Oct 9 2023
We thank audiences for a humongous response: Mad team and producer S Naga Vamsi
Oct 9 2023
Oct 8 2023
‘మ్యాడ్’కి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు: చిత్ర బృందం
ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’. సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయయ్యారు. ఈ వినోదాత్మక చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు(అక్టోబర్ 6న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. షో షోకి వసూళ్ళను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “అందరూ కొత్త వాళ్ళు కలిసి చేసిన ప్రయత్నమిది. సినిమా బాగుంది, ఆడియన్స్ కి నచ్చుతుందని నమ్మకంతో.. ఈ సినిమాకి అంత కాన్ఫిడెంట్ గా ప్రమోట్ చేశాము. కొత్త వాళ్ళు నటించిన ఈ సినిమాకి ఇంత మంచి ఓపెనింగ్స్ రావడం సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాలు చేయడానికి మరింత ధైర్యం వచ్చింది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో రాబొయ్యే రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబడుతుంది. మీడియా నుంచి కూడా ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. మీడియా స్పందన పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నాం” అన్నారు.
దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. “ఇది నా మొదటి సినిమా. అందరం యంగ్ స్టర్స్ కలిసి చేశాం. వంశీ అన్న ఒక్కటే మాట చెప్పాడు.. గట్టిగా కొడుతున్నాం. ఆయన అన్నట్టుగానే జరిగింది. పాజిటివ్ టాక్ రావడంతో చాలా సంతోషంగా ఉంది” అన్నారు.
సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. “మా గురించి జనాలు మాట్లాడుకోవడం అనేది మా ఫస్ట్ సక్సెస్. మంచిగా మాట్లాడుకోవడం అనేది మా సెకండ్ సక్సెస్. చాలా హ్యాపీగా ఉంది. వంశీ అన్న ఒక మాట అంటారు. పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటాం, గట్టిగా కొడతాం అని. నిజంగానే గట్టిగా కొట్టాం” అన్నారు.
నార్నే నితిన్ మాట్లాడుతూ.. “సినిమా చాలా బాగా వచ్చింది, బాగా ఆడుతుంది అని ముందే ఊహించాం. కానీ ఈ స్థాయి రెస్పాన్స్ మాత్రం అసలు ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. మాటలు రావడం లేదు. థియేటర్లలో ప్రతి ఒక్కరు సినిమాని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు” అన్నారు.
రామ్ నితిన్ మాట్లాడుతూ.. “నాకింకా కలలో ఉన్నట్లు ఉంది. ఇంతమంచి సినిమాతో పరిచయం అవుతానని అసలు ఊహించలేదు. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఒక గొప్ప సినిమాలో భాగం అయ్యాననే భావన నాలో ఉంది.” అన్నారు.
*MAD is a hilarious film best enjoyed amidst a large, enthusiastic audience: Naga Vamsi*
MAD released today is getting positive response from the audience. The reviews are wonderful. All screenings are witnessing packed houses, and MAD, a crazy campus comedy, is riding high on its success wave. During a post-release press meet, the cast and crew expressed their heartfelt gratitude to the audience for their unwavering support, which has propelled the film to grand success. MAD is presented by Sithara Entertainments in association with Fortune Four Cinemas.
Sangeeth Shobhan, one of the cast members, humbly acknowledged the appreciation, stating, “It’s truly gratifying to hear people talk so positively about our work. We’re sincerely thankful to our audience for their support.”
Director Kalyan Shankar commented, “The movie has resonated with the audience on a deep level. The responses from Prasads, Sreeramulu, and Sudarshan have been nothing short of crazy. Our entire team is youthful, and the atmosphere is pulsating with positivity. The songs in the second half have garnered a fantastic response.”
Naga Vamsi, the producer of the film, shared his thoughts, saying, “I was confident in our project from the start. The idea of offering refunds, which came to us spontaneously, turned out to be a brilliant move. Even though we had a cast of newcomers, our promotional efforts paid off. The paid premieres saw an impressive turnout, and Sudarshan theatre generously contributing around 1 lakh for this new-comers’ film. Cities like Vizag, Kakinada, and Bhimavaram have shown strong numbers. With no major releases in the coming week, we are optimistic about maintaining this momentum.”
He further added, “Kalyan’s narration of the script had me laughing heartily from the beginning, and that’s when I knew we were onto something special. I extend my appreciation to the media for their keen judgment. In the final 10 days leading up to the release, we launched an aggressive promotional campaign, and the results speak for themselves. MAD is a film best enjoyed amidst a large, enthusiastic audience. As a result, we steadily increased the number of screenings, and the college-centric storyline has truly struck a chord with viewers.”
Narne Nithin, another cast member, expressed his contentment, stating, “We are genuinely thrilled with the numbers; it’s a moment of great happiness for us.”
Ram Nithin, who made his debut in this exceptional film, admitted, “It still feels like a dream to me. I never imagined my debut would be in such a fantastic project. I’m at a loss for words.”
Gopika enthusiastically chimed in, “We are absolutely ecstatic and pleasantly surprised by the overwhelming response. Thank you so much for this incredible support.”
Sri Gouri Priya Reddy, summing up the sentiments of the team, noted, “The buzz and enthusiasm surrounding the premieres and morning shows were exceptional. We always had immense confidence in our story, and it has truly exceeded our expectations.”
Oct 8 2023
Oct 3 2023
మ్యాడ్’ చిత్రం.. థియేటర్లలో ఫుల్ నవ్వుల హంగామా ఉంటుంది: సంగీత్ శోభన్, రామ్ నితిన్, గోపికా ఉద్యాన్
యువ నటీనటులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యాన్ ల కామెడీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.
ఈరోజు(అక్టోబర్ 3) ఉదయం ఈ చిత్ర ట్రైలర్ ను మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. వినోదంతో నిండిన ట్రైలర్ తనకు ఎంతగానో నచ్చిందని చెప్పిన ఎన్టీఆర్.. మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
సినిమా విడుదలకు నేపథ్యంలో ప్రధాన నటులు సంగీత్ శోభన్, రామ్ నితిన్, గోపికా ఉద్యన్ మంగళవారం విలేఖర్లతో ముచ్చటించి, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు సంగీత్ శోభన్ తన రాబోయే కామెడీ ఫిల్మ్ ‘మ్యాడ్’ పట్ల ఎంతో ఉత్సహంగా ఉన్నాడు. “నాగ వంశీ గారు మొదట్లో ఒక హాస్యభరితమైన కథ ఉందని నన్ను సంప్రదించారు. కేవలం ఐదు నిమిషాల కథలోనే కాలేజీ వైబ్, కామెడీ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎందుకంటే టాలీవుడ్ లో ఇలాంటి కథ వచ్చి చాలా సంవత్సరాలైంది. ఆ మరుసటి రోజే నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ద్వారా నాకు ఈ ఆఫర్ వచ్చింది.” అని సంగీత్ శోభన్ అన్నారు.
రామ్ నితిన్: యూట్యూబ్ సిరీస్ లతో నా నటనా జీవితాన్ని ప్రారంభించాను. ఆ తర్వాత, హలో వరల్డ్ అనే సిరీస్ చేశాను. అది విడుదలైన రెండు రోజుల్లోనే నాగ వంశీ గారి నుంచి నాకు కాల్ వచ్చింది. ఒక ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ నుండి ఆఫర్ రావడం, స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఓకే చేశాను.
గోపికా ఉద్యన్: నేను మలయాళీని, దుబాయ్‌లో స్థిరపడ్డాను. తెలుగులో మ్యాడ్ సినిమాతో అరంగేట్రం చేస్తున్నాను. ఆసిఫ్ అలీతో మలయాళంలో ఓ ఫీచర్ ఫిల్మ్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మ్యాడ్ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. జూమ్ కాల్ ద్వారా స్క్రిప్ట్ విన్నాను. స్క్రిప్ట్ విన్న వెంటనే ఓకే చేసాను.
మ్యాడ్ సినిమాలో 2007లో వచ్చిన శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ వైబ్స్ కనిపిస్తున్నాయి . సినిమా ఎలా ఉండబోతుంది?
సంగీత్ శోభన్: హ్యాపీ డేస్ విడుదలై 15 ఏళ్లు దాటింది. అది అప్పటి యువత సినిమా. కానీ ఈ సినిమా కామెడీ ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను ఎంజాయ్ చేసే ట్రెండ్ ఈ తరం వారిది. మ్యాడ్ ఈ తరహా కామెడీని కలిగి ఉంటుంది. కాలేజీ సెటప్ సాధారణం. కానీ కామెడీ మాత్రం నేటి ప్రపంచానికి తగ్గట్టుగా కొత్తగా ఉంటుంది. థియేటర్‌లలో ఫుల్ లాఫ్ హంగామా ఉంటుంది.
ఇప్పటికే టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన తన అన్నయ్య సంతోష్ శోభన్ గురించి సంగీత్ మాట్లాడుతూ, “మా అన్న సంతోష్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న స్థితిని సాధించడానికి చాలా కష్టపడ్డాడు. వెబ్‌సిరీస్‌తో అరంగేట్రం చేసిన తర్వాత నేను మీ ముందుకు టైం పట్టింది. నాలాంటి యువ నటులకు ఓటీటీ ఒక వరం. ఆ రోజుల్లో ఎవరైనా నటుడిగా మారాలంటే బిగ్ స్క్రీన్‌కు ప్రత్యామ్నాయం లేదు. కానీ ఇప్పుడు ఓటీటీ అందరికీ సహాయం చేస్తోంది. మా సోదరుడు సాధించిన దాని పట్ల నేను గర్వపడుతున్నాను.”
తన సోదరుడు సంతోష్ బిగ్ స్క్రీన్ పై పరిచయమైనప్పుడు నేను చిన్న పిల్లాడిని అని సంగీత్ అన్నారు. “ప్రభాస్ గారు మా అన్నయ్యను లాంచ్ చేసినప్పుడు నేను చిన్నపిల్లవాడిని. మా నాన్న ప్రభాస్ అన్నతో కలిసి పనిచేసినందున, ఆయన యూవీ క్రియేషన్స్ ద్వారా మాకు సపోర్ట్ గా నిలబడ్డారు. ఆయన మా కుటుంబంతో ఉన్నందుకు సంతోషంగా ఉంది.”
మ్యాడ్ ని జాతి రత్నాలు తో పోల్చుతున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
సంగీత్ మాట్లాడుతూ, “జాతిరత్నాలు చిత్రానికి కేవీ అనుదీప్, మ్యాడ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ సంయుక్తంగా స్క్రిప్ట్ రాసుకున్నారు. అలా ఆ పోలిక వచ్చింది. అలాగే నాగ వంశీ గారు
ఈ సినిమా కూడా జాతి రత్నాలు తరహాలోనే అందరూ చూసి హాయిగా నవ్వుకునేలా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో జాతి రత్నాలతో పోల్చారు. మ్యాడ్ లో అనుదీప్ సరదా పాత్రలో నటించారు. దర్శకుడికి మంచి స్నేహితుడు కాబట్టి ఆ పాత్రలో నటించడానికి అంగీకరించారు.
ప్రేక్షకులను పిచ్చెక్కించే హాస్యం ఉన్నందున ఈ చిత్రానికి మ్యాడ్ అని పేరు పెట్టినట్లు రామ్ నితిన్ తెలిపారు. “మంచి చిత్రానికి మ్యాడ్ అనేది ఒక కాంప్లిమెంట్. అది మ్యాడ్ గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు మనస్ఫూర్తిగా నవ్వే ఏ సినిమా అయినా అది ఆనందాన్ని కలిగిస్తుంది. డిజె టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ స్క్రిప్ట్ విన్న తర్వాత “మ్యాడ్” అని చెప్పాడు. దర్శకుడు మ్యాడ్ అనే టైటిల్ ని అలా తీసుకున్నారు. సినిమాలో పాత్రలన్నీ బాగుంటాయి. పాత్రల మధ్య కెమిస్ట్రీ, ఫ్రెండ్ షిప్ చూడటానికి సరదాగా ఉంటుంది.”
సినిమాలో నటించడం కంటే ప్రేక్షకులను మరింతగా అలరించాలనే కోరిక ఉందని సంగీత్ తెలిపారు. ” కొత్తవారి సినిమాలు చూడటానికి ప్రేక్షకులు అంతగా రారు. మంచి ఎనర్జీని తీసుకొస్తే తప్ప, ముగ్గురు యువకులు నటించిన చిత్రాన్ని తెరపై చూడడానికి ఎవరూ పట్టించుకోరు. కాబట్టి ఆడియన్స్ లో సినిమా పట్ల ఒక ప్రకంపనను సృష్టించడం మా బాధ్యత. కాలేజీ కుర్రాళ్ల సరదాలను చూడటానికి థియేటర్‌లకు రండి. పాత్రలను లోతుగా అర్థం చేసుకోవడానికి దర్శకుడు కళ్యాణ్‌తో నిరంతరం చర్చించాం. అది మాలోని ఉత్తమమైన నటనను బయటకు తీసుకురావడానికి సహాయపడింది.”
గోపికా ఉద్యాన్ తాను రాధ అనే పాత్ర పోషించానని వివరించారు. “సినిమాలో నేను కీలక పాత్ర పోషించాను. రాధ చిన్న టౌన్ నుండి నగరంలోని కాలేజీలో చదువుకోవడానికి వస్తుంది. రాధ మరియు సంగీత్ పోషించిన పాత్ర చిన్ననాటి స్నేహితులు. వారు మొదటిసారి కాలేజీకి వచ్చారు. కళాశాల జీవితంలో వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేది కథలో సారాంశం” అన్నారు. నిర్మాత హారిక గారి గురించి గోపిక మాట్లాడుతూ, “ఆమె కూడా మ్యాడ్ సినిమాతో అరంగేట్రం చేస్తున్నారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే మేమంతా ఒకే ఏజ్ గ్రూప్‌కి చెందినవాళ్లం. నిర్మాతతో కలిసి పనిచేయడం, మాట్లాడటం చాలా బాగుంది. ఆమె ప్రతిరోజూ సెట్స్ కి వచ్చేవారు. ఆమె తాను నిర్మాత అనే ఫీలింగ్ ఎప్పుడూ చూపించేవారు కాదు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ప్రాజెక్ట్‌లు చేస్తారని ఆశిస్తున్నాను.”
కామెడీ జానర్స్‌లో వచ్చే చిత్రాలకు సంగీతం యొక్క ప్రాముఖ్యత గురించి సంగీత్ ప్రత్యేకంగా మాట్లాడాడు. “సంగీతం సినిమాకి ఆత్మ. భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా మేము కళాశాలలో ప్రవేశించే సన్నివేశాలలో సంగీతం అద్భుతం.”
ఈ పాత్రలన్నీ దర్శకుడు కళ్యాణ్ మ్యాడ్ నెస్ తో వచ్చినవేనని రామ్ నితిన్ అన్నారు. “ఆయన సెట్స్‌లో మ్యాడెస్ట్ పర్సన్. కళాశాల సమయంలో అతని వ్యక్తిగత అనుభవాల నుంచి ఈ కథ, సినిమా రూపొందించబడ్డాయి. మ్యాడ్ అనేది లైఫ్ కామెడీలో భాగంగా ఉంటుంది.”
Mad is going to be a slice-of-life comedy in theatres: Sangeeth Shoban, Ram Nithin, Gopika Udyan
Starring actors Narne Nithin, Sangeeth Shobhan, Ram Nithin, Sri Gouri Priya Reddy, Ananathika Sanilkumar, Gopikaa Udyan, comedy entertainer Mad is hitting screens worldwide on October 6.
Directed by Kalyan Shankar, the film is produced jointly by Haarika Suryadevara & Sai Soujanya under the banner Haarika & Hassine Creations and Sithara Entertainments.
Ahead of the film’s release, the lead actors Sangeeth Shoban, Ram Nithin, and Gopika Udyan caught up with web media journalists on Tuesday to share their experiences working with the film project.
After making a splash with web series Oka Chinna Family Story, actor Sangeeth Shoban is upbeat about his upcoming comedy ‘Mad’. “Naga Vamsi garu initially contacted me stating there is a hilarious story and shall go ahead once I listen to the script. Just five minutes into the story, the college vibe and humour impressed me. Because it’s been so many years since a story of this sort has come up in Tollywood. The very next day, I was on board. Through Oka Chinna Family Story I got this offer. Certainly, it was the base to gain an entry into mainstream cinema,” he added.
Ram Nithin: I started my acting career with a YouTube series. Later, I’ve done a series named Hello World. Within two days after it was out, I got a call from Naga Vamsi garu. For me, getting on offer from a popular production house was a shot in the arm. I instantly okayed it because of the script.
Female lead in Mad, Gopika Udyan: I am Malayali, settled in Dubai. I am debuting in Telugu with Mad. I have done a feature film in Malayalam with Asif Ali. I came into Mad through Instagram. The narration was done through Zoom call, I okayed the script soon after listening to it.
Mad seems to have the vibes of Sekhar Kammula’s film Happy Days that came out in 2007. What kind of flavour does it have?
Sangeeth Shoban: I already said this in press meet recently. It’s been more than 15 years since the movie was released. Comedy and humour belong to that generation. Happy Days can be relatable to that era of youngsters. But now, the trend of enjoying Instagram, facebook and Twitter belongs to this generation. Mad would have this style of comedy. The humour would have references of the popular culture of today’s world. This is the major difference in comedy, the college setup is quite common. But Mad will have an absolute laugh riot in theatres.
Speaking about his elder brother Santosh Shoban, who has already made a mark in Tollywood, Sangeeth says, “My brother Santosh struggled a lot to attain what he is now in Tollywood. And I am not before you after making a debut with a webseries. OTT is a blessing for young actors like me. Back in those days, if one had to become an actor there was no alternative to the big screen. But now OTT is helping everyone out. I am proud of what my brother has achieved.”
Sangeeth said that he was a child when his brother Santosh was launched on the big screen. “I was a kid when Prabhas garu launched my brother. Since my father had worked with Prabhas anna, he came to us and gave an encouraging gesture by backing up from UV Creations. I am happy that their presence is with my family.”
Mad is being compared with the likes of Jathi Ratnalu, what’s your take on it?
Sangeeth says,” It’s because KV Anudeep and Mad director Kalyan Shankar have jointly written the script of Jathi Ratnalu. Thus a comparison came up. Naga Vamsi garu just wanted to pull his leg during the press meet recently. He meant that Mad would be as light-hearted as Jathi Ratnalu, that’s the reason the film was compared with Jathi Ratnalu. Anudeep played a fun character in Mad. He agreed to play the role because he is a good friend of the director.
Ram Nithin said the film is titled Mad because it has the humour that makes audiences go mad. “Mad is a compliment to a good film. It need not necessarily be mad. Any film that you laugh wholeheartedly watching while it might evoke a feeling of joy. It was DJ Tillu’s director Vimal Krishna who said the script was “Mad” after hearing from Kalyan. So eventually, the director took the word mad and coined the same to it. All the three characters played by me, Sangeeth, Narne Nithin will have a proper bromance in the film. And how these chaps bump into three good-looking ladies Sri Gouri Priya Reddy, Ananathika Sanilkumar, Gopikaa Udyan and the chemistry and friendship between them will be fun to watch.”
Sangeeth said that he wanted to entertain audiences more than acting in the film. “I could have played the character more subtly. There are no audiences for newcomers. Unless we bring out good energy, no one cares to watch a film starring three young chaps on the screen. So our responsibility is to create a vibe that people should come to theatres to watch the fun of college boys. We would constantly discuss with director Kalyan to understand the characters in depth. That way it helped to bring the best out of us.”
Gopika Udyan explained that she plays a character named Radha. “I am playing a vital role in the movie. Radha comes from a small town to study at a city college. Radha and the character played by Sangeeth are childhood friends. They come to college for the first time. And what kind of experiences they face during their college life is the story in gist,” she added. Speaking about the producer Haarika garu, Gopika said, “Yes, she too is debuting with the movie Mad. And the best part is we all belong to the same age group. It’s great to work with the producer, to vibe with, to talk with. She would come to the sets every day. She never had that producer-wala feeling. I hope she gets to do more projects in the future.”
Sangeeth highlighted the importance of music for films that come under the comedy genres. “Music is the soul I would say. Bheems Ceciroleo has given amazing music, especially to the scenes when we enter the college.”
Ram Nithin said all the characters came from the madness of the director Kalyan. “He is the maddest person on the sets. The movie and the story are actually conceptualized through his personal experiences during college. Mad is going to be a slice of life comedy.”
Sep 27 2023
Follow Us!