Sir

Vaathi/ Sir Team honours and celebrates real-life Sir/ Vaathi K. Rangaiah

రియల్ బాల ‘సార్’ (కె. రంగయ్య) ని కలిసిన దర్శకుడు వెంకీ అట్లూరి
*రంగయ్య గారు కు సత్కారం, సహకారం అందించిన చిత్ర బృందం
కొన్ని కథలు సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. కదిలిస్తాయి, ఆలోచింపజేస్తాయి, మార్పు దిశగా అడుగులు వేసేలా చేస్తాయి. అలాంటి అరుదైన ఆలోచింపజేసే కథతో రూపొందిన సందేశాత్మక చిత్రమే ‘సార్’. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ 100 కోట్ల దిశగా పయనిస్తోంది. ఇది గురువు గొప్పతనాన్ని తెలియజేసిన చిత్రం. పేద విద్యార్థుల చదువు కోసం బాల గంగాధర్ తిలక్ అనే ఓ గురువు సాగించిన పోరాటం ఈ చిత్రం. సిరిపురం అనే ఊరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు జూనియర్ లెక్చరర్‌గా వెళ్ళిన కథానాయకుడు.. అక్కడ విద్యార్థులెవరూ కళాశాలకు రాకపోవడంతో వారిని తిరిగి కళాశాలకు వచ్చేలా చేస్తాడు. కుల వ్యవస్థపై పోరాడేందుకు వారిలో చైతన్యం నింపుతాడు. ఈ చిత్రంలో విద్య గొప్పతనాన్ని తెలుపుతూ బాల గంగాధర్ తిలక్ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం. అయితే అలాంటి బాల గంగాధర్ తిలక్ నిజం జీవితంలోనూ ఉన్నారు.

కుమురం భీం జిల్లా కెరమెరి మండలం సావర్ ఖేడలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు కేడర్ల రంగయ్య. ఆయన బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 60 లోపే. కానీ ఆయన కృషి ఆ సంఖ్యను 260 కి చేరేలా చేసింది. తన కూతురిని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి.. తన బాటలోనే ఆ గ్రామస్థులు నడిచేలా వారిలో స్ఫూర్తి నింపారు రంగయ్య. తన సొంత డబ్బుతో పాఠశాలను మరమ్మత్తులు చేయించడానికి పూనుకున్న ఆయనను చూసి గ్రామస్థులు ముందుకొచ్చి పాఠశాలకు కొత్త మెరుగులు దిద్దారు. ఉపాధ్యాయుడిగా ఆయన చేసిన కృషికి గాను జాతీయ అవార్డు కూడా అందుకున్నారు రంగయ్య.

కేడర్ల రంగయ్య జీవితం సార్ చిత్రానికి స్ఫూర్తి కాదు. కానీ ఆయన జీవితం కూడా బాల గంగాధర్ తిలక్ కథ లాగే స్ఫూర్తిదాయంగా ఉంది. అదే కేడర్ల రంగయ్యను  ‘సార్’ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి స్వయంగా కలిసేలా చేసింది. నిజజీవితంలో తాను చూసిన, విన్న సంఘటనల ఆధారంగా సార్ కథను, బాల గంగాధర్ తిలక్ పాత్రను తీర్చిదిద్దారు వెంకీ అట్లూరి. అయితే సినిమా విడుదలై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న సమయంలో.. తాను రాసుకున్న బాల గంగాధర్ తిలక్ పాత్రను పోలిన ఉపాధ్యాయుడు నిజంగానే ఉన్నారని తెలిసి వెంకీ అట్లూరి ఆశ్చర్యపోయారు, అంతకుమించి ఆనందపడ్డారు. కేడర్ల రంగయ్య గారిని కలవాలనుకున్నారు. అనుకోవడమే కాదు తాజాగా హైదరాబాద్ లో కలిశారు కూడా.

వెంకీ అట్లూరి, కేడర్ల రంగయ్య ఇద్దరూ కలిసి సార్ చిత్రం గురించి, సావర్ ఖేడ ప్రభుత్వ పాఠశాల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. సార్ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాల్లో తనని తాను చూసుకున్నట్లు ఉందని కేడర్ల రంగయ్య చెప్పడంతో వెంకీ అట్లూరి ఎంతగానో సంతోషించారు. అలాగే అతి చిన్న వయసులోనే ఉత్తమ ఉపాధ్యాయుడుగా జాతీయ అవార్డు అందుకున్నారని తెలిసి కేడర్ల రంగయ్యను వెంకీ అట్లూరి ప్రత్యేకంగా అభినందించారు. 13 సంవత్సరాల కాలంలో తాను ఎదుర్కొన్న సవాళ్ళను, సాధించిన ఘనతలను గుర్తు చేసుకున్న రంగయ్య.. ఇలాంటి అద్భుత చిత్రాన్ని రూపొందించిన వెంకీ అట్లూరికి కృతజ్ఞతలు తెలిపారు. “గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః” అనే దానికి ఇలాంటి గురువులను ఉత్తమ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విద్యార్థుల అభ్యున్నతి కోసం తమ జీవితాలను అంకితం చేసే ఇలాంటి గొప్ప ఉపాధ్యాయులకు సార్ మూవీ టీం సెల్యూట్ చేస్తుంది. పేద విద్యార్థుల విద్య కోసం ఎంతగానో కృషి చేస్తున్న కేడర్ల రంగయ్యకు అండగా నిలిచి.. ఇంతటి గొప్ప కార్యంలో తాము కూడా భాగం కావాలన్న ఉద్దేశంతో చిత్ర బృందం తరఫున వారి వంతుగా రు. 3 లక్షలు ఆర్ధిక తోడ్పాటు అందించారు. ఆయన అద్వితీయ ప్రయాణానికి సహకారంగా అందించిన ఈ ఆర్థిక సాయం.. పాఠశాలల్లో లైబ్రరీల నిర్మాణానికి, విద్యార్థులకు వారి విద్య, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విజయానికి కీలకమైన పుస్తకాలు మరియు విద్యా వనరులను అందించడానికి దోహదపడుతుంది.

కోలీవుడ్ స్టార్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం సార్(వాతి). ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. హ్యాడ్సమ్ హీరో సుమంత్ అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ భారీ వసూళ్లతో మరింతగా దూసుకుపోతోంది.

Vaathi/ Sir Team honours and celebrates real-life Sir/ Vaathi K. Rangaiah

Vaathi/ Sir team tells the story of a young lecturer, played by Dhanush. He goes to a Government School in a rural area and gives a facelift to the education system. He brings students to schools and raises awareness among them to fight the caste system, and celebrate equality through education. He triumphs past many hurdles, thanks to his willpower and the determination of the students. Recently, the team honoured a similar and equally inspiring government school teacher, K. Rangaiah, who won President Award, for his services.

Director Venky Atluri met K Rangaiah and conversed about the film and his life. Being the youngest teacher to receive the President Award for his efforts, he has been instrumental in bringing back students to schools in his village, Savarkhed. When the school headmaster at his village changed after he joined work, he decided to take up the responsibility of bringing back students to schools and ran campaigns against persisting problems in the region.

He stated that after looking at the film, he identified himself with it. He was reportedly reminded of the many struggles he had to face over 13 years, to achieve what he did today. He thanked Venky Atluri for making such a fantastic film and said that many scenes from Sir/Vaathi are like his biography. Sir/ Vaathi team salutes many such teachers who dedicate their lives to the upliftment of students and treat them like their God.

The hymn “Gurur Brahma, Gurur Vishnu, Guru Devo Maheswaraha, Guru Sakashath Parabrahma Tasmai Sree Gurave Namaha!” couldn’t have been more apt. In a bid to recognise Rangaiah’s efforts and to establish a library, the leading production house Sithara Entertainments has donated to him a sum of Rs 3 lakhs. This funding will go towards the construction of libraries in schools, providing students with access to books and educational resources, crucial for their academic, personal, and professional success.

Sir is a meaningful film that joins the league of epic movies of the world that revolved around the concept of a teacher brining reforms to the society”: R Narayana Murthy*

‘సార్’ లాంటి సినిమా తీయడం ఆషామాషి కాదు- పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్’(వాతి). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. కోలీవుడ్ స్టార్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో హ్యాండ్సమ్ హీరో సుమంత్ అతిథి పాత్రలో కనువిందు చేశారు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న భారీస్థాయిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ రెండు భాషల్లోనూ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. సార్ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో తాజాగా చిత్ర బృందం విజయోత్సవ సభను నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో నిర్మాత నాగ వంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి, నటీనటులు సంయుక్త మీనన్, సుమంత్, సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకను ప్రారంభించే ముందు ఇటీవల స్వర్గస్తులైన సినీ నటుడు నందమూరి తారకరత్నకు నివాళులు అర్పిస్తూ చిత్ర బృందం కాసేపు మౌనం పాటించారు.
ముఖ్య అతిథి ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. “ముందుగా ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని, ఒక గొప్ప చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గుండెలకు హత్తుకునేలా సినిమా ఉంటే సూపర్ హిట్ చేస్తామని మరోసారి ప్రేక్షకులు నిరూపించారు. ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడికి నా అభినందనలు. ఇలాంటి సినిమాలు తీయడం ఆశామాషి కాదు. దానికి గుండె ధైర్యం కావాలి. ఇది ఆర్ట్ ఫిల్మ్ కాదు.. కానీ ఆర్ట్ ఫిల్మే. ఇది కమర్షియల్ సినిమా కాదు.. కానీ కమర్షియల్ సినిమానే. అలా మాయ చేశాడు దర్శకుడు. ఇది ప్రజల సినిమా, స్టూడెంట్స్ సినిమా, పేరెంట్స్ సినిమా. జీవితంలో గుర్తుండిపోయే ఇలాంటి సినిమా తీసి హిట్ కొట్టిన నిర్మాతకు నా అభినందనలు. హాలీవుడ్ యాక్టర్ సిడ్నీ పోయిటియర్ నటించిన ‘టు సర్, విత్ లవ్’, ఎన్టీ రామారావు గారి ‘బడిపంతులు’, హృతిక్ రోషన్ నటించిన ‘సూపర్ 30′ లాగా ఇది కూడా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. విద్య, వైద్యం అనేవి ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని రాజ్యాంగ మనకు కల్పించిన హక్కు. కానీ అవి వ్యాపారం అయిపోయాయి. విద్య, వైద్యం వ్యాపారం కాకూడదు. పేదలందరికీ విద్య అందుబాటులో ఉండాలి.. ప్రైవేట్ సెక్టార్ వద్దు, పబ్లిక్ సెక్టార్ ముద్దు అనే సందేశాన్ని చాటి చెప్పిన ఈ చిత్రానికి హ్యాట్సాఫ్. దర్శకుడు సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించాయి. ప్రతి పాత్రను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. సంయుక్తమీనన్, సాయి కుమార్, సముద్రఖని, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది అందరూ అద్భుతంగా నటించారు. కెమెరామెన్ 90ల బ్యాక్ డ్రాప్ ని చక్కగా చూపించారు. ధనుష్ గారు గొప్ప నటుడు. సహజంగా నటిస్తారు. భాషతో సంబంధం లేకుండా అందరికీ దగ్గరైన నటుడు. ఆయన నటనకు సెల్యూట్.” అన్నారు.
నటుడు సుమంత్ మాట్లాడుతూ.. “ఇంత మంచి పాత్ర రాసి, ఆ పాత్రకు నేను న్యాయం చేస్తానని నమ్మిన దర్శకుడు వెంకీకి థాంక్స్. తక్కువ రోజులే పనిచేసిన ఈ సినిమాలో భాగం కావడం ఆనందాన్ని ఇచ్చింది. నాకొక అలవాటు ఉంది. పాత్ర చిన్నదైనా పెద్దదైనా స్క్రిప్ట్ మొత్తం చదవడం అలవాటు. చదవగానే ఈ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సబ్జెక్ట్ తీస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనిపించింది. ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించింది. ఈ స్థాయిలో వసూళ్ళు రావడం సంతోషంగా ఉంది” అన్నారు.
చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “నిద్రాహారాలు మాని ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా నా డైరెక్షన్ డిపార్టుమెంట్.. కో డైరెక్టర్ శ్రీవాత్సవ్ గారు, సతీష్ చంద్ర, అంజి, రమేష్, శివ, నవీన్, హరీష్, రామారావు గారు, వెంకటేష్ మీనన్, పవిష్ నారాయణ్, చరణ్ వీళ్లు నా టీమ్. ఈరోజు ఈ సినిమాకి ఇన్ని ప్రశంసలు దక్కుతున్నాయి అంటే వీళ్ళందరూ కారణం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారి టీమ్, సినిమా పబ్లిసిటీ దిగ్విజయంగా నిర్వహించిన పీఆర్ఓ వేణుగోపాల్ గారు, డిజిటల్ మీడియా చూసుకున్న సందీప్ కులకర్ణి గారు, నా సపోర్ట్ చేసిన నా స్నేహితులు వంశీ కాక, నాని అందరికీ ధన్యవాదాలు. ఫైట్ మాస్టర్ వెంకట్ గారు, డీఓపీ యువరాజ్ గారు, ఎడిటర్ నవీన్ నూలి గారు, కావ్య శ్రీరామ్, రజినీ, సంధ్య, మేకప్ నాగు, శేఖర్ మాస్టర్, విజయ్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ గారు అందరికీ బిగ్ థాంక్స్. లిరిక్ రైటర్స్ రామజోగయ్య శాస్త్రి గారు, సుద్దాల అశోక్ తేజ గారు, ప్రణవ్, సింగర్స్ శ్వేతా మోహన్, కాల భైరవ, అనురాగ్ కులకర్ణి, ప్రణవ్ అందరికీ థాంక్స్. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా మొదటి సినిమా తొలిప్రేమ అక్కడ చేశాం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సార్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాను. డిఐ మదన్, ప్రసాద్, సీజీ వాసు గారు, ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ సాగర్.. ఇలా వీళ్లు అందరూ కలిస్తేనే ఈరోజు ఈ సక్సెస్. తనికెళ్ళ భరణి గారు సెట్ లో ఉంటే దైవత్వం ఉన్నట్లు ఉంటుంది. చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. ఆయన ఈ సినిమాలో నటించడం మా అదృష్టం. సినిమాలో భాగమై ఇంతటి విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సినిమా విజయం సాధిస్తుందని సుమంత్ గారు ముందే అన్నారు. ఆయనను ప్రీరిలీజ్ కి రమ్మని అడిగితే సర్ప్రైజ్ రివీల్ అవ్వకుండా ఉండాలని, డైరెక్ట్ గా సక్సెస్ మీట్ కి వస్తానన్నారు. ఈ సినిమా విజయాన్ని ఆయన ముందుగానే ఊహించారు. ఆయన పరిచయమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.
చిత్ర కథానాయిక సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. ” మా చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న తెలుగు, తమిళ ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మాకు నమ్మకం ఉంది. నేను పోషించిన మీనాక్షి పాత్రను ఇంతలా ఆదరిస్తారని అసలు ఊహించలేదు. నా కెరీర్ లో ప్రేక్షకుల నుంచి ఇంత ప్రేమను ఎప్పుడూ చూడలేదు. ఇంత మంచి సినిమాలో, నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు వెంకీ గారికి థాంక్స్. నన్ను ఇంతలా ప్రోత్సహిస్తూ నా విజయానికి కారకులైన వంశీ గారికి, చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ధనుష్ గారు, సముద్రఖని గారు, భరణి గారు, ఆది గారు, సాయి కుమార్ గారితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది” అన్నారు.
సాయి కుమార్ మాట్లాడుతూ.. “నారాయణమూర్తి గారు ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని ఆశీర్వదించిన ప్రేక్షకదేవుళ్ళు అందరికీ ధన్యవాదాలు. సినిమా చాలా బాగుందని అన్ని ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. నర్సన్నపేట నుంచి ఓ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నా ఫోన్ నెంబర్ ఎలాగో సంపాదించి ఫోన్ చేసి.. ఈ సినిమా చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. ఇది ప్రతి టీచర్, ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్ చూడాల్సిన సినిమా అన్నారు. విద్య నేపథ్యంలో వచ్చిన గొప్ప చిత్రాలలో ఒకటని కొనియాడారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చింది. ఇంత మంచి కథను తెరకెక్కించిన దర్శకుడు వెంకీకి, ఇలాంటి అద్భుతమైన కథకు మద్దతుగా నిలిచిన నిర్మాతలు వంశీ గారికి, సాయి సౌజన్య గారికి అభినందనలు.” అన్నారు.
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. “తల్లిదండ్రులు తర్వాత గురువే. తల్లిదండ్రులు జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు. ఒక దర్శకుడు ఒక అర్థవంతమైన కల కన్నాడు, ఒక సంస్కారవంతమైన కల కన్నాడు.. దానిని ప్రేక్షకులు సాకారం చేశారు. గతంలో గురువులను వేళాకోళం చేసేవాళ్ళు. చాలా బాధ కలిగేది నాకు. ఎందుకంటే మనం ఈ స్థాయికి రావడానికి గురువులే కారణం. వెంకీ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో మేం దగ్గరుండి చూశాం. ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ఫలితం పొందాడు.  ఈ సినిమాతో విశ్వనాథ్ గారిలాగా తనదైన ఒక ముద్రను ఆరంభించాడు. వెంకీ ఇలాంటి సంస్కారవంతమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. గురువులకు లేచి నమస్కారం పెట్టాలనిపించే సంస్కారవంతమైన సినిమా ఇది. ధనుష్ చాలా గొప్ప దర్శకుడు. కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ముందుంటాడు. ఒక గొప్ప సినిమాలో నటించానని సంతృప్తిని మిగిల్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు.
సముద్రఖని మాట్లాడుతూ.. “మనం జనాలను ప్రేమిస్తే.. జనాలు మనల్ని ప్రేమిస్తారు. మనం సమాజాన్ని ప్రేమిస్తే.. సమాజం మనల్ని ప్రేమిస్తుంది. అదే ఈ సినిమా. ఇలాంటి కథ రాయాలంటే మంచి హృదయం ఉండాలి.. సమాజం పట్ల ప్రేముండాలి.. అలాంటి వాళ్ళే ఇంతమంచి కథలు రాయగలరు. మంచి మనసున్న వాళ్ళు అందరూ కలిసి ఒక మంచి సినిమా చేశారు. ఇది మన బ్రెయిన్ ని వాష్ చేసే ఫిల్మ్. మన గురువులకు కాల్ చేసి మాట్లాడాలి అనిపించే ఫిల్మ్. దిగువ మధ్యతరగతి కుటుంబాల బాధను తెలిపిన ఫిల్మ్. ఈ సినిమా చూసినప్పుడు నా పేరెంట్స్, టీచర్స్ గుర్తొచ్చారు. ఇలాంటి సినిమాలో భాగం కావడం దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాను” అన్నారు.
హైపర్ ఆది మాట్లాడుతూ.. “డబ్బుకి కాకుండా మనుషులకి విలువనిచ్చే నారాయణమూర్తి గారు ఇక్కడి వచ్చి మా సినిమా గురించి మాట్లాడటం సంతోషంగా ఉంది. ఈ సినిమా మనల్ని నవ్వించింది, ఏడిపించింది, గూజ్ బంప్స్ తెప్పించింది, మంచి సినిమా చూశామన్న ఆనందాన్ని ఇచ్చింది, ధనుష్ గారి మీద ఇంకా ప్రేమ కలిగేలా చేసింది, దర్శకుడు వెంకీ అట్లూరి గారి మీద గౌరవం కలిగేలా చేసింది, సితార బ్యానర్ కు కలెక్షన్లు వచ్చేలా చేసింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతున్నారు. ఈ సినిమా చూశాక మనకు మన గురువులు గుర్తొస్తారు.” అన్నారు.
డీఓపీ యువరాజ్ మాట్లాడుతూ.. “మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ధనుష్ గారు ఈ సినిమాలో నటించలేదు.. బాలు పాత్రలో జీవించారు. ఈ సినిమాతో మా దర్శకుడు వెంకీ గారు డిస్టింక్షన్ కొట్టేశారు. సంయుక్త, సుమంత్ గారు, సముద్రఖని గారు, సాయి కుమార్ గారు, భరణి గారు, ఆది గారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత వంశీ గారికి, వెంకీ గారికి, ధనుష్ గారికి ధన్యవాదాలు” అన్నారు.
ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన ఈ వేడుకకు స్రవంతి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో విద్యార్థులుగా నటించి అలరించిన పిల్లలతో ఈ వేడుకకు ప్రారంభించడం విశేషం. అలాగే ముఖ్య అతిథిగా హాజరైన నారాయణమూర్తితో కలిసి మూవీ టీమ్ కేక్ కట్ చేసి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు.
 
*“Sir is a meaningful film that joins the league of epic movies of the world that revolved around the concept of a teacher brining reforms to the society”: R Narayana Murthy*
*Sir celebrated success in a gala meet attended by R Narayana Murthy, Samyuktha, Samuthirakani, Sai Kumar, Hyper Aadi, and others*
Sir released on Feb 17, 2023, emerged as a blockbuster. The film is produced by Naga Vamsi S. and Sai Soujanya under Sithara Entertainment in association with Fortune Four Cinemas. Srikara Studios presented the movie. Sir is running successfully in Telugu states and got a unanimous positive talk from audience. The cast and crew of Sir attended a grand success meet in Hyderabad. R Narayana Murthy graced the event as the chief guest. The event started with the actors who portrayed the student characters in Sir.
Venky Atluri lauded the efforts of all the people who are behind the scenes of Sir. He showed a wonderful gesture by calling the crew who is present at the success meet on stage. Venky spoke high about Tanikella Bharani and the way he brought positive energy to the sets. He made a special mention about Sumanth and his presence in the film.
R Narayana Murthy applauded the audience for making ‘Sir’ a grand success. He said when a film connects with the hearts of the audience it will be successful. He pulled off a quote of Abdul Kalam and praised Venky Atluri. Narayana Murthy said, “Sir joins the league of great films such as To Sir with Love, Badi Panthulu, and Super 30. The audience emoted with the protagonist and the students and the film moved them. I salute Dhanush for his great performance. He is a pan-India hero”. He praised all the actors’ performance and concluded saying ‘Sir’ is a film for every parent and every student.
DOP Yuvraj said, “Audience received the movie emotionally. Dhanush lived in the character of Balu sir. Our director Venky got a distinction in the exam (the movie). I am happy that I worked with so many talented actors”.
Saikumar opened his speech with Gurubhyo Namahaa and praised the audience for making Sir a grand success. He said, “I got congratulatory messages from people around the world. What surprised me is I got a call from a college in a remote village and they applauded the film. My family members called me and told Sir really echoed with all of us”.
Sumanth thanked Telugu and Tamil audience for making Sir a grand success, and special thanks for Venky Atluri for writing a beautiful character and roping him for it.
Hyper Aadi said, “We are privileged to get blessings from R Narayana Murthy. We got goosebumps and experienced highs and lows while watching Sir. I saw people clapping the theatre. The movie has been a change maker and all the actors got a lot of respect for doing the film. I really anticipate a good change in the educational system”. In his typical style he heaped praised on cast and crew.
Samyuktha said a simple character like Meenakshi getting a great attention is something unexpected. She remarked, “People are calling me madam and the credit to our director Venky Atluri. This is one film and character that’s defining for me. Meenakshi is one among you and thank you for the acceptance”. Samyuktha shared a story when an anchor previously questioned her choice about doing a teacher character in Sir. Now he might be lauding my choice.
Tanikella Bharani said about the changing perception of audience who is lauding the efforts of teachers in movies. He said, “I am really grateful to my teacher who taught me Telugu and that language became my livelihood. Venky poured his heart into the film and now it’s time to enjoy the film. Dhanush added life to Sir and the collective efforts of the entire team made Sir a grand success”. He commented on the status quo where there is a lack of quality teachers and said Sir will be an eye opener.
Samuthirakani said Sir is all about loving the society and doing great things for the ecosystem around us. He said, “The story idea of Sir only comes to people who have love for society. The character I did in Sir is a contrast from what I faced as a child, but Venky ensured I excel at it”. He praised all the actors of Sir for taking up good roles and thanked the crew behind Sir.
The success meet concluded with cake cutting on the stage by the dignitaries present at the event.
IMG_20230220_204739 IMG_20230220_204347

Renowned Tamil Director “Bharathi Raja” speaks highly of Dhanush’s latest film ‘Sir’/”Vaathi”

ప్రముఖ దర్శకుడు భారతీరాజా మెచ్చిన ధనుష్ తాజా చిత్రం ‘సార్’(వాతి)

తాజా పత్రికా ప్రకటనలో, ప్రముఖ భారతీయ దర్శకుడు భారతీరాజా ధనుష్ నటించిన తాజా చిత్రం ‘వాతి’(సార్) పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన భారతీరాజా, విద్యను ప్రోత్సహించడంలోని ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన ఈ చిత్రాన్ని ఒక ప్రత్యేకమైన చిత్రంగా అభివర్ణించారు.

“నా సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లను చూశాను. కొన్ని విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అలాంటి వాటిలో  ‘సర్’ ఒకటి. నేను చాలా సినిమాలు చూస్తున్నాను, నేను ఇందులో భాగమైనందున ఇది ప్రత్యేకమైనది. సినిమాలు వినోదం పంచడం కంటే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. అలాంటి సినిమాల్లో వాతి ఒకటి. వాతిలో విద్య యొక్క ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారు” అని భారతీరాజా ప్రకటనలో తెలిపారు.
ధనుష్ యొక్క బాధ్యతాయుతమైన దృష్టిని భారతి రాజా ప్రశంసించారు. సినిమాలో కీలక పాత్ర పోషించిన సముద్రఖని, టీచర్‌ పాత్రలో చక్కగా ఒదిగిపోయిన సంయుక్త గురించి కూడా ఆయన ప్రశంసించారు.

సర్  చిత్రానికి సంగీతాన్ని అందించే అవకాశం జివి ప్రకాష్ కి రావడం ఆయనకు ఆశీర్వాదం. ఆయన ఈ సంవత్సరం అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఏడాది ఆయన జాతీయ అవార్డు అందుకోవడం ఖాయం.
సర్ అనేది గొప్ప టైటిల్, ఈ చిత్రం ఉపాధ్యాయుని సామాజిక బాధ్యత గురించి మాట్లాడుతుంది.” అని భారతీరాజా అన్నారు.

ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాలని భారతి రాజా ప్రజలను కోరారు. “నేను ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్న తీరు బాగుంది. ఇటీవలి కాలంలో వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో ఇదొకటి. వాతి థియేటర్‌లో తప్పక చూడవలసిన చిత్రం. మీరు ఈ సినిమాని థియేటర్లలో చూసి, ఆ అనుభూతిని నాతో పంచుకోవాలని కోరుకుంటున్నాను” అని ముగించారు భారతీరాజా.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం సార్(వాతి). ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో ధనుష్, సముద్రఖని, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 17, 2023న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

Renowned Tamil Director “Bharathi Raja” speaks highly of Dhanush’s latest film ‘Sir’/”Vaathi”

In a recent press statement, veteran Indian Director Bharathi Raja expressed his admiration for Dhanush’s latest film, ‘Sir’/Vaathi”. Bharathi Raja, who has been in the Indian film industry for several decades, described the film as a special one and stressed its importance in promoting education.
“In my film career, I’ve seen a lot of milestones. Few things have stunned me. One such is Vaathi. I’m watching a lot of films, this is a special one as I’m part of it. Films should be useful to people, more than entertainment. Sir/Vaathi is one such film. Sir stresses about the importance of education,” Bharathi Raja said in the statement.
Bharathi Raja went on to praise Dhanush for his responsible vision. He also spoke highly of Samuthirakani, who played a vital role in the film, and Samyuktha, who was perfectly cast in the role of a teacher.
“Gv Prakash has scored music for Vaathi, he’s a blessing. He scored some great music this year. I’m sure he’ll bag national award this year. Sir is a great title, the film talks about the social responsibility of a teacher,” Bharathi Raja said.
Bharathi Raja also urged the public to watch the film in theaters. “I am just back from the movie, the way the audience enjoying the film is great. It’s one of the best films in recent times. Vaathi is a must watch in theaters. I want you to watch the film in theaters and converse with me,” Bharathi Raja concluded.
“Vaathi/Sir” is a Tamil/Telugu bilingual film directed by Venky Atluri and produced by Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios. It stars Dhanush, Samuthirakani, and Samyuktha in lead roles, with music composed by G. V. Prakash Kumar. The film was released on February 17, 2023, and has received positive reviews from both critics and audiences.

 

BharathiRaja-1

*Sir is an honest effort to present a socially relevant story with a great message. Venky Atluri*

మనసున్న ప్రతి మనిషికి నచ్చే సినిమా ‘సార్’
-దర్శకుడు వెంకీ అట్లూరి
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు)/‌ ‘వాతి’(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. షో షోకి వసూళ్ళు పెంచుకుంటూ ఈ చిత్రం భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా.. సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఇది 1990-2000 నాటి కథ కదా.. ఇప్పటి యువతకి నచ్చుతుందా అనే సందేహం కలగలేదా?
ఏ కథైనా చక్కగా చెబితే ఎవరైనా వింటారు. ఇది విద్య నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మెరుగు పడలేదు. 90ల కథ అయినప్పటికీ ఇప్పటికి కూడా సరిగ్గా సరిపోయే కథ. ఎంట్రన్స్ ఎగ్జామ్ లు, ఒత్తిడులు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. చదువు అనేది నిత్యావసరం. అందుకే ఈ సబ్జెక్ట్ ఎప్పుడూ కనెక్ట్ అవుతుంది.
ఈ కథలో ధనుష్ గారి కంటే ముందు ఎవరినైనా అనుకున్నారా?
లేదండీ ధనుష్ గారినే అనుకున్నాం. లాక్ డౌన్ లో ఈ కథ రాసుకున్నాను. ఆ సమయంలో ధనుష్ గారికి కథ చెప్పాలి అనుకున్నాను. ఆయనకు కథ చెప్పే అవకాశం వచ్చింది. లాక్ డౌన్ సమయంలో ఓటీటీ వల్ల భాషతో సంబంధం లేకుండా ఫహద్ ఫాజిల్, ధనుష్, పృథ్వీరాజ్ వంటి నటులు మనకు మరింత చేరువయ్యారు. ఓటీటీల వల్ల నేను ధనుష్ గారిని ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడం, ఇంకా ఎక్కువ ఇష్టపడటం చేశాను. ఆయనతో సినిమాతో చేయాలనే కోరిక పెరిగింది. మా నిర్మాతలు ధనుష్ గారికి కథ చెప్తారా అనగానే చాలా సంతోషించాను. కథ చెప్పగానే ఆయన క్లాప్స్ కొట్టి డేట్స్ ఎప్పుడు కావాలి అనడంతో ఆనందం కలిగింది.
ఇది ఎమోషన్స్ ని నమ్ముకొని రూపొందించిన ఎడ్యుకేషనల్ ఫిల్మ్ కదా?
ఈ సినిమా తల్లిదండ్రులు కూడా బాగా కనెక్ట్ అవుతారు. సినిమా చూశాక నాకు బాగా కావాల్సిన ఆయన ఫోన్ చేసి నేను ఇంకా ఎక్కువ చదువుకుంటే బాగుండు అనిపించింది అన్నారు. అలాగే పిల్లలకు కూడా ఈ సినిమా చూశాక తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. స్టూడెంట్స్, పేరెంట్స్ కి అందరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. మనసున్న ప్రతి మనిషికి ఈ సినిమా నచ్చుతుంది.
అతిథి పాత్రలో సుమంత్ గారిని తీసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది?
ఈ సినిమాలో సుమంత్ గారిని అనుకున్నప్పుడు సీతారామం సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. మేం షూట్ చేసే సమయానికి ఆయన సీతారామంలో ఉన్నారని మాకు తెలీదు. ఇందులో ఆ పాత్ర ఎవరైనా స్పెషల్ పర్సన్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ఎవరా ఎవరా అని ఆలోచిస్తుంటే సుమంత్ గారైతే బాగుంటుంది అనిపించింది. ఆయనను సంప్రదిస్తే కథ నచ్చితే చేస్తాను అన్నారు. కథ విని ఆయన వెంటనే ఈ పాత్ర చేయడానికి అంగీకరించారు.
త్రివిక్రమ్ గారు ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చారా?
నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి.. ఒక ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి మధ్య కథా పరంగా ఎలాంటి చర్చలు జరుగుతాయో అలాంటి చర్చలు జరిగాయి. ఏదైనా సీన్ నచ్చితే వెంటనే బాగుందని మెచ్చుకునేవాళ్ళు. కొన్ని కొన్ని సీన్లు ఇలా చేస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చారు. ఇందులో తండ్రీకొడుకుల మధ్య మంచి సన్నివేశం ఉంటుంది. అది త్రివిక్రమ్ గారితో జరిపిన సంభాషణల నుంచే పుట్టింది.
సీక్వెల్ ఆలోచన ఉందా?
సీక్వెల్ ఆలోచన లేదు. నిజాయితీగా ఒక కథ చెప్పాలనుకున్నాను. అదే చేశాను.
ఇందులో సముద్రఖని-ధనుష్ మధ్య ఫైట్ లేకపోవడానికి కారణం?
నేను సినిమా చేసేటప్పుడు ఏ రోజూ కూడా సముద్రఖని గారికి, ధనుష్ గారికి మధ్య ఫైట్ పెట్టాలనుకోలేదు. అలా పెడితే బాగోదు. సహజంగా ఉండదు. ఆ పాత్రల స్వభావం ప్రకారం వాళ్ళు నేరుగా తలపడకపోవడమే సరైనది.
ఈ చిత్రాన్ని త్రీ ఇడియట్స్, సూపర్ 30 తో పోలుస్తున్నారు కదా?
దీనికి, త్రీ ఇడియట్స్ కి సంబంధమే లేదు. సూపర్ 30 అనేది బయోపిక్. నేను సార్ కథ ముందే అనుకున్నాను. అయితే సూపర్ 30 వచ్చినప్పుడు రెండు కథలు కలుస్తాయేమో అని భయపడి చూశాను. కానీ ఆ కథ వేరు, ఇది వేరు. అది బయోపిక్, ఇది ఫిక్షనల్.
తమిళ్ లో స్పందన ఎలా ఉంది?
నేను చెన్నైలో ప్రేక్షకులతో కలిసి షో చూశాను. వాళ్ళు సినిమా చూస్తూ చప్పట్లు కొడుతూనే ఉన్నారు. అది చాలు అక్కడ స్పందన ఎలా ఉందో చెప్పడానికి. తెలుగులో కూడా ప్రీమియర్ షోల నుంచే సినిమా బాగుందంటూ చాలా ఫోన్లు వచ్చాయి. కొందరైతే హిందీలో కూడా విడుదల చేయాల్సింది అన్నారు. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అన్ని భాషల ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ప్రేమకథల నుంచి ఈ వైపు టర్న్ తీసుకోవడానికి కారణమేంటి?
మూడు ప్రేమకథలు చేశాను. ఈసారి ప్రేక్షకులను కొత్తదనం చూపించాలి అనుకున్నాను. అలా ఏ సబ్జెక్ట్ చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసి.. విద్య నేపథ్యంలో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. నా విద్య 90లలో సాగింది. ఆ సమయంలో నాకు ఎదురైన అనుభవాలు, నేను చూసిన సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ కథ రాసుకున్నాను.
సార్ చిత్రానికి సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రశంసలు దక్కాయి?
త్రివిక్రమ్ గారు చాలా మంచి సినిమా చేశావు అన్నారు. శిరీష్ గారు, నితిన్, వరుణ్ తేజ్ ఇలా ఎందరో ఫోన్ చేసి ప్రశంసించారు.
మీ తదుపరి చిత్రం కూడా సితార బ్యానర్ లోనే ఉంటుందా?
సితార నాకు హోమ్ బ్యానర్ లాంటిది. నిర్మాత వంశీ గారు నాకు చాలా మంచి స్నేహితుడు. త్రివిక్రమ్ గారంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది. వారితో కలిసి పని చేయడం నాకెప్పుడూ సంతోషాన్ని ఇస్తుంది. అయితే తదుపరి సినిమా గురించి ఇప్పుడే చెప్పలేదు. నేను సార్ అనే ఒక మంచి సినిమా తీశాను. అది ఎక్కువ మందికి చేరువ అవ్వాలి అనుకుంటున్నాను. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తాను.
ఇక నుంచి కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేస్తారా?
ఇది పూర్తి కమర్షియల్ సినిమా అనను. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సందేశాత్మక చిత్రం. ఇక నుంచి సినిమా సినిమాకి వైవిధ్యం చూపించాలి అనుకుంటున్నాను. విభిన్న జోనర్లలో సినిమాలు చేస్తాను.
*Sir is an honest effort to present a socially relevant story with a great message. Venky Atluri*
Sir starring Dhanush has released on February 17, 2023 in Telugu and Tamil. The movie, produced by Sithara Entertainments and Fortune Four Cinemas and presented by Srikara Studios, got a great applause from all the corners. The performances of actors is lauded and everyone is heaping praises on Venky Atluri for doing a socially relevant film. Most of the scenes in the film are heart-touching and are relatable to many. Sir is running successfully with a positive talk from the audience.
*Here are the excerpts from director Venky Atluri’s interaction with media.*
*Sir is a story set in 90s, how will it connect with the audience of this generation?*
If we narrate a story well, then it connects better with the audience. Sir is set in 90s and is still relevant today. Entrance exams are there today, and the struggles are the same. Those struggles haven’t changed. Education is a basic amenity, so this story is relevant.
*Is Dhanush your first choice?*
During the lockdown, I watched a lot of films – Karnan and Asuran of Dhanush, and he won by heart with exceptional performances. So, I wanted to narrate the story to Dhanush, and it worked. Now we can watch content in OTT and that brought all the other language stars closer to us.
*First reaction of Dhanush after the story narration*
He liked it instantly and clapped 3 times after the narration, and gave me his dates. He is a man of few words, but strong words.
*Education is always an emotion to the parents*
The one who pays the fee has more emotion when it comes to education. Parents connect well with Sir. After watching the film, many realized the importance of education and wish they spent more time back then.
*On your parent’s reaction*
My mom always encouraged me to study more. Engineering happened quickly to me but direction took time time. My parents really loved the scenes and the whole film. They walked out with heavy hearts from the theatres. That’s the case with other audience also.
*On Trivikram’s contribution*
He believes more in collaboration. He is the producer and maintained the same rapport in the narration and script discussions. There is more involvement by him as a producer. The father – son scene was not that elaborate in the first version. Then Trivikram told about his struggle. Then I realized and wrote the lines where parents are sad for the whole life for not making the ends meet. This is a constructive change.
*On discrimination and dignity of labour showed in Sir*
This is still relevant, so it has to be addressed. You might be a software engineer earning Rs 25000 per month or a cab driver earning Rs 35000. Though there are more earnings in the latter case, people may not see it with dignity of labour. I have seen many such instances and roped into my film. Two people from the same class but different community are hesitant to sit next to each other. I tried to address these issues in Sir.
*On making a sequel to Sir*
I never had an idea to make a sequel to Sir. I only wanted to tell a story with a honest intent.
*On no fight sequence between Dhanush and Samuthirakani characters*
I never imagined a fight between Dhanush and Samuthirakani characters. It would have been unnatural. There is a tug of war but no physical fight. The driver clapping in the climax scene, says it all. In the initial scenes, Samuthirakani’s character doesn’t care for the driver. This shows hero’s victory over the villain.
*On response in cinemas*
I watched the morning show in Chennai. They were clapping continuously for 10 minutes from the pre-climax to climax. I couldn’t ask for more. In Telugu, I got many calls and said I made a fantastic film. This is a universal concept. We haven’t yet anything now for Sir’s release in other languages. This film will be well received in Hindi belt too.
*On Sumanth’s character*
When I zeroed in on Sumanth, ‘Sita Ramam’ was not released. We wanted someone special so Sumanth came onboard. We view Sumanth as a hero, so we needed a person of that stature as a narrator. When I sent the script, within one day he accepted the film. He connected with the character because of his honesty.
*Any learnings from Dhanush?*
He is too punctual. He has an inbuilt creativity and a gifted artist. He exactly knows what’s the outcome during a shoot. He is a hard worker and has good insight.
*On comparisons with ‘Super 30’ and ‘3 Idiots’*
Sir is a flashback narration and it’s not new in industry. So, comparison with ‘3 Idiots’ is not relevant. Also ‘Super 30’ is a biopic. When I watched ‘Super 30’, I was happy that Sir is nowhere related to the film. My film is all about private colleges sending lecturers to rural colleges as part of social responsibility.
*Appreciation from producers*
Trivikram liked it a lot, and he commented that as a producer he made a right decision. Shirish called me and appreciated the film. Nithin, Varun, and others also called and appreciated.
*On tilting towards commercial cinema*
Sir is a unique concept when I wrote it. Then it became commercial. I don’t want to do same genre films again.
*On acceptance of Telugu films by other languages*
Now there is no barrier for a film industry. After the likes of Baahubali, RRR, Pushpa made waves in the national front, people from all languages are welcoming Telugu films.
*Why did you change from love stories to socially responsible projects?*
I hit the threshold of making loves stories with ‘Rang De’. I saw some incidents related to education in the news during lockdown and wanted to touch the education subject. Most of my education was in 90s, so I brought in many experiences of my own.
*On your journey into films*
When I entered the industry there was no one to guide me and never thought about direction. Though I had a passion in writing, I couldn’t express it to others. Acting job came easily. And I was bashed for it. A few meetings with Ushakiron movies helped me make a decision outside acting. Then Dil Raju’s association helped me a lot for screenwriting. I learned from many people including Madhura Sridhar, P C Sreeram, and others.
*On the next project*
I didn’t plan it to be honest. I have to ensure that Sir reaches to maximum number of people, and then I can work on my next project. I am planning to do something edgy this time.
GANI9975

 

Sir is registering housefulls everywhere in Telugu states, it’s a blockbuster for us: Producer S Naga Vamsi

సార్’ సినిమాకి ప్రేక్షకుల బ్రహ్మరథం.. ఆనందంలో చిత్ర బృందం

కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం ‘సార్’(వాతి). ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటించింది. భారీ అంచనాలతో ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలైంది. ముందు రోజు సాయంత్రం ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు, విశ్లేషకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండటంతో తాజాగా చిత్ర బృందం విలేకర్ల సమావేశం నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “చాలా ఆనందంగా ఉంది. నాకు సంవత్సరం తర్వాత డిస్ట్రిబ్యూటర్ల నుంచి హౌస్ ఫుల్ అని ఫోన్లు వస్తున్నాయి. నిన్న ప్రీమియర్లకు మంచి టాక్ రావడంతో.. చిన్న చిన్న ఏరియాలలో కూడా మార్నింగ్ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. షో షోకి వసూళ్ళు పెరుగుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన భీమ్లా నాయక్, డీజే టిల్లు సినిమాలకు హౌస్ ఫుల్స్ అని ఫోన్లు వచ్చాయి. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు సార్ సినిమాకు అంత మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. మొదట ఒకట్రెండు ప్రీమియర్ లు  అనుకున్నాం. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తో షోలు పెంచుకుంటూ పోయాము. ఒక్క హైదరాబాద్ లోనే 25  ప్రీమియర్ షోలు పడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొత్తం 40 షోలు వేశాము. ధనుష్ గారి ‘రఘువరన్ బి.టెక్’ తెలుగులో టోటల్ రన్ మీద  ఎంత వసూలు చేసిందో ఆ మొత్తం ఒక్కరోజులోనే సార్ కి వస్తాయి. తమిళ్ లో కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఓవరాల్ గా ధనుష్ కెరీర్ లో రికార్డు స్థాయి వసూళ్ళు వచ్చే అవకాశముంది” అన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “చాలా సంతోషంగా ఉంది. 2018 లో వచ్చిన నా మొదటి సినిమా తొలిప్రేమ తర్వాత మళ్ళీ ఇప్పుడే అందరి నుంచి ఫోన్లు వస్తున్నాయి. విడుదలకు ముందు నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. కానీ ప్రీమియర్లకు వచ్చిన స్పందన చూశాక ప్రశాంతంగా నిద్రపోయాను. ఉదయాన్నే చెన్నై వెళ్లి మార్నింగ్ షో కూడా చూసొచ్చాను. నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చివరి 15 నిమిషాలు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. నేను భాగమైన సినిమాకి ప్రేక్షకుల నుంచి ఇంతమంచి స్పందన రావడం గర్వంగా ఉంది. ఈ ఆలోచనను ముందుకు తీసుకు వెళ్లిన వంశీ గారికి ధన్యవాదాలు. ఆయన చెప్పినట్లుగా ముందు రెండు ప్రీమియర్లు అనుకున్నాం.. కానీ అవి పెరుగుతూ 40 షోల వరకు వెళ్లాయి. ఈ 40 షోలకు వచ్చిన స్పందనతో తమిళ్ లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.” అన్నారు.

ఈ సమావేశంలో విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు దర్శక నిర్మాతలు సమాధానాలు ఇచ్చారు.

సితారలో కమర్షియల్ సినిమాలతో పాటు ‘జెర్సీ’,'సార్’ వంటి బ్యానర్ కి గౌరవం తీసుకొచ్చే సినిమాలు చేయడం ఎలా ఉంది?.
నాగవంశీ: సినీ పరిశ్రమ నుంచి కొందరు ఫోన్ చేసి ఇదే విషయం మాట్లాడారు. రాజు గారు ఫోన్ చేసి ఈ సినిమాకి డబ్బులు, పేరు రెండూ వస్తాయి అన్నారు. మళ్ళీ ఇంకోసారి నువ్వు నేషనల్ అవార్డుకి అప్లికేషన్ పెట్టుకునే సినిమా వచ్చింది.. ఇలాంటి మంచి సినిమా తీయి అని ఆయన ఫోన్ చేసి చెప్పారు.

మంచి సబ్జెక్ట్ తో తమిళ్ లోకి ప్రవేశించారు కదా.. ఇలా మరిన్ని ద్విభాషా చిత్రాలు చేస్తారా?
నాగవంశీ: ఏదైనా మంచి కథ వస్తే, ఇది రెండు భాషల్లో చెప్పాల్సిన కథ అనిపిస్తే ఖచ్చితంగా తీస్తాము. పైగా ఇప్పుడు గేటు కూడా ఓపెన్ అయిపోయింది కదా.

మీరు ఈ తరహా కథ చిత్రాలను తీసే ప్రతిభను  ఇంతకాలం ఎందుకు బయటపెట్టలేదు?
వెంకీ అట్లూరి: మొదటి సినిమా విజయం సాధించినప్పుడు మనకు అదే సరైన రూట్ అనిపించి అటు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. నేను అదే చేశాను. మిస్టర్ మజ్ను విషయంలో కొంత అతి విశ్వాసం దెబ్బ తీసింది. రంగ్ దే ప్రయత్న లోపం అని చెప్పలేను కానీ.. వరుసగా మూడో లవ్ స్టోరీ కావడం, పరిస్థితుల ప్రభావం వల్ల దానికి జరగాల్సిన న్యాయం జరగలేదు. దాంతో నా దారిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. వరుసగా మూడు ప్రేమ కథల తర్వాత ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే ప్రేక్షకులను నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకున్నట్లు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ చిత్రం చేయడం జరిగింది. కేవలం సందేశం మాత్రమే ఇవ్వాలనుకోలేదు. వినోదం కూడా పంచాలనుకున్నాను. సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు. అన్ని ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు. విడుదలకు ముందు చెప్పాను.. ఇప్పుడు చెబుతున్నాను. ఈ చిత్రం చాలాకాలం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది.

విడుదల తర్వాత ధనుష్ గారి స్పందన ఏంటి?
వెంకీ అట్లూరి: ధనుష్ గారు చాలా సంతోషంగా ఉన్నారు. నిన్న రాత్రే ఫోన్ చేసి ప్రీమియర్ల స్పందన ఏంటని అడిగారు. బాగుంది సార్ అంటే రేపు ఉదయం వరకు ఆగు అన్నారు. అప్పుడు ఆయన అలా ఎందుకు అన్నారో అర్థంకాలేదు. చెన్నైలో నేను ప్రేక్షకుల మధ్యలో షో చూశాక.. అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అడిగారు. చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే.. అందుకే నిన్ను ఆగమన్నారు అన్నారు. సినిమాకి వస్తున్న స్పందన పట్ల ధనుష్ గారితో పాటు టీమ్ అంతా చాలా ఆనందంగా ఉన్నారు.

ఈ కథకి స్ఫూర్తి ఏంటి?
వెంకీ అట్లూరి: ఈ కథ కల్పితం. కానీ ఇదంతా ఇంటర్మీడియట్ చదివినప్పుడు మనం చూసిన, అనుభవించిన కథలు. నేను చూసిన, చుట్టుపక్కల జరిగిన సంఘటనల ఆధారంగా రాసుకున్నాను. అందుకే అంత సహజంగా ఉంది.

మీరు నిజ జీవితంలో దీనిని అనుభవించారా?
నాగ వంశీ: మనందరికీ అనుభవమే కదా. నేనొక పెద్ద కాలేజ్ లో ఇంజనీరింగ్ చదవాలనుకున్నాను. కానీ ర్యాంక్ రాలేదు. డొనేషన్ అడిగితే ఎక్కువ చెప్పారు. మా అమ్మ పొలం అమ్మి నన్ను చదివించింది. అయినా కూడా నేను అనుకున్న కాలేజ్ లో చదువుకోలేకయాను. ప్రస్తుతం ఎల్కేజీలకు ఫీజులు దారుణంగా ఉన్నాయి. ఫీజులు తగ్గిస్తే చదువు అందరికీ అందుబాటులో ఉంటుందనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పాలి అనుకున్నాం.

Audiences have given a warm welcome to Dhanush in Telugu with Sir, everyone is identifying with the story: Director Venky Atluri

Sir is registering housefulls everywhere in Telugu states, it’s a blockbuster for us: Producer S Naga Vamsi

Sir a.k.a Vaathi, the Tamil-Telugu bilingual, written and directed by Venky Atluri, is off to an impressive start at the box office. The Dhanush, Samyuktha starrer, produced by S Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas and presented by Srikara Studios, benefited immensely from the terrific response to the premieres held across Telugu states and Tamil Nadu yesterday.

Commemorating its success, Venky Atluri and S Naga Vamsi spoke to the media today. “I am thrilled about the responses to Sir. I made a genuine attempt to come out of my comfort zone and give audiences something new to discover from my films and I am grateful they’ve appreciated it. Audiences are coming out of theatres with a heavy heart and I couldn’t have asked for more. The theatre count is increasing every hour,” the director said.

“I set the film in the 90s because I grew up in the era but I can say very little about our education system has changed over the years. Audiences are identifying with it, connecting to its emotions, laughing, crying and travelling with the characters. Dhanush is also very happy with the footfalls for Sir. He asked me to reserve my excitement for today and not for the premieres yesterday and noticing the housefull crowds, I can understand why he said that to me,” Venky added.

Expressing his happiness about its box office performance, producer S Naga Vamsi said, “I related with the story because my parents too had to sell a piece of land to get me a seat in an engineering college. Venky had initially narrated a family entertainer but we finalised Sir to try something out of the box. From Proddutur to Guntur to Vijayawada and Tirupathi, the film is running to packed crowds in Telugu states. We sold the film to distributors at reasonable rates and they’re all excited about this start. It’s a blockbuster in the making.”

Besides Venky Atluri’s execution and Dhanush’s performance, crowds have equally appreciated the portrayals of Samyuktha, Samuthirakani and Sai Kumar and GV Prakash’s memorable album. Hyper Aadhi, Narra Srinu, Tanikella Bharani, Motta Rajendran too played important roles in the film.

DSC_4379 DSC_4270 DSC_4349 DSC_4311