విడుదలకు ముస్తాబవుతున్న సాయిరాం శంకర్..’రోమియో’

                                    
                                  
                                         విడుదలకు ముస్తాబవుతున్న 
                                                                   సాయిరాం శంకర్  
                 ’రోమియో’  (పూరీ రాసిన ప్రేమ కధ)
ప్రముఖ దర్శకుడు ‘పూరీ జగన్నాద్’ కధ-మాటలు అందించిన చిత్రమిది. అందుకే ఈ చిత్రానికి ‘పూరీ రాసిన ప్రేమ కధ’ అన్నది చిత్రానికి ‘ఉప శీర్షిక’ గా నిర్ణయించారు చిత్ర దర్శక,నిర్మాతలు.
యువ కధానాయకుడు ‘సాయిరాంశంకర్’ హీరోగా  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘ఆనంది ఆర్ట్ క్రియేషన్స్’ సమర్పణలో..మహర్షి సినిమా పతాకంపై  నిర్మాత వల్లూరిపల్లి రమేష్  నిర్మిస్తున్న చిత్రం ఈ ‘రోమియో’. 
పూరీ జగన్నాద్ వద్ద సహాయ దర్శకునిగా పనిచేసిన ‘గోపి గణేష్’ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నాయికగా ‘అడోనికా’ కు ఇదే తొలి తెలుగు చిత్రం.
యూరప్ నేపధ్యంలో జరిగే ప్రేమకధా చిత్రమిది. యువతరం ‘ప్రేమ’ భావాలకు నిలువుటద్దం ఈ చిత్రం. న్యూయార్క్ నగరం నుంచి వచ్చిన కధానాయిక ‘అడోనిక’, ఇండియా నుంచి వచ్చిన ‘సాయిరాం శంకర్’ ఇరువురూ ‘యూరప్’ లో కలుసుకుంటారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, ప్రేమ తదనంతర పరిస్థితులు..వీరి గమ్యం ఏ తీరాన్ని, ఎలా చేరిందన్నది ‘రోమియో; చిత్రమని దర్శకుడు ‘గోపి గణేష్’ తెలిపారు.
పూరీ జగనాద్ గారి కధ-సంభాషణలతో రూపొందుతున్న ఈ ‘రోమియో’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కావటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని గోపిగణేష్ అన్నారు, సునీల్ కాశ్యప్ సంగీతం ఈ చిత్రానికి ఓ బలం అన్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపు కుంటోంది. నవంబర్ నెలలోనే చిత్రం ఆడియో, అదే నెలలో చిత్రం విడుదల ఉంటాయని నిర్మాత వల్లూరి పల్లి రమేష్ తెలిపారు.
ఆలీ,సుబ్బరాజు,ప్రగతి ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కాశ్యప్; పాటలు: భాస్కర భట్ల,విశ్వ,రెహమాన్; కెమెరా: పి.జి.విందా; ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్; ఆర్ట్: చిన్నా; యాక్షన్: వెంకట్; కాస్ట్యూమ్స్: శ్రీ; నృత్యాలు: రఘు;
                                                     కధ-మాటలు: పూరీ జగన్నాద్ 
                                    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపిగణేష్ 
                                      నిర్మాత: వల్లూరి పల్లి రమేష్ 

కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే ‘లక్కీ’ : హీరో ‘శ్రీకాంత్’

‘చమ్మక్ చల్లో’ ప్రచార చిత్రాలు

‘చమ్మక్ చల్లో ‘ నూతన ప్రచార ఛాయా చిత్రాలు : ట్రైలర్ విడుదల

నవంబర్ 1 న విడుదల అవుతున్న ‘లక్కీ’

     నవంబర్ 1 న విడుదలవుతున్న శ్రీకాంత్ ‘లక్కీ’

శ్రీకాంత్, మేఘన జంటగా జ్యోత్స్నారెడ్డి సమర్పణలో రాజ రాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై  ’హరి’ ని దర్శకునిగా పరిచయం చేస్తూ నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న ‘లక్కీ’ చిత్రం 
విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 1 న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.
రొమాంటిక్, ఫామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించి నట్లు దర్శకుడు హరి తెలిపారు. చిత్ర నాయకా,నాయికల పాత్రలు కొత్త దనాన్ని ఆపాదించు కొని ఉంటాయి. పాత్రల మధ్య జరిగే 
సంఘటనలు, సన్నివేశాలు వినోదాన్ని అందిస్తాయి. దర్శకునిగా ఈ చిత్రం మంచి పేరు తెస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు హరి.  సాయి కార్తీక్ సంగీతం ఇప్పటికే సంగీత ప్రియులను విశేషం 
గా ఆకట్టుకొంది. అలాగే చిత్ర కదానుసారం హీరో ‘శ్రీకాంత్’ పాడిన పాత కూడా చిత్రం హైలెట్స్ లో ఒకటి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా చిత్ర కధ, కధనాల విషయంలో జాగ్రత్తలు 
తీసుకొన్నట్లు దర్శకుడు తెలిపారు. 
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో  బ్రహ్మానందం,ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చలపతిరావు, ఏవీఎస్, ఎం.ఎస్.నారాయణ, చిట్టిబాబు, కృష్ణభగవాన్, జయసుధ,,రోజా,సన, హేమ  నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: పడాల శివ సుబ్రహ్మణ్యం: సంగీతం: సాయి కార్తీక్: పాటలు; భాస్కరభట్ల రవికుమార్: కెమెరా: వి.శ్రీనివాస రెడ్డి: ఎడిటర్: నాగిరెడ్డి: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ముదిగొండ 
వెంకటేష్: సమర్పణ: జ్యోత్స్నారెడ్డి: నిర్మాత: రాజ రాజేశ్వరి శ్రీనివాసరెడ్డి: రచన,దర్శకత్వం: హరి