Apr
22
2015
‘జాదూగాడు’ ఆడియో ఆవిష్కరణ
నాగశౌర్య, సోనారిక జంటగా సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం ‘జాదూగాడు’. యోగేష్ దర్శకత్వంలో వి.వి.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. బిగ్ సీడీని మణిశర్మ ఆవిష్కరించారు. మణిశర్మ, బి.గోపాల్, కోన వెంకట్, గోపీచంద్ మలినేని, నల్లమలుపు శ్రీనివాస్ సంయుక్తంగా ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…
మణిశర్మ మాట్లాడుతూ ‘’నేను సాధారణంగా ఆడియో వేడుకలను రాను. వచ్చినా స్టేజ్ పై ఎక్కి మాట్లాడను. ఈ సినిమా విషయంలో మాట్లాడాలనిపించింది. ఆల్ ది వెరీ బెస్ట్ టు జాదూగాడు టీమ్ అండ్ సాగర్. మంచి టీమ్ కలిసి చేస్తున్న మంచి చిత్రం’’ అన్నారు.
నాగశౌర్య మాట్లాడుతూ ‘’నన్ను హీరోగా అనుకోవడమే కాకుండా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రసాద్ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ద్వారా ఫస్ట్ టైమ్ లవ్ ఇమేజ్ నుంచి మారి మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నాను. నన్ను నమ్మి సినిమా తీసే ప్రతి నిర్మాత నాకు దేవుడుతో సమానం. హీరో కావాలనే తపనతో ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఫిల్మ్ నగర్‌లో ఓపెన్ చేసిన ప్రతి ఆఫీస్‌లో ఫోటోలు ఇచ్చాను. పిలిచిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పెర్‌ఫార్మ్ చేశాను. ఆ కష్టమెంటో నాకు బాగా తెలుసు. ముఖ్యంగా నా ఫస్ట్ మూవీ నిర్మాత సాయి కొర్రపాటిగారికి, అవసరాల శ్రీనివాస్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా విషయానికి వస్తే మా డైరెక్టర్‌గారి కసి, మా మధుగారి కథ, శ్రీరామ్‌గారి విజువల్స్, సాగర్‌గారి మ్యూజిక్, అందమైన కోస్టార్.. వీళ్ళంతా కలవడం వల్ల ఒక మంచి మూవీ రెడీ అయింది. నాపై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ప్రసాద్‌గారికి, డైరెక్టర్ యోగిగారికి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తున్నాను’’ అన్నారు.
బి.గోపాల్ మాట్లాడుతూ ‘నాకు ఎంతో ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మగారు. నేను చేసిన సినిమాలకు పాటలతో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశాడు. ఆ సినిమాలు అంత పెద్ద హిట్ కావడంలో మణిశర్మగారు ముఖ్యపాత్ర పోషించారు. వాళ్ళబ్బాయి ఫస్ట్‌టైమ్ మ్యూజిక్ చేస్తున్నాడు. మణిశర్మ అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
కోన వెంకట్ మాట్లాడుతూ ‘’నేను, ఈ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ అనే ఒక హెడ్ క్వార్టర్స్ నుంచి బయలుదేరాం. మా యోగికి ఒక రికార్డ్ వుంది. ఇంత గ్యాప్‌తో యోగి చేసిన ఈ సినిమాలో ఏదో జాదూ వుందని మాత్రం చెప్పగలను. సినిమా తప్పకుండా పెద్ద హిట్టయి యూనిట్ మంచి పేరు తెస్తుందని భావిస్తున్నాను’’ అన్నారు.
సాగర్ మహతి మాట్లాడుతూ ‘’ఎంతో మంది గొప్ప వారు పనిచేసిన ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈరోజు నుంచి నేను కూడా పార్ట్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇప్పుడు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారకులు మా తాతగారు, నాన్నగారు. ఎన్ని జన్మలకైనా ఆ రుణం తీర్చుకోలేనిది. నాన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ఇంత మంచి మ్యూజిక్ లైఫ్‌ని ఇచ్చిన నాన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగశౌర్య ఈ సినిమాలో ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. యోగేష్ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ ‘’2003లో నా మొదటి సినిమా రిలీజ్ అయింది. ఆరోజు నేను ఎంత ఎక్సైట్ అయ్యానో, ఈరోజు అంత ఎక్సైట్ అవుతున్నాను. ఎందుకంటే ఈ సినిమా నా సినిమాగా భావిస్తున్నాను. సాగర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ ఆడియో, సినిమా పెద్ద హిట్టయి తనకి మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు.
మెహర్ రమేష్ మాట్లాడుతూ ‘’యోగి నాకు మంచి ఫ్రెండ్. తను ఈ సినిమాని ఇరగదీశాడు. గ్యాప్ తీసుకొని చేసినా కలర్‌ఫుల్‌గా తీశాడు, నాగశౌర్యని చాలా బాగా ప్రెజెంట్ చేశాడు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.
సోనారిక మాట్లాడుతూ ‘’ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. శౌర్య అమేజింగ్ కో యాక్టర్. ఈ సినిమాకి చాలా మంచి పాటలు ఇచ్చిన సాగర్‌కి వెరీ థాంక్స్. ఈ సినిమాని మేమంతా ఎంతో కష్టపడి చేశాం. తప్పకుండా మా ప్రయత్నాన్ని ఆదరించాలి’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో రమేష్ ప్రసాద్, దామోదర్ ప్రసాద్, నందినిరెడ్డి సహా పలువురు సినీ రంగ ప్రముఖులు పాల్గొని ఆడియో, సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు.
నాగశౌర్య, సోనారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, కాశీ విశ్వనాథ్, మాధవి, అజయ్, శ్రీనివాసరెడ్డి, పృథ్వి, సప్తగిరి, తాగుబోతు రమేష్, జాకీర్ హుస్సేన్, ఆశిష్ విద్యార్థి, రవి కాలే, ప్రభాస్ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: మధుసూదన్, పాటలు: వరికుప్పల యాదగిరి, శ్రీమణి, విశ్వ, సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, సంగీతం: సాగర్ మహతి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, ఆర్ట్: సాహి సురేష్, ఫైట్స్: వెంకట్, నిర్మాత: వి.వి.ఎన్.ప్రసాద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యోగేష్.
By venupro •
FUNCTIONS, JADOOGADU, MY FILMS •
Follow Us!