*Youth Star Nithin and Keerthy Suresh’s enthralling and fun filled song.

* యూత్ స్టార్ ‘నితిన్, కీర్తి సురేష్‘ ల వినోద భరిత గీతం

* ‘రంగ్ దే’ చిత్రం  నుంచి ద్వితీయ గీతం విడుదల
యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ
‘రంగ్ దే’.  ’ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.
ఇటీవల ‘రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన  తొలి గీతానికి  కోటి కి పైగా వ్యూస్ వచ్చిన నేపథ్యంలో
ఈ చిత్రానికి సంభందించిన మలి గీతాన్ని వీడియో రూపంలో ఈరోజు విడుదల చేసింది చిత్రం యూనిట్.  ’ప్రేమ’ తో కూడిన కుటుంబ కధా చిత్రం అయిన ఈ  ’రంగ్ దే’ లోని ఈ ద్వితీయ గీతం వివరాల్లోకి వెళితే .
“సింపుల్ గుండే లైఫు.. టెంపుల్ రన్ లా మారే..
ఈ రంగు రంగు లోకం .. చీకట్లోకి జారే
లవ్లీ గుండే కళలే.. లైఫే  లేనిదాయే
స్మైలీ  లాంటి ఫేసే…. స్మైలే  లేనిదాయే”
అంటూ సాగే ఈ పల్లవి గల గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. గాయకుడు సాగర్ గాత్రంలో ఈ గీతం ఆకట్టుకుంటుంది. ప్రసిద్ధ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి.  చిత్ర నాయకా, నాయిక లయిన నితిన్, కీర్తి సురేష్ లపై  చిత్రీకరించిన ఈ  గీతాన్ని వెండితెరపై వినోద భరితంగా వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు దర్శకుడు వెంకీ అట్లూరి. నృత్య దర్శకుడు శేఖర్ ఈ సందర్భ శుద్ధి గల గీతానికి భిన్నమైన నృత్య రీతులను సమకూర్చారు.
‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్రం ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దీనికి రూపకల్పన చేశారు దర్శకుడు ‘వెంకీ అట్లూరి’. యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుందన్న నమ్మకం విడుదల అవుతున్న ప్రచార చిత్రాలు, వీడియో దృశ్యాలు, గీతాలు మరింత పెరిగేలా చేస్తున్నాయి.

ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్)
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశీ
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి
*Youth Star Nithin and Keerthy Suresh’s enthralling and fun filled  song.
* The second from the movie ‘Rang De’ has been released
The first song of the movie ‘Rang De’ was recently released which got over one crore views . With much excitement for the movie and it’s music, the second song of ‘Rang De’ has been released today in the form a lyrical video by the unit. More details about the song from Rang De – which is a love filled family entertainer.
The lyrics have been penned by Srimani and the song has been sung by Sagar. Arguably the best music director in the industry, Rockstar DSP’s composition has taken the music of this movie to unparalleled levels. Nithin and Keerthy Suresh have been portrayed in an attractive manner by the young and talented director Venky Atluri. The song master, Shekar has excelled at his task to choreograph the song.
‘Rang De’ is the first movie with the combination of Youth star Nithin and  ’Mahanati’ Keerthy Suresh which is being bankrolled  by Sithara Entertainments.
The movie ‘Rang De’ is set to release in theaters on March 26th 2021. The director Venky Atluri has conveyed that this movie can be enjoyed thoroughly with the whole family. He also expressed that the chemistry of the lead couple Nithiin and Keerthy Suresh would mesmerize everyone. It is also worthy of note that the recently released lyrical video of the song along with a few pictures from the movie have received immense popularity within a very short span.
Apart from the lead pair of Nithin and Keerthy Suresh, prominent actor Naresh,  Kousalya, Rohini,Bramhaji, Vennela Kishore,Vineeth, Gayithri raghuram,  Satyam Rajesh, Abhinav Gomatam and  Suhas play pivotal characters in the movie.
Dop- P.C Sreeram
Music- Devi Sri Prasad
Editing- Naveen Nooli
Art- Avinash Kolla
Additional Screenplay- Satish Chandra Pasam
Executive Producer – S. Venkatarathnam (Venkat)
Pro: Lakshmivenugopal
Presented by PDV Prasad
Produced by Suryadevara Nagavasmi
Written and Directed by Venky Atluri.
b copy 6s-034 copy Rangde-2nd lyrical copy

Art director Anand Sai is on board for the much awaited movie of Power Star Pawan Kalyan and Harish Shankar produced by Mythri Movie Makers.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న చిత్రానికి కళా దర్శకునిగా ‘ఆనంద్ సాయి’
కళా దర్శకుడు ‘ఆనంద్ సాయి’
పరిచయం వాక్యాలు అవసరం లేని,లబ్ధ ప్రతిష్ఠుడైన కళా దర్శకుడు ఆయన..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రం మొదలుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రం వరకు దగ్గర దగ్గరగా నూరు చిత్రాల వరకు, ఆయా చిత్రాలలో తన కళాదర్శకత్వ నైపుణ్యంతో ఎన్నో ప్రశంసలు, మరెన్నో విజయాలు, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకున్నారు. గత ఐదు సంవత్సరాలకు పైగా యాదాద్రి
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవటంతో తిరిగి కళాదర్శకునిగా సినిమాలకు పునరంకింతం అవనున్నారు. కొంత కాలం విరామం తరువాత ఆయన ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా, భారీ స్థాయిలో, భారీ వ్యయంతో నిర్మించనున్న చిత్రానికి కళా దర్శకునిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయన తొలి చిత్రం, సుదీర్ఘ విరామం తరువాత ఆయన కళా దర్శకునిగా బాధ్యతలు స్వీకరిస్తున్న చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిదే కావటం గమనార్హం. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్,దర్శకుడు హరీష్ శంకర్ లు కళా దర్శకుడు ‘ఆనంద్ సాయి’ గార్కి ఘన స్వాగతం పలుకుతూ, గౌరవ పూర్వకంగా తమ చిత్రానికి కళా దర్శకునిగా ఆయన పేరును అధికారికంగా ప్రకటిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచార చిత్రాన్ని విడుదలచేశారు.Art director Anand Sai is on board for the much awaited movie of Power Star Pawan Kalyan and Harish Shankar produced by Mythri Movie Makers.Anand Sai as an art director needs no introduction. Starting from Power Star Pawan Kalyan’s ‘Tholiprema’ to Mega Power Star Ram Charan’s ‘Yevadu’, Anand Sai has worked for nearly hundred movies, winning appreciation, accolades and state government awards for his work. After dedicating the last five years of his expertise for the Yadadri Sree Lakshmi Narasimha Swamy temple as the chief architect, he has decided to step back into films since the temple is in its last leg of completion. After a small hiatus, he would be on sets as the art director for the prestigious project produced by popular production house Mythri Movie Makers in the combination of Power Star Pawan Kalyan and director Harish Shankar with grandeur. It is notable that both his debut and his comeback film are with Power Star Pawan Kalyan. The producers of Mythri Movie Makers Mr. Naveen Yerneni, Mr. Y. Ravi Shankar along with director Harish Shankar have welcomed art director Anand Sai and have officially announced his name as the Art Director with a poster on social media.

Magnificent Art Director Anand Sai garu is back to Cinema after dedicating his 5 years of craftsmanship for Yadadri Temple – The Pride of Telangana.

Welcome on board Anand Sai garu for #PSPK28@PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose @MythriOfficial
1 copy Anand Sai

*Rang De prepares itself for a colourful release.

*విడుదలకు రంగులద్దుకుంటున్న ‘రంగ్ దే’

* యూత్ స్టార్ ‘నితిన్, కీర్తి సురేష్‘ ల ‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల

* ‘రంగ్ దే’ ప్రచార సంబరాలు షురూ…!

యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ’ సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ ‘రంగ్ దే’. ‘ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. గత నాలుగు రోజులుగా చిత్రంలోని ఓ గీతానికి సంభందించిన దృశ్యాలు చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తి చేసుకున్నది ఈ చిత్రం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి 2021 మార్చి 26న ధియేటర్ లలో ‘ రంగ్ దే’ సంబరాలు షురూ అవుతాయని తెలిపారు. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దీనికి రూపకల్పన చేశారు దర్శకుడు ‘వెంకీ అట్లూరి’.యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుంది. ఇటీవల ‘రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన దృశ్యాలతో కూడిన వీడియో, అలాగే ఓ గీతం బహుళ ప్రేక్షకాదరణ పొందిన విషయం విదితమే. ‘ప్రేమ’ తో కూడిన కుటుంబ కధా చిత్రం ఈ ‘రంగ్ దే’. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్) పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్ సమర్పణ: పి.డి.వి.ప్రసాద్ నిర్మాత:సూర్యదేవర నాగవంశీ రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి

*Rang De prepares itself for a colourful release.

* Youth star ‘Nithin’, Keerthy Suresh starrer Rang De is all set to release on 26th March.

* The promotion festivities for Rang De have been kicked off.

‘Rang De’ is the first movie with the combination of Youth Star ‘Nithin’and ‘Mahanati’ Keerthy Suresh which is being bankrolled by Sithara Entertainments. In the past 4 days, Rang De team have completed the shoot of a song in the movie. Currently the post production process is underway. The producer of the movie, Surya Devara Naga Vamshi has announced that the audience can celebrate ‘Rang De’ in theaters from March 26th 2021. The director Venky Atluri has conveyed that this movie can be enjoyed thoroughly with the whole family. He also expressed that the chemistry of the lead couple Nithiin and Keerthy Suresh would mesmerize everyone. It is also worthy of note that the recently released lyrical video of the song along with a few pictures from the movie have received immense popularity within a very short span. After expertly crafting the love genre with ‘Tholi Prema’ and ‘Mr.Majnu’, highly skillful and young Director, Venky Atluri, has been entrusted with the role of directing this movie by producer ‘Suryadevara Nagavamsi’. Apart from the lead pair of Nithin and Keerthy Suresh, prominent actor Naresh, Kousalya, Rohini,Bramhaji, Vennela Kishore,Vineeth, Gayithri raghuram, Satyam Rajesh, Abhinav Gomatam and Suhas play pivotal characters in the movie. Dop- P.C Sreeram Music- Devi Sri Prasad Editing- Naveen Nooli Art- Avinash Kolla Additional Screenplay- Satish Chandra Pasam Executive Producer – S. Venkatarathnam (Venkat) PRO: Lakshmi Venugopal Presented by PDV Prasad Produced by Suryadevara Nagavasmi Written and Directed by Venky Atluri.

Selective-Color-1 image0002 image0003 image0001 image0004

Varudu Kaavalenu – Kola Kalle Ila… Song Press Release and Stills

*ప్రేమికుల దినోత్సవం కానుకగా ‘వరుడు కావలెను‘ నుంచి ‘నాగ శౌర్య , రీతువర్మ’ ల ప్రేమ గీతం విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్

*ప్రఖ్యాత గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన మరో సుమధురమైన గీతం 
*  సంగీత, సాహిత్యాల కలబోత  ఈ వీడియో చిత్రం 
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం  ‘వరుడు కావలెను‘
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నేడు (14-2-2021) ‘వరుడు కావలెను‘ చిత్రం యూనిట్ చిత్రం లోని ఓ గీతాన్ని విడుదల చేశారు. ఈ వీడియో చిత్రాన్ని వీక్షిస్తే సంగీత, సాహిత్యాల కలబోత అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే….
‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా
నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా
కొంటె నవ్వే అలా చంపుతుంటే ఎలా
కొత్త రంగుల్లో ప్రాణమే తడిసేంతలా
మళ్ళీ మళ్ళీ రావే పూలజల్లు తేవే‘‘ అనే సాహిత్యం తో సాగే ఈ గీతాన్ని గీత రచయిత రాంబాబు గోసల రచించారు. ప్రఖ్యాత గాయకుడు సిద్ శ్రీరామ్ మరోసారి వీనుల విందుగా ఆలపించిన ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు ప్రాణం పోశాయి. చిత్ర నాయకా నాయికలు మధ్య ప్రేమ కు తెర రూపం గా  ఈ గీతం కనిపిస్తుంది. సంగీతం, సాహిత్యం, స్వరం ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది. వీటికి తోడు ‘నాగ శౌర్య, రీతువర్మ‘ లు అభినయం కట్టిపడేస్తుంది.
గీతాన్ని ఆలపించిన గాయకుడు సిద్ శ్రీరామ్ మాట్లాడుతూ..‘ చిత్ర సంగీత దర్శకులు విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమ కూర్చిన ఈ శ్రావ్య మైన గీతాన్ని ఆలపించటం ఎంతో ఆనందంగా ఉంది. ప్రేమికుల దినోత్సవం రోజున ఈ గీతం సంగీత ప్రియులకు చేరువ కావటం మరెంతో సంతోషం గా ఉందన్నారు.
ఇంతకుముందు చిత్రం పేరును అధికారిక ప్రకటన చేస్తూ ఓ వీడియో, ఆ తరువాత 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఓ  ప్రచారచిత్రం, కథానాయకుడు నాగ శౌర్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన వీడియో వంటి ప్రచారాలకు ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ప్రాచుర్యం లభించింది .. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  ‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం  చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.
నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.
ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్     సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
 
నిర్మాత: సూర్య దేవర నాగవంశి
 
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
 
*a valentines day gift ‘Varudu  Kaavalenu’ from Naga Shaurya and Ritu Varma’s love song released by production company Sitara Entertainments
*Famous singer Sid Sriram sung another melodious song
*a great combination of music and lyrics
an prestigious production banner Sitara Entertainments producing a movie with young hero Naga Shaurya, gorgeous heroine Ritu Varma introducing debutant director Lakshmi Sowjanya with a title ‘Varudu Kaavalenu’
On a valentine’s day occassion today (14-2-2021) ‘Varudu Kaavalenu’ movie unit released a melodious song. This video seems an elegant combination of music and lyrics going into details….
“kolakalley ila
gundey gilley ela
neeli mabbullo neney telenthala
kontey navvey ala
champutuntey ela
kotta rangullo pranamey tadisenthala
malli malli raavey poola jallu thevey” written by an lyric writter Rambabu Gosala. Famous singer Sid Sriram another time sung a melodious song, Vishal Chandrashekhar gave a beautiful music to this song like all songs in the album. It stands out to show the love between hero and heroine in the movie. Music and lyrics gave a competetive feel to entertain us. Along with this ‘Naga Shaurya and Ritu Varma’s performance is a great addition to this song.
Sid sriram said he was super excited to announce about this beautiful love song which he feels honoured to work with Vishal Chandrashekhar on this melody song. He extended his love to all on this Valentines day …
Already a video introducing the title, new year wishes video, and on our hero Naga Shaurya’s birthday another video has been released and got humoungous response from the audience. Shooting is still in progress. ‘Varudu Kaavalenu’ story, screenplay, dialogues, songs, scenes, emotions, all cast performances are taking this to a whole new level and entertains all types of audiences, said producer and director.
Naga Shourya and Ritu Varma as a leading pair, Nadiya, Murali Sharma, Vennela Kishore, Praveen, Ananth, Kiriti Damaraju, Rangasthalam Mahesh, Arjun Kalyan, Vaishnavi Chaitanya, Siddiksha are the main leads.
For this movie
Dialogues: Ganesh Kumar Ravuri,
Cinematographer: Vamsi Patchipulusu,
Music : Vishal Chandrashekhar
Editor: Navin Nooli
Art: A.S Prakash
PRO: Lakshmivenugopal
Presents by: P.D.V Prasad
 
Produced by: Surya Devara NagaVamsi
 
Story – Screenplay – Direction: Lakshmi Sowjanya
vk copy Out Now-1a 30X40-013 copy ACS_8565-1 ACS_9463 copy 6 copy

Rs 54.51 lakh donated for construction of Ayodhya Ram Mandir with inspiration from Sri Pawan Kalyan

శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో

అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ.54.51లక్షల విరాళం

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో చిత్రాలు నిర్మిస్తున్న అయిదుగురు నిర్మాతలు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భూరి విరాళం చేశారు. శ్రీ ఎ.ఎం.రత్నం (మెగా సూర్య ప్రొడక్షన్స్), శ్రీ ఎస్. రాధాకృష్ణ (చినబాబు), శ్రీ దిల్ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్), శ్రీ నవీన్ ఎర్నేని (మైత్రి మూవీ మేకర్స్), శ్రీ బండ్ల గణేష్ (పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్) కలసి రూ.54.51 లక్షల విరాళాన్ని అయోధ్య రామ మందిరం కోసం ఇచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే రూ.30 లక్షలు విరాళాన్ని చెక్కు రూపంలో తిరుపతిలో అందించిన విషయం విదితమే. ఆ స్ఫూర్తితోనే నిర్మాతలు విరాళం ఇచ్చారు. హైదరాబాద్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా నిర్మాతలు- ఆర్.ఎస్.ఎస్. తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీ దేవేందర్ జీ గారికి చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ బాఘ్ సంఘ్ చాలక్ డా. వేదప్రకాష్, నిర్మాత శ్రీ ఎ.దయాకర్ రావు పాల్గొన్నారు.

Rs 54.51 lakh donated for construction of Ayodhya Ram Mandir with inspiration from Sri Pawan Kalyan

Five cine producers, who are producing films with Janasena Party President Sri Pawan Kalyan, have donated funds for Ayodhya Ram Mandirconstruction. The producers include Sri A M Ratnam(Mega Surya Productions), Sri S Radhakrishna(Chinababu), Sri Dil Raju (Sri Venkateswara Creations), Sri Naveen Yerneni (Mythri Movie Makers) and Sri Bandla Ganesh (Parameswara Art Productions) gave Rs 54.51 lakh as donation for Ayodhya Ram temple. It may be recalled that Sri Pawan Kalyan has already donated Rs 30 lakh in the form of a bank cheque in Tirupati recently. Taking inspiration from him, the film producers gave their donation. The producers have handed over the cheques to RSS Telangana region pracharak Sri Devender ji in the presence of Sri Pawan Kalyan in Hyderabad. Golkonda Bagh Sangh chalak DrVedaprakash, producer Sri A Dayakar Rao participated in the programme.

P HariprasadPolitical Secretary to Party President

 

Rs 54 photos 1 (4) photos 1 (2) photos (3) శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో