Sep 27 2023
Sep 26 2023
Soothing Melody Nuvvu Navvukuntu from Sithara Entertainments’ MAD is infectious!
ఈరోజు(సెప్టెంబరు 26న) చిత్ర బృందం ‘నువ్వు నవ్వుకుంటూ’ అంటూ సాగే అందమైన మెలోడీ పాటను విడుదల చేసింది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చగా, కపిల్ కపిలన్ ఆలపించారు. పాట సందర్భానికి తగ్గట్టుగా గీత రచయిత భాస్కరబట్ల యూత్‌ఫుల్ మరియు రొమాంటిక్ లిరిక్స్ రాశారు.
రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. మ్యాడ్ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
తారాగణం & సాంకేతిక నిపుణుల వివరాలు:
తారాగణం: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, అంతోనీ, శ్రీకాంత్ రెడ్డి
రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: ఎస్. నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: నవీన్ నూలి
డీఓపీ: షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి
ఆర్ట్: రామ్ అరసవిల్లి
అడిషనల్ స్క్రీన్ ప్లే: ప్రవీణ్ పట్టు, ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
ఫైట్ మాస్టర్: కరుణాకర్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
Soothing Melody Nuvvu Navvukuntu from Sithara Entertainments’ MAD is infectious!
Sithara Entertainments is coming up with their crazy and Maddening entertainer, MAD on 6th October, 2023. The movie team has started promotions of the movie at full swing.
On 26th September, the team has released a soothing Melody, Nuvvu Navvukuntu. Bheems Ceciroleo composed the song and Kapil Kapilan crooned it. Bhaskarabatla has written youthful and romantic lyrics for this song.
Ram Nithin, Sangeeth Shobhan, Narne Nithin, Sri Gouri Priya Reddy, Ananthika Sanilkumar, Gopikaa Udyan are cast in the movie in lead roles. MAD is produced by debutant Haarika Suryadevara and Sai Soujanya, Fortune Four Cinema is co-producing the film. Suryadevara Naga Vamsi is presenting the film.
National Award winning editor Navin Nooli is editing the film and Shamdat Sainudeen and Dinesh Krishnan B are handling cinematography. MAD is written and directed by debutant Kalyan Shankar.
More details about the film will be announced soon.
Sep 26 2023
Sithara Entertainments’ MADdest youthful Entertainer to release on 6th October
Sep 24 2023
Dulquer Salmaan, Venky Atluri and Sithara Entertainments’ Lucky Baskhar, shoot commences!
Sep 21 2023
*”Sapta Sagaralu Dhaati” is a poetic journey through love and time: Rakshit Shetty*
‘సప్త సాగరాలు దాటి’ చిత్రం భావోద్వేగాలతో కూడిన ఓ అందమైన ప్రయాణం: కథానాయకుడు రక్షిత్ శెట్టి
కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ‘అతడే శ్రీమన్నారాయణ’, ’777 చార్లీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించారు. సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న ఈ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు విలేకర్లతో ముచ్చటించారు కథానాయకుడు రక్షిత్ శెట్టి.
‘సప్త సాగరాలు దాటి’ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది?
దర్శకుడు హేమంత్ తో ఇది నాకు రెండో సినిమా. తన మొదటి సినిమా ‘గోధి బన్న సాధారణ మైకట్టు’లో నేను నటించాను. తన రెండో సినిమా కూడా నాతో చేయాలి అనుకున్నారు. కానీ అప్పుడు నేను ‘అతడే శ్రీమన్నారాయణ’తో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఇప్పుడు మూడో సినిమాకి ఇలా కుదిరింది. ‘ఛార్లీ’ తర్వాత సినిమాల పరంగా నాకు వేరే ప్లాన్ లు ఉన్నాయి. కానీ ఆలోపు ఓ మంచి ప్రేమ కథ చేయాలనుకున్నాను. అప్పుడు హేమంత్ తాను ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ‘సప్త సాగర దాచే ఎల్లో’(సప్త సాగరాలు దాటి) కథ చెప్పడం, దానిని సినిమాగా తీసి హిట్ కొట్టడం జరిగిపోయాయి. దర్శకుడిగా హేమంత్ ది ఒక విభిన్న శైలి. అతని మొదటి రెండు సినిమాలకే కన్నడ పరిశ్రమకు మరో మంచి దర్శకుడు దొరికాడు అనిపించింది. చిత్రీకరణకు ముందు ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తారా అనే ఆసక్తి ఉండేది. ఆయన ఈ కథని పొయెటిక్ గా ఎంతో అందంగా రూపొందించారు.
ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని ముందుగానే అనుకున్నారా?
మొదట రెండు భాగాలు అనే ఆలోచన లేదు. అయితే షూటింగ్ సమయంలో ప్రధాన పాత్రలు మను-ప్రియ మధ్య కెమిస్ట్రీ చూసి హేమంత్ రెండు భాగాలుగా చెప్పాలి అనుకున్నారు. హేమంత్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉంటారు, ఏం చేయాలో క్లారిటీ ఉంటుంది. అయినప్పటికీ షూటింగ్ సమయంలో ఇంకా ఏమైనా మెరుగుపరచగలమా అని ఆలోచిస్తూనే ఉంటారు. అలా కొంత భాగం షూటింగ్ అయ్యాక రెండు భాగాలుగా విడుదల చేయాలని ఆయన భావించారు. మొదట నాకు కాస్త ఆందోళన కలిగినప్పటికీ.. కథ మీద, ఆయన విజన్ మీద నమ్మకంతో అంగీకరించాను. షూట్ అయ్యాక ఎడిటింగ్ టేబుల్ లో చూసుకున్నాక.. రెండు భాగాలుగా చెప్పాలనే ఆయన ఆలోచన సరైనది అనిపించింది. మాములుగా మొదటి భాగం, రెండో భాగం ఎక్కువ వ్యవధితో విడుదల చేస్తుంటారు. కానీ మేము ఏడు వారాల వ్యవధిలోనే విడుదల చేస్తున్నాం. కాబట్టి ప్రేక్షకులు కథతో, పాత్రలతో తేలికగా పయనిస్తారు.
పార్ట్-1, పార్ట్-2 అని కాకుండా సైడ్-A, సైడ్-B అని పెట్టడానికి కారణమేంటి?
2010 సమయంలో జరిగే కథ ఇది. క్యాసెట్లతో ముడిపడి ఉంటుంది. అప్పుడు మనకు పాటల క్యాసెట్లు ఉండేవి. వాటిలో సైడ్-A, సైడ్-B అని ఉంటాయి. సైడ్-A పూర్తయిన తర్వాత సైడ్-B ప్లే చేస్తాం. ఆ ఉద్దేశంతో ఇలా సైడ్-A, సైడ్-B అని పెట్టడం జరిగింది.
దర్శకుడిగా హేమంత్ లో మొదటి సినిమాకి, ఇప్పటికి ఎలాంటి మార్పు చూశారు?
దర్శకుడిగా హేమంత్ ఎంతో ప్రతిభావంతుడు. కానీ మొదటి సినిమాకి ఆయనకు బడ్జెట్ పరంగా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు తన పూర్తి స్థాయి ప్రతిభను చూపించే అవకాశం లభించింది. రచయితగా, దర్శకుడిగా ఆయన సినిమాసినిమాకి ఎంతో మెరుగుపడుతున్నాడు.
కర్ణాటకలో తెలుగు సినిమాల ప్రభావం?
కర్నాటకలో తెలుగు చిత్రాలకు విశేష ఆదరణ ఉంటుంది. చిన్నప్పుడు తెలుగు సినిమాలు విడుదలైన కొన్ని నెలల తర్వాత వీసీఆర్ టేపుల్లో చూసేవాన్ని. ఇంజనీరింగ్ రోజుల్లో, కర్నూలుకి చెందిన నా రూమ్‌మేట్ ద్వారా తెలుగు సినిమాల గురించి మరింత తెలుసుకోగలిగాను. ‘వేదం’ వంటి అద్భుతమైన సినిమా గురించి అలాగే తెలుసుకున్నాను. కమర్షియల్ సినిమాలే కాకుండా విభిన్న చిత్రాలు ఆదరణ పొందగలవని నాకు అర్థమైంది.
‘సప్త సాగరాలు దాటి’ టైటిల్ గురించి?
టైటిల్ ఒక అందమైన కన్నడ పద్యం నుండి తీసుకోవడం జరిగింది. ‘ఏడు సముద్రాలు దాటి’ అనే అర్థం వస్తుంది. మనం భౌతికంగా ఒక ప్రదేశానికి చేరుకోకపోతే.. ప్రేమ, కుటుంబం మరియు జీవిత లక్ష్యాల సందర్భంలో అక్కడ ఉండాలనే భావన లోతుగా వ్యక్తిగతంగా మరియు అర్థవంతంగా ఉంటుంది.
నటన మరియు రచనలను బ్యాలెన్స్ చేయడం?
గత దశాబ్దంలో, నటుడిగా బలమైన ఉనికిని ఏర్పరచుకోవడానికి నేను దర్శకత్వం వహించడం మానుకున్నాను. ఇప్పుడు, నేను కథల సంపదను పోగుచేసుకుని.. దర్శకత్వం మరియు రచనకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తున్నాను.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో అనుబంధం?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన దివ్య నాకు చాలా కాలంగా తెలుసు. “సప్త సాగరాలు దాటి” యొక్క కన్నడ వెర్షన్‌కి ప్రశంసలు దక్కిన తర్వాత, తెలుగు వెర్షన్ కోసం వారితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాను.
‘సప్త సాగరాలు దాటి’ హైలైట్స్?
ఈ సినిమాకి సంబంధించి ప్రతిదీ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం అందమైన సినిమాటోగ్రఫీ, అద్భుతమైన సంగీతం, కథలో లీనమయ్యే సౌండ్ డిజైన్‌ను కలిగి ఉంది, ఇది థియేటర్‌లలో తప్పక చూడదగినదిగా చేస్తుంది.
విడుదల వ్యూహం?
నిర్మాత శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని ‘సప్త సాగరాలు దాటి’ చిత్ర విడుదల విషయంలో భిన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నాను. ఛార్లీ తరహాలో ఒకేసారి వివిధ భాషల్లో విడుదల చేయడం కాకుండా.. మౌత్ టాక్ తోనే వివిధ భాషల ప్రేక్షకులకు చేరువ చేయాలనుకున్నాం.
రాబోయే ప్రాజెక్ట్‌లు?
నా దగ్గర “రిచర్డ్ ఆంథోనీ” ఒక క్లాసీ గ్యాంగ్‌స్టర్ కథ ఉంది, దాని తర్వాత ఆఫ్టర్ లైఫ్ ఆధారంగా OTT చిత్రం ఉంది. అలాగే, “పుణ్య కోటి” అనే రెండు భాగాల ప్రాజెక్ట్ ఉంది.
స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడంపై?
నటుడిగా నేను స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ చిత్రనిర్మాతగా, నాకు తెలుగు భాషపై దాని సాహిత్యం, జానపదాలపై లోతైన అవగాహన అవసరమని నేను నమ్ముతున్నాను.
‘సప్త సాగరాలు దాటి’ చిత్రీకరణ సమయంలో మధుర జ్ఞాపకాలు?
ముఖ్యంగా క్లైమాక్స్‌కు దారితీసే సన్నివేశాలు హేమంత్ కథనంలో ఒక అద్భుతమైన సందర్భం. నా క్యారెక్టర్‌లో లీనమై, నేరేషన్‌లో ఎమోషనల్‌గా పయనించాను. నటన యొక్క అందం ఏమిటంటే, మనం నిజమైన బాధ లేకుండా భావోద్వేగాలను అనుభవించవచ్చు. వ్యక్తిగతంగా ప్రభావితం కానప్పటికీ, మనం భావోద్వేగాలకు కనెక్ట్ అవుతాం.
*”Sapta Sagaralu Dhaati” is a poetic journey through love and time: Rakshit Shetty*
“Saptha Sagaralu Dhaati,” featuring the talented duo of Rakshit Shetty and Rukmini, and skillfully helmed by director Hemanth Rao, is eagerly anticipated for its release on September 22, 2023. The Kannada original, “Sapta Sagaradache Ello,” has been generating an overwhelming response from audiences across the board. Recently, Natural Star Nani added to the excitement by unveiling the trailer for the Telugu version. Released by People Media Factory, the film promises to captivate audiences with its emotionally charged storytelling.
The narrative of “Sapta Sagaralu Dhaati,” as glimpsed in the trailer, unfurls across two distinct time periods, offering insights into the lives of its central characters, Manu and Priya. The film is elevated significantly by the powerhouse performances of Rakshit Shetty and Rukmini Vasanth, evocative musical compositions, the thematic presence of the ocean, and carefully woven imagery, all contributing to its profound impact. Rakshit Shetty, following the success of “777 Charlie,” is poised to deliver yet another heartwarming performance.
Here are key highlights from Rakshit Shetty’s conversation with the media:
Collaboration with Hemanth Rao
This marks my second collaboration with Hemanth after “Godhi Banna Sadharana Mykattu.” Following the success of “777 Charlie,” I was eager to explore a love story, and that’s when Hemanth presented an idea that had been with him for 12 years. I instantly connected with the concept and recognized Hemanth’s unique storytelling style. I’m proud to see such talent emerging in the Kannada film industry, and I was genuinely moved after watching his previous work, which led to our second collaboration. “Sapta Sagaralu Dhaati” was shot in a poetic style, and he has created a beautiful film.
Making the Film in Two Parts
Initially conceived as a single film, Hemanth decided to split it into two parts as the story naturally required an extension. The poetic nature of the film emerged during the shooting process, and both parts were shot, edited, and subsequently realized as a two-part film. The first part embodies Indian classical poetry, while the second part adopts a rock band poetry style, reflecting the evolving emotions between Manu and Priya.
Challenges of a Two-Part Love Story
We recognized the potential challenge of viewer disconnection when making a love story in two parts. To address this, we minimized the gap between the release of Side A and Side B, almost treating it like two episodes of a web series. Additionally, we ensured a 7-week gap between the theatrical releases to maintain audience engagement.
Significance of Side A and Side B
The film revolves around cassettes, set in 2010 when they were still popular. Cassettes play a crucial role in the film’s narrative. While Side A has been released, we eagerly await the release of Side B.
Hemanth Rao’s Evolution as a Filmmaker
Over the last decade, Hemanth has matured both as a person and a writer. As a filmmaker, he has taken on more responsibilities, particularly from a producer’s perspective. In “Godhi Banna,” he worked with a limited budget, but “Sapta Sagaralu Dhaati” allowed him more creative freedom.
View of Telugu Films in Karnataka
I’ve always aimed for my films to reach a wider audience. Telugu films have been highly appreciated in Karnataka, with many families making it a tradition to watch a film every weekend. As a child, I used to watch Telugu films on VCR tapes months after their release. It was during my engineering days, with a roommate from Kurnool, that I discovered more Telugu films, including gems like “Vedam.” This experience made me realize that films like “Vedam” can resonate well, even beyond the commercial genre.
The Title “Sapta Sagaralu Dhaati”
The title originates from a beautiful Kannada poem, roughly translating to “somewhere beyond seven seas.” It embodies the idea that even if we don’t physically reach a place, the concept of being there can be deeply personal and meaningful in the context of love, family, and life goals.
Diverse Film Choices
I strive to explore new territory with each project, creating a broader market through some films and then delving into experimentation with others. I consider myself a storyteller both on and off-screen, aspiring to build a diverse portfolio.
Balancing Acting and Writing
In the past decade, I refrained from directing to establish a strong presence as an actor. Now, I plan to return to directing and writing, having accumulated a wealth of stories to tell.
Choosing Scripts
I have a team of writers, and I am a writer myself. If a script aligns with my profile and journey, I’m inclined to pursue it. I’m also open to opportunities like working with someone of Hemanth Rao’s caliber.
Association with People Media Factory
I’ve known Divya from People Media Factory for a long time. After receiving much appreciation for the Kannada version of “Sapta Sagaralu Dhaati,” I decided to collaborate with them for the Telugu version.
Pressure of Delivering New-Age Cinema in Kannada
I feel a greater sense of responsibility now to create films that resonate with a global audience. Historically, Kannada films didn’t expand beyond regional markets as other South Indian films did. Fortunately, we’ve started exploring new horizons, and with quality content, we can tap into more opportunities. We need more filmmakers to contribute to Kannada cinema’s growth.
Highlights of “Sapta Sagaralu Dhaati”
The film has beautiful cinematography, impactful music, and immersive sound design, making it a must-watch in theaters.
Release Strategy: Two Parts
Unlike “ASN” and “777 Charlie,” which had a pan-India appeal, “Sapta Sagaralu Dhaati” caters to a niche audience. We relied on word-of-mouth and organic growth to build buzz among our target viewers, taking a different approach to ensure the producer’s saftety.
Basis for “Sapta Sagaralu Dhaati”
While the story was originally conceived by Hemanth a decade ago, he has since made substantial improvements. He draws inspiration from the real world for his scenes but maintains the originality of the story.
Exploring Different Dialects in Kannada Films
Rishab, Raj, and I have ventured into various regions in our films, but there is still untapped potential, particularly in North Karnataka and Konkani dialects. We’re gradually exploring these areas in films like “Richard Anthony.”
Reference Music in the Film
Hemanth used reference music for every scene while writing the script. During narration, he would even play music in the background, enhancing the impact of the scenes. We collaborated closely on how each scene could be treated and how sound effects could be integrated.
Upcoming Projects
I have “Richard Anthony,” a classy gangster story, followed by an OTT film based on After Life. Additionally, “Punya Koti” is in the works as a two-part project.
Potential for a Straight Telugu Film
As an actor, I am open to doing a straight Telugu film, but as a filmmaker, I believe I need a deeper understanding of the Telugu language, including its literature and folklore.
Memorable Moments from “Sapta Sagaralu Dhaati” Filming
One standout moment was during Hemanth’s narration of scenes, particularly those leading up to the climax. Immersed in my character, I found myself emotionally moved during the narration. The beauty of being an actor is that you can experience emotions without actually suffering through them; you understand that it’s not you but the character. Although the emotions are real, you are not personally affected by them.
Follow Us!