I hope Varudu Kaavalenu brings back audiences to theatres in huge numbers: icon star Allu Arjun

 

వరుడు కావలెను చిత్రం ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్ ధియేటర్ కు అధికంగా వస్తారని ఆశిస్తున్నాను. 
  • - ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్‌‘
నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 29న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘ కరోనా వల్ల సినిమా ఇండస్ర్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమా రిలీజ్‌ సీజన్‌ ఇండస్ర్టీకి చాలా ముఖ్యం. థియేటర్లు తెరచుకున్నాయి. అన్ని ఇండస్ర్టీల్లోనూ ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు సినిమాహాళ్లకు వస్తున్నారు. ఇదే పాజిటివిటీతో ముందుకెళ్లాలి. తెలుగులో ‘వరుడు కావలెను’, తమిళంలో ‘అన్నాత్తే’, కన్నడలో ‘భజరంగి 2’, హిందీలో ‘సూర్య వన్షీ’.. సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అన్నీ మంచి విజయం సాధించాలి. అలాగే డిసెంబర్‌ 17న ‘పుష్ప’తో మేం కూడా వస్తున్నాం. మా సినిమా కూడా అందరికీ నచ్చాలని కోరుకుంటున్నా. ఈ దీపావళికి భారతీయ సినిమా గతంలోలాగా ప్రేక్షకులను అలరించి మంచి బిజినెస్‌ చేస్తుందనే నమ్మకం ఉంది. ఇక ఈ సినిమా  విషయానికొస్తే.. ‘దిగు దిగు నాగ’ పాట మా ఇంట్లో మోగుతూనే ఉంటుంది. నాగశౌర్య సినిమాలన్నీ చూశా.. అతను చాలా అందగాడు.  మనసున్న వ్యక్తి. భవిష్యత్తులో పెద్ద హీరో అవుతాడు. ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయం కృషితో ఎదిగేవారంటే నాకు చాలా ఇష్టం.. శౌర్య తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్‌ సంపాదించుకున్నారు. ‘పెళ్లి చూపులు’ చూసి రీతూ వర్మ గురించి తెలుసుకున్నా. అమ్మాయిల్లో నాకు హుందాతనం అంటే ఇష్టం.. అది రీతూ దగ్గర చాలా ఉంది. ముంబయ్‌లో షూటింగ్‌ చేస్తున్నప్పుడు అన్ని విభాగాల్లో మహిళలు ఎక్కువశాతం కనిపిస్తారు. మన దగ్గ ర ఇలా ఎప్పుడు చూస్తామా  అనుకునేవాణ్ణి. తెలుగులో హీరోయిన్లుగా మాత్రమే వస్తున్నారు. అన్ని శాఖల్లోకి మహిళలులు రావాలి. ఆ రోజులు త్వరలో వస్తాయనుకుంటున్నా. దర్శకురాలిగా పరిచ అవుతున్న లక్ష్మీ సౌజన్యకి ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమాకి విశాల్‌, తమన్‌ మంచి సంగీతం అందించారు. ఇద్దరు సంగీత దర్శకులు కలిసి పని చేయడానికి ఇగో అడ్డు వస్తుంది. అలాంటివేమీ లేకుండా వీరిద్దరూ మంచి అవుట్‌పుట్‌ ఇచ్చారు.  గీతా ఆర్ట్స్‌ తర్వాత నేను సొంత సంస్థగా భావించే బ్యానర్‌ ఇది. ‘జెర్సీ’కి జాతీయ అవార్డు అందుకున్నందుకు నాగవంశీకి థ్యాంక్స్‌’’ అన్నారు’’ అని అన్నారు.
త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చూశా. నాకు బాగా నచ్చింది. ఇందులో కొన్నిపాత్రలు మనతోపాటు ఇంటికి వస్తాయి. మన ఇళ్లల్లో జరిగే ఆడ పిల్లల తాలూకు కథ ఇది. మనసుకు దగ్గరగా ఉంటుంది. శౌర్య బాగా యాక్ట్‌ చేశాడు. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ అదిరిపోతుంది. రీతూ పెళ్లి కథాంశం ఉన్న చిత్రాల్లోనే ఎక్కువ కనిపిస్తున్నారు.  చాలాకాలం తర్వాత సినిమా మొత్తం చీరకట్టులో ఓ హీరోయిన్‌ని చూశాను. చినబాబుగారి మనసుకి దగ్గరైన సినిమా ఇది. కరోనా వల్ల ఏడాది కాలం వేచిచూశారు’’ అని అన్నారు.
నాగశౌర్య మాట్లాడుతూ…
ఏడాదిన్నర నిరీక్షణకు మంచి దారి దొరికింది. సినిమా పక్కా హిట్‌. ఇది ఓవర్‌ కాన్ఫిడెన్స్‌కాదు. మా అందరికీ ఉన్న నమ్మకం. 29న మా అక్క సౌజన్య లైఫ్‌ డిసైడ్‌ కాబోతుంది. తను దర్శకురాలిగా సెట్‌ అయిపోయినట్లే. తను అనుకున్నది అనుకున్నట్లు తీసింది. డెఫినెట్‌గా తను అనుకున్న జీవితాన్ని పొందుతుంది.మా అక్క సక్సెస్‌కి మేమంతా ఉన్నాం. మురళీశర్మగారి క్యారెక్టర్‌ నన్ను కదిలించింది. చినబాబుగారి సహనానికి గ్రేట్‌. తగ్గేదేలే అన్నట్లు బడ్జెట్‌ పెట్టారు. బన్నీ అన్న నాకు స్ఫూర్తి’’ అన్నారు.
లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ ‘‘మనిషికీ, మాటకు విలువిచ్చే వ్యక్తి చినబాబు గారు. నాకు కెరీర్‌ని ఇచ్చారు. నా కలను నిజం చేశారు. ఆయన ఓపికకు మెచ్చుకోవాలి. శౌర్యతో మళ్లీ సినిమా చేయాలనుంది. నదియాగారు చాలా హార్డ్‌  వర్క్‌ చేశారు. నా కథకు గణేశ్‌ మంచిమాటలు ఇచ్చారు. మంచి టీమ్‌ కుదరబట్టే నేనీ సినిమా చేయగలిగాను’’ అని అన్నారు.
రీతూవర్మ మాట్లాడుతూ ‘‘నా మొదటి సినిమా నుంచి బన్నీ నన్ను సపోర్ట్‌ చేశారు. ఆయనతో సినిమా చేయడం కోసం ఎదురుచూస్తున్నా. నాకు ఓ మంచి సినిమా ఇచ్చిన సితార సంస్థకు థ్యాంక్స్‌. సౌజన్య మనసు పెట్టి పని చేశారు’’ అని అన్నారు.
సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది. అందుకు చినబాబు, వంశీగారికి కృతజ్ఞతలు. ఓ సినిమాకి ఇద్దరు సంగీత దర్శకులు ఉండటం చాలా కష్టం. విశాల్‌ చంద్రశేఖర్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అన్నారు.
విశాల్‌ చంద్ర శేఖర్‌, ప్రవీణ్‌, రాంబాబు గోశాల, నదియా, గణేష్‌ రావూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
I hope Varudu Kaavalenu brings back audiences to theatres in huge numbers:  icon star Allu Arjun
One of the most awaited Telugu films of the year,  Varudu Kaavalenu, is all set to hit theatres on October 29. Starring Naga Shaurya, Ritu Varma in the lead roles, the family entertainer marks the directorial debut of Lakshmi Sowjanya. The film is produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments, the leading banner associated with hit films like Jersey, Premam, Bheeshma and the upcoming Pawan Kalyan, Rana Daggubati multi-starrer Bheemla Nayak. The beautiful trailer, memorable songs by Thaman and Vishal Chandrasekhar, the terrific chemistry between Naga Shaurya and Ritu Varma have ensured good hype for the film ahead of its release.
A grand pre-release event of Varudu Kaavalenu was held at Shilpakala Vedika, Hyderabad, on Wednesday amid the presence of the cast and crew. Icon Staar Allu Arjun and blockbuster filmmaker Trivikram were chief guests at the event that was high on energy and emotions. Several renditions and dance performances set to the songs from the film entertained crowds and the guests thoroughly. The actors and technicians, expressing confidence about the film’s result, were in a joyous mood as they took to the stage.
Director Lakshmi Sowjanya shared, “I thank China Babu garu (producer S Radha Krishna) for this opportunity. He’s a man who lives up to his words and values people. My parents may have given birth to me, but I’ll always be thankful to him for giving me such a strong foundation for my career. Naga Vamsi (garu) is extremely good at understanding the needs of the team and solves any problem amicably. Naga Shaurya is a thorough gentleman and a professional and was a delight to work with. Ritu Varma has always selected good scripts and she had become a family member to all of us as we made the film.”
“This film wouldn’t have been possible without the contributions of Nadhiya, Murali Sharma, dialogue writer Ganesh Ravuri and cinematographer Vamsi Patchipulusu. I wholeheartedly convey my gratitude to my direction team, screenplay writer Sharath. Allu Arjun is a person whom I respect since Vedam, a film I worked on. He always says ‘I can’ as an actor in any given situation and that’s the reason he’s an ‘Icon Staar’ today. Thank you Trivikram (garu) for blessing us and our team with your presence at the event.”
Actress Ritu Varma said, “I feel grateful to Sithara Entertainments for placing so much confidence in me to pull off this role. I hope to see our director Lakshmi Sowjanya’s career start on a successful note. I couldn’t have imagined anyone for the role of Aakash except for Shaurya and he’s such a fantastic performer and I wish to work with him again. It’s been a special experience to share screen-space with Nadhiya (garu). The USP of Varudu Kaavalenu is its freshness. The cinematographer, music directors, the direction and production teams are the backbone of the film. Allu Arjun is one of my most favourite people in the industry and has supported me since the beginning and I’m glad he made time for this event.”
Actor Naga Shaurya, beaming with confidence, stated, “Before I talk about anything else, let me assure everyone that the film is a sure-shot hit. I say it with confidence that everyone will like it. The director has made a beautiful film and is sure to win her many laurels after it releases on October 29. The cinematographer Vamsi, the director and my costume designer Harsha have presented me very well. Ritu Varma has never looked more beautiful in her career and I think we make for a great on-screen pair. The characters and performances of Nadhiya (garu) and Murali Sharma (garu) are the lifelines of the film. I feel honoured to be in the company of Trivikram garu and Allu Arjun garu at the event, they have been an inspiration for an entire generation and are entertaining people for so many years now.”
Director Trivikram added, “The journey of Haarika and Haasine Creations started with Allu Arjun’s Julayi. As someone who considers this banner my own, I thank Allu Arjun for being part of the event. I have watched the film recently and the performances of the cast and crew will stay with you long after you watch it. The film has a story that’s very identifiable and close to our hearts. Lakshmi Sowjanya has got her story right and cast her actors quite aptly. This is a film that China Babu (garu) is extremely fond of and the team has also responded to him with the same amount of love. Vishal Chandrasekhar has done a wonderful job with the music.”
Icon Staar Allu Arjun said, “Even my daughter is dancing to the tune of Digu Digu Naga at home, that’s the popularity of the film’s music. I always like self-made people who have created a mark in the industry and Naga Shaurya is certainly one of them. He isn’t only a good person but also brings innocence, depth to his performances that I enjoy watching. I have a soft corner for Ritu Varma because she’s a Telugu girl and followed her work since the very beginning. I truly like the dignity with the way she carries herself both off and on-screen. I enjoyed the trailer and it shows the effort that the actors and technicians have put into the film.”
“It’s good to see a female director like Lakshmi Sowjanya being launched in the industry. It’s important that women be made an integral part of the filmmaking process across all departments and I wholeheartedly welcome her as a director. I am truly amazed by the rapport and the goodwill that two composers like Vishal Chandrasekhar and Thaman have for each other. The vibe of this event largely reminds me of Alaa Vaikunthapurramulo. I treat this as a home banner (apart from Geetha Arts) and the people here, China Babu (garu) and Vamsi as my own. This is a crucial phase for the industry and I hope to see Telugu cinema and all the other industries in the country bring audiences to theatres and bounce back with a bang.”
Producers S Radha Krishna, S Naga Vamsi, editor Navin Nooli, cinematographer Vamsi Patchipulusu, music directors Thaman, Vishal Chandrasekhar, lyricists Rambabu, Raghuram, Priyanka, actors Praveen, Nadhiya, dialogue writer Ganesh Ravuri and screenplay writer Sharath were also part of the event and stated their happiness in associating with Varudu Kaavalenu. Each of the cast and crew members at the event was later presented with gifts according to their roles in the film and their personal tastes. Filmmaker Trivikram had also felicitated editor Navin Nooli and producer S Naga Vamsi, congratulating them for their national-award wins for Jersey.
DSC_0514 DSC_0512

‘వరుడు కావలెను’ మంచి ప్రేమకథ థియేటర్‌లోనే ఆస్వాదించండి – పూజాహెగ్డే

*మా సినిమా బాగా వచ్చిందని గర్వంగా చెప్పుకొంటాం
ఇది ఓవర్‌ కాన్షిడెన్స్‌ కాదు… సినిమా పట్ల ఉన్న నమ్మకం
– ‘ వరుడు కావలెను‘ సంగీత్‌ వేడుకలో నాగశౌర్య

నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి.ప్రసాద్‌ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రమిది. ఈ నెల 29న థియేటర్‌లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌ను మేకర్స్‌ వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ ను  విడుదల చేసిన చిత్ర యూనిట్‌, శనివారం సంగీత్‌ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా అగ్ర కథానాయిక పూజాహెగ్డే హాజరయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధా కృష్ణ ( చినబాబు), చిత్ర నాయకా, నాయికలు నాగశౌర్య, రీతు వర్మ, దర్శకురాలు లక్ష్మీ సౌజన్య, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, సప్తగిరి, మాటల రచయిత గణేష్‌ రావూరి, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, గేయ రచయిత రాంబాబు గోశాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పూజాహెగ్డే మాట్లాడుతూ…
‘‘హీరోయిన్‌ని అతిథిగా ఆహ్వానించడం అరుదుగా జరుగుతుంది. నన్ను అతిథిగా ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఆ క్రెడిట్‌ చిన్నబాబు, వంశీలకు దక్కుతుంది. హారికా అండ్‌ హాసిని నా ఫ్యామిలీ బ్యానర్‌. చినబాబుగారు నన్ను ఇంట్లో మనిషిలా చూస్తారు. కరోనా వల్ల ఎంతో బాధపడ్డాం. కాస్త రిలాక్స్‌ అవ్వడం కోసం థియేటర్‌లోనే సినిమా చూడండి. దర్శకత్వ శాఖలో మహిళలు చాలా తక్కువ ఉంటారు. ‘వరుడు కావలెను’ మహిళా దర్శకురాలు తెరకెక్కించిన మంచి ప్రేమకథ. అందరూ సినిమా చూసి మీ బాధల్ని మరచిపోండి. దర్శకురాలిగా సౌజన్యకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమా హిట్టై టీమ్‌కు మంచి పేరుతోపాటు నిర్మాతలకు లాభాలు రావాలి. ఇదే జోష్‌తో సక్సెస్‌ పార్టీలో కలుద్దాం’’ అని అన్నారు.

నాగశౌర్య మాట్లాడుతూ…
2018లో కథ విన్నాను. వెంటనే ఓకే చేశా. 2019లో షూటింగ్‌ మొదలుపెట్టాం. ఈ జర్నీలో రెండుసార్లు కరోనా మహమ్మారిని చూశాం. చాలా కష్టపడి సినిమా పూర్తి చేసి విడుదల వరకూ వచ్చాం. సినిమా అవుట్‌పుట్‌ ఒక రేంజ్‌లో వచ్చింది. ‘మన కుటుంబం మంచిది’ అని ఎంత గర్వంగా చెప్పుకుంటామో.. మా సినిమా బాగా వచ్చిందని అంతే గర్వంగా చెప్పుకొంటాం. ఇది ఓవర్‌ కాన్షిడెన్స్‌ కాదు. సినిమా పట్ల ఉన్న నమ్మకం. సినిమాకు బాగా వచ్చిందని తెలిసి ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. అయినా నిర్మాతలు థియేటర్‌ రిలీజ్‌ కోసమే వేచి చూశారు. సౌజన్య అక్క ఎన్నో సంవత్సరాలుగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తూ ఓ మంచికథ రాసుకుంది. ఈ సినిమాతో దర్శకురాలిగా అవకాశం అందుకుంది. మంచి అవుట్‌పుట్‌ కోసం చాలా పోరాడింది. ఈ సినిమా హిట్‌తో తన కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ అందించిన సంగీతంతో మేం మొదటి సక్సెస్‌ అందుకున్నాం. భూమి పాత్రకు రీతూవర్మ పర్ఫెక్ట్‌గా సూట్‌ అయింది. తనతో మళ్లీమళ్లీ పని చేయాలనుంది. చినబాబుగారు, వంశీలతో జర్నీ చాలా అందంగా ఉంటుంది. కథను, సినిమాను ప్రేమించే నిర్మాతలు వీరు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం. మంచి కథకు ఎక్కడా వెనకాడకుండా బడ్జెట్‌ పెడతారు. ఈ నెల 29న విడుదల కానున్న మా చిత్రానికి ఎలాంటి భయం లేకుండా అందరూ రావాలి. థియేటర్ల దగ్గర కొవిడ్‌ నిబంధనలు అన్ని పాటిస్తున్నాం’’ అని అన్నారు.

రీతూవర్మ మాట్లాడుతూ
‘‘ప్రేమ, అనుబంథం ఇతివృత్తంగా పూర్తిగా కుటుంబ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఈ కథ నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. లక్ష్మీ సౌజన్య మంచి కథతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతంలో మంచి డాన్స్‌ నంబర్స్‌ కుదిరాయి. శౌర్య సపోర్ట్‌తో నా వర్క్‌ చాలా ఈజీ అయింది. హీరోయిన్‌ను అతిథిగా పిలవడం రేర్‌గా జరుగుతుంది. మా ఈవెంట్‌కు పూజా రావడం చాలా ఆనందంగా ఉంది. మా అందరికీ సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది’’ అని అన్నారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ…
‘‘కథా బలం, కుటుంబ కథా చిత్రాల మీద మా సంస్థ దృష్టి పెడుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌, యువతకు బాగా ఆకట్టుకునే చిత్రమిది. అతిథిగా హాజరైన పూజాహెగ్డేకు కృతజ్ఞతలు. సహకరిస్తున్న అభిమానులకు, మీడియాకు చాలా థ్యాంక్స్‌’’ అని అన్నారు.

సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ…
‘‘కథకు తగ్గ పాటలు, నేపథ్య సంగీతం కుదిరాయి. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్
పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

~Varudu Kavalenu Is A Beautiful Love Story To Be Watched In Theatres – Pooja Hegde
~We Proudly Boast That Varudu Kavalenu Came Out Nicely. It Is Not Over Confidence, It Shows Our Belief On The Film: Naga Shaurya

Starring Naga Shaurya and Ritu Varma in the lead roles, ‘Varudu Kavalenu’ marks the directorial debut of Lakshmi Sowjanya. The film, presented by PDV Prasad and produced by Naga Vamsi Suryadevara under prestigious production house Sithara Entertainments, is all set for release on October 29th in theatres. The producers have been surprising with unique round of promotions with this film. After holding the trailer launch event recently, the makers have held the Sangeet event of ‘Varudu Kavalenu’ on Saturday night at a star hotel in Hyderabad. Lucky mascot Pooja Hegde has graced the event as the chief guest and wished all the success to the ‘Varudu Kavalenu’ team. Whole cast and crew have attended the event. Haarika & Hassine Creations founder and ace producer Radha Krishna Suryadevara (Chinna Babu), lead actors Naga Shaurya, Ritu Varma, producer Naga Vamsi, music composer Vishal Chandrasekhar, dialogue writer Ganesh Ravuri, lyric writer Rambabu Gosala and others have attended the do.

Speaking at the Sangeet event of ‘Varudu Kavalenu’, Pooja Hegde said, “Today I’ll keep it short. First of all, thanks for having me here. It is rare to have a heroine as a chief guest for a filmy function. I’m really elated with this. I’d like to thank producers Chinna Babu Garu and Naga Vamsi for this. The credit goes to them. Haarika & Hassine Creations is like my home banner. Chinna Babu Garu treats me like his family member. The women representation in direction department is relatively less in the industry. ‘Varudu Kavalenu’ is directed by newcomer Lakshmi Sowjanya. It is a beautiful love story. I wish a great success to the film and hope it brings good profits to producers. I hope director Lakshmi Sowjanya will have a bright future. Everyone have suffered during Covid pandemic. People want some relief and entertainment. So watch ‘Varudu Kavalenu’ only in theatres. Forget all your tensions and troubles by watching the film. With the same energy and josh, I’ll meet the film’s team at the success bash.”

Hero Naga Shaurya said, “I had heard the story of ‘Varudu Kavalenu’ for the first in 2018. As soon as I heard it, I decided to do the film. We’ve started the film’s shoot in 2019. We witnessed two waves of Covid. Certainly, it was a tough journey and finally we’re releasing our film in theatres on October 29th. Producers might be flooded with the OTT offers and continuous calls from the OTT platforms. I really appreciate and thank producers for releasing the film in theatres  first. We proudly boast that ‘Varudu Kavalenu’ came out nicely. It is not over-confidence. But it is our belief and confidence on our film. Sowjanya Akka who earlier worked as an assistant director has written a beautiful love story and that’s ‘Varudu Kavalenu’. She is turning her dream into real. She worked hard for the film’s output and she succeeded in it. With this film, she will bag success. We got our first success with Vishal Chandrasekhar’s music. Song have become chartbusters. Ritu Varma is most apt for the role of Bhumi. Looking forward to working with her again. Producers Chinna Babu Garu and Naga Vamsi are passionate makers. They love cinema and they won’t compromise on the budgets to ensure that the story is justified. The journey with them was beautiful. I urge audiences to watch the film only in theatres. Please come to theatres without any fear as all Covid protocols are being followed at theatres.”

Talking at the event, heroine Ritu Varma shared, “With Love and affection as the central points, the film is a family entertainer and appeals to all sections of audiences. I’m really lucky to get this story and Bhumi’s character. Director Lakshmi Sowjanya is being launched with a good film.There are good dance numbers in the film, thanks to music composer Vishal Chandrasekhar. With co-star Naga Shaurya’s support, it has become quite easy for me. It is rare to invite a heroine as the chief guest. I’m very glad that Pooja Hegde has graced for our event to support us. I’m sure ‘Varudu Kavalenu’ is going to be a big hit for all of us.”

Producer Naga Vamsi said, “Our production always gives importance to films with strong story line and family elements. ‘Varudu Kavalenu’ will equally appeal to families and youth. Thanks to Pooja Hegde for attending and wishing us success. I’d like to extend my thanks to all media and fans for supporting our film.”

Music director Vishal Chandrasekhar said, “All the songs have suited well to the story. Background score is complimenting the film. I’m really happy to be part of such a beautiful film.”

The film’s important cast includes Nadhiya, Murali Sharma, Vennela Kishore, Praveen, Ananth, Kiriti Damaraju, ‘Rangasthalam’ Mahesh, Arjun Kalyan, Vaishnavi Chaitanya, Sidhiksha and others.

For this movie
Dialogues: Ganesh Kumar Ravuri,
Cinematographer: Vamsi Patchipulusu,
Music : Vishal Chandrashekhar
Editor: Navin Nooli
Art: A.S Prakash
PRO: Lakshmivenugopal
Presents by: P.D.V Prasad
Produced by: Surya Devara NagaVamsi
Story- Direction:Lakshmi Sowjanya

 

DSC_4367 DSC_4361 DSC_4358 DSC_4374 DSC_4347

Naga Shaurya Is Back With Varudu Kavalenu: Rana Daggubati

* ‘వరుడు కావలెను‘ తో నాగశౌర్య ఈజ్‌ బ్యాక్‌ – రానా దగ్గుబాటి

*‘వరుడు కావలెను’ చేసినందుకు గర్వ పడుతున్నా – హీరో నాగశౌర్య
*వినోద భరితంగా జరిగిన ‘ వరుడు కావలెను‘ ట్రైలర్ విడుదల వేడుకప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన రానా దగ్గుబాటి ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం…రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘‘నాగశౌర్యని చూస్తే ‘రాముడు మంచి బాలుడు’ అన్న సామెత గుర్తొస్తుంది. ఈ సినిమాకు హీరో ఎవరనేది చెప్పకపోయినా టైటిల్‌ని బట్టి నాగశౌర్య హీరో అని చెప్పగలను. ట్రైలర్‌ బావుంది. థియేటర్లు మొదలయ్యాయి. సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాతో నాగశౌర్య ఈజ్‌  బ్యాక్‌ అని చెప్పగలను. ఈరోజు ఇక్కడికి గెస్ట్‌లా రాలేదు. మా ‘భీమ్లా నాయక్‌’ నిర్మాత కోసం వచ్చాను. టీమ్‌ అందరికీ ఆల్‌ ద బెస్ట్‌’’ అని అన్నారు.

నాగశౌర్య మాట్లాడుతూ …‘
‘చలో ‘ సక్సెస్‌ పార్టీలో సౌజన్య వచ్చి ‘తమ్ముడు నీకో కథ చెబుతా చేస్తావా’ అని అడిగింది. లైన్‌ నచ్చి వెంటనే ఓకే చేశా. కథ వినగానే సూపర్‌హిట్‌ అని ఫిక్స్‌ అయ్యా. ఇలాంటి కథను ఎంత చెడగొట్టాలన్నా చెడగొట్టలేము. ఎందుకంటే పేపర్‌ మీద ఈ కథ హిట్‌. తెరపై కూడా అంతే హిట్‌ అవుతుందని చెప్పగలను. మొదట చిన్న సినిమా అనుకున్నా. సితార బ్యానర్‌ తోడు అవ్వడంతో సినిమా స్థాయి పెరిగింది. చినబాబు గారు , నాగవంశీ గారు ఫలానా హీరోకి ఇంతే బడ్జెట్‌ పెట్టాలనుకునే నిర్మాతలు కారు. ‘డబ్బు ఎలా రాబట్టాలి అనే దానికంటే కథకు ఎంత పెట్టాలి’ అని ఆలోచన ఉన్న  వారిని మేకర్స్‌ అంటారు. అలాంటి వారే చినబాబు గారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. తెరపై ఆర్టిస్ట్‌లంతా ఫ్రెష్‌గా కనిపించడానికి కారణం డైలాగ్‌లు. గణేష్‌ రావూరి చక్కని సంభాషణలు రాశారు. నేను ఇంత అందంగా కనిపించడానికి కారణం మా డిఓపీ వంశీ పచ్చిపులుసు. ఆయన కెమెరా పనితనానికి నాతో నేనే లవ్‌లో పడిపోయా. విశాల్‌ చంద్రశేఖర్‌ చక్కని బాణీలు ఇచ్చారు. సౌజన్య అక్క నన్ను, సినిమాను ఎంతో ప్రేమించి ఈ సినిమా చేసింది. ఈ సినిమాతో సౌజన్య అక్క కల నెరవేరబోతోంది. రీతు చాలా అద్భుతంగా యాక్ట్‌ చేసింది. తను వేరే షూటింగ్‌లో ఉండి రాలేకపోయింది. మంచి కథతో ఈ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నా. ట్రైలర్‌ విడుదల చేయడానికి వచ్చిన రానా అన్నకి థ్యాంక్స్‌’ అని అన్నారు.
‘‘రియల్‌ లైఫ్‌లో నేను కూల్‌గా ఉంటాను. వైఫ్‌ డామినేటింగ్‌ ఉన్నా నాకు పర్వాలేదు. అలాగని అన్ని ఈ విషయాల్లో అడస్ట్‌ కాను. ఎక్కడ రివర్స్‌ అవ్వాలో అక్కడ అవుతాను. నా గత చిత్రానికి ఈ సినిమాకు పదహారు కేజీల వెయిట్‌ తగ్గాను. అదే పెద్ద యునీక్‌నెస్‌. చాలా క్లాసిక్‌ సినిమా ఇది. కుటుంబ సభ్యులంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు’’ అని అభిమానులు అడిగిన ప్రశ్నలకు నాగశౌర్య సమాధానమిచ్చారు.నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ…
మా సంస్థ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మీదే ఎక్కువ దృష్టి పెడుతుంది. మాకు అవే బాగా కలిసొచ్చాయి. ఇది ఫ్యామిలీ, కమర్షియల్‌ సినిమా. సెకెండాఫ్‌లో ఒక సస్పెన్స్‌ ఉంది. అది యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది’’ అని అన్నారు.
దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ‘బిజీ షెడ్యూల్‌లో కూడా రానాగారు ట్రైలర్‌ లాంచ్‌ చేయడానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది’’ అని అన్నారు.మాటల రచయిత గణేష్‌ రావూరి మాట్లాడుతూ…
‘‘భూమిలాంటి అమ్మాయిని ఇంప్రెస్‌ చేయాలంటే ఆకాష్‌లాంటి అబ్బాయి కావాలి. ఈ చిత్రంలో మా హీరోహీరోయిన్ల పాత్రలు అంత ప్లజెంట్‌గా ఉంటాయి. ఫన్‌, ఎమోషన్స్‌, అద్భుతమైన సంగీతం అన్ని ఉన్న చిత్రమిది. నాగశౌర్య కథ వినగానే బ్లాక్‌బస్టర్‌ అవుతుందని చెప్పారు. బయటి టాక్‌ కూడా అలాగే వినిపిస్తుంది. రీతువర్మ ఇప్పటి వరకూ చేయని పాత్ర ఇది. నదియా పాత్ర సినిమాకు చాలా కీలకం. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అని అన్నారు.

గేయ రచయిత రాంబాబు గోశాల మాట్లాడుతూ

 ఈ చిత్రంలో ‘కోల కళ్లే ఇలా’ పాట రాశాను. పాటకు చక్కని పదాలు కుదిరాయి. అంతే అద్భుతంగా సిద్‌ శ్రీరామ్‌ పాడారు. ఈ పాటలో నాగశౌర్య, రీతు చాలా గ్లామర్‌గా కనిపిస్తారు. విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నన్ను ఎంతో ప్రోత్సహిస్తుంది’’ అని అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ…
‘‘నా కామెడీని మిస్‌ అయిన అందరినీ ఇందులో నవ్వులతో చీల్చి చెండాడతా. సెకెండాఫ్‌లో అంతగా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంది. ఈ పాత్ర నేనే చేయాలి అని దర్శకనిర్మాతలు నాకీ అవకాశం ఇచ్చారు’’ అని అన్నారు.సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ
‘‘మంచి పాటలు కుదిరాయి. సింగర్స్‌, మ్యుజిషియన్స్‌ చాలా సపోర్ట్‌ చేశారు. తమన్‌ సంగీతం అందించిన రెండు పాటలూ నాకు నచ్చాయి. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు.నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్
పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

Naga Shaurya Is Back With Varudu Kavalenu: Rana Daggubati

~ Proud To Be Part Of Varudu Kavalenu: Naga Shaurya
~ Varudu Kavalenu Trailer Launch Was Fun-Filled Event

Successful production house Sithara Entertainments is producing Naga Shaurya and Ritu Varma-starrer Varudu Kavalenu. The film marks the directorial debut of Lakshmi Sowjanya and is all set for grand theatrical release on 29th October, 2021. The trailer of the film was unveiled last night in Hyderabad in a grand event which had the attendance of Rana Daggubati. The event was fun-filled and thoroughly entertaining with Naga Shaurya, director Lakshmi Sowjanya and producer Naga Vamsi interacting with the social influencers and answering their funny questions.

Speaking at the event, Rana Daggubati said, “Naga Shaurya is a symbol for good guy. The proverb that comes to one’s mind about Shaurya is ‘Ramu is a good boy’. ‘Varudu Kavalenu’ is a great title and it is apt for Shaurya. Even if one doesn’t reveal the hero’s name, looking at the title we can expect that Naga Shaurya is the hero of the film. Trailer is interesting and promising. Theatres are back. Movies are back. Naga Shaurya is also back with ‘Varudu Kavalenu’. I wish all the best for the entire team. Today, I didn’t come here as a guest. I came for my ‘Bheemla Nayak’ producer Naga Vamsi. I came from straight from the shooting location. I’m sure he will score success with ‘Varudu Kavalenu’ too.”

Talking at the trailer launch, Naga Shaurya said, “During Chalo success party, director Sowjanya Akka came to me and asked me whether I would do a film if I like her story. She had told me the storyline of ‘Varudu Kavelnu’ and I was mighty impressed. After hearing the whole story, I decided that the movie is going to be a big hit. On paper itself, movie is a hit. I’m sure the movie will be big hit on big screens as well. Initially I had thought it was a small movie. But with the addition of a prestigious banner like Sithara Entertainments, the film has become bigger. Producers Chinna Babu Garu and Naga Vamsi Garu are very passionate. They understand the cinema well. They don’t confine a budget to a film based on the hero. They provide budget to the film based on its story and the scale required for the story. Chinna Babu Garu is a true maker. He knows best what all a film requires. ‘Varudu Kavalenu’ caters to all sections of audiences. The film is well balanced such that both family audiences and youth audiences would enjoy thoroughly. The film has really shaped up well. Final output is very good and we’re all quite confident of the film’s success. All the characters in the film really look fresh. Thanks to Ganesh Ravuri’s dialogues which are appealing. The credit for showing me handsome on screen goes to our Cinematographer Vamsi Pachipulusu. His camera work is so nice such that I fell in love with myself after seeing me on screen. Music composer Vishal Chandrasekhar has delivered good tunes. Director Sowjanya Akka has made it so easy and comfortable for me. She has loved the film a lot. Finally, her dreams are turning into real with this movie. Ritu Varma has acted so well. She couldn’t make it to the today’s event as she is busy shooting for another movie. I’m really proud to choose the story of ‘Varudu Kavalenu’ and being part of the film. Thanks to Rana Daggubati Anna for coming all the way and releasing our film’s trailer.”

Responding to some funny questions posed by onlookers and social influencers who attended the trailer launch event, Naga Shaurya said, “I’m very cool in real-life. I’m okay even if my future wife is dominating. At the same time, I won’t adjust in all the matters. I know very well when to reverse. I have reduced 16 kilos of my weight from my previous film. This is the change and uniqueness you can see in me on screen in ‘Varudu Kavalenu’. It is a classic film where family audiences can enjoy it to the core.”

Speaking after the trailer launch, Producer Naga Vamsi said, “Family entertainments have always been top of our priority. We at Sithara Entertainments were fortunate to taste successes with this genre. ‘Varudu Kavalenu’ is a family entertainment with commercial touch. It will appeal to family audiences as well as youth audiences. There is a suspense element in the second half of the film which will stand out. Youth will connect to that suspense element.”

Director Lakshmi Sowjanya thanked Rana Daggubati for gracing the event and launching the film’s trailer. Dialogue writer Ganesh Ravuri said Bhumi and Akash are well-designed characters who are perfect match. He said that the characters are so pleasant to watch on screen. He said the film has fun, emotions and good music in right proportions. “After listening to the story, hero Naga Shaurya Garu said the movie will be a blockbuster. He is right. The outside talk about the film is also the same. Ritu Varma has never played such character. She is perfect for Bhumi’s character. Nadiya’s role is very crucial in the film. I thank my producers for giving me this opportunity to pen dialogues in the film,” said dialogue writer Ganesh Ravuri.

Song writer Rambabu Gosala, who penned the song ‘Kola Kalle Ila’, said he has penned good lyrics for the song. He said music director Vishal Chandrasekhar has done magic with music. He said Sid Sriram has sung the song nicely. Rambabu added that lead actors Naga Shaurya and Ritu Varma are looking glamorous in this song. He said Sithara Entertainments is encouraging him and thanked them for their support.

Comedian Sapthagiri said, “Those who missed my comedy will get a feast with my character in ‘Varudu Kavalenu’. Especially, second-half will have out-and-out entertainment. The word ‘lag’ will play significant role in the film which everyone will enjoy on screen. My character is a tailor-made one and the director, producers wanted me to play it. I thank them.”

Music composer Vishal Chandrasekhar shared, “Songs in ‘Varudu Kavalenu’ have come out really well. Singers and musicians have given their best. The two songs composed by Thaman are so nice. I’m glad to be part of this film.”

Naga Shourya and Ritu Varma as a leading pair, Nadiya, Murali Sharma, Vennela Kishore, Praveen, Ananth, Kiriti Damaraju, Rangasthalam Mahesh, Arjun Kalyan, Vaishnavi Chaitanya, Siddiksha are the main leads.For this movie
Dialogues: Ganesh Kumar Ravuri,
Cinematographer: Vamsi Patchipulusu,
Music : Vishal Chandrashekhar
Editor: Navin Nooli
Art: A.S Prakash
PRO: Lakshmivenugopal
Presents by: P.D.V Prasad
Produced by: Surya Devara NagaVamsi
Story- Direction:Lakshmi Sowjanya
6R3B3522 6R3B3524 6R3B3616 6R3B3626 DSC_3162

యూత్, ఫ్యామిలీస్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ‘వరుడు కావలెను’ * ‘వరుడు కావలెను’ చిత్రానికి నిర్మాతే హీరో -దర్శకురాలు లక్ష్మీ సౌజన్య

నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి.ప్రసాద్‌ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రమిది. ఈ నెల 29న థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య మీడియాతో ఇలా ముచ్చటించారు.

*నేను పుట్టింది కర్నూలు జిల్లాలో అయినా పెరిగిందంతా గుంటూరు జిల్లా నరసరావు పేట. మా నాన్న మ్యాథ్స్ లెక్చరర్. 11 ఏళ్లకే పదో తరగతి ఎగ్జామ్ రాశాను. చిన్నప్పటి నుంచి గుంపులో కలిసిపోవడం కాకుండా నలుగురిలో ఒకరిలా ఉండటం ఇష్టం. అందుకే సినిమా ఇండస్ట్రీ నాకు కరెక్ట్ అనిపించింది. ఇంట్లో పెళ్లి చేస్తానంటే వద్దని వారించి, పద్దెనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ వచ్చేశాను.
తేజ, శేఖర్ కమ్ముల, కృష్ణవంశీ, ఆర్కా మీడియా, ప్రకాష్ కోవెలమూడి దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా వర్క్ చేశాను. ‘వాంటెడ్’ తర్వాత దర్శకత్వ ప్రయత్నాలు మొదలుపెట్టాను. మొత్తానికి ఇండస్ట్రీలో 15 ఏళ్ల జర్నీ తర్వాత ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. సినిమా మేకింగ్‌లో నా ఇండివిడ్యువాలిటీ నాకుంది.
*2017లో చినబాబు గారికి ఈ కథ చెప్పాను. స్టోరీ ఐడియా మొదలు అరగంట ఫుల్ నెరేషన్ వరకూ అంతా ఆయనకి నచ్చింది. అలా ఈ సినిమా మొదలైంది. ప్యాండమిక్ వల్ల రెండేళ్లు ఆలస్యమైంది. హారిక హాసిని క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్ లో నా లాంటి కొత్త డైరెక్టర్ కి అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తున్నాను.
*నా చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాల నుంచే కథలు రాసుకుంటాను. రియల్ లైఫ్ లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఒక అమ్మాయిని చూసి ఈ సినిమా కాన్సెప్ట్ అనుకున్నాను. బేసిగ్గా నాలోనూ ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ మూవీతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఫ్యామిలీ సబ్జెక్ట్ ఎంచుకున్నాను .
*ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి ప్రేమించాలంటే ఆ అబ్బాయిలో చాలా క్వాలిటీస్ ఉండాలి. అవన్నీ నాగశౌర్యలో ఉన్నాయనిపించింది. ఫస్ట్ నుంచి హీరోగా నాగశౌర్యనే అనుకున్నాను.
*మనుషులందరికీ బాడీ పార్ట్స్ ఒకేలా ఉంటాయి. కానీ పోలికల్లోనే చిన్న చిన్న తేడాలుంటాయి. అలాగే సినిమాకి సంబంధించిన స్టోరీస్, రిలేషన్స్, ఎమోషన్స్ అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. మనం ఎంచుకున్న క్యారెక్టరైజేషన్, బ్యాక్‌డ్రాప్ వల్ల సీన్స్ కొత్తగా మారతాయి. అవే సినిమాకి కొత్తదనాన్ని తెస్తాయి. ఈ సినిమాలో అలాంటి కొత్తదనం ఉంటుంది.
*ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ పేరు భూమి. పేరుకు తగ్గట్టే భూమికి ఉన్న అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎదుటివాళ్లని ఎంత రెస్పెక్ట్ చేస్తుందో వాళ్ల నుంచి అదే రెస్పెక్ట్ కోరుకుంటుంది. ఒకరిపై ఆధారపడదు. ఎవరినీ ఇబ్బంది పెట్టడు. అందుకే పర్యావరణానికి ఇబ్బంది లేని ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ చేస్తుంది. అలాంటి అమ్మాయి ప్రేమించాలంటే తన కంటే ఆ అబ్బాయిలోనే ఎక్కువ క్వాలిటీస్ ఉండాలి.
*ఈసినిమాలో హీరో పేరు ఆకాష్ . పేరుకు తగ్గట్టే ఆకాశమంత విశాల హృదయం ఉన్న వ్యక్తి. తను ఓ ఆర్కిటెక్ట్. తన ప్రొఫెషన్ లాగే  లైఫ్‌ను కూడా అందంగా డిజైన్ చేసుకుంటాడు.
*ఇప్పుడున్న అమ్మాయిలందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. అబ్బాయిలకూ కనెక్ట్ అవుతుంది. ఎలా ఉంటే అమ్మాయిలకు అబ్బాయిలు నచ్చుతారనేది ఈ సినిమా చూసి ఫాలో అవ్వొచ్చు.
*మన అందరి జీవితాల్లో ఆల్రెడీ చాలా ట్విస్టులు, ఫజిల్స్ ఉంటాయి. మళ్లీ సినిమాల్లో కూడా ఎందుకు. ప్రకృతి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఈ సినిమా కూడా అంత ప్లజంట్‌గా ఉంటుంది. కళ్లకు అందంగా, చెవులకు వినసొంపుగా ఉంటూ, థియేటర్‌‌లో ప్రశాంతంగా  ఆనందంగా నవ్వుతూ చూసే సినిమా.
*నిర్మాత చినబాబు గారు ఈ సినిమాలో ఓ పార్ట్ కాదు.. ఆయన సపోర్టే ఈ సినిమా. నా దృష్టిలో ఈ సినిమాకు ఆయనే హీరో. ఒకసారి మాటిస్తే అది తప్పరు. ఆయనకి సినిమా అంటే ఎంతో ఫ్యాషన్. చాలా ఎథిక్స్ ఉన్న వ్యక్తి. అందుకే ఇలాంటి సినిమా తీశారు.  లైఫ్ అంతా ఆయనకు రుణపడి ఉంటాను. ఈ సినిమా విషయంలో నన్నెంతో గైడ్ చేశారు.
*ఐడెంటిటీ కోసం మనమంతా చాలా తాపత్రయపడతాం. ఈ ఐడియాతో ఆధార్ కార్డ్ నేపథ్యంలో నెక్స్ట్ మూవీకి కథ రాసుకున్నాను. *డైరెక్షన్ అంటే ఎంతో బాధ్యత గల వృత్తి. మనల్ని చూసి చాలామంది స్ఫూర్తి పొందుతుంటారు. వాళ్లెవరినీ తప్పుదోవ పట్టించకూడదు. అందుకే నేను  ఏ సినిమా చేసినా ప్రేక్షకులను హ్యాపీగా నవ్వించడమో, ఏ మంచి విషయమో నేర్పించడమో ఉండేలా చూసుకుంటాను.
*’Varudu Kavalenu’ Appeals To Girls & Guys Equally: Director Lakshmi Sowjanya*
*Your first break came from a prestigious banner like Sithara Entertainments. How did it happen?*
In 2017, I narrated the story line of ‘Varudu Kavalenu’ to producer Chinna Babu garu who was impressed with the central idea. Later, I gave a 30 minutes narration of the film. Chinna Babu garu liked it. We have worked upon it further. But due to the first and second wave of Covid, the film got delayed. I’m very fortunate to get a launch in such a famous banner. As a lady director, I can’t ask for a better launch pad. I’m really thankful to all the cast and crew for believing in me and supporting me wholly. Hero Naga Shaurya and heroine Ritu Varma have really made it easy for me. Nadhiya garu’s role has an interesting role. I’m very lucky to work with experienced actors in my debut. Thanks to producers for this wonderful opportunity.
*Several movies with a marriage backdrop have been released in the past. How different is ‘Varudu Kavalenu’ from them?*
The characterisations of the lead actors are unique. They are very fresh. Heroine Bhumi’s role has a lot of self-respect. She does eco-friendly business in the movie. She is 30-year-old in the movie. Hero Akash is a soft, handsome, well-read and broad-minded person. He is an architect. He falls for Bhumi. The chemistry of the lead pair has worked well. How entertainingly the story is narrated makes ‘Varudu Kavalenu’ different.
*What is the inspiration for ‘Varudu Kavalenu’?*
I always pick stories from my surroundings. I have a friend like Bhumi. I also have a friend like Akash. It is my imagination that what if a girl like Bhumi and a guy like Akash fall in love?
*Are you under pressure ahead of your debut movie’s release?*
I’m feeling a bit pressured as it is my dream to become a director. However, I’m enjoying the whole process. It was a pleasant experience. It is a beautiful film who can enjoy it in the theatre in a relaxed way.
*How is the support of producers?*
‘Varudu Kavalenu’ is not possible without the backing and support of producers Chinna Babu Garu and Naga Vamsi Garu. Particularly,
Chinna Babu Garu guided me throughout the movie. He made me understand the process and made me work with the team. He guided me in extracting performances from the cast.
*What is the message you are giving to youth with this film?*
There is no message in specific. But after watching the movie, girls will love it hands down. Guys will also like it as it becomes easy for them to deal with girls after this. The movie appeals to both genders. It is a thorough entertainer and connects to girls and guys instantly.
*Tell us about music composers Vishal Chandrasekhar and Thaman.*
Music plays a crucial role in our film. Vishal Chandrasekhar garu gave us beautiful tunes for the film. We opted for Thaman garu for folk numbers as he is known for such tunes. He gave a fabulous tune of ‘Digu Digu Naga’ and it became a chartbuster.
*What are your upcoming projects?*
I penned a couple of interesting scripts for my next. I penned a story revolving around ‘identity’ as identity is key for every person. My next script revolves around the identity of the protagonist where his ‘Aadhar card’ is involved. Director is a responsible job. I’m going to do good movies in the future as well.
Lakshmi Sowjanya (79) Lakshmi Sowjanya (67) Lakshmi Sowjanya (7) Lakshmi Sowjanya (88)

 

‘వరుడు కావలెను‘ లో భూమి పాత్ర చాలా ఛాలెంజింగ్ అనిపించింది. – కధానాయిక రీతువర్మ

‘వరుడు కావలెను‘ లో భూమి పాత్ర చాలా ఛాలెంజింగ్ అనిపించింది.

  – కధానాయిక రీతువర్మ
నాగ శౌర్య , రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’ సినిమా ఈ నెల 29న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సందర్భంగా సినిమాలో భూమి పాత్రలో నటించిన హీరోయిన్ రీతు వర్మ తన క్యారెక్టర్ గురించి  సినిమా గురించి కొన్ని విశేషాలు మీడియాతో చెప్పుకుంది. ఆ విశేషాలు రీతు మాటల్లోనే…స్టోరీ బాగా నచ్చింది: లక్ష్మీ సౌజన్య గారు ఈ కథ చెప్పగానే బాగా నచ్చేసింది. అలాగే భూమి క్యారెక్టర్ కూడా ఎట్రాక్ట్ చేసింది. ఫీమేల్ లీడ్ కి ఛాలెంజింగ్ రోల్స్ చాలా రేర్ గా వస్తుంటాయి. అలాంటి క్యారెక్టర్ తో నేను చేసిన సినిమా ఇది. ఇప్పటి వరకూ నేను చేసిన  క్యారెక్టర్స్ కి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది.  సినిమా చూశాక భూమి క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది.ఫీమేల్ సెంట్రిక్ కాదు: టీజర్ , ట్రైలర్ చూసి ఇది ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం అనుకుంటున్నారు. కానీ ఇది ఫీమేల్ సెంట్రిక్ కాదు. ఒక ప్యూర్ లవ్ స్టోరి. మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వినేలా సాంగ్స్ ఉంటాయి. శౌర్య క్యారెక్టర్ కి స్టోరీలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇవన్నీ రిలీజ్ తర్వాత మీరే చెప్తారు.అలాంటి తేడా ఏం లేదు: డైరెక్టర్ ఫీమేల్ కాబట్టి నా క్యారెక్టర్ స్ట్రాంగ్ గా రాసింది అనుకోను. పెళ్లి చూపులు లో కూడా నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాకపోతే  లక్ష్మీ సౌజన్య ఒకమ్మాయి కాబట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచించి ఈ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నారు. భూమి క్యారెక్టర్ నేను చేసిన బెస్ట్ క్యారెక్టర్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది.

మా పెయిర్ వర్కౌట్ అయింది: శౌర్య చాలా డెడికేటెడ్ గా ఉంటాడు.  షూట్ ఉన్నప్పుడు టైం కి పర్ఫెక్ట్ గా వచ్చేస్తాడు.  వర్కౌట్స్ చేసి ఎప్పుడూ ఫిట్ గా ఉంటాడు. ముఖ్యంగా లవ్ స్టోరీ కి పెయిర్ సెట్ అవ్వాలి. అప్పుడే సినిమా ఇంకా ఎక్కువగా రీచ్ అవుతుంది. మా పెయిర్ బాగుందని చాలా మంది చెప్తున్నారు. సో …మా పెయిర్ వర్కౌట్ అయింది కాబట్టి రిలీజ్ కి ముందే సగం రిజల్ట్ వచ్చేసినట్టే.

ఇదే ఫస్ట్ టైం: డాన్స్ లో నేను పూర్. కానీ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు నాకు డాన్స్ చేసే సాంగ్స్ పడలేదు. కానీ ఫస్ట్ టైం ఇందులో ఒక మాస్ సాంగ్ చేశాను. చాలా కష్టపడి డాన్స్ చేశాను. ఆ సాంగ్ ని థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ సాంగ్ పర్ఫెక్ట్ సిచ్యువేషన్ లో వస్తుంది.

నా ఫేవరేట్ సాంగ్ అదే: ‘కోల కళ్ళే ఇలా’ నా ఫేవరేట్ సాంగ్. బేసిక్ గా సిద్ శ్రీరామ్ ఏం పాడినా నాకు నచ్చుతుంది. సో తన వాయిస్ కూడా సాంగ్ కి ప్లస్ అయ్యింది. అలాగే ఆల్బంలో ‘మనసులోనే నిలిచిపోకే‘ అనే సాంగ్ కూడా బాగా ఇష్టం.

ఓల్డ్ స్కూల్ రొమాన్స్ : సినిమాలో లవ్ స్టోరీ అందరికీ నచ్చేలా ఉంటుంది. రెగ్యులర్ గా అనిపించదు. ఓల్డ్ స్కూల్ రొమాన్స్ ఉంటుంది. మా డైరెక్టర్ చాలా అందంగా చూపించారు. ఈ సినిమా తర్వాత మా డైరెక్టర్ కి మంచి పేరు వస్తుంది.

ఇన్నోసెంట్ క్యారెక్టర్ : నదియా గారు ఇప్పటి కొన్ని పవర్ ఫుల్ రోల్స్ చేశారు. కానీ  ఇప్పటివరకూ చేయని ఓ ఇన్నోసెంట్ రోల్ లో కనిపిస్తారు. నదియా గారి క్యారెక్టర్ కి అందరూ ఇంప్రెస్ అవుతారు. ఆవిడతో నటించడం చాలా హ్యాపీ గా ఫీలయ్యాను.

ఫెస్టివల్ లా ఫీలవుతున్నా : సినిమా రిలీజ్ కి ముందు ఎవరికైనా నర్వస్ నెస్ ఉంటుంది. నాకు కూడా ఉంది. కానీ ఈ ఫేజ్ ని ఒక ఫెస్టివల్ లా ఫీలవుతూ ఎంజాయ్ చేస్తున్నాను. రిలీజ్ కి ముందే ఇండస్ట్రీ లో కూడా సినిమా బాగుంది అనే పాజిటివ్ టాక్ వచ్చింది. సో అవన్నీ విని సంతోషంగా ఉంది.

ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి: సినిమాను పెద్ద స్కేల్ లో చూపించినట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉంటాయి. మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమాను ఎంతో ప్యాషన్ తో నమ్మకంగా నిర్మించారు. వారికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను.

చాలా టైం ఉంది: నా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా రెండు మూడేళ్ళు పట్టొచ్చు. ఇంట్లో ఆ టాపిక్ గురించి నన్ను ఇబ్బంది పెట్టరు. అప్పుడప్పుడు సరదాగా అంటుంటారు తప్ప ఆ విషయాన్ని నాకే వదిలేశారు.

అందుకే ఈ గ్యాప్ : పెళ్లి చూపులు తర్వాత మళ్ళీ అలాంటి రోల్స్ కానీ స్క్రిప్ట్స్ కానీ రాలేదు. మధ్యలో తమిళ్ లో కొన్ని సినిమాలు చేశాను కానీ అవి రిలీజ్ లేట్ అయ్యాయి. ప్రస్తుతం శర్వానంద్ తో తెలుగు , తమిళ్ బైలింగ్వెల్ సినిమా చేస్తున్నాను. అలాగే తమిళ్ లో మరో సినిమాతో పాటు మరో  వెబ్ సిరిస్ చేస్తున్నాను. తెలుగులో ఇంకా ఏ సినిమా కమిట్ అవ్వలేదు.
Bhumi In ‘Varudu Kavalenu’ Is The Most Challenging Role I Played Ever: Ritu Varma

‘Varudu Kavalenu’ features Naga Shaurya and Ritu Varma in the lead roles. Touted to be a love and family entertainer, the film directed by newcomer Lakshmi Sowjanya and produced by Naga Vamsi Suryadevara is all set to hit the theatres world-wide on October 29th. Ahead of the film’s release, lead actress Ritu Varma interacted with the media and shared her experience on working for the film.Impressed With Story‘Varudu Kavalenu’ story impressed me when director Lakshmi Sowjanya first narrated it. I was bowled over by Bhumi’s character. Lead actresses rarely get challenging roles. Bhumi is one such challenging role. In fact, it is the most challenging role I have ever played in my career. This role is totally different from the roles that I played earlier. After watching the film, everyone will fall in love with Bhumi’s character.

Not Female-centric Film

After watching the film’s teaser and trailer, many started guessing that it is a female-centric film. ‘Varudu Kavalenu’ is not a lady-oriented film. It is a pure love story with lots of emotions including family sentiment and humour. Songs are beautiful and make us listen to them on repeat mode. Shaurya’s character has a lot of significance in the story. You’ll only notice these after watching the film.

Bhumi Is Best Character In My Career

I don’t agree that director Lakshmi Sowjanya made Bhumi’s character powerful since she herself is a woman. If you see, even my role in Pelli Choopulu was strong enough. But Sowjanya has designed Bhumi’s character based on her point-of-view. Bhumi’s character will remain as one of the best characters.

Chemistry With Shaurya Worked Well

Shaurya is a dedicated actor. He arrives to shoot on time. He stays fit by working out. He gives his best for the film. Our pair looks good on screen. Our chemistry has worked well. For a love story, the pair should appeal to viewers. Only then it will reach a larger audience. Many have been saying that our pair is looking great. So, that itself shows that we’re half successful even before the film’s release.

Dancing For Mass Tune Is First Time

I love to dance but I wasn’t good at dancing. I had never got a chance to dance to mass tunes. ‘Digu Digu Naga’ gave me that opportunity in ‘Varudu Kavalenu’. This is the first time I grooved for a mass number. It has come out very well. Audiences will enjoy it in theatres. It comes in a perfect situation in the film and it will appeal to all. ‘Kola Kalle ilaa’ is my favourite song in the album. Basically, I love Sid Sriram’s voice. Whatever he sings, I like it. He added life to the ‘Kola Kalle Ilaa’ too. I also like the song ‘Manasulone Nilichipoke’ too.

Beautiful Love Scenes

There are beautiful love scenes in ‘Varudu Kavalenu’. The love story would appeal to youth and family audiences. There is some old school romance but it is told in a unique way. One will not find regular scenes in the film. Our director has shown it pleasantly. After the film’s release, our director will get applause.

Nadhiya Garu Plays Innocent Role

Nadhiya garu has played several powerful roles so far. But she never played an innocent character. It is one such character which will impress one and all. I felt quite happy to act with her and share screen space.

Production Values Are Good

‘Varudu Kavalenu’ is made on a large scale and the production values at Sithara Entertainments are rich. Our producers Chinna Babu Garu and Naga Vamsi are very passionate filmmakers who believed in the film. I wish them all the success.

Marriage On Cards?

My marriage can wait. There is a lot of time for it. It may take another two to three years. My family left the decision with me. They won’t trouble me. However, once in a while, they try to pull my leg.

Upcoming Films

I’m doing a Telugu-Tamil bilingual film with Sharwanand. I’m doing another movie and a web series in Tamil. I haven’t signed any other film in Telugu. After Pelli Choopulu, I didn’t get such roles. That’s the reason for the gap. Meanwhile, I did some films in Tamil whose release got delayed.

Ritu Varma (6) Ritu Varma (9) Ritu Varma (43) Ritu Varma (54) Ritu Varma (81) Ritu Varma (91) Ritu Varma (99)