Tilli Square

Star Boy Siddhu Jonnalagadda and Sithara Entertainments’ Tillu Square second single Radhika is captivating!

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘టిల్లు స్క్వేర్’ రెండో పాట ‘రాధిక’ ఆకట్టుకుంటోంది
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’తో మంచి గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ ఫుల్ స్టార్‌గా మారారు. ఈ చిత్రం ఆయనకు, ఆయన పోషించిన పాత్రకు ఎందరో అభిమానులను సంపాదించి పెట్టింది.
ఇప్పుడు ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు సిద్ధు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన మొదటి గీతం ‘టికెట్టే కొనకుండా’లో అనుపమ గ్లామరస్ అవతార్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పుడు రెండవ గీతంలో కూడా ఆమె ఆకట్టుకుంటోంది. ఇక సిద్ధు జొన్నలగడ్డ పాటకి మరింత ఉత్సాహం తీసుకొచ్చారు.
‘రాధిక’ పాట ఆకర్షణీయమైన బీట్‌ను కలిగి ఉంది. రామ్ మిరియాల తన విలక్షణ శైలిలో పాటను స్వరపరచడమే కాకుండా తానే స్వయంగా ఆలపించారు. ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. రామ్ మిరియాల సంగీతం, గాత్రం, కాసర్ల శ్యామ్ సాహిత్యం కలిసి ఈ పాట అద్భుతంగా ఉంది.
‘డీజే టిల్లు’తో రాధిక పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. అంతగా జనాదరణ పొందిన ‘రాధిక’ పేరుతో వచ్చిన ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకసారి వినగానే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే అంతగా ఈ పాట బాగుంది. ఈ పాట ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని టాప్ 10 చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది.
సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
టిల్లు స్క్వేర్ సినిమా 2024, ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
 
Star Boy Siddhu Jonnalagadda and Sithara Entertainments’ Tillu Square second single Radhika is captivating! 
Star Boy Siddhu Jonnalagadda has become a highly sought after and successful star with DJ Tillu. The movie has earned a cult following for the character and himself, as well.
Now, he is coming up with a sequel to the film, Tillu Square. Mallik Ram is directing the film and the very beautiful & talented Anupama Parameswaran is playing the female lead.
Already, her glamorous avatar in the first single released, “Ticket eh Lekunda”, has become talk of the town. The second single will also have her and Tillu, Siddhu Jonnalagadda, grooving to an energetic beat.
The song, “Radhika” has a catchy and captivating beat.  Ram Miriyala has composed and crooned the song, in this typical style. Kasrala Shyam has written the lyrics.
The groove of the song and usage of ever popular, “Radhika” name make this song, a must listen and easy to repeat as well. This song will definitely find place in Top 10 chartbusters of the year and many playlists.
Suryadevara Naga Vamsi of Sithara Entertainments is producing the film. Fortune Four Cinemas is co-producing & Srikara Studios is presenting the film.
Sai Prakash Ummadisingu is handling cinematography and Navin Nooli is editing the film.
Tillu Square is scheduled for 9th February, 2024 release worldwide.

Radhika Song Still - 1 (1) Radhika Song Still 2 (1) Radhika Song Still 3 (1)

Your Most Favourite Entertainer Tillu aka Starboy Siddu is coming back on 9th February with the Sequal ‘Tillu Square’

మీకు అత్యంత ఇష్టమైన ఎంటర్‌టైనర్ టిల్లు అకా స్టార్‌బాయ్ సిద్ధు ‘టిల్లు స్క్వేర్’తో ఫిబ్రవరి 9న తిరిగి రాబోతున్నాడు
కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘డీజే టిల్లు’లో టిల్లు వంటి గొప్ప వినోదాత్మక పాత్రతో స్టార్‌బాయ్ సిద్ధు అలరించారు. సిద్ధుని టిల్లు పాత్రలో మరోసారి చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో.. సిద్ధు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించాలని నిర్ణయించారు.
వారు రెట్టింపు వినోదం మరియు మస్తీతో ‘డీజే టిల్లు’ సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్‌’ ప్రకటించారు. ఎందరో ప్రేక్షకులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకుని, ఆసక్తిగా ఎదురుచూస్తున్నందున, మేకర్స్ హడావిడి చేయకుండా, ఒరిజినల్ కి ఏమాత్రం తగ్గకుండా పూర్తి వినోదాత్మకంగా మలచడానికి తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు.
నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ, టిల్లూ స్క్వేర్ కల్ట్ స్టేటస్‌ను అందుకుంటుందని, ఆ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
టిల్ స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. డీజే టిల్లులో నేహా శెట్టి పోషించిన రాధిక పాత్ర తరహాలో ఈ పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు. ఇప్పటికే, ఈ సినిమా ప్రచార చిత్రాల్లో అనుపమ కనిపిస్తున్న తీరు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన టికెటే కొనకుండా అనే పాటను మేకర్స్ విడుదల చేయగా భారీ హిట్ అయ్యింది. టిల్లు స్క్వేర్ ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇది ఒరిజినల్ లాగానే మరోసారి ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు.
నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మల్లిక్ రామ్ టిల్ స్క్వేర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
 
Your Most Favourite Entertainer Tillu aka Starboy Siddu is coming back on 9th February with the Sequal ‘Tillu Square’
Starboy Siddu came up with a great entertaining character like Tillu in the cult blockbuster DJ Tillu. He and the producers, Sithara Entertainments have decided to come up with a sequel to the film as many wanted to watch him again in action.
They announced the sequel with Double the Fun and Masti, Tillu Square. As many people have huge expectations from the film and it is eagerly anticipated, the makers did not want to rush and are taking their time to make it as entertaining as the original.
Producer Suryadevara Naga Vamsi stated that Tillu Square will live up to the cult status of the original and they are working towards it. Now, they are ready to bring the movie on 9th February, 2024.
Tillu Square has Anupama Parameswaran in the leading lady role. Makers promise the role will be as memorable as Radhika, played by Neha Sshetty, in the original. Already, the oomph factor that is oozing out from Anupama’s appearance has become a huge talking point.
Makers have released the song, Ticket eh Konakunda, composed and sung by Ram Miriyala and the song has become huge hit. Tillu Square will release in February and makers are promising that it will entertain audiences just like the original, once again.
Sai Prakash Ummadisingu is handling cinematography for the film while Navin Nooli is editing the movie. Mallik Ram is debuting as director with Tillu Square. Sai Soujanya is co-producing on Fortune Four Cinemas and Srikara Studios is presenting the film. More details will be announced soon.
 T2-Date Poster v2 T2-DatePoster-Still

Tillanna is back with a Funkiest Song of the Year – Sithara Entertainments ‘Tillu Square’ First single is out now!

టిల్లు అన్న మళ్ళీ వచ్చాడు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘టిల్లు స్క్వేర్’ నుంచి మొదటి పాట విడుదల
డీజే టిల్లు సినిమాతో, అందులోని పాత్రతో యువతకు బాగా దగ్గరైన సిద్ధు, స్టార్ బాయ్‌గా ఎదిగాడు. అతను ఆ పాత్రను రూపొందించి, అందులో జీవించిన తీరుకి అతను టిల్లుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం తెలుగు చిత్రసీమలో కల్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. టిల్లు అన్నగా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన సిద్ధు, ఇప్పుడు మరొక థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్ ‘టిల్లు స్క్వేర్‌’తో వస్తున్నాడు.
మరోసారి సిద్దు జొన్నలగడ్డను టిల్లుగా చూడబోతున్నాం. ఈసారి వినోదం మొదటి దానికి రెట్టింపు ఉంటుందని చిత్ర నిర్మాతలు ఇప్పటికే హామీ ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమా పతకాలపై సూర్యదేవర నాగ వంశీ తమ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ డీజే టిల్లుకు సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
డీజే టిల్లు చిత్రంలోని సంగీతం అత్యంత ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా, రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన “టిల్లు అన్న డీజే పెడితే” పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి, అది టిల్లు పాత్రకు గుర్తింపుగా మారింది. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ కోసం కూడా రామ్ మిరియాల, సరికొత్త పాటను స్వరపరచి ఆలపించారు.
ఈ పాట జూలై 26న సాయంత్రం 4:05 గంటలకు విడుదలైంది. మాస్ బీట్స్ తో కాలు కదిపేలా హుషారుగా సాగిన ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది. “టిల్లు అన్న డీజే పెడితే” పాట లాగానే, “టికెట్ ఏ కొనకుండా” పాట కూడా పార్టీలు, పబ్‌ల అనే తేడా లేకుండా ప్రతి చోటా ప్లే అయ్యేలా, యువత అమితంగా ఇష్టపడేలా ఉంది. పబ్‌లో మరొక అమ్మాయిని కలిసి, ప్రేమించి మళ్ళీ అవే తప్పులు పునరావృతం చేయకుండా టిల్లును హెచ్చరిస్తున్నట్లుగా సాగింది.
టిల్లు స్క్వేర్ చిత్రం డీజే టిల్లుకి మించి సరికొత్త వినోదాన్ని అందించబోతుందని స్పష్టమవుతోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. సాంగ్ ప్రోమోలో ఆమె లుక్ మరియు టిల్లుతో ఆమె సంభాషణ వైరల్‌గా మారాయి. మొత్తానికి ఈ పాట టిల్లు స్క్వేర్ పై ఇప్పటికే ఏర్పడిన అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లేలా ఉంది.
టిల్లు స్క్వేర్‌లో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మొదటి పాట ‘టికెట్ ఏ కొనకుండా’ను రామ్ మిరియాల స్వరపరచడంతో పాటు ఆలపించారు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ బాధ్యతలు
నిర్వహిస్తున్నారు. టిల్లు స్క్వేర్‌ కి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తారు.
చిత్రం పేరు: టిల్లు స్క్వేర్
తారాగణం: సిద్ధు
అనుపమ పరమేశ్వరన్
దర్శకుడు: మల్లిక్ రామ్
ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్
కూర్పు: నవీన్ నూలి
సంగీతం: రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల
కళ: ఏఎస్ ప్రకాష్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
పీఆర్ఓ: లక్ష్మి వేణుగోపాల్
 
Tillanna is back with a Funkiest Song of the Year – Sithara Entertainments ‘Tillu Square’ First single is out now! 
Siddu has made a huge mark on youth and become Star Boy with his movie DJ Tillu character/movie. The character that he designed and lived on big screen, Tillu, has become synonymous with his name. The movie has become a cult blockbuster in Telugu Cinema. People identify him as Tillu anna and now, he is coming with another crack-a-pot thrilling entertainer, Tillu Square.
Once again, we are going to see Siddu as Tillu and this time, the makers promise the entertaiment value will be double the first one. Suryadevara Naga Vamsi is producing this sequel to their big blockbuster DJ Tillu on Sithara Entertainments and Fortune Four Cinema production houses respectively. Srikara Studios is presenting the film.
Original Soundtrack from the movie, DJ Tillu, has become hugely popular. Mainly, Ram Miriyala composition,”Tillu Anna DJ Pedithe” has become such a huge blockbuster that it has become the identity of the character Tillu. Now, Ram Miriyala who also sang the song, has composed and sang a fresh new single for Tillu Square.
The track has been released on 26th July at 4:05 PM all-over. The song can be categorised as most Funkiest beat song mixed with mass beats and independent style. Like the “Tillu Anna DJ Pedithe”, this song, “Ticket Eh Konakunda” is also set to become one of the most loved and played at the parties, pubs by youth everywhere. Tillu is being cautioned about meeting and falling in love with another girl at Pub and not to repeat the same mistakes.
This is a clever call-back to the original and a hint at what fresh entertainment Tillu is going to serve us with Tillu Square. Anupama Parameswaran is playing the leading lady. Her look and conversation with Tillu in the single song promo have gone viral. The song is set to be big blast and give tremendous hype to the film adding to the buzz it has already generated.
Tillu Square has Siddu, Anupama Parameswaran in leading roles. Ram Miriyala composed and sung the first single, “Ticket Eh Konakunda”. Mallik Ram is directing the film. Sai Prakash Ummadisingu is handling cinematography.
National Award Winning editor Navin Nooli is behind the cuts. A.S. Prakash is handling Art and Production Design for Tillu Square. More details will be announced by the makers soon.
Movie Name: Tillu Square
Song Name: Ticket Eh Konakunda
Music & Sung by: Ram Miryala
Lyrics by: Kasarla Shyam
Director : Mallik Ram
DOP: Sai Prakash Ummadisingu
Editor : Navin Nooli
Music Director: Ram Miryala, Sri Charan Pakala
Art: A.S. Prakash
Producer: Suryadevara Naga Vamsi
Banner: Sithara Entertainments, Fortune Four Cinemas
Presenter: Srikara Studios
Audio: Aditya Music
STILL 2

Starboy Siddhu and Sithara Entertainments’ Tillu Square Release Date announced

స్టార్‌బాయ్ సిద్ధు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘టిల్లు స్క్వేర్’ విడుదల తేదీ ప్రకటన
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు యువతరం మెచ్చే కథాబలమున్న మీడియం బడ్జెట్ చిత్రాలను కూడా నిర్మిస్తున్నాయి. ఇప్పుడు నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా ‘టిల్లు స్క్వేర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘డీజే టిల్లు’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న సిద్ధు, అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి, యువ ప్రతిభావంతుడు సిద్ధు అందించిన ఈ కొత్తతరం కామెడీ థ్రిల్లర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా డీజే టిల్లు పాత్రను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డారు.
ఇప్పుడు ఈ యువనటుడు ‘డీజే టిల్లు’ సీక్వెల్‌ ‘టిల్లు స్క్వేర్’తో వస్తున్నారు. ఈసారి రెట్టింపు వినోదాన్ని పంచడానికి స్టార్ నటి అనుపమ పరమేశ్వరన్ తోడయ్యారు.
ఈ సినిమాని 2023, సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించిన చిత్ర బృందం, సిద్ధు-అనుపమ పరమేశ్వరన్‌ ల రొమాంటిక్ పోస్టర్‌ ను విడుదల చేసింది. ఈ చిత్రం మొదటి భాగాన్ని మించి రెట్టింపు వినోదాన్ని, థ్రిల్ ని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే టిల్లు స్క్వేర్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు విడుదల తేదీ ప్రకటనతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.
ఈ చిత్రానికి రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
సినిమా పేరు: టిల్లు స్క్వేర్
తారాగణం: సిద్ధు, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: మల్లిక్ రామ్
డీఓపీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
Starboy Siddhu and Sithara Entertainments’ Tillu Square Release Date announced
Sithara Entertainments and Fortune Four Cinemas have been coming up with new age entertainers and crafty medium budget films along with big scale productions. Naga Vamsi and Sai Soujanya are now producing Tillu Square with Starboy Siddhu Jonnalagadda.
Srikara Studios is presenting the film and movie shoot is going on at a rapid pace. Siddhu became highly famous as DJ Tillu from the film of same name.
The young & multi-talented actor, crafted a new-age comedy thriller and people loved DJ Tillu character to the core.
Now, the actor is coming up with sequel, Tillu Square and Anupama Parameswaran has been added to the star cast to increase the fun and thrill elements.
The film’s Release date has been announced today as Sept 15th, 2023 with a romantic poster of Siddhu & Anupama Parameswaran. Movie team is promising two times the fun and double the thrills from the first one. Mallik Ram is directing this film.
Already the hype and buzz for the movie, DJ Tillu Square are at their peak and this date announcement has made fans look forward to it with eagerness.
Ram Miriyala & Sri Charan Pakala are composing music for the film and National Award Winning Editor, Navin Nooli is editing the movie.
More details to be revealed soon.
Movie Name: Tillu Square
Cast: Siddhu, Anupama Parameswaran
Director : Mallik Ram
DOP: Sai Prakash Ummadisingu
Editor : Navin Nooli
Music Directors: Ram Miryala, Sri Charan Pakala
Art: A.S. Prakash
Producer: Suryadevara Naga Vamsi
Banner: Sithara Entertainments, Fortune Four Cinemas
Presenter: Srikara Studios
#T2 - Date Poster (1) #T2 - Date Poster-Still (1)

The sequel of the super-hit entertainer DJ Tillu is titled Tillu Square, to star Siddhu Jonnalagadda, Anupama Parameswaran

‘టిల్లు స్క్వేర్’తో రెట్టింపు వినోదం
* ’డీజే టిల్లు’ సీక్వెల్ కి ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్ ని ఖరారు .
*టైటిల్  ప్రకటనతో కూడిన ప్రచార చిత్రం విడుదల
*మరో మారు విజయం పక్కా అన్నట్లుగా వినోదం పంచిన ’టిల్లు స్క్వేర్’ టీజర్
*మార్చి 2023 చిత్రం విడుదల
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘డీజే టిల్లు’ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర విడుదల సమయంలోనే నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సిద్ధుతో ‘డీజే టిల్లు’ సీక్వెల్ చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే ‘డీజే టిల్లు’ సీక్వెల్ ని రూపొందిస్తూ మాట నిలబెట్టుకున్నారు నాగవంశీ.
‘డీజే టిల్లు’ సీక్వెల్ కి ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా ఈరోజు అధికారికంగా ప్రకటించారు. సీక్వెల్ లో సిద్ధుకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
‘టిల్లు స్క్వేర్’ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. బాక్సాఫీస్ దగ్గర ‘డీజే టిల్లు’ సంచలనం సృష్టించిన ఏడాదికే 2023 మార్చిలో సీక్వెల్ థియేటర్లలో సందడి చేయనుంది. ‘టిల్లు స్క్వేర్’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ దీపావళి కానుకగా ఒక ప్రత్యేక వీడిమోని విడుదల చేసింది చిత్ర బృందం. అందులో టిల్లు మద్యం  మత్తులో ట్రాఫిక్ పోలీస్ తో వాదన పెట్టుకోవడం నవ్వులు పూయించింది. తాను హీరోనని, తన పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకుందాం అనుకుంటే డేట్స్ ఖాళీగా లేవని చెప్పడం అలరించింది.  రెండు నిమిషాల నిడివి గల వీడియోతో సీక్వెల్ లో ‘డీజే టిల్లు’ని మించిన వినోదాన్ని పంచబోతున్నారని చెప్పకనే చెప్పేశారు.
స్టార్ బోయ్ సిద్దు వాచికాభినయాలు మరోసారి వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి.
‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ ని స్వరపరిచి విశేషంగా ఆకట్టుకున్న రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా సాయి ప్రకాష్, ఎడిటర్ గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్ వ్యవహరిస్తున్నారు. ‘టిల్లు స్క్వేర్’తో రెట్టింపు వినోదాన్ని పంచి, ‘డీజే టిల్లు’ని మించిన విజయాన్ని సాధిస్తామని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
చిత్రం పేరు: టిల్లు స్క్వేర్
తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్
దర్శకుడు: మల్లిక్ రామ్
ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్
కూర్పు: నవీన్ నూలి
సంగీతం: రామ్ మిరియాల
కళ: ఏఎస్ ప్రకాష్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
The sequel of the super-hit entertainer DJ Tillu is titled Tillu Square, to star Siddhu Jonnalagadda, Anupama Parameswaran
One of the biggest hits in Telugu cinema in 2022, DJ Tillu, is all set to have a sequel. The makers of the film, Sithara Entertainments and Fortune Four Cinemas, formally announced the second instalment of the franchise commemorating Deepavali today. Titled Tillu Square, the sequel features Siddhu Jonnalagadda and Anupama Parameswaran in lead roles. Produced by Suryadevara Naga Vamsi, Tillu Square, to be presented by Srikara Studios, will be directed by Mallik Ram.
The filming of Tillu Square has already commenced and will hit theatres in March 2023, a year after DJ Tillu stormed the box office. A special video announcing Tillu Square was also launched by the team, where Tillu argues with a traffic cop in a drunken-drive incident. He hilariously tells the cop about having to shoot for Tillu Square and the unavailability of Pooja Hegde’s dates for the same. After their funny banter, you’re introduced to the talented team of Tillu Square.
Ram Miriyala, who’d originally composed and sung the title track of DJ Tillu, scores the music. Sai Prakash Ummadisingu cranks the camera for the project to be edited by Navin Nooli. AS Prakash is the art director. Tillu Square promises to offer double the entertainment, thrills and humour as the prequel and the team is committed to breaking newer records again. Other updates about the film will be out soon.
Diwali-Poster-INSTA-still
Ram
T2-FL Poster