Hari Hara Veera Mallu News

 స్వాగతిస్తుంది సమరపథం..

దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం.

 

*పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్2) సందర్భంగా నేడు ప్రచారచిత్రం విడుదల

*‘రేపు సెప్టెంబర్ 2, సాయంత్రం గం: 5.45 నిమిషాలకు పవర్ గ్లాన్స్ పేరుతో ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు‘ ప్రచార చిత్రం విడుదల

పవన్ కళ్యాణ్ హీరోగా, సృజనాత్మక దర్శకుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మహత్తర చిత్ర రాజం‌ ’హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రేపు చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా ప్రచార చిత్రంను నేడు విడుదల చేశారు చిత్ర బృందం.

ఈ ప్రచార చిత్రంలో…

స్వాగతిస్తుంది సమరపథం..

దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం…

అన్నట్లుగా కనిపిస్తారు కథానాయకుడు “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు“. అంతేకాదు రేపు సెప్టెంబర్ 2, సాయంత్రం గం: 5.45 నిమిషాలకు పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించటం తో అభిమానుల ఆనంద సంబరాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. వారి ఆనందాన్ని మరింత ఉచ్ఛ స్థితికి వెళ్లేలా ఆ వీడియో ఉండబోతోందన్నది నిజం.

17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” సినిమా రూపొందుతోంది. ఇది ఒక లెజండ‌రీ బందిపోటు వీరోచిత గాథ.” ఇది భార‌తీయ సినిమాలో ఇప్ప‌టిదాకా చెప్ప‌ని క‌థ‌. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఒక మ‌ర‌పురాని అనుభ‌వాన్ని ఇస్తుంది. ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌ని ఉన్న‌త‌స్థాయి నిర్మాణ విలువ‌ల‌తో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్‌-ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ యాభై శాతం పూర్త‌యింది. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు తెలియచేశారు.

అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించేలా ‘హరిహర వీరమల్లు’ చిత్రం రూపు దిద్దుకుంటోంది.

ఈ చిత్రానికి అగ్ర‌శ్రేణి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి సంగీత బాణీలు అందిస్తుండ‌గా, పేరొందిన సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు. ఎడిటర్ గా కె.ఎల్. ప్రవీణ్ పూడి, విఎఫ్ఎక్స్ హరి హర సుతన్, పోరాటాలు శామ్ కౌశల్, తడోర్ లజరొవ్ జుజి, రామ్ లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్ లు సాంకేతిక నిపుణులుగా వ్యవహరిస్తున్నారు.

క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో మెగాసూర్యా ప్రొడ‌క్ష‌న్‌ బ్యాన‌ర్‌ పై నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

పి.ఆర్.ఓ: ల‌క్ష్మీవేణుగోపాల్‌.

 

Pawan Kalyan sparkles in a regal avatar in historical drama Hari Hara Veera Mallu’s latest poster, leaving fans craving for more

Pawan Kalyan’s historical drama Hari Hara Veera Mallu helmed by reputed filmmaker Krish Jagarlamudi is easily one of the most awaited films among movie buffs. Nidhhi Agerwal plays the female lead in the film presented by A M Rathnam under Mega Surya Production and produced by A.Dayakar Rao.

Commemorating the birthday of Pawan Kalyan (September 2), the makers of Hari Hara Veera Mallu plan to unveil a special glimpse of the film at 5.45 pm tomorrow. The joy of the star’s fans knew no bounds upon hearing the news and the team is confident that they’ll live up to their expectations.

On the eve of the big day, movie buffs received a pleasant surprise from the film team. A special poster from Hari Hara Veera Mallu was unveiled today. In the poster, Pawan Kalyan in the titular character, sporting a rounded moustache, transports the viewers to a different era in a regal avatar, beaming with intensity while riding a chariot.

The poster suggests that the protagonist is amidst a heated, war-like situation where several men are marching towards the enemy holding their weapons. This is just the perfect icing on the cake for Pawan Kalyan’s fans as they await a special glimpse from the team tomorrow.

For the unversed, the film is set in the 17th century revolving around the Mughals and the era of Qutub Shahis and promises to be a visual feast. Hari Hara Veera Mallu is a first-of-its-kind story in Indian cinema about a legendary outlaw and is set to transport viewers to a different world.

The pan-Indian film, set to release in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam, is being made on a huge scale. The film’s shoot is 50% complete and a new schedule will commence soon, the producer Dayakar Rao added. MM Keeravaani provides the music score for the epic actioner while VS Gnanasekhar cranks the camera. Sai Madhav Burra pens the dialogues.

Legendary technician Thota Tharani is the production designer for the film with KL Praveen handling editing duties. Sham Kaushal, Todor Lazarov Juji, Ram-Laxman and Dileep Subbarayan are the stunt choreographers for this big-budget adventure. Hari Hara Suthan is the VFX head for the project.

PRO: Lakshmi Venugopal

 

power-glance-insta-1still (1) #HHVM-HBD Poster