‘Agnyaathavaasi’ audio launch

19 December 2017
Hyderabad

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `అజ్ఞాతవాసి`. శ్రీమ‌తి మ‌మ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టించారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా..

నేను నిరాశ, నిస్స‌హృల్లో ఉన్న‌ప్పుడు నా హితులు, స‌న్నిహితులు, స్నేహితులు ఎవ‌రు నాతో నిల‌బ‌డ‌లేదు.
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ 
మాట్లాడుతూ – “అభిమానించే ప్ర‌తి ఒక్క‌ర్ని గుండెల్లో పెట్టుకోవాలనేంత హృద‌య‌ముంది కానీ శ‌రీరం చిన్న‌దే. నేను సినిమాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు ఇంత అభిమానాన్ని సంపాదిస్తాన‌ని ఏనాడు అనుకోలేదు. నా వ‌ల్ల స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే చిన్న పని చేస్తే చాలున‌ని చిన్న‌ప్ప‌ట్నుంచి అనుకునేవాడిని. సినిమాల ద్వారా అంద‌రికీ చేరువ‌య్యాను. నావ‌ల్ల వీలైనంత మంచిని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ముంద‌కు తీసుకెళ్ల‌డానికి ఫ్లాట్‌పాం ఇచ్చిన సినీ క‌ళామ‌త‌ల్లికి నా పాదాబివంద‌నం. ఎన్ని సినిమాలు చేస్తావ‌ని నేను సినిమాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు అడిగితే ప‌ది, ప‌న్నెండు సినిమాలు మాత్ర‌మే చేయ‌గ‌ల‌న‌ని అనిపించింది. ఖుషీ త‌ర్వాత ఐదారు సినిమాలు చేసి మానేయాల‌ని అనుకున్నాను. దానికి కార‌ణం, నాకు దేశం చాలా గొప్ప‌ది. కానీ ప్రేక్ష‌కుల ప్రేమ ప‌న్నెండు కాదు, పాతిక సినిమాలు చేసేలా ప్రోత్స‌హించింది. నేను ఓట‌మికి ఎప్పుడూ భ‌య‌ప‌డ‌లేదు. అలాగే గెలుపుకు కూడా పొంగిపోలేదు. మ‌నం చేసే ప‌ని ఎప్పుడూ మ‌న‌కు అసూయ ద్వేషాల‌ను ఇస్తుంది. ఇలాంటి అసూయ ద్వేషాల మ‌ధ్య సినిమాలు చేయాలా అని ఆలోచించేవాడిని. అలాంటి సమ‌యంలో జానీ సినిమా ఫెయిల్ అయిన త‌ర్వాత‌, నాకేం అనిపించ‌లేదు. కానీ నా చుట్టు ప‌క్క‌ల వారికి అలాంటి ఓట‌ములతో త‌ల‌కొట్టేసినట్టు ఫీల‌య్యారు. దాంతో నాకు వైరాగ్యం వ‌చ్చింది. దాని వ‌ల్ల నాకు నేనుగా ఓ గోడ క‌ట్టేసుకున్నాను. కానీ ద‌గ్గ‌రి వాళ్ల‌తో స‌హా నేను చేయూత‌నిచ్చిన వారు నాకు అండ‌గా ఎప్పుడూ నిల‌బ‌డ‌లేదు. కానీ అభిమానులు అండ‌గా నిల‌బ‌డ్డారు. అభిమానుల ప్రేమ‌, అభిమానమే కార‌ణం. అటువంటి అభిమానుల కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటుంది. భారత‌దేశ జెండా అంటే నాకు ఎంతో ఇష్టం. ఆ జెండాను చూసిన‌ప్పుడ‌ల్లా నా గుండె ఉప్పొగుతుంది. ఆ జెండా కోస‌మే నేను రాజ‌కీయాల్లోకి వెళ్లానే త‌ప్ప వేరే ఉద్దేశం లేదు. నా అంతిమ ల‌క్ష్యం..శ‌క్తి, వ‌య‌సు ఉండ‌గానే స‌మాజానికి ఎంతో కొంత ఉప‌యోగ‌ప‌డాలి. నేను కాలం తాలూకా శ‌క్తిని బాగా న‌మ్ముతాను. నేను నిమిత్త‌మాత్రుడ్ని అని నాకు తెలుసు. నేను నిరాశ, నిస్స‌హృల్లో ఉన్న‌ప్పుడు నా హితులు, స‌న్నిహితులు, స్నేహితులు ఎవ‌రు నాతో నిల‌బ‌డ‌లేదు. అలాంటి స‌మ‌యంలో ఎప్పుడో గోకులంలో సీత స‌మ‌యంలో అసిస్టెంట్ రైట‌ర్‌గా ఉన్న‌త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అండ‌గా నిల‌బ‌డ్డాడు. సినిమా స‌క్సెస్ స‌మ‌యంలో, గెలుపులో మ‌న చుట్టూ మ‌నుషులుంటారు. కానీ ఓట‌మి స‌మ‌యంలోఎవ‌రూ మ‌న ప‌క్క‌నుండ‌రు. కానీ అభిమానులు న‌న్నెప్పుడూ విడిచిపెట్ట‌లేదు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో నేను చేసిన జ‌ల్సా, స‌క్సెస్‌ను నేను గుర్తించ‌డానికి నాకు నాలుగేళ్లు ప‌ట్టింది. త్రివిక్ర‌మ్ మీకు స‌ల‌హాలిస్తార‌ని చాలా మంది అంటుంటారు. మేం దిగువ మ‌ధ్య త‌ర‌గతి కుటుంబాల నుండి ఇద్ద‌రం వ‌చ్చాం. నేను లేక‌పోతే ఆయ‌న లేరా? న‌్యూక్లియ‌ర్ సైన్స్ చదువుకున్న వ్య‌క్తి. గొప్ప ర‌చ‌యిత‌. నాలాంటి వాడి అవ‌స‌రం ఆయ‌న‌కేముంది. ఆయ‌న‌లాంటి సృజ‌నాత్మ‌క శ‌క్తి ఉన్న వ్య‌క్తికి హీరోలెవ‌రైనా దొరుకుతారు. కానీ ఇద్ద‌రినీ క‌లిపింది సినిమాయే. మా ఇద్ద‌రికీ సినిమా అంటే మోక‌రిల్లేంత గౌర‌వం ఉంది. ఇలాంటి భావ‌జాల‌మే మ‌మ్మ‌ల్ని ద‌గ్గ‌ర చేసింది. నాకు బ‌లంగా నిల‌బ‌డ్డ వ్య‌క్తి. ఇక ఈ సినిమా విషయానికి వ‌స్తే మంచి సినిమాను ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా చేశారు. సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ణికండ‌న్, ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌కాష్ వంటి టెక్నిషియ‌న్స్ ప‌నిచేశారు. నాపై త‌క్కువ పెట్టుబ‌డి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలనుకుంటారు. డిస్ట్రిబ్యూట‌ర్‌కు అండ‌గా నిర్మాత‌లు నిల‌బ‌డ‌టం లేదు. ఇలాంటి త‌రుణంలో పాత కాల‌పు విలువ‌ల‌ను తీసుకొచ్చిన వ్య‌క్తి రాధాకృష్ణ‌గారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు థాంక్స్ చెబుతున్నాను. నాకు అనిరుధ్ ఇష్ట‌మైన సంగీత ద‌ర్శ‌కుడు. ఆయ‌న కొల‌వెరీ పాట వినేవాడిని. సినిమాల్లో నేను డ్యాన్స్ చేయ‌క‌పోవ‌చ్చునేమో కానీ, ఒక్క‌డ్నే ఉంటే పాట విని ఊగుతుంటాను. మైకేల్ జాక్స‌న్ త‌ర్వాత అంత ఇష్ట‌మైన మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌. ఆది గురించి చెప్పాలంటే..ఆది నాకు చిన్న‌ప్ప‌టి నుండి మంచి ప‌రిచ‌యం. త‌న‌తో ప‌నిచేయ‌డం మంచి అనుభ‌వం. న‌ర్రా, రావుర‌మేష్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, బొమ‌న్ ఇరానీ, రావు ర‌మేష్ స‌హా అంద‌రికీ థాంక్స్‌. కీర్తి సురేష్‌, అను ఇమాన్యుయేల్ ఈ సినిమా కోసం స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. వారి సిన్సియారిటీకి నా థాంక్స్‌“ అన్నారు.

ఈ సినిమాలో క‌ల్యాణ్‌గారి న‌ట విశ్వ‌రూపం చూస్తారు.
త్రివిక్ర‌మ్ శ్రీనివాస
్ మాట్లాడుతూ – “ఎంద‌రో మ‌హానుభావులు అంద‌రికీ వంద‌నాలు. అందులో కొంద‌రు ఈ స్టేజ్‌పై ఉన్నారు. వారి గురించి మాట్లాడుకోవాలి. సినిమా త‌ప్ప మ‌రేమీ తెలియ‌ని వ్యక్తి, మా సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ణికండ‌న్‌గారు. ఆయ‌న‌కు కెమెరాయే ప్ర‌పంచం. అంత గొప్ప వ్య‌క్తితో ప‌నిచేశాను. ఆయ‌న్నుండి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. నేను కొద్దిగా చెబితే, ఆయ‌నెంతో తెర‌పై చూపించారు. ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌కాష్‌గారు అఆతో నాకు ప‌రిచ‌యం అయ్యారు. ఆయ‌న తాలూకా విశ్వ‌రూపాన్ని ఈ సినిమాలో చూపించారు. అఆ సినిమాకు నేను, అనిరుధ్ ర‌విచంద్ర‌న్ క‌లిసి ప‌నిచేయాల‌నుకున్నాం. కానీ కుద‌ర‌లేదు. త‌ర్వాత సినిమా త‌ప్ప‌కుండా చేస్తాన‌ని అన్నారు. అన్న‌ట్లుగానే ఈ సినిమాకు అడ‌గ్గానే ఒప్పుకుని, అడిగిన‌ప్పుడ‌ల్లా హైద‌రాబాద్ వ‌చ్చి మ్యూజిక్ చేశారు. త‌న ద‌గ్గ‌ర భ‌యం లేక పోవ‌డాన్ని నేర్చుకున్నాను. అలాగే ఇష్ట‌మైన న‌టుల్లో ఒక‌రైన బొమ‌న్ ఇరానీ ఒక‌రు. ఆయ‌న న‌డిచే ఫిలిం లైబ్ర‌రీ. నేను అసూయ ప‌డే రైట‌ర్ కూడా ఆయ‌న‌లో ఉన్నారు. నేను ఇంకా బాగా రాయ‌డానికి ఇన్‌స్పిరేష‌న్ ఇచ్చారు. త‌నికెళ్ల భ‌ర‌ణిగారు, నాకు పెద్ద‌న్న‌లాంటివారు. ముర‌ళీశ‌ర్మ‌గారు నేను అడ‌గ్గానే ప‌గ‌లు ఈ సినిమా కోసం ప‌నిచేసి, రాత్రి ముంబైలో మ‌రో సినిమా చేసేవారు. ప‌నిని ఎంత ఆనందంగా చేయాలో ఆయ‌న్నుండి నేర్చుకున్నాను. నాకు ఇష్ట‌మైన న‌టుల్లో ఎస్‌.వి.రంగారావుగారు ఒక‌రు. త‌ర్వాత సావిత్రిగారు. వారిద్ద‌రి త‌ర్వాత నాకు రావుగోపాల‌రావుగారంటే ఎంతో ఇష్టం. ఆయ‌న‌తో ప‌నిచేయలేక‌పోయాను కానీ, ఆయ‌న అబ్బాయి రావు ర‌మేష్‌తో ప‌నిచేసే అవ‌కాశం క‌లిగింది. నాది, రావు ర‌మేష్ ప్ర‌యాణం ఒకేసారి మొద‌లైంది. సంస్కారం, సంస్కృతం అనే విష‌యాల‌ను నేర్చుకున్నాను. ఖుష్బూగారు ఎంతో మంచి పాత్ర చేశారు. ఆమెను దృష్టిలో పెట్టుకునే క్యారెక్ట‌ర్ రాసుకున్నాను. కీర్తి, అను ఇమాన్యుయేల్ ఇద్ద‌రూ త‌మ పాత్ర‌కు తామే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. వారిద్ద‌రి నుండి క్ర‌మ‌శిక్ష‌ణ‌ను నేర్చుకున్నాను. చిన‌బాబుగారు వెన్నెముక‌లా సినిమాకు అండ‌గా నిల‌బ‌డ్డారు. నేను రూపాయి ఖ‌ర్చు పెడ‌దామంటే, రూపాయ‌న్న‌ర ఖ‌ర్చు పెడ‌దామ‌నే రాధాకృష్ణగారు ఎంతో బ‌లంగా నా వెనుకుండి ప్రోత్స‌హించారు. ఇక పి.డి.ప్ర‌సాద్‌గారు, నాగ‌వంశీగారు రథ చక్రాల్లా ప‌గ‌ల‌న‌క‌, రాత్ర‌న‌క‌ ఈ సినిమా కోసం ప‌నిచేశారు. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిగారు, భాస్క‌ర‌భట్ల‌, శ్రీమ‌ణి ఎంతో మంచి సాహిత్యాన్ని అందించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారికి ఫోన్‌లో రెండు నిమిషాలు మాత్ర‌మే ఈ క‌థ‌ను చెప్పాను. చాలా బావుంది. ఈ సినిమా మ‌నం చేస్తున్నామ‌ని అన్నారు. ఈ సినిమాలో క‌ల్యాణ్‌గారి న‌ట విశ్వ‌రూపం చూస్తారు. ఆయ‌నతో మ‌రిన్ని సినిమాలు క‌లిసి ప‌నిచేయాల‌ని, మీరంద‌రూ కోరుకునే ఉన్న‌త‌స్థితికి ఆయ‌న చేరుకోవాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని ప్రార్థిస్తున్నాను. తెలుగు సినిమాను శిఖ‌రంపై నిల‌బెట్టిన మ‌ల్లీశ్వ‌రి బి.ఎన్‌.రెడ్డి నుండి బాహుబ‌లి రాజ‌మౌళి వ‌ర‌కు అంద‌రూ మ‌హానుభావులే. గాలి పెంచ‌ల న‌ర‌సింహారావు, సుశ‌ర్ల ద‌క్షిణామూర్తి నుండి అనిరుధ్ వ‌ర‌కు తెలుగు పాట‌ల‌ను మ‌న ఇళ్లల్లోకి తీసుకొచ్చిన మ‌హానుభావులెంద‌రో. మార్క‌స్ బాట్లే. విన్నెంట్ నుండి మ‌ణికండ‌న్ వ‌ర‌కు అంద‌రూ మ‌హానుభావులే. ఎస్.వి.రంగారావు నుండి బొమ‌న్ ఇరాని, ముర‌ళీశ‌ర్మ‌, రావు ర‌మేష్ వ‌ర‌కు అంద‌రూ మ‌హానుభావులే. సావిత్రి, జ‌మున‌, కాంచ‌న, క‌న్నాంబ నుండి కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్ వ‌ర‌కు అంద‌రూ మ‌హానుభావులే. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంద‌రో మ‌హానుభావులు అంద‌రికీ నా వంద‌నాలు“ అన్నారు.

ఖుష్బూ మాట్లాడుతూ – “ఇంత‌కు ముందు నా తెలుగు చిత్రం `స్టాలిన్‌`. త‌ర్వాత ఎన్నో ఆఫ‌ర్లు వ‌చ్చినా, మంచి ప్రాముఖ్య‌త ఉన్న రోల్ వ‌చ్చిన‌ప్పుడే చేయాల‌ని ఏ సినిమాను అంగీక‌రించ‌లేదు. త్రివిక్ర‌మ్‌గారు ఈ రోల్‌ను నేను చేయాల‌న‌గానే కాద‌న‌లేని ప‌రిస్థితి. ప‌దేళ్ల త‌ర్వాత తెలుగులో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వ‌డం గొప్ప అవకాశం. ప‌వ‌న్ డౌన్ టు ఎర్త్ ప‌ర్స‌న్‌. ఇలాంటి సినిమాలో అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. అనిరుధ్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడు. జ‌న‌వ‌రి 10న బిగ్గెస్ట్ హిట్ కొట్ట‌బోతున్నాం“ అన్నారు.

రావు ర‌మేష్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో న‌టించ‌డం గొప్ప అనుభూతి. ఈ అవ‌కాశం ఇచ్చిన త్రివిక్ర‌మ్‌గారికి, ప‌వ‌న్‌గారికి థాంక్స్‌. గొప్ప టీమ్‌తో ప‌నిచేశాను“ అన్నారు.

బొమ‌న్ ఇరానీ మాట్లాడుతూ – “నా తొలి తెలుగు సినిమా అత్తారింటికి దారేది. ఆ సినిమాకు నాకు మ‌ర‌చిపోలేని జ‌ర్నీ. సినిమా క‌థ చెప్ప‌డానికి నా వ‌ద్ద‌కు వ‌చ్చిన వ్య‌క్తితో హీరో ఎవ‌రు, డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నే ప్ర‌శ్న‌లు మాత్ర‌మే వేశాను. ప‌వ‌న్‌క‌ల్యాన్‌, త్రివిక్ర‌మ్‌గార‌ని చెప్ప‌గానే నేను ఏం మాట్లాడ‌కుండా సినిమా చేయ‌డానికి అంగీక‌రించాను. హైద‌రాబాద్ న‌న్నున‌టుడిగా ద‌త్తత తీస‌కుంద‌ని అర్థ‌మైంది. ఇదే టీంతో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నాను“ అన్నారు.

రావు ర‌మేష్ మాట్లాడుతూ – “నితిన్‌గారు ప‌వ‌న్‌గారికి, త్రివిక్ర‌మ్‌గారికి ఎంత పెద్ద అభిమానో తెలుసు. ఆయ‌నవిషెష్ చెప్ప‌మ‌ని చెప్పారు. ఈ సినిమా చేసినందుకు, అవ‌కాశం ఇచ్చినందుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ గారికి థాంక్స్‌“ అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ – “జ‌న‌వ‌రి 10న తెలుగు సినిమాకు రాబోతున్న తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అజ్జాత‌వాసి. క‌ల్యాణ్‌గారు ఏం చేసినా మ‌న‌కు న‌చ్చేస్తుంది. కల్యాణ్‌గారికి త్రివిక్ర‌మ్ గారు తోడై జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు చేశారు. తెలుగు సినిమా రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డానికి నిర్మాత చిన‌బాబుగారు రెడీ అయిపోయారు. జ‌న‌వ‌రి 10 కోసం అంద‌రం వెయిట్ చేస్తున్నాం. బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఖాయం“ అన్నారు.

సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి మాట్లాడుతూ – “ప‌వ‌న్ పేరులో చిరుగాలి ఉన్నా, ఆయ‌నో ప్ర‌భంజ‌నం. ఇది క‌ల్లోలం సృష్టించే ప్ర‌భంజ‌నం కాదు, క‌ల్యాణం జ‌రిపించే ఆనంద‌క‌ర‌ ప్ర‌భంజ‌నం. ఇది త్రివిక్ర‌ముడు సంధించిన క‌ల్యాణాస్త్రం, ప‌వ‌నాస్త్రం. ఇది క‌లెక్ష‌న్స్ సునామీని సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం ద్వారా అనిరుధ్ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. మిగ‌తా పాట‌ల‌ను ర‌చించిన భాస్క‌ర‌భ‌ట్ల‌, శ్రీమ‌ణిల‌కు అభినంద‌నలు“ అన్నారు.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ – “ప‌వ‌న్‌సార్‌తో నేను షూటింగ్‌లో పెద్ద‌గా మాట్లాడ‌లేదు. నేను ఆయ‌న‌కు పెద్ద ఫ్యాన్‌ని. అంద‌రూ ఆయ‌న సినిమాల్లో వ‌చ్చిన త‌ర్వాత ఫ్యాన్స్ అయితే..నేను చిన్న‌ప్ప‌టి నుండే ఆయ‌న‌కు ఫ్యాన్‌ని. ఆయ‌న్ను దూరం నుండే చూడాల‌నుకునేవాడిని. అటువంటిది ఈ సినిమాలో ఆయ‌న‌తో క‌లిసి న‌టించే అవకాశం వ‌చ్చింది. ఆ అవ‌కాశాన్ని క‌లిగించిన త్రివిక్ర‌మ్‌గారికి థాంక్స్. చాలా పెద్ద కాస్ట్ అండ్ క్రూతో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చింది. జ‌న‌వ‌రి 10న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారిని ఇంకా ప‌వ‌ర్‌ఫుల్‌గా, యంగ్‌గా తెర‌పై చూడ‌బోతున్నారు“ అన్నారు.

అను ఇమాన్యుయేల్ మాట్లాడుతూ – “ఈ సినిమా లైఫ్‌లో జ‌రిగిన గొప్ప విష‌యం. చాలా ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తుల‌తో క‌లిసి పనిచేశాను. ప‌వ‌ర్‌స్టార్ ప‌క్క‌న నిల‌బ‌డ‌ట‌మే గొప్ప విష‌య‌మే అయితే, ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం ఆశీర్వాదం అని చెప్పాలి. ఒక గొప్ప అనుభూతి. త్రివిక్ర‌మ్‌గారు నా పేవ‌రేట్ డైరెక్ట‌ర్‌. ఆయ‌న గురించి ఎంత చెప్పిన త‌క్కువే. ఆయ‌న‌తో మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌నిచేయాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా చేసే స‌మ‌యంలో త్రివిక్ర‌మ్‌గారు ఎంతో స‌హ‌కారాన్ని అందించారు. నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా గ్రాండ్ విజ‌న్‌తో సినిమాను నిర్మించారు. అనిరుధ్‌..అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ అందించారు. త‌న‌కు తెలుగులో మ‌రిన్ని మంచి అవ‌కాశాలు రావాలి“ అన్నారు.

కీర్తి సురేష్ మాట్లాడుతూ – “నిర్మాత చిన‌బాబుగారికి థాంక్స్‌. అలాగే త్రివిక్ర‌మ్‌గారికి థాంక్స్‌. చాలా కూలెస్ట్ డైరెక్ట‌ర్‌. ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ గారి కాంబినేష‌న్‌లో నేను క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చారు. అనిరుధ్ వాయిస్ మ్యాజిక్‌. త‌న మ్యూజిక్‌లో నేను చేసిన మూడో సినిమా. సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ణికంఠ‌న్‌గారు ప్ర‌తి ఫ్రేమ్‌ను పెయింటింగ్‌లా తెర‌కెక్కించారు. క‌ల్యాణ్‌గారితో క‌లిసి ప‌నిచేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను“ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో అనిరుధ్‌, భ‌గ‌వాన్, పుల్లారావు, మ‌ణికంఠ‌న్‌, ఎ.ఎస్‌.ప్ర‌కాష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.F30A4927ANI_6546 ANI_6537 ANI_6495 ANI_6481 ANI_6479 ANI_6441 KVR_3381 KVR_3379 KVR_3342 KVR_3338 KVR_3322 KVR_3288 KVR_3275 KVR_3274 KVR_3265 KVR_3176 KVR_3141 KVR_3135 KVR_3123 KVR_3078 JF0A7885 JF0A7870 JF0A7832 JF0A7769 JF0A7696 JF0A7679 JF0A7666 JF0A7660 JF0A7633 JF0A7571 JF0A7534 JF0A7530 JF0A7519 JF0A7518 JF0A7514 JF0A7490 F30A5196 F30A5190 F30A5188 F30A5167 F30A5142 F30A5114 F30A4927 DSC_1546 DSC_1540 DSC_1508 DSC_1489 DSC_1457 DSC_1449 DSC_1423 DSC_1360 DSC_1358 DSC_1318 DSC_1237 DSC_1209 DSC_1198 DSC_1183 DSC_1178 DSC_1172 DSC_1150 F30A5096 F30A5095 F30A5079 F30A5076 F30A5067 F30A5062

‘Agnyaathavaasi’ still & poster

pspk 25 firstlook HD pspk 25 firstlook pic

Nc 16 sithar entertainments production no 3 launched

Leading production house Sithara Entertainments has launched its Production No 3 today featuring Naga Chaitanya Akkineni & Anu Emmanuel in lead roles, Directed by Maruthi Dasari. The film has launched today morning 11:09AM at Ramanaidu Studios with a formal pooja.
Regular shoot of the film will commence from January 5th 2018 as said by Director Maruthi at the Launch.
 నాగ చైతన్య అక్కినేని , దర్శకుడు మారుతి ల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ ప్రొడక్షన్ నంబర్ 3 ప్రారంభం 

 

 నాగ చైతన్య అక్కినేని , దర్శకుడు మారుతి ల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ ప్రొడక్షన్ నంబర్ 3 ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో  లో ప్రారంభం అయింది. నాగ చైతన్య అక్కినేని సరసన ‘అను ఇమ్మాన్యు యేల్’ నాయికగా నటిస్తున్నారు. ఈరోజు మంచిరోజు కావటం తో ఈ చిత్రం పూజ కార్య క్రమాలు నిర్వహించటం జరిగింది. జనవరి 5 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని   ఈ చిత్రానికి సంభందించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. దర్శకుడు మారుతి.  
 _DSC5063 _DSC5291 JES_9001 _DSC5089 _DSC5092 _DSC5134 _DSC5142 copy _DSC5175 copy _DSC5181 _DSC5230 _DSC5234 _DSC5244 _DSC5264 DPP_0847 DPP_0850 JES_9005 JES_9011 SRI_3540

sharwa 27 sithara entertainments production no 4 launched

శర్వానంద్, కాజల్, నిత్యామీనన్’ ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో 

               సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 4 ప్రారంభం 
 
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, నిత్యామీనన్ ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న నూతన చిత్రం ఈ రోజు  (27 – 11 – 17 )   ఉదయం హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియో లో వైభవంగా ప్రారంభమయింది.  
కథానాయకుడు శర్వానంద్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్ని వేశానికి  ప్రముఖ కథానాయకుడు నాగ చైతన్య అక్కినేని క్లాప్ నివ్వగా, కెమెరా స్విచ్ ఆన్ ప్రముఖ దర్శకుడు మారుతి చేశారు. చిత్రం స్క్రిప్ట్ ను హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ చిత్ర దర్శక నిర్మాతలకు అందజేశారు.ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, జెమిని కిరణ్, దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 డిసెంబర్ నెలలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. 
ఈ చిత్రానికి సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్,
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ 
కధ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుధీర్ వర్మ 
sharwanand-sudheervarma-kajal aggarwal-nitya menen combination film under Sithara Entertainments – Production No 4 -  launched
Sithara Entertainments has launched its production No 4 in the direction of Sudheer Varma today morning at Ramanaidu Studios. Camera switched on by Maruthi, Clap by Naga Chaitanya & Script handed over to Sudheer Varma by S. Radha Krishna(chinababu) garu. B.V.S.N. Prasad, Ani Ravipudi, Maruthi, Gemini Kiran graced the event along with the Team. The film features Sharwanand, Kajal Aggarwal & Nithya Menen in a lead roles, Directed by Sudheer Varma & Produced by Naga Vamsi. Prashant Pillai is composing the music & Cinematography is handling by Divakar Mani.
 
Regular shooting of the film will commence from December
Cast & Crew:
Starring: Sharwanand, Kajal Aggarwal, Nithya Menen
Music: Prashant Pillai
Dop: Divakar Mani
Production designer: Raveendar
 
Presents: PDV PRASAD
 
Producer: Suryadevara Nagavamsi
 
Story, Screenplay & Direction: Sudheer Varma
 
Banner: Sithara Entertainments
 DSC_0207 DSC_0238 DSC_0080 DSC_0179 DSC_0186 DSC_0189 DSC_0193 DSC_0199 DSC_0203 DSC_0214 DSC_0220 DSC_0226 DSC_0249 DSC_0253 DSC_0258 DSC_0265 DSC_0281 DSC_0310 DSC_0339 JVR_8241 JVR_8269 JVR_8285 JVR_8364

nagashowrya Manyam Productions new film launched

నాగ శౌర్య కథానాయకునిగా మన్యం ప్రొడక్షన్స్ నూతన చిత్రం ప్రారంభం 
 
యువ కథానాయకుడు నాగ శౌర్య నూతన చిత్రం నేడు (29-11-17) ఉదయం 10 గంటల 34 నిమిషాలకు సంస్థ కార్యాలయం లో ప్రారంభ మయింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ నిచ్చారు. కెమెరా స్విచ్ ఆన్ ప్రముఖ దర్శకుడు మారుతి చేశారు. అలాగే దర్శకుడు మారుతి , రచయిత కోన వెంకట్ లు చిత్రం స్క్రిప్ట్ ను చిత్ర దర్శక, నిర్మాతలకు అందచేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి, వి.ఐ.ఆనంద్,ఉపేంద్ర లు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. 
 నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ మన్యం ప్రొడక్షన్స్  తమ తొలి  ప్రయత్నం గా  నాగ శౌర్య కథానాయకుడు గా, ఛాయాగ్రాహకుడు సాయి శ్రీరామ్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రం ను  నిర్మిస్తోంది. ‘మేం వయసుకు వచ్చాం, ఆలా ఎలా, సుప్రీం, పిల్ల జమిందార్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రస్తుతం నాగ శౌర్య ’ఛలో ‘ చిత్రాలకు శ్రీరామ్ ఛాయాగ్రాహకునిగా పనిచేశారు. దర్శకుడు సాయి శ్రీరామ్ చెప్పిన కధలోని నవ్యత, చిత్ర కధనం ఎంతగానో నచ్చి ఈ చిత్రం ను నిర్మిస్తున్నట్లు నిర్మాత యం.విజయకుమార్ తెలిపారు. నాగ శౌర్య నటించిన చిత్రాలలో ఈ ప్రేమ కదా చిత్రం నిస్సందేహంగా వైవిధ్యాన్ని సంతరించు కుని ఉంటుందని తెలిపారాయన. చిత్ర నాయిక ఎవరన్నదానితోపాటు ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత యం.విజయకుమార్ తెలిపారు.  2018, జనవరి నెల ప్రథమార్ధం లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని తెలిపారు.  
 
ఈ చిత్రానికి సంగీతం: రధన్, కధ : విద్యాసాగర్ రాజు మాటలు: విశ్వ నేత్ర, డి.ఓ.పి: హరిప్రసాద్ జాస్తి, ఆర్ట్: రామాంజనేయులు, ఎడిటర్: ప్రవీణ్ పూడి
.
నిర్మాత: యం.విజయకుమార్
దర్శకత్వం: సాయి శ్రీరామ్ 
 
Actor Naga Shourya & Popular DOP Sai Sriram as Director has started new film under the banner Manyam Productions today. Anish Krishna (Director), VI Anand(Director), Upendhra (Director) has graced the ceremony while the Camera has switched on by Maruthi, clapped by Kona Venkat  & Script given to Driector Sai Sriram by Kona Venkat & Maruthi Respectively.
Sai Sriram has worked as DOP for many popular films i.e Mem Vayasuku Vacham, Ala Ela, Supreme, Pilla Zamindar, Ekkadiki Pothavu Chinnavada, Chalo in past is now coming as a Director with this film. Radhan is composing the music, Cinematography is handling by Hari Prasad Jasthi, Dialogues written by Viswa Netra & the movie being produced by M. Vijay Kumar under Manyam Productions.
Regular shooting of the film will start from 1st week of January, Heroines of the film will be announced soon.
Cast & Crew:
Manyam Productions – Production No 1
Hero: Naga Shourya
Producer: M. Vijay Kumar
Director: Sai Sriram
Music: Radhan
DOP: Hari Prasad Jasthi
Editor: Praveen Pudi
Art: Ramanjaneyulu
Dialogues: Viswa Netra
Regular Shooting from 1st  week of January.1 2 3 5 6 7 8 9