’4 Letters’ audio released*

’4 Letters’ stars Eswar as the male lead.  Directed by R Raghu Raj and produced by Dommaraju Hemalatha, Dommaraju Udaykumar on Sri Chakra Creations, the youthful film’s audio is out. The audio event was held in Hyderabad on Wednesday. The rom-com also stars Tuya Chakraborthy, Anketa Maharana, Kausalya, Annapurna, Sudha and others.

The logo of the new banner was launched by producer ‘Gemini’ Kiran.  Director SV Krishna Reddy unveiled the Trailer.  The big CD was launched by Acchi Reddy and Krishna Reddy.

The occasion was graced by MAA president Shivaji Raja as the chief guest.  He said, “No matter where you are from, your love towards cinema will speak for itself.  I am glad that the producers of this film have come from New York to make this Telugu film.  I sincerely hope that this one will bring fame to the lead actors and everyone else.  Senior actor Suresh has told me ’4 Letters’ has come out really well.  I wish that Eswar will go a long way.”

SV Krishna Reddy said, “The hero’s energy levels in the songs are superb.  He has done a great job.  Eswar has a great dream.  He wants to grow as a commercial hero.  He has reached this stage because of the support given by his parents and family members.  Without parental support, it’s not easy to grow in any profession.  I pray that the attempt to give a nice entertainer to the audience will be rewarded.  I have liked the folk songs.”

Acchi Reddy said, “It’s always good if small films do well at the box office.  I trust that ’4 Letters’ is a well-made film high on quality.  I am sure that it’s going to be a big hit, having watched the songs and the trailer.  It’s not about how many stars are there in a film, how many crores of rupees have been spent.  The success of ‘Hushaaru’ says it all.  I congratulate Uday Kumar garu, who is introducing Eswar with this film.  The director has infused masala elements to attract youngsters.”

Chandrabose said, “Once, I went to the US to judge a show.  Eswar was one of the participants in the singing competition.  He is a nice singer and a good student.  He can dance very well.  Uday Kumar garu hosted me in the US and he was such a nice host.  The music director Bheems’ style is something I love.  His songs are very good for this movie.  Lyricist Suresh knows the audience’s pulse.”

Director R Raghu Raj said, “We completed the entire shoot in 75 days.  It was possible only because of my team.  We are coming up with a very good message.  Once, while coming back from the airport in Hyderabad, I happened to see a message in the cab.  It said, ‘Science is about thinking.  Engineering is about doing.  But engineers are dying’.  My cabbie told me that he is an Engineer.  A thought came to me at that time and that thought inspired me to make this movie.  I am dedicating ’4 Letters’ to all the Engineers out there.  We have touched upon a unique point in the second half.  I have tried ‘Love at seven looks’ concept.”

Producer Uday Kumar said, “Ours is a Telugu family settled in New York.  We have been there for 21 years now.  We follow Telugu traditions in the family.  My daughter is a Bharatanatyam exponent.  We wanted to make our son a doctor.  But since he told us his interest lies in acting, we sent him to acting ‘guru’ Sathyanand garu.  We are very happy that everyone is complimenting our son after seeing the trailer and the songs.  We will continue to introduce fresh talents under our banner.”

Eswar said, “I have completed my studies in the US.  I have always loved movies.  I felt nervous when I stepped in India to pursue acting.  The director planned a workshop with us actors ahead of the production works.  He fine-tuned my body language and taught me discipline.  I trained under Sathyanand garu.”

Vidyullekha Raman, Satya Krishnan, senior actor Suresh, Gowtham Raju will also be seen in the movie.  Music is by Bheems Cicerolo and cinematography is by Chitti Babu K.

The film will hit the screens on February 8.

ఈశ్వర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ, శ్రీ చక్ర క్రియేషన్స్‌ పతాకంపై దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌ నిర్మించిన సినిమా ‘4 లెటర్స్‌’. కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే… అనేది ఉపశీర్షిక. అంకిత, టువ హీరోయిన్లుగా నటించారు. ఆర్‌. రఘురాజ్‌ దర్శకత్వం వహించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది.
నిర్మాత ‘జెమిని’ కిరణ్‌ ఓం శ్రీ చక్ర క్రియేషన్స్‌ సంస్థ లోగోను విడుదల చేశారు. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా న్యూ ట్రైలర్‌ విడుదల చేశారు. నిర్మాత అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి ఆడియో బిగ్‌ సీడీ విడుదల చేశారు.
ఆడియో ఫంక్షన్‌కి అతిథిగా హాజరైన ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ ‘‘సినిమా మీద ప్రేమ ఉండాలి గానీ.. న్యూయార్క్‌లో ఉన్నా, అంటార్కిటికాలో ఉన్నా ఆ ప్రేమ ఎక్కడికీ పోదు. ప్రతి ఒక్కరూ సినిమా మీద ప్రేమతో ఇండస్ట్రీకి వస్తారు. ఏ రంగంలో అయినా ప్రేమ పక్కకు వెళ్తుందేమో కానీ… సినిమాలోని 24 శాఖలపై ప్రేమకు వెళ్ళదు. ఆ ప్రేమతో నిర్మాతలు న్యూయార్క్‌ నుంచి వచ్చి ఈ సినిమా చేశారు. ‘4 లెటర్స్‌’ హీరో హీరోయిన్లకు మంచి పేరు, నిర్మాతలకు లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నా. నాకు సీనియర్‌, టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌ సురేష్‌ సినిమా బాగా వచ్చిందని చెప్పారు. హీరో ఈశ్వర్‌ మంచి హీరో అవ్వాలని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘‘సినిమా సాంగ్స్‌ చూస్తే… హీరో ఎనర్జీ లెవల్స్‌ సూపర్‌. కుమ్మేశాడు. కంగ్రాచ్చులేషన్స్‌. ఈశ్వర్‌కి ఓ గొప్ప కల ఉంది. కమర్షియల్‌ హీరోగా ఎదగాలని అనుకుంటున్నాడు. ఆ కలను నిజం చేసుకోవడానికి అతని చేతుల్లో ఏం లేదు. కల నిజం కావడం ఇంపాజిబుల్‌. మరి, ఎలా నిజమైంది? అతని తండ్రి, తల్లి, కుటుంబం అండగా నిలబడి ఆ కలను నిజం చేశాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే ఓ కుర్రాడు చదువులో ఎలా పైకి రాడో… అలాగే ఓ ప్రొఫెషన్‌లో పైకి రాలేడు. ఈశ్వర్‌కి తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆశీర్వాదం ఉండబట్లే తెరపై హీరోగా వస్తున్నాడు. ప్రేక్షకులకు చక్కటి సినిమా అందివ్వాలని వారు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని అనడానికి ఈ రోజు విడుదలైన పాటలు  చక్కటి ఉదాహరణ. ఫోక్‌ సాంగ్స్‌ బావున్నాయి.
అచ్చిరెడ్డి మాట్లాడుతూ ‘‘చిన్న చిత్రాలు హిట్టయితే ఇండస్ట్రీకి మంచిది. ఒక టేస్ట్‌తో, క్వాలిటీతో, నమ్మకంతో తీసిన సినిమా ఇదని వచ్చాను. పాటలు, ట్రైలర్‌ చూశాక… ఇది చిన్న సినిమా కాదని అనిపిస్తుంది. కాబోయే పెద్ద హిట్‌ సినిమా అనిపించింది. ప్రేక్షకులకు ఎంత బడ్జెట్‌లో తీశారు? ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారు? ఎంతమంది స్టార్స్‌ ఉన్నారు? అనేది పాయింట్‌ కాదు. సినిమా ఇంట్రెస్టింగ్‌గా, మనకు నచ్చేలా ఉందా? లేదా? మనల్ని ఎంటర్‌టైన్‌ చేసిందా? లేదా? అనేది పాయింట్‌. అందుకు ఉదాహరణ… తాజా ‘హుషారు’. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడాలు లేకుండా మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తున్నారు. ఆ స్ఫూర్తితో తన కుమారుడు ఈశ్వర్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఉదయ్‌కుమార్‌గారు ఈ సినిమా చేశారు. కుర్రాళ్ళకు కావాల్సిన మసాలాను దట్టిస్తూ రఘురాజ్‌ సినిమా తీశారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. భీమ్స్‌ పేరులో ఉన్న బలం, పాటల్లో కనిపించింది’’ అన్నారు.
చంద్రబోస్‌ మాట్లాడుతూ ‘‘నేను అమెరికాకు ఓ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వెళ్ళాను. అందులో ఈశ్వర్‌ గాయకుడిగా పాల్గొన్నాడు. అతను గాయకుడు. మంచి విద్యార్థి. నాట్యం బాగా చేస్తాడు. అతడి బహుముఖ ప్రతిభకు చక్కటి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నా. అమెరికాలో ఉదయ్‌కుమార్‌ నన్ను బాగా చూసుకున్నారు. ఆయన పిలిస్తే ఇక్కడికి వచ్చా. వచ్చాక భీమ్స్‌ సంగీత దర్శకుడని తెలిసింది. భీమ్స్‌ అంటే నాకు ప్రత్యేక అభిమానం. తన శైలి, తన పద్ధతి నాకు బాగా నచ్చుతాయి. పాటలు రాసిన సురేశ్‌… ప్రేక్షకుల నాడి తెలిసిన గీత రచయిత’’ అన్నారు.
దర్శకుడు ఆర్‌ రఘురాజ్‌ మాట్లాడుతూ ‘‘సినిమాలకు చాలా అద్భుతాలు జరిగాయి. ఫస్ట్‌… సినిమా షూటింగ్‌ 75 రోజుల్లో పూర్తి చేశాం. దీనికి మా టీమ్‌ కారణం. మంచి మెసేజ్‌తో తీసిన సినిమా ఇది. ఒకరోజు ఎయిర్‌పోర్ట్‌ నుంచి వస్తుంటే… ‘సైన్స్‌ ఈజ్‌ అబౌట్‌ థింకింగ్‌. ఇంజనీరింగ్‌ అబౌట్‌ డూయింగ్‌. బట్‌, ఆల్‌ ఇంజనీయర్స్‌ ఆర్‌ డయింగ్‌’ అని ఒక బోర్డ్‌ చూశా. మా డ్రైవర్‌ని అడిగితే… అతనూ బీటెక్‌ స్టూడెంట్‌ అని తెలిసింది. అప్పుడు వచ్చిన ఆలోచనతో ఈ సినిమా తీశా. ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌కి ఈ సినిమా అంకితం ఇస్తున్నాం. సినిమా సెకండాఫ్‌లో డిఫరెంట్‌ పాయింట్‌ టచ్‌ చేశాం. ‘లవ్‌ ఎట్‌ సెవన్‌ లుక్‌’ కాన్సెప్ట్‌తో చేశా. నిర్మాతలు చాలా సపోర్ట్‌ చేశారు. నేను అడిగిన ఆర్టిస్టులు ఇచ్చారు. ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు.
నిర్మాత ఉదయ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘నేను అమెరికాలో, న్యూయార్క్‌ సిటీలో సెటిలైన తెలుగు ఫ్యామిలీ మాది. 21 ఏళ్ళుగా అక్కడే ఉంటున్నా. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటాము. మా ఇంట్లో తెలుగు వాతావరణం కనిపిస్తుంది. మా అమ్మాయి భరతనాట్యం కళాకారిణి. మా అబ్బాయిని డాక్టర్‌ చేయాలనుకున్నాం. తను యాక్టర్‌ అవుతానని చెప్పడంతో సత్యానంద్‌గారి దగ్గరకి పంపాను. సినిమాలపై ప్రేమతో ‘4 లెటర్స్‌’ తీశాం. ఇంజనీరింగ్‌ నేపథ్యంలో తీసిన ఈ సినిమాను ఫిబ్రవరి 8న విడుదల చేయాలనుకుంటున్నాం. ట్రైలర్స్‌, సాంగ్స్‌ చూసి అందరూ మా అబ్బాయి బాగా చేశాడని అంటుంటే సంతోషంగా ఉంది. ఈ సంస్థలో మరిన్ని సినిమాలు, కొత్తవారితో సినిమాలు తీయాలనుకుంటున్నా’’ అన్నారు.
హీరో ఈశ్వర్‌ మాట్లాడుతూ ‘‘నేను అమెరికాలో చదువున్నా. అయితే సినిమాలు అంటే ఎప్పటినుంచో ఇష్టం. ఇండియా వచ్చినప్పుడు కాస్త నెర్వస్‌గా ఉండేది. దర్శకుడు రఘురాజ్‌గారితో మాట్లాడితే షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యే రెండు నెలల ముందు వర్క్‌షాప్స్‌ చేద్దామన్నారు. మా దర్శకుడు నాకు బాడీ లాగ్వేంజ్‌, వర్క్‌ డిసిప్లేన్‌ అన్నీ నేర్పించారు. నేను సత్యానంద్‌గారి నటనలో శిక్షణ తీసుకున్నా. ఫ్యామిలీలో అందరికీ ఇంట్రెస్ట్‌ ఉండటంతో, ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్‌ కావాలని ఈ సినిమా నిర్మించడానికి అమ్మానాన్న అంగీకరించారు’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు భీమ్స్‌, సీనియర్‌ నటుడు సురేష్‌, కొరియోగ్రాఫర్‌ గణేష్‌, నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.VJK_1791 VJK_1854 VJK_1860batch_VJK_1736 batch_VJK_1740 batch_VJK_1744 batch_VJK_1745 batch_VJK_1748 batch_VJK_1749 batch_VJK_1750 batch_VJK_1760 batch_VJK_1761 batch_VJK_1764 batch_VJK_1767 batch_VJK_1804 batch_VJK_1809 batch_VJK_1817 batch_VJK_1826 batch_VJK_1831 batch_VJK_1832 batch_VJK_1833 batch_VJK_1837 batch_VJK_1841 batch_VJK_1843 batch_VJK_1850 batch_VJK_1853 batch_VJK_1856 batch_VJK_1860 batch_VJK_1861

నేటితరం ప్రేమకథాచిత్రం `4 లెట‌ర్స్‌` టీజర్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్ర రావు

4 LETTERS1 4 LETTERS2 4 LETTERS3 4 LETTERS4 4 LETTERS5 4 LETTERS6 4 LETTERS7 4 LETTERS9

ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్న చిత్రం `4 లెట‌ర్స్‌`.
‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక
ఈశ్వ‌ర్‌, టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శ‌కత్వంలో దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.
`4 లెట‌ర్స్‌` టీజర్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్ర రావు 
ఈ  చిత్రం టీజర్ ను దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్ర రావు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’ ప్రవాస భారతీయుడైన ఈ చిత్ర నిర్మాత ఉదయ్ కుమార్ గారు నిర్మించిన ఈ చిత్రం ’4 లెటర్స్’ టీజర్ నేటి తరం యువతి యువకుల మనోభావాలకు అడ్డం పట్టేలా ఉంది. హీరో ఈశ్వర్ కు ఇది తొలి చిత్రమైనా ఎంతో చక్కగా నటించాడు. సత్యానంద్ గారి శిష్యరికం కాబట్టి చక్కని ప్రతిభ కనబరిచాడు. అతనికి చిత్రపరిశ్రమలో ఉజ్వలమైన భవిష్యత్ ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే నిర్మాత ఉదయ్ కుమార్, దర్శకుడు రఘురాజ్ లు ఈ చిత్రం తో మంచి విజయాన్ని అందుకోవాలని అభిలషించారు.
ఈ నెల ౩౦న చిత్రం ఆడియో, ఫిబ్రవరి 2 వ వారంలో చిత్రం విడుదల 
ఈ సంద‌ర్భంగా…నిర్మాత‌లు దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ మాట్లాడుతూ – “మా బ్యాన‌ర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం `4 లెట‌ర్స్‌`. ఈ చిత్రం టీజర్ ను సుప్రసిద్ధ దర్శకులు శ్రీ రాఘవేంద్ర రావు గారు విడుదల చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. ఆయనకు కృతఙ్ఞతలు. చిత్రం ద్వారా ఈశ్వ‌ర్‌ను హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. చాలా చ‌క్క‌గా న‌టించాడు. స‌త్యానంద్‌గారి వ‌ద్ద శిక్ష‌ణ తీసుకున్న ఈశ్వ‌ర్.. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు.  క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో యూత్ స‌హా అన్నీ వ‌ర్గాల‌ను ఆకట్టుకునే ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందించాం.  ఈ నెల ౩౦న చిత్రం ఆడియో,. ఫిబ్రవరి 2 వ వారంలో చిత్రం విడుదల అవుతాయని తెలిపారు.
హీరో ఈశ్వర్ మాట్లాడుతూ..’ ఎంతోమంది టాప్ స్టార్స్ ను వెండితెరకు పరిచయం చేసిన గ్రేట్ డైరెక్టర్  శ్రీ రాఘవేంద్ర రావు గారు నా తొలి చిత్రం టీజర్ ను విడుదల చేయటం, నన్ను ఆశీర్వదించటం సంతోషం గా ఉంది. ఆయన హస్తవాసి మంచిదని ఎంతో మంది అంటూ ఉంటారు. ఆయన చేతుల మీదుగా విడుదల అయిన ఈ చిత్రం టీజర్ తోపాటు, చిత్రం కూడా ప్రేక్షకాదరణకు నోచుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.
ద‌ర్శ‌కుడు ఆర్.ర‌ఘురాజ్ మాట్లాడుతూ `క‌లుసుకోవాల‌ని` త‌ర్వాత  తెలుగులో నేను డైరెక్ట్ చేసిన మూవీ ఈ 4 లెట‌ర్స్‌. టీజర్ ను గురు తుల్యులు శ్రీ రాఘవేంద్ర రావు గారి చేతులమీదుగా విడుదల అవటం ఈ చిత్ర విజయానికి శుభ సూచకం. ఆయనకు హృదయపూర్వక కృతఙ్ఞతలు. నేటి ట్రెండ్‌కు త‌గ్గ‌ట్లు సినిమాను తెర‌కెక్కించాను. ఒక రకంగా చెప్పాలంటే `4 లెట‌ర్స్‌`: నేటితరం ప్రేమకథాచిత్రం. అందుకే ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక గా పెట్టాము. ప్రేమ,పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు,అభిప్రాయాలు,వాస్తవాలు ఏమిటన్నది విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించటం జరిగింది. చిత్ర కధ,కధనాలు,సంభాషణలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగటం తో పాటు,ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి అన్నారు. హీరో ఈశ్వ‌ర్ చ‌క్క‌గా న‌టించాడు. త‌న‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. హీరోయిన్స్ టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణాలు చ‌క్క‌గా న‌టించారు. హైద‌రాబాద్‌లో టాకీ పార్ట్‌ను, బ్యాంకాక్‌లో సాంగ్స్‌ను చిత్రీక‌రించాం. నిర్మాత‌లు మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా స‌పోర్ట్ చేయ‌డంతో సినిమాను అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం పూర్తి చేశాం“ అన్నారు.
ఈశ్వ‌ర్‌, టువచ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కౌసల్య‌, అన్న‌పూర్ణ‌, సుధ‌, స‌త్య‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, సురేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు, అనంత్‌, వేణు, ధ‌న‌రాజ్, త‌డివేల్‌, విట్టా మ‌హేశ్ ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు.
సాంకేతిక నిపుణులు:
కో డైరెక్ట‌ర్‌:  రాజ‌శేఖ‌ర్ మారి శెట్టి, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  సి.భాస్క‌ర్ రాజు, పాట‌లు:  సురేశ్ ఉపాధ్యాయ‌, కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్‌, స్టిల్స్: అన్బు, డిజైన్స్‌: ఈశ్వ‌ర్‌, ఆర్ట్‌: వ‌ర్మ‌, మ్యూజిక్:  భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్ర‌ఫీ:  చిట్టిబాబు.కె
నిర్మాత‌లు: దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్, 
క‌థ‌, మాట‌లు, ఎడిటింగ్‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆర్‌.ర‌ఘురాజ్.
’4 LETTERS’ MOVIE TEASER LAUNCHED BY LEGENDARY Director SRI. K. RAGHAVENDRA RAO GARU.

The teaser of the movie ’4 LETTERS’, from Om Sri Chakra Creations launched by the legendary Sri. K. Raghavendra Rao garu at 11 a.m. today. He watched the teaser of the movie and was surprised by the wondrous performance of the hero, Eswar. He blessed Eswar believing that he has the potential to be a star in Tollywood. He appreciated the producer, Mr. Udaya Kumar Dommaraju for convening and supporting a luxuriant production. He told the director  R. RaghuRaj, that he was intrigued by the eccentric teaser and is eagerly waiting to watch the movie. The audio launch will be performed on the 30th of January along with the release of theatrical trailer of the movie. The movie will hit the big screens on the second week of February.
INTRODUCING – ESWAR
INTRODUCING – TUYA CHAKRABORTHY & ANKETA MAHARANA
KAUSALYA, ANNAPURNA,  SUDHA, SATYA KRISHNAN, VIDYU LEKHA RAMAN
SURESH, POSANI KRISHNA MURALI, KRISHNA BHAGAVAN, GOWTHAM RAJU, ANANTH  VENU, DHANRAJ, TADIVEL, VITTA MAHES
CO-DIRECTOR  RAJASEKHAR MAARISETTY
PRODUCTION CONTROLLER: C. BHASKAR  RAJU
LYRICS – SURESH UPADHYAYA
CHOREOGRAPHY – GANESH
STILLS – ANBU
DESIGNS ESHWAR
ART – VARMA
MUSIC- BHEEMS CICEROLEO
DIRECTOR OF PHOTOGRAPHY – CHITTI BABU. K

PRODUCERS – DOMMARAJU HEMALATHA  ,DOMMARAJU UDAYA KUMAR 
STORY, SCREENPLAY, DIALOGUES, EDITING, DIRECTION – R. RAGHURAJ

Adhiroh Creative Signs llp – Production No.1 Launched

KNRL7560 KNRL7613 KNRL7634 KNRL7643 KNRL7698 KNRL7702 KNRL7710 KNRL7770 KNRL7778 KNRL7780Adhiroh Creative Signs is a new production house, based in Hyderabad., started  their first venture to day at 10.00 am at Rama Naidu Studios. 

Producers sri Allu Aravind, Gemini kiran, sharrath Marar, sreenivasaraju,  Directors Chandra siddhardha, Karunakaran, kishorePardhasani(dali), jonnalagadda sreenivasaravu, sreeraam balaji, Musi Director koti an sri Professor G,Sreeraamulu Participated for this grand gala function and wished the unit for the grand success.

 The hero of the film is Udayshankar of ‘Aata Gadara Shiva’ (Telugu) fame and the heroine is Aishwarya Rajesh of ‘Kaka Muttai’ (Tamil) and ‘Kanna’ (Tamil) fame, (she is the daughter of late Actor Rajesh).  Director NV Nirmal Kumar is debuting in Telugu.  He has directed the Tamil superhit film ‘Salim’, ftg Vijay Anthony.  The Cinematographer is Ganesh Chandrra. The story is by Bhupathi Raja, a story writer of many a hit fame. 

Adhiroh Creative Signs is introducing a new Music Director Gifton Elias through this film.

The storyline of the film is a holistic family entertainer with a sports element being dealt with.

The film started rolling from today and shall continue in various schedules running through the months of January, February, March and April.

The locales would be in both the Telugu States culminating with a schedule to be shot abroad.

The remaining cast is Sanjay Swarup, Pradeep Rawat, Roopa Lakshmi and others.

Crew; Dialogues Rajendra Kumar and Madhu, Lyrics by Sri Seetharama Sastri and Suddala Ashoka Teja, Art Direction by Manivasagam

Producers – G.Sriram Raju, Bharat Ram

Director: Nv. Nirmal kumar 

 

క్రీడల నేపథ్యంలో ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్ జంటగా ‘అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ తొలి చిత్రం ప్రారంభం’
 
నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ తమ తొలి చిత్రాన్ని నేడు ప్రారంభించింది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రం నేడు హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియో లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయింది.
రామా నాయుడు స్థూడియోలో వైభవంగా ప్రారంభమైన ఈ చిత్రం  వేడుకకు ప్రముఖ నిర్మాత  శ్రీ  అల్లు అరవింద్, జెమిని కిరణ్,శరత్ మరార్, ప్రముఖ దర్శకులు చంద్ర సిద్దార్ధ, కరుణాకరన్, కిషోర్ పార్ధసాని (డాలి), జొన్నలగడ్డ శ్రీనివాసరావు, శ్రీరామ్ బాలాజీ, సంగీత దర్శకుడు కోటి, ప్రొఫెసర్ జి. శ్రీరాములు తదితరులు విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. 
 ఎన్నో ఘనవిజయం సాధించిన చిత్రాలకు కధలందించిన ప్రముఖ రచయిత భూపతిరాజా  ఈ చిత్రానికి కథ నందించారు. గిఫ్టన్ ఇలియాస్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నారు. క్రీడల నేపథ్యంలో సాగే వినోదభరితమైన కుటుంబ కధా చిత్రమిదని దర్శకుడు ఎన్ వి.నిర్మల్ కుమార్  తెలిపారు. 
నేడు ప్రారంభమైన ఈ చిత్రం ఈ నెల మరియు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే వివిధ షెడ్యూల్స్ లో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది అని చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రదేశాలలోను, విదేశాలలోను ఈ చిత్రం కథానుసారం షూటింగ్ ను జరుపుకుంటుంది అని తెలిపారు నిర్మాతలు. 
చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం.
 
నిర్మాతలు:జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్
దర్శకత్వం: ఎన్ వి. నిర్మల్ కుమార్ 

 

బహుభాషా నటుడు మాధవన్, అనుష్క శెట్టి, అంజలి, షాలిని పాండే ప్రధాన తారాగణంగా మార్చి నెలలో అమెరికా లో ప్రారంభం కానున్న ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ చిత్రం’

Photos 1 Photos 2
ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని పలుభాషలలో నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నాయి. తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు తో నిర్మితమవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రమిది. ‘హార్రర్ ధ్రిల్లర్’ గా రూపొందుతున్నఈ చిత్రంలో బహుభాషా నటుడు మాధవన్, అనుష్క శెట్టి, అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్, గోపి సుందర్, షనీల్ డియో,గోపి మోహన్, నీరజ కోన లు ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు  త్వరలోనే తెలియ పరుస్తాము. మార్చి నెలలో చిత్రం షూటింగ్ అమెరికా లో ప్రారంభమవుతుందని, 2019 ద్వితీయార్ధంలో చిత్రం విడుదల అవుతుందని, సినిమా ప్రేక్షకులకు, అభిమానులకు, మీడియా వారికి చిత్ర నిర్మాణ సంస్థల అధినేతలు టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ లు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

People Media factory and Kona Film corporation have come together to produce a first cross over film with Tollywood, Kollywood and Hollywood actors. It’s a star studded film with Madhavan, Anushka Shetty, Anjali, Shalini Pandey, Subba Raju, Avasarala Srinivas etc. kona venkat, Gopi sundar, Shanneil Deo, Gopimohan, and Neeraja kona or Technicians. Few top Hollywood actors & technicians are also being signed and their details will be revealed soon.  The shoot of this film will begin from March in the United States of America. It’s a Horror thriller which is being directed by Hemanth Madhukar. All other details will be revealed once the shoot begins. It’s a 2019 release says producers T.G.Viswaprasad, Konavenkat. And they Convey Pongal Wishes to All.

TSR National Film Awards PRESS MEET

 

 KUM_3280 KUM_3296 KUM_3513TSR Award function to be held on Feburary 17, at Visakhapatnam

Stage is set for the TSR Awards for the year 2017 and 2018. Former MP and filmmaker T Subbarami Reddy and his daughter Pinky Reddy have organised a press meet at Hotel Park Hyatt on Saturday and have announced that award function is going to be held in Visakhapatnam on February 17, at 5 pm. At the press meet, actors Nagma, Meena, Naresh, writer Parcuhuri Murali and others were present, as they are the members of the jury. The awards are given T Subbarami Reddy under the Lalithakala Parishath which was instituted by him in the year 2010. Like every year, this function will be held in the presence of around one lakh people. Other members of the jury are Shobhana Kamineni, Jeevitha, KS Rama Rao (producer) and K Raghurama Krishnam Raju (film critic). The nominations for the awards were also unveiled at this press meet. At the same time, it was also announced that Bollywood diva Vidya Balan will be presented the Sridevi Memorial Award. Actors like Chiranjeevi, Rajinikanth, Nagarjuna, Venkatesh, Surya, Shatrughan Sinha, etc. from the other industries will also be attending the awards function.

ఫిబ్రవరి 17న వైజాగ్ లో టి.ఎస్.ఆర్. – టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2017, 2018టి.ఎస్.ఆర్. – టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కు విశాఖ పట్నం మరోసారి వేదిక కాబోతోంది. 2010 నుండీ రెండేళ్ళకు ఒకసారి  కళాబంధు, సాంస్కృతిక సార్వభౌమ టి. సుబ్బరామిరెడ్డి ఈ అవార్డులను జాతీయ స్థాయిలో అందిస్తున్నారు. ఫిబ్రవరి 17వ తేదీ విశాఖపట్నం, పోర్ట్ గ్రౌండ్ లో వేలాదిమంది సమక్షంలో ఘనంగా 2017, 18 ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని జరుపుబోతున్నట్టు శనివారం టి. సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జ్యూరీ ఛైర్మన్ సుబ్బరామిరెడ్డితో పాటు సభ్యులు డా. శోభనా కామినేని, పింకీరెడ్డి, నగ్మా, మీనా, పరుచూరి గోపాలకృష్ణ, నరేశ్, కె.ఎస్. రామారావు పాల్గొన్నారు. వీరితో పాటుగా జీవిత, కె. రఘురామ కృష్ణంరాజు సైతం జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
టి. సుబ్బరామిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ, ’2010లో మొదలు పెట్టిన ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వఘ్నంగా కొనసాగించడం ఆనందంగా ఉందని, ఈశ్వర శక్తి, ప్రజల ప్రేమతో ఇది సాధ్యమౌతోంద’ని అన్నారు. శ్రీదేవి మెమోరియల్ అవార్డును విద్యాబాలన్ కు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, సూర్య, విక్రమ్ తో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితర తారలు హాజరవుతారని అన్నారు. నెల్లూరులో పుట్టిన సుబ్బరామిరెడ్డికి హైదరాబాద్, విశాఖపట్నంతో విడదీయరాని అనుబంధం ఉందని, ఆయన ఆరాధించే శివుడి ఆజ్ఞతోనే ఈ కళాసేవ అపూర్వంగా సాగుతోందని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. తమ జ్యూరీ గౌరవప్రదంగా, అందరికీ ఆమోదయోగ్యమైన నటీనటులను అవార్డులకు ఎంపిక  చేస్తుందని నరేశ్ తెలిపారు. తెలుగు చిత్రసీమకు చెందిన అనేక మందికి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి టి. సుబ్బరామిరెడ్డి కారకులని కె.యస్. రామారావు చెప్పారు. భారతీయ కళలు, సంస్కృతికి సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి సుబ్బరామిరెడ్డి అని నగ్మా అన్నారు. గతంలో అవార్డుల కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యానని, ఆ తర్వాత ‘దృశ్యం’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నానని, ఇప్పుడు జ్యూరీలో ఉండటం ఆనందంగా ఉందని మీనా తెలిపారు. రాజకీయ, పారిశ్రామిక, కళా రంగాలలో తనదైన ముద్ర వేసిన టి. సుబ్బరామిరెడ్డి జీవితాన్ని బయోపిక్ గా రూపొందించాల్సిన అవశ్యకత ఉందని శోభనా కామినేని అభిప్రాయపడ్డారు. తన తండ్రికి వేరెవ్వరూ సాటిరారని, అతి త్వరలోనే ఆయన ఆటోబయోగ్రఫీని విడుదల చేయబోతున్నామని పింకీ రెడ్డి చెప్పారు.