Aug 16 2023
Yuvan Creates a Magical Melody Suttamla Soosi for Vishwak Sen’s Gangs of Godavari
విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం ‘సుట్టంలా సూసి’ మ్యాజికల్ మెలోడీ స్వరపరిచిన యువన్
*డిసెంబర్ 8 న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదల
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలు గోదావరి డెల్టా నేపథ్యంలో పీరియడ్-గ్యాంగ్‌స్టర్-డ్రామా గా రూపొందుతోన్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే చిత్రం కోసం యువ సంచలనం విశ్వక్ సేన్‌తో చేతులు కలిపాయి.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మునుపెన్నడూ చూడని గ్రే పాత్రలో కనిపించనున్నారు. క్రూరమైన, నేరపూరితమైన చీకటి సామ్రాజ్యంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదగాలని కోరుకునే వ్యక్తి కథగా ఈ చిత్రం రూపొందుతోంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ‘డీజే టిల్లు’ చిత్రంతో ‘రాధిక’గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న నేహాశెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా, రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య మస్తిష్కంలో పుట్టిన ఆలోచన. కథ పట్ల ఎంతో నమ్మకంగా ఉన్న ఆయన సృజనాత్మకతతో చిత్రాన్ని ఎంతో అందంగా మలుస్తున్నారు.
వైవిధ్య భరిత చిత్రాలతో తమ అభిరుచిని చాటుకున్న నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ని ప్రేక్షకులను గొప్ప అనుభూతిని పంచే చిత్రంగా మలచడానికి ఏమాత్రం వెనకడుగు వేయకుండా రూపొందిస్తున్నారు.
ప్రముఖ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన స్వర కల్పనలో హృదయాన్ని హత్తుకునే మొదటి గీతం ‘సుట్టంలా సూసి’, ఆగస్ట్ 16న మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగిన వేడుకలో విడుదలైంది.
విద్యార్థుల కోలాహలం నడుమ జరిగిన ఈ మ్యాజికల్ మెలోడీ ఆవిష్కరణకు హాజరైన యువన్ శంకర్ రాజా, విశ్వక్ సేన్, గాయకుడు అనురాగ్ కులకర్ణి, నేహా శెట్టి విద్యార్థులతో ముచ్చటించి వారిలో మరింత ఉత్సాహం నింపారు.
అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ క్లాసికల్ మెలోడీ కొన్నేళ్ళపాటు ఖచ్చితంగా మన ప్లేలిస్ట్‌లలో భాగం కానుంది. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మెలోడీలను అందించడంలో దిట్ట అయిన యువన్ శంకర్ రాజా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం మరోసారి అలాంటి మెలోడిని స్వర పరిచారు. శ్రీ హర్ష ఈమని అద్భుతమైన సాహిత్యం అందించారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ఉప్పులూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచాలను పెంచాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8 న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
తారాగణం: విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
సినిమాటోగ్రాఫర్: అనిత్ మధాది
ఎడిటర్: నవీన్ నూలి
సహ నిర్మాతలు: వెంకట్ ఉప్పులూరి, గోపీచంద్ ఇన్నమూరి
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన, దర్శకత్వం: కృష్ణ చైతన్య
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
Yuvan Creates a Magical Melody Suttamla Soosi for Vishwak Sen’s Gangs of Godavari
Sithara Entertainments and Fortune Four Cinemas have collaborated with Vishwak Sen for a period-gangster-drama based in Godavari delta, Gangs of Godavari.
Mass ka Das Vishwak Sen will be seen in a never-before-seen Gray character that is seen as epitome of a person wishing to rise from Rags to Riches in a very ruthless and crime-driven dark society.
Neha Sshetty, who gained immense popularity as “Radhika” with Sithara Entertainments’ DJ Tillu is acting as leading lady in the film. Anjali is playing an important supporting role in the film.
The movie, Gangs of Godavari, has been a brain-child of writer-director Krishna Chaitanya and he is making it in his amicable style with aplomb confidence and creativity.
Producers Suryadevara Naga Vamsi and Sai Soujanya, known for their taste in diverse genres, are turning no stone unturned to make Gangs of Godavari, a must-watch epic drama for audiences to love it on big screens.
Musical Genius and Magician, Yuvan Shankar Raja, is composing music for the film. First single from his heartfelt compositions for the album, Suttamla Soosi, has been released at Malla Reddy Engineering College on 16th August.
Yuvan Shankar Raja, Vishwak Sen, singer Anurag Kulkarni, Neha Sshetty have live interacted with the college students unveiling the magical melody.
The classical melody in the vocals of Anurag Kulkarni is definitely going to be a part of our playlists for years to come. Yuvan Shankar Raja is known for composing such lasting melodies and he has done it again for Gangs of Godavari. The Beautiful Lyrics are written by Sri Harsha Emani.
Srikara Studios is presenting the film, Venkat Upputuri & Gopi Chand Innamuri are Co-Producing and Naveen Nooli is editing it.
Already first look posters and Glimpse featuring Vishwak Sen have created great buzz surrounding the film. Makers are planning for December 8th release. More details about the film will be announced soon.