‘నితిన్ పెళ్లి కానుకగా విడుదల అయిన ‘రంగ్ దే’ దృశ్య మాలిక

‘నితిన్ పెళ్లి కానుకగా విడుదల అయిన ‘రంగ్ దే’ దృశ్య మాలిక

యువ కథానాయకుడు ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’  నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’.  ’తొలిప్రేమ’, మిస్టర్ ‘మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.

ఏ క్యూట్ మ్యారేజ్ గిఫ్ట్ టు అవర్ హీరో ‘నితిన్’ : ‘రంగ్ దే’ టీమ్ 


” పెళ్లికొడుకెక్కడ…
హి ఈజ్ మై బాయ్ ఫ్రెండ్ ..
అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు..
అర్జున్..ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఇద్దరి ఫ్యూచర్ దృష్ట్యా ‘అను’ ని నువ్వు పెళ్లి చేసుకోవటమే నాకు న్యాయం అనిపిస్తోంది.
చెయ్ తియ్ జస్టిస్ చౌదరి…
ఏంటి మావయ్య..నీ బతుకు ఇలా అయిపొయింది…
ఏరా…ఏడుస్తున్నావా….మరి పెట్టు..
‘నాన్నా..నవ్వుతోంది …నేను కట్టలేను నాన్నా’ 
అనే సందర్భాను సారంగా సాగే సంభాషణలతో పాటు 
‘బస్టాండే బస్టాండే…ఇక బతుకే బస్టాండే అనే సాహిత్యం తో కూడిన బీజియం తో 
ఈ  దృశ్య మాలిక  ముగుస్తుంది.
నేడు  హీరో నితిన్ వివాహమహోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రం యూనిట్   దృశ్య మాలిక  ను విడుదల చేసింది. 
‘ప్రేమ’ తో కూడిన కుటుంబ కదా చిత్రం ‘రంగ్ దే‘.  సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా  ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. . 2021 సంక్రాంతి  కానుకగా చిత్రం విడుదల అవుతుందన్నట్లుగా ఈ టీజర్ లో కనిపిస్తుంది..

నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్)

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశీ
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి

rangde21595760107 still

Announcement: A Marriage Gift to our Hero Nithiin from Team #RangDe – Poster & Still

A Marriage gift to remember for all @actor_nithiin fans & movie lovers from #TeamRangDe will be unveiled tomorrow at 4:05PM!! Stay tuned. ❤️

షూటింగ్ చేసే పరిస్థితులు లేవు – శ్రీ పవన్ కల్యాణ్ గారు

షూటింగ్ చేసే పరిస్థితులు లేవు

• సినిమాల చిత్రీకరణకు కరోనా వైరస్ ఇబ్బంది ఉంది… ఎవరికి వచ్చినా సమస్యే

శ్రీ పవన్ కల్యాణ్ గారు నటిస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమాతోపాటు క్రిష్ దర్శకత్వంలోని మరో చిత్రం సెట్స్ మీద ఉన్నాయి. జనసేన పార్టీ కార్యక్రమాలను నడుపుతూనే మరో వైపు ఆ సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటూ వచ్చారు. . కరోనా మహమ్మారి తీసుకొచ్చిన ఆరోగ్య విపత్తుతో చిత్రసీమ స్తంభించిపోయింది. సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారి సినిమాలు మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయనే చర్చ అటు ఆయన అభిమానుల్లోనూ… ఇటు చిత్ర వర్గాల్లోనూ ఉంది. జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ పవన్ కల్యాణ్ గారు కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ప్రశ్న: మీ కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి ఏమైనా చెబుతారా?
- కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే. ఆ మధ్యన కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే.. ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్ గారికి వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా.. ఇబ్బందే. వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే.

 

555 (1) 555 (4) 555 (13) 555 (12) 555 (9) 555 (17) 555 (20) 555 (24) 555 (22) 555 (16) 555 (14) 555 (7) 555 (6) 555 (5) 555 (3)