jersey

‘Jersey’ Thank you Meet

సినిమా అనేది శాశ్వ‌తం.. `జెర్సీ` ఎంట‌రైర్ యూనిట్‌కు మెరిట్‌లా ఎప్ప‌టికీ నిలిచిపోయే చిత్రం
- `జెర్సీ` థాంక్స్ మీట్‌లో రానా ద‌గ్గుబాటి

‘‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ మా టీమ్‌కి స్పెషల్‌గా ఉంటుంది. ‘అందరూ పాతబడిపోవచ్చు కానీ, ‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ పాతబడిపోదు. చాలా చాలా స్పెషల్, ప్రౌడ్‌ సినిమాగా మిగిలిపోతుంది’’ అని నాని అన్నారు. ఆయన హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా ‘మళ్ళీరావా’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల అయింది. నాటి నుంచి అప్రతిహతంగా చిత్ర విజయం సరికొత్త రికార్డ్ లను నెలకొల్పుతోంది.

ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్‌’లో నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ– ‘‘జెర్సీ’ రిలీజ్‌ తర్వాత నాకు వచ్చిన మెసేజెస్‌ కానీ, ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు సినిమా గురించి, నటన, టెక్నీషియన్స్‌ గురించి మాట్లాడుతున్న విధానం కానీ.. నేనెప్పుడూ ఎక్స్‌పీరియన్స్‌ చేయని ఒక ఫీలింగ్‌. ఏ సినిమాకైనా తొలి మూడు రోజులు బోల్డన్ని మెసేజ్‌లు, ఫీడ్‌బ్యాక్‌ వస్తుంటాయి. వారం తర్వాత ఆ ఫీడ్‌బ్యాక్‌ తగ్గుతూ ఉంటుంది. కానీ ‘జెర్సీ’ కి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఏ రోజుకారోజు మెసేజ్‌లతో మా ఫోన్లు నిండిపోతున్నాయి. రివర్స్‌లో మాకు థ్యాంక్యూ మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే టీమ్‌ అందరి తరఫున ఒక ఫైనల్‌ థ్యాంక్యూ చెప్పాలని ఈ మీట్‌ ఏర్పాటుచేశాం. చాలా ఎమోషన్‌ ఉన్న సినిమా కదా రిపీట్‌గా చూసేవాళ్లకి ఎలా ఉంటుందనుకున్నాం. కానీ, చాలా మంది మళ్లీ మళ్లీ చూసి మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి వీటిని మెసేజ్‌లు అనలేను.. ఎందుకంటే ఓ చిన్న లవ్‌లెటర్స్‌లా ఉన్నాయి.. అందరికీ థ్యాంక్యూ సోమచ్‌. ‘జెర్సీ’ సినిమా చూసిన రానా కాల్‌ చేసినప్పుడు ఆ వాయిస్‌ నాకు గుర్తుంది.. వాడు(రానా) ఆల్‌మోస్ట్‌ ఏడిచినట్టున్నాడు.. కచ్చితంగా రానాను ఈ ఫంక్షనికి పిలుద్దామనుకున్నా. లాస్ట్‌ మినిట్‌లో ఫోన్‌ చేసినా వస్తాడులే అన్న నమ్మకం.. ఎందుకంటే వాడికి సినిమా ఎంత నచ్చిందో నాకు తెలుసు. మా కష్టానికి అంత రెస్పెక్ట్‌ చూపించిన ప్రేక్షకులందరికీ, మీడియాకి థ్యాంక్స్‌’’ అన్నారు.

హీరో రానా మాట్లాడుతూ– ‘‘నేను సక్సెస్‌ మీట్‌కి వచ్చి చాలా రోజులు అయింది. కానీ, ‘జెర్సీ’ సినిమాకి రావాలనుకున్నా. ఎందుకంటే.. నాకు లైఫ్‌లో బేసిక్‌గా కొన్ని అర్థంకావు. క్రికెట్, పెళ్లి, అమ్మాయిలు, పిల్లలు. ఇవన్నీ అర్థం కాని నాకే ఈ సినిమా చూసి ఏడుపు వచ్చిందంటే ప్రేక్షకుల పరిస్థితి ఏమై ఉంటుందో నాకు తెలుసు. నాని నటన సూపర్‌. ప్రతిరోజు నాకు స్ఫూర్తినిస్తుంటాడు. వారంలో మూడు సార్లు తనని చూస్తాను. అయినా కానీ సినిమాపై అతనికి ఉన్న ప్రేమ చూస్తే ఎంతో కొత్తగా చేయాలని స్ఫూర్తినిస్తూ ఉంటుంది. గౌత‌మ్ స్టోరీ టెల్ల‌ర్‌గా.. ఫిలింమేక‌ర్‌గా జెర్సీతో అంద‌రినీ ట‌చ్ చేశాడు. యు టర్న్ నుండి శ్ర‌ద్ధాశ్రీనాథ్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. ‘జెర్సీ’ కి పనిచేసిన వారందరికీ చెబుతున్నా. సినిమా అన్నది శాశ్వతం.. అందులో ‘జెర్సీ’ సినిమా కోసం ఎప్పుడూ ఒక పేజీ తప్పకుండా ఉంటుంది’’ అన్నారు. ఎంటైర్ టీంకు ఇదొక మెరిట్‌లా మిగిలిపోతుంది“ అన్నారు.

ద‌ర్శ‌కుడు గౌతమ్‌ తిన్ననూరి మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి వచ్చిన అభినందనలకు అందరికీ కృతజ్ఞతలు. `ఈ సినిమాను నాకు చేసే అవ‌కాశం క‌ల్పించిన నిర్మాత‌లు పిడివి.ప్ర‌సాద్‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీగారికి, సినిమా కోసం వ‌ర్క్‌చేసిన ప్ర‌తి ఒక ఆర్టిస్ట్‌, టెక్నీషియ‌న్‌కి థాంక్స్‌. నాని సార్‌కి స్పెష‌ల్ థాంక్స్‌. శ్ర‌ద్ధాశ్రీనాథ్‌కి థాంక్స్‌. నా డైరెక్ష‌న్ టీం ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. సినిమాను చూడ‌ని వాళ్లు ఎవ‌రైనా ఉంటే.. చూడమ‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

హీరోయిన్ శ‌ద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ – “ఈ రోజు ఏం చెప్పాలో తెలియ‌డం లేదు. థాంక్యూ చెబితే స‌రిపోదు. ప్రేక్ష‌కులు చూపించిన ప్రేమ‌కు థాంక్స్‌. ఇంకా మంచి సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. సారా క్యారెక్ట‌ర్ చేయ‌డం ఆనందంగా ఉంది. సింగిల్ ఫాద‌ర్స్‌కు, సింగిల్ మ‌ద‌ర్స్‌కు .. ఈ సినిమాను అంకితం చేస్తున్నాను“ అన్నారు.

విశ్వంత్ మాట్లాడుతూ – “సినిమా ఓ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. డైరెక్ట‌ర్ గౌత‌మ్ తొలి సినిమా నుండి ప‌రిచ‌యం. ఒక‌ప్ప‌టితో పోల్చితే ఇప్పుడు త‌ను న‌వ్వుతున్నాడు. ఓ మంచి సినిమా చూసిన‌ప్పుడు చాలా శాటిస్పాక్ష‌న్ క‌లుగుతుంది. అదే అలాంటి సినిమాలో పార్ట్ అయితే ఆ ఆనందం రెండు, మూడు రెట్లు ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి అనుభూతిని ఇచ్చిన సినిమా ఇది“ అన్నారు.
పాట‌ల ర‌చ‌యిత కృష్ణ కాంత్ మాట్లాడుతూ – “న‌న్ను న‌మ్మి నాకు ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చిన గౌత‌మ్‌కి వంద‌సార్లు థాంక్స్ చెప్పినా స‌రిపోదు. అలాగే త‌మిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయిన అనిరుధ్ ఈ సినిమాలో నాతో సింగిల్ కార్డ్ రాయించినందుకు త‌న‌కు కూడా థాంక్స్‌. ఓ మంచి సినిమాను.. మాస్ట‌ర్ పీస్‌లాంటి సినిమా కోసం పాటు ప‌డ్డ నానిగారికి థాంక్స్‌. మంచి సినిమాను మిస్ కాకుండా చూడండి“ అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు పీడీవీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం లో భాగంగా చిత్ర నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ్యూటర్ లకు ప్రముఖ కదా నాయకుడు రాణా, హీరో నాని, దర్శకుడు గౌతమ్, చిత్ర సమర్పకుడు పిడివి ప్రసాద్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ జ్ఞాపికలను బహుకరించారు.

 

Jersey will remain special forever

Jersey has turned out to be the film of the year with some great response from the critics, audience, and media. The special thanks meet was held yesterday night at Trident hotel and Rana Daggubatti was the chief guest

In Rana’s words “Nani is one actor who keeps inspiring me time and again and he has done that once again with his performance in Jersey. The entire team deserves special applause and Jersey is a film which will remain special forever in the hearts of many. I welcome Shraddha to the Telugu films and hope Nani keeps flying high like this forever”

In Gautam Tinnanuri’s words “I never imagined such a big response to the film. I thank the critics, media, and audience who made this film so special for me. Also, I want to laud my direction department who worked day and night for the film. Last but not least, I own Nani sir big time for making this film such a big hit”.

Finally, Nani said “Generally many keep sending congrats messages for about three days of the film’s release. But for Jersey, the messages haven’t stopped. Every special has been special and emotional. They are like love letters and even after a week, they have been increasing a lot. Jersey will always be a special film and I thank Gautam for bringing this to me. Finally, I thank Rana for coming in as the chief guest and speaking such lovely words about the film”.

In Shraddha Srinath’s words “I am speechless with the way the film is getting good applause from all over. I loved playing Sara and never imagined such a great response to my role. I am loving the way I have been welcomed in Telugu and would love to do more films here”.

 

The event was attended by the film’s presenter, PDV Prasad, Executive producer Venkataratnam and others attended the event. In the end, the film’s producer Naga Vamsi and PDV Prasad distributed shields to Rana, Nani, Gautam Tinnanurim Shraddha Srinath and the rest of the team and various actors and distributors.

 

Jersey thanks meet Jersey thanks meet1 Jersey thanks meet2 Jersey thanks meet3 Jersey thanks meet4 Jersey thanks meet5

`జెర్సీ`.. ఓ జెన్యూన్ సినిమా.. అవుట్ స్టాండింగ్ మూవీ – విక్ట‌రీ వెంక‌టేష్‌

 batch_DSC_1876 batch_DSC_1891 batch_DSC_1901 batch_DSC_1903 batch_DSC_1904 batch_DSC_1909నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తోన్న చిత్రం `జెర్సీ`. ఏప్రిల్ 19న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమంలో నాని క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసే వీడియో మోహన్‌ చెరుకూరి చేతుల మీదుగా విడుదలైంది. వెంకటేష్‌ తొలి టిక్కెట్‌ను విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా…
విక్ట‌రీ వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘క్రికెట్‌ ఇష్టం కాబట్టి ఇక్కడికి రాలేదు. చాలా జెన్యూన్‌గా, ప్రేమగా ఇక్కడికి వచ్చాను.జెర్సీ ఫస్ట్‌లుక్‌ వచ్చినప్పుడే చాలా ఇంప్రెస్‌ అయ్యాను. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి లుక్‌ చూసి ఇంప్రెస్‌ అయ్యా. అలాగే ట్రైల‌ర్ చాలా బాగా న‌చ్చింది. డైరెక్ట‌ర్‌ గౌతమ్‌ ఈ సినిమాలో ఏం చూపించాలనుకున్నారో క్లారిటీగా అదే చూపించారు. ట్రైలర్‌ చూశాక మైండ్‌ బ్లోయింగ్‌గా అనిపించింది. జెన్యూన్‌ సినిమాలు రేర్‌గా వస్తాయి. నానిని ఇలాంటి సినిమాలో చూసేసరికి చాలా బాగా అనిపించింది. ఇలాంటి పాత్రల్లో నటించేటప్పుడు చాలా ఎమోషనల్‌గా ఇన్వాల్వ్‌ అవుతుంటాం. అందుకే ట్రైలర్‌ చూడగానే ఈ తరహా సినిమాలు స్ఫూర్తిగా అనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ హీరో పాత్ర చూసి ఇన్‌స్పయిర్‌ అవుతారు. ప్రతి ఒక్కరూ లైఫ్‌లో స్ట్రగుల్‌ అవుతుంటారు. అలాంటప్పుడు జీవితంలో మనం వదిలేయకూడదు. గట్టిగా ప్రయత్నించి సక్సెస్‌ సాధించాలని ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, లైఫ్‌ లెసన్‌ అని అర్థం చేసుకుంటాం. సినిమా ఔట్‌స్టాండింగ్‌గా ఉంటుంది. నిర్మాతలు నాకు చాలా మంచి మిత్రులు. దర్శకుడికి కంగ్రాట్స్‌. నానిని చూస్తే గర్వంగా ఉంటుంది. తను మనకున్న నేచురల్‌ స్టార్‌’’ అని అన్నారు.
నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ ‘‘వెంకటేష్‌గారు ఆవకాయలాంటి వ్యక్తి. ఆయన నచ్చని తెలుగువారు ఉండరు. నేను బిగ్‌స్ర్కీన్‌ మీద చూసిన ఒక స్టార్‌ని నేరుగా కలిసినప్పుడు మరింతగా నచ్చింది వెంకటేష్‌గారిని చూసినప్పుడే. ఆయన ఫంక్షనకి వెళ్లాలనే నా కోరిక ‘బాబు బంగారం’తో తీరిపోయింది. ఆయన నా ఫంక్షన్‌కు రావాలనే కోరిక ‘జెర్సీ’తో తీరింది. ఆయనతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవాలనే కోరిక ఇప్పటికీ అలాగే ఉంది. తప్పకుండా తీరుతుందనే నమ్మకం ఉంది. మల్టీస్టారర్‌ టాపిక్‌ వచ్చిన ప్రతిసారీ ‘నువ్వూ, వెంకటేష్‌గారు కలిసి చేస్తే చాలా బావుంటుంది’ అని నాతో చాలా మంది చెప్పారు. ఆ క్షణం కోసం వెయిట్‌ చేస్తున్నా. ఈ రోజు ఈ ఈవెంట్‌కి ఛీఫ్‌ గెస్ట్‌గా వచ్చారాయ‌న. నాకు ‘జెర్సీ’ చాలా స్పెషల్‌ సినిమా. ఆయన రాకతో మరింత స్పెషల్‌ అయింది. ఈ సినిమాకు ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏప్రిల్‌ 19న అందరూ చాలా గర్వపడతారు. గౌతమ్‌ని చూసి, అర్జున్‌ని చూసి, నానిని చూసి, శ్రద్ధను చూసి అందరూ గర్వపడతారు. మా నాన్న, మా అబ్బాయి అందరూ గర్వపడతారు. అందరూ గర్వించదగ్గ సినిమాలో నేను నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. బ్లాక్‌బస్టర్‌ వంటి మాటలు నేను ఆనడం లేదు. కానీ గొప్ప సినిమాలో చేశాననే శాటిస్‌ ఫేక్షన్‌ ఉంది. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ముందు గౌతమ్‌ గురించి చెప్పాలి. గౌతమ్‌ చెన్నైలో ఉన్నాడు. యు.ఎస్‌. ప్రింట్స్‌ ఈ రోజు 9 గంటలకు వెళ్తాయి. వాటికోసం అక్కడే ఉన్నాడు. ఈ నెల 19న అతను తీసిన సినిమా మాట్లాడుతుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ కథ చెప్తారు. చాలా బ్యూటీఫుల్‌ సినిమా అవుతుంది. గౌతమ్‌ చాలా పెద్ద డైరక్టర్‌ అవుతాడని గౌతమ్‌  కొడుక్కి ఇవాళ చెబుతున్నా. గౌతమ్‌ కొడుకు పెద్దయ్యాక వాళ్ల నాన్ననే స్ఫూర్తిగా తీసుకుంటాడు. ‘జెర్సీ’ ట్రైలర్‌ స్టైల్‌లోనే చెప్పాలంటే, ఇంత పెద్ద ప్రపంచంలో ఇప్పటిదాకా నన్ను జడ్జి చేయంది తెలుగు ప్రేక్షకులు మాత్రమే. వాళ్ల దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను. ఏప్రిల్‌ 19న థియేటర్‌లో కలుసుకుందాం’’ అని అన్నారు.
శ్రద్ధా శ్రీనాథ్‌ మాట్లాడుతూ ‘‘కన్నడలో ‘యూ టర్న్‌’ నా తొలి సినిమా. ఆ తర్వాత తమిళ్‌, మలయాళం, హిందీ సినిమాలు చేశాను. ‘జెర్సీ’తో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాను. అది నా అదృష్టం. నేను నాలుగేళ్ల క్రితం ఇండసీ్ట్రకి వచ్చినప్పుడు సినిమా కెమెరా ఎలా ఉంటుందో నాకు తెలియదు. మిడ్‌ షాట్‌, వైడ్‌ షాట్‌ కూడా తెలియదు. కానీ మంచి సినిమా, మంచి సా్ట్రంగ్‌ ఫీమేల్‌ పాత్ర చేయాలని అనుకున్నా. ఈ సినిమాలో నా పాత్ర చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. గౌతమ్‌ మంచి పాత్ర రాశారు. నిర్మాతలు చాలా బాగా నిర్మించారు. నా హీరో అర్జున.. నానికి పెద్ద థాంక్స్‌. ఆయన అర్జున పాత్రను చాలా బాగా సెన్సిటివ్‌గా చేశారు. ఆయన ఆ పాత్రలో నటించబట్టే సారా పాత్రలో నేను బాగా చేయగలిగాను. నాకు ఈ సినిమా చాలా స్పెషల్‌’’ అని చెప్పారు.
విక్రమ్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘నాని నాకు ఒకరోజు సాయంత్రం ఈ కథ చెప్పాడు. నాకు చాలా నచ్చింది. ఆ కథలో అన్నీ ఉన్నాయి. డ్రామా నుంచి ప్రతిదీ ఉంది. నాలుగైదు సార్లు ఏడుపొచ్చింది. అంత ఎమోషన్‌ కూడా ఉంది. నేను ట్రైలర్‌ చూశా. చాలా బావుంది. సినిమా స్ర్కీన్‌ మీద ఇంకా బావుండాలని అనుకుంటున్నా. అనిరుద్‌ చాలా చక్కటి బాణీలిచ్చాడు. రీరికార్డింగ్‌ చాలా బాగా వస్తోందని నాని చెప్పాడు’’ అని అన్నారు.
ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ ‘‘ఫన్నీయెస్ట్‌ ఫంక్షన్‌ ఇది. రోజూ మా అబ్బాయి సాయంత్రాల్లో క్రికెట్‌ ఆడమని అడుగుతుంటాడు. నేను ఆడను. ఇప్పుడు స్టేజ్‌ మీద ఆడుతున్నది అతను చూస్తుంటాడనే అనుకుంటున్నాను. నానితో ఏం చేసినా నాకు స్పెషల్‌గానే ఉంటుంది. కారణం అందరికీ తెలుసు. నాని ‘వరల్డ్‌ స్పేస్‌’లో ఆర్‌.జె.గా పనిచేస్తున్నప్పుడు ‘అష్టాచమ్మా’కు ఆడిషన్‌కు వచ్చాడు. అప్పుడు నేను నానికి ఈమెయిల్‌ చేశాను. ‘నాని… నీకు నీ గురించి ఎంత తెలుసో నాకు తెలియదు కానీ, నువ్వు స్టార్‌ మెటీరియల్‌’ అని. ఇప్పుడు దాదాపు దశాబ్దం తర్వాత నా ప్రెడిక్షన్‌ కరెక్టేనని గర్వంగా ఉంటుంది. నేను కొంతకాలం క్రితం ‘గోల్కొండ హైస్కూల్‌’ అని ఒక సినిమా చేశాను. ఇప్పుడు ఇక్కడుంటే ఆ సినిమా ట్రైలర్లు గుర్తుకొస్తున్నాయి. ఇటీవల‌ కాలంలో నేను చూసిన జెన్యూన్‌ ట్రైలర్‌ ఇది. అదే విషయాన్ని నేను ట్విట్టర్‌లోనూ పెట్టా. ఈ సినిమా తప్పకుండా హిట్‌ అవుతుంది. శ్రద్ధ, అనిరుద్‌ అందరూ బాగా చేశారు. నిర్మాత, గౌతమ్‌ చాలా బాగా కృషి చేశారని అర్థమవుతోంది. గౌతమ్‌ ‘మళ్లీ రావా’ నాకు బాగా నచ్చుతుంది. ఈ సినిమా అంతకన్నా పెద్ద హిట్‌ కావాలి’’ అని అన్నారు.
సుధీర్‌ వర్మ మాట్లాడుతూ ‘‘అందరం ట్రైలర్‌ చూశాం. సినిమా అంతకన్నా బావుండాలని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు.
వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘‘నాకూ కూడా క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ప్రొఫెషనల్‌ క్రికెట్‌ కాకపోయినా ట్రైనింగ్‌ తీసుకుని నాని ఆ పోస్టర్లకు ఫోజులివ్వడం చాలా బావుంది. దర్శకుడు రాసుకున్న సీనను నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకెళ్లే నటుడు నాని. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రుతగా ఉంది. గౌతమ్‌ ‘మళ్లీ రావా’ సినిమా నాకు బాగా నచ్చింది. ఈ ప్రొడక్షన హౌస్‌ నాకు సొంత సంస్థలాంటిది. సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని అన్నారు.
సినిమాటోగ్రాఫర్‌ సాహు మాట్లాడుతూ ‘‘ఇంటెన్స్‌ అంశాలు, సరదా విషయాలు ఈ చిత్రంలో చాలా ఉంటాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఏప్రిల్‌ 19 వరకు వెయిట్‌ చేయడంలో తప్పులేదు’’ అని అన్నారు.
మారుతి మాట్లాడుతూ ‘‘రోజూ ఈ టైమ్‌లో టీవీల్లో క్రికెట్‌ చూస్తున్నాం. బిగ్‌ స్ర్కీన్‌ మీదకు క్రికెట్‌ను నానిగారు తీసుకురావడం ఆనందంగా ఉంది. హీరోలకు ఫ్యాన్స్‌ ఉంటారు. దర్శకుడిగా నేను నానిగారికి పెద్ద ప్యాన్‌ని. వంశీ ఈ ట్రైలర్‌ నాకు పంపిన రోజు ట్రైలర్‌ చూసి చాలా షాక్‌ అయ్యా. గౌతమ్‌ సిన్సియర్‌ ఎఫర్ట్‌ పెట్టి సినిమా చేశారు. ఒన్లీ కంటెంట్‌ మాట్లాడుతుంది. సమ్మర్‌లో రెగ్యులర్‌ క్రికెట్‌ ఎంత ఎంటర్‌టైన చేస్తుందో, అంతకు మించి ఈ సినిమా ఎంటర్‌టైన చేస్తుందని భావిస్తున్నా’’ అని అన్నారు.
సత్యరాజ్‌ మాట్లాడుతూ ‘‘ఫస్ట్‌ టైమ్‌ నా లైఫ్‌లో యాక్ట్‌ చేశాను. ఇందులో నేను క్రికెట్‌ కోచ్‌గా నటించాను. ఇన్నేళ్ల కెరీర్‌లో మిగిలిన పాత్రలన్నీ యాక్ట్‌ చేసినట్టుగా అనిపించలేదు. ఈ సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా అనిపించింది. దర్శకనిర్మాతలకు, చిత్ర యూనిట్‌కి చాలా ధన్యవాదాలు’’ అని అన్నారు.
ప్రవీణ్‌ మాట్లాడుతూ ‘‘కొట్టబోయే హిట్టుకు మూడు రోజుల ముందుగానే టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నా’’ అని అన్నారు.
కె.కె. మాట్లాడుతూ ‘‘టెక్నికల్‌ కారణాల వల్ల అనిరుద్‌, గౌతమ్‌ ఇక్కడికి రాలేదు. స్టోరీతో పాటు కలిసి వచ్చే పాటలు రాశాను. అందరికీ నచ్చేలా రాశానని అనుకుంటున్నా. క్రికెట్‌ ఎక్కడుంటే వెంకటేష్‌గారు అక్కడుంటారు. అందుకే ఇక్కడున్నారు. పాటల కోసం అక్కడక్కడా కొన్ని బిట్స్‌ చూశా. తప్పకుండా సినిమా హిట్‌ అవుతుందని నమ్ముతున్నా’’ అని చెప్పారు

‘జెర్సీ’ అమోఘమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది ! ‘జెర్సీ’ నాయిక – శ్రద్ధ శ్రీనాథ్

_L1A8085 _L1A9699 7P5A9345 DSC_9747అందంలో అభినయంలో తనకంటూ ఓ  ప్రత్యేకమైన శైలితో దూసుకొస్తోన్న  ప్రతిభావంతురాలైన కన్నడ నటి ‘శ్రద్ధ శ్రీనాథ్’.  ‘జెర్సీ’  సినిమాలో నాని సరసన నటిస్తూ హీరోయిన్ గా  తెలుగు తెరకు పరిచయం అవుతోంది  కన్నడ బ్యూటీ.

ఇప్పుడు తాజాగా  నేచురల్ స్టార్ నాని హీరోగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో  సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై  సూర్యదేవర నాగ వంశి  నిర్మిస్తున్న ‘జెర్సీ’ సినిమాతో ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాత్రికేయు
ల సమావేశంలో సినిమా గురించి తన మాటల్లో …
 ’జెర్సీ’ సినిమాకు సంబంధించి తన వర్క్ పట్ల శ్రద్ధ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఈ సినిమాలో తనకు  అమోఘమైన భావోద్వేగాలను పండించగల సన్నివేశాల్లో నటించే అవకాశం రావడం చాలా ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చింది. అలాగే సినిమాలో టీనేజర్ గా మరియు ఒక మదర్ గా ఇలా వేరు వేరు దశలలో కనిపిస్తానని తెలిపింది.
ఇక  నాని పక్కన నటించడం గురించి చెప్తూ.. నాని సహజ నటుడని, ఎలాంటి సన్నివేశాన్ని అయినా ఆయన చాలా సింపుల్ వే లో చక్కని హావబావాలతో  నటిస్తారని.. ఆయన పక్కన నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని.. అదేవిధంగా ఈ సినిమా ఒప్పుకోవడానికి నానితో పాటుగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత సూర్యదేవర నాగ వంశి, అనిరుధ్ లతో  మొత్తం చిత్రబృందం కూడా కారణమని.. వారి పనితనం వల్లే  ‘జెర్సీ’ సినిమా  అమోఘమైన భావోద్వేగాలతో అద్భుతంగా వచ్చిందని  శ్రద్ధ శ్రీనాథ్ చెప్పుకొచ్చింది.కాగా  కొన్ని సంవత్సరాలు పాటు  హైదరాబాద్ లోనే  పెరిగిన శ్రద్ధ..  ఇప్పటికే పలు కన్నడ మరియు తమిళ్ సినిమాల్లో కూడా నటించింది.
‘Jersey’ is filled with honest emotions
                                                                           - Shraddha Srinath
  
Shraddha Srinath is a beautiful and talented Kannada actress who is putting her foot on Telugu soil with Jersey. Raised in Hyderabad for a few years, Shraddha has done many Kannada and Tamil films earlier. She plays Sara in Jersey which has Nani as the main lead and Gautam Tinnanuri of Malli Raava fame is the director.

Shraddha is quite excited about the film and says that the beautiful emotions in the script made her accept the film right away. “Very rarely does a heroine get to act in such a strong role which showcases two different phases of life. Majili is one such film with honest emotions which everyone will relate to easily” says Shraddha.

On working with Nani, Shraddha has great regard for the natural star and says ” Not once during the shoot Nani got irritated with my takes or language and always encouraged me through the film. The film runs on our chemistry and Nani and I are riveting in Jersey. We play young lovers who are madly in love and then turn husband and wife who fight all the time which is so full of emotions to see on screen”.

Finally, Shraddha says that another reason behind her accepting the film was the entire team. Her producers, director Gautam, Anirudh have made the film in such a beautiful slice of life manner that many will connect to the emotions of Sara and Arjun at once.

First Single from #JERSEY will release on 14th February

Adhento - Announcement Poster Adhento - Still! Directed by Gowtam Tinnanuri & Produced by S. Naga Vamsi under Sithara Entertainments. An Anirudh Musical!

 CAST

 NATURAL STAR “NANI”

SHRADDHA SRINATH

SATYARAJ

RONIT KAMRA

BRAHMAJI

 

TECHNICIANS

 MUSIC: ANIRUDH RAVICHANDER

DOP: SANU VARGHESE

ART DIRECTOR: AVINASH KOLLA

EDITOR: NAVIN NOOLI

EXECUTIVE PRODUCER: S. VENKATRATHNAM (VENKAT)

PRESENTS: P.D.V PRASAD

PRODUCER: SURYADEVARA NAGA VAMSI

STORY-SCREENPLAY - DIALOGUES –DIRECTION : GOWTAM TINNANURI

 

నటీనటులు 

నాచురల్ స్టార్  “నాని” ,శ్రద్దా  శ్రీనాద్,సత్యరాజ్,బ్రహ్మాజీ,రోనిత్ కామ్రా .
 
సాంకేతిక వర్గం:
మ్యూజిక్:అనిరుద్ 
కెమెరామాన్ :సాను వర్గీస్ 
ఆర్ట్ డైరెక్టర్:అవినాష్ కొల్లా
ఎడిటర్ :నవీన్ నూలి
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్ 
ప్రొడ్యూసర్: సూర్య దేవర నాగ వంశి
కధ,స్క్రీన్ ప్లే ,దర్సకత్వం :గౌతం తిన్ననూరి 

Arjun’s incredible story unfolds from this April 2019. Here is a small peak #JERSEYFirstLook

 

Arjun’s incredible story unfolds from this April 2019. Here is a small peak #JERSEYFirstLook 

FirstLook Jersey Still
  CAST
NATURAL STAR “NANI”
SHRADDHA SRINATH
SATYARAJ
RONIT KAMRA
BRAHMAJI
 
TECHNICIANS
 
MUSIC: ANIRUDH RAVICHANDER
DOP: SANU VARGHESE
ART DIRECTOR: AVINASH KOLLA
EDITOR: NAVIN NOOLI
EXECUTIVE PRODUCER: S. VENKATRATHNAM (VENKAT)
PRESENTS: P.D.V PRASAD
PRODUCER: SURYADEVARA NAGA VAMSI
STORY-SCREENPLAY – DIALOGUES –DIRECTION : GOWTAM TINNANURI