Intinti Ramayanam

Intiti Ramayanam will make you laugh your lungs out; the response is massive, say makers at the success meet

‘ఇంటింటి రామాయణం’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు
సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో ఐవీవై ప్రొడక్షన్స్ నిర్మించిన కుటుంబ కథా చిత్రం ‘ఇంటింటి రామాయణం’. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మాతలు. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, నరేష్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. గ్రామీణ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం(జూన్ 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈరోజు విలేకర్ల సమావేశం నిర్వహించి ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.
దర్శకుడు సురేష్ నరెడ్ల మాట్లాడుతూ.. “నిన్ననే ‘ఇంటింటి రామాయణం’ సినిమా థియేటర్లలో విడుదలైంది. చూసిన ప్రేక్షకులందరూ సినిమాని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా నవ్వుకుంటున్నారు, ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ అవుతున్నారు. నిన్న సంధ్య థియేటర్ లో షో చూడటానికి వెళ్ళాము. ప్రేక్షకుల స్పందన చూసి చాలా ఆనందం కలిగింది. సినిమా అయిపోయాక అందరూ చాలా బాగుందని ప్రశంసించారు. చూసినవాళ్లు అందరూ సినిమా గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. మీడియా వారు ఈ సినిమాని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని వస్తాయి. ఇది కుటుంబంతో, స్నేహితులతో కలిసి ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం. యూఎస్ నుంచి కూడా కొందరు ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇక్కడ మంచి స్పందన వస్తుందని ప్రశంసించారు. ఇది మానవ సంబంధాల మీద నడిచే సినిమా. మనుషులు పరిస్థితులను ఎలా మారుతారు? వారి నిజ స్వరూపాలు ఎలా బయటకు వస్తాయి? అనేది ఈ సినిమాలో చూపించాం. థియేటర్ కి వెళ్లి చూడండి. ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. నాకు ఈ అవకాశమిచ్చిన నా నిర్మాతలకు, నా టీం అందరికి ధన్యవాదాలు. అలాగే నాకు సపోర్ట్ చేసిన నాగవంశీ గారికి, మారుతి గారికి, ఆహా వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు” అన్నారు.
నటి నవ్య స్వామి మాట్లాడుతూ.. “ముందుగా మా టీం అందరికీ శుభాకాంక్షలు. మేం సినిమా చేసేటప్పుడే ఈ సీన్ కి ప్రేక్షకులు నవ్వుకుంటారు, ఈ సీన్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు అనుకునేవాళ్లం. కానీ మేం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన వస్తోంది. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణమైన ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి సినిమాని థియేటర్ లోనే చూడాలి. ఎందుకంటే కామెడీ సీన్స్ ని నలుగురు కలిసి కూర్చొని చూస్తే ఆ కిక్ వేరే ఉంటుంది. ఫన్ డబుల్ అవుతుంది. నిన్న థియేటర్ కి వెళ్లి ఆడియన్స్ తో కలిసి సినిమా చూశాం. ప్రేక్షకుల స్పందనతోనే ఈ సినిమా హిట్ అని మాకు అర్థమైపోయింది. చూసిన ప్రేక్షకులు అందరికీ సినిమా బాగా నచ్చింది. ఇంకా చూడనివాళ్ళు వెంటనే వెళ్లి సినిమా చూడండి. మీరు ఖచ్చితంగా సినిమా చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.
నటుడు అంజి మాట్లాడుతూ.. “ముందుగా మా డైరెక్టర్ గారికి, నిర్మాతలకు, ఆహా వారికి, మారుతి గారికి, నాగవంశీ గారికి, నా తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా ఖచ్చితంగా ఇంటిల్లిపాది వెళ్లి ప్రశాంతంగా థియేటర్ లో కూర్చొని ఎంజాయ్ చేసి, హ్యాపీగా నవ్వుకొని.. ఇంటికి వెళ్లి కూడా చెప్పుకొని చెప్పుకొని నవ్వుకునే సినిమా. నిన్న కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి సినిమా చూశాను. వాళ్ళు ఇంటికి వెళ్లిన తర్వాత ప్రత్యేకంగా ఫోన్ చేసి, ఇది అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అన్నారు. నిన్న ఉదయం సంధ్య థియేటర్ లో, సాయంత్రం గోకుల్ థియేటర్ లో ఆడియన్స్ తో కలిసి సినిమా చూశాం. అందరూ సినిమా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న ఎవరో యూట్యూబ్ లో ‘హీరోయిన్ కిడ్నాప్ అవుతుంది, దాని చుట్టూ కథ తిరుగుతుంది’ అని రివ్యూ చెప్పారు. దయచేసి సినిమా చూసి, రివ్యూ ఇవ్వండి. మా డైరెక్టర్ గారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో మేం ప్రత్యక్షంగా చూశాం. ఒక సినిమా నిర్మించడం అనేది ఎంత రిస్క్ తో కూడుకున్నదో మీకు తెలిసిందే. సినిమా వెనక ఎందరో కష్టముంటుంది. మీరు సినిమా చూడకుండా రివ్యూ రాయడం వల్ల ఎన్నో జీవితాలు తారుమారవుతాయి, నాశనమవుతాయి. దయచేసి సినిమా చూసి, మీకు ఏదనిపిస్తే అది రివ్యూ రాయండి. కానీ సినిమా చూడకుండా ఏది పడితే అది రాయకండి. మా సినిమా అయితే చూసిన అందరికీ నచ్చుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శకనిర్మాతలకు మరోసారి ధన్యవాదాలు” అన్నారు.
నటి కవిత మాట్లాడుతూ.. “నాకు ఈ సినిమాలో అవకాశమిచ్చిన దర్శకుడు సురేష్ గారికి ధన్యవాదాలు. మేము థియేటర్ కి వెళ్లి సినిమా చూసినప్పుడు ప్రేక్షకులందరూ మొదటి సీన్ నుంచి చివరి వరకు చాలా ఎంజాయ్ చేశారు. మేం నవ్వుకుంటూ, ఎంత సరదాగా సినిమాలో నటించామో.. ప్రేక్షకులు కూడా అంతే సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ సినిమా చూస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాలను అందరూ సపోర్ట్ చేయండి” అన్నారు.
బాలనటి చైత్ర మాట్లాడుతూ.. “సినిమా చాలా బాగుంది. నేను సినిమా చూసి చాలా నవ్వుకున్నాను. మీరు కూడా సినిమా చూసి, మంచిగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.
అనంతరం విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానాలు ఇచ్చారు.
నటీనటులు: నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ, అంజి మామ, చేవెళ్ల రవి, జీవన్
సమర్పణ: ఎస్.నాగవంశీ, మారుతి టీమ్
నిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు ,దర్శకుడు: సురేష్ నరెడ్ల
డీఓపీ: పి.సి. మౌళి
సంగీతం: కళ్యాణి మాలిక్
లిరిక్స్: కాసర్ల శ్యామ్
నేపథ్య సంగీతం: కామ్రాన్
ఎడిటర్: ఎస్.బి. ఉద్ధవ్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీపాల్ మాచర్ల
 
Intiti Ramayanam will make you laugh your lungs out; the response is massive, say makers at the success meet   
Intiti Ramayanam, a family drama blending comedy and mystery – is the latest Telugu film released in theatres this weekend. Starring senior actor VK Naresh, Rahul Ramakrishna, and Navya Swamy in the lead roles, the film, presented by Sithara Entertainments, is set in the rural backdrop of Jammikunta town in interior Telangana and is enjoying a good response in theatres. Speaking during the press meet organised in the city on Saturday commemorating its success, the makers along with cast and crew spoke about the audience’s response post release.
Director Suresh Naredla said, “Intinti Ramayanam is finally out in theatres and we’re very happy to know the positive response from audiences. Viewers are enjoying the comedy and emotional sequences throughout the film. When we visited the Sandhya theatre yesterday in the city, the audience response was massive and overwhelming. Be it the scenes of Bithiri Satti or the police station episode, we get to hear a hilarious talk overall. ‘Intinti Ramayanam’ is spreading through word-of-mouth.”
The director further said that everyone who watched the trailer has been saying that the story is about gold theft. “It is not about the mystery of theft. It’s just an undercurrent theme to make viewers curious. The film is more of human relationships, how people change according to the situations, how their originalities come up with changing times.”
Anji Mama, who played a crucial role in the film stated, “I thank my producers who put a step forward to bring a rural story to public. I also thank Producer Naga Vamsi garu, director Suresh Naredla garu, my co-actors and technicians who worked relentlessly for the film. Not restricted to individuals, it’s a film that a family can enjoy thoroughly in theatres, and also go back home laughing while recalling the incidents.”
Character artiste Kavitha said, “I thank our director Suresh garu for giving me the opportunity in the film. We were thrilled to know the pulse of the audience when we visited the theatres yesterday. ‘Intinti Ramayanam’ was a laugh riot. People enjoyed the film from the word go. I request audiences to support our film.”
Navya Swamy congratulated the entire team for the success of ‘Intinti Ramayanam’. “When we watched the final copy, we felt that we might get a good response for this particular scene or that comedy episode. But contrary to our expectations, the reaction of the audiences was quite tremendous. We all are very happy when we witnessed the people breaking into laughter in the halls. It was more than what we had expected. The kick that one can get watching a comedy film along with a bunch of people in theatres is so massive. The comedy doubles up. You will just laugh your lungs out,” Navya said.
Being a non-native Telugu speaker, Navya Swamy admitted that she had to struggle to catch the diction of the Telangana dialect. “I would take the script along and practice it at home just to get familiar with the words. Since I had done my homework, I didn’t feel any difficulty delivering my dialogues before the screen,” she added.
Talking about the inspiration behind setting up the film in the Telangana backdrop, director Suresh said, “I want ‘Intinti Ramayanam’ to be true to its theme with a village backdrop. A proper indie-kind-of a look. The gold-theft incident is a small one in which the story revolves around in the second half. People in the sleepy village are happy-go-lucky souls who chat and crack jokes leading a happy life. It’s all a closely-knit family, but if they have to face something untoward and unexpected, the genuineness of these people is exposed. I want to show how the characters change their colours according to the circumstances. I wanted to portray those moments.”
Producer Venkat Uppaturi, who made his theatrical debut with ‘Intinti Ramayanam’, said he first partnered with aha to make the film. Later after getting convinced with the final product, he wanted to go for theatrical release. “So it eventually clicked and the response was good. I wish we hear a lot more positive response as the days pass,” he added.
Producer Gopichand Innamuri said, “Irrespective of genres whether it is a commercial film or a comedy-drama, audiences would own it if they relate to the story. ‘Intinti Ramanayam’ is one such story which has all elements packed in one bag.” Surabhi Prabhavathi, Gangavva, Anji Mama, Anji, Chevella Ravi (Bithiri Satti), Jeevan and Stephen Madhu play key roles in the film.
 20220401014915_IMG_0611 GANI9438 GANI9441 GANI9444 GANI9514

Intinti Ramayanam will resonate with everyone, it has a lovely story: Director Maruthi

మట్టి వాసన నచ్చే ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ‘ఇంటింటి రామాయణం’
సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో ఐవీవై ప్రొడక్షన్స్ నిర్మించిన కుటుంబ కథా చిత్రం ‘ఇంటింటి రామాయణం’. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మాతలు. నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. గ్రామీణ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథగా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విలేకర్ల సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న వెంకట్ కి నిర్మాతగా మారమని సూచించాను. అలా మారుతి గారిని వెళ్లి కలవగా.. ఆయన వీరిద్దరికి(నిర్మాతలు వెంకట్, గోపీచంద్) ఇచ్చిన బహుమతి ఈ సినిమా. మొదట దీనిని డిజిటల్ సినిమాగానే ప్రారంభించడం జరిగింది. అవుట్ పుట్ చూసిన తరువాత థియేటర్ లో ఆడుతుందన్న నమ్మకంతో విడుదల చేస్తున్నాం. ఇటీవల వచ్చిన దిల్ రాజు గారి బలగం సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలోనే రూపొందింది. ఈ సినిమా దానికి భిన్నంగా ఉంటుంది. నా స్నేహితులు నిర్మాతలుగా పరిచయమవుతున్న ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
ప్రముఖ దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. “సురేష్ నా దగ్గర కొత్తజంట నుంచి ఐదారు సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశాడు. ఆ తర్వాత దర్శకత్వ ప్రయత్నాలు మొదలుపెట్టిన సురేష్ ఒకసారి కథ రాసుకున్నాను అని చెప్పాడు. కథ వినగానే నాకు చాలా నచ్చింది. ఇది ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ.  ఇతర భాషల్లో విడుదల చేసినా ఈ సినిమాకి ఖచ్చితంగా ఆదరణ లభిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. నాగవంశీ గారితో కలిసి నేను ప్రొడక్షన్ చేసిన మొదటి సినిమా లవర్స్. అప్పటినుంచి నిర్మాతలుగా మా ప్రయాణం మొదలైంది. వెంకట్ గారు సినిమా మీదున్న ప్రేమతో డిస్ట్రిబ్యూషన్ లో చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. లాభనష్టాల గురించి ఆలోచించకుండా సినిమాను ప్రేమించే వెంకట్, గోపీచంద్ లను ఈ సినిమాతో నిర్మాతలుగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. రాహుల్ రామకృష్ణ పేరుని సురేషే సూచించాడు. రాహుల్ కేవలం కథ విని ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. నరేష్ గారు తెలంగాణ మాండలికాన్ని అద్భుతంగా పలికారు. ఆయన ఏ పాత్రనైనా సునాయాసంగా పోషిస్తారు. చిన్న సినిమాలను ఆదరించండి. ముఖ్యంగా ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహించండి. థియేటర్ కి వెళ్లి చూడండి.. ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది” అన్నారు.
చిత్ర దర్శకుడు సురేష్ నరెడ్ల మాట్లాడుతూ.. “ముందుగా నాగవంశీ గారికి, మారుతి గారికి ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని ఆహా ఒరిజినల్ ఫిల్మ్ గా తీశాం. అయితే ఇంతమంచి సినిమాని ప్రేక్షకులకు థియేటర్ అనుభూతి కలిగిస్తే బాగుంటుందని వంశీ గారు, మారుతి గారు సూచించడంతో ఇది సాధ్యమైంది. నరేష్ గారికి, రాహుల్ గారికి, నవ్య గారికి నా సినిమాలో నటించిన నటీనటులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టీమ్ అందరి కృషి వల్ల అనుకున్నదానికంటే తక్కువ రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాం. నా నిర్మాతలు వెంకట్ గారికి, గోపి గారికి.. అలాగే థియేటర్ రిలీజ్ కి ఒప్పుకున్న ఆహా వారికి నా ప్రత్యేక కృతఙ్ఞతలు. ఇది ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా. ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కింది. మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో కలిసి ఈ సినిమా చూడండి.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. లాక్ డౌన్ తర్వాత భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను వెతుక్కొని మరీ చూస్తున్నారు. అలాంటి వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. కళ్యాణి మాలిక్ గారు, కాసర్ల శ్యామ్ గారు చాలా మంచి పాటలు ఇచ్చారు. తెలంగాణ మాండలికంలో కాసర్ల శ్యామ్ గారు ఎంతో సాయం చేశారు” అన్నారు.
ప్రముఖ నటుడు నరేష్ మాట్లాడుతూ.. “ఇది మట్టి కథ. ప్రతి ప్రాంతంలోని మాండలికానికి ఒక తియ్యదనం ఉంటుంది. తెలుగువారిగా మనం అన్ని యాసలను ఇష్టపడతాం. ఇది తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. మట్టి వాసన నచ్చే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమా ఒక ప్రాంతానికి పరిమితమయ్యే సినిమా కాదు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో అలరించింది. ఆ సినిమాతో పోల్చడం కాదు కానీ ఈ సినిమాని కూడా గ్రామీణ నేపథ్యంలో దర్శకుడు అద్భుతంగా రూపొందించాడు. మారుతి గారి సినిమాలంటే నాకిష్టం. భలే భలే మగాడివోయ్ చేసేటప్పుడు సినిమా అంతా నవ్వుతూనే ఉన్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సినిమాకి అలా నవ్వాను. ప్రతి ఇంటికి ఒక రామాయణం ఉంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ రథానికి రెండు చక్రాలులా ఉన్న నాగవంశీ గారికి, మారుతి గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు.
రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. ” నేను ఈ సినిమా చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం సురేష్ గారు రాసిన కథ. రెండో కారణం ఏంటంటే ఈ సినిమాలో భాగమైన వంశీ గారికి, మారుతి గారికి, నరేష్ గారికి, నవ్య గారికి, గంగవ్వకి అందరికీ అభిమానిని. సినిమా చేసిన తర్వాత సురేష్ గారికి కూడా అభిమాని అయ్యాను. నేనొక ఫ్యాన్ బాయ్ గా ఈ సినిమా చేశాను. ప్రాంతాలకు, భేదాలకు భిన్నంగా ఉన్న సిసలైన కల్మషం లేని సినిమా ఇది. మన మనస్తత్వాలను, మన మనోభావాలను చాలా అలవోకగా, చాలా సులభంగా చూపిస్తూ మా నుంచి మంచి మంచి నటనను రాబట్టుకున్నారు దర్శకుడు. నాకు ఈ అవకాశమిచ్చిన నాగవంశీ గారికి, మారుతి గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు.
నటి నవ్యస్వామి మాట్లాడుతూ.. “చాలా చాలా సంతోషంగా ఉంది. కల నిజమైన సమయం ఇది. టెలివిజన్ లో చేస్తున్నప్పుడు సినిమాలు చేయాలి అనుకునేదానిని. ఇక టెలివిజన్ లో చేసింది చాలు, సినిమాలు చేద్దాం అనుకున్న సమయంలో ఇంటింటి రామాయణం అవకాశం వచ్చింది. ఇంతమంచి సినిమాలో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నాగవంశీ గారికి, మారుతి గారికి కృతఙ్ఞతలు. నన్ను నమ్మి నాకు ఈ అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. లెజెండరీ యాక్టర్ నరేష్ గారితో కలిసి నటించడం గర్వంగా ఉంది. రాహుల్ గారు, గంగవ్వ, అంజి గారు అందరితో కలిసి పనిచేయడం సరదాగా కుటుంబంతో గడిపినట్లు అనిపించింది” అన్నారు.
నిర్మాతలు వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి మాట్లాడుతూ ఈ ప్రయాణంలో తమకు మద్దతుగా నిలిచిన నాగవంశీ గారికి, మారుతి గారికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగవ్వ, అంజి మామ తదితరులు పాల్గొన్నారు.
నటీనటులు- నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ, అంజి మామ, చేవెళ్ల రవి, జీవన్
సమర్పణ: ఎస్.నాగవంశీ, మారుతి టీమ్
నిర్మాతలు- వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు ,దర్శకుడు- సురేష్ నరెడ్ల
డీవోపీ- పి.సి. మౌళి
సంగీతం- కళ్యాణి మాలిక్
లిరిక్స్ – కాసర్ల శ్యామ్
నేపథ్య సంగీతం- కామ్రాన్
ఎడిటర్ – ఎస్.బి. ఉద్ధవ్
ఆర్ట్ డైరెక్టర్ – శ్రీపాల్ మాచర్ల
పీఆర్ఓ – లక్ష్మీవేణుగోపాల్
 
*Intinti Ramayanam is a pristine film on Telangana culture presented in a beautiful way. This will be a rollercoaster ride: Rahul Ramakrishna* 
 
Intinti Ramayanam will resonate with everyone, it has a lovely story: Director Maruthi
The highly anticipated Telugu movie, Intinti Ramayanam, is set to hit the screens soon, much to the excitement of Telugu cinema fans across the world. Produced by Venkat Upputuri and Gopi Chand Innamuri under IVY Productions, the film is presented by Suryadevara Naga Vamsi and Maruthi Team. Initinti Ramayanam is written and directed by Suresh Naredla and is a genuine family drama with a perfect blend of entertainment and emotions.
With an impressive cast that includes Rahul Ramakrishna, Navya Swamy, Naresh Vijaya Krishna,
Gangavva, Surabhi Prabhavathi, Anji Mama and others, Intinti Ramayanam promises to be a cinematic treat for the audience, with its gripping storyline, beautiful visuals, and soulful music – composed by Kalyani Malik. The team behind the movie is confident that it will resonate with viewers of all ages and backgrounds and leave a lasting impact on them.
Gangavva called Rahul, Navya, and whole team as her family. She said, “Intinti Ramayanam is a family entertainer that tugs at your heartstrings. I request everyone to come to theatres and watch this film.”
Anji Mama exclaimed that Intinti Ramayanam is a wonderful project carved to perfection by director Suresh Naredla. He said, “I was tensed a little at the beginning as I transitioned from a small screen to big screen work. Naresh and other cast supported me a lot. The movie with Telangana nativity got me into tears and it will click with the audience very well.”
Producers Venkat Upputuri and Gopi Chand Indumuri thanked Vamshi and Maruti for all the help and support.
Director Suresh Naredla said, “Intinti Ramaynam started as aha original film and after looking at the output, Vamsi sir said this film needs a theatrical experience. I thank Rahul, Navya, Naresh and all my artists. They made me forget my tension. I was sceptical if I can complete the shoot in 45 days as planned, but my team struggled to make it happen. Aha team supported me to take the film to big screens. Intinti Ramayanam is a unique point that must be watched with whole families. This will be a treat for cinema lovers. Thanks to music director Kalyani Malik and lyricist Kasarla Shyam.”
Naresh Vijaya Krishna said, “There are many films on rural backdrop. This film walks an extra mile by bringing Telangana culture to the fore. In today’s world, there are no barriers for the reach of cinema. Suresh did a great job with IR. I am a great fan of Maruthi, and I laugh all through his films. The same happened with IR, we could laugh through all the film.”
Navya Swamy called this a dream come true. She remarked, “This is a perfect gateway for me to enter into movies. Thanks to everyone and especially director Suresh, his storytelling is fabulous. I thoroughly enjoyed the film and had a lot of fun on sets.”
Rahul Ramakrishna called out two reasons to do this film – the story and the fanboy moment working with all the actors. He said, “I did the movie as a fanboy. Intinti Ramayanam is a pristine film presented in a beautiful way. I thank Vamsi and Maruthi for giving me this opportunity.”
S Naga Vamsi said, “We planned to release it on aha initially, but after looking at the output wanted to go for theatrical release. This launches my two good friends as producers and hope they taste success with this film.”
Maruthi asked everyone to support small films. He said, “Suresh worked as an associate from the days of Kotha Janta. Once he came to me with a story, and I got excited with the story. Then I felt the story will resonate with everyone. It revolves around a miscommunication and how it created a rift in the family. I am feeling happy to launch Venkat and Gopi as producers. It was quite a challenge to rope in the star cast, and everyone fitted well into the characters. I request you to watch the film on big screen, and encourage small films.”

GANI8638 GANI8666