Vijay Devarakonda, Sree Leela, Sithara Entertainments, Fortune Four film, VD12 commences shoot

*విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి, శ్రీలీల, సితార ఎంటర్ టైన్మెంట్స్ సినిమా VD 12 రెగ్యులర్ షూటింగ్ మొదలు.*
విజయ్ దేవరకొండ 12వ సినిమా మొదటి షెడ్యూల్ ఈరోజు మొదలయ్యింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోంది ఈ చిత్రాన్ని.  శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ఈరోజు సారథి స్టూడియోస్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది.
అవార్డ్ విన్నింగ్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, రౌడీ బాయ్ ది విజయ్ దేవరకొండ తో చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.  తెలుగు చిత్రసీమలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల కథానాయిక గా ప్రకటించడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. భారతదేశంలోని అగ్రశ్రేణి సంగీత దర్శకులలో ఒకరైన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి సంబందించి విజయ్ దేవరకొండ కొత్త పోస్టర్ యూనిట్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పోలీస్ గెటప్ లో గన్ పట్టుకొని విజయ్ చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు.
తారాగణం: విజయ దేవరకొండ, శ్రీలీల
రచన, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
డీఓపీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా
Vijay Devarakonda, Sree Leela, Sithara Entertainments, Fortune Four film, VD12 commences shoot
It is known that Tollywood heartthrob Vijay Deverakonda is collaborating with Jersey fame, Gowtam Tinnanuri for an intense action thriller which is tentatively titled VD12.
The latest news pertaining to the project is that it has commenced the shooting in Hyderabad earlier today.  The shooting started at Saradhi Studios in Hyderabad and the lead cast and crew took part in the same.
The makers unveiled a new poster featuring Vijay. In the poster, we see Vijay holding a gun and he looks dapper in the same. This is an out focus poster so we don’t get a glimpse of his look.
The film is directed by Gowtam and it has Sree Leela in the leading lady role. Sithara Entertainments and Fortune Four Cinemas are producing it. Anirudh is composing the music for the film.
 Vd12_plain #VD12-ShootBegins

Meet Versatile Actress Anjali as Rathnamala from Vishwak Sen and Sithara Entertainments’ VS11

విశ్వక్ సేన్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘VS11′లో రత్నమాలగా విలక్షణ నటి అంజలి
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అత్యంత వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది. నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు గొప్ప అభిరుచితో నిర్మిస్తున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
ఇప్పుడు ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి ఆసక్తికరమైన చిత్రం ‘VS 11′ వస్తోంది. ఈ సినిమాలో బహుముఖ ప్రతిభావంతుడు, యంగ్ అండ్ డైనమిక్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్నారు.
ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో యువ నటుడు విశ్వక్ సేన్ క్రూరమైన పాత్రను పోషిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
విలక్షణ నటి అంజలి పుట్టినరోజు(జూన్ 16) సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె రత్నమాలగా కనిపించనున్నారు.
అంజలి ఉత్తమమైన పాత్రలను, స్క్రిప్ట్‌లను ఎంచుకుంటారు. ఆమెకు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. రత్నమాలగా ఆమె మాస్‌ ప్రేక్షకులను అలరించనున్నారు.
లిటిల్ మేస్ట్రో యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన సంగీతం సినిమాలకు ప్రధాన బలంగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది.
ఇప్పటికే విడుదలైన విశ్వక్ సేన్ గంగానమ్మ జాతర, రాగ్స్ టు రిచ్స్ పోస్టర్లు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. క్రూరమైన వ్యక్తి కథను చూసేందుకు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
తారాగణం: విశ్వక్ సేన్
దర్శకత్వం: కృష్ణ చైతన్య
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
సినిమాటోగ్రాఫర్: అనిత్ మధాది
ఎడిటర్: నవీన్ నూలి
సహ నిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌
పీఆర్ఓ: లక్ష్మివేణుగోపాల్
Meet Versatile Actress Anjali as Rathnamala from Vishwak Sen and Sithara Entertainments’ VS11
Sithara Entertainments with Fortune Four Cinema are producing highly varied content films that entertain every audience member.  Suryadevara Naga Vamsi and Sai Soujanya are producing films with great taste and they have been receiving high level appreciation from audiences.
Now, the highly active production house is coming up with VS11. The movie stars young and dynamic multi-faceted star, Mass Ka Das Vishwak Sen in the lead role.
The young actor is playing a ruthless Gray character in the action drama film. Krishna Chaitanya is writing and directing the film on a grand scale.
Movie team has released First look of Versatile Actress Anjali, on the occasion of her birthday. She will be seen as Rathnamala from the film.
Anjali has been selecting best possible characters and scripts. She has a good following among audiences and as Ratnamala, she will be loved by masses.
Little Maestro Yuvan Shankar Raja is composing music for the film. The tunes composed by him will be an asset to the film.
Already, Vishwak Sen looks in Gangannamma Jathara and Rags to Riches posters have gone viral and created huge buzz. Movie-lovers are eagerly awaiting to witness the tale of the ruthless person.
More details from the film will be announced soon.
 Anjali-Bday-STILL

*My goal is to produce pan-world films and Hollywood projects in 2-3 years, says producer TG Vishwa Prasad of People Media Factory*

వచ్చే రెండు మూడేళ్ళలో పాన్ వరల్డ్ సినిమాలు, హాలీవుడ్ ప్రాజెక్ట్‌లను నిర్మించడమే మా లక్ష్యం: నిర్మాత టి.జి. విశ్వప్రసాద్

అనతికాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్న పీపుల్ మీడియా సంస్థ వరుస ఘన విజయాలతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం పదికి పైగా నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జూన్ 16న ‘ఆదిపురుష్’ విడుదలవుతున్న నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ ఆదిపురుష్ తో పాటు తమ బ్యానర్ లో రూపొందుతోన్న సినిమాల గురించి ఆసక్తికర విషయాల పంచుకున్నారు.

‘ఆదిపురుష్’ తెలుగు రైట్స్ తీసుకోవడానికి కారణం?
ఆదిపురుష్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ విజువల్‌గా బాగుంది. ఇది ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని మేము భావించాము. మార్కెట్ లెక్కలు వేసుకుని మంచి ధరకు ఈ సినిమా తెలుగు రైట్స్ ని తీసుకున్నాం. భవిష్యత్ లోనూ టి.సిరీస్ నిర్మించే సినిమాలతో అవగాహన ఉంటుంది. ‘స్పిరిట్’ని కూడా తెలుగులో మేమే విడుదల చేస్తాం.

‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ గారు మిమ్మల్ని కుటుంబసభ్యుడు లాంటివారు అన్నారు కదా? ఎలా అనిపించింది?
ఆయన అందరితో మంచిగా ఉంటారు. ఆయనతో అంత మంచి అనుబంధం ఏర్పడటం మా అదృష్టం.

నిర్మాతగా మీ ప్రయాణం ఎలా ఉంది?
నేను గతంలోనూ చెప్పాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ని ఒక ఫ్యాక్టరీ మోడల్ లోనే స్టార్ట్ చేశాం. అదృష్టం కొద్దీ మాకు విజయాల శాతం ఎక్కువగానే ఉంది. కానీ సినిమా అనేది ఒక ప్రయాణం. ఇందులో విజయాలు ఉంటాయి, పరాజయాలు ఉంటాయి. అవన్నీ ఆలోచించే ఈ రంగంలోకి అడుగుపెట్టాం. పరాజయం ఎదురైనా అది మళ్ళీ పునరావృతం కాకుండా మరింత కృషి చేస్తాం. పరాజయాల నుంచి కొత్త విషయాలు నేర్చుకొని ముందుకు వెళ్ళాలి.

వేగంగా వంద సినిమాలు నిర్మించడం మీ లక్ష్యమని గతంలో చెప్పారు? ఆ లక్ష్యం సినిమాల నాణ్యతపై ప్రభావం చూపుతుందా?
వేగంగా వంద సినిమాలు నిర్మించాలనేది ఇటీవల పెట్టుకున్న లక్ష్యం. త్వరలోనే మా బ్యానర్ లో 25 సినిమాలు పూర్తవుతాయి. మా మొదటి 25 సినిమాల కోసం మేం కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాం. కానీ తదుపరి 25 సినిమాలను వేగంగా ఏడాదిన్నరలో పూర్తి చేసి, 50 సినిమాల మార్క్ ని అందుకుంటాం. ఇప్పటికే నాలుగైదు దాదాపు సినిమాలు పూర్తయ్యాయి, మరో 15 దాకా నిర్మాణ దశలో ఉన్నాయి. ఎక్కువ సినిమాలు చేయడం వల్ల క్రియేటివిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు. ఇన్ని సినిమాలు చేయడం వల్ల, విడుదల సమయంలో మాత్రం ఛాలెంజ్ లు ఎదురవుతాయి. మాది ఒక ఫ్యాక్టరీ. మాకు టీం ఉంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా.. మంచి సినిమాలను అందించడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం.

మీరు సొంతంగా నిర్మించిన దానికంటే, ఇతర బ్యానర్స్ భాగస్వామ్యంతోనే ఎక్కువ విజయాలు అందుకున్నట్టున్నారు?
పరాజయాలకు భాగస్వామ్యానికి సంబంధం లేదు. మేం ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి చేసిన వాటిలో పరాజయంపాలైనవి ఉన్నాయి. అలాగే మేం సోలోగా నిర్మించిన వాటిలోనూ పరాజయం చెందినవి ఉన్నాయి. భాగస్వామ్యంతో చేసినా ఎక్కువ శాతం మా ప్రమేయం ఉంటుంది. కాబట్టి జయాపజయాల్లోనూ మా బాధ్యత ఉంటుంది.

ఇతర భాషల్లోనూ తెలుగు సినిమాకి ఉన్న డిమాండ్ మరియు ఓటీటీ రైట్స్ కారణంగా సినిమాలకు ఆదాయం పెరిగింది అంటే ఏకీభవిస్తారా?
దానివల్లే మేం వంద సినిమాలు చేయబోతున్నాం. కేవలం థియేట్రికల్ బిజినెస్ మీద ఆధారపడితే అది సాధ్యం కాదు. ఓటీటీ బిజినెస్ కూడా ఇప్పుడు చాలా కీలకం. అందుకే వచ్చే ఏడాదిన్నరలో 25 సినిమాలు చేస్తామని చెప్పగలుగుతున్నాం.

ఆదిపురుష్ టికెట్ బుకింగ్స్ తెలుగులో ఇంకా ఓపెన్ కాకపోవడానికి కారణం?
రేపు(జూన్ 14) ఓపెన్ అవుతాయి. తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరల పెంపు గురించి ప్రభుత్వాలతో మాట్లాడటం జరిగింది. రెండు ప్రభుత్వాల సానుకూల స్పందన వచ్చింది. మల్టీప్లెక్స్ లలో ధరల అలాగే ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్ లో రూ.50 వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. రూ.25 పెంచాలి అనుకుంటున్నాం. ఇతర పంపిణీదారులతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటాం. అందుకే కాస్త ఆలస్యమైంది.

ప్రతి థియేటర్ లో హనుమంతుడికి ఒక సీటు కేటాయించడం, పలువురు సెలబ్రిటీలు ఉచిత టికెట్లు ప్రకటించడం పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చా?
హనుమంతుడికి ప్రతి థియేటర్ లో ఒక సీటు కేటాయించడం అనేది అది ఆయన పట్ల ఉన్న భక్తికి, గౌరవానికి నిదర్శనం. ఉచిత టికెట్లు అనేది పబ్లిసిటీ స్టంట్ కాదు. ఇలాంటి సినిమాకి తమ వంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో వారంతట వారు ముందుకొచ్చి చేస్తున్నారు.

ఆదిపురుష్ ముందురోజు పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయా?
ఇప్పటిదాకా అయితే ఆ ఆలోచన లేదు. జూన్ 15న రాత్రి ప్రీమియర్స్ వేయాలనే డిమాండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తే చెప్పలేం.

కొత్త సినిమాల గురించి?
సెట్స్ మీద దాదాపు 15 సినిమాలు ఉన్నాయి. వాటి ప్రకటన, ప్రమోషన్స్ విషయంలో వేటికవే ప్రత్యేక ప్లాన్స్ ఉన్నాయి. పరిశ్రమకు పలువురు కొత్త దర్శకులని కూడా పరిచయం చేయబోతున్నాం. ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఎనిమిది, పది వరకు కొత్త దర్శకులతో చేస్తున్న సినిమాలు ఉన్నాయి.

మీ 50 వ సినిమా గురించి చెప్పండి? అది హాలీవుడ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చా?
మా 25వ సినిమా ‘బ్రో’. మా 50 వ సినిమా ప్రకటన అనేది మరో ఆరు నెలల్లో ఉండొచ్చు. ఇంత తక్కువ సమయంలో హాలీవుడ్ ప్రాజెక్ట్ అనేది సాధ్యంకాదు. వచ్చే రెండు మూడేళ్ళలో హాలీవుడ్ సినిమాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం అక్కడి టెక్నీషియన్స్ ని తీసుకుంటున్నాం. త్వరలో పాన్ వరల్డ్ సినిమాలు నిర్మించాలనేది మా లక్ష్యం.

ప్రభాస్-మారుతి తో సినిమా చేస్తున్నారు కదా.. అంత పెద్ద సినిమాని అధికారికంగా ప్రకటించకపోవడానికి కారణమేంటి?
ప్రతి సినిమాకి ఓ ప్లాన్ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తాం. ఆ సినిమా విడుదల తేదీ, ఇతర విషయాల గురించి ఇప్పుడే చెప్పలేను.

ఎన్టీఆర్ శతజయంతికి అమెరికాలో ఆయన విగ్రహం పెట్టాలి అనుకున్నారు కదా.. ఏమైంది?
ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి అక్కడ మేయర్ అనుమతి కూడా తీసుకున్నాం. కానీ కొందరు దీనిని అడ్డుకోవాలని చూస్తున్నారు. అందుకే మేలో విగ్రహం ఏర్పాటు చేయలేకపోయాం. త్వరలో ఏర్పాటు చేసేలా సన్నాహాలు చేస్తున్నాం.

*My goal is to produce pan-world films and Hollywood projects in 2-3 years, says producer TG Vishwa Prasad of People Media Factory*

Leading film producer TG Vishwa Prasad is making new strides in the Telugu movie-making landscape. Handling commercial films with diverse storylines is his forte. Starting with Goodachari, his homegrown film banner People Media Factory has achieved a reasonably good success rate with a bunch of feel-good movies as well as commercial potboilers. The biggest among them was ‘Karthikeya 2′ and ‘Dhamaka’ which entered the league of Rs 100-crore club.

In a media interaction on Tuesday, TG Vishwa Prasad divulged his interests, set goals, and the reason behind putting a hefty price for theatrical rights of ‘Adipurush’ in Telugu States and more.

*You bagged the theatrical rights of ‘Adipurush’ in Telugu States. While you are already set to produce a film with Prabhas, what’s the reason behind purchasing a film which was made by other makers?*

Well, it’s simple, it’s a business strategy. Adipurush’s teaser is so visually gripping that we felt that it would certainly become big at the box office. Adipurush made all the buzz that it required in the public. As you all know and it’s already in the market that I’ve purchased Prabhas’ film for a fancy prince.

*Have you purchased Adipurush’s rights based on its merits or did you just go with the wave of Prabhas’ popularity?*

Basically, T Series is bankrolling the Prabhas film at a pan-India level. So for every language, there will be a different producer who buys the film and releases it in his respective region. In the same manner, I have purchased Adipurush’s rights in the Telugu States. Even in future, we have a sort of understanding with the T-Series that we may purchase their upcoming films and release them in the Telugu States.

And Sandeep Reddy’s directorial ‘Spirit’ too will be released in Telugu. The association with star Prabhas is always primary.  And coming to his movie Adipurush, it has a good buzz in the market. At the same time, Spirit too has equally garnered good buzz. We made the moves only after thoroughly understanding the market dynamics.

*In the recent event held at Tirupati, Prabhas mentioned that he forged a family bonding with you. How did you feel listening to him?*

Definitely, one has to build a good relationship with everyone in the movie industry. And we’re lucky to have a close association with Prabhas. The decision to purchase the film Adipurush was my idea. It didn’t come from Prabhas initially. After a few consultations with him, I felt it was a good bet to go and purchase the rights, thus we eventually closed the deal.

*How satisfactory is your journey so far in Tollywood? How do you take successes and defeats?*

I’ve spoken about this previously. We had started the film production business as a factory model. Luckily, we have achieved a good success rate. But reaping fruits in the entertainment industry is a long journey to tread for anyone. We’re prepared to take both success and failures in the same breath. Success shouldn’t make you laidback at the same time failure shouldn’t let you down, you need to learn from the mistakes and move on.

*What’s the success mantra for the films that came from your banner?*

Fundamentally, in any business model, you need to set a few goals. We need to set the right expectations. Disappointment would come if you set deep expectations. The first process is called discovery. A lot of time we spend on discovering things and doing the right research. Luckily, there is no situation arose where we felt disappointed. Definitely, you feel bad when something goes wrong. When you feel it is a learning curve, it certainly turns into a positive thing.

*Last time when you spoke in an interview, you said that your aim was to make 100 films as quickly as possible. Do you think one might falter while going at this pace of reaching the goal? How do you set things right when creative aspects take a backseat?*

Faster 100 films is a goal which was set recently. We will soon announce our 25th movie Bro. It took almost five-plus years for us to make 25 movies since our inception. Sometime by next year, we might reach the landmark of finishing 50 movies. Of 50 films, 25 movies have already been completed. Four to five films have been completed. Some 15 scripts are ready to go on floors. We’re confident that very soon we will get another eight to 10 films to reach our fastest 50 milestone.

*As a film producer, how do you manage a film project when you run out of time and at the same time it shouldn’t affect the creative process of the film?*

As you go on producing a number of movies in the movie industry, you will be knowing that the creative aspects of the film are not a challenge. The only confrontation that you face is releasing your films in theatres. Just one or two films in a month. You can’t release too many. While you do big-budget films, you need to maintain some gaps. We might expect some challenges in releasing the films in theatres but never in producing feel-good films. Creativity is taken care of by team members. So we have learnt a lot in the last two years as a person and as a team.

*The success rate keeps varying when you single-handedly produce a movie and when you collaborate with other banners. Isn’t that so?*

Yes, it differs, but there is no relation between failures and collaboration. We collaborated majorly with three companies. The first one was with Blue Planet. Kalyan Ram’s MLA was a moderate hit in theatres and ‘Silly Fellows’ was a commercial failure. Later, we joined hands with Suresh Productions for ‘Venky Mama’ and ‘Oh! Baby’. Both were commercially good hits. And later we collaborated with Abhishek Agarwal. The large chunk of investment say 98 percent was ours. Keeping the luck factor aside, collaborations have zero impact on success and failure.

*There is a clear spike in Telugu cinema’s market value. Do you think more and more films keep coming because of the non-theatrical business? Do you agree with the popular norm that a film has more chances to get picked on OTT if it was produced under an established film production company?*

Yes, that’s the reason why I said I could reach the landmark of faster 100 films within no time. If I go by the standard theatrical release, I can’t even make 20 films in one year. I can firmly tell you that keeping the films that are meant for OTT space, more and more scripts are being pitched, thus going on floors.

*Heroes’ remuneration came into the picture recently. Some actors quote the pay based on their non-theatrical films. How is it viable for a film producer like you?*

More than leverage, availability is the key. Take any producer – there is no situation in the industry where a producer can say no to a project because a hero is demanding more remuneration. The projects I have taken up because I know that they are commercially viable.

*Adipurush openings have started across the country but not in Telugu States, why the delay happened? What’s the permission you sought from the State governments as far as ticket fares are concerned?*

Because of the ticket prices, the openings in Telugu have been delayed. The openings will start on Wednesday in Telangana and Andhra Pradesh. We got permission to hike the ticket for another Rs 50 for single screens in Telangana and Andhra Pradesh. We’re still thinking about whether to go with the hike of Rs 50 or Rs 25, mostly we may consider a Rs 25 hike. No change in the multiplexes. We’re waiting for the government’s GO.

*Several publicity stunts are being made as far as Adipurush is concerned. We’ve seen that a seat is allotted to Lord Hanuman. Heroes purchase tickets and distribute them to fans. Is this part of publicity?*

The seat allotted to Lord Hanuman – is based on faith and the story that’s got inspired by Ramayana. But other instances like heroes purchasing tickets and distributing them to fans can be seen as a voluntary move.

Ahead of the Adipurush’s release in the USA, an event is being arranged in Seattle. “I am leaving for the US tomorrow to oversee the arrangements. There are no paid premiers planned this time. The mood of the public and the response will be conveyed to me by my team. So I need not worry about it,” Vishwa Prasad said confidently.

Under People Media Factory, producer Vishwa Prasad set a goal to make a pan-world film soon. “In another two to three years, I would probably go and produce Hollywood films. That’s our aim.”

Upon questioning about giving preference to fresh blood of filmmakers, “Presently, we’re working with new directors, new in the sense, they may not be new to the industry, but new to direction. Eight to nine people are in the pipeline ready with their scripts,” he added.

 

GANI8275 GANI8232

Nandamuri Balakrishna’s NBK109 to be directed by Bobby Kolli & Produced by Sithara Entertainments

నందమూరి బాలకృష్ణ హీరోగా (‘NBK 109′) బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం:
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ భారీ బ్లాక్ బస్టర్లను అందిస్తూ తన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరో బ్లాక్ బస్టర్ అందించాలని, ఓ భారీ యాక్షన్ చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ తో చేతులు కలిపారు.
బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి, సూర్యదేవర నాగవంశీ పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను అధికారికంగా ప్రకటించి చిత్ర పనులు ప్రారంభించారు.
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు(జూన్ 10) నిర్వహించిన పూజా కార్యక్రమంలో స్క్రిప్ట్‌ను బడా మాస్ దర్శకుడు వి.వి. వినాయక్ తన చేతుల మీదుగా చిత్ర బృందానికి అందజేశారు. దక్షిణ కొరియా గౌరవ కౌన్సెల్ జనరల్ చుక్కపల్లి సురేష్ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు. విజయవంతమైన దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచాన్ చేశారు. మొదటి షాట్ కి మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో తెలిపేలా కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మద్యం సీసా, గొడ్డలి, ఇతర పదునైన ఆయుధాలతో కథానాయకుడి పాత్ర ఎంత శక్తివంతంగా ఉండబోతుందో తెలియజేశారు. కాన్సెప్ట్ పోస్టర్ తోనే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగేలా చేసింది చిత్ర బృందం.
“వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్” అనే లైన్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో వివరించారు. అలాగే “ప్రపంచానికి అతను తెలుసు.. కానీ అతని ప్రపంచం ఎవరికీ తెలియదు” అంటూ పోస్టర్ పై రాసున్న సినిమా ట్యాగ్‌లైన్ ఆకట్టుకుంటోంది.
ఈ రెండు లైన్స్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది చిత్ర బృందం. అభిమానులకు, సినీ ప్రియులకు థియేటర్లలో గొప్ప అనుభూతిని ఇచ్చే సినిమా అవుతుందని చిత్ర బృందం చెబుతోంది.
ఈ చిత్రాన్ని 2024 ప్రారంభంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. మరిన్ని వివరాలను చిత్ర బృందం త్వరలో ప్రకటించనుంది.
తారాగణం: నందమూరి బాలకృష్ణ
దర్శకుడు: బాబీ కొల్లి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
Nandamuri Balakrishna’s NBK109 to be directed by Bobby Kolli & Produced by Sithara Entertainments
Nandamuri Balakrishna is known as “God of Masses” and he has been delivering huge blockbusters to entertain his huge fanbase. Keeping up with delivering huge blockbusters, he has decided to deliver an action spectacle with Sithara Entertainments and Fortune Four Cinemas
Suryadevara Naga Vamsi and Sai Soujanya are producing this massive film in the direction of blockbuster filmmaker Bobby Kolli. Srikara Studios is presenting the film.
Nandamuri Balakrishna, Bobby Kolli and Suryadevara Naga Vamsi have performed a Pooja to officially announce the film and commence works.
At the Pooja ceremony script has been handed over by big mass director, V.V. Vinayak. First clap is given by Chukkapalli Suresh (Honorary Counsel General of South Korea). Camera is switched on by successful director Gopichand Malineni. First shot direction is handled by Wizard of Words and popular director Trivikram Srinivas.
Movie team has released a concept poster that talks about the story. With a sickle, an axe and weapons that showcase how violent, the character is going to be, movie team has got huge buzz among the fans.
The line for the film is aptly described as “Violence ka Visiting Card”. And movie tagline reads – “The World Knows Him But No one knows his World”.
With these two lines the movie team has given huge expectations for the movie and it is going to be mass spectacle for fans and movie-lovers at the theatres.
Movie is expected to release early 2024. More details will be announced soon by the team.
Cast & Crew:
Starring: Nandamuri Balakrishna
Director: Bobby Kolli
Producers: Suryadevara Naga Vamsi & Sai Soujanya
Banners: Sithara Entertainments, Fortune Four Cinemas
Presenter: Srikara Studios
1 2 3 4 5 7 8 9 10 11 12 13

Intiti Ramayanam will make you laugh your lungs out; the response is massive, say makers at the success meet

‘ఇంటింటి రామాయణం’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు
సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో ఐవీవై ప్రొడక్షన్స్ నిర్మించిన కుటుంబ కథా చిత్రం ‘ఇంటింటి రామాయణం’. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మాతలు. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, నరేష్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. గ్రామీణ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం(జూన్ 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈరోజు విలేకర్ల సమావేశం నిర్వహించి ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.
దర్శకుడు సురేష్ నరెడ్ల మాట్లాడుతూ.. “నిన్ననే ‘ఇంటింటి రామాయణం’ సినిమా థియేటర్లలో విడుదలైంది. చూసిన ప్రేక్షకులందరూ సినిమాని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా నవ్వుకుంటున్నారు, ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ అవుతున్నారు. నిన్న సంధ్య థియేటర్ లో షో చూడటానికి వెళ్ళాము. ప్రేక్షకుల స్పందన చూసి చాలా ఆనందం కలిగింది. సినిమా అయిపోయాక అందరూ చాలా బాగుందని ప్రశంసించారు. చూసినవాళ్లు అందరూ సినిమా గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. మీడియా వారు ఈ సినిమాని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని వస్తాయి. ఇది కుటుంబంతో, స్నేహితులతో కలిసి ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం. యూఎస్ నుంచి కూడా కొందరు ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇక్కడ మంచి స్పందన వస్తుందని ప్రశంసించారు. ఇది మానవ సంబంధాల మీద నడిచే సినిమా. మనుషులు పరిస్థితులను ఎలా మారుతారు? వారి నిజ స్వరూపాలు ఎలా బయటకు వస్తాయి? అనేది ఈ సినిమాలో చూపించాం. థియేటర్ కి వెళ్లి చూడండి. ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. నాకు ఈ అవకాశమిచ్చిన నా నిర్మాతలకు, నా టీం అందరికి ధన్యవాదాలు. అలాగే నాకు సపోర్ట్ చేసిన నాగవంశీ గారికి, మారుతి గారికి, ఆహా వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు” అన్నారు.
నటి నవ్య స్వామి మాట్లాడుతూ.. “ముందుగా మా టీం అందరికీ శుభాకాంక్షలు. మేం సినిమా చేసేటప్పుడే ఈ సీన్ కి ప్రేక్షకులు నవ్వుకుంటారు, ఈ సీన్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు అనుకునేవాళ్లం. కానీ మేం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన వస్తోంది. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణమైన ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి సినిమాని థియేటర్ లోనే చూడాలి. ఎందుకంటే కామెడీ సీన్స్ ని నలుగురు కలిసి కూర్చొని చూస్తే ఆ కిక్ వేరే ఉంటుంది. ఫన్ డబుల్ అవుతుంది. నిన్న థియేటర్ కి వెళ్లి ఆడియన్స్ తో కలిసి సినిమా చూశాం. ప్రేక్షకుల స్పందనతోనే ఈ సినిమా హిట్ అని మాకు అర్థమైపోయింది. చూసిన ప్రేక్షకులు అందరికీ సినిమా బాగా నచ్చింది. ఇంకా చూడనివాళ్ళు వెంటనే వెళ్లి సినిమా చూడండి. మీరు ఖచ్చితంగా సినిమా చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.
నటుడు అంజి మాట్లాడుతూ.. “ముందుగా మా డైరెక్టర్ గారికి, నిర్మాతలకు, ఆహా వారికి, మారుతి గారికి, నాగవంశీ గారికి, నా తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా ఖచ్చితంగా ఇంటిల్లిపాది వెళ్లి ప్రశాంతంగా థియేటర్ లో కూర్చొని ఎంజాయ్ చేసి, హ్యాపీగా నవ్వుకొని.. ఇంటికి వెళ్లి కూడా చెప్పుకొని చెప్పుకొని నవ్వుకునే సినిమా. నిన్న కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి సినిమా చూశాను. వాళ్ళు ఇంటికి వెళ్లిన తర్వాత ప్రత్యేకంగా ఫోన్ చేసి, ఇది అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అన్నారు. నిన్న ఉదయం సంధ్య థియేటర్ లో, సాయంత్రం గోకుల్ థియేటర్ లో ఆడియన్స్ తో కలిసి సినిమా చూశాం. అందరూ సినిమా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న ఎవరో యూట్యూబ్ లో ‘హీరోయిన్ కిడ్నాప్ అవుతుంది, దాని చుట్టూ కథ తిరుగుతుంది’ అని రివ్యూ చెప్పారు. దయచేసి సినిమా చూసి, రివ్యూ ఇవ్వండి. మా డైరెక్టర్ గారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో మేం ప్రత్యక్షంగా చూశాం. ఒక సినిమా నిర్మించడం అనేది ఎంత రిస్క్ తో కూడుకున్నదో మీకు తెలిసిందే. సినిమా వెనక ఎందరో కష్టముంటుంది. మీరు సినిమా చూడకుండా రివ్యూ రాయడం వల్ల ఎన్నో జీవితాలు తారుమారవుతాయి, నాశనమవుతాయి. దయచేసి సినిమా చూసి, మీకు ఏదనిపిస్తే అది రివ్యూ రాయండి. కానీ సినిమా చూడకుండా ఏది పడితే అది రాయకండి. మా సినిమా అయితే చూసిన అందరికీ నచ్చుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శకనిర్మాతలకు మరోసారి ధన్యవాదాలు” అన్నారు.
నటి కవిత మాట్లాడుతూ.. “నాకు ఈ సినిమాలో అవకాశమిచ్చిన దర్శకుడు సురేష్ గారికి ధన్యవాదాలు. మేము థియేటర్ కి వెళ్లి సినిమా చూసినప్పుడు ప్రేక్షకులందరూ మొదటి సీన్ నుంచి చివరి వరకు చాలా ఎంజాయ్ చేశారు. మేం నవ్వుకుంటూ, ఎంత సరదాగా సినిమాలో నటించామో.. ప్రేక్షకులు కూడా అంతే సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ సినిమా చూస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాలను అందరూ సపోర్ట్ చేయండి” అన్నారు.
బాలనటి చైత్ర మాట్లాడుతూ.. “సినిమా చాలా బాగుంది. నేను సినిమా చూసి చాలా నవ్వుకున్నాను. మీరు కూడా సినిమా చూసి, మంచిగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.
అనంతరం విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానాలు ఇచ్చారు.
నటీనటులు: నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ, అంజి మామ, చేవెళ్ల రవి, జీవన్
సమర్పణ: ఎస్.నాగవంశీ, మారుతి టీమ్
నిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు ,దర్శకుడు: సురేష్ నరెడ్ల
డీఓపీ: పి.సి. మౌళి
సంగీతం: కళ్యాణి మాలిక్
లిరిక్స్: కాసర్ల శ్యామ్
నేపథ్య సంగీతం: కామ్రాన్
ఎడిటర్: ఎస్.బి. ఉద్ధవ్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీపాల్ మాచర్ల
 
Intiti Ramayanam will make you laugh your lungs out; the response is massive, say makers at the success meet   
Intiti Ramayanam, a family drama blending comedy and mystery – is the latest Telugu film released in theatres this weekend. Starring senior actor VK Naresh, Rahul Ramakrishna, and Navya Swamy in the lead roles, the film, presented by Sithara Entertainments, is set in the rural backdrop of Jammikunta town in interior Telangana and is enjoying a good response in theatres. Speaking during the press meet organised in the city on Saturday commemorating its success, the makers along with cast and crew spoke about the audience’s response post release.
Director Suresh Naredla said, “Intinti Ramayanam is finally out in theatres and we’re very happy to know the positive response from audiences. Viewers are enjoying the comedy and emotional sequences throughout the film. When we visited the Sandhya theatre yesterday in the city, the audience response was massive and overwhelming. Be it the scenes of Bithiri Satti or the police station episode, we get to hear a hilarious talk overall. ‘Intinti Ramayanam’ is spreading through word-of-mouth.”
The director further said that everyone who watched the trailer has been saying that the story is about gold theft. “It is not about the mystery of theft. It’s just an undercurrent theme to make viewers curious. The film is more of human relationships, how people change according to the situations, how their originalities come up with changing times.”
Anji Mama, who played a crucial role in the film stated, “I thank my producers who put a step forward to bring a rural story to public. I also thank Producer Naga Vamsi garu, director Suresh Naredla garu, my co-actors and technicians who worked relentlessly for the film. Not restricted to individuals, it’s a film that a family can enjoy thoroughly in theatres, and also go back home laughing while recalling the incidents.”
Character artiste Kavitha said, “I thank our director Suresh garu for giving me the opportunity in the film. We were thrilled to know the pulse of the audience when we visited the theatres yesterday. ‘Intinti Ramayanam’ was a laugh riot. People enjoyed the film from the word go. I request audiences to support our film.”
Navya Swamy congratulated the entire team for the success of ‘Intinti Ramayanam’. “When we watched the final copy, we felt that we might get a good response for this particular scene or that comedy episode. But contrary to our expectations, the reaction of the audiences was quite tremendous. We all are very happy when we witnessed the people breaking into laughter in the halls. It was more than what we had expected. The kick that one can get watching a comedy film along with a bunch of people in theatres is so massive. The comedy doubles up. You will just laugh your lungs out,” Navya said.
Being a non-native Telugu speaker, Navya Swamy admitted that she had to struggle to catch the diction of the Telangana dialect. “I would take the script along and practice it at home just to get familiar with the words. Since I had done my homework, I didn’t feel any difficulty delivering my dialogues before the screen,” she added.
Talking about the inspiration behind setting up the film in the Telangana backdrop, director Suresh said, “I want ‘Intinti Ramayanam’ to be true to its theme with a village backdrop. A proper indie-kind-of a look. The gold-theft incident is a small one in which the story revolves around in the second half. People in the sleepy village are happy-go-lucky souls who chat and crack jokes leading a happy life. It’s all a closely-knit family, but if they have to face something untoward and unexpected, the genuineness of these people is exposed. I want to show how the characters change their colours according to the circumstances. I wanted to portray those moments.”
Producer Venkat Uppaturi, who made his theatrical debut with ‘Intinti Ramayanam’, said he first partnered with aha to make the film. Later after getting convinced with the final product, he wanted to go for theatrical release. “So it eventually clicked and the response was good. I wish we hear a lot more positive response as the days pass,” he added.
Producer Gopichand Innamuri said, “Irrespective of genres whether it is a commercial film or a comedy-drama, audiences would own it if they relate to the story. ‘Intinti Ramanayam’ is one such story which has all elements packed in one bag.” Surabhi Prabhavathi, Gangavva, Anji Mama, Anji, Chevella Ravi (Bithiri Satti), Jeevan and Stephen Madhu play key roles in the film.
 20220401014915_IMG_0611 GANI9438 GANI9441 GANI9444 GANI9514