పద్మశ్రీ అవార్డు గ్రహీత, డా. బ్రహ్మానందంకు హాస్యనట బ్రహ్మ బిరుదు

1100 చిత్రాల్లో కమెడియన్‌గా నటించి మెప్పించిన నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత, డా. బ్రహ్మానందంకు హాస్యనట బ్రహ్మ అనే బిరుదును కాకతీయ కళావైభవ మహోత్సవంలో ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో…

టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ”కాకతీయ లలిత కళాపరిషత్తు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వైభవంగా అప్పటి కాకతీయుల ఖ్యాతిని తెలియజేయాలనే ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సభాపతి సిరికొండ మధుసూదనాచారి, ఎస్‌.జైపాల్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతుంటే.. జూపల్లి కృష్ణారావు, డా.సి.లక్ష్మారెడ్డి తదితరులు గౌరవ అతిథులుగా హాజరు కానున్నారు. చలన చిత్ర పరిశ్రమకు చెందిన జయప్రద, డా.రాజశేఖర్‌, జీవిత, బాబూమోహన్‌, పరుచూరి గోపాలకృష్ణ, అలీ, కవిత, కేథరిన్‌ థ్రెసా, హంసానందిని, శ్రద్ధాదాస్‌, పృథ్వీ, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి తదితరులను కాకతీయ పురస్కారాలతో సత్కరిస్తాం. అలాగే మహబూబ్‌ నగర్‌కు చెందిన సాహిత్య, సంగీత, నృత్య కళాకారులు ప్రొడ. ఎల్లూరి శివారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, గొరేటి వెంకన్న, చిక్కా హరీశ్‌, జంగిరెడ్డి, పద్మాలయా ఆచార్య, వంగీశ్వర నీరజ తదితరులను కాకతీయ అవార్డుతో సత్కరిస్తాం” అన్నారు.

శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ – ”బ్రహ్మానందం గొప్ప నటుడు. తెలుగు రాష్ట్రాల్లో మరచిపోలేని నటుడు. కళాకారులకు, కవులకు, నటులకు కుల, మత, ప్రాంతీయ బేదాలుండవు. కని వినీ ఎరుగని రీతిలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్‌ చేస్తాం” అన్నారు.

అలీ మాట్లాడుతూ – ”కళాకారులంటే నటరాజుకి చాలా ఇష్టం. ఆ నటరాజు సుబ్బరామిరెడ్డిగారి రూపంలో వచ్చారు. ఎందుకంటే 1100 సినిమాలు పూర్తి చేసుక్ను మా అన్న బ్రహ్మానందంకు బిరుదునిచ్చి సత్కరించడం గొప్ప విషయం. మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో 1100 సినిమాలు చేయడం గొప్ప విషయం” అన్నారు.

డా.బ్రహ్మానందం మాట్లాడుతూ ”కళలకు ఎల్లలు లేవు. కళల్లో ఈశ్వరత్వం ఉంటుంది. అలాంటి ఈశ్వరుడ్ని పూజించే సుబ్బరామిరెడ్డిగారు ఈ అవార్డు వేడుకలు నిర్వహిస్తుండటం గొప్ప విషయం. ఆ దేవుడి దయ వల్ల ఎన్నో అవార్డులను స్వీకరించినప్పటికీ.. రేపు నేను తీసుకోబోయే అవార్డు విశిష్టమైందని భావిస్తున్నాను. అది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను” అన్నారుnew doc 2018-03-09 11.47.31_1 1 (1) 1 (5) 1 (2) 1 (3) 1 (4)