ధనుష్ ‘సార్’ టీజర్ విడుదల

ధనుష్ ‘సార్’ టీజర్ విడుదల
 
*యాక్షన్, ఎమోషన్ ల మేళవింపు ’సార్’ దృశ్య మాలిక
*నేడు చిత్ర కథానాయకుడు ధనుష్ పుట్టినరోజు
* అంబరాన్నంటిన ధనుష్ అభిమానుల ఆనందం
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో జతకడుతూ ’సార్’  చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) తో కలసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ‘సార్’ కు సమర్పకునిగా వ్యవహరిస్తోంది.
వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో  నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు) ‌’వాతి’,(తమిళం) షూటింగ్ కార్యక్రమాలు దాదాపు ముగింపు దశలో ఉన్నాయి. ‘సార్’ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్న ఈ చిత్రం టీజర్ ఈరోజు విడుదల అయింది. దీనికి
ఈరోజు చిత్ర కథానాయకుడు ధనుష్ పుట్టినరోజు
వేదిక అయింది.
 
విడుదల అయిన ధనుష్ ‘సార్’ టీజర్ పరికిస్తే
యాక్షన్, ఎమోషన్ ల మేళవింపు ’సార్’ దృశ్య మాలిక అనిపిస్తుంది. పాత్రల మధ్య  సంభాషణలు సైతం ఇందుకు అద్దం పడతాయి.
“జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్
మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్” ఇదే రా ఇప్పటి ట్రెండ్.  పాత్ర అంటుంది ఓ సందర్భంలో..
మరోచోట ఓ లెక్చరర్ ”త్రిపాఠి మన కాలేజ్ లోని బెస్ట్ లెక్చరర్స్ ని గవర్నమెంట్ కాలేజీ కి పంపించేస్తే మన దగ్గరకి వచ్చి చదువుకునేది ఎవరు…!” అంటారు….
సమాధానంగా “మనం పంపేది  థర్డ్ గ్రేడ్ జూనియర్ లెక్చరర్స్ ని”… అని. ఆ పాత్ర సమాధానం.
“సార్… మై సెల్ఫ్
బాల గంగాధర్ తిలక్
త్రిపాఠి ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో జూనియర్ లెక్చరర్..
అంటూ ఇందులో మనకు కనిపించే ‘సార్’
“విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే
నైవేద్యం తో సమానం. పంచండి …
ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి” అంటాడు కథానాయకుడు ధనుష్ ఆవేదన మిళితమైన తీవ్ర స్వరంతో…. ముగింపుగా”
విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా సాగే
ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు
‘సార్’ జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్న ది అటు ఆసక్తి ని, ఇటు ఉద్విగ్నత కు గురి చేస్తుంది. అరవై తొమ్మిది  క్షణాల పాటు సాగే ఈ టీజర్ ‘సార్’ పై మరింత అంచనాలు పెరిగేలా చేసింది.
టీజర్ విడుదలైన క్షణం నుంచే  తమ అభిమాన హీరో పుట్టిన రోజుకు సరైన బహుమతి  అన్నట్లుగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అభిమానుల ఆనందం అంబరాన్ని అంటుకున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో  ’సార్’ అక్టోబర్ లో విడుదలకానుంది.
తారాగ‌ణం: ధ‌నుష్‌, సంయుక్తా మీన‌న్‌, సాయికుమార్, తనికెళ్ల భ‌ర‌ణి
, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు.
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: అవినాష్ కొల్లా
ఎడిట‌ర్: న‌వీన్ నూలి
సినిమాటోగ్రాఫ‌ర్:  జె.యువరాజ్
మ్యూజిక్: జి.వి. ప్ర‌కాష్‌కుమార్‌
యాక్షన్ కొరియోగ్రాఫర్: వెంకట్
స‌మ‌ర్ప‌ణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాత‌లు: నాగ‌వంశీ ఎస్‌. – సాయి సౌజ‌న్య‌
రచన- దర్శకత్వం: వెంకీ అట్లూరి
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
 
Dhanush dazzles as a lecturer set to reform the education system in Sir/Vaathi teaser; fans call it a perfect gift on the star’s birthday
Leading producer Suryadevara Naga Vamsi of the popular banner Sithara Entertainments is joining forces with Sai Soujanya of Fortune Four Cinemas for a bilingual film Sir (Telugu)/Vaathi (Tamil), headlined by national-award winning actor Dhanush. Srikara Studios is presenting the film. Venky Atluri is the writer and director of the prestigious project that’s nearing completion. Samyuktha Menon plays the female lead in the film.
The teaser of the bilingual was launched today, commemorating Dhanush’s birthday. This glimpse is a perfect mishmash of action and emotion, enhanced by a series of impactful dialogues. A character in the film says,  ’Zero fees…Zero education…More fees…More education…This is the trend now,’ to which a lecturer responds, ‘Tripathi, if we let the best lecturers in our college leave for government colleges, who’ll come to study here?’
The dialogue-baazi continues with the line, ‘We’re only letting third-grade lecturers leave.’ Dhanush in his introductory dialogue, adds, ‘Sir..myself Bala Gangadhar Tilak…I’m a junior lecturer at Tripathi Educational Institute…Education is like an offering you give to a God in a temple…Share it with everyone but don’t sell it like a five-star hotel dish.’ Sir takes on unfair practices within the education system and deals with the challenges faced by its pivotal character.
Right from Dhanush’s fluent dialogue delivery in Telugu to his appearance in a variety of looks and intriguing action sequences, the teaser is a feast for his fans with a perfect balance of mass and class elements. They couldn’t have asked for a better gift on the star’s birthday. The Sir teaser increases the curiosity around the film’s release in October.
Sai Kumar, Tanikella Bharani, Samuthirakani, Thotapalli Madhu, Narra Srinivas, Pammi Sai, Hyper Aadhi, Shara, Aadukalam Naren, Ilavarasu, Motta Rajendran, Hareesh Peradi and Praveena too play crucial roles in the film. J Yuvraj cranks the camera for the film with national award-winning composer GV Prakash coming up with the background score. Another award-winning technician Navin Nooli is the editor and Avinash Kolla is the production designer. Venkat handles the action choreography.
SIR-TeaserOutNow FINAL SIR PLAIN

Dhanush’s first look poster of Sir/Vaathi on his birthday eve leaves his fans in a tizzy

 

ధనుష్ ద్విభాషా చిత్రం‌ ‘సార్‌’ (తెలుగు)/ ‘వాతి’ (తమిళం) తొలి ప్రచార చిత్రం విడుదల.
* ధనుష్ పుట్టినరోజు (28, జూలై) సందర్భంగా వీడియో చిత్రం విడుదల 
*వెంకీ అట్లూరి  దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్  సంయుక్త నిర్మాణం
* ‘సార్’ అక్టోబర్ లో విడుదల
*తెలుగు, తమిళ రాష్ట్రాల్లో  ధనుష్ అభిమానుల ఆనందం
‘సార్’
జాతీయ అవార్డు గ్రహీత స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో  నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు) ‌’వాతి’,(తమిళం) షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) మరియు శ్రీకర స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. ‘సార్’ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారీ చిత్రంలో.
ఇటీవల”యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్” స్లోగన్ తో ఈ చిత్రానికి సంభందించి విడుదల అయిన టైటిల్ రివీల్ వీడియో ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన, ఉత్తేజ‌క‌ర‌మైన‌ క‌థ‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌న ముందు ప్రెజెంట్ చేయ‌నున్నార‌నే న‌మ్మ‌కం కలిగించింది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రం పేరుతో కూడిన విడుదల  అయిన ప్రచార చిత్రాలు కూడా ఆ నమ్మకాన్ని మరింత పెంచాయి. దీనిని మరింత ముందుకు తీసుకు వెళుతూ చిత్ర కథానాయకుడు ధనుష్ పుట్టినరోజు జూలై 28 సందర్భాన్ని పురస్కరించుకుని వేడుకలకు ఒక రోజు ముందే తెరతీస్తూ ‘సార్’ తొలి ప్రచార చిత్రాన్ని ఈరోజు విడుదల చేసింది చిత్రం యూనిట్.
ఈ ప్రచార చిత్రం లో ధనుష్ ‘సార్’ ఓ లైబ్రరీలో కూర్చొని శ్రద్ధగా,దీక్షగా రాసుకుంటున్నట్లు కనిపిస్తారు. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారు, దేనికి సిద్ధ మవుతున్నారు లాంటి ప్రశ్నలన్నిటికీ ‘సార్’ సమాధానం వెండితెర మీద చూడాల్సిందే.
ఈ ప్రచారచిత్రం తో చిత్రం పట్ల పెరిగిన ఆసక్తి మరింత స్థాయికి వెళ్ళే దిశగా ధనుష్ పుట్టినరోజు నాడు అనగా రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల అయ్యే వీడియో చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో  ధనుష్ అభిమానుల ఆనందం అంబరాన్ని అంటుతుంది. 
ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ…’సార్’ చిత్రంలో ధనుష్ లెక్చరర్ గా కనిపిస్తారు. విద్యా వ్యవస్థ నేపధ్యంలో జరిగే కథ. నేడు విడుదల ఆయన ప్రచార చిత్రం కానీ, రేపు మా హీరో ధనుష్ గారు పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న వీడియో చిత్రం కానీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రూపొందుతోంది చిత్రం. దీనికి తగినట్లుగా ధనుష్ గారు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆయన సహకారం, ఆయనతో ప్రయాణం మర్చిపోలేనిది అన్నారు. అలాగే జి వి ప్రకాష్ గారి సంగీతం, యువరాజ్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరింత వన్నె తెస్తాయి అని నమ్ముతున్నాను అని తెలిపారు.
‘సార్’ అక్టోబర్ లో విడుదలకానుంది. తెలుగు, తమిళ భాషల్లో తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని, రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు, విశేషాలు వెల్లడి చేయనున్నట్లు తెలిపారు నిర్మాత నాగవంశీ.
తారాగ‌ణం: ధ‌నుష్‌, సంయుక్తా మీన‌న్‌,సాయికుమార్,తనికెళ్ల భ‌ర‌ణి
, సముద్ర ఖని,తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార,ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు.
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: అవినాష్ కొల్లా
ఎడిట‌ర్: న‌వీన్ నూలి
సినిమాటోగ్రాఫ‌ర్:  జె.యువరాజ్
మ్యూజిక్: జి.వి. ప్ర‌కాష్‌కుమార్‌
యాక్షన్ కొరియోగ్రాఫర్: వెంకట్
స‌మ‌ర్ప‌ణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాత‌లు: నాగ‌వంశీ ఎస్‌. – సాయి సౌజ‌న్య‌
రచన- దర్శకత్వం: వెంకీ అట్లూరి
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
Dhanush’s first look poster of Sir/Vaathi on his birthday eve leaves his fans in a tizzy
National award-winning actor Dhanush’s Telugu-bilingual Sir/Vaathi, written and directed by Venky Atluri, is nearing completion. S Naga Vamsi and Sai Soujanya are bankrolling the prestigious project under Sithara Entertainments, Fortune Four Cinemas. Srikara Studios presents the film. Samyuktha Menon plays the female lead.
A title reveal video of the bilingual, calling the film an ambitious journey of a common man caught the attention of many, hinting at a unique, intriguing campus tale. The title posters contributed to the excitement of Dhanush’s fans. On the eve of Dhanush’s birthday, the makers of Sir/Vaathi released the first look of the film.
In the first look poster, Dhanush, surrounded by a pile of books across various shelves, is burning the midnight oil, sporting an intense expression while working on an important assignment. This look featuring Dhanush as a lecturer has only enhanced the curiosity surrounding the film’s teaser, set to release tomorrow at 6 pm (on Dhanush’s birthday).
Here’s what the director Venky Atluri has to say about it.“Dhanush will be seen as a lecturer in Sir. The film revolves around the education system and is simultaneously being made in Tamil and Telugu. Dhanush’s unflinching support on the sets is indeed unbelievable. GV Prakash’s music and Yuvraj’s cinematography are among the major highlights of the film,” he added.
Sir is set to release in October. More details about the much-anticipated Telugu-Tamil bilingual will be announced shortly.
CAST :
Dhanush, Samyuktha Menon,Sai Kumar,Tanikella Bharani,Samuthirakani,Thotapalli Madhu, Narra Srinivas, Pammi Sai, Hyper Aadhi, Shara, Aadukalam Naren, Ilavarasu,Motta Rajendran,Hareesh Peradi,Praveena etc
CREW:
Production Designer: Avinash Kolla
Editor: Navin Nooli
DOP: J Yuvraj
Music: G. V. Prakash Kumar
Action Choreographer – Venkat
Presentes: Srikara Studios
Producers: Naga Vamsi S – Sai Soujanya
Written & Directed By : Venky Atluri
Banners: Sithara Entertainments – Fortune Four Cinemas
Pro: Lakshmi Venugopal
FL TWITTER&InstaStory_TELUGU FL TWITTER&InstaStory_TAMIL SIR FL PLAIN FL TWITTER_ENGLISH

Superstar Mahesh Babu and director Trivikram’s #SSMB28, produced by Haarika and Hassine Creations, to go on floors this August; film set for a summer 2023 release

 సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చిత్రం 
*ఆగస్టు నుంచి రెగ్యులర్  షూటింగ్ 
*2023 వేసవి లో చిత్రం విడుదల
*నేడు ప్రచార చిత్రం విడుదల
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో,టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్  అధినేత ఎస్.రాధాకృష్ణ ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న భారీ,ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతోంది.
ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన తార ‘పూజాహెగ్డే‘ మరోసారి జతకడుతున్నారు.
మ‌హేష్‌బాబు , త్రివిక్ర‌మ్  ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంభందించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రెగ్యులర్  షూటింగ్ ఆగస్టు లో   ప్రారంభమవుతుంది. ఈ  సందర్భంగా ప్రచార చిత్రం ను విడుదల చేసారు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్‘ చిత్రం యూనిట్.
ఈ ప్రచార చిత్రాన్ని వీక్షిస్తే… జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం అవగత మవుతుంది.
మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అత‌డు`, `ఖ‌లేజా` దశాబ్ద కాలానికి పైగా నేటికీ  ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. దశాబ్ద కాలానికి పైగా  ఎదురు చూస్తున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో బిగ్గెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతోంది అన్న వార్త    అభిమానుల ఆనందాన్ని అంబరాన్ని తాకేలా చేసింది.
 ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది (2023) వేసవి లో చిత్రం విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్.రాధా కృష్ణ  ఈ సందర్భంగా తెలిపారు.  టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్పెష‌ల్ క్రేజ్ ఉన్న ఈ చిత్రానికి నిర్మాత‌: ఎస్.రాధాకృష్ణ‌(చిన‌బాబు),
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌.
 
Superstar Mahesh Babu and director Trivikram’s #SSMB28, produced by Haarika and Hassine Creations, to go on floors this August; film set for a summer 2023 release
Haarika and Hassine Creations’ SSMB28, headlined by Superstar Mahesh Babu and directed by filmmaker Trivikram, is one of the most anticipated projects by movie buffs and fans alike. The film is set to go on floors this August, the makers have confirmed today. Actress Pooja Hegde plays the female lead in the film bankrolled by leading producer S.Radha Krishna (China Babu).
The pre-production formalities are progressing at a brisk pace. Trivikram is churning out a script that’ll appeal to audiences across all age groups and tastes. Offering a sneak peek into SSMB28, the team has released a special glimpse throwing light on the film’s cast and crew.
The sneak peek, complemented by a stylish score, confirms that the film will be edited by national award-winning technician Navin Nooli while the team also comprises art director AS Prakash, in-form music director Thaman and cinematographer PS Vinod. The makers have also announced that the film would be a summer 2023 release; ‘The evergreen combo is back to reign,” it says.
Mahesh Babu and Trivikram’s earlier collaborations, Athadu and Khaleja, continue to entertain and amaze audiences even today and expectations are running high on their third project together that’s touted to be the wholesome entertainer. More interesting details about the film and its team will be unveiled shortly, said producer S Radha Krishna.
Cast & Crew Details:
Stars: Super Star Mahesh Babu, Pooja Hegde
Written & Directed by Trivikram
Music: Thaman S
Cinematography: PS Vinod
Editor: Navin Nooli
Art Director – A.S. Prakash
Producer: S. Radha Krishna(Chinababu)
Banner – Haarika & Hassine Creations

Phalana Abbayi Phana Ammayi’s shoot progresses across picturesque locations in London

లండన్ లో “ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి”
*నాగశౌర్య,మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్  సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’
*లండన్ లోని పలు సుందరమైన ప్రదేశాలలో ప్రస్తుతం షూటింగ్
విజయవంతమైన చిత్రాలలోని నాయకా,నాయికలు అలాగే దర్శకులు…వీరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందే చిత్రాలపై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపార వర్గాలలోనూ ఆసక్తి రేకెత్తుతుంది.
ప్రస్తుతం అలా ఆసక్తిని కలిగించే చిత్రం ఇది.  దీనిని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మరో నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి నిర్మిస్తోంది.. వివరాల్లోకి వెళితే…
ఆమధ్య యువ కథానాయకుడు నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు విదితమే. అలాగే ‘నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన ‘ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాల విజయాలు తెలిసిందే.
ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. కథానాయకుడిగా నాగశౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ లను టీమ్ గా చేసుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుపుకుంటోంది. నాయక, నాయిక లతోపాటు ప్రధాన తారాగణం పాల్గొనగా చిత్రీకరణ జరుగుతోంది.
ఇలాంటి విజయ వంతమైన చిత్రాల నాయక,నాయికలు, దర్శకుడు, ప్రతిభ గల సాంకేతిక వర్గంతో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపారు ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల తెలిపారు.
Phalana Abbayi Phana Ammayi’s shoot progresses across picturesque locations in London
There’s always curiosity among audiences, fraternity and trade circles when actors and directors with a successful track record reunite for a new film. Eminent production house People Media Factory is joining hands with another new banner, Dasari Productions, for an exciting project Phalana Abbayi Phalana Ammayi. The film brings back Naga Shaurya and Malavika Nair together after their hit-collaboration Kalyana Vaibhogame.
Actor, writer and director Srinivas Avasarala, who associated with Naga Shaurya for quality films like Oohalu Gusagusalade, and Jyo Achyutananda in the past, is wielding the megaphone for Phalana Abbayi Phana Ammayi. There’s immense buzz and excitement all around that names who enjoy such credibility like Naga Shaurya, Malavika Nair and Srinivas Avasarala are collaborating to tell another refreshing story.
Phalana Abbayi Phana Ammayi is currently being shot across picturesque locations in London. Apart from the lead pair, a bulk of the supporting cast too will take part in the schedule. “We’re happy to team up with such a talented cast, crew who’ve proved their worth in the past,” said producers TG Vishwa Prasad, Dasari Padmaja and co-producer Vivek Kuchibhotla.
papa movie - 01 PXL_20220702_120000706 PXL_20220702_120018762 PXL_20220702_120022699 PXL_20220702_120028892