Aug 31 2023
Sithara Entertainments announced their next, #MAD – Produced by debutante Haarika Suryadevara along with Sai Soujanya!
వరుస సినిమాలతో దూసుకుపోతున్న సితార సంస్థ వైవిధ్యమైన చిత్రాలను అందిస్తోంది. అలాగే, సూర్యదేవర నాగ వంశీ తన నిర్మాణ సంస్థ ద్వారా ప్రతిభావంతులైన దర్శకులకు అవకాశాలు ఇవ్వడంపై దృష్టి సారించారు.
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తెలుగులో నాణ్యమైన సినిమాకు పర్యాయపదాలుగా మారాయి. ఈ నిర్మాణ సంస్థలు ఇతర భాషలతో పాటు పాన్-ఇండియా మార్కెట్ లోకి కూడా ప్రవేశించాయి.
తాజాగా సూర్యదేవర నాగ వంశీ, రక్షా బంధన్ సందర్భంగా తమ సంస్థ నుండి ఒక ప్రత్యేక చిత్రాన్ని ప్రకటించారు. చినబాబు కుమార్తె, నాగ వంశీ సోదరి హారిక సూర్యదేవర ఈ కొత్త చిత్రం ‘ప్రొడక్షన్ నెం.18′తో నిర్మాతగా పరిచయమవుతుండటం విశేషం. నాగ వంశీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయి సౌజన్య, హారిక సూర్యదేవర నిర్మిస్తున్నారు.
యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘మ్యాడ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవల ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
తారాగణం & సాంకేతిక నిపుణుల వివరాలు:
తారాగణం: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, అంతోనీ, శ్రీకాంత్ రెడ్డి
రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: ఎస్. నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: నవీన్ నూలి
డీఓపీ: షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి
ఆర్ట్: రామ్ అరసవిల్లి
అడిషనల్ స్క్రీన్ ప్లే: ప్రవీణ్ పట్టు, ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
ఫైట్ మాస్టర్: కరుణాకర్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
Sithara Entertainments announced their next, #MAD – Produced by debutante Haarika Suryadevara along with Sai Soujanya!
Suryadevara Naga Vamsi has become a renowned producer in Telugu Cinema. Hailing from Suryadevara Radhakrishna (China Babu)’s family, he made a phenomenal name for himself with Sithara Entertainments.
The Super Active Production House has been producing variety of movies with diverse themes in all genres. Also, Suryadevara Naga Vamsi has been concentrating on giving chances to talented filmmakers through his production house.
Sai Soujanya, established director Trivikram Srinivas wife, has been collaborating with him as co-producer. Sithara Entertainments and Fortune Four Cinema have become synonymous with quality cinema in Telugu and they have been venturing into other languages, Pan-India markets as well.
Now, Suryadevara Naga Vamsi, on the occasion of Raksha Bandhan announced a special film from his production house. The major plus is that Chinababu’s daughter Haarika Suryadevara – sister of S. Naga Vamsi – is debuting as producer with this new film, #Production18. Naga Vamsi will be presenting this film while Sai Soujanya and Haarika Suryadevara produce it.
The movie has been titled MAD and it is designed to be a youthful entertainer. Narne Nithin, Sangeeth Shobhan, Ram Nithin, Sri Gouri Priya Reddy, Ananathika Sanilkumar, Gopikaa Udyan are playing lead roles in the film.
Bheems Ceciroleo who scored a huge musical blockbuster with recent Dhamaka, is composing music for the film. Shamdat Sainudeen and Dinesh Krishnan B have handled cinematography for the movie. More details about the film will be announced soon.
Cast & Crew Details:
Starring: Narne Nithin, Sangeeth Shobhan, Ram Nithin, Sri Gouri Priya Reddy, Ananathika Sanilkumar, Gopikaa Udyan
Co-Starring: Raghu Babu, Racha Ravi, Muralidhar Goud, Vishnu, Anthony, Srikanth Reddy
Written And Directed By : Kalyan Shankar
Presenter: S. Naga Vamsi
Producers: Haarika Suryadevara & Sai Soujanya
Music : Bheems Ceciroleo
Editor : Navin Nooli
DOP : Shamdat Sainudeen – Dinesh Krishnan B
Art Director : Raam Arasavilli
Additional Screenplay : Praveen Pattu & Pranay Rao Takkallapalli
Fight Master : Karunakar
Pro: LakshmiVenugopal
Banners: Sithara Entertainments & Fortune Four Cinemas
Follow Us!