శ్రీ రంజిత్ మూవీస్, దర్శకుడు ‘తేజ’ ల కాంబినేషన్లో ‘హోరా హోరీ’

 
అలా మొదలైంది, అంతకుముందు ఆ తరువాత‘ వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్‘.
చిత్రం, నువ్వు నేను, జయం‘ అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన దర్శకుడు ’తేజ’.
వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం నిర్మాణంజరుపుకుంటోంది.
అదే ”హోరా హోరీ”……
 నూతన,నటీ నటులతో ప్రేమ కధా చిత్రాలను రూపొందించి, విజయం వైపు అవి ప్రయాణించేలా చేయటం దర్శకుడు ‘తేజ’ కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఈ  చిత్రాన్నిఆయన నూతన,నటీ నటులతో నే మరోమారు తెరకెక్కించే ప్రయత్నం చేశారు.ఆయనకు అండగా నిర్మాత దామోదర్ ప్రసాద్ నిలిచారు.
హోరా హోరీ‘ …ఇదీ ప్రేమ కధా చిత్రమే. అయితే దర్శకుడు ‘తేజ’ దాన్ని తెరకెక్కించిన తీరు మాత్రం ప్రశంసనీయంగా ఉంటుందని అన్నారు నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్. ఈ చిత్రానికి సంభందించిన తొలి ప్రచార చిత్రాలను విడుదల చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ..’చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని  తెలిపారు. హైదరాబాద్, వైజాగ్, కర్నాటక ల లోని పలు సుందరమైన ప్రదేశాలలో చిత్రం షూటింగ్ జరుపుకుంది. చిత్రంలో మొత్తం 8 పాటలు ఉంటాయి. సంగీతం పరంగా కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. కోడూరి కళ్యాణ్ సంగీతం, పెద్దాడ మూర్తి సాహిత్యం మెచ్చుకోదగిన అంశాలు అన్నారు. ఈ నెలలోనే చిత్రం ఆడియో, వచ్చే నెలలో ‘హోరా హోరీ’ ని విడుదలచేయనున్నట్లు నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ తెలిపారు.
దర్శకుడు తేజ మాట్లాడుతూ..’ఈ చిత్రం ద్వారా దిలీప్ కధానాయకునిగా పరిచయం అవుతున్నారు. నాయికగా ‘దక్ష’ నటిస్తున్నారు. అలాగే ప్రతినాయకునిగా చస్వాతో పాటు అభిరాం, వరప్రసాద్, డి.ఎస్.రావు లు పరిచయం అవుతున్నారు. మరికొన్ని పాత్రలలో ఎం.వి.ఎస్.హరనాధరావు, రాకెట్ రాఘవ, రచ్చ రవి, జబర్దస్త్ రాకేశ్, బాలాజీ బద్రినాద్, సీమ, భార్గవి నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సంగీతం: కోడూరి కళ్యాణ్: పాటలు: పెద్దాడ మూర్తి: రచనా సహకారం: ఆకెళ్ళ శివప్రసాద్, బాలకుమారన్, కెమెరా: దీపక్ భగవంత్; ఎడిటర్: జునైద్; కాస్ట్యూమ్ డిజైనర్; శ్రీ;  స్టంట్స్: పాంథర్ నాగరాజు: నృత్యాలు: శంకర్, కెవిన్; సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి. వి ; నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్; కధ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: తేజ 
01 hora hori press note DSC04193 06 DSC03021 DSC03112 IMG_1230 IMG_9368 IMG_0238 IMG_1182 02 03