తెలుగు,తమిళ భాషలలో ‘లలితశ్రీ కంబైన్స్ రూపొందిస్తున్న ‘శ్రీ త్యాగరాజు’ పాటల రికార్డింగ్

01

ప్రఖ్యాత వాగ్గేయకారుడు ‘త్యాగయ్య’. ఆయన జీవితకధ ఆధారంగా లలితశ్రీ కంబైన్స్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్.వి.రమణమూర్తి రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీ త్యాగరాజు’.ఈ సంగీత ప్రధానమైన చిత్రంలో త్యాగరాజు పాత్రను ప్రఖ్యాత నృత్య సంకీర్తనా చార్యులు జె.ఈశ్వరప్రసాద్ పోషిస్తున్నారు.
‘శ్రీ త్యాగరాజు’ చిత్రం పాటల రికార్డింగ్ ఈ నెల 16వ తేది రాత్రి ప్రణతి ఆడియో ల్యాబ్  లో జరిగింది.పద్మభూషణ్ డా: నూకల చినసత్యన్నారాయణ సీతారాముల విగ్రహాలకు పూజాకార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం  సంగీత జగద్గురు శ్రీ త్యాగరాజు కృతులు రెండింటిని ‘కనుగొంటిని శ్రీరాముని నేడు’, ‘రారా మా ఇంటిదాకా’ ను రికార్డ్ చేయటం జరిగింది. సుప్రసిద్ధ కర్నాటక సంగీత విద్వాంసుడు శ్రీ వైజర్స్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నారు,చిత్ర రంగంలో సీనియర్ సంగీత విద్వాంసుడు పూర్ణచందర్ ఈ చిత్ర సంగీత పర్యవేక్షణ చేస్తున్నారు,
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత,దర్శకుడు ఆర్.వి.రమణమూర్తి మాట్లాడుతూ..’ప్రఖ్యాత వాగ్గేయ కారుడు త్యాగయ్య’. ఆయన అసలు పేరు కాకర్ల త్యాగ బ్రహ్మం.తమిళనాడులోని తిరువాయూర్ లో ఆయన జన్మించారు.ఆయనకు చిన్నతనం నుంచి ‘రామభక్తి’ మెండు.కుటుంబ సభ్యులు ఆయన కవిత్వాన్ని రాజులకు ధారాదత్తం చేయమన్నా ‘నిది చాల సుఖమా..రామును సేవా సన్నిధి సుఖమా’ అంటూ తిరస్కరించి,ఎన్ని ఒడిదుడుకులు జీవితంలో ఎదురైనా రామనామ స్మరణ చేస్తూ రామ భక్తీ కే అంకితమై ఎన్నో కీర్తనలు రచించారు.త్యాగరాజు రచించిన కీర్తనలే కర్నాటక సంగీతానికి ఆధారం అయ్యాయి.ఈనాటికీ దక్షిణాదిన సంప్రదాయ సంగీతం అభ్యసించే ప్రతి ఒక్కరూ త్యాగరాజ స్వామి కీర్తనలతోనే సంగీతంలో ఓనమాలు దిద్దుకుంటారు.’ అలాంటి వాగ్గేయ కారుని జీవిత చరిత్రను తెరకెక్కించటం అదృష్టం గా భావిస్తున్నట్లు రమణమూర్తి తెలిపారు.
సంకీర్తనాచార్యుడనైన తాను త్యాగరాజు పాత్రను పోషించటం శ్రీరామకృప అని ఈశ్వరప్రసాద్ అన్నారు.
‘శ్రీత్యాగారాజు’లోని ఇతర ప్రధాన పాత్ర దారులు, సాంకేతిక నిపుణుల ఎంపిక వేగంగా జరుగుతోంది.ఇందులో మొత్తం 16గీతాలు ఉంటాయి. జూన్,జులై నెలల్లో వీటి రికార్డింగ్ పూర్తవుతుంది.డిసెంబరు నాటికి చిత్ర నిర్మాణం పూర్తి చేసి 2014 జనవరిలో ‘శ్రీ త్యాగరాజు’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నిర్మాత,దర్శకుడు ఆర్.వి.రమణమూర్తి తెలిపారు.
మహానటుడు చిత్తూరు వి.నాగయ్య 1946లో ‘త్యాగయ్య’ను రూపొందించగా,1981లో బాపు ‘త్యాగయ్య’కు దర్శకత్వం వహించారు. 2013 లో మూడవసారి ‘శ్రీ త్యాగరాజు’ చిత్రం రూపొందటం విశేషం.

02 03 20130516_205220 20130516_205335 photo Thyagayya music 1