SeetaManohara Sree Raghava

Dhanush – Venky Atluri – Sithara Entertainments & Fortune Four Cinemas Bilingual Movie titled as ‘SIR’ (Telugu)/’Vaathi’ (Tamil)

 

ధనుష్ – వెంకీ అట్లూరి – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ద్విభాషా చిత్రం టైటిల్‌ ‘సార్‌’ (తెలుగు)/ ‘వాతి’ (తమిళం)
పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో జతకడుతోంది. ఆయ‌న‌తో తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ది. త‌మిళ వెర్ష‌న్‌కు ‘వాతి’, తెలుగు వెర్ష‌న్‌కు ‘సార్’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ఉత్తేజ‌భ‌రిత‌మైన‌ టైటిల్ లుక్ మోషన్ పోస్టర్‌ను  నిర్మాత‌లు ఆవిష్కరించారు.
టైటిల్ రివీల్ వీడియోలో ఈ సినిమా “యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్” అని చెప్పారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్ ప్ర‌కారం ధ‌నుష్ ఒక జూనియ‌ర్ కాలేజీ లెక్చ‌ర‌ర్‌గా న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. టైటిల్ డిజైన్‌లో పెన్నుపాళీ క‌నిపిస్తోంది. అంటే ఇది ఒక పీరియాడిక‌ల్ మూవీ అనీ, హీరో త‌న క‌లం బ‌లంతో స్టూడెంట్స్‌కు ఒక రోల్ మోడ‌ల్ అవుతాడ‌నీ ఊహించ‌వ‌చ్చు. మొత్తంగా ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ను చూస్తుంటే, ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన, ఉత్తేజ‌క‌ర‌మైన‌ క‌థ‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌న ముందు ప్రెజెంట్ చేయ‌నున్నార‌నే న‌మ్మ‌కం క‌లుగుతోంది. చిత్రం పేరుతో కూడిన ప్రచార చిత్రాలను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు.
ఇదే బ్యానర్‌లో ఇటీవ‌ల‌ ‘రంగ్‌దే’ చిత్రానికి దర్శకత్వం వహించిన యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్నారు.
కేరళకు చెందిన చార్మింగ్ సెన్సేషన్ సంయుక్తా మీనన్ ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక‌య్యారు. ‘సూదు కవ్వం’, ‘సేతుపతి’, ‘తెగిడి’, ‘మిస్టర్ లోకల్’, ‘మార’ వంటి చిత్రాలకు పనిచేసి త‌న‌దైన ముద్ర‌వేసిన‌ సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేయనున్నారు. హృద‌యాన్ని హ‌త్తుకొనే సంగీతం స‌మ‌కూర్చ‌డంలో దిట్ట అయిన జి.వి. ప్ర‌కాష్‌కుమార్ సంగీత ద‌ర్శ‌కుడు. రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి. ఈ ద్విభాషా చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ 2022 జ‌న‌వ‌రిలో మొద‌లవుతుంది.
తారాగ‌ణం: ధ‌నుష్‌, సంయుక్తా మీన‌న్‌, సాయికుమార్ త‌నికెళ్ల భ‌ర‌ణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌)
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: అవినాష్ కొల్లా
ఎడిట‌ర్: న‌వీన్ నూలి
సినిమాటోగ్రాఫ‌ర్: దినేష్ కృష్ణ‌న్‌
మ్యూజిక్: జి.వి. ప్ర‌కాష్‌కుమార్‌
స‌మ‌ర్ప‌ణ: పి.డి.వి. ప్ర‌సాద్‌
నిర్మాత‌లు: నాగ‌వంశీ ఎస్‌. – సాయి సౌజ‌న్య‌
ర‌చ‌యిత – ద‌ర్శ‌కుడు: వెంకీ అట్లూరి
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ – ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
Dhanush – Venky Atluri – Sithara Entertainments & Fortune Four Cinemas Bilingual Movie titled as ‘SIR’ (Telugu)/’Vaathi’ (Tamil)
Sithara Entertainments, who are on a roll with multiple movies in production, are taking a step ahead and teaming up with the 2 time-National Award Winning actor ‘Dhanush’ for a new bilingual movie in Telugu and Tamil titled ‘Vaathi’ (Tamil) / ‘SIR’ (Telugu)’.  On this occasion, the makers unveiled the intriguing Title Look Motion Poster of the movie which grabbed the attention of the movie buffs across social media.
Youthful Director Venky Atluri, who had directed Rang De movie in the same banner, will be directing this prestigious film. Sithara Entertainments, headed by Suryadevara Naga Vamsi, will be co-producing this film along with Mrs. Sai Soujanya (Fortune Four Cinemas). The charming sensation from Kerala Samyuktha Menon will be the female lead.
The posters of Vaathi and SIR, released in both languages, in the backdrop of a blackboard filled with several numbers, mathemetical equations, besides a note stating ‘classes start soon’, create an element of curiosity.  Further, the video announcing the titles, take you through the film’s ambience, including the college premises, the bell and a series of sepia-tinted photographs, highlighting that the film would be ‘an ambitious journey of a common man’. The haunting background music adds a sense of nostalgia to the video.
Cinematographer Dinesh Krishnan, who worked on movies like Soodhu Kavvum, Sethupathi, Thegidi, Mr.Local, Maara will be handling the camera work. National Award Winning Editor Navin Nooli will be working for this movie. Soulful composer G. V. Prakash Kumar will be the music director. More Updates around the movie will be revealed as the time progresses. Regular shoot starts in January 2022.
Starring : Dhanush
Co-Starring: Samyuktha Menon, Sai Kumar, Tanikella Bharani
Executive Producer : S. Venkatarathnam (Venkat)
Production Designer : Avinash Kolla
Editor : Navin Nooli
DOP : Dinesh Krishnan
Music : G. V. Prakash Kumar
Producers : Naga Vamsi S – Sai Soujanya
Writer & Director : Venky Atluri
Presenter : PDV Prasad
Banners : Sithara Entertainments – Fortune Four Cinemas
Pro: Lakshmivenugopal
sir - 01 SIR _TWITTER-STORY SIR TELUGU_INSTAPOST SIR TELUGU_TWITTER-STORY sirVAATHI_TWITTER-STORY

Virat Raj in & as ‘Seeta Manohara Sri Raghava’ launched formally with pooja ceremony

విరాట్ రాజ్’ హీరోగా “సీతామనోహర శ్రీరాఘవ” చిత్రం ప్రారంభం

*ఆశీస్సులు అందించిన ‘ప్రముఖ నిర్మాతలు ఎ.ఎం.రత్నం, సురేష్ బాబు, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి
వెండితెర కు మరో నట వారసుడు పరిచయం అవుతున్నారు. అతని పేరు ‘విరాట్ రాజ్’. అతను హీరోగా రూపొందుతున్న “సీతామనోహర శ్రీరాఘవ” చిత్రం నేడు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు,ఆత్మీయులు సమక్షంలో వైభవంగా ప్రారంభం అయింది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ నిచ్చారు. యువ హీరో ఆకాష్ పూరి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు సతీమణి శ్యామల గారు హీరో విరాట్ రాజ్ కు ఆశీస్సులు అందించి, యూనిట్ కు శుభాకాంక్షలు తెలియ చేసారు.
ఇటు తాత వెంకట సుబ్బరాజు, అటు పెద తాత హరనాథ్ గారు స్ఫూర్తి తో ఈ ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇది సరైన చిత్రంగా భావిస్తున్నాను. మీడియా, చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ప్రేక్షకులు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను అన్నారు ‘విరాట్ రాజ్’. అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’. కొద్దిరోజుల క్రితం హీరో విరాట్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రం హీరోను, పేరును పరిచయం చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రాలు,వీడియో ప్రశంసలు అందుకున్న విషయ విదితమే.
ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న దుర్గా శ్రీ వత్సస.కె. మాట్లాడుతూ…మాస్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం అన్నారు. ‘హీరోగా విరాట్ రాజ్ పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా నేనూ పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఒక ఇమేజ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఈ చిత్రం ద్వారా భిన్నమైన చిత్రాలకు సరితూగే ఇమేజ్ ను ‘విరాట్ రాజ్’ స్వంతం చేసుకునేలా ఈ చిత్రం కథను సిద్ధం చేయటం జరిగింది. చిత్రం పేరు ‘సీతామనోహర శ్రీరాఘవ’. పేరు వెనుక కథ ఏమిటన్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నాము. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు భావోద్వేగాల సమ్మిళితం అన్నారు దర్శకుడు. కె.జి.ఎఫ్. 2, సలార్  చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్న ‘రవి బస్ రుర్’ ఈ  చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సంగీతం ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నాను. అలాగే త్రిబుల్ ఆర్ చిత్రానికి పోరాటాలు సమకూర్చిన కింగ్ సాలమన్ ఈ చిత్రానికి కంపోజ్ చేస్తున్న పోరాటాలు చిత్రానికి మరో ఆకర్షణ. నిర్మాత సుధాకర్ గారు హీరో కుటుంబానికి సన్నిహిత మిత్రులు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి విజయవంతమైన చిత్రంగా దీనిని మలచటానికి కృషి చేస్తానన్నారు.
వెండితెరకు మరో నట వారసుడు ను తమ
‘వందన మూవీస్’ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా పరిచయం చేయటం చాలా ఆనందంగా ఉంది అన్నారు చిత్ర నిర్మాత సుధాకర్.టి. నవంబర్ లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని,ఓ మంచి కథతో వందన మూవీస్ చిత్ర నిర్మాణ సంస్థ పరిచయం కావటం సంతోషంగా ఉందన్నారు.
సంగీత దర్శకుడు రవి బస్ రుర్ మాట్లాడుతూ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించటం ఆనందంగా ఉందన్నారు.  కధానాయిక రేవ మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం కావటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసి ఆశీస్సులు అందించిన ప్రముఖులు నిర్మాత లు ఎ.ఎం.రత్నం,సురేష్ బాబు,దర్శకుడు అనిల్ రావిపూడి, యువ హీరో ఆకాష్ పూరి,రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు సతీమణి శ్యామల గారు లకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు.
‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రంలో కథానాయకుడిగా విరాట్ రాజ్, నాయికగా రేవ, ఇతర పాత్రల్లో తనికెళ్లభరణి, బ్రహ్మాజీ, పృథ్వీ, కబీర్ దుహాన్ సింగ్, ప్రవీణ్, గోపరాజు రమణ, రాఘవ,కృష్ణ, నిఖిలేంద్ర, సత్య సాయి శ్రీనివాస్, రూపాలక్ష్మి నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రవి బస్ రుర్ ; పాటలు: రామజోగయ్య శాస్ర్తి; కెమెరా: కల్యాణ్. బి; ఎడిటర్: కాశ్యప్ గోలి; యాక్షన్:
కింగ్ సోలోమన్; ఆర్ట్: రామాంజనేయులు; నృత్యాలు: శేఖర్, జానీ మాస్టర్స్
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: రామాచారి.ఎం
నిర్మాత: సుధాకర్.టి; కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్శకత్వం: దుర్గా శ్రీ వత్సస.కె.
బ్యానర్: వందన మూవీస్
Virat Raj in & as ‘Seeta Manohara Sri Raghava’ launched formally with pooja ceremony
‘Seeta Manohara Sri Raghava‘, a film starring yesteryear actor Haranath’s grand nephew Virat Raj in the lead, was today launched formally with pooja ceremony at Ramanaidu Studios in Hyderabad.
Director Anil Ravipudi gave the first clap, while the camera was switched on by veteran producer A M Rathnam.  Anil Ravipudi, A M Rathnam, Suresh Babu and other guests wished the team members all success in their new endeavour.
The film directed by Durga Srivastasa K is produced by Sudhakar T on Vandana Moviees banner. It is tipped to be a lively youthful entertainer.
Speaking on the occasion, the director said the film would be a mass entertainer. Stating that he was happy that the movie is marking the debut of Virat Raj, he added that the film will have all elements to entertain the audience. “It is a clean family entertainer. Salaar music director Ravi Basur’s music will be one of the highlights of the movie. Action sequences will be composed by RRR fame King Solomon. I thank Sudhakar Reddy and I am sure we will succeed in fulfilling all expecations on us.”
The producer said he is happy introduce Harnath garu brother’s nephew in this film. He said Seeta Manohara Sri Raghava will be very entertaining one with a good story. Regular shoot will commence from November, he said.
Virat Raj said he is happy to start his film journey with Seeta Manohara Sri Raghava. “I am thanking all people who have graced the launch event including A M Rathnam, Anil Ravipudi and Rebel Star Krishnam Raju’s wife Shyamala Devi.
Kalyan B is the cinematographer of the film. While musical score is by Ravi Basrur, lyrics will be penned by Ramajogayya Sastri. Sri Kasyap Goli will take care of editing department.
King Solomon will be the sunt master for Seeta Manohara Sri Raghava, while Ramanjaneyulu will helm the art department. Ramachary M is the exeutive producer of the movie.
Sekhar and Johny will be the dance choreographers and Phani will handle computer graphics. Poster designs will be done by I D Sudheer. Venugopal is the public relations officer. Besides wielding the megaphone, Durga Srivatsasa K has also penned the story, screenplay and dialogues.
It has been planned to complete the shoot of the movie at the earliest and to release it during early 2022.
Staring:
Viratraj, Reva,Tanikelkabharani, Kabeer duhaan Singh, Brahmaji, prudhvi,Praveen,Krishna,nikhilendra,Satya Sai Srinivas,Roopalakshmi etc
Story, Dailogues,screenplay, and direction: Durga Srivatsasa K
Producer: Sudhakar T
Music Director: Ravi Basrur
Cinematography: Kalyan B
Lyrics: Ramajogaiah Sastry
Editor: Kashyap goli
Fights: king Soloman
Art: Ramanjaneyulu
Choreography: Sekhar & jony masters
Banner: Vandana Moviees
20211020084444_0C2A4082 20211020084327_0C2A4060 20211020083407_0C2A4014 20211020082946_0C2A4001 20211020083106_0C2A4007 20211020082014_0C2A3979 20211020083916_0C2A4036 20211020081320_0C2A3946

*’విరాట్ రాజ్’ హీరోగా “సీతామనోహర శ్రీరాఘవ” చిత్రం

*’విరాట్ రాజ్’ హీరోగా “సీతామనోహర శ్రీరాఘవ” చిత్రం
*అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’
*ప్రచార చిత్రాలను,వీడియోను విడుదల చేసిన నట శిక్షకుడు శ్రీ సత్యానంద్ గారు
 వెండితెర కు మరో నట వారసుడు పరిచయం అవుతున్నారు. అతని పేరు ‘విరాట్ రాజ్’.
అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’ ఈరోజు అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రం హీరోను, పేరును పరిచయం చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రాలను,వీడియోను అతని నట శిక్షకుడు శ్రీ సత్యానంద్ గారు విడుదల చేసి ఆశీస్సులు అందించారు.
చిత్రం పేరు ‘సీతామనోహర శ్రీరాఘవ’. విరాట్ రాజ్ పరిచయ ప్రచార చిత్రాలను  పరిశీలిస్తే పెద తాత హరనాథ్ స్ఫురణకు వస్తారు. ఓ చిత్రంలో అందంగా,క్యూట్ గా కనిపిస్తున్న విరాట్ రాజ్  మరో ప్రచార చిత్రం లో గన్ చేతబట్టి యాక్షన్ లోక్  వెంకట సుబ్బరాజు గారు ‘భక్త తుకారాం, కోడె నాగు, రిక్షా రాజి’ వంటి అలనాటి పలు చిత్రాలలో కీలక పాత్రలలో నటించారు. ఇటు తాత వెంకట సుబ్బరాజు, అటు పెద తాత హరనాథ్ గారు స్ఫూర్తి తో ఈ ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇది సరైన చిత్రంగా భావిస్తున్నాను. మీడియా, చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ప్రేక్షకులు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను అన్నారు ‘విరాట్ రాజ్’
ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న
దుర్గా శ్రీ వత్సస.కె. మాట్లాడుతూ…’హీరోగా విరాట్ రాజ్ పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా నేనూ పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఒక ఇమేజ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఈ చిత్రం ద్వారా భిన్నమైన చిత్రాలకు సరితూగే ఇమేజ్ ను ‘విరాట్ రాజ్’ స్వంతం చేసుకునేలా ఈ చిత్రం కథను సిద్ధం చేయటం జరిగింది. చిత్రం పేరు ‘సీతామనోహర శ్రీరాఘవ’. పేరు వెనుక కథ ఏమిటన్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నాము. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు భావోద్వేగాల సమ్మిళితం అన్నారు దర్శకుడు. కె.జి.ఎఫ్. 2, సలార్  చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్న ‘రవి బస్ రుర్’ ఈ  చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
వెండితెరకు మరో నట వారసుడు ను తమ
‘వందన మూవీస్’ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా పరిచయం చేయటం చాలా ఆనందం గా ఉంది అన్నారు చిత్ర నిర్మాత సుధాకర్.టి. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుందని, చిత్రంలో ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరన్నది మరోసారి ప్రకటించటం జరుగుతుందని అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రవి బస్ రుర్ ; పాటలు: రామజోగయ్య శాస్ర్తి; కెమెరా: కల్యాణ్. బి; ఎడిటర్: జి.యం.శాస్త్రి; యాక్షన్: వెంకట్;
నిర్మాత: సుధాకర్.టి; కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్శకత్వం: దుర్గా శ్రీ వత్సస.కె.
బ్యానర్: వందన మూవీస్
*Introducing Virat Raj in “Sita Manohara Sree Raghava”*
*Yesteryear handsome actor Haranath’s grandson Virat Raj debuts as a hero, and acting guru Satyanand unveils a Poster and video glimpse.
Another talented youngster is getting introduced as a hero in the Telugu film industry. He is Virat Raj, the grandson of actor Venkata Subbaraju, who was the brother of the handsome actor of yesteryear Haranath. Virat Raj plays the lead role in the production of Vandana Movies’ “Sita Manohara Sree Raghava.”
On the occasion of his birthday today, acting guru Sri Satyanand unveiled the Poster,video glimpse and wished him great success.
Venkata Subbaraju played key roles in hits such as “Kode Naagu”, “Bhakta Tukaram”, and “Riksha Raji”. Virat Raj expressed his happiness on being introduced in “Sita Manohara Sree Raghava,” which is billed to be a wholesome family entertainer.
Talented youngster Durgaa Srivatsasa K is making his debut as the director. “I could not have to get a better launchpad than this. The title itself gives away the theme of the story. Apart from the family elements, the film is packaged as a mass entertainer. It will appeal to all sections of audiences,” Durga stated.
The team is glad to announce Ravi Basrur’s name as the music director. Ravi Basrur is the man behind the Pan-Indian rage “KGF-2″ franchise and ‘Salar’.
Informing further details, producer Sudhakar said, “We are happy to introduce another talented actor to the silver screen. The regular shoot will commence in September. The other cast and crew details will be finalized shortly.”
 The film will also feature some prominent actors.
Story, Dailogues,screenplay, and direction: Durga Srivatsasa K
 Producer: Sudhakar T
 Banner: Vandana Moviees
 Music Director: Ravi Basrur
 Cinematography: Kalyan B
 Lyrics: Ramajogaiah Sastry
 Editor: GM Sastry
 Fights: Venkat
001a OUT EMPTY 001a OUT 003 3 X 4.5 OUT 003 EMPTY