‘అ ఆ’ ప్రచార చిత్రాలు

combo (3) nov 0116 nov 0363 combo (2) nov 0075

‘A..Aa’ posters

TIMES copy6s-009 copy 6s-015 copy 6s-026 copy 30X40-39 copy

‘అ ఆ’ ఆడియో రిలీజ్ వేడుక

The audio of A aa was launched moments ago. The function was graced by Pawan Kalyan.

Ramajogayya Sastry said, “Trivikram Srinivas is always known to create good song situations. He always does something different. I learnt many things from him during the finalization process of a song. After writing a song, I would spend 3-4 hours with him for giving finishing touches. They are a very valuable learning. I have written four songs. Vellipoke Shayamala is close to my heart. It has been getting very good response in social media. Working with Mickey J Meyer is a revelation. He has given a very contemporary music.”

Dil Raju said, “You all know watching which movie Nithiin wanted to become an actor. It was after watching Toli Prema. If Pawan Kalyan garu comes to his audio function, he is sure that the film will become a hit. This film is going to rock for sure.”

Ajay said, “The film will be as pleasant as the title and the teaser. I thank Trivikram garu and producer garu for the role.”

Anupama Parameswaran said, “I am a Malayali. I don’t understand Telugu, but by seeing you all, I can understand your love for Pawan Kalyan sir. Pawan sir is most welcome. We want to see him in Malayalam films. Even I am excited about meeting him. Trivikram garu gave me so much of confidence. I was nervous.

Sharrat Marar said, “There is so much of soul in Mickey’s music. Trivikram garu is one of the finest directors of our times. Nithiin’s father Sudhakar Reddy garu was so excited when this project was finalized. I wish the team very best.”

Srinivas Reddy said, “We get money when we work with others. But when we work with Trivikram garu, we get knowledge, too. We are going to get a comedienne after this movie. I am playing Nadiya garu’s secretary in the movie.”

Krishna Chaitanya said, “I am a mad fan of Trivikram garu. I am happy more for getting an opportunity to work with him than for writing a song.”

Nadia said, “Trivikram had no song and dance for us. But I feel like tapping my feet listening to the songs. I thank Pawan garu for gracing the occasion to bless the film.”

Samantha said, “This film should win for the sake myself, my hero, my producer and everyone else. Moreover, Pawan Kalyan garu has come here to bless us.”

Mickey said, “I got to learn lot of things from Trivikram sir. I like to thank all the singers. I thank Ramajogayya sir and Krishna Chaitanya for the lyrics.”

Nithiin said, “I won’t speak much about the movie. A Aa means andamaina, ahladakaramaina cinema. Everything is there in the movie. To tell in Pawan garu’s style, (imitates his Kushi style). Working with Samantha was great. Nadiya garu is Maha Lakshmi in this film. She was attha in Attarintiki Daredi, she is attha once again, but a different kind. Yellipoke Shayamala is my favourite song. I have been listening to it again and again. Trivikram garu is like my guru. I am a zero. He is like a walking dictionary, google, encyclopedia, etc. I was talking about everyone from Chengiz Khan to Che Guevera with my friends. They were surprised. My source of knowledge is Trivikram garu. It was Toli Prema which inspired me to become an actor. When I auditioned for Jayam, Teja garu asked me if I knew dancing. I told them that I can manage some movements. I just danced steps from a song from Tammudu. Next day, I was asked to enact a scene and it was the ‘Shakuntala akkaya’ scene. Teja garu asked me to do it for six times. When I was down for many years, Pawan garu attended the audio function of Ishq. It was a big hit. I am sure this film is going to be a hit, as Pawan garu has graced the function.”

Trivikram said, “In our journey, we tend to forget where we came from. We always have to rediscover our roots. A Aa is one such attempt. Some memories won’t be forgotten ever. Some journies we would never want to stop. Some experiences never exhaust no matter how much we share. For example, the days when I used to smoke with friends, share a cup of tea for want of money, etc. A Aa is like a diary I wrote many years ago. I have revisted that diary. Producer Radhakrishna garu said that this film will give the same experience he had had while listening. I thank Nihtiin for doing this film without caring for whether it’s hero- or heroine-oriented. Nadiya has read so much for this movie, so much that she would have become an IAS officer had she read this much for that purpose. You are going to see Nagavalli for many more years. Hari Teja is like Suryakantham at a young age. Ramajogayya Sastry and Krishna Chaitanya have done a great job. It’s a film that is told more through the visuals. Natarajan (DoP) has helped me do that.” About Pawan, Trivikram said, “Konda okariki talonchi yeragadhu. shikaram okariki salam anadu. Keratam okari kosam aagadu. Pawan is my favourite tsunami, he is the army I have kept with myself.”

Pawan Kalyan said, “I am often scared to talk on the dais. I still feel the same shyness that a beginner feels when he is talking for the first time. I didn’t know how much Nithin loves me till a while ago. When he invited me to attend the audio function of Ishq, I saw him as a brother. He hadn’t had hits for many years, like I didn’t have. It became a hit because of the efforts of everyone. I wish that he will become a big star, not only in Telugu, but also country-wide. Mickey’s music is foot-tapping. Kudirithe dance chese vadini. I knew Naresh garu as a child. He was in the house opposite ours in Chennai. I wish producer Chinna babu garu all the best. Trivikram was the one who wrote some lines in Gokulam lo Seetha. It was my first experience with him. Our friendship grew stronger years later. When people appreciate me for my dialogues, I feel respect should be the writer’s. I knew the story of A Aa even before Attarintiki Daredi happened. This will be a very good entertainer. I whole-heartedly wish the film all the best. Jai Hindi.”

యువ క‌థానాయ‌కుడు నితిన్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అ ఆ. ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న స‌మంత న‌టించింది. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్నినిర్మించారు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందించిన అ ఆ ఆడియో ఆవిష్క‌ర‌ణోత్స‌వం హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో ఘ‌నంగా జ‌రిగింది. సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగిన అ ఆ ఆడియో వేడుక‌లో హీరో నితిన్, హీరోయిన్ స‌మంత థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌గా… ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌రై అ ఆ ఆడియోను ఆవిష్క‌రించారు.

గీత ర‌చ‌యిత రామ జోగ‌య్య శాస్త్రి మాట్లాడుతూ…ఈ చిత్రానికి నాలుగు మంచి పాట‌లు రాసాను. ఈ పాట‌లు రాసే క్ర‌మంలో త్రివిక్ర‌మ్ గారితో గ‌డిపిన మూడు నాలుగు గంట‌లు చాలా విలువైన‌వి. ఆయ‌న నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. మిక్కీ జే మేయ‌ర్ త‌న పాత ప‌ద్ద‌తిని ప‌క్క‌న పెట్టి కొత్తగా ఉండే సంగీతాన్ని అందించారు.ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతుంది. మ‌నంద‌రికీ అ ఆ వినోదాన్ని అందిస్తుంది అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…తొలిప్రేమ సినిమా చూసి నితిన్ హీరో అవ్వాల‌నుకున్నాడు. హీరో అయిన త‌ర్వాత ఆడియో ఫంక్ష‌న్ కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెస్ట్ గా వ‌స్తే సినిమా హిట్ అవుతుంద‌ని నితిన్ న‌మ్మ‌కం. నితిన్ న‌మ్మ‌కం త‌గ్గ‌ట్టు ఈ సినిమా స‌మ్మ‌ర్ లో మంచి హిట్ అవుతుంది. త్రివిక్ర‌మ్ ఏది రాసినా కొత్త‌గా రాస్తారు. అ ఆ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది అన్నారు.

సీనియ‌ర్ హీరో న‌రేష్ మాట్లాడుతూ… నా కెరీర్ లోనే ది బెస్ట్ క్యారెక్ట‌ర్ ఈ చిత్రంలో చేసాను. అ ఆ మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలుస్తుంది. నా గురువు జంథ్యాల వెళ్లిపోయారు అనుకున్నాను కానీ త్రివిక్ర‌మ్ లో జంధ్యాల గార్ని చూస్తున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ…త్రివిక్ర‌మ్ గారు గురించి ఆయ‌న సినిమాలు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆయ‌న సినిమాలు ఎంత బాగుంటాయో అంద‌రికీ తెలిసిందే. త్రివిక్ర‌మ్ గారి సినిమాలోని డైలాగ్స్ చ‌దువుకుంటే చాలు సినిమా తీసేయచ్చు. నితిన్, స‌మంత మంచి కాంబినేష‌న్… అన్నింటి కంటే మించి మంచి సంస్థ‌లో ఈ చిత్రం రూపొందింది. మిక్కీ జే మేయ‌ర్ మంచి ట్యూన్ అందించారు. ఈ సాంగ్స్ ట్రెండ్ సెట్ సాంగ్స్ అవుతాయి. అ ఆ పెద్ద బ్లాక్ బ‌ష్ట‌ర్ అవుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు.

హీరోయ‌న్ స‌మంత మాట్లాడుతూ…ఈ సినిమా నా హీరో కోసం.. నా డైరెక్ట‌ర్ కోసం.. నా నిర్మాత కోసం… స‌క్సెస్ అవ్వాలి. ఖ‌చ్చితంగా మా సినిమా గెలుస్తుంది. ఆడియో ఫంక్ష‌న్ కి ప‌వ‌ర్ స్టార్ గెస్ట్ గా వ‌చ్చారంటే సినిమా హిట్ అంతే..అన్నారు.

హీరో నితిన్ మాట్లాడుతూ… అ ఆ అంటే ఏమిటో త్రివిక్ర‌మ్ గారి స్టైల్ లో చెప్పాలంటే… అంద‌మైన ఆహ్లాద‌క‌ర‌మైన‌ సినిమా. అదే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి స్టైల్ లో చెబితే అ… ఆ… అంతే. సినిమాకి రియ‌ల్ హీరో నిర్మాత అని న‌మ్ముతాను. మా నిర్మాత‌ రాథాకృష్ణ గారు ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని అన్ని పాట‌లు న‌చ్చాయి. ముఖ్యంగా శ్యామ‌లా సాంగ్ నాకు బాగా న‌చ్చింది. త్రివిక్ర‌మ్ గారు న‌డిచే లైబ్రెరీ లాంటివారు. ఆయ‌న నుంచి ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాను. ఈ సినిమాకి వ‌ర్క్ చేసిన‌ ప్ర‌తి క్ష‌ణం నా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. తొలిప్రేమ చూసి హీరో అవ్వాల‌నుకున్నాను. జ‌యం సినిమా ఆడిష‌న్స్ లో డ్యాన్స్ చేయ‌మంటే…ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి త‌మ్ముడు సినిమాలో స్టెప్స్ వేసాను. ఏదైనా సీన్ చేయ‌మంటే….త‌మ్ముడు సినిమాలో క‌ళ్యాణ్ గారు చేసిన కామెడీ సీన్ చేసాను…అలా నేను హీరో అవ్వడానికి క‌ళ్యాణ్ గారే కార‌ణం. ఇష్క్ ఆడియో ఫంక్ష‌న్ కి వ‌చ్చారు. ఇప్పుడు అ ఆ ఆడియో ఫంక్ష‌న్ కి కూడా వ‌చ్చినందుకు క‌ళ్యాణ్ గార్కి మ‌న‌స్పూర్తిగా థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట్లాడుతూ…అ ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అని కొంత మంది అడిగారు..మ‌నం ప‌ని చేయ‌డంలో…. గెల‌వ‌డంలోప‌డి…మ‌నం ఎక్క‌డ నుంచి ప్రారంభించాం.. మ‌న మూలాలు ఏమిటి అనేది మ‌ర‌చిపోతున్నాం. అందుచేత మ‌న మూలాల్ని వెతికే ప్ర‌య‌త్న‌మే అ ఆ. కొన్ని జ్ఞాప‌కాలు..కొన్ని ప్ర‌యాణాలు.. ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేం. కొన్ని ప్ర‌యాణాలును ఆపాల‌ని అనిపించ‌దు. కొన్ని అనుభూతులు ఎంత పంచుకున్నా స‌రిపోవు అనిపిస్తుంటుంది. నా స్నేహితులుతో మాట్లాడిన మాట‌లు…ఒక టీని ఇద్ద‌రు స్నేహితులు క‌లిసి తాగిన రోజులు… వెన‌క్కి తిరిగి చూసుకుంటే మ‌ర‌చిపోలేని అనుభూతి క‌లుగుతుంది. అ ఆ అనేది చాలా కాలం క్రితం రాసేసిన డైరీ లాంటిది. అంద‌రికీ న‌చ్చుతుంది అనుకుంటున్నాను. ఈ చిత్రాన్ని తెర‌కెక్కించడానికి నాకు బ‌లంగా నిల‌బ‌డిన వ్య‌క్తి నా నిర్మాత రాధాకృష్ణ గారు. ఈ సినిమా చూసిన వెంట‌నే ఆడియోన్స్ కి మంచి అనుభూతి ఇస్తుంది. హీరో సినిమానా… హీరోయిన్ సినిమానా అని అడ‌గ‌కుండా క‌థ‌ని న‌మ్మి చేసిన నితిన్ కి థ్యాంక్స్. అలాగే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు డేట్స్ ఇచ్చి అన‌సూయ పాత్ర‌కు ప్రాణం పోసిన‌ స‌మంత గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చాలా బాగా న‌టించింది. ఖ‌చ్చితంగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ని చాలా సంవ‌త్స‌రాలు తెలుగు సినిమాల్లో చూస్తారు.మిక్కీ జే మేయ‌ర్ క‌థ చెప్ప‌డం ప్రారంభించిన‌ 10 నిమిషాల‌కే ఒక ట్యూన్ ఇచ్చేసాడు. ఈ చిత్రానికి చాలా మంచి ట్యూన్స్ అందించారు. సీతారామ శాస్త్రి గారు త‌ర్వాత తెలుగు పాట‌కు గౌర‌వం తీసుకురాగ‌ల గీత ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి గారు. ఈ చిత్రానికి ఆయ‌న చాలా మంచి పాట‌లు రాసారు. అలాగే కృష్ణ చైత‌న్య కూడా మంచి పాట‌ను రాసారు. కొండ ఒక‌రికి త‌ల వంచ‌దు.. శిఖ‌రం కూడా త‌ల‌వంచ‌దు..కెర‌టం అల‌సిపోయి ఆగ‌దు..నా ఉప్పెన… నేను దాచుకున్న సైన్యం… శ‌త్రువులు పై నేను చేసే యుద్దం…నేను వ‌దిలిన‌ బాణం…నా పిడుగు..ఓ సునామి…ఇదంతా నా కిష్ట‌మైన స్నేహితుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..ఈ ఆడియో వేడుకకు రావ‌డం ఆనందంగా ఉంది అన్నారు.

హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ… ఇష్క్ సినిమా ఆడియో ఫంక్ష‌న్ కి నేను ఎందుకు వ‌చ్చానంటే…ఇష్క్ ఆడియో ఫంక్ష‌న్ కి న‌న్ను పిల‌వ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు నితిన్ నాకు త‌మ్ముడులాగా అనిపించాడు. నేను నా సినిమాల గురించి త‌ప్పా… వేరే సినిమాలు ఎలా ఆడుతున్నాయి అని ప‌ట్టించుకోను. ఇష్క్ సినిమాకి ముందు నితిన్ కి నాలాగే హిట్స్ లేవ‌ని తెలిసింది. త‌మ్ముడుకి ఇబ్బంది అంటే ధైర్యం ఇద్దామ‌ని వ‌స్తాం క‌దా…అందుకే ఇష్క్ ఆడియో ఫంక్ష‌న్ కి వ‌చ్చాను. అది మంచి విజ‌యం సాధించింది. అలాగే అ ఆ సినిమా కూడా మంచి విజ‌యం సాధించి… నితిన్ గార్కి మంచి పేరు రావాల‌ని… భార‌త‌దేశంలో నితిన్ పెద్ద స్టార్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ విన‌సొంపుగా ఉంది. అద్భుత‌మైన సంగీతం అందించారు. పాట‌లు వింటుంటే డ్యాన్స్ చేయాల‌నిపించింది. గోకులంలో సీత చిత్రానికి త్రివిక్ర‌మ్ అసోసియేట్ రైట‌ర్ గా వ‌ర్క్ చేసారు. ఆ చిత్రానికి చాలా డైలాగ్స్ త్రివిక్ర‌మ్ రాసారు. ఆవిధంగా ఫ‌స్ట్ టైమ్ త్రివిక్ర‌మ్ నేను క‌ల‌సి ప‌ని చేసాం. కానీ…అప్ప‌టికి మా ఇద్ద‌రికీ ప‌రిచ‌యం లేదు. తొలి ప్రేమ డ‌బ్బింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ప‌క్క‌నే చిరున‌వ్వుతో సినిమా రీ రికార్డింగ్ జ‌రుగుతుంది. ఆ సినిమాలో రెస్టారెంట్ సీన్ లో డైలాగ్స్ చూసి భ‌లే రాసారే బాగున్నాయి అనిపించింది. జ‌ల్సా నుంచి త్రివిక్ర‌మ్ తో ప‌రిచ‌యం. ఆయ‌న విలువ‌లు గురించి కేవ‌లం సినిమాలు తీయ‌డం మాత్ర‌మే కాదు…నిజ జీవితంలో విలువ‌లు పాటించే వ్య‌క్తి అందుకే ఆయ‌నంటే నాకు అంత ఇష్టం. హీరోకి ఎంత ఇమేజ్ వ‌చ్చినా… దాని వెన‌క ర‌చ‌యిత బ‌లం ఉంద‌ని బ‌లంగా న‌మ్మే వ్య‌క్తిని. అందుకే రైట‌ర్స్ అంటే నాకు గౌర‌వం. ర‌చయిత త్రివిక్ర‌మ్ మ‌న‌కు ఉండ‌డం తెలుగు వారు గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం. అత్తారింటికి దారేది చిత్రం కంటే ముందు నుంచి ఈ క‌థ తెలుసు. కుటుంబ స‌మేతంగా వెళ్లి చూడ‌ద‌గ్గ సినిమా ఇది అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ న‌టి న‌దియా, హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, నిర్మాత శ‌ర‌త్ మ‌రార్, నిర్మాత నిఖితా రెడ్డి, అజ‌య్,కృష్ణ చైత‌న్య, ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌కాష్, పి.డి.వి.ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

SIVA7985 SIVA8005 SIVA8006 SIVA8013

‘అ ఆ’ ప్రచార చిత్రాలు

image0003 image0004 image0005 image0006 image0007 image0008 image0009 image0010 image0011 image0012 image0013 image0014 image0015 image0001 image0002