I hope Varudu Kaavalenu brings back audiences to theatres in huge numbers: icon star Allu Arjun

 

వరుడు కావలెను చిత్రం ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్ ధియేటర్ కు అధికంగా వస్తారని ఆశిస్తున్నాను. 
  • - ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్‌‘
నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 29న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘ కరోనా వల్ల సినిమా ఇండస్ర్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమా రిలీజ్‌ సీజన్‌ ఇండస్ర్టీకి చాలా ముఖ్యం. థియేటర్లు తెరచుకున్నాయి. అన్ని ఇండస్ర్టీల్లోనూ ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు సినిమాహాళ్లకు వస్తున్నారు. ఇదే పాజిటివిటీతో ముందుకెళ్లాలి. తెలుగులో ‘వరుడు కావలెను’, తమిళంలో ‘అన్నాత్తే’, కన్నడలో ‘భజరంగి 2’, హిందీలో ‘సూర్య వన్షీ’.. సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అన్నీ మంచి విజయం సాధించాలి. అలాగే డిసెంబర్‌ 17న ‘పుష్ప’తో మేం కూడా వస్తున్నాం. మా సినిమా కూడా అందరికీ నచ్చాలని కోరుకుంటున్నా. ఈ దీపావళికి భారతీయ సినిమా గతంలోలాగా ప్రేక్షకులను అలరించి మంచి బిజినెస్‌ చేస్తుందనే నమ్మకం ఉంది. ఇక ఈ సినిమా  విషయానికొస్తే.. ‘దిగు దిగు నాగ’ పాట మా ఇంట్లో మోగుతూనే ఉంటుంది. నాగశౌర్య సినిమాలన్నీ చూశా.. అతను చాలా అందగాడు.  మనసున్న వ్యక్తి. భవిష్యత్తులో పెద్ద హీరో అవుతాడు. ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయం కృషితో ఎదిగేవారంటే నాకు చాలా ఇష్టం.. శౌర్య తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్‌ సంపాదించుకున్నారు. ‘పెళ్లి చూపులు’ చూసి రీతూ వర్మ గురించి తెలుసుకున్నా. అమ్మాయిల్లో నాకు హుందాతనం అంటే ఇష్టం.. అది రీతూ దగ్గర చాలా ఉంది. ముంబయ్‌లో షూటింగ్‌ చేస్తున్నప్పుడు అన్ని విభాగాల్లో మహిళలు ఎక్కువశాతం కనిపిస్తారు. మన దగ్గ ర ఇలా ఎప్పుడు చూస్తామా  అనుకునేవాణ్ణి. తెలుగులో హీరోయిన్లుగా మాత్రమే వస్తున్నారు. అన్ని శాఖల్లోకి మహిళలులు రావాలి. ఆ రోజులు త్వరలో వస్తాయనుకుంటున్నా. దర్శకురాలిగా పరిచ అవుతున్న లక్ష్మీ సౌజన్యకి ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమాకి విశాల్‌, తమన్‌ మంచి సంగీతం అందించారు. ఇద్దరు సంగీత దర్శకులు కలిసి పని చేయడానికి ఇగో అడ్డు వస్తుంది. అలాంటివేమీ లేకుండా వీరిద్దరూ మంచి అవుట్‌పుట్‌ ఇచ్చారు.  గీతా ఆర్ట్స్‌ తర్వాత నేను సొంత సంస్థగా భావించే బ్యానర్‌ ఇది. ‘జెర్సీ’కి జాతీయ అవార్డు అందుకున్నందుకు నాగవంశీకి థ్యాంక్స్‌’’ అన్నారు’’ అని అన్నారు.
త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చూశా. నాకు బాగా నచ్చింది. ఇందులో కొన్నిపాత్రలు మనతోపాటు ఇంటికి వస్తాయి. మన ఇళ్లల్లో జరిగే ఆడ పిల్లల తాలూకు కథ ఇది. మనసుకు దగ్గరగా ఉంటుంది. శౌర్య బాగా యాక్ట్‌ చేశాడు. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ అదిరిపోతుంది. రీతూ పెళ్లి కథాంశం ఉన్న చిత్రాల్లోనే ఎక్కువ కనిపిస్తున్నారు.  చాలాకాలం తర్వాత సినిమా మొత్తం చీరకట్టులో ఓ హీరోయిన్‌ని చూశాను. చినబాబుగారి మనసుకి దగ్గరైన సినిమా ఇది. కరోనా వల్ల ఏడాది కాలం వేచిచూశారు’’ అని అన్నారు.
నాగశౌర్య మాట్లాడుతూ…
ఏడాదిన్నర నిరీక్షణకు మంచి దారి దొరికింది. సినిమా పక్కా హిట్‌. ఇది ఓవర్‌ కాన్ఫిడెన్స్‌కాదు. మా అందరికీ ఉన్న నమ్మకం. 29న మా అక్క సౌజన్య లైఫ్‌ డిసైడ్‌ కాబోతుంది. తను దర్శకురాలిగా సెట్‌ అయిపోయినట్లే. తను అనుకున్నది అనుకున్నట్లు తీసింది. డెఫినెట్‌గా తను అనుకున్న జీవితాన్ని పొందుతుంది.మా అక్క సక్సెస్‌కి మేమంతా ఉన్నాం. మురళీశర్మగారి క్యారెక్టర్‌ నన్ను కదిలించింది. చినబాబుగారి సహనానికి గ్రేట్‌. తగ్గేదేలే అన్నట్లు బడ్జెట్‌ పెట్టారు. బన్నీ అన్న నాకు స్ఫూర్తి’’ అన్నారు.
లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ ‘‘మనిషికీ, మాటకు విలువిచ్చే వ్యక్తి చినబాబు గారు. నాకు కెరీర్‌ని ఇచ్చారు. నా కలను నిజం చేశారు. ఆయన ఓపికకు మెచ్చుకోవాలి. శౌర్యతో మళ్లీ సినిమా చేయాలనుంది. నదియాగారు చాలా హార్డ్‌  వర్క్‌ చేశారు. నా కథకు గణేశ్‌ మంచిమాటలు ఇచ్చారు. మంచి టీమ్‌ కుదరబట్టే నేనీ సినిమా చేయగలిగాను’’ అని అన్నారు.
రీతూవర్మ మాట్లాడుతూ ‘‘నా మొదటి సినిమా నుంచి బన్నీ నన్ను సపోర్ట్‌ చేశారు. ఆయనతో సినిమా చేయడం కోసం ఎదురుచూస్తున్నా. నాకు ఓ మంచి సినిమా ఇచ్చిన సితార సంస్థకు థ్యాంక్స్‌. సౌజన్య మనసు పెట్టి పని చేశారు’’ అని అన్నారు.
సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది. అందుకు చినబాబు, వంశీగారికి కృతజ్ఞతలు. ఓ సినిమాకి ఇద్దరు సంగీత దర్శకులు ఉండటం చాలా కష్టం. విశాల్‌ చంద్రశేఖర్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అన్నారు.
విశాల్‌ చంద్ర శేఖర్‌, ప్రవీణ్‌, రాంబాబు గోశాల, నదియా, గణేష్‌ రావూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
I hope Varudu Kaavalenu brings back audiences to theatres in huge numbers:  icon star Allu Arjun
One of the most awaited Telugu films of the year,  Varudu Kaavalenu, is all set to hit theatres on October 29. Starring Naga Shaurya, Ritu Varma in the lead roles, the family entertainer marks the directorial debut of Lakshmi Sowjanya. The film is produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments, the leading banner associated with hit films like Jersey, Premam, Bheeshma and the upcoming Pawan Kalyan, Rana Daggubati multi-starrer Bheemla Nayak. The beautiful trailer, memorable songs by Thaman and Vishal Chandrasekhar, the terrific chemistry between Naga Shaurya and Ritu Varma have ensured good hype for the film ahead of its release.
A grand pre-release event of Varudu Kaavalenu was held at Shilpakala Vedika, Hyderabad, on Wednesday amid the presence of the cast and crew. Icon Staar Allu Arjun and blockbuster filmmaker Trivikram were chief guests at the event that was high on energy and emotions. Several renditions and dance performances set to the songs from the film entertained crowds and the guests thoroughly. The actors and technicians, expressing confidence about the film’s result, were in a joyous mood as they took to the stage.
Director Lakshmi Sowjanya shared, “I thank China Babu garu (producer S Radha Krishna) for this opportunity. He’s a man who lives up to his words and values people. My parents may have given birth to me, but I’ll always be thankful to him for giving me such a strong foundation for my career. Naga Vamsi (garu) is extremely good at understanding the needs of the team and solves any problem amicably. Naga Shaurya is a thorough gentleman and a professional and was a delight to work with. Ritu Varma has always selected good scripts and she had become a family member to all of us as we made the film.”
“This film wouldn’t have been possible without the contributions of Nadhiya, Murali Sharma, dialogue writer Ganesh Ravuri and cinematographer Vamsi Patchipulusu. I wholeheartedly convey my gratitude to my direction team, screenplay writer Sharath. Allu Arjun is a person whom I respect since Vedam, a film I worked on. He always says ‘I can’ as an actor in any given situation and that’s the reason he’s an ‘Icon Staar’ today. Thank you Trivikram (garu) for blessing us and our team with your presence at the event.”
Actress Ritu Varma said, “I feel grateful to Sithara Entertainments for placing so much confidence in me to pull off this role. I hope to see our director Lakshmi Sowjanya’s career start on a successful note. I couldn’t have imagined anyone for the role of Aakash except for Shaurya and he’s such a fantastic performer and I wish to work with him again. It’s been a special experience to share screen-space with Nadhiya (garu). The USP of Varudu Kaavalenu is its freshness. The cinematographer, music directors, the direction and production teams are the backbone of the film. Allu Arjun is one of my most favourite people in the industry and has supported me since the beginning and I’m glad he made time for this event.”
Actor Naga Shaurya, beaming with confidence, stated, “Before I talk about anything else, let me assure everyone that the film is a sure-shot hit. I say it with confidence that everyone will like it. The director has made a beautiful film and is sure to win her many laurels after it releases on October 29. The cinematographer Vamsi, the director and my costume designer Harsha have presented me very well. Ritu Varma has never looked more beautiful in her career and I think we make for a great on-screen pair. The characters and performances of Nadhiya (garu) and Murali Sharma (garu) are the lifelines of the film. I feel honoured to be in the company of Trivikram garu and Allu Arjun garu at the event, they have been an inspiration for an entire generation and are entertaining people for so many years now.”
Director Trivikram added, “The journey of Haarika and Haasine Creations started with Allu Arjun’s Julayi. As someone who considers this banner my own, I thank Allu Arjun for being part of the event. I have watched the film recently and the performances of the cast and crew will stay with you long after you watch it. The film has a story that’s very identifiable and close to our hearts. Lakshmi Sowjanya has got her story right and cast her actors quite aptly. This is a film that China Babu (garu) is extremely fond of and the team has also responded to him with the same amount of love. Vishal Chandrasekhar has done a wonderful job with the music.”
Icon Staar Allu Arjun said, “Even my daughter is dancing to the tune of Digu Digu Naga at home, that’s the popularity of the film’s music. I always like self-made people who have created a mark in the industry and Naga Shaurya is certainly one of them. He isn’t only a good person but also brings innocence, depth to his performances that I enjoy watching. I have a soft corner for Ritu Varma because she’s a Telugu girl and followed her work since the very beginning. I truly like the dignity with the way she carries herself both off and on-screen. I enjoyed the trailer and it shows the effort that the actors and technicians have put into the film.”
“It’s good to see a female director like Lakshmi Sowjanya being launched in the industry. It’s important that women be made an integral part of the filmmaking process across all departments and I wholeheartedly welcome her as a director. I am truly amazed by the rapport and the goodwill that two composers like Vishal Chandrasekhar and Thaman have for each other. The vibe of this event largely reminds me of Alaa Vaikunthapurramulo. I treat this as a home banner (apart from Geetha Arts) and the people here, China Babu (garu) and Vamsi as my own. This is a crucial phase for the industry and I hope to see Telugu cinema and all the other industries in the country bring audiences to theatres and bounce back with a bang.”
Producers S Radha Krishna, S Naga Vamsi, editor Navin Nooli, cinematographer Vamsi Patchipulusu, music directors Thaman, Vishal Chandrasekhar, lyricists Rambabu, Raghuram, Priyanka, actors Praveen, Nadhiya, dialogue writer Ganesh Ravuri and screenplay writer Sharath were also part of the event and stated their happiness in associating with Varudu Kaavalenu. Each of the cast and crew members at the event was later presented with gifts according to their roles in the film and their personal tastes. Filmmaker Trivikram had also felicitated editor Navin Nooli and producer S Naga Vamsi, congratulating them for their national-award wins for Jersey.
DSC_0514 DSC_0512