Nee Chaaredu Kalle, the first single of Swathi Muthyam, starring Ganesh, Varsha Bollamma, captures the bliss of first love

వర్ష బొల్లమ్మతో
“నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా…నీ మత్తులో మళ్లీ పడిలేస్తూ ఉన్నా” అంటూ పాటందుకున్న 
‘గణేష్‘
* విడుదల అయిన ‘స్వాతిముత్యం‘ ప్రేమ గీతం
*”స్వాతిముత్యం” ఆగస్ట్ 13 న విడుదల
ప్రేమ తాలూకు భావోద్వేగాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఓ అమ్మాయి కి , ఓ అబ్బాయి కి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు, జరిగే సంఘటనలు, వాటి సందర్భాలు … ఇవన్నీ ఎంత కొత్తగా వుంటే అంతగా మనసును హత్తుకుంటాయి. ఇప్పుడు విడుదలైన ‘స్వాతిముత్యం‘ లోని గీతం కూడా అలానే అనిపిస్తుంది, ఆకట్టుకుంటుంది.
‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం
‘స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రేమ గీతం ఈరోజు విడుదల అయింది.
నాయిక వర్ష బొల్లమ్మతో
“నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా…నీ మత్తులో మళ్లీ పడిలేస్తూ ఉన్నా” అంటూ పాటందుకున్న నాయకుడు ‘గణేష్‘. ఈ వీడియో చిత్రం లో కనిపిస్తారు.
చిత్ర హీరో, హీరోయిన్ గణేష్, వర్ష బొల్లమ్మ లపై పట్టణం నేపథ్యంలో చిత్రీకరించిన ఈ గీతానికి సాహిత్యాన్ని కె కె అందించగా, అర్మాన్ మాలిక్ శ్రావ్యంగా ఆలపించారు. మహతి స్వర సాగర్ సంగీతంలో కొత్త హొయలు పోయిందీ గీతం.  గణేష్ మాస్టర్ నిర్దేశకత్వంలో రూపొందిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుంది.
పాట విడుదలైన క్షణం నుంచే అది ఆకట్టుకుంటున్న వైనం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసలు సంతోషాన్ని కలిగిస్తున్నాయని అన్నారు చిత్ర దర్శకుడు లక్ష్మణ్.
ప్రతి పాట కు ప్రసవ వేదన ఉంటుంది. ఈ పాట కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. ఈ పాట కొన్ని పర్యాయాలు రాసిన తరువాతే అందరికీ ఆమోదయోగ్యమయింది. దర్శకుడు చెప్పిన సందర్భానికి, సంగీత దర్శకుని బాణీలకు, నిర్మాత అభిరుచికి తగినట్లుగా సాహిత్యం అందించటం ఆనందంగా ఉంది. అలాగే ఈ పాటలో “ఓ.. తారల్ని మూట కడతా
నీ కాలి ముందు పెడతా
అరె.. చందమామ కి నీకూ తేడా లేదుగా
మబ్బుల్ని తెచ్చి కుడతా
రెక్కల్ని చేసి పెడతా
మేఘాలు దాటి పదా
ఆ ఆకాశం అంచుకే చేరదాం” అనే పదాలు , పాట పల్లవి నాకెంతో ఇష్టం అన్నారు రచయిత
కె కె.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ చిత్రాన్ని ఆగస్టు 13 న విడుదల చేస్తున్నట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారం ఊపందుకుంటోంది. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం’స్వాతిముత్యం’.  సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘స్వాతిముత్యం’ ను దర్శకుడు తీర్చి దిద్దారు లక్ష్మణ్ అని తెలిపారు. ఇప్పటివరకు చిత్రానికి సంబంధించి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో చిత్రం సగటు సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాయి అన్న వార్తలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు విడుదల అయిన తక్షణమే ఈ గీతం కూడా ఆకట్టుకుంటోంది.
గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.
‘స్వాతిముత్యం’ చిత్రానికి
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయా గ్రహణం: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
కళ: అవినాష్ కొల్ల
పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
రచన- దర్శకత్వం: లక్ష్మణ్.కె.కృష్ణ
Nee Chaaredu Kalle, the first single of Swathi Muthyam, starring Ganesh, Varsha Bollamma, captures the bliss of first love
Swathi Muthyam, a feel-good family entertainer produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments, marks the acting debut of Ganesh and features Varsha Bollamma as the female lead. Directed by Lakshman K Krishna, the film has music by Mahathi Swara Sagar. Nee Chaaredu Kalle, the first single from the film, was launched today.
Nee Chaaredu Kalle is a musical journey through the bliss of first love and the many moments that make it a magical experience. Lyricised by Krishna Kanth (KK) and sung by Butta Bomma sensation Armaan Malik and Sanjana Kalmanje, the breezy number captures how the protagonists Ganesh and Varsha Bollamma are gradually smitten by one another.
The melody is easy on the ears and brims with a universal appeal that could resonate with music buffs across all age groups. Director Lakshman K Krishna says Nee Chaaredu Kalle has been the cynosure of all eyes on social media after the launch and that listeners just can’t have enough of it.
Like every other work of art, it took a lot of effort to bring this together according to the producer’s tastes and the situation specified by the director. The stanza with the words ‘O Taaralni Moota Kadatha…Nee Kaali Mundu Pedatha..Are…Chandamamaki Neeku Theda Leduga..Mabbulani Tecchi Kudatha’ holds a special place in my heart, shares lyricist KK.
The film’s glimpse, first-look posters received impressive responses from crowds recently. The situations between an innocent young man and a straightforward girl promise a heart-warming entertainer.Swathi Muthyam touches upon themes like life, love, and marriage and looks at modern-day relationships in a newer light.
Swathi Muthyam releases in theatres on August 13. The shoot is complete and the post-production formalities are progressing at a brisk pace. The supporting cast includes senior actors Naresh, Rao Ramesh, Subbaraju, Vennela Kishore, Harshavardhan, Pammi Sai, Sapthagiri, Goparaju Ramana, Siva Narayana, Pragathi, Surekha Vani, Sunaina, Divya Sripada.
Crew Details :
Music: Mahathi Swara Sagar
Cinematography: Suryaa
Editor: Navin Nooli
Art: Avinash Kolla
Pro: LakshmiVenuGopal
Presents: PDV Prasad
Producer: Suryadevara Naga Vamsi
Written and Directed by Lakshman K Krishna
_20A7365 _20A7876 _20A7888 MKS_0058 MKS_5794 MKS_5893 SM-01 SM-02 SM-03 SM-04 SM-05

Sithara Entertainments and Fortune Four Cinemas join hands for Panja Vaisshnav Tej’s next, film formally launched

*పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో చిత్రం వైభవంగా ప్రారంభం:
* వైష్ణవ్ తేజ్ మాస్ అవతారం ఈ చిత్రం
*కథానాయికగా ‘శ్రీ లీల‘
*దర్శకుడు గా శ్రీకాంత్.ఎన్.రెడ్డి పరిచయం
*ఆకట్టుకుంటున్న ప్రచార చిత్రం, సంభాషణలు, నేపథ్య సంగీతం
*హైదారాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో నేటి (22-6-2022) ఉదయం 11.16నిమిషాలకు ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభం

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో రూపు దిద్దుకోనున్న చిత్రం నేడు ముహూర్తం జరుపుకుంది. హైదారాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో నేటి (22-6-2022) ఉదయం 11.16 నిమిషాలకు ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభం అయింది.
సుప్రసిద్ధ దర్శకు డు త్రివిక్రమ్, హీరో సాయి ధర్మ తేజ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు సుధీర్ వర్మ, మరో దర్శకుడు కళ్యాణ్ (అనగనగా ఒక రాజు) లు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ముహూర్తపు దృశ్యానికి దర్శకత్వం త్రివిక్రమ్ వహించారు. క్లాప్ హీరో సాయిధర్మ తే జ్ ఇవ్వగా,కెమెరా స్విచాన్ దర్శకుడు సుధీర్ వర్మ చేశారు. స్క్రిప్ట్ ను నిర్మాత ఎస్.నాగవంశీ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ కు అందించారు.

చిత్రం ముహూర్తం సందర్భంగా ఈ చిత్రానికి సంభందించిన ఓ ప్రచారచిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్. దీన్ని పరికిస్తే…”
“రేయ్ రాముడు లంక మీద పడ్డం ఇనుంటావ్. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే
ఎట్టుంటదో సూస్తావా…” అని చిత్రంలో ప్రతినాయక పాత్ర హెచ్చరిక గా అంటే…..
“ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా…. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు… సూస్కుందాం రా….
తలలు కోసి సేతికిస్తా నాయాలా…!” అంటూ కథానాయకుడు మరింత గా హెచ్చరించడం కని (విని) పిస్తుంది. పదునైన ఈ సంభాషణలకు సమకూర్చిన నేపథ్య సంగీతం మరింత పౌరుషాన్ని పెంచినట్లయింది. 2023 సంక్రాంతి కి చిత్రం విడుదల అని కూడా కనిపిస్తుంది. తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. అంతేకాదు భారీస్థాయిలో నిర్మాణం జరుగుతుందనిపిస్తుంది ఈ వీడియోను పరికిస్తే.
వైష్ణవ్ తేజ్ సరసన కథానాయికగా ‘శ్రీ లీల‘ నటిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడు గా శ్రీకాంత్.ఎన్.రెడ్డి పరిచయం
అవుతున్నారు. వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం. పూరి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం అంటున్నారు చిత్ర దర్శక,నిర్మాతలు.
చిత్రం రెగ్యులర్ షూటింగ్,అలాగే చిత్రానికి సంబంధించిన ఇతర నటీ నటు లు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు.
పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాతలు ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య.
రచన- దర్శకత్వం: శ్రీకాంత్.ఎన్.రెడ్డి

Sithara Entertainments and Fortune Four Cinemas join hands for Panja Vaisshnav Tej’s next, film formally launched

Leading production houses Sithara Entertainments and Fortune Four Cinemas are coming together to produce an action spectacle, headlined by Panja Vaisshnav Tej. The film’s muhurat ceremony was held at Ramanaidu Studio, Hyderabad at 11.16 am today amid the presence of the team and distinguished guests. Actress Sreeleela has been roped in as the female lead for the project. First-time filmmaker N Srikanth Reddy, who has written the story, will direct the film, tentatively titled #PVT04.

Filmmaker Trivikram, Haarika and Hassine Creations founder S Radha Krishna, actor Sai Dharam Tej, director Sudheer Varma, Anaganaga Oka Raju director Kalyan,, producer S Naga Vamsi graced the pooja ceremony. While Trivikram directed the muhurat shot, Sai Dharam Tej clapped for it and filmmaker Sudheer Varma switched on the camera. S Naga Vamsi honorarily handed over the script to director Srikanth Reddy.

A special promo, offering a glimpse into the film’s theme, was released commemorating its launch. Vaisshnav Tej and the antagonist are in a war of words in the glimpse, where there are several mythological references to Rama, Ravana, Lanka, Ayodhya, and Shiva. When the antagonist says, ‘You may have heard about Rama vanquishing Lanka but can you guess the plight of Ayodhya if a ten-headed man attacks it?’ and Vaisshnav Tej retorts firmly, ‘This Ayodhya isn’t ruled by Rama, but the Lord he worships, Rudra Kaleswara (Shiva). Bring it on..I’ll rip you apart.’

The intense background enhances the impact of the glimpse immensely and action junkies can expect nothing short of a feast from #PVT04. A launch poster where Vaisshnav holds a trisoolam in front of a bull catches your interest too. “This is an out-and-out mass vehicle for Vaisshnav Tej. It’s a full-on action entertainer,” say the makers. The untitled film will go on floors shortly. Other details about the cast and crew will be out soon. Presented by PDV Prasad, the film is produced by S. NagaVamsi and Sai Soujanya. The film is slated for a Sankranthi 2023 release.

 

#PVT04-SE16 PosterStill #PVT04-SE16 Poster

 

DSC_3099_2

 

 

 

MUR_3920_1

హీరోగా “గణేష్” చిత్రం ”స్వాతిముత్యం” ఆగస్ట్ 13 న విడుదల

హీరోగా “గణేష్ బెల్లంకొండ” చిత్రం ”స్వాతిముత్యం” ఆగస్ట్ 13 న విడుదల
*ఆకట్టుకుంటున్న విడుదల
 తేదీ ప్రచార చిత్రం
*ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం”స్వాతిముత్యం”
‘గణేష్ బెల్లంకొండ‘ హీరోగా
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం
‘స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ చిత్రాన్ని ఆగస్టు 13 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘స్వాతిముత్యం’ ను దర్శకుడు తీర్చి దిద్దారు దర్శకుడు లక్ష్మణ్ అని తెలిపారు.
దర్శకుడు మాటల్లో చెప్పాలంటే ‘స్వాతిముత్యం’ లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి.
ఇటీవల విడుదల అయిన ‘స్వాతిముత్యం’ ప్రచార వీడియో చిత్రంవినోదమే ప్రధానంగా ఈ చిత్రం ఆద్యంతం రూపొందిందని, అందులోని  దృశ్యాలు చూసిన అందరికీ  అనిపించింది. వీడియో చిత్రం లోని సంభాషణలు  సైతం ఈ విషయాన్ని బలపరిచాయి.
గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.
‘స్వాతిముత్యం’ చిత్రానికి
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయా గ్రహణం: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
కళ: అవినాష్ కొల్ల
పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
రచన- దర్శకత్వం: లక్ష్మణ్.కె.కృష్ణ
 
Sithara Entertainments’ feel-good family entertainer Swathi Muthyam, starring Ganesh Bellamkonda, Varsha Bollamma, to release on August 13
Swathi Muthyam is a feel-good family entertainer bankrolled by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. The film marks the acting debut of Ganesh Bellamkonda and features Varsha Bollamma as the female lead. Directed by Lakshman K Krishna, Swathi Muthyam has music by Mahathi Swara Sagar. The makers have announced the film’s release date today.
The entertainer will hit theatres across the globe on August 13, for the Independence Day weekend. In the release date announcement poster, Ganesh and Varsha have a gala time riding a two-wheeler on an empty road. The warm chemistry of the on-screen pair instantly grabs your attention.
The film’s glimpse, first-look posters received impressive responses from crowds recently. Going by the promos, Swathi Muthyam revolves around two youngsters on the cusp of an arranged marriage. The situations between an innocent young man and a straightforward girl assure an intriguing watch.
Swathi Muthyam also touches upon themes like life, love, marriage and looks at modern-day relationships in a newer light. The shoot is complete and the post-production formalities are progressing at a brisk pace. The supporting cast comprises senior actors Naresh, Rao Ramesh, Subbaraju, Vennela Kishore, saptagiri, Harshavardhan, Pammi Sai, Goparaju Ramana, Siva Narayana, Pragathi, Surekha Vani, Sunaina, Divya Sripada.
Crew Details :
Music: Mahathi Swara Sagar
Cinematography: Suryaa
Editor: Navin Nooli
Art: Avinash Kolla
Pro: Lakshmi Venu Gopal
Presents: PDV Prasad
Producer: Suryadevara Naga Vamsi
Written and Directed by Lakshman K Krishna
Swathimuthyam - Date Poster Still Swathimuthyam - Date Poster

మేజర్’ చిత్ర బృందానికి అభినందనలు – పవన్ కళ్యాణ్

మేజర్’ చిత్ర బృందానికి అభినందనలు

* శ్రీ అడివి శేష్ లాంటి సృజనశీలురు మరింత మంది చిత్రసీమకు రావాలి

ముంబై మహానగరంలో 26 నవంబర్ 2008న ఉగ్రవాదులు చేసిన ఘాతుకాలను 26/11 మారణ హోమంగా ఈ దేశం గుర్తుపెట్టుకొంది. నాడు చేసిన కమెండో ఆపరేషన్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సాహసాలు, ఆయన వీర మరణాన్ని వెండి తెరపై ‘మేజర్’గా ఆవిష్కరించిన చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తెలుసుకొని సంతోషించాను. అన్ని భాషలవారినీ మెప్పిస్తున్న ఈ బయోపిక్ మన తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందం కలిగించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి సైనికాధికారులు, సిబ్బంది దేశ భద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలి. పార్టీ సంబంధిత వ్యవహారాల్లో తలమునకలై ఉండటంతో మేజర్ ఇంకా చూడలేదు. ఆ చిత్రానికి వస్తున్న స్పందన తెలుసుకొన్నాను. త్వరలోనే ఆ చిత్రం వీక్షిస్తాను.
ఈ చిత్ర కథానాయకుడు సోదరుడు అడివి శేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రఖ్యాత రచయిత దివంగత శ్రీ అడివి బాపిరాజు గారి మనవడైన శ్రీ శేష్ సినిమాలో భిన్న శాఖలపై అభినవేశం ఉన్న సృజనశీలి. తెలుగు సాహిత్యంపై మక్కువ… వర్తమాన అంశాలపై ఉన్న అవగాహన ఆయన మాటల్లో తెలుస్తుంది. ఇటువంటివారు మరింత మంది చిత్రసీమకు రావాలి. ఒక సాహసి కథను చలన చిత్రంగా మలచిన చిత్ర దర్శకుడు శ్రీ శశికిరణ్ కు శుభాకాంక్షలు. ఇటువంటి మంచి చిత్రాలు ఆయన నుంచి మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నాను.
‘మేజర్’ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన ప్రముఖ హీరో శ్రీ మహేశ్ బాబు గారికి, చిత్ర నిర్మాతలు శ్రీ శరత్ చంద్ర,శ్రీ అనురాగ్ రెడ్డిలకు నా అభినందనలు. ఈ చిత్రంలో నటించిన శ్రీ ప్రకాష్ రాజ్, శ్రీమతి రేవతి, సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, మురళీ శర్మలకు, చిత్ర సాంకేతిక నిపుణులకు ప్రత్యేక అభినందనలు.

- పవన్ కళ్యాణ్

PHOTO-2022-06-12-16-00-44 PHOTO-2022-06-12-16-00-50