RANI RANEMMA

శ్రీలంక వెళ్లనున్న యాక్షన్ కింగ్ ‘అర్జున్’, నాయిక’లక్ష్మీరాయ్’, ప్రముఖ దర్శకుడు ‘కోడిరామకృష్ణ’ ల చిత్రం ‘రాణీ రాణమ్మ’

IMG_6866 IMG_7337 IMG_7375 IMG_7510 IMG_8767 IMG_9956 SRI_9669 SRI_9706
రాణీ రాణమ్మ
యాక్షన్ కింగ్ ‘అర్జున్’, నాయిక’లక్ష్మీరాయ్’, ప్రముఖ దర్శకుడు ‘కోడిరామకృష్ణ’ ల చిత్రం.
శైలజ ప్రొడక్షన్స్ పతాకంపై అభిరుచి గల నిర్మాత ఆర్.రామచంద్ర రాజు తెలుగు,తమిళ భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్నారీ చిత్రాన్ని. దాదాపు 60 శాతానికి పైగా పూర్తయిన ‘రాణీ రాణమ్మ’ గురించి నిర్మాత
మాట్లాడుతూ…
శ్రీలంక నేపధ్యంలో జరిగే కధ ఇది. ‘ 
”తెలుగు రాష్ట్రం లో నివసిస్తున్నఓ తమిళ యువకుడు  (కధానాయకుడు అర్జున్) కి అమాయకురాలైన ఓ చిన్నపాప పరిచయం అవుతుంది. ఆ పాప యువకుడి  కుటుంబానికి ఎంతో దగ్గర అవుతుంది. వారితో కలసి పోతుంది. తెలుగు రాని ఆ పాప ఎవరో, తల్లి దండ్రులు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఆ పాప స్వస్థలం శ్రీలంక అని తెలుస్తుంది కధానాయకునికి. ప్రభుత్వ అధికారుల సహకారంతో ఆ పాపను శ్రీలంక కు తీసుకు వెళ్ళటానికి చేసిన ప్రయత్నాలు ఎలా జరిగాయి, శ్రీలంక లో మిలిటరీ అధికారిని కలసిన తరువాత   ఏమైంది, అక్కడ ఎలాంటి పరిస్థితులను వీరు ఎదుర్కొన్నారు..? చివరకు ఏమైంది..?” అన్న అంశాన్ని దర్శకుడు కోడిరామకృష్ణ తెరకెక్కిస్తున్న తీరు తెరపై చూడాల్సిందే అన్నారు నిర్మాత రామచంద్ర రాజు.
సెంటిమెంట్,యాక్షన్ డ్రామా మిళితమైన కధాంశం తో కూడిన చిత్రమిది. దర్శకుడు కోడిరామకృష్ణ,అర్జున్ ల కలయికలో వస్తున్న6వ చిత్రమిది. ఆ చిత్రాల విజయాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రం రూపొందుతోందని తెలిపారాయన. ప్రతి సన్నివేశం  మనసును ఎంతగానో హత్తుకుంటుంది.రాజేంద్రకుమార్ సంభాషణలు ఎంతో బాగా  రాశారు. ఎస్.ఏ.రాజ్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. కధానాయకుని పాత్రలో రెండు కోణాలు ఉంటాయి. పతాక సన్నివేశాలు ఉత్కంట భరితంగా సాగుతాయి అని తెలిపారు నిర్మాత. ఈ చిత్రం మలయాళ మాతృక ‘కాల్చ’(మమ్ముట్టి,పద్మప్రియ, 3 రాష్ట్ర అవార్డ్ లు గెల్చుకున్న చిత్రం) హక్కులుతీసికొన్న ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ వద్ద మేము ‘తెలుగు, తమిళం’ లో పునర్నిర్మాణ హక్కులు తీసుకోవటం జరిగింది.అద్భుతమైన చిత్రమిది.
 
అక్టోబర్ నుంచి శ్రీలంక లో చిత్రం చివరి షెడ్యూల్  ప్రారంభ మవుతుంది. ఈ ఏడాది చివరలో సినిమా విడుదలకు సిద్ధ మవుతుందని నిర్మాత తెలిపారు.
అర్జున్,లక్ష్మీరాయ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో బేబి అన్షు నటిస్తోంది. ఆశిష్ విద్యార్ధి,తో పాటు సంగీత దర్శకుడు ఎస్.ఏ.రాజ్ కుమార్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి మూలకధ: బ్లెస్సి: మాటలు:రాజేంద్ర కుమార్: ఫోటోగ్రఫి: కోడి లక్ష్మణ్, వెంకట్: సంగీతం ఎస్.ఏ.రాజ్ కుమార్: 
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కోడి రామకృష్ణ: 
నిర్మాత: ఆర్. రామచంద్రరాజు 

కోడిరామకృష్ణ,అర్జున్,లక్ష్మీరాయ్ ల తో శైలజ ప్రొడక్షన్స్ ‘రాణీ రాణమ్మ’ ప్రారంభం

IMG_7237 launch-raniranammaIMG_7226 SRI_9559 SRI_9561 IMG_7254 IMG_7272 IMG_7282 SRI_9580