KARTIKEYA – 2

Nikhil, Chandoo Mondeti, People Media Factory’s film ‘Karthikeya – 2′ :Hero Nikhil Birthday wishes poster

Nikhil17

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ‘కార్తికేయ – 2 ‘

నిఖిల్  హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  ’కార్తికేయ – 2 ‘

1 2
2014 లో యువకథానాయకుడు నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘కార్తికేయ’ చిత్రం విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో విదితమే. అప్పటినుంచే ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘కార్తికేయ – 2 ‘ చిత్రం రూపొందనుందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికది నిజమవుతోంది.
నిఖిల్  హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం ను ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని కథానాయకుడు నిఖిల్ పుట్టినరోజు జూన్ 1 సందర్భంగా అధికారికంగా వెల్లడి చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ..’నిఖిల్ హీరోగా దర్శకునిగా నా తొలి చిత్రం ‘కార్తికేయ’ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో మా కాంబినేషన్ లో రూపొందనున్న

 ’కార్తికేయ – 2 ‘ చిత్రం పై అంచనాలు అధికంగానే ఉంటాయన్న ది వాస్తవం. దీనికి తగినట్టుగానే ఈ చిత్రం ఉంటుంది.
‘కార్తికేయ’ కు కొనసాగింపుగా ‘కార్తికేయ – 2 ‘ ఉంటూనే కధా,కధనాల విషయంలో సరికొత్తగా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ సీక్వెల్ ఈచిత్రం అన్నారు.’కార్తికేయ – 2 ‘ చిత్రం   నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. చిత్రంలోని ఇతర నటీ,నట సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాత,దర్శకులు తెలిపారు. తమ కథానాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నిర్మాత  టి.జి.విశ్వప్రసాద్,
ఎగ్జిక్యూటివ్ ప్రొద్యూసర్  వివేక్ కూచిభొట్ల. కథ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: చందు మొండేటి

Nikhil, Chandoo Mondeti, People Media Factory’s film ‘Karthikeya – 2′  

Young hero Nikhil and Swathi starrer ‘Karthikeya’ was released in 2014 and garnered huge success. Chandoo Mundeti directed the film. Thereafter, news circulated that a sequel to it will be made. It’s now happening, the sequel titled ‘Karthikeya 2’ is being directed by Chandoo Mondeti. Producers TG Vishwa Prasad and Vivek Kuchibhotla are bankrolling under the noted production house People Media Factory. The makers have made an official announcement about the sequel on June 1 on the occasion of hero Nikhil’s birthday.On this note, director Chandoo Mondeti said, “My first film Karthikeya with Nikhil in lead role turned out to be a huge hit. So, now the expectations on the sequel ‘Karthikeya-2′ will certainly be high. The film will be according to expectations. ‘Karthikeya 2’ is a sequel to Karthikeya. The film story and screenplay will be intriguing. In other words, ‘Karthikeya 2‘will be a perfect sequel”.

‘Karthikeya 2′ production works will begin soon. Makers will announce the details related to rest of the cast and crew shortly.

Producer TG Vishwa Prasad is producing the film under People Media Factory banner. Film executive producer is Vivek Kuchibhotla. Story, dialogues, screenplay, and direction: Chandoo Mondeti.