Anikha Surendran, Arjun Das and Surya Vasishta team up for Butta Bomma, backed by Sithara Entertainments and Fortune Four Cinemas

అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట  ల తో  ’సితార ఎంటర్ టైన్ మెంట్స్’ , ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‘….”బుట్ట బొమ్మ”
* ”బుట్ట బొమ్మ” గా అనిక సురేంద్రన్
* అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు కథా నాయకులు
*శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం
*వినాయకచవితి పర్వదినాన చిత్రం పేరుతో ప్రచార చిత్రం విడుదల
*నవంబర్ లో చిత్రం విడుదల
వరుస చిత్రాల నిర్మాణం లోనే కాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి నిర్మిస్తున్న మరో  చిత్రం ప్రచార పర్వం వినాయక చవితి పర్వదినాన  మొదలైంది. వివరాల్లోకి వెళితే…..
అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట  లు నాయిక, నాయకులుగా ’సితార ఎంటర్ టైన్ మెంట్స్’ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా  ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రానికి ”బుట్ట బొమ్మ” అనే పేరును ఖరారు చేస్తూ వినాయకచవితి పర్వదినాన చిత్రం పేరుతో ప్రచార చిత్రం ను విడుదల చేశారు. నాగ‌వంశీ ఎస్‌. – సాయి సౌజ‌న్య‌ ఈ చిత్రానికి నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు.
విడుదలైన ప్రచార చిత్రంలో నాయిక అనిక సురేంద్రన్ ‘బుట్ట బొమ్మ‘ గా ఎంతో అందంగా ఒదిగిపోయిన వైనం చూడ ముచ్చటగా ఉందనిపిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ…‘బుట్ట బొమ్మ‘ గా అనిక సురేంద్రన్, అలాగే అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల పాత్రలు గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ లో సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. గుర్తుండి పోతాయి.‘ప్రేమ’ లోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి అని తెలిపారు.. సంభాషణల రచయిత గా ‘ వరుడు కావలెను‘ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గణేష్ కుమార్ రావూరి ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు.
సెప్టెంబర్ నెలలో జరిగే షూటింగ్ తో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. నవంబర్ నెలలో చిత్రం విడుదల అని, చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఒక్కొక్కటిగా తెలియ పరుస్తామని తెలిపారు నిర్మాతలు.
అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట నాయిక, నాయకులుగానటిస్తున్న ఈ చిత్రంలో
నవ్య స్వామి, నర్రాశ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి,ప్రేమ్ సాగర్, మిర్చి కిరణ్, కంచెర్ల పాలెం కిషోర్, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రధారులు.
సాంకేతిక నిపుణులు:
ఛాయాగ్రహణం: వంశీ పచ్చి పులుసు
సంగీతం: గోపిసుందర్
మాటలు: గణేష్ కుమార్ రావూరి
పాటలు: శ్రీమణి, ఎస్. భరద్వాజ్ పాత్రుడు
ఎడిటర్: నవీన్ నూలి
పోరాటాలు : డ్రాగన్ ప్రకాష్
ప్రొడక్షన్ డిజైనర్: వివేక్ అన్నామలై
ప్రొడక్షన్ కంట్రోలర్: సి హెచ్. రామకృష్ణా రెడ్డి
పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్
నిర్మాత‌లు: నాగ‌వంశీ ఎస్‌. – సాయి సౌజ‌న్య‌
దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్
Anikha Surendran, Arjun Das and Surya Vasishta team up for Butta Bomma, backed by Sithara Entertainments and Fortune Four Cinemas
Leading production house Sithara Entertainments, known for backing quality films, and Fortune Four Cinemas are joining hands for a new project. Anikha Surendran, Arjun Das and Surya Vasishta play the lead roles in the film titled Butta Bomma, which was formally announced today commemorating Vinayaka Chaturthi. The poster of the film was launched on the occasion. S Naga Vamsi and Sai Soujanya are bankrolling the film directed by Shourie Chandrasekhar Ramesh.
In the poster of Butta Bomma, an innocent Anikha Surendran is curiously looking through a window. Spilling the beans about the film, director Shourie Chandrasekhar Ramesh shares, “Butta Bomma is a realistic love story set amidst a village backdrop featuring Anikha Surendran, Arjun Das and Surya Vasishta. The film will tug at your heartstrings and explore various dimensions of love with an engaging screenplay.”
The shoot of Butta Bomma will be wrapped this September. The makers plan to release the film in November. Other details about the film will be revealed shortly. Navya Swami, Narra Srinu, Pammi Sai, Karthik Prasad, Vasu Inturi, Mirchi Kiran, Kancharapalem Kishore and Madhumani too play important roles in this rural romance. Ganesh Kumar Ravuri, who shot to fame with Varudu Kaavalenu, has penned the dialogues. Gopi Sundar scores the music for the film which has cinematography by Vamsi Patchipulusu.
Crew:
Cinematography: Vamsi Patchipulusu
Music: Gopi Sundar
Dialogues: Ganesh Kumar Ravuri
Lyrics: Shreemani, S Bharadwaja Pathrudu
Editor: Navin Nooli
Production designer: Vivek Annamalai
Production controller: C H Ramakrishna Reddy
PRO: LakshmiVenugopal
Producers: S Naga Vamsi and Sai Soujanya
Director: Shourie Chandrasekhar T  Ramesh
ButtaBomma_Still1 ButtaBomma_Still2 #ButtaBomma_FL_Design_2 #ButtaBomma_FL_Design_1

Swathi Muthyam, a family entertainer with a novel plot, set to release on October 5

గణేష్,వర్ష బొల్లమ్మ’ ల ”స్వాతిముత్యం” అక్టోబర్ 5 న విడుదల
*కంటెంట్ బలంతో దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు 
*విడుదల తేదీ ఖరారు చేస్తూ ప్రచార చిత్రం విడుదల
‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ’స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
కంటెంట్ బలంతో దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి
విడుదల తేదీ ఖరారు చేస్తూ ప్రచార చిత్రం ఈరోజు విడుదల చేశారు.”స్వాతిముత్యం” అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ అధికారికంగా ప్రకటించారు.
 ’స్వాతిముత్యం’ లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం’స్వాతిముత్యం’.  సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘స్వాతిముత్యం’ ను దర్శకుడు తీర్చి దిద్దారు లక్ష్మణ్ అని తెలిపారు
చిత్ర ప్రచారం కూడా సగటు సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటూ, ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవల విడుదల అయిన ”నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా” గీతం తో పాటు ఇప్పటివరకు చిత్రానికి సంబంధించి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో చిత్రం సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి అన్న వార్తలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి అంటోంది చిత్ర బృందం.
గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.
సాంకేతిక వర్గం:
సంగీతం: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: అవినాష్ కొల్ల
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన, దర్శకత్వం: లక్ష్మణ్ కె.కృష్ణ
Swathi Muthyam, a family entertainer with a novel plot, set to release on October 5
Swathi Muthyam, a feel-good family entertainer produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments, marks the acting debut of Ganesh and features Varsha Bollamma as the female lead. Directed by Lakshman K Krishna, the film has music by Mahathi Swara Sagar. Swathi Muthyam is set to hit theatres on October 5 and is a perfect festive treat for Dasara, meant for audiences of all age groups.
These are times when audience tastes have evolved considerably and the makers believe Swathi Muthyam is the perfect new-age film that’ll offer something new to them and respect their intelligence. The film has a novel plot with all the ingredients that make for a big-screen experience and promises to be an ideal blend of romance, humour, family emotions and foot-tapping music.
The film’s glimpse, first-look posters and the first single, a beautiful melody Nee Chaaredu Kalle have received impressive responses from crowds all over. The heartwarming entertainer revolving around an innocent young man and a straightforward girl touches upon themes like life, love, and marriage and looks at modern-day relationships in a newer light.
Swathi Muthyam has wrapped its shoot and post-production formalities and the makers are very confident about their product. The supporting cast includes senior actors Naresh, Rao Ramesh, Subbaraju, Vennela Kishore, Harshavardhan, Pammi Sai, Sapthagiri, Goparaju Ramana, Siva Narayana, Pragathi, Surekha Vani, Sunaina, Divya Sripada.
Crew Details :
Music: Mahathi Swara Sagar
Cinematography: Suryaa
Editor: Navin Nooli
Art: Avinash Kolla
Pro: LakshmiVenuGopal
Presents: PDV Prasad
Producer: Suryadevara Naga Vamsi
Written and Directed by Lakshman K Krishna
Swathimuthyam-Rel Date Swathimuthyam-Rel Date_Still

 

Haarika and Hassine Creations, Sithara Entertainments complete a successful decade in cinema, release a video thanking everyone for their support

హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విజయవంతంగా పదేళ్ల సినీ  ప్రయాణం పూర్తి 
 
*అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వీడియోను విడుదల చేసిన నిర్మాణ సంస్థ.
అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న చిత్రనిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ నేటితో పదేళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాయి. ఆగస్టు 9, 2012న విడుదలైన ‘జులాయి’తో ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించి, మొదటి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకొని, మంచి అభిరుచి గల నిర్మాతలుగా పేరు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్, ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. పదేళ్ల సినీ ప్రస్థానంలో ఈ సంస్థల నుంచి 16 సినిమాలు రాగా, అందులో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడం విశేషం.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ కి ప్రత్యేక అనుబంధముంది. ‘జులాయి’ నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న అన్ని చిత్రాలను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తుండటం విశేషం. ఇక సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా యువ ప్రతిభకు పెద్ద పీట వేస్తుంటారు. ఈ పదేళ్లలో ఈ రెండు బ్యానర్స్ లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అఆ’, ‘ప్రేమమ్’, ‘అరవింద సమేత’, ‘జెర్సీ’, ‘భీష్మ’, ‘భీమ్లా నాయక్’, ‘డీజే టిల్లు’, ‘అల వైకుంఠపురములో’ ఇలా పదికి పైగా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.
ఇక ముందు కూడా తమకు అందరి అభిమానం, ఆశీస్సులు, ప్రేక్షకుల మద్దతు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక వీడియోని విడుదల చేశారు. “జులాయితో ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. మీరు ఇచ్చిన ప్రేమ ఈ అందమైన చిత్రాలన్నీ తీయగలననే నమ్మకాన్ని కలిగించింది. మీరు మాకు విభిన్న చిత్రాలను తెరకెక్కించడానికి మరియు అనేక భావోద్వేగాలను తెరపై అందించడానికి అవకాశం ఇచ్చారు. ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో మీ ప్రేమ మరియు మద్దతు మమ్మల్ని మరిన్ని సవాళ్లు స్వీకరించేలా చేశాయి. ఇన్నాళ్లూ మీ ప్రేమకు ధన్యవాదాలు. మీ మద్దతు ఇకపై కూడా ఇలాగే ఉంటుందని, మరిన్ని అద్భుతమైన చిత్రాలతో మిమ్మల్ని మరింత అలరిస్తామని ఆశిస్తున్నాము.” అంటూ వీడియోలో పేర్కొన్నారు.
మధురమైన పదేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో భారీ విజయాలను అందుకున్న ‘హారిక అండ్ హాసిని’, ‘సితార’ సంస్థల నుంచి మరిన్ని అద్భుతమైన చిత్రాలు రాబోతున్నాయి. అందులో ‘స్వాతిముత్యం’(గణేష్, వర్ష బొల్లమ్మ), ‘అనగనగా ఒక రాజు’(నవీన్ పొలిశెట్టి), ‘PVT04′(పంజా వైష్ణవ్ తేజ్), ‘SSMB28′(మహేష్ బాబు, త్రివిక్రమ్, పూజ హెగ్డే), ‘DJ టిల్లు-2′(సిద్ధు జొన్నలగడ్డ), ‘సార్’(ధనుష్, సంయుక్త మీనన్), మలయాళ చిత్రం కప్పెల రీమేక్(సూర్య, అర్జున్ దాస్, అనిఖ సురేంద్రన్) వంటి చిత్రాలున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ రెండవ దశాబ్దంలో మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాలనే నిబద్ధతకు కట్టుబడి ఉన్నాయి.

Haarika and Hassine Creations, Sithara Entertainments complete a successful decade in cinema, release a video thanking everyone for their support

Leading production houses Haarika and Hassine Creations, Sithara Entertainments have created an indelible mark in the Telugu film industry over a decade by churning out quality cinema consistently. Their tryst with cinema began on August 9, exactly 10 years ago with the release of Julayi, the action entertainer starring Allu Arjun and Ileana D’Cruz, directed by Trivikram. Ever since they haven’t looked back at all, letting their films do the talking and winning the trust of audiences with their refined script choices.

On completing a decade in films, the production house shared a special video offering a glimpse into many of their memorable films ranging from Julayi to A..Aa to S/O Satyamurthy, Jersey, DJ Tillu, Ala Vaikunthapurramulo, Aravinda Sametha and Bheemla Nayak. From national awards to box office reception and glowing critical reception, the banners have seen it all, backing some of the biggest Telugu films this decade featuring top stars and also encouraging new talent into the industry.

The production houses thanked viewers and well-wishers for continuous support in their endeavours and also revealed the lineup of their upcoming films. In the video, they shared, “A dream of many years came true with Julayi. The love you gave made us confident to make all these beautiful films. You have given us the chance to touch different genres and deliver many emotions on screen. In these 10 years, a journey of 16 films, your love and support gave our passion the wings to conquer more challenging avenues. Thank you for your love all these years. Keep supporting our passion. We hope to continue entertaining you with our exciting lineup of films.”

Their future films look extremely compelling – Swathimuthyam (starring Ganesh, Varsha Bollamma), #PVT04 (Panja Vaisshnav Tej), #SSMB28 (Mahesh Babu, Trivikram, Pooja Hegde), Tillu 2 (Siddhu Jonnalagadda), Anaganaga Oka Raju (Naveen Polishetty), Sir/Vaathi (Dhanush, Samyuktha Menon) and an untitled film (the remake of Kappela starring Surya, Arjun Das and Anikha Surendran). Staying true to their commitment to ensuring entertainment with a purpose, Haarika and Hassine Creations and Sithara Entertainments enter their second decade in cinema with greater hope and optimism.

PHOTO-2022-08-09-17-02-38
10Y Design

Swathimuthyam gets postponed from 13th August release date

ఆగస్టు 13న విడుదల కావాల్సిన ‘స్వాతిముత్యం’ వాయిదా
గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా మా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ‘స్వాతిముత్యం’ చిత్రం ఆగస్టు 13న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాము. ఈ నిర్ణయం పట్ల మేం సంతోషంగా లేనప్పటికీ, వాయిదా వేయక తప్పడం లేదు. రిలీజ్ డేట్‌ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, రిలీజ్ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా నిర్ణయం తీసుకోక తప్పలేదు.
విడుదల తేదీని ముందుగానే ప్రకటించి, విడుదల ప్రణాళికలతో పూర్తి సిద్ధంగా ఉన్నప్పటికీ పరిశ్రమ గురించి ఆలోచించి మేం వెనక్కి తగ్గుతున్నాము. మహమ్మారి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితి అంత గొప్పగా లేదు. ఇంతకుముందులా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. మా సినిమా విడుదలకు సరైన సమయం కుదిరినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి చూసి,ఇతర చిత్రాల నిర్మాతల పరిస్థితి చూసి మా సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ప్రేక్షకులు థియేటర్‌లకు వచ్చి మునుపటిలాగ సినిమాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.
సాంకేతిక వర్గం:
సంగీతం: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: అవినాష్ కొల్ల
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన, దర్శకత్వం: లక్ష్మణ్ కె.కృష్ణ
Swathimuthyam gets postponed from 13th August release date
We, Sithara Entertainments., would like to inform you that Swathimuthyam starring Ganesh, Varsha Bollamma has been postponed from 13th August release date. While we are unhappy about this development yet couldn’t avoid this postponement. We have completed the shoot, post production works keeping in mind the release date and wanted to go ahead with the release plans.Even though we could have been adamant about our release plans, post pandemic TFI situation is not great. Audiences are not coming to theatres as they used to before and looking at this situation, we did not want to compete with other releases, even though it is perfect timing for our film to release.

Looking at the producers situation in the current scenario we have decided to postpone our film and we will announce the release date soon. We hope audiences will come to theatres and enjoy films like they used to, going forward.

The supporting cast includes senior actors Naresh, Rao Ramesh, Subbaraju, Vennela Kishore, Harshavardhan, Pammi Sai, Sapthagiri, Goparaju Ramana, Siva Narayana, Pragathi, Surekha Vani, Sunaina, Divya Sripada.

Crew Details :
Music: Mahathi Swara Sagar
Cinematography: Suryaa
Editor: Navin Nooli
Art: Avinash Kolla
Presents: PDV Prasad
Producer: Suryadevara Naga Vamsi
Written and Directed by Lakshman K Krishna

Swathimuthyam_New Poster Swathimuthyam Still