‘Chal Mohanranga’ full songs release matter and stills

Aj 16X25 still DC 5X12 still NMTG 16X13 still sakshi 16X13 still times 16X25 still
After a stupendous response from the audience for the all the singles and teaser released so far, the happy makers of “Chal Mohan Ranga” are launching their jukebox on the eve of Ugadi. While Smt.Nikitha Reddy is presenting the film, Pawan Kalyan Creative Works along with Trivikram have combined with Sreshth Movies to produce Nithiin’s 25 directed by Krishna Chaitanya. Nithiin and Megha Akash are pairing up once again for this beautiful seasonal love story.
S Thaman has come up with a beautiful album which has all kinds of songs from western to regional, happy to sad, love to break up. Every song has set the bar high.
The album explains the kind of journey the audience are going to experience in theaters which has varied emotions as dictated by the story. Krishna Chaitanya being a lyricist himself hasn’t written even a single song in the album but has encouraged different lyricists for each song and every song has high lyrical value.
N Nataraja Subramanian(Natty) of “A Aa” fame who is a master of maintaining the mood of the film from opening to rolling titles has done his part to the Tee. He has captured every location at its best giving us some breath-taking visuals.
N Sudhacar Reddy who has given us some beautiful love stories like “Ishq”, “Gunde Jaari Gallanthayindhe” and “Chinnadhana Ne Kosam” has produced this film. The film is all set to release on April 5th.
Casting includes: Dr. K.V Naresh, Lissy, Rohini Hattangadi, Rao Ramesh, Sanjay Swaroop, Prabhas Srinu, Narra Srinu, Madhunandan, Pammi Sai, Pragathi, Satya, Ashu Reddy, Kireeti, Vennela Ramarao, Rajasri Nair, Ranadhir, Neelima Bhavani, Master Joy, Master Likith, Baby Krithika, Master Snehith, Master Skandan.
Cinematography: N. Nataraja Subrahmanian
Music: Thaman S.
Editing: S.R. Sekhar
Choreography: Sekhar V.J.
Fights: Stunt Silva, Ravi Verma
Story: Trivikram
Presenter: Smt. Nikitha Reddy
Producer: N. Sudhacar Reddy
Screenplay, Dialogues, Direction: Krishna Chaitanya
ఉగాది అంటే ఇంట్లో పిండి వంటలు, బంధుమిత్రుల హడావిడి, థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, యూట్యూబ్లో ఎన్నో సినిమాల పాటలు, టీజర్లు రిలీజ్ అవుతాయి. ఈ ఉగాది సందర్భంగా యువ కథానాయకుడు నితిన్, కథానాయిక మేఘా ఆకాష్ తో కలసి నటించిన “ఛల్ మోహన్ రంగ” చిత్ర ఆల్బిమ్ ని విడుదల చేశారు.
ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు విడుదలైన మూడు పాటలులాగానే ఆల్బమ్లో కొత్తగా విడుదలైన మిగతా మూడు పాటలు వివిధమైన శైలిలో ఉన్నాయి.
ఆల్బమ్ లో ప్రతీ పాటని కొత్తగా కొట్టడమే కాకుండా ప్రతీ పాటని హిట్ చేయగల అతి తక్కువ సంగీత దర్శకులలో ఒకరు థమన్. మాస్ నుంచి క్లాస్ వరకు, ప్రేమ నుంచి విరహం వరకు  , సంతోషం నుంచి బాధ వరకు, అనింటిని ఎంతో బాగా స్వరపరిచి ఒక పూర్తిస్థాయి ఆల్బమ్ ఇచ్చారు.
యు.ఎస్, ఊటీ, హైదరాబాదలలో ఎన్నో  అందమైన ప్రదేశాలలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి  ఎన్. నటరాజన్ సుబ్రహ్మణ్యన్ సినీమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్ర నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు.
చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం: డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి, రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృతిక, మాస్టర్ జాయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.
సంగీతం: థమన్.ఎస్,
కెమెరా: ఎన్.నటరాజ సుబ్రమణియన్,
కూర్పు: ఎస్.ఆర్.శేఖర్,
నృత్యాలు:శేఖర్.వి.జె,
పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ;
సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి
నిర్మాత: ఎన్.సుధాకర్ రెడ్డి
స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కృష్ణ చైతన్య

పద్మశ్రీ బ్రహ్మానందానికి ‘హాస్యనట బ్రహ్మ’ బిరుదు ప్రదానం

BGP_0646 BGP_0705 BGP_0753 BGP_0759 BGP_0796 BGP_0925 BGP_0948 BGP_0160 BGP_0164 BGP_0242 BGP_0244 BGP_0383 BGP_0517 BGP_0577 BGP_0628

మహబూబ్ నగర్ లో వైభవంగా జరిగిన డా:టి. సుబ్బరామిరెడ్డి కాకతీయ లలితా కళాపరిషత్, కాకతీయ కళా వైభవ మహోత్సవం వేడుక 

  కాకతీయ కళావైభవానికి రాజకీయంతో సంబంధం లేదని, కళలను ప్రోత్సహించేందుకే దానిని ఏర్పాటు చేసినట్లు కాకతీయ లలిత కళా పరిషత్‌ ఛైర్మన్‌ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందానికి ‘హాస్యనట బ్రహ్మ’ పురస్కారంతో ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. 

హాస్యనటుడు బ్రహ్మనందం సార్థక నామధేయుడని, ఆయన పేరులోనే ఆనందం ఉందని తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి పేర్కొన్నారు. యావత్‌ జాతికి హాస్యాన్ని పంచుతున్న మహానటుడని కొనియాడారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం రాత్రి టీఎస్‌ఆర్‌ కాకతీయ లలితా కళాపరిషత్‌ ఆధ్వర్యంలో కాకతీయ కళా వైభవ మహోత్సవం నిర్వహించారు. 1100 చిత్రాలు పూర్తి చేసుకున్న బ్రహ్మానందంకు సంస్థ ఆధ్వర్యంలో ‘హాస్యనటబ్రహ్మ’ బిరుదును ప్రదానం చేశారు. బ్రహ్మానందం చేతికి మధుసూధనాచారి బంగారు కంకణం తొడిగి వీణను, జ్ఞాపికను బహూకరించారు. సభాపతి మాట్లాడుతూ.. కాకతీయ కళా వైభవం కార్యక్రమాల ద్వారా కాకతీయుల కీర్తిని విశ్వవ్యాప్తం చేయడానికి సుబ్బరామిరెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. బ్రహ్మానందం, కార్యక్రమ నిర్వాహకుడు, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి జిల్లాలో కాకతీయ కళా వైభోత్సవాలు నిర్వహిస్తానన్నారు.

ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగువారి సత్తా శక్తిని అందరికీ తెలియజేస్తానని, తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోనూ కాకతీయ కళావైభవోత్సవాన్ని నిర్వహిస్తానని అన్నారు. బ్రహ్మానందం నటనకు జీవం పోస్తారని, ఆయన ఓ జీనియస్‌ నటుడని కితాబిచ్చారు. 1100 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించిన గొప్ప నటుడని పేర్కొన్నారు.

ఎంపీ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ కళ ఈశ్వరశక్తిగా భావించాలన్నారు. 700 ఏళ్ల క్రితం ఇక్కడ కాకతీయ వైభవం సాగింది. తెలుగుజాతి కళావైభవాన్ని మహోన్నతస్థాయికి తీసుకపోయిన మహానీయులు కాకతీయులు అని కొనియాడారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ బ్రహ్మానందం నటనా ప్రతిభకు పాలమూరులో సన్మానించటం మరువలేని  అనుభూతిగా అభివర్ణించారు. 

ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘పాలమూరు ప్రజలకు కన్నుల పండగ చేసేందుకు వచ్చిన సినీ ప్రముఖులకు ధన్యవాదాలు. ఇది మామూలు కార్యక్రమం కాదు. కాకతీయ కళా వైభవ మహోత్సవాన్ని హైదరాబాద్‌ శిల్ప కళావేదికలో నిర్వహించిన తర్వాత వరంగల్‌లో చేస్తానని సుబ్బరామిరెడ్డిగారు నాతో అన్నారు. కానీ, పాలమూరు ప్రజల కోసం ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరా. బ్రహ్మానందం గారితో 1992లో ‘ప్రేమ ఎంతమధురం’అనే సినిమాను నేను తీస్తే దానిలో ఆయన నటించారు. విదేశాల్లో 25ఏళ్లు ఉన్న తర్వాత 1996లో నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. అప్పుడు జీవిత రాజశేఖర్‌ ఎనిమిది నెలల గర్భిణి ఉండి కూడా నా తరపున ప్రచారం చేశారు. వారి అందించిన సహకారం మర్చిపోలేనిది.  ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ కళాలకు ప్రాంతాలతో సమానంలేదని, కళాకారులను తెరాసా ప్రభుత్వం సముచితమైన గౌరవం ఇస్తుందన్నారు. కేంద్ర మాజీమంత్రి సూదిని జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ గొప్పనటుడు బ్రహ్మనందాన్ని పాలమూరు వేదికగా సన్మానించటం అభినందనీయమన్నారు.   ఇక్కడ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుబ్బరామిరెడ్డిగారికి ధన్యవాదాలు’’ అని అన్నారు.

 
సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.. సినీ ప్రముఖుల హాజరు పాలమూరువాసులను ఆనందాన్ని పంచింది.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడితో పట్టణం పులకించింది.. టీఎస్‌ఆర్‌ కాకతీయ లలిత కళా పరిషత్తు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైధానంలో కాకతీయ కళా వైభవ మహోత్సవం కన్నులపండువగా కొనసాగింది. ఎంపీ సుబ్బరామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సినీనటుడు బ్రహ్మానందంను హాస్య నటబ్రహ్మ పురస్కారంతో సత్కరించారు. 
శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రి జూపల్లి, ప్రణాళిక విభాగం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితోపాటు వంశీచంద్‌రెడ్డి, సినీ నటుడు, అందోల్‌ ఎమ్మెల్యే బాబుమోహన్‌, పురపాలిక ఛైర్‌పర్సన్‌ రాధ, నటులు జయప్రద, జీవిత, రాజశేఖర్‌, శ్రద్ధాదాస్‌, అలీ, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎల్లూరి శివారెడ్డి, గోరటి వెంకన్న, జంగిరెడ్డి, నీరజాదేవి, పద్మాలయ ఆచార్య తదితరులను  శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.జడ్పీ ఛైర్మన్‌ భాస్కర్‌ మాట్లాడుతూ సినీమాలపై ఉన్న తన మక్కువను వేదికపై పంచుకున్నారు. హమాలీ పని చేసే తనకు సినిమాలతోనే ఆహ్లాదం ఉండేదని చెప్పారు. బాద్మి శివకుమార్‌, లయన్‌ విజయ్‌కుమార్‌, వంశీరామరాజు, ధర్మారావు, మనోహర్‌రెడ్డి, లయన్‌ నటరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Will take glory of Kakatiyas beyond Telangana: TSR

Dr T Subbarami Reddy, Member of Parliament, in his address on the occasion of felicitating Tollywood comedian Dr K Brahmanandam in ‘Kakatiya Kala Vaibhava Mahotsavam’ held in Mahabubnagar town on Sunday, said such programmes to celebrate the art and culture of Kakatiyas would be held not only in every district across Telangana, but also in major cities of Andhra Pradesh, Maharashtra, Karnataka and Tamil Nadu, as the Kakatiya dynasty was spread across all these States around 700 years ago.

Describing the sculptures which were carved during the reign of Kakatiya rulers as magnificent art forms which emanated power from within, he said that even Sri Krishnadevaraya was inspired by such art forms.

 He made it clear that there was no politics in celebrating the grandeur of the Kakatiya art and culture.

AP Jithender Reddy, Mahabubnagar MP, speaking on the occasion, said that there was a time when people used to make fun of Telangana dialect, but after the formation of Telangana, Chief Minister K Chandrashekar Rao had taken the dialect to the world stage by conducting Telugu Maha Sabha in a grand way.

Mahabubnagar MLA V Srinivas Goud reminded everyone that it was the wonderful engineering of Kakatiya rulers that Telangana could get so many irrigation tanks which were still intact and were the main source of irrigation for the State.

Jayaprada, Shraddha Das, Jeevitha, Babu Mohan, Srinivas Reddy, Raghu Babu, Aali, former MP Jaipal Reddy, MLC Ponguleti Srinivas Reddy, Nagarkurnool MP Nandi Yellaiah, Devarkadra MLA Alla Venkateshwar Reddy, Municipal Chairperson Radha Amar and several eminent personalities attended the event.

 

పద్మశ్రీ అవార్డు గ్రహీత, డా. బ్రహ్మానందంకు హాస్యనట బ్రహ్మ బిరుదు

1100 చిత్రాల్లో కమెడియన్‌గా నటించి మెప్పించిన నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత, డా. బ్రహ్మానందంకు హాస్యనట బ్రహ్మ అనే బిరుదును కాకతీయ కళావైభవ మహోత్సవంలో ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో…

టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ”కాకతీయ లలిత కళాపరిషత్తు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వైభవంగా అప్పటి కాకతీయుల ఖ్యాతిని తెలియజేయాలనే ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సభాపతి సిరికొండ మధుసూదనాచారి, ఎస్‌.జైపాల్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతుంటే.. జూపల్లి కృష్ణారావు, డా.సి.లక్ష్మారెడ్డి తదితరులు గౌరవ అతిథులుగా హాజరు కానున్నారు. చలన చిత్ర పరిశ్రమకు చెందిన జయప్రద, డా.రాజశేఖర్‌, జీవిత, బాబూమోహన్‌, పరుచూరి గోపాలకృష్ణ, అలీ, కవిత, కేథరిన్‌ థ్రెసా, హంసానందిని, శ్రద్ధాదాస్‌, పృథ్వీ, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి తదితరులను కాకతీయ పురస్కారాలతో సత్కరిస్తాం. అలాగే మహబూబ్‌ నగర్‌కు చెందిన సాహిత్య, సంగీత, నృత్య కళాకారులు ప్రొడ. ఎల్లూరి శివారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, గొరేటి వెంకన్న, చిక్కా హరీశ్‌, జంగిరెడ్డి, పద్మాలయా ఆచార్య, వంగీశ్వర నీరజ తదితరులను కాకతీయ అవార్డుతో సత్కరిస్తాం” అన్నారు.

శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ – ”బ్రహ్మానందం గొప్ప నటుడు. తెలుగు రాష్ట్రాల్లో మరచిపోలేని నటుడు. కళాకారులకు, కవులకు, నటులకు కుల, మత, ప్రాంతీయ బేదాలుండవు. కని వినీ ఎరుగని రీతిలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్‌ చేస్తాం” అన్నారు.

అలీ మాట్లాడుతూ – ”కళాకారులంటే నటరాజుకి చాలా ఇష్టం. ఆ నటరాజు సుబ్బరామిరెడ్డిగారి రూపంలో వచ్చారు. ఎందుకంటే 1100 సినిమాలు పూర్తి చేసుక్ను మా అన్న బ్రహ్మానందంకు బిరుదునిచ్చి సత్కరించడం గొప్ప విషయం. మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో 1100 సినిమాలు చేయడం గొప్ప విషయం” అన్నారు.

డా.బ్రహ్మానందం మాట్లాడుతూ ”కళలకు ఎల్లలు లేవు. కళల్లో ఈశ్వరత్వం ఉంటుంది. అలాంటి ఈశ్వరుడ్ని పూజించే సుబ్బరామిరెడ్డిగారు ఈ అవార్డు వేడుకలు నిర్వహిస్తుండటం గొప్ప విషయం. ఆ దేవుడి దయ వల్ల ఎన్నో అవార్డులను స్వీకరించినప్పటికీ.. రేపు నేను తీసుకోబోయే అవార్డు విశిష్టమైందని భావిస్తున్నాను. అది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను” అన్నారుnew doc 2018-03-09 11.47.31_1 1 (1) 1 (5) 1 (2) 1 (3) 1 (4)

‘ఛల్ మోహన్ రంగ’ ‘పెద్దపులి’ అంటూ పాడుతూ చిందేస్తున్న ‘నితిన్’

               Still Peddapuli Single release 3 Open HD (1)నువ్వు పెద్ద పులినెక్కినావమ్మో గండి పేట గండి మైసమ్మ” అనగానే ప్రతీ తెలుగు అభిమాని పూనకం వచ్చినట్టు డాన్సులు వేస్తారు. ఎందుకంటే ఆ పాటలో ఉన్న ఎనర్జీ అటువంటిది. ఇప్పుడు ఈ పాటని మన యువ కథానాయకుడు నితిన్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం “ఛల్ మోహన్ రంగ”లో రీక్రియేట్ చేస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో,పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తెలంగాణ సంస్కృతిని, పెద్దమ్మ తల్లి గొప్పతనాన్ని చాటుతూ బోనాల సంబరాలలో పాడుకునే పాట “పెద్ద పులి”.  ఆ పాటని అంతే గొప్పగా, దాని స్థాయి ఏ మాత్రం తగ్గకుండా సంగీత దర్శకులు థమన్ మరియు సాహిత్య రచయిత సాహితి గారు చాలా జాగ్రత్తగా రీక్రియేట్ చేశారు.

పెద్ద పులి లాంటి పాట హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అయితే, అదీ తెలంగాణ వాస్తవ్యుడైన నితిన్ 25వ చిత్రం అయితే, దానికి థమన్ తన ఫోక్ ఇన్స్ట్రుమెంట్స్ తో దానిని వేరే స్థాయికి తీసుకుని వెళ్తే, వీటన్నిటికీ మించి ఆ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో నితిన్ మాస్ స్టెప్స్ వేస్తే, ఇంకేముంది, థియేటర్లో ఫ్యాన్స్ కి  సంబరాలే…..

సాహితి గారు అసలైన తెలంగాణ పదాలను వాడుతూ, పాటలో ప్రాస యాస ఏ మాత్రం తగ్గకుండా, వినడానికి పాడుకోవడానికి సులభంగా ఉండేలా వ్రాసారు.

ఈ మధ్యన ఫోక్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన రాహుల్ సిపిలిగంజ్ ఈ పాటని పాడారు. ఈ గీతం నిన్న రాత్రి వరంగల్ లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ లో యువత కేరింతలు,ఉత్సాహాల నడుమ విడుదల అయింది.

ఈ చిత్రానికి  ఎన్. నటరాజన్ సుబ్రహ్మణ్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్ర నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు.

చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం: డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి,రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను,నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృతిక, మాస్టర్ జాయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.

సంగీతం: థమన్.ఎస్,

కెమెరా: ఎన్.నటరాజ సుబ్రమణియన్,

కూర్పు: ఎస్.ఆర్.శేఖర్,

నృత్యాలు: శేఖర్.వి.జె,

పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ;

సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి

నిర్మాత: ఎన్.సుధాకర్ రెడ్డి

స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కృష్ణ చైతన్య

How much ever we transform and adapt to the modern culture and influenced by the western world, we still have our roots here and when ever we get the taste of it, it brings out the local feeling in us irrespective of the place, profession and situation we are in. And “Pedda Puli” is one song that tops the list.

“Pedda Puli” those two words give dance vibes to any music lover especially in both the telugu speaking states. It’s a telangana folk song performed by various folk artists during bonalu festival where the song poetically explains the heroic deeds of Gandi Maisamma, one of the famous telangana local goddesses.

And now the song has been recreated by director krishna chaitanya and music director Thaman for the film “Chal Mohan Ranga”. Pawan Kalyan Creative Works and Trivikram have combined with Sreshth Movies for Nithiin’s 25 directed by Krishna Chaitanya of “Rowdy Fellow” fame. Nithiin and Megha Akash are pairing up once again for this beautiful seasonal love story.

Hero introduction songs are always done keeping fans in mind and this being nithiin’s 25th movie, director krishna chaitanya has come up with this thought and blended it so well with the situation.
The song takes off when the hero gets his US visa clearance and is all high on celebration mode. And it’s being  bonalu time, the energy around him takes his celebrations to next level.

Sahithi who is famous for his folk songs has written this song. His lyrics are a major asset to the song. He has come up with proper telangana words to match the song tempo without ruining the original song at any point.

And this time thaman used various kinds of drums especially folk ones to showcase the culture and the tradition of the song i.e. being carried through years. And this has actually enhanced the energy of the song.

N.Sudhacar Reddy, the producer of the movie has sourced everything for the song. From bringing in various kinds of folk performers to recreating the overall bonalu setup, he has done it all.

And Natty (T. Natarajan Subrmanian) has used the complete setup with the help of choreographer Sekhar.V.J. capturing each and every detail possible to give audience the real festival feel on the screen.

With the new found telugu folk singer Rahul Sipligunj holding the mic once again for this song, its all set to take audience for a folk ride bringing everyone on to the dance floor. Fans go merry in theaters from April 5th as the film is all set to release.

Casting includes: Dr. K.V Naresh, Lissy, Rohini Hattangadi, Rao Ramesh, Sanjay Swaroop, Prabhas Srinu, Narra Srinu, Madhunandan, Pammi Sai, Pragathi, Satya, Ashu Reddy, Kireeti, Vennela Ramarao, Rajasri Nair, Ranadhir, Neelima Bhavani, Master Joy, Master Likith, Baby Krithika, Master Snehith, Master Skandan.

 

Cinematography: N. Nataraja Subrahmanian

Music: Thaman S.

Editing: S.R. Sekhar

Choreography: Sekhar V.J.

Fights: Stunt Silva, Ravi Verma

Story: Trivikram

Presenter: Smt. Nikitha Reddy

Producer: N. Sudhacar Reddy

Screenplay, Dialogues, Direction: Krishna Chaitanya

 

శ్రీదేవి జ్ఞాపకాలలో చిత్ర పరిశ్రమ ప్రముఖులు

 1111 (1) 1111 (2) 1111 (3) 1111 (4) 1111 (5) 1111 (8) 1111 (9) 1111 (10) 1111-(6) 1111-(7)

దక్షిణాదితో పాటు ఉత్తరాది సినిమాలో కూడా నటిగా తనదైన ముద్రను చూపించి 300 సినిమాల్లో నటించి మెప్పించిన నటీమణి శ్రీదేవి. ఇటీవల ప్రమాదవశాతు దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ పరిశ్రమ ఆమెకు సంతాపాన్ని ప్రకటిస్తూ సంస్మరణ సభను నిర్వహించారు.  శ్రీదేవి జ్ఞాపకాలతో మరోసారి తల్లడిల్లిపోయింది తెలుగు చలన చిత్రపరిశ్రమ. ఆదివారం హైదరాబాద్‌లో టి.సుబ్బిరామిరెడ్డి కళా పరిషత్‌ ఆధ్వర్యంలో శ్రీదేవి సంతాప సభ జరిగింది. తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు నటీ   నటులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ‘శ్రీదేవి మళ్లీ శ్రీదేవిగానే పుట్టాలి’ అని అభిలషించారు. ఈ కార్యక్రమంలో కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి, కృష్ణంరాజు, జయప్రద, జయసుధ, అమల, కోటశ్రీనివాసరావు, కవిత, జీవిత, రాజశేఖర్‌, సి.కల్యాణ్‌, పి.సుశీల, నివేదాథామస్‌, బి.వి.ఎస్‌,ఎన్‌.ప్రసాద్‌, ఉపాసన, పరుచూరి గోపాలకృష్ణ, బాబూ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ”శ్రీదేవితో నాకు నలబై సంవత్సరాలుగా మంచి పరిచయం ఉంది. అలాంటి వ్యక్తి చనిపోయిందని తెలయగానే నాతో పాటు యావత్‌ భారతదేశం షాక్‌ అయింది. మా అమ్మాయితో చాలా సన్నిహితంగా ఉండేది. మంచి నటే కాదు.. మంచి హ్యుమన్‌ బీయింగ్‌. ఎంతో సరదాగా, సంప్రదాయంగా, నవ్వుతూ ఉండేది. సినీ పరిశ్రమ నుండి ఇంత మంది పెద్దలు వచ్చారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు అమ్మాయి 70 సినిమాలకు పైగా బాలీవుడ్‌లో సినిమాలు చేయడం అంటే మాటలు కాదు. లమ్హే, చాందినీ సినిమాలను నేను, యశ్‌చోప్రాలు నిర్మించాం. మళ్లీ వచ్చే జన్మలో తెలుగు అమ్మాయిగానే పుట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు. ‘‘అందరూ అనుకుంటున్నట్టు శ్రీదేవికి ఆర్థిక సమస్యలేం లేవు. శ్రీదేవి కెరీర్‌లో పుంజుకుంటున్న దశలోనే ఆమె మాతృమూర్తి చెన్నైలో స్థలాలు కొన్నారు. ‘ఈ స్థలాలు అమ్మేసి.. హైదరాబాద్‌లో ఏమైనా కొనాలా’ అని నన్ను శ్రీదేవి చాలాసార్లు సలహా అడిగేది. హిందీలో ఆమెతో రెండు చిత్రాలు నిర్మించా. అవి రెండూ బాగా ఆడాయి’’

కృష్ణంరాజు మాట్లాడుతూ – ”సాధారణంగా చచ్చినవారి కళ్లు చారడేసి అంటుంటారు. అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత వారిని ఎక్కువగా పొగుడుతూ ఉంటాం. కానీ శ్రీదేవి కళ్లు బ్రతికుండగానే చారడేసి కళ్లు అమ్మాయి అయింది. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమెతో నాలుగైదు సినిమాలే చేశాను. అద్భుతమైన నటి. కొన్ని క్యారెక్టర్స్‌ను ఆమె తప్ప మరెవరూ చేయలేరనిపించేలా నటించింది. మంచి సంస్కారం ఉన్న నటి. బొబ్బిలి బ్రహ్మాన్న సినిమాను హిందీలో తీసినప్పుడు తనే హీరోయిన్‌గా నటించింది. అడిగిన వెంటనే డేట్స్‌ అడ్జస్ట్‌ చేసి నటించింది. నాతోనే కాదు.. తను నటించిన సినిమాల్లో అందరితో మంచి సహకారాన్ని అందించింది. అన్ని భాషల్లో నటించిన శ్రీదేవిగారు అన్నింటిలో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అన్నారు.
‘‘శ్రీదేవి నన్నెప్పుడూ ‘సర్‌’ అని పిలిచేది. పెద్దలంటే ఆమెకు చాలా గౌరవం. నటిగా కొన్ని పాత్రలు ఆమె తప్ప ఎవ్వరూ చేయలేరు. ఆమధ్య కలిసినప్పుడు ‘చిత్రసీమకొచ్చి నాకు యాభై ఏళ్లు. మీకూ యాభై ఏళ్లయ్యాయి. దీన్ని ఓ వేడుకగా జరుపుకోవాలి. ఆ కార్యక్రమానికి నేను తప్పకుండా వస్తా’ అంది. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ హిందీలో తీశాం. అందులో కథా   నాయికగా శ్రీదేవి నటించింది. నేను ఫోన్‌ చేయగానే ఒప్పుకొంది. ఆ సినిమా పూర్తయ్యేంత వరకూ బాగా సహకరించింది’’

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ – ”నేను లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు తను బాలనటిగా నటించిన బడిపంతులు సినిమా చూశాను. తను నటిగా 50 ఏళ్ల అనుభవాన్ని సంపాదించుకున్నప్పటికీ నేను తనను మొదటిసారి చూసిన చిన్నపిల్ల రూపమే మనసులో నిలిచిపోయింది. తనతో ‘అనురాగదేవత’ సినిమాకు మేం తొలిసారి కలిసి పనిచేశాం. రామానాయుడుగారు ఆమెను చిత్రసీమకు దేవతను చేస్తే.. ఎన్టీఆర్‌గారు అనురాగదేవతను చేశారు. అనుభవ పూర్వకంగా స్వర్ణోత్సవం జరుపుకోవాల్సిన నటి. మళ్లీ ఆవిడ పుట్టి మనకు కనపడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

 

‘‘మన కళ్ల ముందు నుంచి శ్రీదేవి వెళ్లిపోవడం అన్యాయం. ‘అనురాగ దేవత’ షూటింగ్‌ రవీంద్ర భారతిలో జరుగుతోంటే మేం వెళ్లాం. ‘చూసుకో పదిలంగా’ అనే పాట.. ప్రేక్షకుల్లో కూర్చుని చూశాం. అదో జ్ఞాపకం. రామానాయుడు ‘దేవత’ చేశారు. ఎన్టీఆర్‌ ‘అనురాగ దేవత’ చేశారు. అలాంటి దేవత.. స్వర్ణోత్సవం జరుపుకోవాల్సిన సమయంలో కన్నీటి వీడ్కోలు ఇవ్వాల్సిరావడం బాధాకరమైన విషయం’’

 

జయప్రద మాట్లాడుతూ – ”ఈరోజు మనసులో తెలియని బాధ. శ్రీదేవి నటిగా ప్రతి విషయంలో తనకు తానే పోటీగా నిలబడింది. మేం ఇద్దరం కలిసి తెలుగు, హిందీలో 15 సినిమాలకు పనిచేశాం. ఇద్దరి మధ్య హెల్దీ మధ్య కాంపిటీషన్‌ ఉండేది. తను నిజంగా ఈరోజు మన మధ్య లేదని అంటే నమ్మలేకుండా ఉన్నాను. తను పిల్లల విషయంలో కూడా ఎంతో కేర్‌ తీసుకునేది. జాన్వీని తనంతటి హీరోయిన్‌ను చేయాలనుకునేది.‘‘తనతో పదిహేను సినిమాలు చేసుంటా. పోటా పోటీగా నటించేవాళ్లం. మామధ్య ఓ ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. అందం, నాట్యం, డైలాగ్‌.. ఇలా అన్నింట్లోనూ పోటీ ఉండేది. శ్రీదేవి అవ్వాలన్న కోరికతో చాలామంది ఈ పరిశ్రమలోకి వచ్చారు. అతిలోక సుందరి తెలియని లోకాలకు వెళ్లిపోయింది. మంచి తల్లిగా తన బిడ్డల్ని తీర్చిదిద్దాలన్న తపన ఉండేది

అమల అక్కినేని మాట్లాడుతూ – ”శ్రీదేవిగారు బ్యూటీఫుల్‌, ఫాబులస్‌ ఆర్టిస్ట్‌. అనుకోకుండా ఆమె మనల్ని విడిచి పెట్టి పోవడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అన్నారు.

పి.సుశీల మాట్లాడుతూ – ”దేవలోకం నుండి వచ్చిన సుందరిలాగా మన ముందకు వచ్చి.. మనల్ని మరపించి మళ్లీ తన లోకానికి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. తనకు 8 ఏళ్ల వయసున్నప్పుడు తన కోసం పాట పాడాను. తను హీరోయిన్‌గా నటించిన సినిమాలకు నేను పాటలు పాడాను. మనకు తీపి గుర్తులను మిగిల్చి వెళ్లిపోయారు. ఆమె మనసుకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అన్నారు. ‘‘దేవలోకంలోంచి వచ్చిన సుందరిలా మన కళ్ల మందు కదిలి.. మళ్లీ తన లోకానికి వెళ్లిపోయింది. తన ఎనిమిదేళ్ల వయసులో తనకు నేను ఓ పాట పాడినందుకు గర్విస్తున్నాను. హీరోయిన్‌గా తొలి సినిమాలోనూ నేనే పాట పాడాను. అది  భగవంతుడు నాకిచ్చిన అవకాశం’

జగపతిబాబు మాట్లాడుతూ – ”శ్రీదేవిగారు అమర్‌ రహే. ఆమె కుటుంబానికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.

జయసుధ మాట్లాడుతూ – ”శ్రీదేవి మనకు దూరం కావడాన్ని ఆమెతో నటించిన సహనటిగా జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమెతో కలిసి 9-10 సినిమాల్లో నటించాను. చైల్డ్‌ సూపర్‌స్టార్‌గా ఉన్నప్పుడు శ్రీదేవిని చాలాసార్లు చూశాను. తనతో కలిసి హీరోయిన్‌గా కూడా నటించాను. మా ఫ్యామిలీతో తనకు మంచి అనుబంధం ఉండేది. ఆమె మనసుకు శాంతి కలగాలి. ఆమె ఇద్దరి అమ్మాయిలు గొప్ప హీరోయన్స్‌గా పేరు తెచ్చుకుని, వారి తల్లి కోరికను తీరుస్తారని నమ్ముతున్నాను” అన్నారు. ‘నేనూ, శ్రీదేవి పది చిత్రాల వరకూ నటించాం. బాల నటిగా ఉన్నప్పుడు.. తనని చూడ్డానికి ప్రత్యేకంగా ఆమె ఇంటికి వెళ్లా. అలా నేను చూసిన మొదటి నటి ఆమె. మా అమ్మగారు, శ్రీదేవి అమ్మగారు మంచి స్నేహితులు. చెల్లాయి సుభాషిణితో కూడా సాన్నిహిత్యం ఉండేది. నన్నెప్పుడూ ‘జయసుధగారూ’ అనే పిలిచేది. శ్రీదేవి ప్రతి పుట్టిన రోజుకీ చెన్నై తప్పకుండా వెళ్లేదాన్ని. శ్రీదేవి మరణవార్త కలచివేసింది. నాకేదో అయిపోతోందన్న భయం వచ్చేసింది. ముంబైకి కూడా వెళ్లి చూడాలనిపించలేదు. కనీసం టీవీ కూడా చూడలేదు. చివరి సారి తన మొహం చూడాలనుకుని కేవలం ఇరవై సెకన్ల పాటు టీవీ ఆన్‌ చేశా. ఆమె పార్థివ దేహం చూస్తుంటే చిన్నప్పటి శ్రీదేవిలా కనిపించింది

సి.కల్యాణ్‌ మాట్లాడుతూ – ”శ్రీదేవిగారు చిరస్థాయిగా మన మనస్సుల్లోనే ఉన్నారు. నటిగా ఆమె ఏ రోజు ఏ నిర్మాతను, దర్శకుడిని నొప్పించలేదు. కానీ ఈ ఏడాది మన అందరినీ నొప్పించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బోనీ, జాన్వీ, ఖుషీలు సహా అందరికీ ఆ దేవుడు ఆత్మ స్థైరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

డా.రాజశేఖర్‌ మాట్లాడుతూ – ”శ్రీదేవిగారి మరణవార్త విని చాలా షాక్‌కు గురయ్యాం. ఆమె తండ్రి ఆయ్యప్పన్‌గారితో మా నాన్నకు మంచి అనుబంధం ఉండేది. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఆమె ప్రతి భారతీయుడి కుటుంబంలో భాగమైన నటి. ఆమె కుటుంబానికి ఆ దేవుడు గుండె ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

కోటశ్రీనివాసరావు మాట్లాడుతూ – ”నేను శ్రీదేవిగారితో కలిసి రెండు, మూడు సినిమాల్లో పనిచేశాను. ఆ దేవుడు నటిగా పుట్టించాడు. ఆమె యాబై ఏళ్లు నటించింది. మళ్లీ దేవుడు దగ్గరికే వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ – “జ‌గ‌దేకవీరుడు అతిలోక సుంద‌రి` స‌హా మ‌రో చిరంజీవి సినిమాలో శ్రీదేవిగారు చిరంజీవిగారితో క‌లిసి న‌టించారు. నాకు స్నేహితుడైన బోనీ క‌పూర్, శ్రీదేవిని పెళ్లి చేసుకున్న కొత్త‌లో వాళ్ల ఇంటికి వెళ్లాను. ఆ స‌మ‌యంలో ఆమె ఇల్లాలిగా చేసిన గౌర‌వం చూసి నేను స్థానువైయ్యాను. ఎందుకంటే ఆమె మ‌న దృష్టిలో ఉన్న స్థాయి వేరు కాబ‌ట్టి. నేను మ‌న‌సులో ఏడ్చాన‌ని అప్పుడు అశ్వ‌నీద‌త్‌గారితో చెప్పాను. ఆమెను మ‌ర‌చిపోలేం. రామ్‌గోపాల్ వ‌ర్మ రాసిన లేఖ ఒక‌టి ఈ మ‌ధ్య చ‌దివాను. అది చ‌దివిన త‌ర్వాత త‌ను మ‌న‌సు ఎంత మెత్త‌నైన‌ది. ఆమె గురించి వ‌ర్మ ఎంత స్ట‌డీ చేశాడోన‌ని నాకు అర్థ‌మైంది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్న త‌ర్వాత.. బోనీ కుంటుంబం వారిని దూరం చేసింది. అందుకు కార‌ణాలు ఏమైనా కావ‌చ్చు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న‌కు ఆ కుటుంబం ద‌గ్గ‌ర కావాల‌ని.. అవుతుంద‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు. ‘‘ఓసారి బోనీకపూర్‌ ఇంటికివెళ్లా. ఓకుర్రాడు టీ తీసుకొచ్చాడు. శ్రీదేవి ఆ కప్పు తీసుకుని నా చేతుల్లో పెడుతుంటే.. ఆశ్చర్యపోయా. నా  మనసులో ఆవిడకున్న స్థాయివేరు. ఆమె కప్పు అందించడం ఒప్పుకోలేకపోయా. ఈ విషయం నాతో పాటు వచ్చిన అశ్వనీదత్‌కు చెప్పుకుంటూ కుమిలిపోయా. శ్రీదేవి మరణం తరవాత రాంగోపాల్‌ వర్మ రాసిన ఉత్తరం చదివా. వర్మ గురించి రకరకాలుగా అనుకుంటాం. కానీ వర్మ హృదయం ఎంత మెత్తనైందో తొలిసారి తెలిసింది’’     

ఈ కార్యక్రమంలో జగపతిబాబు, అమల, జీవిత, రాజశేఖర్‌, పింకి రెడ్డి, ఉపాసన, శోభనా రెడ్డి, సుమంత్‌, కోట శ్రీనివాసరావు, నరేష్‌, శివాజీరాజా, అలీ, కవిత, రేలంగి నరసింహారావు, బాబూ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.–    కార్య‌క్ర‌మంలో పాల్గొన్నవారు శ్రీదేవికి త‌మ సంతాపాన్ని తెలియ‌జేశారు.