Mar 26 2018
Mar 26 2018
“Nela Ticket” unit wishes Happy Sri Rama Navami*:
సకుటుంబ సమేతంగా చూడ తగ్గ చిత్రం గా ‘నేలటిక్కెట్టు’
“Nela Ticket” unit wishes Happy Sri Rama Navami to Telugu audience. Produced by Ram Talluri under SRT Entertainments banner and directed by Soggade Chinni Nayana, Raarandoi Veduka Chuddam fame Kalyankrishna Kurasala, Mass Maharaja Ravi Teja’s movie has completed 80% of the shooting and with only 3 pending songs makers confirmed the release on May 24th.
The film stars Malvika Sharma as heroine along with Jagapathi Babu, Brahmanandam, Jayaprakash, Raghubabu, Ali, Posani Krishna Murali, Subbaraju, Annapurnamma, Priyadarshi, Prabhas Srinu, Pruthvi, Surekha Vani and Praveen playing crucial roles.
Fida fame Shakthikanth Karthick is composing the music, editing by Chota K.Prasad, Art Direction by Brahma Kadali and Mukesh is handling the cinematography.
Mar 26 2018
‘ఛల్ మోహనరంగ’ ప్రీ రిలీజ్ వేడుక
‘ఛల్ మోహనరంగ’ ప్రీ రిలీజ్ వేడుక
నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం ‘చల్ మోహన్‌రంగ’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో,పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలవుతోంది. ‘ఛల్ మోహన రంగ’ విడుదల ముందస్తు వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.
బీవీయస్‌యన్ ప్రసాద్ మాట్లాడుతూ “మా కల్యాణ్‌బాబుగారు త్రివిక్రమ్‌గారితో కలిసి తీస్తున్న ‘చల్ మోహన్‌రంగ’ పెద్ద హిట్ కావాలి. సుధాకర్‌రెడ్డిగారికి ఆల్ ది బెస్ట్” అని అన్నారు.
జెమిని కిరణ్ మాట్లాడుతూ “పవన్ కల్యాణ్‌గారికి నితిన్ పెద్ద ఫ్యాన్. త్రివిక్రమ్‌గారు, పవన్‌గారు నిర్మిస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి” అని చెప్పారు.
మధు నందన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. ఏప్రిల్ 5న సినిమా విడుదలవుతుంది. థియేటర్లకు వెళ్లి చూసిన ప్రతి ఒక్కరూ జల్సా చేసుకుంటారు. ఖుషీగా బయటికి వస్తారు. మనకు జయం పక్కా” అని చెప్పారు.
కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ “నితిన్ నా ఫేవరేట్ హీరోల్లో ఒకరు. ఈ కాంబినేషన్ ట్రెమండస్‌గా ఉంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నాను” అని తెలిపారు.
రావు రమేశ్ మాట్లాడుతూ “చల్‌మోహన్‌రంగా హీరో పేరు అండీ. ఈ కాంబినేషన్‌లో నటించడం ఆనందంగా ఉంది. నటరాజ్ సుబ్రమణ్యం చాలా బాగా తీశారు. తమన్‌గారి సాంగ్స్ ప్రతి సినిమాకూ మారుతుంటాయి. చాలా బాగా చేస్తారు. పెద్ద హిట్ కావాలి. వేసవి వేడిలో చల్లటి సినిమా ఇది. అద్భుతమైన హిట్ కావాలి” అని చెప్పారు.
దామోదరప్రసాద్ మాట్లాడుతూ “సుధాకర్‌రెడ్డిగారు నాకు మంచి ఫ్రెండ్. నితిన్‌కి, మిగిలిన టీమ్ అందరికీ శుభాకాంక్షలు” అని చెప్పారు.
మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ “ఈ టైటిల్ అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ మంచి పేరు వస్తుంది. పెద్ద పులి పాట అమెరికా దాకా పోయింది. హేకాన్ అనే గొప్ప సింగర్ సోషల్‌మీడియాలో ఆ పాటను పాడటం చాలా గొప్ప విషయం” అని అన్నారు.
లిజి మాట్లాడుతూ “చల్‌మోహన్‌రంగా నితిన్‌కి 25వ సినిమా. నాకు 25ఏళ్ల తర్వాత ఇది కమ్‌బ్యాక్ చిత్రమైంది. టీమ్ అందరికీ ధన్యవాదాలు. దాదాపు 20 స్క్రిప్ట్ లు విన్న తర్వాత ఈ సినిమాను ఎంపిక చేసుకున్నాను. నేను సినిమాల నుంచి వెళ్లిపోకముందు ’20వశతాబ్దం’, ‘మగాడు’ వంటి మంచి సినిమాలు చేశాను. అలాంటి సినిమాలను మళ్లీ చేయాలని అనుకున్నాను. మళ్లీ సినిమాల్లోకి రావాలనుకున్నాను. నాకు తెలుగు భాష ఇష్టం. తెలుగు భోజనం ఇష్టం. ఇక్కడ మహిళలకు ఇచ్చే గౌరవం చాలా ఇష్టం. నాకు ఇష్టమైన విషయాలను మళ్లీ ఆస్వాదించే అవకాశం ఇచ్చినందుకు ఈ టీమ్‌కి ధన్యవాదాలు” అని అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ “పాతికేళ్ల క్రితం ‘తొలిప్రేమ’ చూసి నితిన్ హీరో కావాలనుకున్నాడు. అలాంటి పవన్‌గారి నిర్మించే సినిమా నితిన్‌కి 25వ సినిమా కావడం హ్యాపీ. ఈ సినిమాకు తమన్ మంచి సంగీతాన్నిచ్చాడు. చైతన్య తన తొలి సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా కూడా తనకి పెద్ద హిట్ కావాలి. పవన్‌కల్యాణ్‌గారు ‘ఇష్క్’ సినిమా ఆడియోకి వచ్చారు. ఆ రోజు మీరూ ఉన్నారు. ఈ సినిమాకూ ఆయన వస్తున్నారు. మీరు కూడా రావాలి అని నితిన్ అడగ్గానే అమలాపురం నుంచి వచ్చాను” అని తెలిపారు. తమన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా మంచి విజయాల్ని సొంతం చేసుకుంటున్నాడు. ఈ సినిమాకీ మంచి బాణీలు అందించాడు. నితిన్ 25వ సినిమాకి పవన్ నిర్మాత కావడం తన అదృష్టం’’ అన్నారు.
నటరాజసుబ్రమణ్యం మాట్లాడుతూ “టీమ్‌కి చాలా థాంక్స్” అని అన్నారు.
నితిన్ మాట్లాడుతూ “25 సినిమాలు.. 16 ఏళ్లు.. ఈ జర్నీ రోలర్ కోస్టర్ రైడ్. కరుణాకరన్‌గారికి, కల్యాణ్‌గారికి చాలా థాంక్స్. వాళ్ల ‘తొలిప్రేమ’ చూసిన తర్వాతే నేను హీరో కావాలని అనుకున్నాను. తేజగారు నాకు యాక్టింగ్ నేర్పించారు. నేను సినిమాల్లోకి వెళ్తానంటే మా అమ్మానాన్నలు కాదనుకుండా పంపించారు. ‘వీడు సినిమాలకు తప్ప దేనికీ పనికిరాడు’ అని అనుకున్నారేమో. ఇన్నాళ్లు నాతో సినిమాలు చేసిన దర్శకనిర్మాతలు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకు బ్యాక్‌బోన్ కెమెరామేన్ నట్టిగారు. ఆయన మా వెన్నంటే ఉండి చాలా సాయం చేశారు. ఆయనతో పాటు సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు. కృష్ణచైతన్య నాకు చాలా ఏళ్లుగా తెలుసు. తను నా ఫ్రెండ్. తనకి ఏదైనా చెప్పేంత చనువు ఉంది. సినిమా కోసం ఏరా, పోరా అని చాలా తిట్టుకున్నాం. తమన్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. పాటలు రాసిన కె.కె., బాలాజీ, సాహితీ, నీరజ కోన, కేదార్‌నాథ్‌కి ధన్యవాదాలు. ఈ సినిమా నెంబర్ వల్ల నాకు ముఖ్యం ఈ సినిమాను నిర్మించింది పవన్‌కల్యాణ్‌గారు కాబట్టి ముఖ్యం. అలాగే త్రివిక్రమ్‌గారు.. మా నాన్నగారు. నా జీవితంలో నాకు ఇష్టమైన మొదటి ముగ్గురూ వీళ్లే. నేను ఎవరికైనా అబ్బాయికి సైట్ కొట్టాలంటే ఎవరికి కొడతానంటే త్రివిక్రమ్‌గారికేనని ఓ ఇంటర్వ్యూలో ఫన్నీగా చెప్పాను. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బ్యానర్లు కట్టి, బట్టలు చింపుకుని, పదే పదే సినిమాలు చూసి, నేరుగా ఒక్క సారి చూస్తే చాలు, ఫొటో తీసుకుంటే చాలు, మాట్లాడితే చాలు.. అని అనుకున్న వ్యక్తి పవన్‌కల్యాణ్‌గారు. ఆ రోజు నేను గట్టిగా, బలంగా అనుకున్నాను. అందుకే ఇవాళ నాకు పరిశ్రమలో పెద్ద స్ర్టెంగ్త్ పవన్‌కల్యాణ్‌గారు. త్రివిక్రమ్‌గారు. వాళ్లు నా సినిమాకు నిర్మాత కావడం నా అదృష్టం. అభిమానుల అందరి అదృష్టం. మా ఫ్యాన్స్ నుంచి కల్యాణ్‌గారికి చిన్న రిక్వెస్ట్. పవన్‌కల్యాణ్‌గారు ఏ ఫీల్డ్ కి వెళ్లినా సక్సెస్ అవుతారు. ఆయన నోటి వెంట `సినిమాలు చేయను` అని అంటే ఫ్యాన్స్ తట్టుకోలేం. ఎప్పుడో ఒక సినిమా చేయకపోతారా అనే హోప్‌తో ఉంటాం. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. కల్యాణ్‌గారి పేరును, త్రివిక్రమ్‌గారి పేరును నిలబెడుతుంది. ఏప్రిల్ 5న విడుదలవుతుంది” అని చెప్పారు.
నితిన్ మాట్లాడుతూ ‘‘16 యేళల్లో 25 సినిమాలు చేశా. ఈ ప్రయాణం చాలా ప్రత్యేకం. ‘తొలి ప్రేమ’ చూసి కథానాయకుణ్ని అవ్వాలనుకున్నా. తొలి అవకాశం ఇచ్చి, నటన నేర్పిన తేజ గారికి కృతజ్ఞతలు. 25వ సినిమా స్పెషల్ సినిమా. అంకె కోసం కాదు. నా జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, మా నాన్నగారు. ఈ ముగ్గురూ నిర్మాతలుగా మారి తీసిన చిత్రమిది. అందుకే చాలా స్పెషల్. నేను ఓ అబ్బాయి అయి ఉండి, మరో అబ్బాయికి బీటు కొట్టాలంటే.. త్రివిక్రమ్‌కే కొడతా. ఆయనంటే నాకు అంత ప్రేమ. ఎవరి సినిమాలు చూస్తూ పెరిగానో, ఎవరిని చూసి హీరో అవ్వాలనుకున్నానో.. ఎవరి సినిమా కోసం బట్టలు చింపుకున్నానో అలాంటి పవన్ కల్యాణ్ ఈ చిత్రానికి నిర్మాత. ఈరోజు నా బలం.. పవన్, త్రివిక్రమ్. పవన్ కల్యాణ్‌గారికి ఒక్కటే విన్నపం. మీరు ఏ రంగంలోకైనా వెళ్లండి. కానీ సినిమాలు మానేస్తా అని మాత్రం అనకండి’’ అన్నారు.
తమన్ మాట్లాడుతూ “సినిమా చాలా బాగా వచ్చింది. పవన్‌గారితో ఓ సెల్ఫీ తీసుకోవాలని వచ్చాను. అది కుదిరింది. ఈ సినిమాకు పనిచేసిన లిరిసిస్ట్ లు అందరికీ ధన్యవాదాలు. నట్టి విజువల్స్ చాలా బావుంటాయి. నేను హీరోలకు పనిచేసిన తొలి సినిమాలన్నీ హిట్టే. నితిన్‌తో ఇది నా తొలి సినిమా. తప్పకుండా హిట్ అవుతుంది. పవన్‌కల్యాణ్‌గారి నిర్మాణంలో సినిమా చేయడం ఆనందంగా ఉంది” అని తెలిపారు. ఆయన నిర్మాతగా తీసిన చిత్రంలో నేనో సాంకేతిక నిపుణుడిగా పనిచేయడం ఆనందంగా ఉంది. కృష్ణ చైతన్య మంచి స్నేహితుడు. స్క్రిప్టు చాలా బాగా చేశాడు. సినిమా బాగుంది. నట్టి అందించిన విజువల్స్ ప్రధాన బలం. ఆయన విజువల్స్ వల్లే ఆర్.ఆర్ బాగా చేయగలిగా’’ అన్నారు.
కృష్ణచైతన్య మాట్లాడుతూ “పవన్‌కల్యాణ్‌గారిని, త్రివిక్రమ్‌గారిని చూస్తే చాలనుకున్నాను. వాళ్లని చూడాలని నేను బలంగా కోరుకున్నానేమో. నితిన్ 25వ సినిమాను వీళ్లందరూ కలిసి నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. తమన్‌గారికి 40-50 పాటలు రాశాను. ఆయన్ని సాయిగారు అని అంటాం. అద్భుతమైన పాటలిచ్చారు. లిరిసిస్ట్ లు అందరూ చాలా బాగా రాశారు. మేఘా ఆకాష్ చాలా సెన్సిబుల్ ఆర్టిస్ట్. చెప్పగానే అర్థం చేసుకుని నటిస్తుంది. ఇందులోని నటీనటులందరూ చాలా చక్కగా నటించారు. మధు నా ఫ్రెండ్. అతని వల్లనే నితిన్ పరిచయం. మా జర్నీ ఇంతవరకూ వచ్చింది” అని చెప్పారు. తమన్‌కి చాలా పాటలు రాశా. ఈ చిత్రంలో నాకు అద్భుతమైన పాటలు ఇచ్చారు గీత రచయితలు. మేఘాకి తక్కువ చెప్పినా ఎక్కువ గ్రహిస్తుంది. నితిన్ నా స్నేహితుడు. తన 25వ సినిమా నేను చేయడం, దానికి పవన్, త్రివిక్రమ్ నిర్మాతలు అవ్వడం ఆనందంగా ఉంద’’న్నారు.
మేఘా ఆకాష్ మాట్లాడుతూ “ఈ చిత్రం యూనిట్ నాకు ఫ్యామిలీ లాంటిది. శేఖర్ మాస్టర్ నుంచి ప్రతి ఒక్కరినీ గుర్తుచేసుకోవాలి. నట్టిగారికి, తమన్ గారికి, నిఖితా రెడ్డి, సుధాకర్‌రెడ్డి, త్రివిక్రమ్, పవన్‌గారు, కృష్ణచైతన్య, నితిన్.. అందరికీ చాలా థాంక్స్. అందరికీ మా సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు. ఇలాంటి చిత్రంలో పనిచేయడం ఓ గౌరవంగా భావిస్తున్నా. మేమంతా ఓ కుటుంబంలా కలిసి పనిచేశాం. తమన్ మంచి బాణీలు అందించారు. దర్శకుడు కృష్ణ చైతన్య ప్రతి విషయాన్ని వివరించి మరీ చెప్పారు. అందరికీ నచ్చుతుంద’’న్నారు.
పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ “ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక్కోసారి మానసికంగా సపోర్ట్ కోరుకుంటూ ఉంటాం. అలాంటి సపోర్ట్ ఇస్తే బావుంటుందని `ఇష్క్` కార్యక్రమానికి వెళ్లాను. `ఇష్క్` సినిమా ఆడియోకు రావాలని నితిన్ నన్ను పిలిచినప్పుడు నేను పరాజయాల్లో ఉన్నాను. కానీ వాళ్లు మనస్ఫూర్తిగా పిలిచారని అర్థం చేసుకుని వచ్చాను. జయాలకు పొంగకుండా, అపజయాలకు కుంగకుండా నిలకడగా ఉండగలగడం గొప్ప విషయమే. కొందరు నా సినిమాలో చూసి ఐఐటీకి వెళ్లిన విద్యార్థులు కూడా ఉన్నారు. నాకూ, నితిన్‌కీ వయసు పెద్ద తేడా ఉన్నప్పటికీ, సినిమాల పరంగా అనుభవం ఐదారేళ్ల తేడానే. నితిన్ వాళ్ల నాన్నగారు నాకు ఇష్టమైన వ్యక్తి. తమన్ సంగీత దర్శకుడు కాకముందు నుంచీ `ఖుషీ`సమయం నుంచీ తెలుసు. మణిశర్మగారిని `నాకు ఓ హిందీ పాట కావాలి. థియేటర్‌లో గెంతులు వేయాలి` అని అడిగా. ఆయన బాధ్యతను తమన్ మీద పెట్టారు. ఈ సినిమాకు ఆయన మంచి బాణీలిచ్చారు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా నిర్మాతల్లో నేను ఒకడిని అయినప్పటికీ క్రూ లో చాలా మంది నాకు తెలియదు. అందరికీ మనస్ఫూర్తిగా ఒక విషయం చెబుతున్నా.. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. కృష్ణచైతన్యగారికి పెద్ద హిట్ రావాలి. చాలా మంచి స్క్రిప్ట్ చేశారు” అని అన్నారు. నితిన్ ఎలాంటి సపోర్ట్ లేకుండా.. సినీ పరిశ్రమకు వస్తే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు తెలుసు. నితిన్ జయాపజయాలకు అతీతంగా కష్టపడి పనిచేశాడు. తనకో ఎమోషనల్ సపోర్ట్ కావాలనుకున్న దశలో ‘ఇష్క్’ పాటల వేడుకకు అతిథిగా వెళ్లా. అందరి ప్రేమ వల్ల ఆ సినిమా బాగా ఆడింది. నితిన్ ఇప్పుడు 25 పూర్తి చేసుకున్నాడు. వయసులో నాకంటే చిన్నవాడే అయినా సినిమా పరంగా మా ఇద్దరి అనుభవంలో ఐదారేళ్ల తేడా. నితిన్, వాళ్ల నాన్నగారు సుధాకర్ రెడ్డి నాకు ఇష్టమైన వ్యక్తులు. కృష్ణ చైతన్య చాలామంచి స్క్రిప్ట్ చేశారు. ‘ఖుషి’లో ‘ఏ మేరా జహా’ పాట అంత బాగా రావడానికి కారణం తమన్. అప్పట్లో మణిశర్మ దగ్గర ఉండేవారు. ఈ పాట బాధ్యత అంతా మణిశర్మ తమన్‌పై పెట్టారు. ‘థియేటర్లో గంతులు వేయాలి.. ఆ పాట హిందీలో ఉండాలి’ అని తమన్‌కి చెప్పా. ఇప్పటికీ ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది. ఈ చిత్రానికీ మంచి పాటలు ఇచ్చాడు. నితిన్ మరిన్ని మంచి విజయాలు పొందాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
కొసమెరుపు తనకన్నా స్లిమ్‌గా పవన్‌కల్యాణ్‌గారు ఉన్నారని నితిన్ చెప్పగానే “నాకు సినిమాలు లేకుంటే సన్నబడిపోతాను. నాకు పెద్ద కోరికలు ఉండవు” అని పవన్ కల్యాణ్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో బి.వి.ఎన్.ఎన్ ప్రసాద్, జెమిని కిరణ్, మహేశ్వరరెడ్డి, దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తారాగణం: డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి,రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను,నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృతిక, మాస్టర్ జాయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.
సంగీతం: థమన్.ఎస్, కెమెరా: ఎన్.నటరాజ సుబ్రమణియన్, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, నృత్యాలు: శేఖర్.వి.జె, పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ; సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి, నిర్మాత: ఎన్.సుధాకర్ రెడ్డి, స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కృష్ణ చైతన్య .
Mar 18 2018
Mass Maharaj ‘Raviteja’ film first look released
On the eve of Ugadhi, Mass Maharaja Ravi Teja has revealed the first look of his new film under SRT Entertainments banner:
On the eve of Ugadhi, Mass Maharaja Ravi Teja has revealed the first look, title and release date of his new movie on twitter. Titled as “Nela Ticket” this classy mass family action entertainer is produced by Ram Talluri under SRT Entertainments banner and directed by Soggade Chinni Nayana, Raarandoi Veduka Chuddam fame Kalyankrishna Kurasala.
The film stars Malavika as heroine along with Jagapathi Babu, Brahmanandam, Jayaprakash, Raghubabu, Ali, Posani Krishna Murali, Subbaraju, Annapurnamma, Priyadarshi, Prabhas Srinu, Pruthvi, Surekha Vani and Praveen playing crucial roles.
With almost 60% shoot completed, the makers are planning to wrap it soon and release it on May 24th. Fida fame Shakthikanth Karthick is composing the music, editing by Chota K.Prasad, Art Direction by Brahma Kadali and Mukesh is handling the cinematography.
Follow Us!