Gunturu Kaaram

Mahesh’s Guntur Kaaram: Mass Euphoria

‘గుంటూరు కారం’ ఘాటు చూపిస్తున్న మహేష్ బాబు-త్రివిక్రమ్’అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చిన‌బాబు) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన లభించింది. గుంటూరు మిర్చిలా ఉన్నాడంటూ అభిమానులు మురిసిపోయారు. వెండితెరపై వింటేజ్ మహేష్ ని చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లెజెండరీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న ‘ఎస్ఎస్ఎంబి 28′ టైటిల్ ని, గ్లింప్స్ ని విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించినప్పటి నుంచి అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఏంటి, ఇందులో మహేష్ బాబుని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. బుధవారం నాడు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో అభిమానుల సమక్షంలో  ‘ఎస్ఎస్ఎంబి 28′ టైటిల్, గ్లింప్స్ విడుదల వేడుక వైభవంగా జరిగింది. సూపర్ స్టార్ అభిమానుల కేరింతల నడుమ, అభిమానుల చేతుల మీదుగానే సాయంత్రం 6:03 గంటలకు ‘మాస్ స్ట్రైక్’ పేరుతో గ్లింప్స్ ను విడుదల చేశారు.

మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ కి ‘గుంటూరు కారం’ అనే శక్తివంతమైన టైటిల్ పెట్టారు. టైటిల్ ని బట్టి చూస్తే, ఇది గుంటూరు నేపథ్యంలో రూపొందుతోన్న యాక్షన్ ఫిల్మ్ అని అర్థమవుతోంది. టైటిల్ ని వెల్లడిస్తూ విడుదల చేసిన ‘మాస్ స్ట్రైక్’ అంచనాలకు మించి ఉంది. మహేష్ చిటికెతో గ్లింప్స్ ప్రారంభమైంది. కర్రసాముతో రౌడీ గ్యాంగ్ ని చితక్కొడుతూ ఆయన అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. గళ్ళ చొక్కా ధరించి, తలకి ఎర్ర కండువా చుట్టుకొని ఉన్న మహేష్ సరికొత్త లుక్ ఆకట్టుకుంటోంది. మహేష్ ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్ లో త్రివిక్రమ్ చూపించబోతున్నారని స్పష్టమైంది. నోటిలో నుంచి బీడీని తీసి, దానిని స్టైల్ గా వెలిగించి “ఏంది అట్టా చూస్తున్నావు.. బీడీ 3D లో కనపడుతుందా” అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి ఎప్పటిలాగే ఫిదా చేశారు మహేష్. భారీ బ్లాస్ట్ తో జీప్ గాల్లో ఎగరగా, మహేష్ తన కాలి దుమ్ముని దులుపుకొని నడుస్తున్నట్లుగా వీడియోని ముగించిన తీరు మెప్పిస్తోంది. అలాగే తమన్ నేపథ్యం సంగీతం కట్టిపడేసేలా ఉంది. మొత్తానికి ‘మాస్ స్ట్రైక్’ చూస్తుంటే కేవలం మహేష్ బాబు అభిమానులకు మాత్రమే కాదు, మాస్ అభిమానులు అందరూ కన్నుల పండుగలా ఉంది.

ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఎడిటర్ గా జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి, కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్ వ్యవహరిస్తున్నారు.

తారాగణం: మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌
నిర్మాత‌: ఎస్.రాధాకృష్ణ‌(చిన‌బాబు)
బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
సంగీతం: తమన్
డీఓపీ: పి.ఎస్.వినోద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Mahesh’s Guntur Kaaram: Mass Euphoria

A mass and powerful title Guntur Kaaram is locked for superstar Mahesh Babu’s 28th film under the direction of Trivikram Srinivas.

On superstar Krishna’s birth anniversary, the makers released a small glimpse to announce the title and also the tagline- Highly Inflammable.

Guntur Kaaram is a powerful title and the tagline offers mass euphoria to the super fans. S Thaman’s high-octane music with oora mass background score creates a double impact.

As the title suggests, the story of the movie is set in Guntur backdrop, and Guntur Kaaram seems to be high on action and mass laced with family elements.

Mahesh Babu transformed himself into a slick and stylish get-up to play an action-packed character in the movie.

Trivikram Srinivas who brings the best out of his actors will be presenting Mahesh Babu in a never-seen-before avatar.

S Radhakrishna of Haarika & Hassine Creations is prestigiously making the movie on a massive budget with Pooja Hegde and Sreeleela playing the heroines.

The movie Guntur Kaaram is set to make Sankranthi festivities more entertaining, as the movie is arriving for the festival.

Cast & Crew Details:Stars: Super Star Mahesh Babu, Pooja Hegde, Sreeleela

Written & Directed by Trivikram
Music: Thaman S
Cinematography: PS Vinod
Editor: Navin Nooli
Art Director – A.S. Prakash
Producer: S. Radha Krishna(Chinababu)
Presenter – Smt. Mamatha
Banner – Haarika & Hassine Creations
Pro: Lakshmi Venugopal

#GunturKaaram-Still-2 #GunturKaaram-Still 16X25A 16X25-B

The title, glimpse of Superstar Mahesh Babu and director Trivikram’s next to be unveiled by ‘Super’ fans in theatres screening Mosagallaku Mosagaadu

మోసగాళ్ళకు మోసగాడు’ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ‘ఎస్ఎస్ఎంబి 28′ టైటిల్ ప్రకటన
 
- సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ‘ఎస్ఎస్ఎంబి 28′ నుంచి ‘మాస్ స్ట్రైక్’ విడుదల
‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎస్ఎస్ఎంబి 28′(వర్కింగ్ టైటిల్). టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చిన‌బాబు) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన లభించింది. వెండితెరపై వింటేజ్ మహేష్ బాబుని చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత కొద్దిరోజులుగా ‘ఎస్ఎస్ఎంబి 28′ టైటిల్ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా చిత్ర బృందం టైటిల్ వెల్లడికి ముహూర్తం ఖరారు చేసింది. లెజెండరీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న టైటిల్ ని రివీల్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక్కడ మరో విశేషం ఉంది. కృష్ణ గారు నటించిన ఆల్ టైం హిట్స్ లో ఒకటైన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని ఆయన జయంతి కానుకగా మే 31న 4K లో భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రదర్శించనున్న అన్ని థియేటర్లలో ‘ఎస్ఎస్ఎంబి 28′ చిత్రానికి సంబంధించిన టైటిల్ తో కూడిన గ్లింప్స్ ని విడుదల చేయనున్నారు. పైగా ఈ విడుదల కార్యక్రమం అభిమానుల చేతుల మీదుగా జరగనుంది. అభిమానుల చేతుల మీదుగా ‘మాస్ స్ట్రైక్’ పేరుతో విడుదలవుతున్న ఈ గ్లింప్స్ అభిమానులకి మాస్ ఫీస్ట్ అవుతుందని చిత్ర బృందం చెబుతోంది. ఇక తండ్రి జయంతి సందర్భంగా ఆయన సినిమా మళ్లీ విడుదల కావడం, ఆ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లలో కొడుకు సినిమా గ్లింప్స్ విడుదల చేయడం అనేది సినీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ అరుదైన ఘటనకు ‘ఎస్ఎస్ఎంబి 28′ శ్రీకారం చుట్టింది.
ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఎస్ఎస్ఎంబి 28′ సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ఎడిటర్ గా జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి, కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్ వ్యవహరిస్తున్నారు.
తారాగణం: మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌
నిర్మాత‌: ఎస్.రాధాకృష్ణ‌(చిన‌బాబు)
బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
సంగీతం: తమన్
డీఓపీ: పి.ఎస్.వినోద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
 
The title, glimpse of Superstar Mahesh Babu and director Trivikram’s next to be unveiled by ‘Super’ fans in theatres screening Mosagallaku Mosagaadu
Superstar Mahesh Babu and director filmmaker Trivikram are joining hands for one of the most anticipated projects by movie buffs and fans. Pooja Hegde, Sreeleela play the female leads in the action entertainer bankrolled by leading producer Suryadevara Radha Krishna (China Babu) under Haarika and Hassine Creations.
While there are several titles under speculation for the massive project, the update around the same will be revealed by the fans of the star themselves. In addition, a glimpse of the film will also be unveiled. Yes, you heard it right. For the first time ever, the title and the first glimpse of a Mahesh Babu project will be launched by his fans in theatres on Superstar Krishna’s birthday i.e. May 31.
The glimpse will be screened in all theatres that are screening the redefined version of Superstar Krishna’s classic Mosagallaku Mosagadu, that’s re-releasing on the same day. “A MASS Feast For Fans and By Fans! #SSMB28MassStrike to thunder its way on 31ST MAY! SUPER FANS will unveil Striking video at the Theatres!!Super Star @urstrulyMahesh #Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine,” the production house Haarika & Hassine Creations tweeted.
The update announcement poster has a massy Mahesh Babu, with a cloth wrapped around his head, smoking a cigarette. S Thaman scores the music for the film whose technical team includes cinematographer PS Vinod, editor Navin Nooli and art director AS Prakash.
Mahesh Babu and Trivikram’s earlier collaborations, Athadu and Khaleja, continue to entertain and amaze audiences even today and expectations are running high on their third project together that’s touted to be the wholesome entertainer. SSMB28 is presented by Mamatha.
Cast & Crew Details:
Stars: Super Star Mahesh Babu, Pooja Hegde
Written & Directed by Trivikram
Music: Thaman S
Cinematography: PS Vinod
Editor: Navin Nooli
Art Director – A.S. Prakash
Producer: S. Radha Krishna(Chinababu)
Presenter – Smt. Mamatha
Banner – Haarika & Hassine Creations
Pro: Lakshmi Venugopal
#SSMB28-MassStrike-FinalDesign-Still #SSMB28-MassStrike-FinalDesign

SSMB28, Superstar Mahesh Babu and director Trivikram’s much-awaited collaboration, to release on January 13, 2024

సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చిత్రం 2024, జనవరి 13న విడుదల

* సంక్రాంతికి మహేష్ బాబు-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్
* ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్

‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న మోస్ట్ వాంటెడ్ ఫిల్మ్ ‘ఎస్ఎస్ఎంబి 28′(వర్కింగ్ టైటిల్). టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చిన‌బాబు) భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ ని సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం ఓ కొత్త పోస్టర్ ను వదిలారు. “సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఎస్ఎస్ఎంబి 28′తో సరికొత్త మాస్ అవతార్‌లో జనవరి 13, 2024 నుండి ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో అలరించనున్నారు” అంటూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ అసలుసిసలైన సంక్రాంతి సినిమాని తలపిస్తూ విశేషంగా ఆకట్టుకుంటోంది.

పండుగలా ‘ఎస్ఎస్ఎంబి 28′ కొత్త పోస్టర్:
మేకర్స్ చెప్పినట్టుగా తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ బాబు సరికొత్త మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. పోస్టర్ ని బట్టి చూసే ఇది మిర్చి యార్డ్ లో జరిగే యాక్షన్ సన్నివేశమని అనిపిస్తోంది. మిర్చి యార్డ్ లో కొందరికి బుద్ధిచెప్పి.. కళ్లద్దాలు, నోట్లో సిగరెట్ తో గుంటూరు మిర్చి ఘాటుని తలపిస్తూ స్టైల్ గా నడిచొస్తున్న మహేష్ బాబు మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి మాస్ బొమ్మ చూపించబోతున్నారని పోస్టర్ తోనే అర్థమవుతోంది.

మహేష్ బాబు సినిమాలకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాలను అందుకున్నాయి. ఇక దర్శకుడు త్రివిక్రమ్ గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ సైతం 2020 సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ రికార్డులను సృష్టించడం విశేషం. అసలే హ్యాట్రిక్ కాంబినేషన్, అందులోనూ సంక్రాంతి సీజన్ కావడంతో ‘ఎస్ఎస్ఎంబి 28′ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ఎడిటర్ గా జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి , కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్ వ్యవహరిస్తున్నారు.

తారాగణం: మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌
నిర్మాత‌: ఎస్.రాధాకృష్ణ‌(చిన‌బాబు)
సంగీతం: తమన్
డీఓపీ: పి.ఎస్.వినోద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

SSMB28, Superstar Mahesh Babu and director Trivikram’s much-awaited collaboration, to release on January 13, 2024

Superstar Mahesh Babu’s SSMB28, directed by filmmaker Trivikram, is undoubtedly one of the most keenly awaited actor-director collaborations among audiences. The film features Pooja Hegde and Sreeleela as female leads. S.Radha Krishna (China Babu) is producing the entertainer under Haarika and Hassine Creations.

The release date of SSMB28 was confirmed today. The film will hit screens on January 13, 2024. With all the commercial ingredients in the right mix, the project promises to be an ideal festive treat. A special poster, confirming the news, features Mahesh Babu in a brand-new stylish avatar, where he sports a beard and a thin moustache, donning a black shirt and blue jeans, while smoking a cigarette in front of a lorry.

A series of red chillies are flying mid air as Mahesh Babu arrives and a few men look up to him. The Super Star is at his massy best in the poster. Some of Mahesh Babu’s best films – Okkadu, Sarileru Neekevvaru, Seethamma Vakitlo Sirimalle Chettu – released for Sankranthi and the unit promises another memorable outing that has all the makings of a blockbuster and will please his fans. The team is believed to be thrilled with the way the film has been shaping up.

SSMB28 is the third association between Mahesh Babu and Trivikram, after two much-celebrated films Athadu and Khaleja. While hit composer S Thaman scores the music for SSMB28, the crew comprises noted technicians including cinematographer PS Vinod, art director AS Prakash and editor Navin Nooli. Other details about the film and its team will be out soon.

Cast & Crew Details:

Stars: Super Star Mahesh Babu, Pooja Hegde, Sreeleela,
Written & Directed by: Trivikram
Music: Thaman S
Cinematography: PS Vinod
Editor: Navin Nooli
Art Director – A.S. Prakash
Producer: S. Radha Krishna(Chinababu)
Presenter – Smt. Mamatha
Banner – Haarika & Hassine Creations
Pro: Lakshmivenugopal

#SSMB28-Date-Final-Still #SSMB28-Date-Final-Web

Superstar Mahesh Babu and director Trivikram’s #SSMB28, produced by Haarika and Hassine Creations, to go on floors this August; film set for a summer 2023 release

 సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చిత్రం 
*ఆగస్టు నుంచి రెగ్యులర్  షూటింగ్ 
*2023 వేసవి లో చిత్రం విడుదల
*నేడు ప్రచార చిత్రం విడుదల
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో,టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్  అధినేత ఎస్.రాధాకృష్ణ ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న భారీ,ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతోంది.
ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన తార ‘పూజాహెగ్డే‘ మరోసారి జతకడుతున్నారు.
మ‌హేష్‌బాబు , త్రివిక్ర‌మ్  ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంభందించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రెగ్యులర్  షూటింగ్ ఆగస్టు లో   ప్రారంభమవుతుంది. ఈ  సందర్భంగా ప్రచార చిత్రం ను విడుదల చేసారు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్‘ చిత్రం యూనిట్.
ఈ ప్రచార చిత్రాన్ని వీక్షిస్తే… జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం అవగత మవుతుంది.
మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అత‌డు`, `ఖ‌లేజా` దశాబ్ద కాలానికి పైగా నేటికీ  ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. దశాబ్ద కాలానికి పైగా  ఎదురు చూస్తున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో బిగ్గెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతోంది అన్న వార్త    అభిమానుల ఆనందాన్ని అంబరాన్ని తాకేలా చేసింది.
 ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది (2023) వేసవి లో చిత్రం విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్.రాధా కృష్ణ  ఈ సందర్భంగా తెలిపారు.  టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్పెష‌ల్ క్రేజ్ ఉన్న ఈ చిత్రానికి నిర్మాత‌: ఎస్.రాధాకృష్ణ‌(చిన‌బాబు),
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌.
 
Superstar Mahesh Babu and director Trivikram’s #SSMB28, produced by Haarika and Hassine Creations, to go on floors this August; film set for a summer 2023 release
Haarika and Hassine Creations’ SSMB28, headlined by Superstar Mahesh Babu and directed by filmmaker Trivikram, is one of the most anticipated projects by movie buffs and fans alike. The film is set to go on floors this August, the makers have confirmed today. Actress Pooja Hegde plays the female lead in the film bankrolled by leading producer S.Radha Krishna (China Babu).
The pre-production formalities are progressing at a brisk pace. Trivikram is churning out a script that’ll appeal to audiences across all age groups and tastes. Offering a sneak peek into SSMB28, the team has released a special glimpse throwing light on the film’s cast and crew.
The sneak peek, complemented by a stylish score, confirms that the film will be edited by national award-winning technician Navin Nooli while the team also comprises art director AS Prakash, in-form music director Thaman and cinematographer PS Vinod. The makers have also announced that the film would be a summer 2023 release; ‘The evergreen combo is back to reign,” it says.
Mahesh Babu and Trivikram’s earlier collaborations, Athadu and Khaleja, continue to entertain and amaze audiences even today and expectations are running high on their third project together that’s touted to be the wholesome entertainer. More interesting details about the film and its team will be unveiled shortly, said producer S Radha Krishna.
Cast & Crew Details:
Stars: Super Star Mahesh Babu, Pooja Hegde
Written & Directed by Trivikram
Music: Thaman S
Cinematography: PS Vinod
Editor: Navin Nooli
Art Director – A.S. Prakash
Producer: S. Radha Krishna(Chinababu)
Banner – Haarika & Hassine Creations