Anikha Surendran, Arjun Das and Surya Vasishta team up for Butta Bomma, backed by Sithara Entertainments and Fortune Four Cinemas

అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట  ల తో  ’సితార ఎంటర్ టైన్ మెంట్స్’ , ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‘….”బుట్ట బొమ్మ”
* ”బుట్ట బొమ్మ” గా అనిక సురేంద్రన్
* అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు కథా నాయకులు
*శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం
*వినాయకచవితి పర్వదినాన చిత్రం పేరుతో ప్రచార చిత్రం విడుదల
*నవంబర్ లో చిత్రం విడుదల
వరుస చిత్రాల నిర్మాణం లోనే కాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి నిర్మిస్తున్న మరో  చిత్రం ప్రచార పర్వం వినాయక చవితి పర్వదినాన  మొదలైంది. వివరాల్లోకి వెళితే…..
అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట  లు నాయిక, నాయకులుగా ’సితార ఎంటర్ టైన్ మెంట్స్’ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా  ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రానికి ”బుట్ట బొమ్మ” అనే పేరును ఖరారు చేస్తూ వినాయకచవితి పర్వదినాన చిత్రం పేరుతో ప్రచార చిత్రం ను విడుదల చేశారు. నాగ‌వంశీ ఎస్‌. – సాయి సౌజ‌న్య‌ ఈ చిత్రానికి నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు.
విడుదలైన ప్రచార చిత్రంలో నాయిక అనిక సురేంద్రన్ ‘బుట్ట బొమ్మ‘ గా ఎంతో అందంగా ఒదిగిపోయిన వైనం చూడ ముచ్చటగా ఉందనిపిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ…‘బుట్ట బొమ్మ‘ గా అనిక సురేంద్రన్, అలాగే అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల పాత్రలు గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ లో సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. గుర్తుండి పోతాయి.‘ప్రేమ’ లోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి అని తెలిపారు.. సంభాషణల రచయిత గా ‘ వరుడు కావలెను‘ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గణేష్ కుమార్ రావూరి ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు.
సెప్టెంబర్ నెలలో జరిగే షూటింగ్ తో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. నవంబర్ నెలలో చిత్రం విడుదల అని, చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఒక్కొక్కటిగా తెలియ పరుస్తామని తెలిపారు నిర్మాతలు.
అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట నాయిక, నాయకులుగానటిస్తున్న ఈ చిత్రంలో
నవ్య స్వామి, నర్రాశ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి,ప్రేమ్ సాగర్, మిర్చి కిరణ్, కంచెర్ల పాలెం కిషోర్, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రధారులు.
సాంకేతిక నిపుణులు:
ఛాయాగ్రహణం: వంశీ పచ్చి పులుసు
సంగీతం: గోపిసుందర్
మాటలు: గణేష్ కుమార్ రావూరి
పాటలు: శ్రీమణి, ఎస్. భరద్వాజ్ పాత్రుడు
ఎడిటర్: నవీన్ నూలి
పోరాటాలు : డ్రాగన్ ప్రకాష్
ప్రొడక్షన్ డిజైనర్: వివేక్ అన్నామలై
ప్రొడక్షన్ కంట్రోలర్: సి హెచ్. రామకృష్ణా రెడ్డి
పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్
నిర్మాత‌లు: నాగ‌వంశీ ఎస్‌. – సాయి సౌజ‌న్య‌
దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్
Anikha Surendran, Arjun Das and Surya Vasishta team up for Butta Bomma, backed by Sithara Entertainments and Fortune Four Cinemas
Leading production house Sithara Entertainments, known for backing quality films, and Fortune Four Cinemas are joining hands for a new project. Anikha Surendran, Arjun Das and Surya Vasishta play the lead roles in the film titled Butta Bomma, which was formally announced today commemorating Vinayaka Chaturthi. The poster of the film was launched on the occasion. S Naga Vamsi and Sai Soujanya are bankrolling the film directed by Shourie Chandrasekhar Ramesh.
In the poster of Butta Bomma, an innocent Anikha Surendran is curiously looking through a window. Spilling the beans about the film, director Shourie Chandrasekhar Ramesh shares, “Butta Bomma is a realistic love story set amidst a village backdrop featuring Anikha Surendran, Arjun Das and Surya Vasishta. The film will tug at your heartstrings and explore various dimensions of love with an engaging screenplay.”
The shoot of Butta Bomma will be wrapped this September. The makers plan to release the film in November. Other details about the film will be revealed shortly. Navya Swami, Narra Srinu, Pammi Sai, Karthik Prasad, Vasu Inturi, Mirchi Kiran, Kancharapalem Kishore and Madhumani too play important roles in this rural romance. Ganesh Kumar Ravuri, who shot to fame with Varudu Kaavalenu, has penned the dialogues. Gopi Sundar scores the music for the film which has cinematography by Vamsi Patchipulusu.
Crew:
Cinematography: Vamsi Patchipulusu
Music: Gopi Sundar
Dialogues: Ganesh Kumar Ravuri
Lyrics: Shreemani, S Bharadwaja Pathrudu
Editor: Navin Nooli
Production designer: Vivek Annamalai
Production controller: C H Ramakrishna Reddy
PRO: LakshmiVenugopal
Producers: S Naga Vamsi and Sai Soujanya
Director: Shourie Chandrasekhar T  Ramesh
ButtaBomma_Still1 ButtaBomma_Still2 #ButtaBomma_FL_Design_2 #ButtaBomma_FL_Design_1