’ఓ డాడీ’ గీతం విడుదలైన కొద్ది సమయానికే  అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో మరో ఫేవరేట్ సాంగ్ గా  చార్ట్ బస్టర్స్ లో టాప్ లో నిలుస్తోంది.మరో అద్భుతమైన పాటను అందించి, మరొక సూపర్ హిట్ ఆల్బమ్ ను తన ఖాతాలో థమన్ వేసుకున్నారన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణి నటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,
పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, పి.ఆర్.ఓ.: లక్ష్మి వేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

 
531A0412 531A0341 531A9408
Starring stylish star Allu Arjun in the lead role, ‘Ala Vaikunthapurramlo’ is gearing up for its release on January 12th. The family entertainer is the third collaboration between Allu Arjun and ace filmmaker, Trivikram.The first two songs from the audio album namely, ‘Samajavaragamana’ and ‘Ramuloo Ramulaa’ are already topping the music charts. The third song, ‘OMG Daddy’ is out now. Thaman, who has been in fine form lately, has given yet another impressive peppy song.Krishna Chaitanya penned the lyrics for ‘OMG Daddy’. Rahul Sipligunj is the lead singer while Roll Rida and Nambiar crooned the rap portions.

The teaser of ‘OMG Daddy’ was released recently and it has already received a very good response from Allu Arjun’s fans and cine enthusiasts, in general. Thaman seems to have hit the bullseye again with ‘OMG Daddy’.

Produced jointly by Geetha Arts and Haarika & Hassine Creations, this movie, which will hit the screens on 12th January, 2020, has been riding high on expectations.

Cast: Stylish Star AlluArjun, Pooja Hegde, Tabu,Rajendra Prasad, Sachin Kedkar, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya, Brahmaji,,Harshavardhan,Ajay,Rahul Ramakrishna, Pammi sai.

Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts

`నిశ్శ‌బ్దం` చిత్రంలో హాలీవుడ్ యాక్ట‌ర్ ‘మైకేల్ మ్యాడ్‌స‌న్’ లుక్

look-1 Telugu look-1 Still

అనుష్క‌ శెట్టి, ఆర్‌.మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే ప్ర‌ధాన పాత్రధారులుగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందుతోన్న క్రాస్ ఓవ‌ర్ చిత్రం `నిశ్శ‌బ్దం`. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో హాలీవుడ్‌కి చెందిన న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, ర‌చ‌యిత, ఫొటోగ్రాఫ‌ర్ మైకేల్ మ్యాడ్‌స‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప‌లు హాలీవుడ్ చిత్రాల్లో న‌టించి మెప్పించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. వైవిధ్యమైన పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న ఈ హాలీవుడ్ న‌టుడు `నిశ్శ‌బ్దం` చిత్రంలో రిచ‌ర్డ్ డికెన్స్ అనే పోలీస్ హెడ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. గురువారం ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌నుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన అనుష్క శెట్టి స‌హా ప‌లువురు ఇండియ‌న్స్ యాక్ట‌ర్స్‌, హాలీవుడ్ యాక్ట‌ర్ మైకేల్ మ్యాడ్ స‌న్ వంటి స్టార్స్ న‌టిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ సంగీతాన్ని అందిస్తుండ‌గా షానియ‌ల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:  గోపీ సుంద‌ర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీర‌జ కోన‌, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ: షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంక‌ట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్,  స్టోరీ,  డైరెక్ష‌న్ – హేమంత్ మ‌ధుక‌ర్.
Unveiling the look of Hollywood actor Michael Madsen in NishabdamStarring Anushka Shetty, R. Madhavan, Anjali and Shalini Pandey, Nishabdam is an upcoming multilingual film.

Presently in post production, the film has several leading names. One of them is award winning actor, director, producer, writer and photographer from Hollywood, Michael Madsen.

This talented actor is said to be seen in the role of police head Richard Dixon in Nishabdam. The team is set to release the first look of his character on Thursday.

Very soon an announcement of the release date will also be made by the unit.

Nishabdam will release in Telugu, Tamil, Malayalam, Hindi and English. The release date of the crossover film directed by Hemanth Madhukar will be announced soon. The film is produced by People Media Factory, Kona Films Corporation by TG Vishwaprasad and Kona Venkat.

The film also has an ensemble cast of Michael Madsen, Hunter O’ Hara, Shalini Pandey, Srinivas Avasarala and Subbaraj amongst others.

Music: Gopi Sunder
Editing: Praveen Pudi
Art: Chad Raptor
Stylist: Neeraja Kona
Stunts: Alex Terjiff
DOP: Shaniel Deo
Screenplay, Dialogues: Kona Venkat
Co-producer: Vivek Kuchibotla
Producers: TG Vishwaprasad, Kona Venkat
Story, direction: Hemanth Madhukar

Surender Reddy unveils MisMatch trailer, movie to release on Dec 6th


* డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ‘మిస్ మ్యాచ్’ ట్రైలర్ విడుదల

* డిసెంబర్ 6న సినిమా ప్రేక్షకుల ముందుకు !!!‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం  ’మిస్ మ్యాచ్’. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న’మిస్ మ్యాచ్’ విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న ‘మిస్ మ్యాచ్’ ను  విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు  ఇప్పటికే ప్రకటించారు..

 సెన్సార్ ‘యు’  సర్టిఫికెట్ ను పొందిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ రోజు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..
రచయిత భూపతి రాజా మాట్లాడుతూ…’మిస్ మ్యాచ్’ సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. రెండు కుటుంబాల మధ్య జరిగే కథను దర్శకుడు నిర్మల్ బాగా  చూపించారు కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది అవుతుందని తెలిపారు.మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ మాట్లాడుతూ..నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు, అందరికి నచ్చే పాటలు ఈ సినిమాలో ఉన్నాయి. డిసెంబర్ 6 న విడుదల కాబోతున్న ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.

దర్శకుడు నిర్మల్ మాట్లాడుతూ…నా మొదటి తెలుగు సినిమా ఇది. నాకు సపోర్ట్ చేస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు, మ్యూజిక్ బాగా రావడానికి కారణమైన గిఫ్టన్ గారికి థాంక్స్. ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఈ మూవీకి ఉన్నాయి. తప్పకుండా ఆడియన్స్ అందరికి ఈ సినిమా నచ్చుతుందని తెలిపారు

నిర్మాత జి.శ్రీరామ్ రాజు మాట్లాడుతూ..మా చిత్ర ట్రైలర్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి రిలీజ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. దర్శకుడు నిర్మల్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. భూపతి రాజా గారు మంచి కథ ఇచ్చారు. ఈ చిత్ర టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం ఎంతో  కష్టపడి పని చేశారు. ఉదయ్, ఐశ్వర్య రాజేష్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ…మా చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సురేందర్ రెడ్డి గారికి థాంక్స్, మంచి కథ, కథనాలు ఉన్న సినిమ ‘మిస్ మ్యాచ్’. నిర్మల్ కుమార్ గారు సినిమాను అందంగా తెరకెక్కించారు. తొలిప్రేమ చిత్రంలోని ఈ మనసే సాంగ్ ఈ సినినిమాలో రీమిక్స్ చేశాం, అందరికి నచ్చుతుంది. డిసెంబర్ 6న మీ ముందుకు వస్తున్న మా సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్న అన్నారు.

ముఖ్య అతిధి దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ…’మిస్ మ్యాచ్’ టైటిల్ బాగుంది. హీరో ఉదయ్ బాగా చేసాడు. కథ అందించిన భూపతి గారికి, డైరెక్టర్ నిర్మల్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. డైరెక్టర్ నిర్మల్ తమిళ్ లో చేసిన చదరంగ వెట్టై పెద్ద హిట్, అదే విధంగా తాను తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ ‘మిస్ మ్యాచ్’ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను, ఈ చిత్రంలో నటించిన  నటీనటులకు, సాంకేతిక నిపుణులకు గుడ్ లక్. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను  అన్నారు.

ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం
దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ .
నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్
 90567 (6) 90567 (5) 90567 (4) 90567 (3) 90567 (2) 90567 (1)
Surender Reddy unveils MisMatch trailer, movie to release on Dec 6th
Starring Uday Shankar and Aishwarya Rajesh in lead roles, MisMatch is gearing up for release on December 6th. Adhiroh creative science LLP bankrolled the film. The trailer of the film was unveiled by ace filmmaker Surender Reddy.The writer of the film, Bhupathi Raja said MisMatch has an interesting subject and will attract family audience.

The music director Gifton said the audio album is a really good one and it has feel-good songs.

The director, Nirmal said this is his first film and hopes the audience will like the film’s theme and content.

The producer sreeram raaju  thanked Surender Reddy for releasing the trailer. He thanked the technicians for the brilliant efforts.

The male lead, Uday said the film has enough emotions and gripping elements to keep the viewers engaged all the way through.

Director Surender Reddy said the lead actor, Uday acted well in the film and wished the entire team all the very best for the film. “I hope the film becomes a huge hit,” he said.

Other co actors sanjay swaroop,Pradeep rawath ,roopalaxmi,sharanya

Music Director: Gifton Elias, Director of Photography: Ganesh Chandrra Story: Bhupathy Raja Dialogue writer: Rajendra Kumar, Madhu

Lyrics: Sirivennela Sitarama Sastry, Suddhala Ashok teja,Oruganti Dharma teja,Shreshta,  Art Director: Mani Vasagam Director: NV NirmalKumar Producers: G. Sriram Raju,K. Bharath Ram
Special thanks to Stylish Ace Director @DirSurender Garu for launching #MisMatch Trailer!Watch the Lovely trailer here
▶️ http://bit.ly/347Ru80

@USUdayShankar @aishu_dil @Dir_nirmalkumar #GSriramRaju #KBharatRam @GiftonElias @Ganeshchandhrra @venupro @AdhirohCS

#MisMatchOnDec6th