Father Chitti Uma Kaarthik

*Audience will connect with Father-Son Relationship in ‘FCUK (Father-Chitti-Umaa-Kaarthik)’ – Hero Ram Karthik*‌

*’ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)‘లో ఫాద‌ర్‌-స‌న్ రిలేష‌న్‌షిప్ ఆడియెన్స్‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది
- హీరో రామ్ కార్తీక్‌*

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ (దాము) నిర్మించిన ‘ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)‘ చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న, శుక్ర‌వారం విడుద‌ల‌వుతోంది. విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కార్తీక్‌గా యంగ్ హీరో క్యారెక్ట‌ర్‌ను రామ్ కార్తీక్ పోషించారు. సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధుల‌తో రామ్ కార్తీక్ సంభాషించారు. ఆ విశేషాలు…

ఈ సినిమాలో మీకు ఎలా అవ‌కాశం వ‌చ్చింది?
మా సినిమా డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌పై, సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండ‌టం హ్యాపీ. డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజుగారి మునుప‌టి సినిమా ‘ర‌చ‌యిత’ చూశాను. అది న‌న్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాలో కార్తీక్ క్యారెక్ట‌ర్‌కు ర్యాండ‌మ్‌గా కాకుండా, చాలా మంది ప్రొఫైల్స్ చూసి న‌న్ను ఎంచుకున్నార‌ని తెలిసింది. సాగ‌ర్‌గారు చాలా టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. న‌టుడిగా నాలో నాకు తెలీని యాంగిల్‌ను ఈ సినిమాతో ఆయ‌న బ‌య‌ట‌కు తెచ్చారు. ఇంట‌ర్న‌ల్‌గా వేసిన ఓ షోలో నా ప‌ర్ఫార్మెర్స్‌ను అంద‌రూ మెచ్చుకోవ‌డం మ‌రింత హ్యాపీ.

మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది?
టైటిల్‌లోని కార్తీక్ పాత్ర‌ను చేశాను. ప‌క్కింట‌బ్బాయి త‌ర‌హాలో ఉంటుంది. నా ఫాద‌ర్‌గా చేసిన జ‌గ‌ప‌తిబాబుగారిది చిలిపిగా ఉండే క్యారెక్ట‌ర్. లైక్ ఫాద‌ర్ లైక్ స‌న్ త‌ర‌హాలో నా క్యారెక్ట‌ర్ ఉంటుంది. అయితే నిజ జీవితంలో దానికి పూర్తి ఆపోజిట్‌గా ఉంటాన‌నుకోండి.

జ‌గ‌ప‌తిబాబు గారి లాంటి పేరుపొందిన యాక్ట‌ర్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది?
జ‌గ‌ప‌తిబాబు గారు ఓ లెజెండ‌రీ యాక్ట‌ర్‌. ఆయ‌న‌తో తెర పంచుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. మా ఇద్ద‌రి మ‌ధ్యా వ‌చ్చే చాలా సీన్ల‌లో ఓ ఎమోష‌న‌ల్‌ సీన్ నాకు చాలా న‌చ్చింది. అది ఛాలెంజింగ్ సీన్‌. ఆ సీన్‌లో ఆయ‌న మీద నేను కోపాన్ని ప్ర‌ద‌ర్శించాలి. మొద‌ట నెర్వ‌స్‌గా అనిపించినా, ఆయ‌న ఇచ్చిన స‌పోర్ట్‌తో దాన్ని చేశాను. ఆ సీన్ చాలా బాగా వ‌చ్చింది. ఈ సినిమాలో తండ్రీకొడుకుల మ‌ధ్య అనుబంధం ఫ‌న్‌గానే కాకుండా ఎమోష‌న‌ల్‌గానూ ఉంటుంది. అది ఆడియెన్స్‌కు బాగా రీచ్ అవుతుంది.

అస‌లు ఈ సినిమా క‌థేమిటి?
కార్తీక్‌, ఉమ మ‌ధ్య ప్రేమ‌క‌థ‌లో స‌డ‌న్‌గా చిట్టి అనే చిన్న‌పాప ఎంట‌రైతే వ‌చ్చే అపార్థాలు దేనికి దారి తీస్తాయి? ఆ పాప ఎవ‌రు?  మా ల‌వ్ స్టోరీని ఆమె ఎలా గ‌ట్టెక్కించింద‌నేది? అనే పాయింట్‌ ఇంట‌రెస్టింగ్‌గా, కామిక్ వేలో ఉంటుంది. అంటే పాత్ర‌ల మ‌ధ్య ఉండే క‌న్‌ఫ్యూజ‌న్.. మంచి ఫ‌న్‌ను అందిస్తుంది. డైరెక్ట‌ర్ సాగ‌ర్‌గారు ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ను కామిక్ వేలో చెప్పారు.

చిన్న‌పాప‌తో వ‌ర్క్ చేయ‌డం క‌ష్ట‌మ‌నిపించ‌లేదా?
లేదండీ. ఆమెతో క‌లిసి సీన్లు చేసేట‌ప్పుడు మేమేం క‌ష్ట‌ప‌డ‌లేదు. చిట్టి పాత్ర‌ను బేబి స‌హ‌శ్రిత చాలా బాగా చేసింది. త‌ను బార్న్ ఆర్టిస్ట్‌. త‌న నుంచి ఎలాంటి ఎక్స్‌ప్రెష‌న్ కావాలంటే అది ఇచ్చేసేది.

హీరోయిన్ అమ్ము అభిరామి గురించి ఏం చెబుతారు?
అమ్ము అభిరామితో మంచి వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఉంది. ఆమెది మామూలు మెమ‌రీ కాదు. వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌. త‌న‌కు స‌రిగా తెలుగు తెలీదు. డైలాగ్ బ‌ట్టీపెట్టేసి, పర్ఫెక్టుగా చెప్పేసేది.

సినిమాలో మీకు ప‌ర్స‌న‌ల్‌గా ఏ పాట ఇష్టం?
పాట‌ల్లో నాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ రాసి, పాడిన “పూవ‌ల్లే” బాగా ఇష్టం. అది ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. పాప‌, జ‌గ‌ప‌తిగారు, నా మీద ఆ పాట ఉంటుంది. త‌న కూతుర్ని దృష్టిలో పెట్టుకొని ఆ పాట‌ను భీమ్స్ రాశారు. నిజానికి ఆల్బ‌మ్ మొత్తం బాగా ఉంద‌నే టాక్ వ‌చ్చింది.

శ్రీ రంజిత్ మూవీస్ లాంటి ప్రెస్టీజియ‌స్ బ్యాన‌ర్‌లో ప‌నిచేయ‌డంపై ఏం చెబుతారు?
నిజంగా శ్రీ రంజిత్ మూవీస్ లాంటి ప్రెస్టీజియ‌స్ బ్యాన‌ర్‌లో న‌టించే అవ‌కాశం రావ‌డం వెరీ హ్యాపీ. స్క్రిప్ట్ విష‌యంలో నిర్మాత దాము గారు చాలా ప‌ర్టిక్యుల‌ర్‌గా ఉంటారు. కేస్టింగ్ విష‌యంలోనూ అంతే. ఆ బ్యాన‌ర్ నుంచి సినిమా వ‌స్తోందంటే.. హిట్ అయిన‌ట్లే అనే అభిప్రాయం ఉంది. ప్రొడ‌క్ట్ విష‌యంలో ఆయ‌న అంత శ్ర‌ద్ధ చూపిస్తారు. ఈ సినిమాకు న‌లుగురు పిల్ల‌ర్లు. దాముగారు, సాగ‌ర్‌గారు, జ‌గ‌ప‌తిబాబు గారు, లైన్ ప్రొడ్యూస‌ర్ వాసు ప‌రిమి. ఈ సినిమా ఇంత బాగా రావ‌డానికి వాళ్లు ప్ర‌ధాన కార‌ణం.

*Audience will connect with Father-Son Relationship in ‘FCUK (Father-Chitti-Umaa-Kaarthik)’ – Hero Ram Karthik*‌

Father Chitti Umaa Kaarthik popularly known by acronym FCUK which has created high expectations with its teaser is set to hit the theaters on February 12th. The movie directed by Vidyasagar Raju presents Raam Kaarthik and Jagapathi Babu in a unique son and father relationship. This was revealed in the media interaction of Ram Kaarthik today details of which are below.

How did you get the opportunity in this film?
Our film is happy to be trending on social media, on the digital platform.  I saw director Vidyasagar Rajugari’s previous film ‘Racheyta’.  That impressed me a lot.  Karthik’s character was given to me after a lot of study of actors profiles by the production house. Sagar is a very talented director.  As an actor, he brought an angle unknown to even me with this film.  I am happy with the immense appreciation being showered on me for my performance in the film.

How is your character?
I did the role of Karthik in the title.  Its a boy next door kind of character. The prankster character that Jagapathibabu enacted is as  my father.  Our characters not ‘Like Father – Like Son’ but very opposite.

How did it feel to work with a well-known actor like Jagapathi babu Garu?
Jagapathi Babu is a legendary actor.  I feel lucky to share the screen with him.  One of the many scenes that happens between the two of us is an emotional scene that I really like.  That was a challenging scene.  I have to show anger at him in that scene.  Although I seemed nervous at first, I did it with the support he gave me.  That scene came out very well.  The relationship between father and son in this film is not only fun but also emotional.  It will reach the audience well.

What exactly is this movie about?
It is about how a love story of Kaarthik and Umaa is interrupted by entry of Chitti and how it is resolved. Director Vidyasagar has presented this narrative with lot of fun and humour.

Isn’t it hard to work with a small baby?
None.  We did not have any problems working with her. In Fact she was the one who made it very stress free.  The character of Chitti was very well done by Baby Sahasritha.  She is a Born Artist.  She gave whatever expression we needed.

What about the heroine Ammu Abirami?
Have a good working experience with Ammu Abhirami.  She has no ordinary memory.  She is a very Talented Artist‌.

What song do you personally like in the movie?
I really like “Poovalle” written and sung by music director Bhims among the songs.  It is very emotional.  Bhims wrote the song with his daughter in mind.  We are delighted  that the album as a whole has been rated as very good.

What about working on a prestigious banner like Sri Ranjith Movies?
Really very happy to have the opportunity to star in a prestigious banner like Sri Ranjith Movies.  Producer Damu is very particular about the script.  The same is true of casting.  The movie is coming from a banner which gives a foregone conclusion from the beginning that it is a hit.  He pays so much attention to the product.  There are four pillars in this movie.  Damugaru, Sagar garu, Jagapati babu Garu, Line Producer Vasu Parim Garui.  They are the main reason why this film came out so well.

 

7890 (10) 7890 (8) 7890 (6) 7890 (4) 7890 (3) 7890 (1)

*After this film I am confident that Jagapathi Babu will get a lot of jovial characters: KL Damodar Prasad, Producer

*’ఎఫ్‌సీయూకే’ ఒక కామిక్ రిలీఫ్ లాంటి సినిమా: డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజు
*ఈ సినిమా రిలీజ‌య్యాక జ‌గ‌ప‌తిబాబుకు ఈ త‌ర‌హా జోవియ‌ల్‌ క్యారెక్ట‌ర్లు మ‌రిన్ని వ‌స్తాయ‌నుకుంటున్నా:  నిర్మాత కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్‌

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)‘. రామ్ కార్తీక్‌-అమ్ము అభిరామి యువ జంట‌గా, మ‌రో కీల‌క పాత్ర‌లో బేబి స‌హ‌శ్రిత న‌టించగా విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ (దాము) నిర్మించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది.

‘ఎఫ్‌సీయూకే’ సినిమా విశేషాల‌ను వెల్ల‌డించ‌డానికి సోమ‌వారం నిర్మాత దామోద‌ర్ ప్రసాద్ (దాము), ద‌ర్శ‌కుడు విద్యాసాగ‌ర్ రాజు (సాగ‌ర్‌) మీడియాతో ఇంట‌రాక్ట్ అయ్యారు.

ప్ర‌శ్న‌:  విద్యాసాగ‌ర్ రాజు డైరెక్ష‌న్‌లో ఈ సినిమా నిర్మించ‌డానికి మిమ్మ‌ల్ని ప్రేరేపించిన అంశ‌మేమిటి?
దాము:  సినిమా సినిమాకీ నాకు రెండు మూడేళ్లు గ్యాప్ రావ‌డానికి కార‌ణం, స్క్రిప్ట్ విష‌యంలో నేను తీసుకొనే కేర్‌. స్క్రిప్ట్ నాకు యూనిక్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటే త‌ప్ప నేను సినిమా చెయ్య‌ను. అలాగే డైరెక్ట‌ర్‌గా నేను ఎంచుకొనే వ్య‌క్తికి సంబంధించి ఇండ‌స్ట్రీలో అత‌ని అనుభ‌వాన్నీ, ప‌నిమీద అంకిత‌భావాన్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాను. 24 శాఖ‌ల్లో ఎంతో కొంత అవ‌గాహ‌న ఉందా, లేదా అనేది చూస్తాను. న‌చ్చితే క‌లిసి ప‌నిచేస్తా. స్క్రిప్ట్ న‌చ్చితే సినిమా మొద‌లుపెడ‌తాను. దీనివ‌ల్లే సినిమా సినిమాకీ నేను టైమ్ తీసుకుంటాను. జ‌గ‌ప‌తిబాబు గారి ద్వారా సాగ‌ర్ నాకు ప‌రిచ‌య‌మ‌య్యాడు. అత‌ను ఇండ‌స్ట్రీలో న‌లిగిన వ్య‌క్తి. టాలెంట్ ఉంది. అత‌నో స‌బ్జెక్ట్ చెప్పాడు. ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ క‌థ‌లోని సోల్‌కు క‌నెక్ట‌య్యా. స్క్రిప్ట్ సంతృప్తిక‌రంగా వ‌చ్చాక సినిమా స్టార్ట్ చేశాం.

ప్ర‌శ్న‌: ‘ఎఫ్‌సీయూకే’ అని కాంట్ర‌వ‌ర్షియ‌ల్ టైటిల్ ఎందుకు పెట్టారు?
దాము: ఈ సినిమా క‌థ న‌డిచేది నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ల‌తో. అందుక‌ని ‘ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్’ అని పెట్టాం. అది లెంగ్తీగా అనిపిస్తున్న‌ద‌ని భావించి, పొడి అక్ష‌రాల్లో ‘ఎఫీసీయూకే’ అని పిలుస్తున్నాం. అందులో ఓ అక్ష‌రం అటూ ఇటూ అయితే బూతు అవుతుంద‌ని తెలుసు. టైటిల్ పెట్టాక చాలా మంది ఇదేం టైటిల్ అని అడిగారు. కానీ సినిమాలో ఎక్క‌డా బూతు ఉండ‌దు. హాయిగా న‌వ్వుకొనేట్లు ఉంటుంది.
సాగ‌ర్‌: ఈ సినిమాకు సోల్ ఆ నాలుగు పాత్ర‌లే. జ‌గ‌ప‌తిబాబు గారు చేసిన పాత్ర పేరు ఫ‌ణి. ఆయ‌న‌ది హీరో ఫాద‌ర్ క్యారెక్ట‌ర్‌. మూడు త‌రాల‌కు చెందిన పాత్ర‌లు, జ‌న‌రేష‌న్ గ్యాప్‌తో వ‌చ్చే ఇబ్బందుల‌ను, ఆ పాత్ర‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌ను కామిక్ వేలో చెప్పాం. సినిమా అంతా హిలేరియ‌స్‌గా న‌వ్విస్తుంది. సినిమా చూస్తే, ‘ఎఫ్‌సీయూకే’ అనే టైటిల్ యాప్ట్ అని అంద‌రూ అంటారు.

ప్ర‌శ్న‌:  చిన్న‌పాప‌తో న‌టింప‌చేయ‌డం క‌ష్ట‌మ‌నిపించ‌లేదా?
సాగ‌ర్‌: క‌ష్ట‌మే. ఈ విష‌యంలో జ‌గ‌ప‌తిబాబు గారికి థాంక్స్ చెప్పాలి. ఆ పాప కాంబినేష‌న్‌తో వ‌చ్చే సీన్ల‌ను తీసేప్పుడు ఆయ‌న ఎంతో పేషెన్స్‌తో మాకు స‌హ‌క‌రించారు. సాధార‌ణంగా పిల్ల‌లు నిద్ర‌పోతే వెంట‌నే లేవ‌రు. కానీ స‌హ‌శ్రిత సూది కింద‌ప‌డిన శ‌బ్దం వినిపించినా లేచేసేది. అందుక‌ని ఆమె నిద్ర‌పోయే సీన్లు తీయాల్సి వ‌చ్చిన‌ప్పుడు యూనిట్ మెంబ‌ర్స్ అంద‌రం కాళ్ల‌కు చెప్పులు కూడా వేసుకోకుండా ప‌నిచేశాం. ఏమైనా బేబి స‌హ‌శ్రిత ఈ సినిమాకు ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ అని చెప్పాలి.

ప్ర‌శ్న‌:  సినిమాకు సెన్సార్ నుంచి ‘ఎ’ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది క‌దా?  దానికేమంటారు?
దాము: శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్ అనేది ఎప్పుడూ త‌ల‌దించుకొనే సినిమాలు తియ్య‌దు. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు సింగిల్ క‌ట్ కానీ, బీప్ కానీ లేకుండా ‘ఎ’ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. అలా అని ఈ సినిమాలో న్యూడిటీ కానీ, కిస్ సీన్స్ కానీ ఉండ‌వు. కొన్ని బోల్డ్ డైలాగ్స్ ఉంటాయి. వాటిని క‌ట్ చేయించుకొని యు/ఎ స‌ర్టిఫికెట్ తీసుకోవ‌చ్చు. కానీ అలా చేస్తే ఆ సీన్‌లోని ఎమోష‌న్ పోతుంది. అందుకే క‌ట్ లేకుండా ‘ఎ’ స‌ర్టిఫికెట్ ఇస్తామంటే తీసేసుకున్నాను.

ప్ర‌శ్న‌: మ‌హ‌మ్మారి టైమ్‌లో చాలామంది త‌మ సినిమాల‌ను ఓటీటీలో రిలీజ్ చేశారు క‌దా.. మీరెందుకు ఇవ్వ‌లేదు?
దాము:  ప్ర‌తి సినిమా నాకొక లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్‌. అలాగే పాండ‌మిక్ టైమ్ కూడా లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్సే. నేను కేవ‌లం బిజినెస్ చేసుకోవ‌డం కోస‌మే సినిమా తియ్య‌ను. నేను ఏం చేశానో అది సినిమాయే చెబుతుంది. అదే నాకు బిజినెస్ తీసుకొస్తుంది. దాని కోసం నేను ప‌రుగులు పెట్ట‌ను. ఈ సినిమా తీసింది థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చెయ్య‌డానికి. సినిమా మొద‌లయ్యే ముందు దాకా నేను వ్య‌క్తుల్ని ప‌ట్టించుకుంటాను, మొద‌ల‌య్యాక నేను నా ప్రొడ‌క్ట్‌ని త‌ప్ప వ్య‌క్తుల్ని ప‌ట్టించుకోను. ఏం చెప్పినా అది నా ప్రొడ‌క్టే చెప్పాల‌నుకుంటాను. ఇది నేను ఎంచుకున్న చాయిస్‌. ప్రొడ‌క్ట్ బాగుంటే అంద‌రికీ పేరొస్తుంది, అది అంద‌రికీ కెరీర్‌ని ఇస్తుంది.

ప్ర‌శ్న‌:  సినిమాలో ప్రేక్ష‌కుల్ని అల‌రించే అంశాలేమిటి?
సాగ‌ర్‌:  ప్ర‌ధానంగా కామెడీని ఆస్వాదిస్తారు. ఈ సినిమా ఆద్యంతం కామెడీతో అల‌రిస్తుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఆడియెన్స్‌కు ఈ సినిమా ఓ కామిక్ రిలీఫ్. ఇది జెన్యూన్ ఫిల్మ్‌. ఇందులోని ప్ర‌తి ఎమోష‌న్ జెన్యూన్‌గా అనిపిస్తుంది. ఎక్క‌డా ఫోర్స్‌డ్‌గా అనిపించ‌దు.
దాము: ఈమ‌ధ్య మాకు తెలిసిన‌వాళ్ల‌కు ఈ సినిమా చూపించాను. ఆడియెన్స్‌లో పెద్ద‌వాళ్ల నుంచి చిన్న‌వాళ్ల దాకా ఉన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ సినిమాలోని ఏదో ఒక పాత్ర‌తోటో, ఇన్సిడెంట్‌తోటో క‌నెక్ట్ అయ్యారు. బాగుంద‌న్నారు. దాంతో ఓ మంచి జెన్యూన్ ఫిల్మ్ తీశామ‌నే న‌మ్మ‌కం, సంతృప్తి క‌లిగాయి.

ప్ర‌శ్న‌:  ఫాద‌ర్ క్యారెక్ట‌ర్‌కు జ‌గ‌ప‌తిబాబు గారు ఫ‌స్ట్ చాయిస్సేనా?
సాగ‌ర్‌:  దాముగారు చెప్పిన‌ట్లు ఈ స్క్రిప్ట్‌ను కానీ, ఇందులోని క్యారెక్ట‌ర్ల‌ను కానీ ఏ యాక్ట‌ర్ల‌నీ దృష్టిలో పెట్టుకొని రాయ‌లేదు. ఒక జెన్యూన్ స్క్రిప్ట్ చేశాం. అందులోని క్యారెక్ట‌ర్ల‌కు ఎవ‌రైతే బాగుంటామ‌ని అనుకున్నామో వాళ్ల‌ను తీసుకున్నాం. ఫాద‌ర్ క్యారెక్ట‌ర్‌కు, అందులోని చిలిపిత‌నానికీ జ‌గ‌ప‌తిబాబు గారైతే బాగా న్యాయం చేస్తార‌నీ, ఆయ‌నైతే దానికి క‌రెక్టుగా స‌రిపోతార‌నీ అనిపించి, ఆయ‌న‌ను అప్రోచ్ అయ్యాం. విన‌గానే ఆయ‌న క్యారెక్ట‌ర్‌కు క‌నెక్ట‌యి ఓకే చెప్పారు.
దాము:  శోభ‌న్‌బాబు గారి త‌ర్వాత అంత‌టి లేడీస్ ఫాలోయింగ్ ఉన్న తెలుగు హీరో జ‌గ‌ప‌తిబాబే. ‘లెజెండ్’ సినిమా నుంచి ఆయ‌న విల‌న్ రోల్స్ పోషిస్తూ వ‌స్తున్నా, ఇప్ప‌టికీ ఆయ‌న లేడీస్ ఫాలోయింగ్‌లో మార్పు లేదు. న‌ల‌భైల్లో, యాభైల్లో ఉన్న ఆడ‌వాళ్ల‌లోనే కాదు, టీనేజ్‌లో, ఇర‌వైల‌లో ఉన్న అమ్మాయిల్లోనూ ఆయ‌న‌కు మంచి ఫాలోయింగ్ ఉండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. ‘ఎఫ్‌సీయూకే’ రిలీజ‌య్యాక ఆయ‌న‌కు ఈ త‌ర‌హా జోవియ‌ల్ క్యారెక్ట‌ర్లు మ‌రిన్ని వ‌స్తాయ‌నుకుంటున్నాను.

*’FCUK is a comic relief film: Director Vidyasagar Raju

*After this film I am confident that Jagapathi Babu will
get a lot of jovial characters: KL Damodar Prasad, Producer

FCUK film which is an acronym for Father Chitti Uma Karthik which stars Jagapathi Babu as the main lead along with Ram Kaarthik and Ammu Abhirami as a romantic young couple and Baby Sahasritha in a pivotal role is set to release on February 12th 2021.

The movie team led by producer by KL Damodhar Prasad of Sri Ranjith Movies and Director Vidyasagar Raju while interacting with the media on Monday revealed the highlights of FCUK movie.

Question: What inspired you to make this film under the direction of Vidyasagar Raju?
Damu: The reason I take two to three years time for each film is my attention to scripts. I don’t begin work on a movie unless I am absolutely confident that the script is unique and interesting. I also am very selective about the directors I work with. I look into their commitment to work and their experience with various crafts. Vidyasagar is a very talented director but has been crushed in the industry. When I saw his script it was very interesting and we worked on the detailing and now I am very happy with the result. I am thankful to Jagapathi Babu garu for introducing Vidyasagar to me.

Question: Why the controversial title ‘FCUK’?
Damu: The story of this film is told with four main characters. That is why we named it ‘Father-Chitti-Uma-Karthik’. Since its lengthy name we are using its acronym FCUK. I know that a small spelling change will change the meaning but there is nothing of such type in the movie. The movie will only generate wholesome laughter.
Sagar: There are only four characters in this movie. The name of the character played by Jagapathibabu is Phani. He is a hero father character. The characters of the three generations, the difficulties caused by the generation gap, and the scenes between the characters are told in the comic way. The whole movie is hilarious. If you watch the movie, you will say that the title ‘FCUK’ is apt.

Question: Wasn’t it difficult to work with a baby?
Sagar: It’s hard. Thanks to Jagapathibabu for this. He was very patient with us when we shot the scenes that came with baby combination. Usually children do not wake up immediately when they fall asleep. But small sounds used to wake her. So when she had to do the sleeping scenes, all the members of the unit worked without even putting sandals on their feet. Anyway, it’s a God-given gift for this baby-friendly movie.

Question: Did the film get an ‘A’ certificate from the censor?
Damu: Shree Ranjith Movies banner will never make a movie that is not family oriented. The film was given an ‘A’ certificate by the censors without a single cut or beep. That said, there are no nudity or kiss scenes in this movie. There are some bold dialogues. You can cut them and get a U / A certificate. But doing so loses the emotion in that scene. That is why we took ‘A’ certificate without a cut.

Question: Many people have released their films in OTT during pandemic Time .. why didn’t you do that?
Damu: Every movie is a learning experience for me. As well as the pandemic time is also a learning experience. I love movies and I am not doing movies only as a business. This movie was made for the audience to enjoy in the theaters. As a product I want to take it to the maximum people.  If the product is good, it will give a name to everyone, it will give a career to everyone.

Question: What entertains the audience in this movie?
Sagar: Everyone will enjoy the comedy in the movie. The film manages to entertain with its comedy throughout. In a word, this movie is a comic relief for the audience. This is a genuine film. Every emotion in it feels genuine. Doesn’t seem to be forced anywhere.
Damu: Recently I showed this movie to people we know. Audiences ranged from adults to children. Everyone felt connected with some character or incident in the movie. With that came the confidence and satisfaction of making a good genuine film.

Question: Is Jagapathibabu the first choice for the father character?
Sagar: As Damu garu said, this script was not written with any of the characters in mind. We did a genuine script. We thought anyone would be good at the characters in it. But Jagapathi Babus stellar performance has made a phenomenal difference to the movie.

 

00124 (1) 00124 (3) 00124 (6) 00124

*Festivities mark FCUK (Father Chitti Uma Karthik) Barasala Function

 

*సంద‌డి సంద‌డిగా జ‌రిగిన ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) బార‌సాల వేడుక‌
*వీడియో సాంగ్స్‌ను విడుద‌ల చేసిన యూట్యూబ్ స్టార్స్‌
*ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన ఎంట‌ర్‌టైన‌ర్ ఈ సంవ‌త్స‌రం ఇంకా రాలేదు..ఈ సినిమా ఆ ఎంట‌ర్‌టైన‌ర్ కాబోతోంది: -జ‌గ‌ప‌తిబాబు
జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా, రామ్ కార్తీక్‌-అమ్ము అభిరామి యువ జంట‌గా, మ‌రో కీల‌క పాత్ర‌లో బేబి స‌హ‌శ్రిత న‌టించిన ‘ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)‘ చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ (దాము) నిర్మించారు.

శ‌నివారం సాయంత్రం హైద‌రాబాద్‌లోని హోట‌ల్ ద‌స్‌ప‌ల్లాలో ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) బార‌సాల (ప్రి రిలీజ్‌) వేడుక సంద‌డి సంద‌డిగా, క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. ఇదివ‌ర‌కు ఈ చిత్రంలోని ఆడియో సాంగ్స్‌ను కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్ చేతుల మీదుగా విడుద‌ల చేయ‌గా, ఈ బార‌సాల వేడుక‌లో వాటి వీడియో సాంగ్స్‌ను పాపుల‌ర్ యూట్యూబ‌ర్స్‌తో రిలీజ్ చేయించ‌డం గ‌మ‌నార్హం.

శ్రీ రంజిత్ మూవీస్ అధినేత కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ, “ఈరోజు స్పెష‌ల్ డే. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ పుట్టిన‌రోజు. ఇదేరోజు మా సినిమా బార‌సాల జ‌రుపుకోవ‌డం సంతోషంగా ఉంది. శ్రీ రంజిత్ మూవీస్ 46 సంవ‌త్స‌రాలుగా సినిమాలు తీస్తూ వ‌స్తోంది. నాది ఇంట్రెస్టింగ్ జ‌ర్నీ. జ‌గ‌ప‌తిబాబు గారి వ‌ల్ల డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజు నాలుగేళ్ల క్రితం ప‌రిచ‌య‌మ‌య్యారు. ఈ స్క్రిప్ట్‌పై దాదాపు ఏడాది పాటు వ‌ర్క్ చేశాం. స్క్రీన్‌ప్లే ప‌రంగా కానీ, కాస్టింగ్ ప‌రంగా కానీ, టెక్నీషియ‌న్స్ పరంగా కానీ ది బెస్ట్ చేశామ‌ని న‌మ్ముతున్నాను. ఒక్క మాట‌లో చెప్పాలంటే ప్ర‌తి విష‌యంలోనూ ఈ సినిమా ది బెస్ట్‌. నాకు యూనిక్ స్క్రిప్ట్‌లంటే ఇష్టం. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే త‌ప్ప సినిమా చెయ్యను. నేనెప్పుడూ ప్రొడ‌క్ట్ క్వాలిటీ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాను. ప్రేక్ష‌కులు ఖ‌ర్చుపెట్టే ప్ర‌తి రూపాయికీ న్యాయం జ‌ర‌గాల‌నుకుంటాను. నేను ఖ‌ర్చుపెట్టే ప్ర‌తి రూపాయీ స్క్రీన్ మీద క‌నిపిస్తుంది. ప్రొడక్ట్ బాగుంటే దానికి ప‌నిచేసే ప్ర‌తి ఒక్క‌రి కెరీరూ బాగుంటుంది. నాకు వ్యాపార‌ప‌రంగా బాగుంటుంది. నేను న‌మ్మే సూత్రం ఇదే! తొమ్మిది నెల‌ల కొవిడ్ మ‌హ‌మ్మారి త‌ర్వాత ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌ను గౌర‌వించాల‌నీ, వారి స‌ర్వీసుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జెయ్యాల‌నే ఉద్దేశంతో ఈ సినిమా పాట‌లను వారి చేతుల మీదుగా రిలీజ్ చేశాం. మ‌హ‌మ్మారి టైమ్‌లో సినిమాలు లేక‌పోవ‌డంతో యూట్యూబ్ స్టార్స్ ఆడియెన్స్‌కు ఎంతో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. సినిమా స్టార్స్‌కు ఉన్న పాపులారిటీ సంపాదించారు. అందుకే వారి చేతుల మీదుగా ఈరోజు వీడియో సాంగ్స్‌ను రిలీజ్ చేసాము. ఈ సినిమాకి నాతో పాటు ట్రావెల్ చేసి, ఇంత బాగా రావ‌డానికి తోడ్ప‌డిన నా టీమ్‌ కు థాంక్స్ చెప్పుకుంటున్నా. అలా మొద‌లైంది మూవీ నుంచి ప్ర‌తి సినిమాకీ మేం న్యూ టాలెంట్‌ను ఇంట్ర‌డ్యూస్ చేస్తూ వ‌స్తున్నాం. ఈ సినిమాతో సినిమాటోగ్రాఫ‌ర్‌గా శివ‌ను ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాం. త‌ను ఫెంటాస్టిక్ విజువ‌ల్స్ ఇచ్చాడు. ఈ సినిమాకు బాలాదిత్య‌, క‌రుణాక‌ర్ జంట ర‌చ‌యిత‌లుగా పనిచేశారు. న‌టుడు బాలాదిత్య రైట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఆ ఇద్ద‌రూ డైలాగ్స్‌తో పాటు లిరిక్స్ రాశారు. ఇప్ప‌టిదాకా నా సినిమాల‌కు క‌ల్యాణీ మాలిక్ మ్యూజిక్ ఇస్తూ వ‌చ్చారు. ఈ సినిమాకు ఆయ‌న‌కు బ్రేక్ ఇచ్చి భీమ్స్ సెసిరోలియోతో చేయించాను. త‌ను ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చాడు. మా యాక్ట‌ర్స్ జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, స‌హ‌శ్రిత‌, రాజా ద‌గ్గుబాటి త‌దిత‌రులు చాలా బాగా చేశారు.” అని చెప్పారు.

ఆ త‌ర్వాత చిత్రంలోని వీడియో సాంగ్స్‌ను యూట్యూబ్ స్టార్స్ రిలీజ్ చేశారు. “ముఝ్ సే ఏక్ సెల్ఫీ లేలో” సాంగ్‌ను బ‌బ్లూ, “నేనేం చెయ్య..” పాట‌ను దుర్గారావు దంప‌తులు, “మ‌న మ‌న‌సు క‌థ” పాట‌ను దేత్త‌డి హారిక‌, “హే హుడియా ప్రేమ‌లో ప‌డిపోయా” సాంగ్‌ను దిల్ సే మెహ‌బూబ్, “గారాల‌ప‌ట్టి నా గుండెత‌ట్టి” పాట‌ను ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌ రిలీజ్ చేశారు. జ‌గ‌ప‌తిబాబుకు చిన్న‌ప్ప‌ట్నుంచీ తాను ఫ్యాన్‌న‌నీ, ఆయ‌న‌తో క‌లిసి ఓ స్టెప్ వెయ్యాల‌నేది త‌న కోరిక అనీ దుర్గారావు చెప్ప‌గా, జ‌గ‌ప‌తిబాబు స్టేజి మీద‌కు వ‌చ్చి నేనేం చెయ్య పాట‌కు దుర్గారావుతో క‌లిసి స్టెప్పులేశారు. దేత్త‌డి హారిక‌తో క‌లిసి భ‌ర‌త్‌, సునీల్ డాన్స్ చేశారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సెసిరోలియో మాట్లాడుతూ, తాను హైస్కూల్లో నైన్త్ క్లాస్ చ‌దువుతున్న‌ప్పుడు ఫొటోతో పాటు ఆటోగ్రాఫ్ కావాల‌ని త‌ను లెట‌ర్ రాస్తే చెన్నై నుంచి త‌న‌కు ఆటోగ్రాఫ్‌తో ఓ ఫొటో వ‌చ్చింద‌నీ, అది జ‌గ‌ప‌తిబాబు గారిద‌నీ తెలిపారు. హీరో అంటే త‌న‌కు మొద‌ట తెలిసింది ఆయ‌నేన‌నీ అన్నారు. చిన్న క‌ల‌ల‌నీ, క‌న్నీళ్ల‌నీ పొదుపు చేసుకొని ప్రయాణిస్తూ ఇక్క‌డికొస్తే, సుమారు ఇర‌వై ఏళ్ల ప్ర‌యాణం త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబు గారిని క‌లుసుకొని, ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేశాన‌నీ చెప్పారు. భీమ్స్ ఎమోష‌న‌ల్‌గా మాట్లాడుతుండ‌గా, జ‌గ‌ప‌తిబాబు వేదిక మీద‌కొచ్చి ఆయ‌న‌ను ఆత్మీయంగా కౌగ‌లించుకున్నారు.

ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీ తుమ్మ‌ల ప్ర‌స‌న్న కుమార్‌, ఫిల్మ్‌చాంబ‌ర్ ప్రొడ్యూస‌ర్స్ సెక్టార్ సెక్ర‌ట‌రీ సి.ఎన్‌. రావు కూడా ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడి, సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌నే ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు.

ఈ సినిమా బిగ్‌ టిక్కెట్టును హీరో సునీల్ వెయ్యి రూపాయ‌ల‌కు కొనుగోలు చేశారు.

రైట‌ర్‌గా మారిన న‌టుడు బాలాదిత్య మాట్లాడుతూ, “జ‌గ‌ప‌తిబాబు సినిమా సంక‌ల్పంలో ఆయ‌న చిన్న‌ప్ప‌టి క్యారెక్ట‌ర్ చేశాను. ఇప్పుడు ఆయ‌న సినిమాకి డైలాగ్స్ రాసే అవ‌కాశం రావ‌డం వండ‌ర్ఫుల్ ఆప‌ర్చునిటీ. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ పుట్టిన రోజున నేను డైలాగ్ రైట‌ర్‌గా పుట్టాను. అలాగే ఇందులో మూడు పాట‌లు రాశాను. వాటిలో ఓ ఇంగ్లీష్ పాట‌ను కూడా రాయ‌గ‌లిగాను” అన్నారు.

రైట‌ర్ క‌రుణాక‌ర్ మాట్లాడుతూ, “గేయ‌ర‌చ‌యిత అయిన న‌న్ను విద్యాసాగ‌ర్ రాజు త‌న ‘ర‌చ‌యిత’ అనే మూవీతో డైలాగ్ రైట‌ర్‌గా ప‌రిచ‌యం చేశారు. ఆ సినిమా త‌ర్వాత నాకు మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. నా లైఫ్‌లో ఓ బ్యూటిఫుల్ డైమండ్ ఈ సినిమా” అన్నారు.

న‌టుడు భ‌ర‌త్ మాట్లాడుతూ, “ఈ సినిమా విజువ‌ల్స్ చూశాక అందులో క‌నిపించింది నేనేనా అని నాకే డౌట్ వేసింది. న‌న్ను చాలా బాగా చూపించారు. నా చిన్న‌ప్పుడు జ‌గ‌ప‌తిబాబు గారు ఎలా ఉన్నారో, ఇప్పుడు నేను పెద్ద‌య్యాక కూడా ఆయ‌న అలాగే ఉన్నారు. రామ్ కార్తీక్ చాలా మంచి మ‌నిషి. అమ్ము అభిరామికి ఉన్న ల‌క్ష‌లాది మంది ఫ్యాన్స్‌లో నేనూ ఒక‌డ్ని. ఇండస్ట్రీకి ఆమె ఒక బ్లెస్సింగ్‌. ఒక న‌టుడిలోని తెలీని డైమ‌న్ష‌న్‌ను బ‌య‌ట‌కు లాగే డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజు. శ్రీ రంజిత్ మూవీస్ లెగ‌సీని దాముగారు కొన‌సాగిస్తున్నారు” అన్నారు.

హీరోయిన్ అమ్ము అభిరామి మాట్లాడుతూ, “ఇలా హీరోయిన్‌గా ఓ మంచి టీమ్ ద్వారా లాంచ్ అవ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఐ యామ్ సో బ్లెస్‌డ్‌. దాముగారు నాకు గాడ్‌ఫాద‌ర్‌లా అయిపోయారు. జ‌గ‌ప‌తిబాబు గారు, రామ్ కార్తీక్‌, భ‌ర‌త్, టీమ్ మొత్తం నా ఫ్యామిలీలా అనిపించింది. ఈ సినిమా ఆడియెన్స్‌కు ఓ ట్రీట్‌లాగా, ఓ ఫీస్ట్‌లాగా ఉంటుంది” అన్నారు.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, “సినిమాకు మంచి పాజిటివ్ వైబ్స్ వ‌స్తున్నాయి. శ్రీ రంజిత్ మూవీస్ లాంటి ప్రెస్టీజియ‌స్ బ్యాన‌ర్‌లో అవ‌కాశం ద‌క్క‌డం అదృష్టంగా భావిస్తున్నా. దాముగారు త‌లుచుకుంటే నా ప్లేస్‌లో పెద్ద స్టార్ ఉండేవారు. క్యారెక్ట‌ర్స్‌కు త‌గ్గ కాస్టింగ్‌ను న‌మ్ముతారు కాబ‌ట్టే నాకు చాన్స్ ఇచ్చారు. విద్యాసాగ‌ర్ రాజు ప‌ని రాక్ష‌సుడు. సినిమా త‌ప్ప ఆయ‌న‌కు వేరే ప్ర‌పంచం లేదు. లెజెండ్ లాంటి జ‌గ‌ప‌తిబాబు గారితో క‌లిసి న‌టించే అవ‌కాశం నాకు ల‌భించింది. ఆయ‌న కామెడీ టైమింగ్ వేరే లెవ‌ల్‌. భీమ్స్ అమేజింగ్ ఆల్బ‌మ్ ఇచ్చారు. ఆల్బ‌మ్ మొత్తం వైర‌ల్ అయ్యింది” అన్నారు.

న‌టుడు సునీల్ మాట్లాడుతూ, “ఈ సినిమా ద్వారా అంద‌రికీ మంచి కెరీర్ రావాల‌ని కోరుకుంటున్నాను. సాల్ట్, పెప్ప‌ర్ తినే ప్ర‌తి మ‌నిషీ ఈ సినిమా చూడాల‌ని నేను కోరుకుంటున్నాను” అన్నారు.

డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజు మాట్లాడుతూ, సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌నీ, అంద‌రూ ఎంజాయ్ చేస్తార‌నీ ఆశిస్తున్నాన‌ని చెప్పారు.

ప్ర‌ధాన పాత్ర‌ధారి జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ, “ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌, యూట్యూబ‌ర్స్ మా సెల‌బ్రిటీల‌నేది ఎక్స‌లెంట్ థాట్‌. ఎవ‌రూ ఆ ప‌నిచెయ్య‌లేదు. ఆ ఆలోచ‌న చేసిన‌వాళ్ల‌ను ప్ర‌శంసిస్తున్నాను. 300 మంది క‌ష్ట‌ప‌డితే ఓ సినిమా వ‌స్తుంద‌ని మెహ‌బూబ్ అన్నాడు. కానీ ఒక్క‌రే వ‌న్ మ్యాన్ షోగా క‌ష్ట‌ప‌డి యూట్యూబ‌ర్‌గా పేరు తెచ్చుకుంటున్నారంటే.. మీరు గొప్ప‌వాళ్లు. మిలియ‌న్ల మందికి వినోదాన్నిస్తున్నారు. ఆస‌మ్‌. ఐ యామ్ రియ‌ల్లీ హ్యాపీ. యు ఆర్ రియ‌ల్లీ గ్రేట్‌. ఈ ప్రాజెక్ట్ స్టార్ట‌యిన‌ప్పుడు టైటిల్‌, సినిమా బాగుండాల‌ని డైరెక్ట‌ర్ సాగ‌ర్‌కు చెప్పాను. టైటిల్ ‘ఎఫ్‌సీయూకే’ అని చెప్పాడు. చాలా బాగుంద‌న్నాను. టీజ‌ర్ కూడా ఆల్రెడీ స‌క్సెస‌య్యింది. టైటిల్‌ను చూసి, కొంత‌మంది వేరేగా అనుకుంటున్నారు. ఈ సినిమాలో బూతు లేదు. జ‌నాల‌కు రీచ్ కావాల‌నే ఆ టైటిల్ పెట్టాం. ఫైన‌ల్‌గా ఆ టైటిల్‌కు అర్థం ‘ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్’ అనే. ఇది హిలేరియ‌స్ ఫిల్మ్‌. ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన ఎంట‌ర్‌టైన‌ర్ ఈ సంవ‌త్స‌రం ఇంకా రాలేదు కాబ‌ట్టి, ఈ సినిమా ఆ ఎంట‌ర్‌టైన‌ర్ కాబోతోందని ఆశిస్తున్నాను.” అన్నారు.

నటీమణులు క‌ల్యాణీ న‌ట‌రాజ‌న్‌, శ్రీ రాపాక సినిమాటోగ్రాఫ‌ర్ శివ‌, లైన్ ప్రొడ్యూస‌ర్ వాసు త‌దిత‌రులు మాట్లాడారు.

తారాగ‌ణం:
జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌.

సాంకేతిక బృందం:
మాటలు:ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: జె.కె.మూర్తి
పి.ఆర్.ఓ: యల్. వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూస‌ర్: వాసు ప‌రిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: శ్రీ‌కాంత్‌రెడ్డి పాతూరి
స‌హ‌నిర్మాత: య‌ల‌మంచిలి రామ‌కోటేశ్వ‌ర‌రావు
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
బ్యాన‌ర్‌: శ్రీ రంజిత్ మూవీస్.

*Festivities mark FCUK (Father Chitti Uma Karthik) Barasala Function |

*Youtube Stars release video songs of FCUK Movie | 
*FCUK (Father Chitti Uma Karthik) film will give audiences wholesome entertainment that they have been awaiting – Jagapathi Babu
Preparing for February 12th release is FCUK (Father Chitti Uma Karthik) Movie which has Jagapathi Babu in the lead role along with young pair Ram Kaarthik and Ammu Abhirami. It also has Baby Sahasritha in a pivotal role. FCUK which is an acronym for Father Chitti Umaa Kaarthik has been directed by Vidyasagar Raju and produced by Sri Ranjith Movies led by K L Damodar Prasad.
The Barasala (Pre-release event) function of FCUK Movie that was held on Saturday Evening at Hotel Daspalla of Hyderabad was a high octane event. After having Covid warriors release the vocals of the movie songs, the event became a grand stage wherein YouTube stars released  the movie songs music videos with bunch fanfare.Speaking on the occasion FCUK Movie producer KL Damodar Prasad said that today is a very special day as this is the date on which Telugu Film Industry was born. He said he was happy that on the same day FCUK movie Barasala function was also being held. Recalling the milestones of the 46 year movie making journey of Sri Ranjith Movies, he thanked everyone who made this incredible journey possible. He recounted how FCUK Movie journey started with Jagapathi Babu introducing him to Director Vidyasagar Raju and upon finding his concept interesting, the entire team worked hard to make the movie perfect in every-way possible and the results are now there for everyone to see. Sri Ranjith Movies takes pride in introducing new talent and this movie too introduces new facets of talents of many team members. Shiva as cinematographer has delivered fantastic visuals in his debut. Actor Bala Aditya showcased his new talent as he worked with Karunakar Adigarla to pen the dialogues and lyrics of the film. Music has been composed by Bheems Ceciroleo.

He welcomed the YouTube stars who kept the audiences enthralled during the pandemic to release the songs. ‘Selfie Lelo’ song was released by Babloo, ‘Nenem Cheyaa’ was released by Durgarao couple, ‘Manasu Katha’ by Harika, ‘Hey Hudiya’ by Dil Se Mahboob, ‘Garalapetta’ was released by Shanmukh Jashwanth. Among the highlights was the moment when responding to Durgaraos request Jagapathi stepped on stage to sing along ‘Nenem Cheyaa’ and all other stars joined in to dance. The emotions touched high when Music Director Bheems revealed that as a student he had written to an actor for an autographed photo and actually got it and 20 years later actually got to work with that very actor Jagapathi Babu. Actor Baladitya recalled that he was a child artist in Jagapathi Babus Sankalpam film and now he is excited to be penning dialogues for him. Writer Karunakar thanked Director Vidyasagar for introducing him to writing in his previous film Racheyta. Actor Bharath said director Vidyasagar brought out a new dimension in him and he could hardly recognise himself in the film visuals. Heroine Ammu Abhirami said she felt blessed to be debuting in telugu with such a great film. Hero Ram Karthik said it was an amazing team effort he is delighted the songs have already become a viral hit.

Actor Sunil said that every artist and technician launched by Sri Ranjith Movies had a good carrier and wished the same to everybody involved in this film too. Director Vidyasagar Raju said that he hoped that every one of the Tollywood audience will enjoy this film. Producers council secretary Thumalla Prasanna Kumar, Film chamber producers sector secretary CN Rao were among those who wished the film a success. The movie big ticket was purchased by Hero Sunil for Rupees One Thousand.

Jagapathi Babu said that it was an fantastic idea to get the YouTube stars to release the songs and that everyone is indebted to them for keeping the pandemic year manageable. He compared 300 people working on a movie to the one man show of a YouTuber and said that in itself speaks volumes about their efforts and greatness. Speaking about the movie he said he liked the movie title the moment Director Vidyasagar told him. He said everything about the movie is truly fantastic. He said the amazing success of the teaser itself is a clear indication of how much success the film will be. He said post pandemic the audiences have been awaiting a true entertainer and he was confident that FCUK movie will end that wait.

Actors Kalyan Natrajan, Sri Roopika, Cinematographer Shiva, Live Producer Vasu were among those who spoke.

Movie Name: Father Chitti Umaa Kaarthik
Starring: Jagapathi Babu, Ram Karthik, Ammu Abhirami
Banner: Sri Ranjith Movies
Producer: K L Damodar Prasad
Story / Screenplay / Choreography / Director: Vidyasagar Raju
DOP: Shiva.G
Music: Bheems Ceciroleo
Editor: Kishore Maddali
Art: JK Murthy
Background Score: Jeevan (JB)
Dialogues / Lyrics: Adithya, Karunakar Adigarla
Fights: Stuns Jashuva
PRO: Lakshmivenugopal
Co-Producer: Yalamanchili Rama Koteswara Rao
Executive Producer: Srikanth Reddy Pathuri
Line Producer: Vasu Parimi

790 (7) 790 (8) 790 (6) 790 (4) 790 (2) 790 (3) 790 (1)

Barasalla Function of FCUK (Father Chitti Uma Karthik) announced

ఫిబ్ర‌వ‌రి 6న ‘ఎఫీసీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)‘ బార‌సాల వేడుక‌

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా, రామ్ కార్తీక్‌-అమ్ము అభిరామి యువ జంట‌గా, మ‌రో కీల‌క పాత్ర‌లో బేబి స‌హ‌శ్రిత న‌టించిన ‘ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)‘ చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ (దాము) నిర్మించారు.

కాగా, ఈ నెల 6న, శ‌నివారం ఈ సినిమా బార‌సాల వేడుక జ‌ర‌గ‌నున్న‌ది. ఈ విష‌యం తెలియ‌జేస్తూ, “ఎఫ్‌సీయూకే బార‌సాల వేడుక ఫిబ్ర‌వ‌రి 6న” అంటూ చిత్ర బృందం ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. దీన్ని చూసి బార‌సాల వేడుక ఏమిటి!.. అంటూ అంద‌రిలోనూ ఆశ్చ‌ర్యం, కుతూహ‌లం వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ త‌ర్వాత ప్రి రిలీజ్ ఈవెంట్‌కే ఆ పేరు పెట్టిన‌ట్లు అర్థం చేసుకొన్నారు. ఆ రోజు ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప్రేక్ష‌కులు చూడ‌నున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలోని నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్స్‌, వారి క్యారెక్ట‌ర్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. వీట‌న్నింటికీ ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా టీజ‌ర్‌లో జ‌గ‌ప‌తిబాబు క‌నిపించిన తీరు అంద‌రిలోనూ క్యూరియాసిటీని రేకెత్తించి, సినిమాపై అంచ‌నాల‌ను అనూహ్యంగా పెంచేసింది.

రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో యంగ్ హీరోకు ఫాద‌ర్‌గా టైటిల్ రోల్ చేసిన జ‌గ‌ప‌తిబాబు క్యారెక్ట‌ర్‌లోని రొమాంటిక్ యాంగిల్‌, ఆ యాంగిల్‌ను ఆయ‌న పండించిన తీరు ప్రేక్ష‌కుల్ని అమితంగా అల‌రించ‌నున్నాయి. ఫ్యామిలీ హీరోగా పేరుపొందిన ఆయ‌న చాలా కాలం త‌ర్వాత ఈ త‌ర‌హా పాత్ర‌ను పోషించ‌డం గ‌మ‌నార్హం.

భీమ్స్ సెసిరోలియో సుమ‌ధుర సంగీత బాణీలు అందించిన పాట‌లు ఇటీవ‌ల వ‌రుస‌గా వైద్య‌-ఆరోగ్య‌, మునిసిప‌ల్‌, పోలీస్‌, మీడియా సిబ్బంది లాంటి కొవిడ్ హీరోల చేతుల మీదుగా విడుద‌లై సంగీత ప్రియుల ఆద‌రాభిమానాల‌ను పొందుతున్నాయి.

తారాగ‌ణం:
జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌.

సాంకేతిక బృందం:
మాటలు:ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: జె.కె.మూర్తి
పి.ఆర్.ఓ: యల్. వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూస‌ర్: వాసు ప‌రిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: శ్రీ‌కాంత్‌రెడ్డి పాతూరి
స‌హ‌నిర్మాత: య‌ల‌మంచిలి రామ‌కోటేశ్వ‌ర‌రావు
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
బ్యాన‌ర్‌: శ్రీ రంజిత్ మూవీస్.

 
Barasalla Function of FCUK (Father Chitti Uma Karthik) announced
 
Sri Ranjith Movies today announced that this Saturday which is the 6th of February FCUK (Father Chitti Uma Karthik) movie Barasala Function will be held. The announcement is creating lot of intrigue as to what is Barasala Function will be. Finally Telugu audiences may get to see the first visuals of the much awaited FCUK (Father Chitti Uma Karthik)movie as A poster was released today announcing the date of this ‘pre-release’ event as 6th February 2021. Until now the only visuals of the movie released have been the teaser and AV’s about each of the character. However these visuals took the telugu audiences by storm and much expectation has been created about the film which Stars Jagapathi Babu, Ram Karthik and Ammu Abhirami. The movie is scheduled to be released on February 12th.
‘FCUK’ (Father Chitti Uma Karthik) has become the popular acronym for the  actual title of the movie, ’Father Chitti Umaa Kaarthik’. Projected as a Romantic Comedy the movie presents Jagapathi Babu in a titular role after a long gap and this is bringing back memories of Jagapathi Babu stellar performances as a Romantic performer. The music of the movie has been composed by Bheems Ceciroleo and the songs have been released by various Covid heroes like Health, Muncipal, Police and Media Personnel which has brought a lot of appreciation to the movie team. FCUK (Father Chitti Uma Karthik) has been produced by K L Damodar Prasad and directed by Vidyasagar Raju.
 Jagapatibabu, Karthik, Ammu Abhirami, Ali, Daggubati Raja, Kalyani Natarajan, Brahmaji, Krishna Bhagavaan, Rajitha, Jabardast Ram Prasad, Naveen, Venky, Raghava, Bharat etc.
Dialogues: Aditya,Karunakar,
Cinematography: Shiva.G
Music Director: Bheems Ceciroleo
Songs: Aditya, Karunakar, Bheems
Editing: Kishore Maddali
Art Director: J.k. Murthy
PRO: L.Venugopal
Story-Screenplay-Choreography-Direction: Vidyasagar Raju
Producer: KL Damodar Prasad
2U2A9965 V_R_7615 V_R_2237

Puvvalle Melukunnadi Song from FCUK (Father Chitti Uma Karthik) movie released by Baby Prakruthi


‘ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)‘లోని “పువ్వ‌ల్లే మేలుకున్న‌ది” పాట‌ను విడుద‌ల చేసిన బేబి ప్ర‌కృతి

జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత టైటిల్ రోల్స్ పోషించిన ‘ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)‘ చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. శ్రీ రంజిత్ మూవీప్ ప‌తాకంపై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మించిన ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

రీల్ హీరోల స్థానంలో రియ‌ల్ హీరోల‌తో ఈ చిత్రంలోని నాలుగు పాట‌ల‌ను చిత్ర బృందం విడుద‌ల చేయిస్తూ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కొవిడ్ మ‌హ‌మ్మారిపై పోరాటంలో ముందుండి అవిశ్రాంతంగా సేవ‌లందిస్తూ వ‌స్తున్న వైద్య‌-ఆరోగ్య‌, మునిసిప‌ల్‌, పోలీస్‌, మీడియా సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జెయ్యాల‌నే స‌త్సంక‌ల్పంతో వారి చేతుల మీదుగా నాలుగు పాట‌ల‌ను విడుద‌ల చేశారు. అవి సంగీత ప్రియుల‌ను బాగా అల‌రిస్తున్నాయి.

లేటెస్ట్‌గా పాపుల‌ర్ సింగ‌ర్ గీతామాధురి కుమార్తె బేబి ప్ర‌కృతి చేతుల మీదుగా “పువ్వ‌ల్లే మేలుకున్న‌ది” అంటూ సాగే పాట‌ను రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆ పాట‌ను మ‌ధురంగా ఆ త‌ల్లీకూతుళ్లు ఆల‌పించ‌డం విశేషం.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ, ఈ పాట పిల్ల‌లు, వారి త‌ల్లిదండ్రుల మ‌ధ్య అనుబంధానికి సంబంధించింద‌నీ, “పువ్వ‌ల్లే మేలుకున్న‌ది” పాట ఆవిష్క‌ర‌ణ‌లో బేబి ప్ర‌కృతి, అమ్మ గీతామాధురి మ‌ధ్య ఆ అనుబంధమే ప్ర‌తిఫ‌లించ‌డం చూడ్డానికి ఎంతో బాగుంద‌నీ అన్నారు.

గీతామాధురి మాట్లాడుతూ, నిజంగా పాట చాలా బాగుంద‌నీ, సినిమా అంత‌కు మంచి బాగుంటుంద‌ని ఆశిస్తున్నాన‌నీ అన్నారు. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌వుతున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నాన‌ని చెప్పారు.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, ఒక చ‌క్క‌ని పాట‌ను త‌ల్లీకూతుళ్లు గీతామాధురి, బేబి ప్ర‌కృతి విడుద‌ల చేయ‌డం ఎంతో ఆనందాన్నిచ్చింద‌నీ, ఫిబ్ర‌వ‌రి 6న ఫుల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేస్తామ‌నీ తెలిపారు.

రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌ల చేసిన క్యారెక్ట‌ర్ లుక్ పోస్ట‌ర్లు కానీ, టీజ‌ర్ కానీ ఆడియెన్స్‌ను అమితంగా ఆక‌ట్టుకున్నాయి. టీజ‌ర్ విడుద‌ల‌య్యాక సినిమాపై అంచ‌నాలు రెట్టింప‌య్యాయి.

తారాగ‌ణం:
జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌.

సాంకేతిక బృందం:
మాటలు:ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: జె.కె.మూర్తి
పి.ఆర్.ఓ: యల్. వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూస‌ర్: వాసు ప‌రిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: శ్రీ‌కాంత్‌రెడ్డి పాతూరి
స‌హ‌నిర్మాత: య‌ల‌మంచిలి రామ‌కోటేశ్వ‌ర‌రావు
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
బ్యాన‌ర్‌: శ్రీ రంజిత్ మూవీస్.

Puvvalle Melukunnadi Song from FCUK (Father Chitti Uma Karthik)  movie released by Baby Prakruthi

As announced earlier, Baby Prakruthi Daughter of acclaimed singer Geethamadhuri released Puvvalle Melkunnadi song from FCUK (Father Chitti Uma Karthik) movie.  The intense attachment and love between the cute baby and her famous mother was on show as they crooned the song from FCUK (Father Chitti Uma Karthik)  Movie to launch it. Music Director Bheems Ceciroleo speaking on the occasion said this song was specifically about the magic of the relationship between children and parents and it was wonderful to see the same being reflected in the launch between Baby Prakruthi and her mother Geethamadhuri. Geetamadhuri said the song is amazing and she wished the movie the best and also said that he is looking forward to see the movie when it releases on February 12th. Hero Ram Kaarthik thanked the daughter and mother for releasing the song and announced that the full video song will be released on February 6th. The movie has been directed by Vidyasagar Raju and produced by K L Damodar Prasad of Sri Ranjith Movies which has a phenomenal record of highly successful movies that have set standards in Tollywood.
 
Jagapatibabu, Karthik, Ammu Abhirami, Ali, Daggubati Raja, Kalyani Natarajan, Brahmaji, Krishna Bhagavaan, Rajitha, Jabardast Ram Prasad, Naveen, Venky, Raghava, Bharat etc.
Dialogues: Aditya,Karunakar,
Cinematography: Shiva.G
Music Director: Bheems Ceciroleo
Songs: Aditya, Karunakar, Bheems
Editing: Kishore Maddali
Art Director: J.k. Murthy
PRO: L.Venugopal
Story-Screenplay-Choreography-Direction: Vidyasagar Raju
Producer: KL Damodar Prasad
V_R_0883 Garalapatti 2 V_R_5423 V_R_1086