ఈ నెలలోనే విడుదలకు ముస్తాబవుతున్న ‘జాదూగాడు’

2 (1) DSC_4712

చింతకాయల రవి’ ఫేం దర్శకుడు ‘యోగేష్’ దర్శకత్వం లో, వి.వి.యన్.ప్రసాద్ నిర్మాతగా ‘సత్య ఎంటర్టైన్మెంట్స్’  రూపొందిస్తున్న చిత్రం ‘జాదూగాడు’ . ‘ఊహలు గుసగుస లాడే, దిక్కులు చూడకు రామయ్య’,లక్ష్మీ రావే మాఇంటికి’ వంటి విజయ వంతమైన చిత్రాల యువ హీరో ‘నాగ శౌర్య’  ఈ చిత్ర కధానాయకుడు కాగా, నాయికగా ‘హర హర మహాదేవ’ సీరియల్ లో పార్వతి గా నటించిన ‘సోనారిక’ ఈ చిత్రం ద్వారా నాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.  

చిత్ర దర్శకుడు ‘యోగేష్’ మాట్లాడుతూ..’ కధానాయకుడు నాగశౌర్య ఇప్పటివరకు ప్రేమ కధా చిత్రాల నాయకుడిగా నటించారు. కానీ ఈ చిత్రం లోఅతని పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది.  లోన్ రికవరీ బిజినెస్ చేసే పాత్రలో ఈ చిత్ర కధానాయకుడు కనిపిస్తారు. కధానాయిక సోనారిక తొ ప్రేమలో పడ్డ తరువాత లోకల్ గ్యాంగ్  లీడర్  తొ కదానాయకుడి వివాదం ఇటు కధను, అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందన్నది చిత్రమని, మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం లో కధానాయకుడి పాత్రను తీర్చి దిద్దటం జరిగిందని,వినోదంతో కూడిన మాస్ కధా చిత్రం ఈ ‘జాదూగాడు’ అన్నారు దర్శకుడు.

పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నఈ ‘జాదూగాడు’ నిర్మాణ  కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.  ఇటీవల విడుదల అయిన చిత్రం ఆడియోకు మంచి స్పందన లభించిందని, చాట్ బస్టర్స్ లో ఈ చిత్రం పాటలు  ద్వితీయ స్థానంలో ఉన్నాయని  తెలిపారు. సంగీత దర్శకుడు సాగర్ మహతి సంగీతం ఈ చిత్ర విజయానికి ఓ మెట్టు అవుతుందని, ఈనెల ౩వ వారంలో  చిత్రం విడుదల అవుతుందని నిర్మాత వి.వి.ఎన్.ప్రసాద్ తెలిపారు.

కోట శ్రీనివాసరావు,అజయ్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వి,  సప్తగిరి, తాగుబోతు రమేష్, జాకీర్ హుస్సేన్,   ఆశిష్ విద్యార్ధి, రవి కాలే, ‘ప్రబాస్’ శ్రీను, ‘రాకెట్’ రాఘవ,‘అదుర్స్’ రఘు,  స్వామిరారా సత్య, ఫిష్ వెంకట్ లు నటిస్తున్నారు.

సినిమాటోగ్రాఫర్ : సాయి శ్రీరామ్ ,ఎడిటర్: యం.ఆర్.వర్మ: ఆర్ట్ : సాహి సురేష్ ; ఫైట్స్ : వెంకట్ ; కథ , మాటలు : మధు సూదన్; పాటలు : వరికుప్పల యాదగిరి , శ్రీమణి, విశ్వ, నిర్మాత : వి.వి.ఎన్.ప్రసాద్, స్క్రీన్ ప్లే , దర్శకత్వం : యోగేష్  

“JADOOGADU” An action entertainer in which Naga Shaurya plays an ambitious and a very street smart guy who makes his living by running a small time loan recovery business,he falls in love with a nurse being played by sonarika and the conflict starts when the local gangster played by zakir hussain come into their lives.

The  film is being produced under the banner sathyaa entertainments by v.v.n.Prasad and directed by yogesh of “chintakayala Ravi” fame,starring naga shaurya  and sonarika along with an ensemble of cast which has sapthagiri,srinivas reddy,prithvi,ajay,zakir hussain,ravi kale &kota srinivasa rao in key roles.
The film’s audio is garnering all the attention for the popular songs it has and it is already in 2nd place in all the chart-busters.
The film is ready and slated for 3rd week of may release.
story-dialouges: Maddhu sudan,
Music: saagar mahati
Lyrics:varicuppala yadgiri,srimani &viswa
editor:M.R varma
stunts:venkat
cinematographer:sai sriram
producer:v.v.n prasad
screenplay,Direction:yogesh