హరిరామజోగయ్య గారు త్వరగా కోలుకోవాలి: శ్రీ పవన్ కల్యాణ్


హరిరామజోగయ్య గారు త్వరగా కోలుకోవాలి

09678 (1) 09678 (2) 09678 (3) 09678 (4) 09678 (5) 09678 (6)

హరిరామజోగయ్య గారు త్వరగా కోలుకోవాలి

• నాకు మార్గదర్శకులుగా వ్యవహరించాలి

• జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు

జనసేన పార్టీ హితం కోరుకొనే శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారు త్వరగా కోలుకోవాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆకాంక్షించారు. నాకు, పార్టీకి మార్గదర్శకులుగా వ్యవహరించాలని కోరితే వారు అందుకు అంగీకారం తెలిపారని చెప్పారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ శ్రీ హరిరామ జోగయ్య అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం శ్రీ పవన్ కల్యాణ్ గారు శ్రీ హరిరామ జోగయ్యను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అక్కడి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “నిబద్ధత కలిగిన హరిరామ జోగయ్య గారు నరసాపురం పార్లమెంట్ సభ్యులుగా 2004-09 కాలంలో ఉండి, మా కుటుంబం కోసం రాజీనామా చేసి వచ్చారు. అనుభవజ్ఞులైన వారి సలహాలు, ఆశీస్సులు అవసరమని పోరాటయాత్ర సమయంలో పాలకొల్లు వెళ్ళి కలిశాను. ఇప్పుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పటికి కూడా జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయం గురించి చర్చించారు. హరిరామ జోగయ్యగారు నాకు మార్గరదర్శకులుగా ఉంటారు.

• జనసేన అధ్వర్యంలో పాలకొల్లులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పాలకొల్లు నుంచి ఎందరో వచ్చారు. అల్లు రామలింగయ్య గారు, దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు… ఇలా చాలామంది పాలకొల్లు నుంచి వచ్చినవారే. నవతరంలో ఉన్న నైపుణ్యాన్ని తీర్చిదిద్దేలా పాలకొల్లులో శ్రీ ఎస్.వి.రంగారావు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ను జనసేన అధ్వర్యంలో నెలకొల్పనున్నాం. ఈ ఇన్స్టిట్యూట్ కి హరిరామ జోగయ్య గారు ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. వీరు నిర్మాతగాను ఎన్నో  మంచి చిత్రాలు అందించారు. రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసు నేతృత్వంలో నడుస్తుంది. ఇందుకు నా అండదండలు ఉంటాయి. ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల యువతకు ఉపయోగపడేలా ఉంటుంది” అన్నారు.

శ్రీ హరిరామ జోగయ్య మాట్లాడుతూ “చిరంజీవిగారు కుటుంబం అంటే నాకు ఎంతో ఇష్టం. పవన్ కల్యాణ్ గారికి అభిమానిని. జనసేన పార్టీకి ఎప్పుడూ నా సహాయసహకారాలు ఉంటాయి. చివరి శ్వాస వరకూ జనసేన కోసమే పని చేస్తాను. ప్రజలందరి క్షేమం కోరుకొంటూ… అందరినీ సురక్షితంగా చూసుకొనే పార్టీ ఇది. అందరం శ్రీ పవన్ కల్యాణ్ గారు వెన్నంటి నడుద్దాం. పాలకొల్లు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ ఇస్తాం. రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తారు. శిక్షణ విధానం, ఫ్యాకల్టీ సిద్ధం అయింది. ఈ శిక్షణాలయం ప్రారంభానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు వస్తారు” అని చెప్పారు.

 

*People Media Factory: Social Responsibility Move*

* ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు
ద్వారెన్ బ్రావో తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం *

ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు
ద్వారెన్ బ్రావో తో తమ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ షార్ట్ ఫిలిం ను నిర్మించటాన్ని  ఎంతో సంతోషంగా ప్రకటించారు సంస్థ అధినేత టి.జి.విశ్వప్రసాద్.
ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగా వైవిధ్య‌మైన క‌థా చిత్రాను నిర్మిస్తూ…విజ‌యాలు సాధిస్తూ..అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను అన‌తి కాలంలోనే ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ. ఎం.ఎల్.ఎ, వైఫ్ ఆఫ్ రామ్,  సిల్లీఫెలో, గూఢ‌చారి చిత్రాల‌ను నిర్మించిన ఈ సంస్థ ప్ర‌స్తుతం స‌మంత అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌లో  ఓ బేబి, విక్ట‌రీ వెంక‌టేష్ – యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ, అనుష్క‌, మాధ‌వ‌న్, కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్ కాంబినేష‌న్లో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ సైలెన్స్, నాగ శౌర్య‌తో చిత్రాలను నిర్మిస్తోంది.

ఇలా విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విదేశాలలో షూటింగ్ జరుపుకోవటానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా సమకూరుస్తున్న విషయం విదితమే. కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, వీటితోపాటు సామాజిక స్పృహ కు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు  సంస్థ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. విషయానికి వస్తే  ఈ సంస్థ మరో ముందడుగు వేసి ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు ద్వారెన్ బ్రావో తో , తమ సంస్థ  ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CRS )’ లో భాగంగా  ఓ షార్ట్ ఫిలింను నిర్మించ బోతోంది. దీనికి సంబంధించి నేటి ఉదయం వీరిరువురి మధ్య  ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ద్వారెన్ బ్రావో తో పాటు చిత్ర నిర్మాత టి.జి.విశ్వప్రసాద్,సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నటరాజ్ పిళ్ళై లు పాల్గొన్నారు.
సోషల్ అవేర్నెస్ కు సంబంధించి రూపొందే ఈ లఘు చిత్రం కోయంబత్తూర్, తమిళనాడు, అలాగే వెస్ట్ ఇండీస్ లోని ట్రినిడాడ్, టొబాగో లలో చిత్రీకరణ జరుపుకుంటుంది. రేపటినుంచి కోయంబత్తూర్ లో షూటింగు ప్రారంభమవుతుందని దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మీడియాకు తెలుపుతామని ప్రకటించారు నిర్మాత టి.జి.విశ్వప్రసాద్

*People Media Factory: Social Responsibility Move*DSC_8880 DSC_8883 DSC_8888

We, People Media Factory, are not only a film making company, but a socially responsible corporate house. We promote, through the medium of film, many socially relevant endeavours and promote the responsible use of our resources.
We are delighted to share the news of signing up with celebrated cricketer Dwayne Bravo, to make a social awareness short film. This forms a part of our CSR project.
The short film will be completing its shooting in Coimbatore, Tamil Nadu and in Trinidad and Tobago, West Indies.
We finalised the project in the presence of producer Mr. T.G. Vishwa Prasad and co producer, Mr.Vivek Kuchibhotla. Mr. Dwayne Bravo and the executive producer, Natraj Pillai, were also present on the occasion of the signing of the deal.
We pledge to serve the social causes in a similar vein in the future too. We expect the valuable suggestions and reactions of citizens after the release of the short film.
Let us make this world a better place to live.

Rangde

Our next film is with #Bheeshma and #Mahanati!!

Yes, @actor_nithiin and @KeerthyOfficial are coming together for the first time in #Rangde. Movie will be directed by  @dirvenky_atluri and produced by @vamsi84 under @sitharaents with @pcsreeram sir as DOP.

Summer 2020 Release

logo final copy

‘గేమ్ ఓవర్’ విజయం ప్రేక్షకులదే

 

producer sashikant,Taapsee,Director Aswin Saravanan,Producer Chakravarty Ramchandra
గేమ్ ఓవర్‘ విజయం ప్రేక్షకులదే 

ప్రముఖ కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మించిన ‘గేమ్ ఓవర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200 కు పైగా స్క్రీన్స్ లో తెలుగు,తమిళం,హిందీ భాషలలో జూన్ 14 న విడుదలయి అటు ప్రేక్షకుల చేత, ఇటు సినీ విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది, రెండవ వారం లో అడుగిడి అటు కలెక్షన్ల పరంగానూ, ప్రశంసల పరంగానూ ముందుకు దూసుకు వెళుతోంది  అని చిత్ర నిర్మాతలు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర తెలిపారు. ఇది ప్రేక్షకుల విజయం అన్నారు. చిత్రం పబ్లిసిటీ ప్రారంభమైన నాటినుంచే టీజర్,  సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన లభించటం, మూడు భాషల్లో ని  నటీనటులు, రచయితలు, దర్శకులు చిత్ర ప్రముఖుల ప్రశంశలు, ప్రముఖ బాలీవుడ్  రచయిత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాని కి హిందీలో సమర్పకుడుగా వ్యవహరించటం, భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడు రాని సరికొత్త కధాంశంతో ఈ చిత్రం తెరకెక్కటం,’ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా చూడని కథని ఇది’ అని చాలా మంది చెబుతుంటారు. కానీ ఇంత ఒరిజినల్‌ స్టోరీని, ఇంత ఇన్నోవేటివ్‌గా ఈమధ్య అయితే ఎవరూ చెప్పలేదు దర్శకుడు అశ్విన్ శరవణన్ చిత్ర కథను తెరకెక్కించిన తీరు,అలాగే రోన్ ఏతాన్ యోహాన్ నేపధ్య సంగీతం కూడా చిత్ర విజయానికి కారణం అని తెలిపారు. వీటన్నిటితోపాటు నాయిక ‘తాప్సి’ అద్భుతమైన నటన, తాప్సీ నటిగా చాలా పరిణితి సాధించింది. ముఖ్యంగా స్ట్రాంగ్‌ విల్‌ చూపించే పాత్రల్లో మెప్పిస్తోంది అన్నారు.మూడు భాషల్లో ‘గేమ్ ఓవర్’ విజయం సాధించటం తమ సంస్థ పై బాధ్యత మరింత గా పెరిగినట్లు తెలుపుతూ, సంస్థ సభ్యులందరికీ అభినందనలు, కృతఙ్ఞతలు తెలిపారు నిర్మాతలు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర. మూడు భాషల్లో చిత్రం విజయం సాధించింది కాబట్టి ఈ విజయాన్ని ఒకే వేదికపై ఘనంగా నిర్వహించాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు.తమ సంస్థ గతంలో తెలుగులో నిర్మించిన ‘లవ్ ఫెయిల్యూర్’,‘గురు’ చిత్రాల విజయాల సరసన ఈ ‘గేమ్ ఓవర్’  నిలవటమే కాక హ్యాట్రిక్ సాధించిందని అన్నారు. తెలుగు లో త్వరలోనే స్టార్ హీరోలతోనూ కథాబలం కలిగిన చిత్రాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వీటి వివరాలు త్వరలోనే మీడియా ద్వారా తెలియ చేయటం జరుగుతుంది అన్నారు.
కథానాయిక ‘తాప్సి’ మాట్లాడుతూ..’గేమ్ ఓవర్’ ప్రేక్షకులకు ఓ సరికొత్త ధ్రిల్లింగ్ ను కలిగిస్తుందని చిత్రం విడుదలకు ముందు తెలిపాను. ఇప్పుడది నిజమైంది. అందరూ నా నటనను మెచ్చుకుంటున్నారు.దీనికి కారణం దర్శకుడు అశ్విన్ శరవణన్ నాపాత్రను తెరకెక్కించిన తీరు. ఓ మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన చిత్ర నిర్మాతకు కృతఙ్ఞతలు, మరియు చిత్ర విజయానికి అభినందనలు అన్నారు.
తాను గతంలో రూపొందించిన నాయిక నయనతార ‘మయూరి’ చిత్రం తెలుగు నాట గుర్తింపును తెస్తే ఈ ‘గేమ్ ఓవర్’ చిత్రం ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. చిత్రాన్ని ఆదరిస్తూ, అభినందనలు కురిపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు హృదయ పూర్వక కృతఙ్ఞతలు.ఈ విజయంతో మరింత బాధ్యతగా మంచి కధా బలం కలిగిన చిత్రాలను రూపొందిస్తానని తెలిపారు చిత్ర దర్శకుడు అశ్విన్ శరవణన్.
Hyderabad, 21 June 2019 :  YNOT Studios is glad to announce that our latest release ‘Game Over’ starring Taapsee Pannu, successfully enters its second week of theatrical run, and is still a popular choice among movie-goers across India, trending at #3 on IMDb India.We would like to take this moment to thank the audience, critics, friends and colleagues from the film fraternity and all members of the Press & Media for welcoming and celebrating our film with abundant praise and superlative response, even when it has been of a very unfamiliar style and an experimental nature. It really encourages as and rebinds our faith in our endeavour to back and deliver quality cinema.

YNOT Studios and Reliance Entertainment had formed a joint venture in early 2018 and ‘Game Over’ is the first collaboration, and we are very glad to start off this association on a positive note. Initially started as a Telugu-Tamil bi-lingual project, ‘Game Over’ was also dubbed into Hindi with luminaire-filmmaker Anurag Kashyap coming on board as the presenter in Hindi, which took the film to a wider audience. ‘Game Over’ released in Telugu, Tamil & Hindi on 14 June 2019, in over 1200 screens worldwide, to widespread positive public & critical acclaim.

The writer-director Ashwin Saravanan, had come to YNOT with a vision to tell a very important story in a thrilling and riveting format. We, at YNOT, are proud to have nurtured the idea and to have enabled him to realise the vision onto the screen and we were glad to see that many reviews had identified and acknowledged the multiple layers and lines which were well-researched and subtly utilised by the director – like PTSD(Post Traumatic Stress Disorder), violence against women, interesting facts related to modern-day body art,etc., and how an important story was conveyed effectively in a genre-bending format, and left a lasting impact among the audiences, in the way the director intended.

We are also pleased and humbled to see how women have embraced “Game Over”. The sheer resolve the central character(s) show in their own lives to ‘fight back’ when faced with challenges beyond their control, is an important message that every girl in today’s society needs to adopt and be wary of.

Taapsee Pannu’s performance as ‘Swapna’ has been key to ‘Game Over’’s success and her excellent performance is getting her rave reviews across all three languages and across the globe. Her consistency in picking her roles and stories has also been a talking point among many. We at YNOT, had a great experience working with Taapsee who is a thorough professional and an extremely hardworking and a committed actor.

“Game Over”s marketing campaign hashtag #YouHaveSeenNothingLikeThis had also become a huge success, with public and the media dubbing it as a very strong claim, but the movie absolutely lives up to the claim undoubtedly and that ‘Game Over’ is indeed a first-of-its-kind movie in Indian Cinema.

After the tremendous success of YNOT’s previous films ‘Love Failure’(2011) and  ‘Guru’(2017), we feel very proud to have struck hat-trick with “Game Over” and we wish to celebrate this success in a big scale very soon, along with all those who have given continous support and encouragement to us in our journey so far. It motivates us to produce more content-driven straight movies in Telugu, and we have already begun the process and the talks are in progress to put together an interesting project, details of which will be revealed soon.

YNOT Studios would like to once again unconditionally thank the Telugu audience, film fraternity, and the entire Press & Media for having supported us in making “Game Over” a grand success.

 

‘GameOver’ 2nd week posters

GameOver-ENGTelugu-June21-01 GameOver-ENGTelugu-June22-01 GameOver-ENGTelugu-June23-01 GameOver-Telugu-June21-01 GameOver-Telugu-June22-01 GameOver-Telugu-June23-01