About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

Anaganaga Oka Raju : Title Teaser | First Look Poster /Still / matter

*నవీన్ పోలిశెట్టి హీరోగా “అనగనగా ఒక రాజు”

*’సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థలు సంయుక్త నిర్మాణం*
* సంక్రాంతి శుభాకాంక్షలు తో  పేరుతో కూడిన ప్రచార చిత్రం విడుదల
*ఆద్యంతం వినోదాత్మకంగా భరితంగా
‘‘అనగనగా ఒక రాజు” వీడియో చిత్రం
*నవీన్ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’  సంస్థలు సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా ‘నవీన్ పోలిశెట్టి’ ఈ చిత్రానికి కథానాయకుడు. ప్రతిభగల యువకుడు కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
సంక్రాంతి శుభాకాంక్షలు తో ఈ రోజు పేరుతో కూడిన ప్రచార చిత్రం విడుదలచేశారు చిత్ర బృందం. వీడియో ను నిశితంగా గమనిస్తే ‘ ఏదో పెళ్లికి సంభందించి ఏర్పాట్లు, హడావుడి గమనించవచ్చు. పెళ్ళికొడుకు తయారవుతున్న తీరు కనిపిస్తుంది. ఫోటో షూట్ జరుగుతూ ఉంటుంది..
చిత్ర కథానాయకుడు పాత్రధారి రాజు (నవీన్ పోలిశెట్టి) మాట్లాడుతున్నాడు ఇదిగో ఇలా….” నాయుడు గారు హనీమూన్ కి హవాయి కి టికెట్స్ బుక్ చేశారా లేదా…డబ్బులు గురించి ఆలోచించకండి రాజు గాడి పెళ్లి ఇక్కడ. హవా హవాయి అంటూ హమ్మింగ్ చేస్తూ డాన్సు చేస్తాడు. ఫోటోగ్రాఫర్ ను పిలుస్తూ రాజు గాడు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పగిలిపోవా లిరా… గ్లిట్టరింగ్, షివరింగ్, ఫ్లిక్కరింగ్ అంటూ ఫోజు లిస్తాడు.
పారిజాతం అత్తయ్యా.. రేయ్ అత్తయ్య గారు వచ్చారు ఎసి లు ఆన్  చేయండ్రా అంటూ తన బంగారాన్ని చూపిస్తూ స్టయిల్ కొడుతూ ఉంటాడు. ఇదేం విడ్డూరం ఆడవాళ్లకేన వడ్డాణం… అందుకే నేను కూడా మామ కు చెప్పి డబ్ల్యు డబ్ల్యు యఫ్ లాంటింది ఒక ఐదు కిలోల బంగారం చేయించాను. చూస్తావుగా పద. మన ఫోటోలు చూసి ఆ కత్రినా కైఫ్, విక్కి కౌషల్ కుళ్లుకుని చావాలరా అలా తియ్యి నువ్వు. దీనికి రాజు ఈటింగ్  కాజు అని కాప్షన్ ఏసు కో రా…!  ఉంగరాన్ని కింద పడేస్తూ యాక్షన్ చేస్తూ ఉంటాడు. అంతలోనే..
ఒరేయ్.. రేయ్..రేయ్..అది చూసావా, ఆ బరువు కి పడిపోయిందిరా..ఎత్తకు రా రేయ్..రేపు మళ్ళా కొనుక్కుందాం..రాజు గాడి పెళ్లిరా..మామ ఎంత ఖర్చు పెడతాడో కనపడాలరా ఫొటోలో…పైనుంచి కింద దాకా ఒక ఫుల్ లెంగ్త్ తియ్యరా .. ఈ చెప్పులు…అంటూ చెప్పులు చూసి కోపంతో…అరేయ్ అల్తాఫ్ …ఫాంటసీ ఫుట్ వేర్ వేసుకుంటాను నేను..? రాజు గాడి పెళ్లి ఇది.. 7 తరాల పెళ్లి..
సారి అండి మీరు వచ్చేసారా…? ఇవన్నీ పట్టించుకోకండి…నేను చెప్పుకోకూడదు కానీ మోస్ట్ ఎంటర్ టైనింగ్ ఈవెంట్ ఆఫ్ ది డికేడ్ అండి. థియేటర్ లో మీరే చూస్తారుగా.
టైటిల్ ఏంటంటారా….?
అరేయ్ కళ్లజోడు…? ఒక భీభత్సమైన బ్యాగ్రౌండ్ స్కోర్ వేసుకోరా…
“అనగనగ ఒక రాజు”
నేనిలా స్లో మోషన్ లో వుంటాను ….పెట్టుకోరా నన్ను…. అంటూ రాజు పాత్ర ధారి నవీన్ పోలిశెట్టి ఆద్యంతం నవ్వుల విందు చేస్తాడు ఈ ప్రచార చిత్రంలో.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు తమన్  ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ ప్రచార చిత్రానికి ఆయన అందించిన నేపథ్య గీతం మరింత వన్నె తెచ్చింది.
ప్రేక్షకులుగా మీరు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయుత్త మవ్వండి, మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాము అంటున్నారు. వినోదం పరమావధిగా నవీన్ పోలిశెట్టి సరికొత్త అవతారం ఈ చిత్రం స్వంతం. త్వరలోనే చిత్రం షూటింగ్  ప్రారంభం కానుంది. ఇప్పటికే చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని వివరాలను, విశేషాలను త్వరలోనే మరో సందర్భంలో మీడియాకు ప్రకటించనున్నట్లు ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య లు తెలిపారు.
Naveen Polishetty’s next with Sithara Entertainments and Fortune Four Cinemas titled Anaganaga Oka Raju
Popular young actor Naveen Polishetty is teaming up with first-time director Kalyan Shankar for a hilarious entertainer, produced by Sithara Entertainments in collaboration with Fortune Four Cinemas. The makers have officially announced the title of the film, Anaganaga Oka Raju, today innovatively through a funny video where the lead character Raju is getting ready for his wedding in style.
In the title announcement video, Raju, in the middle of a marriage photoshoot, is planning for his honeymoon in Hawaii. He is even instructing that the photos should be good enough to go viral on social media, something that celebrity couple Vicky Kaushal and Katrina Kaif should be envious of. He even talks of readying a vaddanam for himself, like a WWF belt with over five kilos of gold. He throws various tantrums about his footwear too but at the end of it, confirms that the film will be the most entertaining event of the decade when it hits theatres.
Anaganaga Oka Raju had another surprise in store where the most-happening composer S Thaman is announced as its music director, raising the audience’s expectations about the film. The entertaining glimpse just shows the non-stop entertainer that Anaganaga Oka Raju promises to be. Suryadevara Naga Vamsi and Sai Soujanya are bankrolling the film. More details about the film’s cast and crew will be out soon.
Stars: Naveen Polishetty
Music: Thaman S
Producer: Naga Vamsi S & Sai Soujanya
Written and Directed by Kalyan Shankar
Banners: Sithara Entertainments & Fortune Four Cinemas
Presents: PDV Prasad
PRO: Lakshmi Venugopal
AOR_FirstLook AOR_Still

Bheemlanayak new poster

BN-Sankranthi Poster BN-Sankranthi Poster-Still

Sithara Entertainments unveils a feel-good first glimpse of Swathi Muthyam, a family entertainer starring Ganesh Bellamkonda, Varsha Bollamma

హీరోగా “గణేష్ బెల్లంకొండ” పరిచయ చిత్రం ”స్వాతిముత్యం” ప్రచార చిత్రం విడుదల
*వినోదమే ప్రధానంగా సంక్రాంతి శుభాకాంక్షలు తో ‘స్వాతిముత్యం‘ ప్రచార చిత్రం
*ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం”స్వాతిముత్యం”
‘గణేష్ బెల్లంకొండ‘ హీరోగా
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం
‘స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
సంక్రాంతి పర్వదినాన ‘స్వాతిముత్యం’ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. సరదాగా సాగే ఈ ప్రచార చిత్రం ను గమనిస్తే…
“రావు రమేష్ ఎవరితోనో ..ఏరా అమ్మాయిని కలిశావా..? పంతులు గారు తో ఇప్పుడే మాట్లాడాను…అమ్మాయి వాళ్ళ నాన్నకి పట్టింపులు ఎక్కువ పద్దతి అది ఇది అని బుర్ర తినేస్తాడంటాడేంటి అనే మాటలతో ప్రచార చిత్రం ప్రారంభమవుతుంది. ఆ తరువాత
హీరోయిన్ తన తల్లి బుగ్గమీద ….హీరో తండ్రి బుగ్గమీద ముద్దు పెట్టుకొంటూ సెల్ఫీ దిగే సన్నివేశాలు… తదనంతరం
హీరోయిన్ హీరోతో నువ్వు వర్జిన్ వా అని అడగటం దానికి అది…అంటూ హీరో నీళ్ళు నమలటం..మరో దృశ్యంలో..
ఇప్పుడు ఏంటి కాళ్ళు కడగాలి అంతే కదా..! అని హీరో చేసే పని చూసి….
ఎదవ… ఎదవ సన్నాసి నువ్వు కాదు.. ఆళ్లు నీ కాళ్ళు కడగాలి.. నా పరువు తీసేస్తున్నాడు ఈడు అంటూ రావు రమేష్ విసుక్కోవడం…
ఎవరి కాళ్ళు ఎవరు కడిగితే ఏంటి నాన్న అంటూ హీరో అనటం ఇలా సరదాగా ముగుస్తుంది ఈ వీడియో చిత్రం. వినోదమే ప్రధానంగా ఈ చిత్రం ఆద్యంతం రూపొందుతుందని ఇందులోని దృశ్యాలు చూసిన ఎవరికైనా అనిపిస్తుంది. సంభాషణలు సైతం ఈ విషయాన్ని బలపరుస్తాయి.
దర్శకుడు మాటల్లో చెప్పాలంటే ‘స్వాతిముత్యం’ లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి.
ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ.
గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.
‘స్వాతిముత్యం’ చిత్రానికి
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయా గ్రహణం: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
కళ: అవినాష్ కొల్ల
పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన- దర్శకత్వం: లక్ష్మణ్.కె.కృష్ణ
Sithara Entertainments unveils a feel-good first glimpse of Swathi Muthyam, a family entertainer starring Ganesh Bellamkonda, Varsha Bollamma
Swathi Muthyam is a refreshing family entertainer bankrolled by Suryadevara Naga Vamsi under the leading production house Sithara Entertainments. The film that marks the acting debut of Ganesh Bellamkonda, features Varsha Bollamma as the female lead. Directed by Lakshman K Krishna, Swathi Muthyam has music by Mahathi Swara Sagar. Commemorating Sankranthi, the makers have launched the film’s first glimpse today.
The first glimpse of Swathi Muthyam takes viewers through a tale of two youngsters on the cusp of marriage. A guy and a girl agree on an alliance fixed by their parents and meet each other. While the guy tries hard to get into the good books of the girl with a few gestures that turn unintentionally funny, the girl surprises him with her confidence when she asks him about his virginity. The glimpse ends on a funny note when the bridegroom washes the legs of the bride’s father as part of ‘kanyadanam’.
Ganesh Bellamkonda’s innocence and Varsha Bollamma’s next-door-girl appeal in the first glimpse instantly win you over. Swathi Muthyam revolves around an innocent youngster and touches upon themes like life, love, marriage, looking at modern-day relationships in a newer light. The supporting cast comprises senior actor Naresh, Rao Ramesh, Subbaraju, Vennela Kishore, Harshavardhan, Pammi Sai, Goparaju Ramana, Siva Narayana, Pragathi, Surekha Vani, Sunaina, Divya Sripada.
A major part of Swathi Muthyam’s filming is complete. More details about the film will be announced soon.
Crew Details :
Music: Mahathi Swara Sagar
Cinematography: Suryaa
Editor: Navin Nooli
Art: Avinash Kolla
Pro: Lakshmi Venu Gopal
Presents: PDV Prasad
Producer: Suryadevara Naga Vamsi
Written and Directed by Lakshman K Krishna
SM-Still2 InstaStory-SM-GlimpseOutNow Swathimuthyam - First Glimpse Still

Sithara Entertainments announces their next, ProductionNo16 in association with Fortune4Cinemas

*పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం

*నేడు వైష్ణవ్ తేజ్  పుట్టిన రోజు సందర్భంగా అధికారిక ప్రకటన.
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపు దిద్దుకోవటానికి రంగం సిద్ధమైంది. నేడు వైష్ణవ్ తేజ్  పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ లు ఈ మేరకు అధికారిక ప్రకటన ను ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త  మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. అంతేకాదు భారీస్థాయిలో నిర్మాణం జరుగుతుందనిపిస్తుంది ఈ వీడియోను పరికిస్తే. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య.  ఇప్పటికే ధనుష్ హీరోగా తెలుగు, తమిళం లో  నిర్మితమవుతున్న ‘సార్’, నవీన్ పోలిశెట్టి హీరో గా మరోచిత్రం, సిద్దు జొన్నలగడ్డ హీరోగా ‘ డిజే టిల్లు’, చిత్రాలు సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో నిర్మిత మవుతున్న విషయం విదితమే.
Sithara Entertainments and Fortune Four Cinemas announce #ProductionNo16 starring Panja Vaisshnav Tej
Leading banner Sithara Entertainments is joining forces with Fortune Four Cinemas for a massive project, tentatively titled #ProductionNo16, featuring upcoming star Panja Vaisshnav Tej in the lead. Commemorating actor Panja Vaisshnav Tej’s birthday today, the production houses formally announced the project with a brief video, showcasing a glimpse of what can audience expect from the exciting collaboration.
“A rising star who conquered hearts with his first wave, gearing up for a mass makeover with #Production16, Happy Birthday Panja Vaisshnav Tej,” the announcement video says, in the backdrop of a few golden ornaments, hinting at something grand and huge in the offing. The makers promise a mass treat with Panja Vaisshnav Tej this time and the stylish background score certainly has the crowds curious with regard to the film’s premise and backdrop.
Suryadevara Naga Vamsi and Sai Soujanya are bankrolling the yet-to-be-titled film. More details around the film’s cast, crew and director would be revealed shortly. Sithara Entertainments and Fortune Four Cinemas are collaborating for a handful of much-awaited projects including actor Dhanush’s Tamil-Telugu bilingual Sir/Vaathi, an untitled film featuring Naveen Polishetty, the thriller comedy DJ Tillu with Siddhu Jonnalagadda.
Producers: Naga Vamsi S – Sai Soujanya
vaishnav tej

DJ Tillu: Tillu Anna DJ Pedithe Song Release | Youtube Link, Stills & Design

లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట’ అంటూ పాటందుకున్న ’డిజె టిల్లు’ సిద్దు జొన్నలగడ్డ, 

*గాయకుడు రామ్ మిరియాల స్వరాన్ని, స్వరాల్ని అందించిన గీతం
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా
టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం
 ‘డిజె టిల్లు’. 
 
ఈ చిత్రానికి సంభందించిన ఓ గీతం ఈ రోజు విడుదల అయింది. గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాలు సమకూర్చిన ఈ గీతం విడుదల ఆయన క్షణం నుంచే చార్ట్ బస్టర్ లో దూసుకు వెళుతోంది. సామాజిక మాధ్యమాలలో సైతం స్పందన డీజే స్థాయిలో హోరెత్తుతోంది. పాట వివరాలు, విశేషాలలోకి వెళితే…..
“లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట
టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల
మల్లేశన్న దావత్ ల బన్ను గాని బారాత్ ల
టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దుంకాల” అనే ఈ పల్లవి గల గీతాన్ని గీతా రచయిత కాసర్ల శ్యామ్ రచించారు. ఈ గీతం గురించి ఆయన మాటల్లోనే…
హీరో క్యారెక్టరైజేషన్ చెప్పే ఒక పాట రాయాలని డైరెక్టర్ గారు చెప్పి,రామ్ మిరియాల ఇచ్చిన మంచి బీట్ ఉన్న ట్యూన్ పంపించారు…పక్కా హైదరాబాదీ రిదం తో ఉన్న ట్యూన్ వినగానే బాగా నచ్చింది.. హైదరాబాద్ గల్లీలల్లో  ఒక రకమైన ఆటిట్యూడ్ తో ఉండే యంగ్ కుర్రాళ్ళు గుర్తొచ్చారు..ఏరియాల పేర్లతో పల్లవి ప్రారంభించి,హీరోపై మిగతా మిత్రులు, ఫ్యాన్స్ కోణంలో హుక్ లైన్ రాసా..తరువాత టీజర్ లో హీరో నటన,స్వాగ్ చూసాక చరణం అప్రయత్నంగా పలికింది… పాట ప్రోమోనే అద్భుతమైన వ్యూస్ రాబట్టుకుంది.. పాట అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను…
మంచి డాన్సింగ్ నంబర్ నా కలం లో నుండి రావడం,అందరి సెలెబ్రేషన్ లలో నేను ఒక భాగమవ్వడం సంతోషం గా ఉందని ఈ గీతం రచయిత కాసర్ల శ్యామ్ అంటున్నారు. భాను నృత్యరీతులు సమకూర్చారు ఈ గీతానికి.
ఇప్పటివరకు ఈ చిత్రానికి సంభందించి విడుదల అయిన ప్రచార చిత్రాలు, ఇటీవల విడుదల అయిన‘డిజె టిల్లు’ టీజర్ కూడా పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకున్నాయన్నది స్పష్టం. అటు టీజర్ లో దృశ్యాలు, సంభాషణలు ఇటు ఈ గీతంలోని నృత్యాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. జనవరి 14-2022 న విడుదల అవుతున్న ‘డిజె టిల్లు’ ప్రేక్షకుల్లోఆసక్తిని రేకెత్తిస్తోంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదు అనే విధంగా చిత్ర ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.
నూతన దర్శకుడువిమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు ఆయన .
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రాశ్రీనివాస్ నటిస్తున్నారు.
రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
మాటలు: సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ
 
Come, shake a leg with DJ Tillu for Ram Miriyala’s groovy dance number Tillu Anna DJ Pedithe 
DJ Tillu, starring Siddhu Jonnalagadda and Neha Shetty in the lead roles, is a mad-cap thriller directed by debutant Vimal Krishna and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. Ahead of the film’s release on January 14 for the Sankranti season, Tillu Anna DJ Pedithe, a fast-paced party number was launched today and has caught the fascination of music lovers.
Staying true to Siddhu’s character as a local Hyderabadi DJ in the film, the number is high on energy and brims with a folksy flavour unique to Telangana. One of the most happening playback singers in the tinsel town, Ram Miryala, has sung and composed the song penned by popular lyricist Kasarla Shyam, synonymous with delivering one chartbuster after the other.
‘Lalaguda Amberpeta Mallepalli Malakpeta..Tillu anna dj pedithe tilla tilla aadalaa…Mallesanna dawath la bannu gaani baarat la.. Tillu anna digindu ante dinchak dinchak dhunkalaa,’ the song, filled with apt local references and boasting of great rhythm, takes off on an exuberant note, with an irresistibly catchy musical hook. Besides Siddhu’s energetic dance moves, the lyrical video offers a colourful sneak-peek into traditions, festivals that are integral to the life of a Hyderabadi. The composer does a fine job in seamlessly blending this indie-musical flavour into a mainstream film.
“The director wanted me to write a song that’ll mirror Siddhu’s characterisation in the film and sent across a catchy tune. I was instantly drawn to the number that captured the musical spirit of Hyderabad perfectly. I was reminded of those typical arrogant local guys across Hyderabadi streets and hence thought it would be apt to start the song with the names of various areas in the city,” lyricist Kasarla Shyam says.
“The hook line was written keeping fans in mind and my job was made easier when I noticed Siddhu’s attitude in the film. The lines just flowed organically. I’m happy with the response to the song promo and quite eager to know what audiences have to say about the full song too. I am satisfied I could do my bit to lift the spirits of audiences with a kickass dance number. Bhanu’s choreography does complete justice to its energy levels,” he adds.
It’s evident that DJ Tillu and its wacky universe has resonated with young audiences from the stills and the promos, including the recently launched teaser. The film is further bolstered by the presence of music director S Thaman, who’s come on board to compose the background score. Composer Sri Charan Pakala is also part of the project. Directed by debutant Vimal Krishna, the film has a formidable supporting cast, comprising Prince Cecil, Brahmaji, Pragathi and Narra Srinivas.
Cast & Crew:
Stars: Siddhu, Neha Shetty, Prince Cecil, Brahmaji, Pragathi and Narra Srinivas
Story & Screenplay by: Vimal Krishna & Siddhu
Dialogues: Siddhu
Art Director: Avinash Kolla
Music Director: Sri Charan Pakala
Editor: Navin Nooli
DOP: Sai Prakash Ummadisingu.
Executive Producer: Dheeraj Mogilineni
Producer: Suryadevara Naga Vamsi
Director: Vimal Krishna
Banner: Sithara Entertainments
Presenter: PDV Prasad
Tillu Anna DJ Pedithe - Song Still Tillu Anna DJ Pedithe-OutNow