MY FILMS

* ఇంత‌మంది అభిమానుల‌ను సంపాదించుకున్న అనుష్క‌ జ‌న్మ ధ‌న్యం: ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు

*ఒక న‌టిగా, ఒక మ‌నిషిగా నా హృదయంలో అనుష్క‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది

- అనుష్క 15 సంవ‌త్స‌రాల కెరీర్ ఈవెంట్‌లో అగ్ర ద‌ర్శ‌కుడు య‌స్‌. య‌స్‌. రాజ‌మౌళి  

2005 సంవ‌త్స‌రంలో వ‌చ్చిన ‘సూప‌ర్’ సినిమాతో ప్రారంభించి న‌టిగా అనుష్క ప్ర‌యాణానికి 15 సంవ‌త్స‌రాలు. ప్ర‌స్తుతం ఆమె ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న ‘నిశ్శ‌బ్దం’ ఏప్రిల్ 2న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుష్క 15 ఏళ్ల కెరీర్ ఈవెంట్‌ను చిత్ర బృందం గురువారం హైద‌రాబాద్‌లోఘనంగా నిర్వ‌హించింది. ఈ వేడుక‌లో ప‌లువురు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, అనుష్క స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ, “తొలిసారి స్వీటీని చూడ‌టం ఒక ఎక్స్‌పీరియెన్స్‌. ‘శ్రీ‌రామ‌దాసు’ తీసేప్పుడు నాగార్జున గెస్ట్ హౌస్‌కు వెళ్లాను. ఆయ‌న ‘డైరెక్ట‌ర్‌గారూ స‌రైన టైమ్‌కు వ‌చ్చారు. మీకో కొత్త హీరోయిన్‌ను చూపించాలి’.. అని చెప్పి, ‘స్వీటీ’ అని పిలిచాడు. సెల్లార్ నుంచి మెట్లెక్కుతూ వ‌చ్చింది. మొద‌ట క‌ళ్లు, త‌ర్వాత ముఖం, ఆ త‌ర్వాత మ‌నిషి పైకి వ‌చ్చి నిల్చుంది. అప్పుడు ఆమెతో అన్నాను.. ‘నువ్వు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ అవుతావ్ స్వీటీ’ అని చెప్పాను. ఇవాళ నిన్ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను. ఆరోజు అక్క‌డ ఎలాగైతే మెట్లెక్కి వ‌చ్చావో, అలాగే బంగారు మెట్లెక్కుతూ కెరీర్‌లో ముందుకు వ‌చ్చావు. పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో ఫ‌స్ట్ పిక్చ‌ర్ చేశావు. హీరోయిన్ల‌ను పూరి ఎలా చూపిస్తాడో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ‘సూప‌ర్’ అనిపించావ్‌. ఆ త‌ర్వాత శ్యామ్‌ప్ర‌సాద్‌రెడ్డి, కోడి రామ‌కృష్ణ కాంబినేష‌న్‌తో చేసిన ‘అరుంధ‌తి’తో నీకు గ‌జ‌కేస‌ర యోగం ప‌ట్టింది. అప్పుడే ఏనుగును ఎక్కేశావ్‌. ఆ త‌ర్వాత ‘భాగ‌మ‌తి’, గుణ‌శేఖ‌ర్ సినిమా ‘రుద్ర‌మ‌దేవి’, ‘బాహుబ‌లి’లో దేవ‌సేన‌గా హంస‌వాహ‌నం ఎక్కి ఆకాశంలోకి వెళ్లిపోయావ్‌. ఆ సినిమాలో ‘ఊపిరి పీల్చుకో’ అని నువ్వు చెప్పిన డైలాగ్‌తో ద‌ద్ద‌రిల్లిపోయింది. నా సినిమా ‘న‌మో వెంక‌టేశాయ‌’లో ఒక భ‌క్తురాలిగా చేశావ్‌. ప్ర‌య‌త్నిస్తే సినిమాలు దొరుకుతాయ్‌. కానీ నీ విష‌యంలో క్యారెక్ట‌ర్లే నిన్ను వెతుక్కుంటూ వ‌చ్చాయ్‌. ఈ జ‌న‌రేష‌న్‌లోని మ‌రే హీరోయిన్‌కీ ఆ అదృష్టం ద‌క్క‌లేదు. నీ కెరీర్‌లో బెస్ట్ క్యారెక్ట‌ర్ల‌ను పొందావు. ‘అనుష్క చాలా మంచిది, అందుకే ఆ క్యారెక్ట‌ర్లు వ‌చ్చాయి’ అని అంద‌రూ చెప్పే విష‌య‌మే. అంద‌రినీ నీ కుటుంబంలా చూసుకుంటావ్‌. తెలుగులోనే కాకుండా త‌మిళ‌నాడులో, క‌ర్ణాట‌క‌లోనూ ఇంత‌మంది అభిమానుల‌ను సంపాదించుకున్న నీ జ‌న్మ ధ‌న్యం. నీకూ, నాకూ ద‌గ్గ‌ర పోలిక ఉంది. న‌న్ను ‘మౌన ముని’ అని పిలిచేవారు. నువ్వు ఈ ‘నిశ్శ‌బ్దం’ సినిమాతో మౌన మునిక‌న్య‌గా అయిపోతావ్‌. డైరెక్ట‌ర్ హేమంత్ ఈ సినిమా క‌థ నాకు చెప్పాడు. ఆ క్యారెక్ట‌ర్ ఎలా చేసుంటావో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. నీ సామ‌ర్థ్యం నాకు తెలుసు. హేమంత్ వెరీ గుడ్ డైరెక్ట‌ర్‌. నిర్మాత‌లు నాకు బాగా తెలుసు. ఈ పిక్చ‌ర్ పెద్ద హిట్ట‌వ్వాలి” అని చెప్పారు.

నిర్మాత ఎం. శ్యామ్‌ప్ర‌సాద్ రెడ్డి మాట్లాడుతూ, “అనుష్క జీవితాన్ని మార్చేసిన సినిమా ‘అరుంధ‌తి’ అని అంద‌రూ అంటుంటారు కానీ, ఆ సినిమాతో నా జీవితాన్ని మార్చేసిన న‌టి తాను అని నేనంటాను. ఆ మాట‌కు నేను క‌ట్టుబ‌డి ఉంటాను. త‌న స్నేహితుల‌కు ఆమె ఆనందాన్ని క‌లిగిస్తుంది. అవ‌స‌రం అనుకున్న‌ప్పుడ‌ల్లా ఆమె స్నేహితుల ద‌గ్గ‌ర ఉంటుంది. వాళ్ల బాధ‌లు వింటుంది. వాళ్ల ఆనందాన్నీ, విజ‌యాల్నీ సెల‌బ్రేట్ చేస్తుంది. ఆమె కుడిచేత్తో చేసే సాయం ఎడ‌మ చేతికి కూడా తెలీదు. ఆమె త‌న సొంత‌ కుటుంబాన్ని మొద‌లు పెట్టాల‌ని కోరుకుంటున్నా. ‘నిశ్శ‌బ్దం’ టీమ్‌కు మంచి జ‌ర‌గాల‌ని ఆశిస్తున్నా” అన్నారు.

డైరెక్ట‌ర్ వైవీఎస్ చౌద‌రి మాట్లాడుతూ, “మా ‘దేవ‌దాసు’ సినిమా కోసం బాంబేకి వెళ్లి ఇలియానాను హీరోయిన్‌గా సెల‌క్ట్ చేసుకుని, అగ్రిమెంట్లు కుదుర్చుకొని, ఇలియానా, వాళ్ల‌మ్మ‌తో క‌లిసి ఫ్లైట్‌లో హైద‌రాబాద్‌కు వ‌స్తున్నాను. వాళ్లిద్ద‌రూ నా వెనుక సీట్ల‌లో కూర్చున్నారు. నా ముందు సీట్లో చ‌క్క‌ని రూప‌లావ‌ణ్యాలు ఉన్న ఒక అమ్మాయి వ‌చ్చి కూర్చోవ‌డం రెప్ప‌పాటు కాలంలో చూశాను. పేర‌డిగితే స్వీటీ శెట్టి అని చెప్పింది. నంబ‌ర్ అడిగి తీసుకున్నా. ‘సూప‌ర్‌’లో ఆమె బాగున్న‌ప్ప‌టికీ, ‘విక్ర‌మార్కుడు’తో ఆమెకు మంచి బ్రేక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత నా ‘ఒక్క మ‌గాడు’ చేసింది. ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఇవాళ ఎంతో ఎత్తుకు ఎదిగారు. మంచి విగ్ర‌హం క‌ల ఒక అమ్మాయికి మంచి క‌ళ్లు, మంచి ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ దేవుడు ఇస్తే పాత్ర‌లు వెతుక్కుంటూ వ‌స్తాయి. అనుష్క ద‌గ్గ‌ర‌కు అలా పాత్ర‌లు వెతుక్కుంటూ వచ్చాయి. మంచిత‌నంతో, ఓపిక‌తో ఆ పాత్ర‌ల‌కు జీవంపోసి ఇవాళ ఆమె ఈ స్థాయిలో ఉన్నారు. అనుష్క గురించి ఎవ‌రు చెప్పినా ముందు చెప్పేది ఆమె మంచిత‌నం గురించి. మ‌నిషిని మ‌నిషిలా చూడ్డం ఆమెలోని గొప్ప గుణం. ఆమెకు మంచి జీవిత భాగ‌స్వామి దొర‌కాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. ‘నిశ్శ‌బ్దం’ టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగించింది. ట్రైల‌ర్ చూశాక క‌చ్చితంగా ఈ సినిమా ఏదో చెయ్య‌బోతోంద‌ని అనిపించింది. హేమంత్‌కు బ్ర‌హ్మాండ‌మైన బ్లాక్‌బ‌స్ట‌ర్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నా” అని చెప్పారు.

డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ, “ఈ బంగారుత‌ల్లి ‘సూప‌ర్’ సినిమా హీరోయిన్ కోసం బాంబే వెళ్లిన‌ప్పుడు దొరికింది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి తీసుకెళ్లాను. నాగార్జున‌గారు త‌న‌ను చూడ‌గానే, ‘ఈ అమ్మాయ్ చాలా బాగుందే’ అన్నారు. ‘ఈ అమ్మాయికి ఆడిష‌న్ చేద్దాం సార్’ అన్నాను. ‘ఆడిష‌న్ ఏమీ అవ‌స‌రం లేదు, పెట్టేద్దాం’ అని ఆయ‌న‌న్నారు. అన్న‌పూర్ణ స్టూడియోలోనే వినోద్ బాల ద‌గ్గ‌ర త‌ను యాక్టింగ్ నేర్చుకుంది. డాన్స్ అవీ నేర్చుకొని సూప‌ర్ ఎన‌ర్జీతో ‘సూప‌ర్’ ఫిల్మ్‌లో చేసింది. అంత‌కుముందు నాగార్జున‌గారు నీ పేరేంట‌ని అడిగితే స్వీటీ అని చెప్పింది. ‘కాదు, నీ ఒరిజిన‌ల్ పేరు?’ అన‌డిగారు. స్వీటీయేన‌ని, త‌న పాస్‌పోర్ట్ చూపించింది. అందులో ఆ పేరే ఉంది. ‘ఇలా కాదు, స్క్రీన్ నేమ్ మంచిది ఉండాలి’ అన్నారు నాగార్జున‌గారు. ఆ త‌ర్వాత ఈ పిల్ల‌కు ఏం పేరు పెడ‌దామ‌ని చాలా పేర్లు రాసుకున్నాం. అప్ప‌డు మ్యూజిక్ డైరెక్ట‌ర్ సందీప్ చౌతా ‘మిల మిల’ అనే పాట రికార్డింగ్ కోసం ఒక అమ్మాయిని పిలిపించాడు. ఆ అమ్మాయి పేరు అనుష్క‌. అది నాకు న‌చ్చి, ‘ఈ పేరు ఎలా ఉంది?’ అని స్వీటీని అడిగాను. ‘బాగానే ఉంది కానీ, నాగార్జున‌గారిని కూడా అడుగుదాం’ అంది. ఆయ‌న్ని అడిగితే, మ‌న హీరోయిన్ల‌లో ఎవ‌రికీ ఇలాంటి పేరు లేదు, పెట్టేయొచ్చ‌న్నారు. అలా అనుష్క అనే నామ‌క‌ర‌ణం జ‌రిగింది. ‘సూప‌ర్‌’తో స్టార్ట‌యి, ‘నిశ్శ‌బ్దంతో ప‌దిహేనేళ్ల కెరీర్ పూర్తి చేసుకుంటోంది. యు రాకింగ్‌, ల‌వ్ యు.. హ్యాట్సాఫ్‌. ఇందాక అనుష్క ఏవీ చూశాను. హీరోల ఏవీల కంటే చాలా బాగుంది. నాకు గూస్‌బంప్స్ వ‌చ్చాయి. అంద‌రూ చెప్తున్న‌ట్లే అనుష్కనిజంగా చాలా మంచిది. త‌న ద‌గ్గ‌ర చాలా విష‌యాలు నేర్చుకోవాలి. ర‌వితేజ‌, చార్మి, నేను అనుష్క‌ను ‘అమ్మా’ అని పిలుస్తాం. మేం క‌లిసిన‌ప్పుడ‌ల్లా త‌న కాళ్ల‌కు దండంపెట్టి ఆశీర్వాదం తీసుకుంటాం. ఆమెలో కొన్ని ల‌క్ష‌ణాల‌న్నా మాకు రావాల‌ని కోరుకుంటుంటాం. చాలా మంచిత‌నం, చాలా తెలివితేట‌లు క‌లిసిన కాంబినేష‌న్ అనుష్క‌. నా స్నేహితుడు హేమంత్ మ‌ధుక‌ర్ తీసిన ‘నిశ్శ‌బ్దం’ సినిమాను నేనిప్ప‌టికే చూశాను. ఫెంటాస్టిక్ ఫిల్మ్‌. అనుష్క‌ మూగ‌మ్మాయిలా చేసింది. నిజంగా మూగ‌దేమో అని నాకే డౌట్ వ‌చ్చింది. ఈ అమ్మాయి ‘తెలీదు తెలీదు’ అని అన్నీ నేర్చుకొనే ర‌కం. త‌న‌కు హ్యాట్సాఫ్‌. ఈ సినిమా పెద్ద హిట్ట‌వ్వాలి అనుష్కా” అని చెప్పారు.

చార్మి మాట్లాడుతూ, “అనుష్క ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ప్పుడు నేను సీనియ‌ర్‌లా బిహేవ్ చేశాను. అప్ప‌ట్నుంచే త‌ను ప‌రిచ‌యం. ఇవాళ త‌ను నాకు అమ్మ‌. ఆమెలో ఎన్నో గొప్ప గుణాలున్నాయి. ఆమెలా ఉండటం చాలా క‌ష్టం. స‌హ‌నం, స‌మ‌తుల్యం విష‌యంలో ఆమె అద్భుతం. 15 ఏళ్ల కెరీర్ అంటే జోక్ కాదు. ఈ కాలంలో ఆమె అద్భుత‌మైన పాత్ర‌లు చేసింది. మొన్న ‘నిశ్శ‌బ్దం’ చూశాం. అందులో అనుష్క త‌న న‌ట‌న‌తో చింపేసింది. ‘నిశ్శ‌బ్దం’ పెద్ద హిట్ కావాల‌ని ప్రార్థిస్తున్నా. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి క‌లెక్ష‌న్స్ సాధించాల‌ని కోరుకుంటున్నా” అన్నారు.

ర‌చ‌యిత‌, నిర్మాత‌ల్లో ఒక‌రైన‌ కోన వెంక‌ట్ మాట్లాడుతూ, “రాఘ‌వేంద్రరావుగారు, శ్యామ్‌ప్ర‌సాద్‌రెడ్డి గారు చెప్పిన‌ట్లు ఈ సినిమాలో క్యారెక్ట‌ర్ త‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చింది. ఈ సినిమాను పాన్ ఇండియాగా చెయ్యాల‌నీ.. హాలీవుడ్‌, బాలీవుడ్ యాక్ట‌ర్ల‌తో చేయించాల‌నీ మా టీమ్ నిర్ణయించుకుంది. ఒక క్యారెక్ట‌ర్‌ను సౌత్‌, నార్త్‌లో తెలిసిన న‌టితో చేయించాల‌ని అనుకుంటున్న టైమ్‌లో స్వీటీ నాకు బాంబే ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించింది. అక్క‌డి సెక్యూరిటీ వాళ్లు త‌మ మెట‌ల్ డిటెక్ట‌ర్స్‌ను ప‌క్క‌న‌పెట్టి మరీ ఆమెతో ఫొటోలు దిగుతున్నారు. ఒకే ఫ్లైట్‌లో ప్ర‌యాణించాం. హైద‌రాబాద్‌లో ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్‌ను అంత‌కుముందు అక్క‌డ ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింద‌ని చెన్నై తీసుకుపోయారు. రాత్రి 10 గంట‌ల నుంచి తెల్ల‌వారు జాము 5 గంట‌ల వ‌ర‌కు ఫ్లైట్‌లోనే ఉండిపోయాం. ‘ఏంటి కోన గారూ, మీరేం చేస్తున్నారు? అన‌డిగింది. అప్ప‌డు ఈ క‌థ చెప్పా. ఆమెను ఆ సినిమా కోసం అడ‌గాల‌ని చెప్ప‌లేదు. ఏదో ఒక‌టి మాట్లాడుకోవాలి కాబ‌ట్టి చెప్పాను. త‌ర్వాత త‌ను వెళ్లిపోయింది. నేను హైద‌రాబాద్ తిరిగొచ్చాక స్వీటీ అయితే ఎలా ఉంటుంద‌ని హేమంత్‌ను అడిగాను. ‘ఇండియాలోనే అంత‌కంటే బెట‌ర్ చాయిస్ దొర‌క‌దు సార్’ అన్నాడు. అప్పుడు ‘ఫుల్ స్టోరీ వింటావా?’ అని ఆమెకు మెసేజ్ పెట్టాను. అలా త‌ను విన‌డం, ఈ ప్రాజెక్టులోకి రావ‌డం.. అంతా ఆ దేవుడు డిజైన్ చేసిన‌ట్లు జ‌రిగింది. సాధార‌ణంగా హీరోయిన్ల కెరీర్ చాలా త‌క్కువ కాల‌మే ఉంటుంది. పీక్స్‌లో అయితే మాగ్జిమ‌మ్ ఐదేళ్లు ఉంటుంది. అలాంటిది 15 ఏళ్లు త‌న మార్క్‌నీ, త‌న మార్కెట్‌నీ పెంచుకుంటూ, నిల‌బెట్టుకుంటూ ఉందంటే త‌న టాలెంట్‌తో పాటు ఇంకేదో ఉండాలి. అదే స్వీటీ! క్యారెక్ట‌ర్ అంటే చాలా త‌ప‌న ప‌డుతుంది, టెన్ష‌న్ ప‌డుతుంది, చాలా హోమ్‌వ‌ర్క్ చేస్తుంది. సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటానంటే బేగంపేట్ స్కూల్ నుంచి టీచ‌ర్లు, ఇద్ద‌రు ముగ్గురు స్టూడెంట్స్ రెండు నెల‌ల పాటు రోజూ స్వీటీ ఇంటికెళ్లి ఆమెకు దానిని నేర్పారు. ఇలా పాత్ర కోసం చాలా క‌ష్ట‌ప‌డింది. త‌న‌కు ఏమీ తెలీద‌నుకోవ‌డ‌మే ఆమెలోని గ్రేటెస్ట్ క్వాలిటీ. ఇన్ని సినిమాలు చేసినా ఫ్రెష్ స్టూడెంట్ లాగానే ఫీల‌వుతుంది. అందుకే ఇంత‌కాలం ఉంది, ఇంకో ప‌దిహేనేళ్లు ఇలాగే ఉన్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ట్రూ లేడీ సూప‌ర్‌స్టార్ అన‌డానికి నిజంగా అర్హురాలు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంద‌ర్నీ స‌మానంగా చూసే గొప్ప గుణం ఆమెది. త‌న మీద ఒక పుస్త‌కం రాయొచ్చు. ‘నిశ్శ‌బ్దం’ ఆమెకు మంచి హెల్ప్ అవ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైట‌ర్‌గా ఇది నాకు 55వ చిత్రం. గ‌ర్వంగా చెప్తున్నా, ఇప్ప‌టివ‌ర‌కూ నేను రాసిన బెస్ట్‌ స్క్రీన్ ప్లే లలో ఇదొక‌టి” అని చెప్పారు.

నిర్మాత డి. సురేష్‌బాబు మాట్లాడుతూ, “అనుష్క గురించి ఏం చెప్ప‌ను.. ‘సూప‌ర్’ సినిమా టైమ్‌లో ఒక అంద‌మైన అమ్మాయి అటూ ఇటూ న‌డుస్తుండ‌టం చూశాను. ఆ త‌ర్వాత త‌న‌తో కొన్ని సినిమాలు చేశాను. ఇండ‌స్ట్రీలో చాలామందిని క‌లుస్తుంటాం. చాలా మంచి మ‌నుషులు చాలా త‌క్కువ‌మంది ఉంటారు. బ‌హుశా హీరోయిన్ల‌లో అనుష్క లాంటి నైస్ ప‌ర్స‌న్ ఇంకొక‌రు ఉండ‌రు. నిజంగానే త‌ను స్వీట్ గాళ్‌, గుడ్ గాళ్‌, గొప్ప హృద‌యం ఉన్న అమ్మాయి. అలాంటి హృద‌యం ఉన్న‌వాళ్లు అరుదు. మున్ముందు ఆమె జీవితం మ‌రింత గొప్ప‌గా ఉండాల‌ని కోరుకుంటున్నా” అన్నారు.

చిత్ర‌ నిర్మాత టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ, “నేనొక ప‌ది సినిమాల దాకా నిర్మించాను. ‘నిశ్శ‌బ్దం’ సినిమాతో అనుష్క‌తో స‌న్నిహితంగా ప‌నిచేసే అవ‌కాశం ల‌భించింది. అనుష్క మైల్ స్టోన్ ఈవెంట్ సంద‌ర్భంగా ఈ సినిమా విడుద‌ల చేస్తుండ‌టం నా అదృష్టంగా భావిస్తున్నా. తెలుగు, హాలీవుడ్ న‌టుల‌తో ఈ మూవీ డిఫ‌రెంట్‌గా ఉంటుంది” అన్నారు.

డైరెక్ట‌ర్ హేమంత్ మ‌ధుక‌ర్ మాట్లాడుతూ, “అనుష్క ఒక నిగ్ర‌హం ఉన్న విగ్ర‌హం. రెండేళ్ల పాటు మాతో పాటు ఈ సినిమా కోసం త‌ను వెచ్చించ‌డం మామూలు విష‌యం కాదు. అది ఆమె అంకిత‌భావం. మాపై న‌మ్మ‌కం ఉంచినందుకు ఆమెకు థాంక్స్‌. ఈ ప‌దిహేనేళ్ల జ‌ర్నీలో ఆమె ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేశారు. వాటిలో ‘నిశ్శ‌బ్దం’ కూడా ఒక మైలురాయి లాంటి సినిమా లాగా నిల‌బ‌డుతుంద‌ని ఆశిస్తున్నా. అంజ‌లి కూడా ఇప్ప‌టి దాకా చేసిన క్యారెక్ట‌ర్ల‌కు చాలా భిన్న‌మైన క్యారెక్ట‌ర్ ఈ సినిమాలో చేసింది. మాకు కావాల‌సిన అన్నింటినీ నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్ గారు స‌మ‌కూర్చి పెట్టారు. ఆయ‌న స‌పోర్ట్ ఇవ్వ‌బ‌ట్టే ఈ సినిమాను నేను అనుకున్న‌ట్లు చేయ‌గ‌లిగాను” అన్నారు.

అంజ‌లి మాట్లాడుతూ, “ఐ ల‌వ్ యూ స్వీటీ. నీది చాలా మంచి హృద‌యం. ‘నిశ్శ‌బ్దం’ సెట్స్‌పై తొలిరోజు నాకు సౌక‌ర్యంగా ఉంటుందా అనే ఫీలింగ్ ఉండేది. త‌న‌తో నాకు చాలా కాంబినేష‌న్ సీన్స్ ఉన్నాయి. త‌న పుట్టిన‌రోజుకు ఒక పిక్చ‌ర్ పోస్ట్ చేశాను, అది త‌ను న‌న్ను పైకి లేపిన పిక్చ‌ర్‌. ఆమె నుంచి అంత సౌక‌ర్యం పొందాను. ఆమె ఇండ‌స్ట్రీలో మ‌రెన్నో ఏళ్లు ఉండాలి. ‘నిశ్శ‌బ్దం’లో న‌న్ను భాగం చేసినందుకు అంద‌రికీ థాంక్స్‌. నా కెరీర్‌లో ఇదొక డిఫ‌రెంట్ మూవీ. అంద‌రికీ న‌చ్చుతుంద‌ని అనుకుంటున్నా” అన్నారు.

డైరెక్ట‌ర్‌ య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి మాట్లాడుతూ, “స్వీటీ నాకు చాలా స‌న్నిహితురాలు, ఫ్యామిలీ ఫ్రెండ్‌. త‌ను మంచి అబ్జ‌ర్వ‌ర్‌. ప్ర‌తి విష‌యాన్నీ చాలా బాగా అబ్జ‌ర్వ్ చేస్తుంది. ‘విక్ర‌మార్కుడు’ సినిమా చేసేట‌ప్పుడు ప్ర‌తి షాట్‌ను ఎలా చెయ్యాలో చేసి చూపించ‌మ‌నేది. నేను చేసి చూపిస్తే త‌ను దాన్ని త‌న‌కు త‌గ్గ‌ట్లుగా మ‌ల‌చుకొని చేసేది. ఆఖ‌రుకి ర‌వితేజ‌తో రొమాంటిక్ సీన్స్ కూడా యాక్ట్ చేసి చూపించ‌మ‌నేది. అలా అన్నీ నాతో చేయించింది. ఆ సినిమాలోనే మా కుటుంబం మొత్తానికి త‌ను స‌న్నిహితురాలైంది. నాతో పాటు మా ఆవిడ‌కూ, మా వ‌దిన‌కూ, మా పిల్ల‌ల‌కూ స‌న్నిహిత‌మైపోయింది. నాకే స‌న్నిహితురాలేమోన‌ని ఇంత‌దాకా అనుకుంటూ వ‌చ్చాను. ఇక్క‌డ‌కు వ‌చ్చాక తెలిసింది, త‌ను అంద‌రికీ స‌న్నిహితురాలేన‌ని. నా సినిమాల్లో హీరోయిన్ల‌కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్ట‌ర్లు పెద్ద‌గా క్రియేట్ చెయ్య‌ను. కానీ దేవ‌సేన పాత్ర‌ను సృష్టించినందుకు గ‌ర్వంగా ఫీల‌వుతుంటాను, ఎందుకంటే దాన్ని స్వీటీ పోషించిన విధానం. చాలామంది హీరోయిన్ల‌తో ప‌నిచేస్తుంటాం, వాళ్ల‌ను చూస్తుంటాం. కొంత‌మందిని ప్రేమిస్తాం, కొంత‌మందిని ఇష్ట‌ప‌డ‌తాం. స్వీటీని ఒక న‌టిగా, ఒక మ‌నిషిగా చాలా గౌర‌విస్తాను. ఆ విష‌యంలో నా హృదయంలో ఆమెకో ప్ర‌త్యేక స్థానం ఉంది. త‌ను ఫెంటాస్టిక్ రోల్స్ చేసింది. ఇంకా చేస్తుంద‌ని నాకు తెలుసు. ‘నిశ్శ‌బ్దం’ టీజ‌ర్‌, ట్రైల‌ర్ చాలా బాగున్నాయి. ఆ సినిమా విడుద‌ల‌య్యే ఏప్రిల్ 2 కోసం ఎదురుచూస్తుంటా అని చెప్పారు.

అనుష్క మాట్లాడుతూ, “సీనియ‌ర్స్ సాధించిన దానితో పోలిస్తే నేను సాధించింది చాలా త‌క్కువ‌. అయితే దీన్ని నేను ఓ బాధ్య‌త‌గా తీసుకొని ఇంకా హార్డ్‌వ‌ర్క్ చెయ్యాలి, ఇంకా మంచి స్క్రిప్ట్స్ చెయ్యాలనుకుంటాను. ‘సూప‌ర్‌’ నుంచి  ’నిశ్శ‌బ్దం’ వ‌ర‌కూ.. పూరి జ‌గ‌న్నాథ్ గారి నుంచి మొద‌లుకొని, ప్ర‌తి సినిమా డైరెక్ట‌ర్‌కూ చాలా థాంక్స్ చెప్పుకుంటున్నా. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్పుడు సినిమాపై నా నాలెడ్జ్ ఎలా ఉండిందో పూరి జ‌గ‌న్నాథ్ గారికి తెలుసు. ప్ర‌తి సినిమా నాకొక మెట్టు. స‌హ న‌టులు, నిర్మాత‌, ప్ర‌తి యూనిట్ మెంబ‌ర్‌తో ఒక ప్ర‌యాణం చేస్తూ వ‌చ్చాను. మంచి, చెడు అనుభ‌వాల‌తో ఇక్క‌డి దాకా వ‌చ్చాను. ఈ ప‌దిహేనేళ్ల‌లో నాతో క‌లిసి ప‌నిచేసిన‌, ప్ర‌యాణించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నా. ‘నిశ్శ‌బ్దం’ చిత్రం ఏప్రిల్ 2న వ‌స్తోంది. ఒక భిన్న‌మైన చిత్రం అందించాల‌ని మా వంతు ప్ర‌య‌త్నం చేశాం. దీనికి ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నా. ఇక్క‌డ‌కు వ‌చ్చి ఈ ఈవెంట్‌ను నాకు ప్ర‌త్యేక‌మైన‌దిగా మార్చిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్ అన్నారు. నిశ్శబ్దం సహనిర్మాత వివేక్ కూచి భొట్ల ఈ వేడుక ఆద్యంతం వైభవంగా జరగటానికి ఏర్పాట్లను గత కొన్నిరోజులుగా దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ వేడుక‌లో నిర్మాత పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్‌, ద‌ర్శ‌కులు శ్రీ‌వాస్‌, వీరు పోట్ల కూడా మాట్లాడారు.

Nisbdham (6) Nisbdham (4) Nisbdham (5) Nisbdham (1) Nisbdham (3) Nisbdham (2)

‘Nissabdham’ posters

Anushka - TELUGU-1 Shalini - TELUGU Anjali - TELUGU

Natural Star Nani Released Anushka Shetty’s ‘Nishabdham’ Trailer, All Set For Worldwide Release On April 2nd in Telugu, Tamil, Malayalam, Hindi and English Languages

నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేసిన‌ ‘నిశ్శ‌బ్దం’ ట్రైల‌ర్‌.. ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో సినిమా గ్రాండ్ రిలీజ్‌

`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘నిశ్శ‌బ్దం’. ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుదలవుతోంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న చిత్రమిది. క్రితి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్ లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మాణతలో టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను శుక్ర‌వారం నేచురల్ స్టార్ నాని త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ‘‘ఇదుగో..మా స్వీటెస్ట్ స్వీటీ ‘నిశ్శ‌బ్దం’ ట్రైలర్. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు’’ అని చిత్ర యూనిట్‌కి నాని శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సినిమా లో అత్యధిక భాగం అమెరికాలో చిత్రీక‌రించారు.

ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. సినిమా అంతా క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అని ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ట్రైలర్ ప్రారంభంలోనే ఒక అమెరికన్ న్యూస్ రిపోర్టర్ “దెయ్యాల కొంప అనే పేరున్న వుడ్ సైడ్ విల్లా ఈరోజు మరోసారి వార్తల్లోకి వచ్చింది” అన చెప్తుంది.‘అక్క‌డ చీక‌ట్లో ఎవ‌రో ఎటాక్ చేశారంటా..కానీ ఎవ‌రో ఏంటో క‌నిపించ‌లేదంటున్నారు’ అనే డైలాగ్‌ లు వినిపిస్తాయి. అంజలి ఈ కేసును విచారణ చేస్తూ ఉంటుంది. “ఒక ఘోస్ట్ ఇదంతా చేసిందని యాక్సెప్ట్ చెయ్యడానికి నా సెన్సిబిలిటీస్ ఒప్పుకోలేదు” అని మరో సీన్ లో అంజలి అంటుంది. అనుష్క ను విచారిస్తూ “నిన్న నీ బెస్ట్ ఫ్రెండ్ సోనాలి(శాలిని) ఎందుకు రాలేదు?” అని ప్రశ్నిస్తుంది. “నిన్న ఆర్ఫనేజ్ కు వెళ్ళిన మాకు చాలా షాకింగ్ విషయాలు తెలిశాయి” అంటుంది. అవసరాల శ్రీనివాస్ మరో సీన్ లో “ఇదంతా ఓ పాతికేళ్ళ అమ్మాయి ఒక్కత్తే చేసిందంటారా?” అని అడిగితే “ఎవరో తనకి సహాయం చేస్తున్నారు” అంటూ బదులిస్తుంది.
ఓ పాడుబ‌డిన ఇంట్లో ఉన్న అనుష్క‌, మాధ‌వ‌న్ కొన్ని భ‌యాన‌క‌మైన విష‌యాల‌ను చూస్తార‌ని.. అస‌లు ఆ ఇంట్లో ఏముందోన‌ని పోలీసులు అన్వేష‌ణ‌తోనే సినిమా ర‌న్ అవుతుంద‌ని తెలుస్తుంది. మరో హీరోయిన్ అంజ‌లి అమెరిక‌న్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతుంది. ఆమె అనుష్క‌కి ఏదో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. అనుష్క మాట‌లు మాట్లాడ‌లేని, చెవులు విన‌ప‌డ‌ని బ‌ధిర అమ్మాయి సాక్షిగా ఈ సినిమాలో న‌టించింది. ఆమె త‌న సైగ‌ల‌తో అంజ‌లికి ఏదో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటుంది. అస‌లు అనుష్క బెస్ట్ ఫ్రెండ్ సోనాలి ఎవ‌రు? అనే విష‌యం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అలాగే ఈ ట్రైల‌ర్‌లో మైకేల్ హ‌డ్స‌న్‌, అవసరాల శ్రీనివాస్, సుబ్బ‌రాజు, షాలిని పాండే త‌దిత‌రులు కనబడతారు.
అస‌లు ఘోస్ట్ హౌస్ ఏంటి? అందులో జ‌రిగే క‌థేంటి?  అనేది తెలుసుకోవాలంటే ఏప్రిల్ 2న విడుద‌ల‌వుతున్న ‘నిశ్శ‌బ్దం’ చూడాల్సిందేన‌ని ఆసక్తి రెపేలా ట్రైల‌ర్ ఉంది.

అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో త‌దిత‌రులు నటిస్తున్నారు.

సంగీతం:  గోపీ సుంద‌ర్,ఎడిటింగ్: ప్రవీణ్ పూడి,ఆర్ట్: చాడ్ రాప్టోర్,స్టైలీష్ట్: నీర‌జ కోన‌,స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ: షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంక‌ట్,
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం:  హేమంత్ మ‌ధుక‌ర్‌

 
Natural Star Nani Released Anushka Shetty’s ‘Nishabdham’ Trailer, All Set For Worldwide Release On April 2nd in Telugu, Tamil, Malayalam, Hindi and English Languages

Tollywood star heroine Anushka who became care of address for lady oriented films after scoring super hits with Arundhati, Baahubali, Rudhramadevi and Bhaagamathie is presently starring in the lead role in ‘Nishabdham’.

Hemant Madhukar is directing the film while TG Vishwa Prasad and Kona Venkat are jointly producing it on People Media Factory in association with Kona Film Corporation banners. The film’s entire shoot has been wrapped up and post-production activities are underway.

The film is all set for a grand release worldwide in Telugu, Tamil, Malayalam, Hindi and English languages on April 2nd.

Natural Star Nani released Nishabdham theatrical trailer on Friday. “Here’s the #NishabdhamTrailer Our sweetest Sweety in a edge of the seat thriller. Best wishes to the entire team Smiling face with smiling eyes,” tweeted he.

Nishabdham is shot completely in USA.

Going by the trailer, Nishabdham is going to be a crime suspense thriller. The trailer begins with the dialogue “Akka Cheekatlo Evaro Attack Chesaranta… Kaanee Evaro Ento Kanipinchadam Ledantunnaru.”

It is evident through trailer that, a couple- Anushka and Madhavan witnesses some creepy incidents in a haunted house and the entire story revolves around police investigating the matter.

Actress Anjali who appears as an American cop tries to talk with Anushka who is mute named Sakshi. Anushka tries to convey something to Anjali through her eyes. The question that arises after watching the trailer is who Anushka’s best friend Sonali is? What’s in this haunted house? What happened in the house? We need to wait and watch the film to get clarity on these.

Shalini Pandey, Subbaraju and Michael Madsen are also seen in the trailer.

Cast:
Anushka Shetty, R. Madhavan, Anjali, Michael Madsen, Shalini Pandey, Subbaraju, Srinivas Avasarala and Hunter O’Harrow.

Technology Crew:
Music: Gopi Sundar, Editing: Praveen Pudi, Art: Chad Raptor, Stylist: Neeraja Kona, Stunts: Alex Terzif, Cinematography: Shaneil Deo, Screenplay, Dialogues: Kona Venkat, Co-Producer: Vivek Kuchibhotla;

 Producers: TG Viswa Prasad, Kona Venkat,
 Story, Direction – Hemant Madhukar.
P1017932 copy

“నా సినిమా హిట్టయితే ఎంత హ్యాపీగా ఫీలవుతానో, దానికంటే ఎక్కువగా ‘భీష్మ’ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీలవుతున్నా” – ‘భీష్మ’ థాంక్స్ మీట్ లో ప్రముఖ హీరో మెగా ప్రిన్స్ ‘వరుణ్ తేజ్’

ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన ‘భీష్మ’ మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి వైజాగ్ లో థాంక్ యు మీట్ నిర్వహించారు. ఈ విజయోత్సవంలో ‘భీష్మ’ డిస్ట్రిబ్యూటర్లకు, యూనిట్ మెంబర్లకు వరుణ్ తేజ్, నితిన్, రష్మిక, వెంకీ జ్ఞాపికలను అందజేశారు. వరుణ్ తేజ్ నుంచి నిర్మాత నాగవంశీ, డైరెక్టర్ వెంకీ, హీరోయిన్ రష్మిక, హీరో నితిన్ జ్ఞాపికలను అందుకున్నారు.

ఈ సందర్భంగా గేయరచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ, “ఈ సినిమాలో నేను రాసిన ‘వాటే బ్యూటీ’ పాటను హిట్ చేశారు, సినిమానీ హిట్ చేశారు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ‘ఛలో’లో రెండు పాటలు రాస్తే.. వాటిని ఆదరించారు, ఆ సినిమానీ హిట్ చేశారు. నితిన్ హీరోగా మణిశర్మ సంగీతం అందించిన ‘లై’ సినిమాకు పాట రాసిన నేను, ఇప్పుడు మణిశర్మ వాళ్లబ్బాయి మహతి స్వరసాగర్ సంగీతానికి పాట రాయడం ఆనందంగా ఉంది” అన్నారు.

ఫైట్ మాస్టర్ వెంకట్ మాట్లాడుతూ, “మా ‘భీష్మ’మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఏ సినిమా రికార్డ్స్ రాయాలన్నా వైజాగ్ నుంచే మొదలవుతుంది. ఈ సినిమాలో సెకండాఫ్ లో వచ్చే ఫైట్ ను త్రివిక్రమ్ గారు  చాలా మెచ్చుకున్నారు” అన్నారు.

నటుడు అజయ్ మాట్లాడుతూ, “నా ఫ్రెండ్, నా బ్రదర్ నితిన్ కు ఇంత పెద్ద హిట్టిచ్చిన ప్రేక్షకులందరికీ థాంక్స్. వైజాగ్ ఆడియెన్స్ సినిమా లవర్స్. సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ‘భీష్మ’ ఇంత పెద్ద హిట్టయ్యిందంటే కారణం ప్రేక్షకులే” అన్నారు.

డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ, “ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన నితిన్ గారికి, మా ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి థాంక్స్” అని చెప్పారు.

నటుడు సంపత్ రాజ్ మాట్లాడుతూ, “వైజాగ్ లో ‘భీష్మ’ ఇంకా పెద్ద సినిమా అవ్వాలని కోరుకుంటున్నా. ఈ సినిమాని ఇత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు థాంక్స్. చూసినవాళ్లు మరోసారి ఇంట్లోవాళ్లందర్నీ తీసుకొని సినిమాకి వెళ్లాల్సిందిగా కోరుతున్నా. ఈ సినిమాలో నన్ను భాగం చేసిన యూనిట్ సభ్యులందరికీ థాంక్స్” అన్నారు.

హీరోయిన్ రష్మికా మందన్న మాట్లాడుతూ,  ’భీష్మ’ మంచి సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది.”నితిన్ గారు, వెంకీ గారు వాళ్లిద్దరంటే నాకు బాగా ఇష్టం. ఈ ఈవెంట్ కు వరుణ్ తేజ్ గారు వచ్చినందుకు థాంక్స్. నిర్మాత నాగవంశీ గారు మంచి లాభాలు పొందాలని  ఆశిస్తున్నా. ‘భీష్మ’ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు చాలా చాలా థాంక్స్” అన్నారు.

భీష్మ’ హిట్టయినందుకు పవన్ కల్యాణ్ గారు చాలా సంతోషించారు! -  హీరో నితిన్ 
హీరో నితిన్ మాట్లాడుతూ, “పవన్ కల్యాణ్ గారు ఆరడుగుల బుల్లెట్ అయితే, మా వరుణ్ ఆరడుగుల నాలుగంగుళాల బుల్లెట్. ఆయన రాలేకపోయినా మా వరుణ్ గారు వచ్చారు. ఈ ప్రొడ్యూసర్ తో నా మొదటి సినిమా ‘అ ఆ’ పెద్ద హిట్టయింది. ఇది మా రెండో సినిమా. కల్యాణ్ గార్ని మొన్ననే కలిశాను. సినిమా హిట్టయినందుకు ఆయన చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఈ వారంలో సినిమా చూస్తానని చెప్పారు. ఆయన సినిమా చూశాక మళ్లీ కలుస్తాను. ‘భీష్మ’ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్. నాలుగేళ్ల తర్వాత మళ్లీ నాకు హిట్ వచ్చింది. ఈ హిట్ ను నాకిచ్చిన నిర్మాతలకు, డైరెక్టర్ వెంకీకి థాంక్స్ చెప్పుకుంటున్నా. రష్మిక గారు చాలా చాలా బాగా చేశారు. మా ఫస్ట్ కాంబినేషన్ మంచి హిట్టయింది. ఈ సినిమాలో ఆమె డాన్సులు ‘నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్’ (రష్మికను చూస్తూ ‘ఏవండీ మీకు అర్థమవుతుందా!’ అన్నారు). మా ఇద్దరి కాంబినేషన్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాగర్ మహతి చాలా మంచి మ్యూజిక్ ఇస్తే, నవీన్ నూలి ఎడిటింగ్ బాగా చేశాడు. సెకండాఫ్ లో వెంకట్ మాస్టర్ అదిరిపోయే ఫైట్ ఇచ్చాడు. కాసర్ల శ్యామ్, శ్రీమణి చక్కని లిరిక్స్ ఇచ్చారు. అజయ్ తో నాది హిట్ కాంబినేషన్” అని చెప్పారు.

నితిన్ ను చూసి చాలా హ్యాపీ ఫీలవుతున్నా!-మెగా ప్రిన్స్ ‘వరుణ్ తేజ్’

ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, “పది రోజుల నుంచీ నా సినిమా షూటింగ్ లో పాల్గొంటూ వైజాగ్ లోనే ఉంటున్నాను. ఇక్కడి గాలి, అవీ వంటపట్టాయి. నేనిక్కడకు ఒక చీఫ్ గెస్టులా కాకుండా నా ఫ్రెండ్ నితిన్ సక్సెస్ ను ఎంజాయ్ చెయ్యడానికి వచ్చాను. ఈ సినిమా స్టార్ట్ చెయ్యక ముందు నుంచీ, ఒకటిన్నర సంవత్సరంగా నితిన్, నేను కలిసి ట్రావెల్ చేశాం. ఈ సినిమా స్టోరీ నాకు ముందే చెప్పాడు. సాంగ్స్ ముందే చూపించాడు. సినిమా మంచి హిట్టవ్వాలని కోరుకున్నా. నిజంగా నా సినిమా హిట్టయితే ఎంత హ్యాపీగా ఫీలవుతానో, దానికంటే ఎక్కువగా నితిన్ సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీలయ్యాను. వెంకీ కుడుముల ఇదివరకు తీసిన ‘ఛలో’ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. సాధారణంగా ఇండస్ట్రీలో సెకండ్ సినిమా హిట్ కొట్టడం కొంచెం కష్టమంటారు. వెంకీ ఆ పరీక్ష పాసయ్యాడు. అతను ఇంకా ఎన్నో ఎన్నో సక్సెస్ లు కొట్టాలని కోరుకుంటున్నా. రష్మిక గ్రేట్ ట్రాక్ లో ఉంది. ఈ సంవత్సరం ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’.. ఇదివరకు ‘గీత గోవిందం’, ‘ఛలో’ సినిమాలు చేసింది. తను మంచి టాలెంట్ ఉన్న నటి. తనతో చేస్తే సినిమా హిట్టవుతుందని అంటారు. బహుశా త్వరలోనే ఆమెతో కలిసి చెయ్యాలని ఆశిస్తున్నా. నిర్మాత నాగవంశీ ఈ ఏడాది మొదట్లో ‘అల.. వైకుంఠపురములో’తో పెద్ద సక్సెస్ కొట్టి, ఇప్పుడు ‘భీష్మ’తో కంటిన్యూ చెయ్యడం మామూలు విషయం కాదు. ఈ సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ అభినందనలు. నేను చిన్నప్పట్నుంచీ మణిశర్మ గారికి పెద్ద అభిమానిని. చిరంజీవి గారు, మణిశర్మ గార్ల కాంబినేషన్ అంటే చొక్కాలు చించేసుకొనేవాళ్లం. వాళ్లబ్బాయి సాగర్ వచ్చి ఇంత మంచి ఆడియో ఇవ్వడం హ్యాపీ. ఇటీవల మణిశర్మ గారిని కలిస్తే, ఆయన కళ్లల్లో కొడుకు సక్సెస్ సాధించాడనే గర్వం కనిపించింది. సాగర్ కు అభినందనలు. సినిమాలో వాట్సాప్ సీన్ ను బాగా ఎంజాయ్ చేశాను. నితిన్ ను చూసి చాలా హ్యాపీ ఫీలవుతున్నా. ఈ మధ్యనే మేం బాగా సన్నిహితులమయ్యాం. అతనితో ఈ స్నేహం కొనసాగాలని కోరుకుంటున్నా. ‘భీష్మ’ను మళ్లీ మళ్లీ చూసి ఇంకా పెద్ద సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నా. నేను చిన్నప్పట్నుంచీ కల్యాణ్ బాబాయ్ ఇంట్లో పెరిగాను. రక్త సంబంధం కాబట్టి నేను ఆయనకు అభిమానినవడం పెద్ద విషయం కాదు. కానీ నేను రేటింగ్ ఇస్త్తున్నా.. నితిన్ నంబర్ వన్ పవన్ కల్యాణ్ గారి ఫ్యాన్. కచ్చితంగా నితిన్ కు కల్యాణ్ బాబాయ్ అభిమానుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది” అని చెప్పారు.

హైలైట్స్:


* నితిన్ మాట్లాడుతూ డైరెక్టర్ వెంకీని పొగుడుతుంటే, ఆయన వచ్చి వచ్చి నితిన్ బుగ్గను ముద్దు పెట్టుకున్నారు. “శాలిని గారు (నితిన్ కాబోయే భార్య) ఇంక ఈ బుగ్గను ముద్దు పెట్టుకోరు” అన్నారు.

* రష్మికపై ప్రశంసలు కురిపించిన నితిన్ “ఈ సినిమాలో ఆమె డాన్సులు ‘నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్” అని చెప్పి, ఆమెను చూస్తూ “ఏవండీ మీకు అర్థమవుతుందా!” అని ప్రేక్షకులకు నవ్వులు పంచారు.

* వరుణ్ తేజ్ తన ప్రసంగంలో “నితిన్ సినిమానంతా జెన్యూన్ గా తీసి, ఒక విషయంలో మోసం చేశాడు. ‘భీష్మ.. సింగిల్ ఫరెవర్’ అన్నాడు. ఫస్ట్ రీల్ అయ్యేవరకు అమ్మాయిని పడేశాడు. సింగిల్ గా ఉంటానని చెప్పి, సినిమా విడుదలకు ముందు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. మమ్మల్ని మోసం చేశాడు. ఏదేమైనా అతని విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈ సినిమా సక్సెస్ కంటే పెద్ద అడుగు పెళ్లి చేసుకోవడం. అతనికీ, శాలినికీ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు అభినందనలు” అని చెప్పి అలరించారు.

DSC_1371 DSC_1377 DSC_1382 DSC_1411 DSC_1415 DSC_1416


*Sree Vishnu’s film with People Media Factory and Abhishek Agarwal Arts titled “Raja Raja Chora”*

*’శ్రీవిష్ణు’ హీరోగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ చిత్రం ‘రాజ రాజ చోర’*

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా, యువ కథానాయకుడు శ్రీవిష్ణు  హీరోగా, హసిత్ గోలి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని  నిర్మిస్తున్నాయి. సునయన నాయిక. హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా నేడు చిత్రం  తొలి ప్రచార చిత్రాన్నివిడుదల చేశారు. ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’ అనే పేరును నిర్ణయించారు. ‘హసిత్ గోలి’ ఈ చిత్రం ద్వారా దర్శకునిగాపరిచయం అవుతున్నారు అని  చిత్ర నిర్మాతలు  టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు.

శ్రీవిష్ణు, హసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. మా హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం పేరును, తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేయటం ఆనందంగా ఉంది.  ఒక వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్  షూటింగ్ జరుపుకుంటోంది అని తెలిపారు చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఏప్రిల్ నాటికి చిత్ర షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయని తెలిపారు సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల,క్రియేటివ్ ప్రొడ్యూసర్ కీర్తి చౌదరి.

చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో తనికెళ్ళ భరణి, రవిబాబు, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వేదరామన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కీర్తి చౌదరి
సహ నిర్మాత: వివేక్ కూచి భొట్ల
నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్
రచన-దర్శకత్వం: హసిత్ గోలి

*Sree Vishnu’s film with People Media Factory and Abhishek Agarwal Arts titled “Raja Raja Chora”*

Reputed film production houses, People Media Factory and Abhishek Agarwal Arts together  are producing a film with young hero Sree Vishnu. The film titled ‘Raja Raja Chora’ is being helmed by debut director Hasith Goli. Sunaina has been locked as one of the female leads. On the occasion of Sree Vishnu’s birthday, the team has released the first look of the movie.

‘We are happy to work with talented people like Sree Vishnu and Hasith Goli. Regular shoot of the movie has begun and we’ve already completed one schedule’, said the producers T.G. Vishwaprasad, Abhishek Agarwal. ‘The story of the movie is very interesting. By April we shall complete our entire shoot’, said Co Producer Vivek Kuchibhotla and Creative Producer Kirthi Chowdary.

Tanikella Bharani, Ravi Babu, Ajay Ghosh and others will be seen in crucial roles in the film.
Cinematography: Veda Raman
Music: Vivek Sagar
Editor: Viplav Nyshadam
Art: Kiran Kumar Manne
Creative Producer: Kirthi Chowdary
Co-Producer: Vivek Kuchibhotla
Producers: T.G.Vishwa Prasad, Abhishek Agarwal
Writer-Director: Hasith Goli

Interesting Stories, Interesting characters and a unique birthdate, wishing our @sreevishnuoffl aka #RajaRajaChora a very Happy Birthday!!
May you celebrate many more birthdays with unique stories like this.

@hasithgoli | @oddphysce | @veda_raman | @kirthi_chowdary | @peoplemediafcy | @AAArtsOfficial |
@vivekkuchibotla | @AbhishekOfficl | #RRC | #RRCFirstLook

 

FIRSTLOOK FINAL FIRSTLOOK FINAL STILL