*Youth Star Nithin and Keerthy Suresh’s enthralling and fun filled song.

* యూత్ స్టార్ ‘నితిన్, కీర్తి సురేష్‘ ల వినోద భరిత గీతం

* ‘రంగ్ దే’ చిత్రం  నుంచి ద్వితీయ గీతం విడుదల
యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ
‘రంగ్ దే’.  ’ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.
ఇటీవల ‘రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన  తొలి గీతానికి  కోటి కి పైగా వ్యూస్ వచ్చిన నేపథ్యంలో
ఈ చిత్రానికి సంభందించిన మలి గీతాన్ని వీడియో రూపంలో ఈరోజు విడుదల చేసింది చిత్రం యూనిట్.  ’ప్రేమ’ తో కూడిన కుటుంబ కధా చిత్రం అయిన ఈ  ’రంగ్ దే’ లోని ఈ ద్వితీయ గీతం వివరాల్లోకి వెళితే .
“సింపుల్ గుండే లైఫు.. టెంపుల్ రన్ లా మారే..
ఈ రంగు రంగు లోకం .. చీకట్లోకి జారే
లవ్లీ గుండే కళలే.. లైఫే  లేనిదాయే
స్మైలీ  లాంటి ఫేసే…. స్మైలే  లేనిదాయే”
అంటూ సాగే ఈ పల్లవి గల గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. గాయకుడు సాగర్ గాత్రంలో ఈ గీతం ఆకట్టుకుంటుంది. ప్రసిద్ధ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి.  చిత్ర నాయకా, నాయిక లయిన నితిన్, కీర్తి సురేష్ లపై  చిత్రీకరించిన ఈ  గీతాన్ని వెండితెరపై వినోద భరితంగా వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు దర్శకుడు వెంకీ అట్లూరి. నృత్య దర్శకుడు శేఖర్ ఈ సందర్భ శుద్ధి గల గీతానికి భిన్నమైన నృత్య రీతులను సమకూర్చారు.
‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్రం ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దీనికి రూపకల్పన చేశారు దర్శకుడు ‘వెంకీ అట్లూరి’. యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుందన్న నమ్మకం విడుదల అవుతున్న ప్రచార చిత్రాలు, వీడియో దృశ్యాలు, గీతాలు మరింత పెరిగేలా చేస్తున్నాయి.

ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్)
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశీ
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి
*Youth Star Nithin and Keerthy Suresh’s enthralling and fun filled  song.
* The second from the movie ‘Rang De’ has been released
The first song of the movie ‘Rang De’ was recently released which got over one crore views . With much excitement for the movie and it’s music, the second song of ‘Rang De’ has been released today in the form a lyrical video by the unit. More details about the song from Rang De – which is a love filled family entertainer.
The lyrics have been penned by Srimani and the song has been sung by Sagar. Arguably the best music director in the industry, Rockstar DSP’s composition has taken the music of this movie to unparalleled levels. Nithin and Keerthy Suresh have been portrayed in an attractive manner by the young and talented director Venky Atluri. The song master, Shekar has excelled at his task to choreograph the song.
‘Rang De’ is the first movie with the combination of Youth star Nithin and  ’Mahanati’ Keerthy Suresh which is being bankrolled  by Sithara Entertainments.
The movie ‘Rang De’ is set to release in theaters on March 26th 2021. The director Venky Atluri has conveyed that this movie can be enjoyed thoroughly with the whole family. He also expressed that the chemistry of the lead couple Nithiin and Keerthy Suresh would mesmerize everyone. It is also worthy of note that the recently released lyrical video of the song along with a few pictures from the movie have received immense popularity within a very short span.
Apart from the lead pair of Nithin and Keerthy Suresh, prominent actor Naresh,  Kousalya, Rohini,Bramhaji, Vennela Kishore,Vineeth, Gayithri raghuram,  Satyam Rajesh, Abhinav Gomatam and  Suhas play pivotal characters in the movie.
Dop- P.C Sreeram
Music- Devi Sri Prasad
Editing- Naveen Nooli
Art- Avinash Kolla
Additional Screenplay- Satish Chandra Pasam
Executive Producer – S. Venkatarathnam (Venkat)
Pro: Lakshmivenugopal
Presented by PDV Prasad
Produced by Suryadevara Nagavasmi
Written and Directed by Venky Atluri.
b copy 6s-034 copy Rangde-2nd lyrical copy